ఏచూరిపై హిందూసేన దాడి | Two people raising slogans try to manhandle Sitaram Yechury | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 7 2017 5:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై హిందూ అతివాదులు దాడికి పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది. మీడియా సమావేశంలో పాల్గొనేందుకు నడుకుంటూ వస్తోన్న ఏచూరిపై హిందూసేనకు చెందిన ఇద్దరు వ్యక్తులు దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సీపీఎం కార్యకర్తలు.. ఆ ఇద్దరినీ దొరకబుచ్చుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడుతున్నందునే హిందూ అతివాదులు ఈ తరహా దాడులకు తెగబడ్డారని సీపీఎం నేతలు అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement