కడప సెవెన్‌రోడ్స్ : ఈ ఏడాది రబీ పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో పంటల బీమా పథకానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నువ్వులు, వేరుశనగ, పెసలు, జొన్నలు, మినుములు, వరి, పొద్దుతిరుగుడు, శనగ పంటలకు బీమా సౌకర్యం ఉంటుందన్నారు. గడువులోపు నమోదు కావాలన్నారు. బీమా చేసిన మొత్తానికి 1.5 శాతం ప్రీమియం చెల్లించాలన్నారు. వాణిజ్య, ఉద్యాన పంటలకు ఐదు శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. పంట వేసిన ధృవపత్రం జారీ నిమిత్తం కూడా ఎటువంటి మొత్తాన్ని రైతు సేవా కేంద్రంలోని సిబ్బందికి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీమా చేసిన పంట వివరాలు ఈ–పంటలో సక్రమంగా నమోదయ్యాయో లేదో సరిచూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, ఎల్‌డీఎంజనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment