అగ్నిప్రమాదంలో గాయపడిన బాలుడు మృతి
కై కలూరు: మండవల్లి మండలం భైరవపట్నంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల బాలుడు ఆదివారం ప్రాణాలు విడిచాడు. ఈనెల 24న రాత్రి భైరవపట్నంలో గ్యాస్ సి లిండర్లు పేలి తొమ్మిది గుడిసెలు దగ్ధమైన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమైన గుడిసెలోని దుబ్బా వంశీ (25), అతని భార్య అన్ను (21), వారి కుమారుడు విక్కీ (3)తో పాటు మరో ముగ్గురు కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బాలుడు విక్కీ మరణించాడు. వంశీ, అన్ను పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వంశీ మృతదేహాన్ని నందివాడ మండలం పోలుకొండలోని తాతయ్య ఇంటికి తరలించారు. క్షతగాత్రుల్లో నక్కల షారుఖాన్ (45), అతని కుమారులు చరణ్ (19), కార్తీక్ (18)లను కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వెల్లూరుకు ఆదివారం రాత్రి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment