లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకుందాం : సీపీఎం
వనపర్తి రూరల్: మత సామరస్యాన్ని కాపాడుతూ లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని యాదవ కమ్యూనిటీ భవనంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి రమేశ్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డివిజన్ కార్యదర్శి గణేష్ అధ్యక్షతన బీజేపీ మతోన్మాద వ్యతిరేక జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తలుగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ జబ్బార్, సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి హన్మంతు, అరుణ్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మతం పేరుతో మనుషులను విడదీసి మెజార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలు పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఉపాధి సమస్యలతో సతమతమవుతుంటే వాటిని పక్కదారి పట్టించేందుకు మతపరమైన ఎజెండాను ముందుకు తెస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయడం లేదన్నారు. దేశసంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వంగా జీవించేందుకు, మతసామరస్యాన్ని పెంచేందుకు, కార్మిక, కర్షక ఐక్యతను కాపాడేందుకు, వారి హక్కుల సాధన కోసం వామపక్ష పార్టీలు ఉద్యమిస్తున్నాయని, రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు, వర్గ పోరాటాలను ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు లక్ష్మి, ఎం.రాజు, గోపి, పరమేశ్వరాచారి, మేకల ఆంజనేయులు, కళావతమ్మ, మోషా, గోపాలకృష్ణ, ఆది, రమేశ్, గుంటి వెంకటయ్య, మహబూబ్‌పాషా, రాజు, రాజన్న, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
రేపు పుష్పయాగం
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం పుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక సభ్యుడు సందడి ప్రతాప్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు పుష్పయాగం ప్రారంభమవుతుందని.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment