ఏలూరు (టూటౌన్): రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఉద్యోగులు పనిచేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్‌కుమార్ పిలు పునిచ్చారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో న్యాయవాదులు విశేష కృషి చేయాలని, తద్వారా సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందని సూచించారు. ప్రతి వ్యక్తి సొంత లాభాన్ని కొంత త్యాగం చేసి సమాజాభివృద్ధికి పా టుపడాలని కోరారు. రెండో అదనపు జిల్లా జడ్జి పి. మంగాకుమారి, ఐదో అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి, పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్.ఉమా సునంద, డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏపీపీ కోనే సీతారామారావు, ప్రభుత్వ న్యాయవాది బీజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment