బ్రిస్టల్ : మనుషులన్నా తాము పొందిన సహాయాన్ని మర్చిపోతారేమో గానీ, కొన్ని జంతువులు అలా కాదు! తమకు సహాయం చేసిన వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాయి. అతడికి ఏదో విధంగా సహాయం చేసి తీరతాయి. మనం చేసింది ఎంత చిన్న సహాయమైనా. అలాంటి ఓ సంఘటనే లండన్‌లోని బ్రిస్టల్‌లో చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం బ్రిస్టల్‌లోని ఎవాన్ అండ్ సమర్‌సెట్ వద్ద ఓ పోలీసు అధికారి తన రెండు చేతులతో ఓ గుర్రం వీపును గోకటం ప్రారంభించాడు. దీంతో ఆ గుర్రం కూడా ఆ పోలీస్ అధికారి వీపును తన నోటితో గోకటం ప్రారంభించింది. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించిన ఓ వ్యక్తి శనివారం ఉదయం తన ట్విటర్ ఖాతాలో ఉంచాడు.
దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు 2000మంది దీన్ని లైక్ చేయగా 250 మంది రీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీగా స్పందిస్తూ.. ‘‘ నా గుర్రుం కూడా ఇలాగే చేస్తుంది. తన ముని పంటితో నన్ను బాధించకుండా గోకుతుంది.. చనిపోయిన నా గుర్రానికి కూడా ఇలా చేయటం అంటే చాలా ఇష్టం.. ఒకర్నొకరు గోక్కోవటం చాలా బాగుంది. వెంటనే నేను కూడా ఓ గుర్రాన్ని కొనుక్కోవాలి.’’ అంటూ కామెంట్లు చేశారు.