సెపరేటు | Sakshi
Sakshi News home page

సెపరేటు

Published Fri, May 10 2024 3:25 PM

సెపరే

శ్రీవారి సేవలో ఎన్నికల పరిశీలకులు
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు పర్దీప్‌ కుమార్‌, ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాహుల్‌ ధింగార సందర్శించారు.
ఆయన రూటే

శురకవారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2024

నిమ్మల.. వసూళ్లు చాలా..

ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటానికి తమ్ముళ్ల జేబులకు చిల్లు

కుర్చీల నుంచి ఫ్లెక్సీల వరకు భారం అంతా వారిదే

కార్యక్రమానికి అయ్యే ఖర్చు నిర్ణయించేది ఆయనే..

పార్టీ కార్యక్రమాలు, ట్రీగార్డుల పేరిట వ్యాపారుల నుంచి వసూళ్లు

పర్సంటేజీల కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిళ్లు

పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు బాగోతం

2014, 2019 ఎన్నికల్లో వరుసగా పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన పర్సంటేజీల వ్యవహారం పెద్ద రచ్చే అయ్యింది. పాలకొల్లులో పైసలిస్తేనే పనులు జరుగుతాయన్న ప్రచారం అప్పట్లో ముమ్మరంగా జరిగింది. 2018లో పట్టణంలోని దమ్మయ్యపతి మురుగుకోడు పనులకు సంబంధించి కమీషన్‌ వ్యవహారం తేలక కాంట్రాక్టర్‌కు అధికారుల ద్వారా బిల్లుల చెల్లింపులు నిలిపివేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌లో పెట్టి వేధింపులకు గురిచేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ తదితరులు జోక్యం చేసుకుని పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన నిర్వహించి సదరు కాంట్రాక్టర్‌ను బయటకు తీసుకువచ్చారు. గోదావరి పుష్కరాల పనుల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన అవినీతిలో లోకేష్‌కు వాటా ఇచ్చేవారని విమర్శలు ఉన్నాయి. సొమ్మొకరిది.. సోకొకరిది అన్న చందాన అప్పట్లో మొక్కలను సంరక్షించే పేరిట దాతలు, వ్యాపారుల నుంచి వసూళ్లు చేసి తన పేరు వేయించుకున్నారంటారు.

కార్యక్రమాల భారం కేడర్‌పైనే..

పార్టీ కార్యక్రమాలు పేరిట ఆయన ఏ గ్రామానికి, ఏ వార్డుకు వచ్చినా కుర్చీలు, జెండాలు, ఫ్లెక్సీలు, టిఫిన్లు, భోజనాలు తదితర ఖర్చులన్నీ స్థానిక నాయకులే భరించాలి. పార్టీ కార్యక్రమాలకు తక్కువనుకుంటే రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చయ్యేదంటున్నారు. ఫ్లెక్సీలు స్వయంగా ఆయనే డిజైన్‌ చేయించుకుని వాటినే ప్రింటింగ్‌ చేయించాలని, సైజులు కూడా ఆయనే నిర్ణయించే వారంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదోక పనిచేయించుకోవచ్చన్న ఉద్దేశంతో ఎంత ఖర్చయినా భరించేవాళ్లమని, పవర్‌ పోయినప్పుడు పాత ఒరవడి కొనసాగించడం తమ తలకు మించిన భారమయ్యేదని కేడర్‌ లోలోన మదనపడేవారని తెలుస్తోంది. ఆయన ప్రచార ఆర్భాటానికి తమ చేతి చమురు వదిలించేవారని ఆవేదన చెందుతున్నారంట.

హమారా జగన్‌

ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ నిర్ణయంతో కూటమికి ఎదురుగాలి వీస్తోంది. తామంతా సీఎం జగన్‌కు అండగా ఉంటా మని ముస్లిం నేతలు అంటున్నారు. 8లో u

బీసీలపై

పుట్టుకొచ్చిన ప్రేమ

గతంలో బీసీ నేతలు ఎవరినీ ఎదగనీయకుండా అణగదొక్కే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి కొత్తగా వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చిందన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. అందుకు అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపీ) బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కావడమే కారణమంటున్నారు. బీసీ సామాజికవర్గం నుంచి గతంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీల నుంచి మేకా శేషు బాబు, అంగర రామ్మోహన్‌ ఎమ్మెల్సీలుగా ఉండగా వారికి కనీస ప్రోటోకాల్‌ గౌరవం కూడా నిమ్మల దక్కకుండా చేసిన విషయా న్ని గుర్తు చేసుకుంటున్నారు. 2018లో పట్టణంలో అన్నా క్యాంటీన్‌ ప్రారంభో త్సవం సందర్భంగా ఎమ్మెల్సీ రామ్మోహన్‌ ను ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడంతో పాటు కార్యక్రమానికి ఆహ్వానించని విషయమై జరిగిన వివాదాన్ని, ఏఏంసీ చైర్మన్‌ పదవిని బీసీలకు ఇస్తానని చెప్పి క్షత్రియ సామాజిక వర్గానికి ఇవ్వడాన్ని బీసీలు చర్చించుకుంటున్నారు. పాలకొల్లు మున్సిపాల్టీలో వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న కర్నేన రోజారమణి దంపతులను ఎమ్మెల్యే నిమ్మల ఎదగనీయకుండా అడ్డుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపికి వర్గాలకు అతీతంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆదరణ లభిస్తుండటంతో నిమ్మలకు ఓటమి భయం పట్టుకుని బీసీ జపం చేస్తున్నారని స్థానికులు గుస గుసలాడుకుంటున్నారు.

న్యూస్‌రీల్‌

ఆయన వస్తున్నారంటే తమ జేబుకు ఎంత చిల్లు పడుతుందోనని అక్కడి తెలుగు తమ్ముళ్లు హడలిపోతారంట. పేరుకు ఎమ్మెల్యే అయినా పార్టీ కార్యక్రమాల ఖర్చులను కేడర్‌పై రుద్దుతారని, మీరు సహకరించాలంటూ వ్యాపారులనూ విడిచిపెట్టరని పేరు. గతంలో జరిగిన అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వ్యవహారం వివాదాస్పదమైనా.. ట్రీగార్డుల పేరిట వసూళ్లు చేసినా ఆయన రూటే సెపరేటని పేరొందారు పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. – సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్‌

టార్గెట్‌లు పెట్టి మరీ..

గతంలో పాలకొల్లులో నిర్వహించిన మినీ మహానాడుతో పాటు పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు, చంద్రబాబు, లోకేష్‌ తదితర నాయకుల పర్యటనల సమయంలో వ్యాపారులు, రి యల్టర్లు, బడాబాబులకు భారీగానే టార్గెట్‌లు పెట్టేవారని తెలుస్తోంది. ఆయనతో ఎందుకు వచ్చిన గొడవ అన్న ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా అడిగిన కాడికి వారు చెల్లింపులు చేసేవారంటారు. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే వసూళ్ల వేధింపులు తప్పవన్న ధోరణిలో వ్యాపారులతో పాటు వివిధ వర్గాల వారు వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం.

సెపరేటు
1/1

సెపరేటు

Advertisement
 
Advertisement