నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
వనపర్తి: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆహార భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాలయాల్లో ఆహారం నాణ్యతపై కమిటీ సభ్యులు ప్రత్యేక దృష్టి సారిస్తూ.. ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. వారంలో నాలుగు నుంచి ఐదుసార్లు తనిఖీలు చేపట్టాలని సూచించారు. లోపాలు కనిపిస్తే.. చర్యలకు సిఫారస్ చేయాలన్నారు. హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యంతో పాటు కూరగాయలు, ఇతర వస్తువుల నాణ్యతను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని తెలిపారు. హోటళ్లలోనూ భోజనం నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలని సూచించారు.
చెల్లింపుల్లో వేగం పెంచాలి..
కొనుగోలు చేసిన వరిధాన్యం డబ్బులు రైతులకు సకాలంలో చెల్లించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొన్న రెండు రోజుల్లో ట్యాబ్ ఎంట్రీలు, పేమెంట్ల ప్రక్రియ పూర్తికావాలన్నారు. చెల్లింపులు నెమ్మదిస్తే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 46,722 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని.. 25,543 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ. 59.26 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మిగతా చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
విద్యార్థులకు
మంచి భోజనం అందించాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment