No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Apr 20 2024 2:00 AM

- - Sakshi

కడప సెవెన్‌రోడ్స్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండవ రోజైన శుక్రవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కడప లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా కాకర్ల షణ్ముఖరెడ్డి ఒక్కొక్క సెట్టు చొప్పున నామినేషన్‌ దాఖలు చేశారు.

అసెంబ్లీ స్థానాలకు: ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బద్వేలు, కమలాపురం, పులివెందులలో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. కడప అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా కోనేటి హరి వెంకట రమణ, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున సయ్యద్‌ సలావుద్దీన్‌ ఒక్కొక్క సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. జమ్మలమడుగు అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ తరుపున చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ఒక సెట్‌, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మూలె సుధీర్‌రెడ్డి తరుపున పార్టీ నాయకులు ఒక సెట్‌, వైఎస్సార్‌ సీపీ తరుపున మూలే క్రాంతిప్రియ మరొక సెట్‌, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ తరపున రామదాసు కాటా ఒక సెట్‌ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల వరదరాజులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా వెంకట ప్రసాద్‌రెడ్డి బొల్లవరం, భరోసా పార్టీ అభ్యర్థిగా చింతల శోభన్‌బాబు ఒక్కొక్క సెట్‌ చొప్పున నామినేషన్‌ దాఖలు చేశారు. మైదుకూరు అసెంబ్లీ స్థానంలో అన్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రాజా రామిరెడ్డి సిరయపురెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున రఘురామిరెడ్డి ఒక్కొక్క సెట్‌ చొప్పున నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

సుధీర్‌రెడ్డి తరపున నామినేషన్‌ పత్రాన్ని 
అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
1/1

సుధీర్‌రెడ్డి తరపున నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

Advertisement
 
Advertisement
 
Advertisement