తత్వవేత్త, కవి, సంగీతకారుడు, స్వరకర్త అయిన భక్త కనుకదాసు సమాజాన్ని మెప్పించిన ఆదర్శమూర్తి అని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కనకదాసు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ కనకదాసు కర్ణాటక సంగీతంకోసం ఎనలేని సేవ చేశారన్నారు. కర్ణాటకలో జన్మించిన ఆయన మంచి విద్యావంతునిగా సమాజాన్ని అన్ని కోణాల్లో సూక్ష్మ పరిశీలన చేశారని తెలిపారు. చిన్న వయసులోనే నరసింహాస్తోత్రం, రామధాన్యమంత్రం, మోహన తరంగిణి రచించారని వివరించారు. కురవ కులానికి చెందిన కనకదాసు అప్పట్లో కుల వివక్షను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి కృష్ణయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ, ఉపాధి కల్పనాధికారి సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment