రైతు పండుగ సదస్సులో భాగంగా తొలిరోజు గురువారం సెషన్ల వారీగా పలు శాఖలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించారు. పాలెంలోని కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం సైంటిస్టులు సాగు భూమిలో మట్టి నమూనాల సేకరణ.. పంట రకం, ఆయిల్‌పాం వంటి విత్తనాల తయారీ, పప్పు ధాన్యాల దిగుబడి, చీడపీడలు, తెగుళ్లపై వివరించారు. నాబార్డు, వ్యవసాయ అధికారులు రైతుల విజయగాధలపై వీడియోలు ప్రదర్శించారు. రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు, రైతు బీమా, రైతు భరోసా, పంట రుణాలపై పలు వివరాలను రైతులకు తెలియజేశారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్టులు వ్యవసాయ యాంత్రీకరణ, సుస్థిర వ్యవసాయం–సుస్థిర జీవనోపాధి, జీవ సంబంధ తెగుళ్ల నియంత్రణ, పంట అవశేషాల సమర్థ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment