అర్జీల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి కృషి

Published Tue, Jan 28 2025 1:32 AM | Last Updated on Tue, Jan 28 2025 1:32 AM

అర్జీల పరిష్కారానికి కృషి

అర్జీల పరిష్కారానికి కృషి

దొంగ స్వామీజీ అరెస్టు
అశుభం జరుగుతుందంటూ భయపెట్టి పూజలు చేయిస్తానంటూ డబ్బులు తీసుకొని ఉడాయించే దొంగ స్వామీజీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 8లో u

భీమవరం(ప్రకాశం చౌక్‌): ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, ఈ దిశగా అధికారులు కృషిచేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారం నాణ్యతగా, రీ ఓపెన్‌ కాకుండా ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, గ్రామ, వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్‌ అప్పారావు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబ్యునల్‌ మెంబరు మేళం దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్జీల్లో కొన్ని..

● మొగల్తూరు మండలం వారతిప్పలో మంచినీటి చెరువులోని చేపలకు వేలం నిర్వహించకుండా పంచాయతీ కార్యదర్శి, ఈఓపీఆర్డీ గ్రా మంలో కొందరితో కుమ్మకై పట్టుబడి చేసుకునే అమ్ముకున్నారని ఎంపీటీసీ భర్త తిరుమాని శివనాగరాజు ఫిర్యాదు చేశారు.

● పాలకొల్లుకి చెందిన మంగ రత్నమాల ఆచంటలో సర్వే నంబర్‌ 7897లో తన భూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేసి వాస్తవ భూమి చూపించాలని అర్జీ అందజేశారు.

● పెంటపాడు మండలం ముదునూరుపాడులో నివాసాల మధ్య బ్రాందీ షాపులను నిర్వహిస్తున్నారని, దీంతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు బి.సత్యవతి, కె.మంగ టి.సరస్వతి కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement