ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా సారథి విరాట్ కోహ్లి వీరోచితంగా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీతో చెలరేగడంతో టీమిండియా ఆతిథ్య జట్టుకు 521 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 2014లో ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన కోహ్లి ప్రస్తుత సిరీస్‌లో చెలరేగి ఆడుతున్నాడు.