ప్రజా సమస్యలపై పోరాటం
పులివెందుల రూరల్ : రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు చేయడానికి, ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయారన్నారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తామన్నారు. సమస్యలు విన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పురస్కరించే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో బద్వేలు ఎమ్మెల్యే సుధా, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపరెడ్డి, బలరాంరెడ్డి, రసూల్, బ్రహ్మానందరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment