ప్రొద్దుటూరు క్రైం : తాను పని చేసిన డబ్బులు అడిగినందుకు మహ్మద్‌గౌస్ అనే యువకుడిపై ఉపేంద్ర పగిలిన బీరు సీసా ముక్కతో దాడి చేశాడు. ఈ సంఘటనలో మహమ్మద్‌గౌస్ తీవ్రంగా గాయ పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహమ్మద్‌గౌస్ జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. అతను పెయింట్ పని చేసుకొని జీవనం సాగించేవాడు. ఆణా బంకు సమీపంలో నివాసం ఉంటున్న ఉపేంద్ర కూడా అతనితో కలిసి పెయింట్ పని చేస్తుంటాడు. ఇటీవల ఇద్దరు కలిసి ఒక చోట పెయింట్ పని చేశారు. ఆ డబ్బులు మొత్తం ఉపేంద్ర ఒక్కడే తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న మహమ్మద్‌గౌస్ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడుగగా అతను ఇవ్వలేదు. దీంతో మహమ్మద్‌గౌస్ బెదిరించాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి బైపాస్‌రోడ్డులోని ముక్తియార్ ఆయిల్‌మిల్లు వద్ద ఉపేంద్ర కనిపించడంతో డబ్బు ఇవ్వాలని మళ్లీ అడిగాడు. పదే పదే డబ్బులు అడుగుతావా అంటూ అక్కడే ఉన్న గాజు సీసా ముక్కతో మహమ్మద్‌గౌస్ కడుపులో పొడిచి ఉపేంద్ర పరారయ్యాడు. తీవ్ర రక్తగాయాలతో పడిపోయి ఉన్న అతన్ని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ వెంకటసురేష్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment