అందరు ఆరోగ్యంగా ఉండాలి
సైబరాబాద్ అడిషనల్ డీసీపీ పుల్ల శోభన్
కమలాపూర్ : అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ధ్యేయమని సైబరాబాద్ అడిషనల్ డీసీపీ పుల్ల శోభన్‌కుమార్ అన్నారు. పుల్ల ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో సోమవారం కమలాపూర్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి స్వయంగా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఏకశిల, లక్ష్మీనరసింహ, భద్రకాళి ఆస్పత్రి వైద్యులు 900 మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శోభన్‌కుమార్ మాట్లాడుతూ పుల్ల వంశస్తుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఎస్పీ పుల్ల సంజీవరావు, సీఐ హరికృష్ణ, ఎంపీడీఓ గుండె బాబు, ఏకశిల, లక్ష్మీనరసింహ, భద్రకాళి ఆస్పత్రుల వైద్యులు పాల్గొన్నారు.
వ్యవసాయ బావిలో
కొండచిలువ
శాయంపేట : శాయంపేటకు చెందిన రైతు గడ్డం సంజీవ్ సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావిలో కొండచిలువ కనిపించడంతో ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ సభ్యుడు మారపల్లి సునీల్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో సునీల్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా బీట్ ఆఫీసర్ రతన్‌లాల్‌తోపాటు జూపార్క్ సిబ్బంది అక్కడికి చేరుకొని బావిలోని కొండచిలువను సురక్షితంగా బయటికి తీశారు. అనంతరం అడవిలో వదిలివేయడానికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment