ప్రజాపక్షాన పోరాటాలకు వైఎస్సార్‌సీపీ కార్యాచరణ
పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
అత్తిలి: జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీని సంస్థాగతంగా బలోపేతం చేసి, ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాటాలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం అత్తిలిలో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు అధ్యక్షతన ఆయన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో తణుకు నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ముదునూరి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పూర్తిగా బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని పునః నిర్మాణం చేయడంతో పాటు కార్యకర్తలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నామన్నారు. కేడర్‌లో నూతన ఉత్సాహం నింపేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. త్వరలో జగన్ జిల్లాల్లో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో నాయకులను కలుసుకుని వారితో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. కొత్త కమిటీలు ఏర్పడిన అనంతరం ప్రతినెలా నియోజకవర్గంలో ఏదో ఒక మండల సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లాలో అన్ని నియోజవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటుచేసి అనంతరం జిల్లా కమిటీలను రూపొందిస్తామన్నారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అరెస్టులు చేయడంపై జగన్ ప్రత్యేక న్యాయవాదులను ఏర్పాటు చేశారని, సోషల్ మీడియా కన్వీనర్లు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
అన్నివేళలా అండగా..
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కేడర్‌కు అన్నివేళలా అండగా ఉంటానన్నారు. సమన్వయంతో పార్టీ కార్య క్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుద్దా మని పిలుపునిచ్చారు. నూతనంగా నియమించే కమిటీలకు ఎంపికై న వారు కర్తవ్య విధులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని కోరారు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ మోసపూరిత హామీలను ప్రజలు గమనిస్తున్నారని, పాలకులను ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఉచిత ఇసుక అమలు దారుణంగా ఉందని, ఇసుక ధరలు గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల సమన్వయకర్తలు గుడాల గోపి, పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా కన్వీనర్లపై ప్రభుత్వం పెట్టే కేసులకు ఎవరూ భయపడవద్దన్నారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్లు బుద్దరాతి భరణీప్రసాద్, ఉండవల్లి జానకి, అత్తిలి, తణుకు టౌన్, తణుకు రూరల్, ఇరగవరం మండల పార్టీ అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ, మంగెన సూర్య, బోడపాటి వీర్రాజు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు, అత్తిలి, తణుకు జెడ్పీటీసీ సభ్యులు అడ్డాల జానకి, ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, నాయకులు వెలగల అమ్మిరెడ్డి, పెన్మెత్స రామరాజు, వెలగల సాయిబాబారెడ్డి, పోలినాటి చంద్రరావు, ఆకుల పండుస్వామి, సబ్బితి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment