విభిన్న ఆలోచనలతో కొలువులు
తాడేపల్లిగూడెం: విభిన్న ఆలోచనలు ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీ నిట్‌లో సోమవారం ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థులకు హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. దినేష్‌రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాలు ఉంటేనే కొలువుల సాధన సాధ్యమన్నారు. విభిన్న ఆలోచనలకు అక్షర రూపమిస్తే అద్భుత ఆవి ష్కరణలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఆచార్యులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ మూడు సమస్యలపై 24 గంటల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి తీసుకురావాలని కోరారు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, అసోసియేట్ డీన్ ఫణి శ్రీకృష్ణ అధ్యక్షత వహించారు.
30న విశాఖ ఉక్కు పరిరక్షణ యాత్ర రాక
భీమవరం: సీపీఎం చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ యాత్ర ఈనెల 30న భీమవరం చేరుకుంటుందని, యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ సోమ వారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్న తరుణంలో యాత్ర విశాఖ నుంచి నెల్లూరు వరకు సాగుందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించినంత మాత్రాన సమస్య శాస్వతంగా పరిష్కారం కాలేదని తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖ స్టీల్ అప్పుల్లో ఉందని సెయిల్‌లో విలీనం సాధ్యం కాదని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
నిరుద్యోగ భృతి అమలుచేయాలి
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి ఇస్తామని ఇచ్చిన హామీని అమలుచేయాలని ఏపీ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి చిక్కాల దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ ఏలూ రు నుంచి కాకినాడకు 15 రోజుల పాటు నిర్వహించే పాదయాత్రను సోమవారం ఏలూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులను ఆదుకునేందుకు తక్షణం మెగా డీఎస్సీ తీయాలన్నారు. వలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించి వారికి నెలకు రూ.10 వేల వేతనం అందించాలని కో రారు. సచివాలయ సిబ్బందిని పర్మినెంట్ చేసి వారికి పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలన్నారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ప్రత్యేక చట్టం చేసి దాని ద్వారా హెల్త్‌స్కీమ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు.
లేగదూడల అందాల పోటీలు
పోడూరు: మట్టపర్రులో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో సోమవారం లేగదూడల అందాల పోటీలు నిర్వహించారు. మొత్తం 35 లేగదూడలు పాల్గొన్నాయి. కడలి సత్యనారాయణకు చెందిన లేగదూడ ప్రథమ, బండారు నాగేశ్వరరావుకు చెందిన దూడ ద్వితీయ, అడ్డాల ప్రసాద్‌కు చెందిన దూడ తృతీయ బహుమతులు సాధించాయి. సర్పంచ్ దొమ్మేటి శ్రీనివాస్, పాలకొల్లు వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెన్మెత్స రామభద్రరాజు, పశుసంవర్ధకశాఖ ఏడీ పి.జయకర్ బహుమతులు అందించారు. అలాగే పశువైద్య శిబిరం నిర్వహించి సుమారు 50 పశువులకు వ్యాధినిరోధక టీకాలు వేశారు. మండల పశువైద్యాధికారి ఎస్.మహేష్‌కుమార్ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో వర్మీ కంపోస్టు స్టాల్
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం వర్మీ కంపోస్టు అమ్మకానికి ఉంచుతామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సో మవారం కలెక్టరేట్ వద్ద వర్మీ కంపోస్టు స్టాల్‌ను ఆమె ప్రారంభించారు. వ్యవసాయంలో ఆర్గా నిక్ వర్మీ కంపోస్టు వాడకంతో అధిక దిగుబడు లు సాధించవచ్చన్నారు. కిలో ఒక్కింటికి రూ.10ల చొప్పున స్టాల్‌లో విక్రయిస్తారని, ప్రతి సోమవారం రొటేషన్ పద్ధతిలో రెండేసి పంచాయతీల చొప్పున అమ్మకాలు చేస్తారని, తొలిరోజు విస్సాకోడేరు, ఉణుదుర్రు పంచాయతీల ఎస్‌డబ్ల్యూసీ ప్లాంట్ల నుంచి తయారుచేసిన వర్మీ కంపోస్టును అందుబాటులో ఉంచామన్నారు. డీపీఓ బి.అరుణశ్రీ, టెక్నికల్ కో– ఆర్డినేటర్ ఎన్.ఎడ్వర్డ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment