భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో 177 అర్జీలను జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, అధికారులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని జేసీ అన్నారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ బి.శివనారాయణ రెడ్డి, డీఎల్‌డీఓ వై.దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● గణపవరానికి చెందిన వడ్లమూడి రామలక్ష్మమ్మ తనకు భర్త, పిల్లలు లేరని, అనారోగ్యం కావడంతో అప్పులపాలయ్యానని, తన సోదరి కుమారులకు తాను రాసి ఇచ్చిన 97 సెంట్ల భూ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి తనకు స్వాధీన పరచాలని అర్జీ అందజేశారు.
● పెనుగొండకి చెందిన పుత్తినీడి పద్మ తమ ప్రాంతంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని విచారణ చేయాలని జేసీని కోరారు.
● తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లికి చెందిన బలుసు సూర్యచంద్రరావు తన వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు.
● కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీవిశ్వేశ్వరరావు బీసీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment