డీఈఓ అబ్దుల్ ఘని బాధ్యతల స్వీకరణ
వనపర్తి విద్యావిభాగం: జిల్లా విద్యాశాఖ అధికారిగా మహ్మద్ అబ్దుల్ ఘని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల విద్యాశాఖ చేపట్టిన బదిలీల్లో నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న అబ్దుల్ ఘనిని వనపర్తికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టిన ఆయన.. మర్యాద పూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు. అనంతరం విద్యాశాఖలోని ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రొగ్రెస్ వివరాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తే చర్యలు
వీపనగండ్ల: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు తాగునీరు అందకుండా ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ వెంకటరమణ హెచ్చరించారు. గురువారం వీపనగండ్లలో పర్యటించి, మిషన్ భగీరథ నీటి సరఫరాను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకంతో ప్రజలకు తాగునీరు అందకుండా కొందరు పనిగట్టుకొని పైప్‌లైన్ ధ్వంసం చేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తే సహించమన్నారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఎస్‌ఈ వెంట డీఈ అమిథ్ కుమార్, ఏఈ విశ్వనాథ్ తదితరులు ఉన్నారు.
ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌గా సంతోష్‌కుమార్
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆర్టీసీ రీజియన్ మేనేజర్‌గా పి.సంతోష్‌కుమార్ రానున్నారు. ఇక్కడ ఆర్‌ఎంగా పనిచేస్తున్న వి.శ్రీదేవి హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు బదిలీ అయ్యారు. మూడు, నాలుగు రోజుల్లో నూతన ఆర్‌ఎం బాధ్యతలు చేపట్టనున్నారు. సంతోష్‌కుమార్ రంగారెడ్డి రీజియన్ డిప్యూటీ ఆర్‌ఎంగా పనిచేస్తుండగా.. పదోన్నతిపై మహబూబ్‌నగర్‌కు ఆర్‌ఎంగా నియమితులయ్యారు. ఇతను 2000లో మొదట ఒంగోలు జిల్లా గిద్దలూరు డిపో మేనేజర్‌గా విఽధుల్లో చేరారు. తర్వాత కామారెడ్డి, జీడిమెట్ల, 2010లో సిటీలో డిప్యూటీ సీఎంఈగా పదోన్నతి పొందారు. డిప్యూటీ సీఎంఈగా మెదక్‌తో పాటు హెడ్‌ఆఫీస్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా, కార్గోలో రెండేళ్ల పాటు హెడ్‌గా పనిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లాకు డిప్యూటీ ఆర్‌ఎంగా వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment