ఏకగ్రీవంగా ట్రెజరీ ఎన్నికలు
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖజానా శాఖ ఉద్యోగుల సంఘ కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం ఏ లూరు జిల్లా ఖజానా కార్యాలయంలో ఎన్నిక లు నిర్వహించగా ప్రెసిడెంట్‌గా యూవీ పాండురంగారావు, సెక్రటరీగా కప్పల సత్యనారా యణ, ట్రెజరర్‌గా ఎల్.వెంకటేష్, అసోసియే ట్ ప్రెసిడెంట్‌గా ఎం.మధుసూదనరావు, వైస్ ప్రెసిడెంట్‌లుగా పి.హరిబాబు, ఎ.శ్రీనివాసరావు, యు.రాజేష్‌కుమార్, ఎ.రమ కిరణ్మయి, జాయింట్ సెక్రటరీలుగా బి.నరసింహరావు, విద్యాసాగర్, డి.వరలక్ష్మిని ఎన్నుకున్నారు. ఉ మ్మడి జిల్లా ఏపీఎన్‌జీఓ సంఘ అధ్యక్షుడు చో డగిరి శ్రీనివాస్ ఎన్నికల అధికారిగా, ఏపీటీఎస్‌ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ.రమణారెడ్డి సహాయ ఎన్నికల అధికారిగా, బి.సతీష్ ఎ న్నికల అబ్జర్వర్‌గా వ్యవహరించారు. పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ హరినాథ్ తదితరులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
‘వీరగాథ’ పోటీల్లో ప్రథమం
ఆకివీడు: రిపబ్లిక్ డే సందర్భంగా సర్వశిక్షా అభియాన్ వీరగాథ 4.0 పేరుతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో సిద్ధాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కలవల కుసుమ (8వ తరగతి) రాష్ట్రస్థాయిలో ప్రథమ బ హుమతి గెలుచుకుంది. ఆమె గీసిన ‘సెల్యూట్ ఇండియన్ ఆర్మీ’ చిత్రం అవార్డు, మెమెంటో, నగదు బహుమతులను సాధించింది. ఆదివారం విజయవాడలో సర్వశిక్షా అభియాన్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ చేతులమీదుగా కుసుమ అవా ర్డు అందుకుంది. హెచ్‌ఎం ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు నాగదుర్గ, కనిశెట్టి ప్రసాద్, శేషసాయి, కంభంపాటి న ర్సింహం, ఎ.ప్రసాద్, మోహన్ ఆమెను అభినందించారు.
ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: విజయవాడలో ఈనెల 28 నుంచి అండర్–23 మహిళల, పురుషుల అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కా ర్యదర్శి గవ్వ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపా రు. పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా మహిళా జ ట్టును ఆదివారం ఏలూరు కస్తూరిబా బాలికల పాఠశాలలో ఎంపిక చేశామన్నారు. బి.లీలావతి, ఎ. టాలీఅనిత, జి.నాగదేవి, టి.జ్యోతి, పీ ఎన్ వినయ్‌శ్రీ, వి.యామిని, పి.జయశ్రీ, డి.సాయిభవాని, బి.దేవిశ్రీ, పాలకొల్లుకు చెందిన ఆర్.మహాతి, డి.నందిని జట్టు సభ్యులుగా ఎంపికయ్యారన్నారు. స్టాండ్‌బై క్రీడాకారిణులుగా జి.సరిత, జి.సాయిసుధ, ఏపీ చంద్రిక ఉన్నారన్నారు.
మావుళ్లమ్మ సన్నిధిలోసినీ నటి ఐశ్వర్య రాజేష్
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మావుళ్లమ్మవారిని ‘సంక్రాంతికి వస్తున్నామ్’ సినిమా ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, ఫొటో అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment