ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం
భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు తదితర సమస్యలపై 11 మంది అర్జీలు అందజేశారు. పలు సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్‌శాఖ ఉండాలని ఎస్పీ అన్నారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
27న సివిల్స్ శిక్షణకు స్క్రీనింగ్
ఏలూరు (టూటౌన్): సివిల్స్ పరీక్షల ఉచిత శిక్షణ కోసం ఈనెల 27న రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్‌వీ నాగరాణి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణకు జిల్లాలో 12 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి అదేరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు గంట ముందు రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్‌కు వెళ్లి రిపోర్ట్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 7569184335లో సంప్రదించాలని కోరారు.
మహిళలపై దాడులను అరికట్టాలి
భీమవరం (ప్రకాశంచౌక్): మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా విస్తృత అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవం వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. వచ్చేనెల 10 వరకు మహిళలను స్వేచ్ఛగా బతకనిద్దాం, స్వేచ్ఛగా ఎదగనిద్దాం అనే అంశంపై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. బాల్యవివాహాల నివారణకు చర్యలు తీసుకో వాలని, మహిళలపై దాడులు అరికట్టాలని అ న్నారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వరు పాల్గొన్నారు.
పెద్దింటికి పురస్కారం
నరసాపురం రూరల్: వేములదీవిలోని వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు పెద్దింటి అరుణ్‌కుమార్ ఆచార్యులు అలంకార బ్రహ్మ బిరుదు పేరుతో అవార్డు అందుకున్నారు. సో మవారం హైదరాబాద్‌లో వేదఖాన్ ట్రస్ట్, వై ఖానస యూత్ ఫారమ్ సంయుక్తంగా ఆయన కు అవార్డు అందజేశారు. వేంకటేశ్వరస్వామికి వేలాది అలంకారాలు చేసినందుకు గుర్తింపుగా అవార్డు ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment