‘మీకోసం’కు హాజరుకాకుంటే చర్యలు
జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి హెచ్చరిక
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమానికి హాజరుకాకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లాలో 20 మండలాల తహసీల్దార్ల కార్యాలయంలో జరుగుతున్న మీకోసం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాని అధికారులకు మె మోలు జారీ చేయాలని ఉన్నతాధికారులను అదేశించారు. కార్యక్రమానికి వరుసగా మూడు వారాల పాటు హాజరుకాని వారి వివరాలు సేకరించి స స్పెండ్ చేసే వరకూ చర్యలు చేపడతామన్నారు. సమాచారం ఇవ్వకుండా సెలవులు పెట్టిన అధికారులపై ఉదాసీనంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపైనా చర్యలు తప్పవన్నారు.
అధికారుల డుమ్మా
ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే పలుచోట్ల అధికారులు డుమ్మా కొట్టడంతో ప్రజలు భీమవరంలో జిల్లాస్థాయి కార్యక్రమానికి పోటెత్తుతున్నారు. స్థానికంగా చిన్నపాటి సమస్యల పరిష్కారానికి కూడా కలెక్టరేట్‌కు హాజరవుతూ అర్జీలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment