![డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/27/26wdpt054-330133_mr-1735244253-0.jpg.webp?itok=Yv4SgCZ_)
డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
తీవ్ర జ్వరం, ఫిట్స్‌తో అస్వస్థత
స్వగ్రామానికి చేరిన మృతదేహం
జగ్గయ్యగూడెంలో విషాదఛాయలు
ఐనవోలు: మండలంలోని జగ్గయ్యగూడెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గొలమారి క్రాంతికుమార్ రెడ్డి(35) అనారోగ్యంతో ఈనెల 17న అమెరికాలోని డల్లాస్‌లో మృతి చెందాడు. గొలమారి జోజిరెడ్డి–లూత్‌మేరి దంపతుల కుమారుడు క్రాంతి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాడు. అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. తీవ్ర జ్వరం రావడంతో డల్లాస్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. జ్వరానికి తోడు ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతతో మృతి చెందాడు.
కాగా.. క్రాంతికి మూడేళ్ల క్రితం తెలంగాణకు చెందిన ప్రియాంకతో వివాహమైంది. ఆమె కూడా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. వీరికి ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. క్రాంతికుమార్ రెడ్డి మెదక్ జిల్లాలోని వర్గల్‌లో నవోదయ విద్యాలయంలో చదువుకున్నాడు. ఇక్కడ చదివిన కొందరు అమెరికాలో స్థిరపడ్డారు. మిత్రుడి మృతి వార్త తెలుసుకున్న స్నేహితులు క్రాంతి మృతదేహాన్ని స్వగ్రామానికి చేరేలా సహకరించారు.
గురువారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా.. కుటుంబ సభ్యులు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment