ఫిర్యాదులపై సత్వరం స్పందించాలి
కడప అర్బన్ : జిల్లాలో ప్రజలు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు ఫిర్యాదుదారులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణ పరిధిలోని ప్రొద్దుటూరు రహదారిలో బైపాస్ రోడ్డు సమీపాన స్కూటర్లు ఢీకొనడంతో.. ఒకరి పరిస్థితి విషమం కాగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయిన సంఘటన చోటు చేసుకొంది. సొమవారం పట్టణానికి చెందిన రామాంజనేయులు ప్రొద్దుటూరు వైపు నుంచి జమ్మలమడుగు వస్తుండగా.. వెనుక వైపు నుంచి స్కూటర్ ఢీకొన్న సంఘటనలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు అయినవి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా, రామాంజనేయులుకు స్వల్ప గాయాలైనవి. గుర్తు తెలియని వ్యక్తిని స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
విద్యార్థులపై శ్రద్ధ వహించాలి
వేంపల్లె : విద్యార్థులపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఆర్జేడీ, ఉర్దూ కళాశాల ప్రిన్సిపాల్ రవి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఉర్దూ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రతి రోజూ కళాశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు. కళాశాలలో చెప్పిన పాఠాలపై కూ డా అప్పుడప్పుడు అడగడంతోపాటు నోటు పుస్తకాలను తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థుల చదు వు పట్ల అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో.. అంత కంటే ఎక్కువగా తల్లిదండ్రులపై కూడా బాధ్యత ఉందన్నారు. సమావేశంలో అధ్యాపకులు భాస్కర్ నాయక్, ఫైరోజ్, షఫి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment