సేవలు దూరం.. రైతుకు భారం | - | Sakshi
Sakshi News home page

సేవలు దూరం.. రైతుకు భారం

Published Sun, Jan 26 2025 6:03 AM | Last Updated on Sun, Jan 26 2025 6:02 AM

సేవలు

సేవలు దూరం.. రైతుకు భారం

ఆదివారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2025

ఉండిలో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌

సాక్షి, భీమవరం: పంటలు, ఆక్వా సాగులో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సీడు, ఫీడు రాజ్యమేలుతున్నాయి. వీటిలో నాణ్యత ఏ మేరకు ఉందో తెలిపే ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేక నకిలీలను వినియోగించి రైతులు నష్టపోతున్నారు. భూమిలోని పోషక లోపాలను గుర్తించి అవసరమైన మేరకు ఎరువులను వినియోగించేందుకు ఉపయోగపడే భూసార పరీక్షల నిర్వహణ మొక్కుబడితంతుగా సాగేది. వ్యవసాయశాఖ మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలకు పంపినా పంట సగం పూర్తయ్యేసరికి ఫలితాలు రావడం వలన ఉపయోగం ఉండేదికాదు. ఈ నేపథ్యంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లకు శ్రీకారం చుట్టింది.

జిల్లాలో ఆరుచోట్ల.. సాగులో నకిలీ బెడదను అరికట్టి వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లను గత ప్రభుత్వంలో ఏర్పాటుచేశారు. రైతులు శాంపిల్స్‌ తెస్తే చాలు వ్యవసాయం, మత్య్సశాఖ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించి అన్ని పరీక్షలు ఇక్కడ ఉచితంగా నిర్వహించేలా ఒక్కో ల్యాబ్‌ను దాదాపు రూ.కోటికి పైగా వ్యయంతో రూపలక్పన చేశారు. తాడేపల్లిగూడెంలో రీజనల్‌ కోడింగ్‌ సెంటర్‌ (ఆర్‌సీసీ) ఉన్న నేపథ్యంలో జిల్లాలో మిగిలిన భీమవరం, ఉండి, నరసాపురం, తణుకు, పాలకొల్లులో, ఆచంట నియోజకవర్గానికి సంబంధించి మార్టేరులో అగ్రి ల్యాబ్స్‌ను నిర్మించారు. విత్తనాల స్వచ్ఛత, మొలక శాతం, తేమ శాతం పరీక్షించడం, ఎరువులు, ఆక్వా సీడు, ఫీడు నాణ్యమైనవిగా నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే నియోజకవర్గంలోని రైతులకు అమ్మకాలు జరిగేలా చూడటం, నకిలీలను గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఈ ల్యాబ్‌ల ముఖ్య ఉద్దేశం.

మూడుచోట్ల విత్తన పరీక్షలతో సరి

ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు భీమవరం, తణుకు, పాలకొల్లులోని ల్యాబ్స్‌ను ప్రారంభించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆక్వా తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ను గత ప్రభుత్వం అందజేసింది. తర్వాత ఉండి, నరసాపురం, మార్టేరులోని ల్యాబ్స్‌ నిర్మాణం పూర్తయ్యింది. పాలకొల్లులో కేవలం విత్తన మొలకశాతం పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుండగా భీమవరంలో విత్తన మొలకశాతం, ఆక్వాకు సంబంధించి చెరువు నీటి శాంపిల్స్‌ పరీక్షలు చేస్తున్నారు. ఆయా ల్యాబ్స్‌లో ఫెర్టిలైజర్స్‌ శాంపిల్స్‌ పరీక్షించేందుకు సామగ్రి ఉన్నా బోరు నీటి సదుపాయం లేకపోవడంతో వినియోగానికి నోచుకోవడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉండి, నరసాపురం, మార్టేరులోని అగ్రి ల్యాబ్స్‌ నిరుపయోగంగా మారాయి.

న్యూస్‌రీల్‌

వినియోగంలోకి తేవాలి

రైతులంటే కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్‌ అగ్రిల్యాబ్స్‌ను వినియోగంలోకి రాకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. ల్యాబ్స్‌ను వినియోగంలోకి తెచ్చి నకిలీల సమస్యను అరికట్టాలి.

– వడ్డి రఘురాం, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తాడేపల్లిగూడెం

సామగ్రి రావాల్సి ఉంది

జిల్లాలోని కొన్ని ల్యాబ్‌లలో విత్తన పరీక్షలు జరుగుతున్నాయి. మిగి లిన చోట్ల పూర్తిస్థాయిలో సామగ్రి ఇంకా రాలేదు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం.

– జెడ్‌.వెంకటేశ్వరరావు, జేడీ, వ్యవసాయశాఖ

నిర్వీర్యమౌతున్న అగ్రి ల్యాబ్‌లు

వ్యవసాయ, ఆక్వా, పాడి రైతులకు అండగా నిలిచిన గత ప్రభుత్వం

విత్తనాలు, ఎరువులు, ఆక్వా సీడు, ఫీడు, దాణా పరీక్షలకు ల్యాబ్‌లు

దాదాపు రూ.6 కోట్లతో జిల్లాలో 6 ల్యాబ్‌ల నిర్మాణం

ల్యాబ్‌లను పట్టించుకోని కూటమి ప్రభుత్వం

మూడుచోట్ల నిరుపయోగంగా ల్యాబ్‌లు

మిగిలిన చోట్ల విత్తనాలు, నీటి శాంపిల్స్‌ పరీక్షలకే పరిమితి

సేవలు అందక.. వినియోగానికి నోచుకోక..

ఈ చిత్రాన్ని గమనించారా? నకిలీలతో వ్యవసాయం, ఆక్వా, పాడి రైతులు నష్టపోకూడదని గత ప్రభుత్వంలో నియోజకవర్గ కేంద్రం ఉండిలో నిర్మించిన డా.వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌. నియోజకవర్గంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆక్వా చెరువుల్లోని నీరు, చేప పిల్లల సీడు, ఫీడు, పశువులకు అందించే దాణా, మందులను ఇక్కడ పరిశీలించి నాణ్యమైనవని నిర్ధారించిన తర్వాతనే డీలర్లు, వ్యాపారులు మార్కెట్‌లో రైతులకు అమ్మకాలు చేసేందుకు దాదాపు రూ.కోటి వ్యయంతో ఈ ల్యాబ్‌ను నిర్మించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో వినియోగానికి నోచుకోక ఇదిగో ఇలా నిరుపయోగంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
సేవలు దూరం.. రైతుకు భారం1
1/4

సేవలు దూరం.. రైతుకు భారం

సేవలు దూరం.. రైతుకు భారం2
2/4

సేవలు దూరం.. రైతుకు భారం

సేవలు దూరం.. రైతుకు భారం3
3/4

సేవలు దూరం.. రైతుకు భారం

సేవలు దూరం.. రైతుకు భారం4
4/4

సేవలు దూరం.. రైతుకు భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement