తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమైందా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలిచ్చిన ఆయన తన పుట్టినరోజు డిసెంబర్ 12న కొత్తపార్టీ ప్రకటించనున్నట్లు సమాచారం. రజనీకాంత్ ఇప్పటికే తన అభిమానులతో సుదీర్ఘంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో కూడా అభిమానులు..రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు. అయితే దేవుడు ఆదేశిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని ఆయన కూడా చెప్పారు.
Published Sat, Jun 17 2017 7:03 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
Advertisement