భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సందడి
భీమవరం: భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం రాత్రి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర బృందం సందడి చేసింది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సంబరాల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం హీరో, హీరోయిన్లు వెంకటేష్, ఐశ్వర్యరాజేష్, మీనాక్షి డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముందుగా గాయకులు శ్రీకృష్ణ, రఘురామ్, మధుప్రియ, రోహిణి తదితరులు చిత్రంలోని పాటలు ఆలపించారు. అలాగే కళాశాల విద్యార్థులు డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నారు. చిత్రంలో బులిరాజు పాత్రతో ఆకట్టుకున్న రేవంత్ తన మాటలతో ప్రేక్షకులను నవ్వించగా పాటల రచయితలు భాస్కర్‌భట్ల, చేగొండి అనంతశ్రీరామ్, సంగీత దర్శకుడు భీమ్స్ సినిమాలో పా టలు, డైలాగులతో ఆలరించారు. అనంతరం హీరో వెంకటేష్ మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చిత్రీకరణ సమయంలో తప్పక హిట్ కొడతామని భావించామని, ప్రేక్షకులు త్రిపుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. సినిమా విజయం వెనుక దర్శకుడు అనిల్ రావిపూడి శ్రమ చెప్పలేనిదన్నారు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్‌బస్టర్ తో మీ ముందుకు వస్తామన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత హిట్ కొట్టే సినిమా కోసం ఆలోచిస్తున్నానని, రెబర్‌స్టార్ ప్రభాస్‌తో సి నిమా తీయడానికి ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. హీరోయి న్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మాట్లాడుతూ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలో నిర్వహించిన ఈ ఈవెంట్ తన కళాశాల రోజులను గు ర్తుకు తెచ్చిందని మీనాక్షి అన్నారు. చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), కామినేని శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment