కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా సీనియర్ కబడ్డీ పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగే పోటీలకు వీరు ప్రాతినిధ్యం వహిస్తారు. 8లో u
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024
తాడేపల్లిగూడెం రూరల్: నిబంధనలకు పాతర వేస్తూ తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఎర్ర కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జిల్లాపరిషత్‌కు చెందిన భూములతో పాటు ఆరుగొలను, కొత్తూరు రెవెన్యూ పరిధిలో దాదాపు 150 నుంచి 200 ఎకరాల్లో ఎర్ర కంకర తవ్వకాలు సాగుతున్నట్టు తెలిసింది. అసలు లీజుదారుల నుంచి కంకర మాఫియా వాటిని స్వాధీనం చేసుకుని మరీ ఈ తవ్వకాలు చేస్తున్నట్టు సమాచారం. అధికారికంగా 20 అడుగుల మేర మాత్రమే ఇక్కడ కంకర తవ్వకాలు జరగాల్సి ఉంది. దీనికి తోడు అంతర్గత ఒప్పందం 30 అడుగులుగా తెలుస్తోంది. అయితే కంకర మాఫియా మాత్రం 100 అడుగుల పైగా లోతుకు వెళ్లి మరీ కంకరను తవ్వేస్తున్నట్టు కనిపిస్తోంది. రైతు తన భూమి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లు, లారీల ద్వారా కంకర లేదా మట్టిని బయటకు తరలిస్తే మైనింగ్ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండానే రాత్రీ పగలూ తేడా లేకుండా కంకరను తవ్వి స్థానిక అవసరాలతో పాటు అంతర్ జిల్లాలకు సైతం తరలిస్తున్నారు. ఇంతలా మాఫియా రెచ్చిపోతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో గ్రామం నుంచి లారీలు వెళ్తుండటంతో అప్పట్లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో లారీలు గ్రామంలోకి రాకుండా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అప్రోచ్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వెలిసిన అనధికారిక లేఅవుట్ల పూడికకు ఇక్కడ నుంచే కంకర తరలిపోతుంది.
సబ్ డివిజన్‌లో కానరాని మైనింగ్ శాఖ
తాడేపల్లిగూడెం సబ్ డివిజన్‌గా మారిన తర్వాత ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. అయితే, తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను, కొత్తూరు రెవెన్యూ పరిధిలో పెద్ద ఎత్తున కంకర తవ్వకాలు జరుగుతున్నా వాటిని అరికట్టే దిశగా మైనింగ్ శాఖ కార్యాలయం, అధికారులు ఇక్కడ లేకపోవడం శోచనీయం. జిల్లా, అంతర్ జిల్లాలకు ఇక్కడ నుంచి కంకర తరలిపోతున్నా మైనింగ్ అధికారులు మిన్నకుండటం విశేషం. ఇదిలా ఉండగా తాడిపూడి కాలువ గట్టు సైతం కంకర మాఫియా దాటికి కనుమరుగైపోతోంది. దీంతో సమీప రైతులు గట్టును సైతం ఆక్రమించి సాగు చేసుకోవడం విశేషం. అధికారులను ప్రశ్నిస్తే దాట వేసే ధోరణిలో వ్యవహరించడం గమనార్హం. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కంకర, గ్రావెల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
కాలువ గట్టు.. కొల్లగొట్టు..
జగ్గన్నపేటలో తాడిపూడి కాలువ గట్టు ఇలా..
న్యూస్‌రీల్
నిబంధనలు కాలరాసి.. కంకర తవ్వేసి..
యమకంకరులు
యథేచ్ఛగా ఎర్ర కంకర తవ్వకాలు
ఆరుగొలనులో రాత్రీపగలూ తేడా లేకుండా తరలింపు
లేఅవుట్ల పూడికకు వినియోగం
పట్టించుకోని అధికార యంత్రాంగం
ప్రభుత్వ ఆదాయానికి గండి
భూమి గల రైతుల నుంచి కంకర తవ్వకం నిమిత్తం తక్కువ ధరను కంకర మాఫియా చెల్లిస్తోంది. అయితే కంకర తవ్వకాలకు సంబంధించి మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. అటువంటి అనుమతులు కంకర మాఫియా వద్ద ఉన్నాయా ? అంటే ప్రశ్నార్థకమే. దీంతో మైనింగ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. మాఫియా మాత్రం కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తోంది. అధికారులు దాడులు నిర్వహించిన సందర్భంలో వారికి తాయిలాలు అందిస్తూ మాఫియా చేతులు దులుపుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. దాడులు సైతం నామమాత్రమే అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment