వైద్య ‘ఆనందిని’ | Sakshi
Sakshi News home page

వైద్య ‘ఆనందిని’

Published Thu, May 9 2024 3:55 AM

-

మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని పేదల గుండె చప్పుడు వినాలని ఆ చిన్నారి ఉబలాటపడింది. ఒక్కో తరగతి పైకొస్తున్న కొద్దీ ఆ ఆశ బలమైన సంకల్పంగా మారింది. కూతురి తపన చూసి తల్లిదండ్రులు కలవరపడ్డారు. తమ స్తోమతకు వైద్య విద్య సాధ్యమేనా అని ఆందోళన చెందారు. పట్టువదలని ఆ విద్యార్థిని కష్టపడి చదివింది. కజకిస్థాన్‌లో ఎంబీబీఎస్‌ సీటు పొందింది. అక్కడకు వెళ్లి చదవడం ఎలా అనుకుంటున్న తరుణంలో చీకటిలో వెలుగు దివ్వెలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం వరమైంది. ఆన్‌లైన్‌లో ఆఖరి రోజు దరఖాస్తు చేసిన ఆ విద్యార్థినికి సంక్షేమ సర్కారు అండగా నిలిచింది. వైద్యవిద్య కయ్యే పూర్తి ఫీజు భరించేందుకు ముందుకొచ్చింది. అక్కడికెళ్లేందుకు అయ్యే ఖర్చులనూ భరించింది. ఇప్పుడు కజకిస్థాన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న ఆ విద్యార్థిని మోములో ఆనందం తొణికిసలాడుతోంది.

Advertisement
Advertisement