పారదర్శకంగా రుణాలు అందిస్తున్నాం
ఐనవోలు : నందనం సొసైటీని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో విలీనం చేసిన తర్వాతే పురోగతి సాధించిందని వరంగల్ డీసీసీ బ్యాంకు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు స్పష్టం చేశారు. సామాన్య రైతు ఎవరికి కమీషన్లు ఇవ్వకుండా నేరుగా సొసైటీ, డీసీసీబ్యాంకు బ్రాంచ్‌ల్లో సంప్రదిస్తే అత్యంత పారదర్శకంగా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నందనం సొసైటీ ఆధ్వర్యంలో అదే గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ మార్టును ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నందనం రైతు సేవా సహకార సంఘంలో 52వ మహాజన సభ సమావేశం సంఘం ఉపాధ్యక్షుడు తక్కళ్లపెల్లి చందర్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. సొసైటీ సీఈఓ సంపత్‌కుమార్ ఆరు నెలల ప్రగతి నివేదికను రైతులకు చదివి వినిపించారు. అనంతరం మార్నేని రవీందర్‌రావు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా నందనం సొసైటీ పనిచేస్తోందన్నారు. వ్యవసాయ భూమి మాత్రమే ఉన్న రైతు కొడుకు విదేశాల్లో చదవాలంటే గతంలో రుణాలు ఇచ్చే బ్యాంకులే లేవన్నారు. డీసీసీ బ్యాంకు ఒక్కటే వ్యవసాయ భూములపై విదేశీ రుణాలు అందిస్తుందన్నారు. రుణాలు పొందిన రైతులు తమకు ఇచ్చిన గడువులోగా రుణాలు తిరిగి చెల్లిస్తే అపరాధ రుసుం వసూలు చేయరన్నారు. అనంతరం రైతులకు సొసైటీ ద్వారా మంజూరైన కర్షక మిత్ర మార్టిగేజ్ రుణాలకు సంబంధించిన రూ.56 లక్షల విలువగల చెక్కులు పంపిణీ చేశారు.
సొసైటీ సీఈఓపై డైరెక్టర్ ఆగ్రహం
నందనం సొసైటీ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న సంపత్‌పై డైరెక్టర్ మేట చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈఓ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడని, విధులు సరిగా నిర్వర్తించని సీఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు బుచ్చిరెడ్డి, బాబు, పద్మ, ఎలేంద్ర, రాంచంద్రం, చిరంజీవి, రాజ్‌కుమార్, నోడల్ ఆఫీసర్, బ్యాంకు మేనేజర్, బాం్యకు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment