సమగ్ర సర్వేతో ప్రయోజనం
పరకాల: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రతి కుటుంబం నమోదు చేసుకుని ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులు కావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. పరకాల మున్సిపాలిటీలోని 12వ వార్డులో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఇన్‌చార్జ్ కమిషనర్ కె.సుష్మా, ఏసీపీ కిషోర్‌కుమార్, డిప్యూటి స్టాటిస్టికల్ అధికారి శ్రీనివాసులు, కౌన్సిలర్లు బండి రాణి, మార్క ఉమాదేవి, మడికొండ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలి..
దళారులకు పత్తి విక్రయించకుండా రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. గురువారం పరకాల వ్యవసాయ మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ రవీందర్, ఆర్డీఓ కె.నారాయణ, మార్కెట్ కార్యదర్శి జీవన్‌కుమార్, హనుమాన్, ధనలక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లు యజమానులు ఎం.బాపురావు, ఎర్ర రామన్న, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment