పులివెందుల రూరల్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణం భాకరాపురంలోని తన నివాసంలో ఆయన సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని పులివెందులలో ఏర్పాటు చేయాలని చాలా మంది దాతలు ముందుకు రావడం జరిగింది. దాతలకు మెమెంటోలు ఇచ్చే కార్యక్రమాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, మాజీ వైస్ చైర్మన్ సర్వోత్తమరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హేమాద్రిరెడ్డి, సుధీకర్‌రెడ్డి, హాలు గంగాధరరెడ్డి, పద్మనాభరెడ్డి, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీకి వినతి
బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీలో నెలకొన్న పలు రకాల సమస్యలను పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్అవినాష్రెడ్డిని కలిసి మున్సిపల్ చైర్మన్ వాకమళ్ళరాజగోపాల్రెడ్డి వినతిపత్రం సమర్పించారు. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పుత్తాశ్రీరాములు, మాజీ వైస్‌చైర్మన్ నాగంసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, తుమ్మిశెట్టివెంకటసుబ్బయ్య, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment