కొల్లేరుపై కామినేని గారడీ | - | Sakshi
Sakshi News home page

కొల్లేరుపై కామినేని గారడీ

Published Tue, Jan 28 2025 1:32 AM | Last Updated on Tue, Jan 28 2025 1:31 AM

కొల్ల

కొల్లేరుపై కామినేని గారడీ

కొల్లేరు ప్రజలు ఏం కోరుతున్నారంటే..

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రజాప్రతినిధులకు కొల్లేరు కష్టాలు ముంచుకొచ్చాయి. కృష్ణా నది వర దలతో కొల్లేరు కకావికలం కావడంతో మళ్లీ రాష్ట్రస్థాయిలో కొల్లేరు ఆక్రమణలపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ పరిణామాల క్రమంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తీవ్ర గందరగోళం రేగి ప్రజల్లో అసంతృప్తి రగులుతోంది. ప్రతి ఎన్నికలకు కొల్లేరును సెంటిమెంట్‌గా వాడుకుని లబ్ధి పొందిన కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో సహా ప్రజాప్రతినిధులకు ఈసారి గట్టి షాక్‌ ఇవ్వడంతో మళ్లీ యథావిధిగా మాయమాటలతో ముచ్చట్లకు తెరతీయడం చర్చనీయాంశంగా మారింది.

మళ్లీ బడాయి మాటలు

కొల్లేరు సమస్యలను పరిష్కరిస్తానంటూ 2014 నుంచి ఎన్నికల సమయంలో హామీలిచ్చి కొల్లేరు ఓ ట్లతో గట్టెక్కిన బీజేపీ ఎమ్మెల్యే కామినేని మళ్లీ బ డా యి మాటలకు తెరతీశారు. మూడు నెలల్లో కొ ల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువులు ధ్వంసం చేసి సరిహద్దులు నిర్ణయించాలని సుప్రీం ఆదేశాలతో కొల్లేరు పరీవాహక గ్రామాల్లో కలకలం రేగింది. కొల్లేరు ఓటర్లకు కూటమి ప్రజాప్రతినిధులు విలన్లుగా మారిపోయారు. దీంతో మళ్లీ హడావుడిగా కొల్లేరుకు శాశ్వత పరిష్కారమంటూ బడాయి మాటలు చెప్పడానికి ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేయించి మరీ పాత పాటే పాడటం చర్చనీయాంశంగా మారింది. గత శనివారం కై కలూరులో కొల్లేరు పెద్దల సమావేశమంటూ టీడీపీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేయించి అత్యంత జాగ్రత్తగా కాంటూరు లెవిల్‌ 5 నుంచి 3కు కుదింపు అంశాన్ని అట్టకెక్కించడంలో ఎమ్మె ల్యేలు కామినేని శ్రీనివాస్‌ విజయవంతమయ్యారు. ఇప్పుడు తాజాగా మీరెంత వరకైనా పోరాడండి మీ వెనుక కొల్లేరు ఎమ్మెల్యేలు కామినేని, చింతమనేని, రఘురామకృష్ణరాజు, ధర్మరాజు, ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్‌ ఉంటారని ప్రకటించి సమస్య పరిష్కార భారం కొల్లేరు ప్రజలపైనే వదిలేశారు.

సుప్రీం ఆధీనంలో.. కొల్లేరు సమస్య రాష్ట్ర పరిధిలో లేదు, సుప్రీంకోర్టు ఆధీనంలో ఉంది. 1999 అక్టోబరు 4న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 120 ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి, పూర్వ కృష్ణా జిల్లాలో 9 మండలాల్లో +5 కాంటూరు పరిధి వరకు 77,138 ఎకరాల్లో కొల్లేరును అభయారణ్యంగా గుర్తించారు. ఆక్రమణలు పెరగడంతో 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు ఆపరేషన్‌ చేశారు. కాకినాడకు చెందిన కె.మృత్యుంజయరావు గతేడాది సెప్టెంబర్‌ 1న అప్పటి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను ప్రతివాదిగా చేరుస్తూ కొల్లేరు ఆక్రమణలపై పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 16న కొల్లేరు ఆక్రమణలపై సుప్రీం కొరడా ఝులిపించింది. మూడు వారాల్లో ప్రభుత్వం నివేదిక అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 14నకు వాయిదా వేసింది.

2014 నుంచీ అదేమాట

కామినేని 2014లో బీజేపీ అభ్యర్థిగా కై కలూరు నుంచి గెలిచి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ భీమవరం సభలో కొల్లేరు కాంటూరు కుదింపు, పెద్దింట్లమ్మ వారధి నిర్మాణా లకు హామీ ఇచ్చారు. 2015 జూలైలో అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌, మరో మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి కొల్లేటికోటలో సమావేశం ఏర్పాటుచేశారు. కాంటూరు కుదింపు అంశంపై త్రిసభ్య కమిటీ బృందం ఏర్పాటుచేశారు. ఈ కమిటీ పర్యావరణానికే ప్రాధాన్యమిచ్చినా కొల్లేరుపై ఏమీ తేల్చ లేదు. మళ్లీ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే బీజేపీ అభ్యర్థిగా వచ్చి శాశ్వత పరి ష్కారం చూపిస్తానని, కాంటూరు కుదింపు చేస్తానని కామినేని పాతపాటే పాడారు. కామినేని హామీ ఇచ్చిన పెద్దింట్లమ్మ వారధి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించడం విశేషం.

ఎన్నికల్లో శాశ్వత పరిష్కారమంటూ కొత్త అజెండా

సమస్య తీవ్రం కావడంతో ఇటీవల హడావుడిగా సమావేశం

కాంటూరు కుదింపును అట్టకెక్కించిన నేతలు

కూటమి నేతల మాయమాటలతో కొల్లేరు విలవిల

కొల్లేరు ప్రజల్లో రగులుతున్న అసంతృప్తి

కొల్లేరు కాంటూరు 5 నుంచి 3కు కుదించడం, గ తంలో కొల్లేరు ఆపరేషన్‌ జరిగిన సమయంలో 7,500 ఎకరాల భూమిని అదనంగా ధ్వంసం చేశారు. వాటిని పేదలకు పంచాలని బలమైన డిమాండ్‌ ఉంది. దివంగత వైఎస్సార్‌ హయాంలో భూ పంపిణీకి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాగే 14,932 జిరాయితీ భూములు, 5,510 ఎకరాల బీఫాం పట్టా భూములు పంపిణీ చేయాలి. ఇక సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్‌, రివ్యూ పిటిషన్లు దాఖలు చేసి కొల్లేరు వా దనలు వినిపించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొల్లేరుపై సమీక్ష నిర్వహించి కాంటూరు కుదింపుపై తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించాలి. కొల్లేరు పరీవాహక ప్రాంతంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవానికి కొల్లేరు సమస్యలు జా తీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు (ఎన్‌టీడబ్ల్యూ ఎల్‌) ఆమోదంతో జరగాలి. రాష్ట్ర బోర్డు తీర్మానం చేస్తేనే ఇదంతా జరుగుతుంది. ఇవేమి మాట్లాడకుండా మీరు పోరాడండి వెనుక మేం ఉంటామంటూ హడావుడి సమావేశాలు నిర్వహించడంపై లంకవాసులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కొల్లేరుపై కామినేని గారడీ 1
1/1

కొల్లేరుపై కామినేని గారడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement