జిల్లాలో ఇప్పటి వరకు ఆయా కొనుగోలు కేంద్రాల ద్వారా 38 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. వానాకాలంలో మొత్తం 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే కొన్నిచోట్ల వరికోతలు ముందస్తుగా జరగడం.. నీటిపారుదల ప్రాంతాల్లో ఆలస్యమయ్యాయి. మొదట సన్నరకం ధాన్యానికి బోనస్‌పై అయోమయం నెలకొనడంతో ప్రైవేటులో అమ్ముకున్నారు. ప్రస్తుతం కొనుగోలు పూర్తయ్యే నాటికి మరో 1.50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 51 కోట్లతో పాటు బోనస్ డబ్బులను రూ. 2కోట్ల మేరకు చెల్లించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment