కార్తికం.. కమనీయం
కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది,
ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో మారుమోగాయి. కార్తిక దీపారాధనతో
ఆలయాలు కాంతులీనాయి.పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెన్నా నదిలో స్నానాలు ఆచరించి కొండపై గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి,
సంతాన మల్లేశ్వర, సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలలో విశేష పూజలు నిర్వహించారు. మహిళలు నదితో బాటు ఆలయ ధ్వజ స్తంభం వద్ద , ఆలయ ప్రాంగణంలో
భక్తి శ్రద్దలతో దీపాలను వెలిగించారు.
–సాక్షి నెట్వర్క్
Comments
Please login to add a commentAdd a comment