జిల్లాలో నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ అత్యంత పకడ్భందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్పారు. డేటా ఎంట్రీ ప్రక్రియపై కలెక్టరేట్‌లో మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సర్వే ఫారాలు సూపర్‌వైజర్ల పర్యవేక్షణలోనే బయటకు తీసుకురావాలన్నారు. ప్రతి ఆపరేటర్ రోజుకు 25 ఫారాలు తప్పనిసరిగా ఎంట్రీ చేయాలని.. వివరాలను నమోదు చేసిన తర్వాత సర్వే ఫారాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వేకు సంబంధించి ఇంకా కొన్ని ఎన్యుమరేషన్ బ్లాక్‌లలో కొన్ని ఇళ్లు మిగిలిపోయాయని.. తాళంవేసి ఉన్న ఇళ్లను మళ్లీ వి జిట్ చేసి వివరాలు సేకరించాలని సూచించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, జెడ్పీ సీఈవో యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఓ ప్రసాదరావు, డీఎస్‌ఓ కాశీ విశ్వనాథ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment