తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో వైఎస్సార్‌సీపీ యూఏఈ వింగ్ సభ్యుడు దిలీప్ రెడ్డి గోవింద్ జననేతపై తనకున్న అభిమానాన్ని విభిన్నంగా చాటుకున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుటిన రోజు సందర్భముగా దుబాయ్‌లో1800 అడుగుల ఎత్తులో ఉన్న జెబల్ జాయిస్ పర్వతం పైనుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఆవిష్కరించి, రసల్ కెయిమా జిప్ లైన్ స్టంట్ చేసి, వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారన్నారు. 2019లో వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని తెలియజేశారు. దిలీప్ రెడ్డి గోవింద్ ప్రయత్నాన్ని రమేష్ రెడ్డితో పాటూ పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అభినందించారు.