NTR
-
శిక్షణ ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
చిలకలపూడి(మచిలీపట్నం): ఆరు నుంచి తొమ్మిది వరకు చదువుతున్న బాలికలకు రాణి లక్ష్మీభాయ్ ఆత్మ రక్ష స్వశిక్షణ్లో శిక్షణ ఇచ్చేందుకు ఏజెన్సీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ఎం. ఫణిదూర్జటి సోమవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లాలో ప్రాథమికోన్నత, ఉన్నత, జూనియర్ కళాశాలలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లలో చదువుతున్న బాలికలకు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారన్నారు. ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏజెన్సీలు వారి దరఖాస్తులను ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా మచిలీపట్నంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న శిక్షణ సంస్థలు విద్యాసంస్థల్లో స్వీయ రక్షణ శిక్షణను నిర్వహించటంలో ఏజెన్సీలకు ముందస్తు అనుభవం ఉండాలన్నారు. శిక్షకులకు తప్పనిసరిగా ఒక మార్షల్ఆర్ట్స్ లేదా ఆత్మరక్షణ క్రమశిక్షణ (తైక్వాండో), కరాటే, జూడో, క్రాప్ మాగా సర్టిఫికెట్ పొంది ఉండాలన్నారు. బాలికల కోసం శిక్షణ సామర్థ్యాన్ని ఏజెన్సీలు ప్రదర్శించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 8331957289లో సంప్రదించాలన్నారు. -
గ్రీవెన్స్‌ను సమర్థంగా నిర్వహించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డివిజనల్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్‌ను సమర్థంగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) జరిగింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి. జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాను నంబర్ వన్ చేయాలి.. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను నంబర్ వన్‌గా నిలిపేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయాలన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్కు వివిధ శాఖలకు సంబంధించి 145 అర్జీలు అందాయన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 56, పురపాలక పట్టణాభివృద్ధి 30, పోలీస్ శాఖకు 9, పంచాయతీరాజ్, సర్వే విభాగాలకు ఏడు చొప్పున, విద్యాశాఖకు సంబంధించి 6 అర్జీలు, ఉపాధికల్పన 5, ఆరోగ్యం 4, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 3, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 3, వ్యవసాయం, ఏపీఎస్ఆర్టీసీ, పౌర సరఫరాలు, ఇరిగేషన్‌కు రెండు చొప్పున, అదేవిధంగా ఏపీసీపీడీసీఎల్, సహకార, డీఆర్డీఏ, గృహ నిర్మాణం, పరిశ్రమలు, ఇంటర్మీడియెట్ విద్య, సాంఘిక సంక్షేమం శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున అందాయన్నారు. పీజీఆర్ఎస్లో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ● జి. కొండూరుకు చెందిన డి. రోహిణీ దేవి గ్రీన్ ఫీల్డ్ హై వే నిర్మాణానికి తన భూమి ఇచ్చారు. దీనికి సంబంధించి మూడు నెలల క్రితం అవార్డు పాస్ అయ్యింది. రూ.65లక్షలు పరిహారం రావాలి. భూమిపై ఉన్న రుణాలు చెల్లిస్తే పరిహారం అందజేస్తామని అధికారులు చెప్పారు. దీంతో బయట అప్పులు తెచ్చి బ్యాంకులో కట్టారు. అయితే ఇప్పటి వరకూ పరిహారం అందలేదు. బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తక్షణమే తనకు పరిహారం చెల్లించాలని కోరుతూ పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. ‘ప్రైవేటు’ ఫీజుల దోపిడీని అరికట్టాలి గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని, విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఫీజుల దోపిడీ, విద్యార్థుల ఆత్మహత్యలపై కలెక్టరేట్ల వద్ద నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టాయి. అనంతరం విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, ఉపాధ్యక్షుడు ఎం. సాయి కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ ఫీజుల దోపిడీ, విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి 145 అర్జీలు స్వీకరణ -
17 నుంచి వలంటీర్ల ఆమరణ నిరాహార దీక్ష
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ హనుమాన్‌పేటలోని సీపీఐ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వలంటీర్లను రెన్యూవల్ చేయలేమనే విషయం ఎన్నికల ముందు ముఖ్యమంత్రికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వలంటీర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, గౌరవ వేతనం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వలంటీర్ వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వలంటీర్లు షైనీ, భాను, నరేష్, కల్యాణ్, దమ్ము రమేష్, స్వప్న, సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం
విజయవాడస్పోర్ట్స్: కేసుల త్వరితగతిన పరిష్కారం కావడానికి మధ్యవర్తిత్వం ఎంతగానో దోహదపడుతుందని ఉమ్మడి కృష్ణాజిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. మీడియేషన్‌పై న్యాయవాదులకు, సోషల్ వర్కర్లకు 40 గంటల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, సుప్రీం కోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఆదేశాల మేరకు జిల్లాలోని 30 మంది న్యాయ వాదులు, సోషల్ వర్కర్లకు 40 గంటలు మీడియేషన్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. కర్ణాటకకు చెందిన బీనాదేవరాజ్, సుధా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యానంద్, కృష్ణాజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామకృష్ణ పాల్గొన్నారు. బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీలు మార్పు ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో బీఈడీ కోర్సు మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఫీజు చెల్లించుకునే గడువును మార్పు చేసినట్లు సీఈ అలపాటి శివప్రసాదరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీలోగా సంబంధిత అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రూ.100 అపరాధ రుసుంతో ఫిబ్ర వరి 6లోగా చెల్లించవచ్చని తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక -
సేవల్లో సో పూర్!
● గన్నవరానికి చెందిన 52 ఏళ్ల రమణయ్య తీవ్రమైన కడుపునొప్పితో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. అతనికి స్కాన్ చేసి కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. సర్జరీ చేసేందుకు నెల రోజులు పడుతుందని యూరాలజీ విభాగంలో చెప్పారు. దీంతో ఇంటికెళ్లిపోయారు. కిడ్నీల్లో రాళ్లు ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకి, జ్వరం కూడా రావడంతో చేసేది లేక ప్రైవేటు ఆస్పత్రికి వెళితే రూ. లక్షన్నర వరకూ ఖర్చు అయింది. అప్పు చేసి వైద్యం చేయించుకున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● విజయవాడకు చెందిన వెంకట్రావుకు బ్రెయిన్ రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి స్ట్రోక్ వచ్చింది. దీంతో ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు స్కానింగ్ చేశారు. మెదడు రక్తనాళాలకు స్టెంట్ వేయాలని ఇక్కడ అందుబాటులో లేదని చెప్పడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ రూ.3.50 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి వచ్చింది. పేద కుటుంబం కావడంతో అప్పుచేసి వైద్యం పొందినట్లు చెబుతున్నారు. ఇలా వీరిద్దరే కాదు నిత్యం అనేక మంది ప్రభుత్వాస్పత్రికి రావడం, ఇక్కడ వైద్యం లేదని చెప్పడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోవడం తరచూ జరుగుతోంది. ముఖ్యంగా యూరాలజీ, కార్డియోథోరాసిక్(సీటీ) సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో వంటి విభాగాలతో పాటు, న్యూరో సర్జరీల్లో స్టెంట్ అవసరమైన వారు ఇలా తరలివెళ్తున్న వారిలో ఉంటున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్‌లోని సూపర్‌స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, న్యూరా లజీ, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, అంకాలజీ విభాగాలు ఉన్నాయి. వీటిలోని కొన్ని విభాగాల్లో అరకొరగా సేవలు అందుతుండటంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ రాళ్లు ఉన్న వారితో పాటు, గుండె సర్జరీలు అవసరమైన వారు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులకు తరలిపోతున్నారు. గుండె కవాటాల మార్పిడి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో కూడా చేయక పోవడంతో బయటే డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. అరకొర సౌకర్యాలతోనే.. విజయవాడ జీజీహెచ్‌లోని యూరాలజీ విభాగంలో ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉన్నారు. కానీ సౌకర్యాలు అరకొరగా ఉండటంతో పూర్తిస్థాయిలో శస్త్ర చికిత్సలు నిర్వహించలేకపోతున్నారు. అదే రీతిలో కార్డియోథోరాసిక్ సర్జరీలు సైతం వారానికి ఒకటి, రెండు మూత్రమే నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. సర్జరీలు అవసరమైన వారు మాత్రం ఎక్కువగా ఉంటున్నారు. సర్జికల్ అంకాలజీ విభాగం ఉన్నా.. శస్త్ర చికిత్సలు అరకొరగా జరుగుతున్నాయి. అందుకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడమే కారణంగా చెబుతున్నారు. గతంలో అరుదైన జబ్బులకు సైతం ఖరీదైన ఇంజెక్షన్లను ప్రభుత్వం సరఫరా చేసేదని, ఇప్పుడు మందులు కూడా అరకొరగా ఉండటంతో చేసేది లేక రోగులే బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంటోందంటున్నారు. విజయవాడ జీజీహెచ్‌లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో దిగజారిన సేవలు ప్రైవేటు లేదా గుంటూరు ఆస్పత్రికి వెళ్తున్న రోగులు సీటీ సర్జరీ, యూరాలజీ సర్జరీల కోసం ఎదురు చూపులు ఖరీదైన ఇంజెక్షన్లనూ సరఫరా చేయని ప్రభుత్వం సేవలు దిగజారాయి.. గతంలో ప్రభుత్వాస్పత్రిలో నాణ్యమైన సేవలు అందేవి. ఇప్పుడు రోగులు వెళ్తుంటే మందులు లేవు, పరీక్షలు లేవు అంటున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పేదలు వైద్యఖర్చులు భరించలేక అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. – శెటికం దుర్గాప్రసాద్, పటమట అరకొరగానే సేవలు.. జీజీహెచ్‌లో అరకొరగానే సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో వచ్చే వారికి సమయానికి వైద్యం అందడం లేదు. సర్జరీ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోంది. ఫలితంగా చాలా మంది ప్రైవేటుకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటే బావుంటుంది. – చందా కిరణ్‌తేజ, మాచవరం -
మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్
చిలకలపూడి(మచిలీ పట్నం): గీత వృత్తిలోని కులాల వారికి మద్యంషాపుల కేటాయింపునకు గెజిట్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసినట్లు కృష్ణా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి జి. గంగాధరరావు తెలిపారు. ప్రభుత్వం 2024–26కి గీత కులాల వారికి 10 శాతం షాపులు ఇవ్వాలని నిర్ణయించగా జిల్లాలో 12 షాపులు కేటాయించారన్నారు. ఈ షాపుల కోసం దరఖాస్తులు ఆన్ లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ మోడ్‌లో ఇవ్వవచ్చన్నారు. అప్లికేషన్లు అన్ని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయన్నారు. ఫిబ్రవరి 5 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు తీసుకోనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్లు వచ్చిన షాపులకు లాటరీ పద్ధతిలో కేటాయింపు చేస్తామన్నారు. ప్రతి దరఖాస్తుకు రూ. 2 లక్షలు రుసుము చెల్లించాలన్నారు. దీంతో పాటు సంబంధిత తహసీల్దార్ ద్వారా కులం, ఉపకులానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉందన్నారు. మరిన్ని వివరాలకు జిల్లాలోని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్లలో గాని మచిలీపట్నం జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. హోరాహోరీగా డెకథ్లాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజయవాడస్పోర్ట్స్: డెకథ్లాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజయవాడ శివారు నిడమానూరులోని స్టార్ టెన్నిస్ అకాడమీలో సోమవారం జరిగింది. అండర్–10, 12, 14 బాల, బాలి కల విభాగాల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. అండర్–10 బాలుర విభాగంలో హర్షద్ప్రణవ్, లవిత్, అండర్–12 విభాగంలో వర్థన్, మహేశ్వరరెడ్డి, అండర్–14 విభాగంలో దిషంత్, మహేశ్వర్ వరుసగా విన్నర్, రన్నర్లుగా నిలిచారు. బాలికల అండర్–10 విభాగంలో విన్నర్‌గా శ్రీహిత, రన్నర్‌గా ఆర్న నిలిచారు. విజేతలకు డెకథ్లాన్ టెన్నిస్ ఇన్చార్జ్ సూర్య, స్టార్ టెన్నిస్ అకాడమీ కోచ్ సాయి ట్రోఫీ, సర్టిఫికెట్లు, నగదు బహుమతులను అందజేశారు. నూతన కార్యవర్గం ఎన్నిక మైలవరం: ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మ సంస్థల వ్యవస్థాపక ధర్మకర్తల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో సోమవారం జరిగిన ధర్మకర్తల సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా అశోక్ గజపతిరాజు, ముఖ్య సలహాదారుగా ఎస్.వి. సుధాకరరావు, అధ్యక్షుడిగా మురళీ కృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా డాక్టర్ కోపల్లి హనుమంతరావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య, మన్నెం లక్ష్మీనాథరెడ్డి, ఇనుగంటి వెంకట రోహిత్, జనరల్ సెక్రటరీగా వంకేశ్వరం ఆదినారాయణ, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాసరావు, కోశాధికారిగా కౌతా సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పైడా ప్రసాద్ ఎన్నికయ్యారని జనరల్ సెక్రటరీ ఆదినారాయణరావు తెలిపారు. 1.10 లక్షల మందికి రుణాలివ్వాలి గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు 1.10లక్షల మంది లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీఎం సూర్యఘర్ రుణాల మంజూరుపై బ్యాంకర్లు, వెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు రుణాల మంజూరు చేయడంలో వెండర్స్ బ్యాంకర్స్ మధ్య సమన్వయం అవసరం అన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీరిలో 1.10వేల మంది లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించామన్నారు. ఇప్పటి వరకు 787మంది లబ్ధిదారులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. 651 మంది లబ్ధిదారుల వాటా కింద 10 శాతం మొత్తాన్ని చెల్లించారన్నారు. సమావేశంలో ఎల్డీఎం కె. ప్రియాంక, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, కేడీసీసీ బ్యాంక్ ఏజీఎం వాసవి కుమారి, వివిధ బ్యాంకుల అధికారులు, వెండార్స్ పాల్గొన్నారు. -
మట్టినీ మేస్తున్నారు!
అమరావతికి తరలింపు పేరుతో దోపిడీకి స్కెచ్సాక్షి, ప్రతినిధి, విజయవాడ: అక్రమ మట్టి దందాకు తెలుగు తమ్ముళ్లు భారీ స్కెచ్ వేశారు. రాజధానికి మట్టి తరలింపు పేరుతో అక్రమంగా మట్టి దోపిడీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా విజయవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కాంట్రాక్టు సంస్థల పేరుతో తెలుగు తమ్ముళ్లు పాగా వేసి వెలగలేరులో 5 ఎకరాలు, కేవలం మట్టి తవ్వుకొనేందుకు ఎకరాకు రూ.14 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. కొత్తూరులో ఎకరం రూ.47.5 లక్షల వంతున 6 ఎకరాలు మట్టితో పాటు పొలాన్ని సైతం కొనుగోలు చేశారు. తాడేపల్లిలో ఎకరం రూ. 41 లక్షల వంతున 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అడ్వాన్స్‌లు సైతం చెల్లించారు. ఇంకా ఆయా గ్రామాల్లో భూముల్లో మట్టి తవ్వకాలకు అనువుగా ఉండే భూముల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఈ స్కెచ్ అంతా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, గ్రామ స్థాయి నాయకులకు సైతం మట్టి దందాలో వాటా ఇచ్చేలా ప్రణాళిక రచించినట్లు సమాచారం. నామమాత్రంగా అనుమతులు తీసుకొని, వారు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు మైనింగ్ అధికారులు సైతం పూర్తిగా సహకరించి, తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు రెడీ చేస్తున్నారు. ప్రభుత్వానికి టోకరా.. ప్రభుత్వానికి సీనరేజ్ చార్జీలు ఎగవేయడంతో పాటు, పొలంలో 20 అడుగుల మేర తవ్వకాలు చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తు న్నారు. ఇప్పటికే రోడ్డు పనుల పేరుతో ప్రముఖ కాంట్రాక్టు సంస్థలు విజయవాడ రూరల్ మండలంలో పరిధికి మించి 20–30 అడుగుల లోతు మేర తవ్వాయి. ముడుపులు తీసుకొని మైనింగ్ అధికారులు ఈ దందాకు పూర్తిగా సహకరిస్తున్నారు. వీరు తనిఖీలకు వెళ్లే సమయంలో మట్టి మాఫియాకు ఓ గ్రూపు ఏర్పాటు చేసి, ముందే సమాచారం ఇస్తున్నారు. విషయం ముందే తెలుస్తుండటంతో మట్టి మాఫియా ఆ సమయంలో తవ్వకాలు జరపకుండా వాహనాలను పక్కన పెట్టేస్తోంది. వీరి తనిఖీల సమయంలో రోటీన్‌గా మట్టి తవ్వే దొంగలు కాకుండా అమాయకులు పట్టు బడితే తూతూ మంత్రంగా వారి వాహనాలను ఆపేసి, నామ మాత్రంగా జరిమానాలు విధించి మమ అంటున్నారు. పొలవరం వద్ద ఫిర్యాదులు చేసినా ఆగదే.. పోలవరం కట్ట మట్టిని తెలుగు తమ్ముళ్లు అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. ఈ నెల మొదటి వారంలో మట్టి అక్రమ రవాణా చేస్తుంటే చుట్టు పక్కల గ్రామస్తులు నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మూడు లారీలు, ఓ పొక్ల్లెయిన్ నీటి పారుదల శాఖ అధికారులకు పట్టుబడినా.. ఆ వాహనాలను సీజ్ చేయకుండా వదిలేశారు. మూడు రోజుల పాటు జేసీ ఆ ప్రాంతంలో ఉన్నా.. వాహనాలను వదిలేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని ఆ గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీని వెనుక గొల్లపూడికి చెందిన టీడీపీ నేత హస్తం ఉండటంతో నీటి పారుదల శాఖ అధికారులు వదిలేసినట్లు సమాచారం. కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, నైనవరం, పాతపాడు గ్రామాల పరిధిలోని పోలవరం కాలువ మట్టి తవ్వకాలను అరికట్టాలని కోరుతూ మొండెం జమలయ్య ఇటీవల కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. దీనికి సమాధానంగా నీటి పారుదల శాఖ అధికారులు పోలవరం కట్టపై క్షేత్ర స్థాయిలో తనిఖీకి సిబ్బంది లేకపోయినా.. ఉన్న వారితో తనిఖీలు నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ అప్పుడప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా మట్టి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొనడం చూస్తే, అక్కడ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సిబ్బంది చేరుకొనే సమయానికి కొంత మంది పారిపోతున్నారని, దొరికిన వారిపైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లిలో పొలాలను కొంటున్న టీడీపీ నేతలు నామమాత్రపు అనుమతులతో భారీగా తవ్వకాలకు రంగం సిద్ధం ప్రజాప్రతినిధులకు వాటాలు ఇచ్చేలా ఒప్పందం పోలవరం మట్టిని తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు వాహనాలు పట్టుబడినా వదిలేస్తున్న వైనం రోడ్డు పనుల పేరుతో అనుమతులు తీసుకొని ఇష్టారాజ్యంగా తవ్వకాలు -
No Headline
●కోనేరుసెంటర్: పోలీసు కో–ఆపరేటివ్ సొసైటీ ద్వారా పోలీసు కుటుంబా లకు భరోసా కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. కృష్ణాజిల్లా పోలీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుంచి రుణం తీసుకుని ఈ నెల 8వ తేదీన అనారోగ్యంతో మరణించిన స్వీపర్ ఆర్.మరియమ్మ సొసైటీకి చెల్లించాల్సిన రూ.1,36,226 నగదు ను ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా రద్దు చేసిన పత్రాలను జిల్లా ఎస్పీ సోమవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సిబ్బంది కుటుంబాల సాధకబాధలను అర్ధం చేసు కుని రుణాలు పొందిన సిబ్బందితో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయిస్తున్నట్లు చెప్పా రు. కో– ఆపరేటివ్ సొసైటీ మేనేజర్ కేఎస్సార్ మూర్తి తది తరులు పాల్గొన్నారు. -
పేదల గూడుపై కూటమి నేతల కన్ను
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ నాలుగు దశాబ్దాల క్రితం పేదలకు కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్లు వేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అప్పట్లో అజిత్‌సింగ్‌నగర్, కుందావారి కండ్రిక, పాయకాపురం ప్రాంతాల్లో బీ ఫారం పట్టాలు అందించింది. ఇటీవల ఆయా ప్రాంతాల్లోని ఇళ్ల పట్టాలను శాశ్వత రిజిస్ట్రేషన్ చేయటానికి వీఎంసీ చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియతో కూటమి నాయకులు పేదల గూడుపై గద్దల్లా వాలిపోయారు. రిజిస్ట్రేషన్ పేరుచెప్పి పేదల నుంచి రూ.లక్షల్లో సొమ్ములు వసూలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు తమను వ్యతిరేకించే వారికి రిజిస్ట్రేషన్లు ఆపాలని, అందుకు కొర్రీలు వేయాలని అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఇప్పటికీ సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. దీనిపై వీఎంసీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు వాపోతున్నారు. గద్దల్లా వాలిన కూటమి నేతలు వీఎంసీ అందించిన స్థలాల్లో 10 ఏళ్లకు పైగా నివాసం ఉన్న పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ఇటీవల వీఎంసీ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతోంది. ఇందుకు నామమాత్రంగా గజానికి రూ.100 చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించటంతో కూటమి నేతలు గద్దల్లా వాలిపోయారు. ప్రభుత్వం తమదేనని, తాము రిజిస్ట్రేషన్ చేయిస్తామని అమాయక ప్రజల నుంచి ఏరియాను బట్టి ఒక్కో ఎసెస్మెంట్కు రూ.10 వేల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఓ మాజీ కార్పొరేటర్ ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నారు. వీఎంసీలో ప్రతిరోజూ ఆయనే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉంటుండటం విమర్శలకు తావిస్తోంది. తాము చెప్పిన వారికే రిజిస్ట్రేషన్ చేయాలని వీఎంసీలో పట్టాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గతవారం ఒక్కరోజే 40 రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకురాగా, రిజిస్ట్రేషన్‌కు వచ్చిన మిగిలిన వారంతా కొద్దిసేపు ఆందోళన చేయటంతో ఆ పెద్దమనిషి చేసేదిలేక అక్కడనుంచి వెళ్లిపోయాడు. అధికారులపై ఒత్తిడి ప్రస్తుతం ఐదవ ఫేజ్‌లో 1170 ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇందుకోసం న్యూ ఆర్ఆర్ పేట, పాయకాపురంలలో కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు సుమారు 500కు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. వీఎంసీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వ్యవహారమంతా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సచివాలయాల నుంచి ప్లానింగ్ సెక్రటరీలు దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉండగా అజిత్‌సింగ్‌నగర్‌లోని పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తమ అనుమతి లేకుండా దరఖాస్తులను స్వీకరించవద్దని హుకుం జారీ చేశారు. దరఖాస్తుదారులు సదరు కూటమి నాయకులను సంప్రదించగా ఒక్కో రిజిస్ట్రేషన్‌కు లక్షల్లో డిమాండ్ చేస్తున్నారని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు కంటే టీడీపీ నాయకుల ఫీజు అధికంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. నాయకులు అడిగిన సొమ్ము చెల్లించకపోతే వారి దరఖాస్తులు కూడా స్వీకరించటం లేదని ఆరోపిస్తున్నారు. బ్యాంకుల్లో తనఖాలు ఉన్నా... అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, రాజరాజేశ్వరిపేటల్లో వీఎంసీ ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న నివాసులు వారి కుటుంబ అవసరాలకు నగరంలోని పలు కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో తనఖా పెట్టుకున్నారు. అయితే తనఖా పెట్టుకున్న వారి వివరాలు సేకరించుకున్న కూటమి నేతలు ఇటీవల వచ్చిన వరదల్లో వారి ఇళ్లపట్టాలు పోయాయని, వారందరికీ వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది ఇళ్లు అమ్ముకుని ఇతర ప్రాంతాలకు వెళ్లినవి, ప్రైవేటు వ్యక్తుల వద్ద తనఖాల్లో ఉన్నవాటిని విడుదల చేస్తాం, తమకు రూ.5–10 లక్షలకు విక్రయించాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. స్థలాలు, ఇళ్లు కూటమి నాయకులకు విక్రయించటానికి సుముఖత లేని వారి రిజిస్ట్రేషన్లను సచివాలయం వద్దే నిలుపుదల చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 40 ఏళ్ల క్రితం పేదలకు పంపిణీ చేసిన భూముల రిజిస్ట్రేషన్ కార్పొరేషన్ బీ–ఫారం పట్టాల రిజిస్ట్రేషన్లపై కూటమి నాయకుల కుతంత్రాలు తాము పంపకుండా సచివాలయాల్లో అప్లికేషన్ తీసుకోవద్దని కూటమి నాయకుల హుకుం బ్యాంకుల్లో తనఖా పెట్టినవి సైతం తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులపై కూటమి నాయకుల ఒత్తిడి -
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరణ
మోపిదేవి: మోపిదేవిలో ఓ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే అపహరించారు. సేకరించిన వివరాల మేరకు సోమవారం ఉదయం గ్రామంలో ఒంటరిగా ఉంటున్న మోపిదేవి జగన్ మోహనరావు(లేటు) భార్య నాగలక్ష్మి అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి విద్యుత్ పోల్‌పై పని చేస్తున్నట్లు చెప్పి ఆమె ఇంటి బయట సప్టాపై కొద్ది సేపు కూర్చున్నాడు. మధ్యాహ్న సమయంలో మరోసారి ఇంటికి వచ్చి మీ మీటర్ చెక్ చేయాలని చెప్పి ఇంట్లోకి వచ్చినట్లు ఆమె తెలిపింది. మెడలోని బంగారు గొలుసు లాగడంతో కేకలు వేసి చేతితో గట్టిగా పట్టుకున్నానని, తనను బలంగా నెట్టడంతో కిందపడిపోయానన్నారు. చేతిలో ఉన్న కొద్దిపాటి గొలుసు మాత్రమే ఉందని, మిగిలిన గొలుసుతో పరారయ్యాడని తెలిపారు. బయటకు పోయి తలుపు గడియ పెట్టడంతో తన కేకలకు చుట్టుపక్కలవారు వచ్చి తలుపులు తీసే లోపు ద్విచక్రవాహనంపై పరారైనట్లు తెలిపింది. వేరే ఊరులో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై పోలీసులను అడగ్గా తమ దృష్టికి రాలేదని సమాధానం చెప్పారు. జాతీయ స్థాయి పోటీల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల విజయం గుడ్లవల్లేరు: జాతీయ స్థాయి పోటీల్లో గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థులు విజయం సాధించారు. ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ సోమవారం విలేకరులకు తెలిపారు. తేలప్రోలు ఉషారామ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వారు ఈ నెల 24, 25వ తేదీల్లో డిప్లొమా విద్యార్థులకు జాతీయ స్థాయి యువర్ ఫెస్ట్ – 2025ను నిర్వహించారన్నారు. టెక్నికల్, కల్చరల్ పోటీల్లో తమ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ బహుమతులను కై వసం చేసుకున్నారని చెప్పారు. -
వీఓఏల వేతన బకాయిలు చెల్లించాలి
ఏపీ వెలుగు వీఓఏ ఉద్యోగుల సంఘం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వీఓఏ(యానిమేటర్లు)లకు ఆరు నెలల బకాయి వేతనాలు విడుదల చేయాలని వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం వారు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వీఓఏ సంఘం గౌరవాధ్యక్షురాలు కమల మాట్లాడుతూ కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నాయకులు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఆ సర్క్యులర్ రద్దు చేయలేదన్నారు. ఆరు నెలల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ ఉమాదేవి మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సర్క్యులర్‌ను రద్దు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తొలగించిన వీఓఏలను విధుల్లోకి తీసుకోవాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ అక్రమ వేధింపులు ఆపాలన్నారు. లేని పక్షంలో విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీఓఏ యూనియన్ జిల్లా నాయకులు, టి.విజయలక్ష్మి, వి.సౌజన్యకుమారి, బి.ప్రగతి, స్వాతి, టి.అనిత, వెంకట్రావు, పి.వెంకటేష్, కుమారిబాయి తదితరులు పాల్గొన్నారు. -
పంటకాల్వలో పడి యువకుడి దుర్మరణం
తిరువూరు: గంపలగూడెం మండలం పెనుగొలనుకు చెందిన తోట వెంకటేశ్వరరావు(25) సోమవారం ఉదయం పంటకాల్వలో పడి మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రంలోని వైరా మండలం గొండ్లపాలెం గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి పంటకాలువలో పడిపోగా వెంకటేశ్వరరావు నీటమునిగి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు మరో ద్విచక్రవాహనంపై కలిసి వెళ్లినట్లు తెలిపారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అవివాహితుడు. ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి పోలంపల్లి(వత్సవాయి): ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పోలంపల్లికి చెందిన ట్రాక్టర్లో పెంట్యాలవారిగూడెం చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలంపల్లి శివారు వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న పి.ఉపేంద్ర(25)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉపేంద్ర మృతి చెందాడు. ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కమర్షియల్ వెహికల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కమర్షియల్ వెహికల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక సోమవారం ఏకగ్రీవం అయ్యింది. రామకృష్ణాపురంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా కమర్షియల్ వెహికల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడిగా దెందుకూరి సత్యనారాయణరాజు, సెక్రటరీగా డి.భాస్కర్ రాజు, కోశాధికారిగా డి.సూర్యనారాయణరాజు గౌరవ అధ్యక్షుడుగా పెనుమత్స అప్పలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులతో గౌరవ అధ్యక్షుడు అప్పలరాజు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ నేతలు, సభ్యులు, స్థానిక పెద్దలు పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. -
సెపక్ తక్రా జాతీయ టోర్నీ విజేత ఆంధ్ర
విజయవాడస్పోర్ట్స్: సెపక్తక్రా జాతీయ పోటీల విన్నర్ ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ కై వసం చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమట జెడ్పీ స్కూల్లో నాలుగు రోజుల పాటు హోరాహోరీగా జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) అండర్–14 బాల, బాలికల పోటీలు సోమవారం ముగిశాయి. పోటీల ప్రారంభం నుంచి ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు అజేయంగా పోరాడింది. లీగ్ పోటీల్లో విద్యాభారత్, బిహార్ జట్లను ఓడించి అత్యధికంగా ఎనిమిది పాయింట్లతో క్వార్టర్స్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్‌లో తెలంగాణ జట్టను, సెమీ ఫైనల్స్‌లో ఢిల్లీ జట్టును ఓడించి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. సోమవారం ఉదయం జరిగిన ఫైనల్స్‌లో మణిపూర్‌తో రాష్ట్ర జట్టు హోరాహోరీగా తలపడింది. రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠ రేపింది. 15 నిమిషాల పాటు సాగిన తొలి సెట్లో ఆంధ్ర 15, మణిపూర్ 13 పాయింట్లు సాధించాయి. రెండో సెట్లో మొదటి ఐదు పాయింట్లను ఆంధ్రా సాధించగా ఆ తరువాత మూడు పాయింట్లు మణిపూర్ నమోదు చేసింది. అక్కడ నుంచి స్కోర్ ఒక్కో పాయింట్ తేడాతోనే ముందుకు సాగింది. నిర్ణీత 15 పాయింట్లకు గానూ ఇరు జట్లు చెరో 14 పాయింట్లు సాధించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో రిఫరీ ఇరు జట్లకు గోల్డెన్ పాయింట్ల(17)కు అవకాశం ఇచ్చారు. ఈ తరుణంలోనూ ఇరు జట్లు మళ్లీ చెరో 15 పాయింట్లు సాధించాయి. 16, 17 పాయింట్లు ఆంధ్రా జట్టు సాధించి ఉత్కంఠకు తెరదింపింది. ఆంధ్రా జట్టులో వి.కావ్య (కెప్టెన్), ఎండీ రెహమూమ, కె.లావణ్య బరిలో దిగగా, ఎన్.కవిత, ఎం.భానుప్రియ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లుగా ఉన్నారు. కెప్టెన్ కావ్య స్ట్రైకర్‌గా రాణించగా, రెహమూమ కిల్లర్ ప్లేతో, లావణ్య ఫీడర్ ప్లేతో అదరగొట్టారు. మొదటి రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించిన ఆంధ్రా క్రీడాకారులు, జాతీయ విజేతగా పేరొందిన మణిపూర్‌ను రెండో స్థానానికి నెట్టారు. మణిపూర్ జట్టులోనూ లీన్గక్పిఛాను (కెప్టెన్), అజోక, సిల్కి ఆటతీరు అబ్బురపరిచింది. నిలకడైన ఆటతీరుతో క్రీడాభిమానుల మన్ననలు అందుకుంది. విజేతలకు ట్రోఫీలు అందజేసే నిమిత్తం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైతం మణిపూర్ క్రీడాకారుల ఆట తీరుకు మెచ్చి తన సొంత నిధులు రూ.10 వేలను ప్రత్యేక బహుమతిగా అందజేశారు. ఆంధ్రా జట్టు కెప్టెన్ కావ్యకు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తన వ్యక్తిగత నిధులు రూ.15 వేలు అందజేశారు. బాలికల విభాగంలో మణిపూర్ రన్నర్ ట్రోఫీని అందుకోగా మూడో స్థానం బిహార్‌కు లభించింది. బాలుర విన్నర్ మణిపూర్ బాలుర విభాగంలో మణిపూర్ 15–2, 15–5 తేడాతో బిహార్‌ను ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకుంది. రన్నర్ ట్రోఫీని బిహార్ సాధించింది. మూడో స్థానం కోసం ఢిల్లీ, గుజరాత్ తలపడ్డాయి. ఈ పోటీల్లో ఢిల్లీ 15–9,15–10 తేడాతో గెలిచి మూడో స్థానం బహుమతిని అందుకుంది. ఎస్జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు, సహాయకార్యదర్శులు కె.వి.రాధాకృష్ణ, ఏ.పి.రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలకు కార్యనిర్వహణ కార్యదర్శిగా కె.రమేష్ వ్యవహరించారు. మొత్తం 12 రాష్ట్రాల జట్లు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించాయి. పోటీల నిమిత్తం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 100 మంది పీఈటీలు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా పని చేశారు. బాలికల రన్నర్‌గా మణిపూర్ బాలుర విభాగం విన్నర్ మణిపూర్, రన్నర్ బిహార్ -
హైవే బస్టాండ్‌ను ఉపయోగంలోకి తేవాలి
జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేట జాతీయ రహదారిపై నిర్మించిన హైవే బస్టాండ్‌ను వెంటనే వాడుకలోకి తీసుకురావాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. పట్టణం సమీపంలోని ఆటోనగర్‌లో హైవేకు ఆనుకుని నూతనంగా నిర్మించిన ఆర్టీసీ హైవే బస్టాండ్ వద్ద సోమవారం తమ పార్టీ నాయకులతో కలిసి తన్నీరు నాగేశ్వరరావు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరుగు పొరుగున ఉన్న కోదాడ, నందిగామ పట్టణాల వలే జగ్గయ్యపేట పట్టణం కూడా జాతీయ రహదారి వరకు విస్తరించాలనే పట్టణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.1.20 కోట్ల నిధులతో 65 వ జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ హైవే బస్టాండ్ నిర్మాణం చేసిందన్నారు. అప్పటి ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రారంభోత్సవం కూడా చేశారన్నారు. హైవే మీద బస్టాండ్ ఉంటే హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు వెళ్లాలంటే అన్ని వేళలా ప్రయాణించే సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న జగ్గయ్యపేట ప్రాంత వాసుల ఆశ నెరవేరిందని సంతోషించామన్నారు. బస్టాండ్‌ను ప్రారంభించి ఏడాది కావస్తోందని, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా నేటి వరకు స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) గానీ, అధికారులు గానీ దీనిని వాడుకలోకి తీసుకురాకపోవడం శోచనీయమన్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి
ధర్నా చౌక్‌లో డీవైఎఫ్ఐ ధర్నా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో సోమవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాలో పాల్గొన్న డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తుచేశారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేని కారణంగా అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని అనేక పోరాటాలు చేసి రెండేళ్ల వయోపరిమితి పెంపు సాధించుకున్నామన్నారు. 2023 జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 4,59,182 మంది హాజరయ్యారని, వారిలో 95,208 మంది అర్హత సాధించారన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, కోర్టు కేసుల ఫలితంగా తదుపరి ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ ఈవెంట్స్ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు వయో పరిమితి మించిపోయిందని చెప్పడం అన్యాయమన్నారు. పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు సకాలంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించకుండా తాత్సారం చేసి అభ్యర్థులను బలిచేయడం సరికాదన్నారు. జాప్యానికి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హోంగార్డు రిజర్వేషన్లు తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము మాట్లాడుతూ గడచిన రెండేళ్లుగా అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ కోసం ఎదురుచూశారని, తీరా టెస్ట్‌కు వెళ్లిన అభ్యర్థులను వయోపరిమితి దాటి పోయిందని తిప్పి పంపడం అన్యాయమని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఫిజికల్ టెస్ట్‌కు అనుమతించి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. 1600 మీటర్ల పరుగులో ముగ్గురు చనిపోయారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.కృష్ణ, ఎన్.నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు సురేష్, అభ్యర్థులు రాజ్‌కుమార్, రాజీవ్, అనిత, మల్లి తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాu8లో సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం తెలిపారు. దుర్గమ్మ సేవలో.. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను గవర్నర్ కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 7 -
3న ఇంద్రకీలాద్రిపై శ్రీపంచమి వేడుకలు
సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): క్రోధి నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి(శ్రీపంచమి)ని పురస్కరించుకుని ిఫిబ్రవరి 3న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు, సరస్వతి యాగాన్ని నిర్వహించేందుకు వైదిక కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవారి మూలవిరాట్‌ను సరస్వతీదేవిగా అలంకరించడంతో పాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. రానున్న వార్షిక పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, పోటీ పరీక్షలలో మంచి ర్యాంక్ సాధించేలా విద్యార్థులను ఆలయ అర్చకులు ఆశీర్వదిస్తూ అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించిన పెన్ను, కంకణంతో పాటు చిన్న సైజు ఫొటో, కుంకుమ ప్రసాదాలను పంపిణీ చేస్తారు. దేవస్థాన యాగశాలలో సరస్వతి యాగాన్ని నిర్వహించేలా వైదిక కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానాలయం వద్ద ముఖ మండప దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే విద్యార్థులు తప్పని సరిగా యూనిఫాం, స్కూల్, కాలేజీ గుర్తింపు కార్డును ధరించిన వారికి మాత్రమే పెన్నులను అందజేస్తారు. ఈ నెల 30 నుంచి మాఘ మాసోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు దుర్గమ్మ సన్నిధిలో మాఘ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. మాఘమాసంలో ఆదివారం, ఏకాదశి, దశమి వంటి విశేష పర్వదినాల్లో సూర్యోపాసన సేవ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
దొడ్డిదారిన నల్ల చట్టాలు తెస్తున్న కేంద్రం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు, కార్మికులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి ఏలూరు లాకుల మీదుగా అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ధర్నా చౌక్‌లో జరిగిన సభలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించలేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆనాడు రైతు ఉద్యమానికి తలవంచిన ప్రభుత్వం నల్లచట్టాలు విరమించుకున్నట్లు ప్రకటించిందని, తిరిగి దొడ్డిదారిన అవే నల్లచట్టాలను అమలు చేస్తోందని విమర్శించారు. నూతన మార్కెట్ విధానం, సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం వంటివి పూర్తిగా కార్పొరేట్లకు అనుకూల చట్టాలని పేర్కొన్నారు. ఏ లక్ష్యాలు, ఉద్దేశంతో సహకార సంఘాలు ఏర్పాటయ్యాయో ఆ లక్ష్యం నెరవేరకపోగా అసలుకే ఎసరు పెట్టే చట్టాలను తీసుకొచ్చిందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రం నాలుగు లేబర్ కోడ్స్ అమలుకు పూనుకుందని, 29 కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. పనిగంటలు, పని దినాలు పెంచి కార్మికుల శ్రమను, ధనాన్ని దోచుకునే పన్నాగాలు పన్నిందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. రవీంద్ర, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి, ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.యలమందరావు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఎం.వెంకటసుబ్బయ్య, సీఐటీయూ, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు -
త్రివర్ణ స్ఫూర్తి..
భారతదేశ సమున్నత కీర్తిని, త్రివర్ణ జెండా స్ఫూర్తిని చాటేలా 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ.. స్వేచ్ఛా భారతంలో ఉన్నతంగా జీవించేందుకు హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న శకటాలు నగర వీధుల్లో ప్రజల సందర్శనార్థం తిరిగాయి. జిల్లా స్థాయి కార్యక్రమం సిటీ ఆర్మ్డ్ గ్రౌండ్లో జరిగింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ విజయవాడస్పోర్ట్స్: స్వర్ణాంధ్ర, విజన్–2047 ఆశయాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో జిల్లా ప్రగతికి ఐక్యతతో పాటుపడదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడలోని సిటీ ఆర్మ్డ్ పోలీస్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన 76వ భారత గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పది సూత్రాల వృద్ధి సోపానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్‌లోని లక్ష్యాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం–మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ తాగునీరు, భద్రత, రైతు–వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి–ఇంధనాల వ్యయ నియంత్రణ, ఇలా అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన సాధించాలన్నారు. సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, సమగ్ర సాంకేతికత మార్గదర్శక సూత్రాల స్ఫూర్తిగా పనిచేయాలని అధికారులకు సూచించారు. 522 మందికి ప్రశంసా పత్రాలు.. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 522 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేశారు. వ్యక్తిగతంగా, బృందంగా సామాజిక సేవలో భాగస్వాములైన వారికి అభినందనలు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, మునిసిపల్, వ్యవసాయం, పంచాయతీరాజ్, పరిశ్రమల ఉద్యోగులకు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ ప్రశంస పత్రాలను అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్డీవో కె.మాధురి, డీసీపీ కె.ఎం.మహేశ్వరరాజు, ఏడీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ డి.ప్రసాద్ పాల్గొన్నారు. వారి త్యాగాలే స్ఫూర్తికావాలి..గుణదల(విజయవాడ తూర్పు): స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతరం దేశ భవిష్యత్‌కు బాటలు వేయాలని జెసిస్ ఇండియా అంతర్జాతీయ సమన్వయకర్త ఎన్. హర్షవర్థన్ రెడ్డి అన్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా 76 మీటర్ల జాతీయ పతాకంతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. రామవరప్పాడు రింగ్ వద్ద నుంచి సిద్ధార్థ మెడికల్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని 76 మీటర్ల అతి పెద్ద జాతీయ జెండాను రూపొందించి ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. ఆ త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెసిస్ జోన్ 26 అధ్యక్షుడు టి. భరత్ కుమార్, జోన్ డైరెక్టర్ లక్కం రవీంద్రరెడ్డి, కె. గణేష్ బాబు, కందుల రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాడవాడలా ఉప్పొంగిన జాతీయతా భావం ఘనంగా గణతంత్ర దినోత్సవం సిటీ ఆర్మ్డ్ పోలీస్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీశ హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు -
కలెక్టరేట్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో 76వ భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి పథాన రైలు
● విజయవాడ డివిజన్ గణతంత్ర వేడుకలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో 76వ గణతంత్ర వేడుకలు రైల్వే స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ డీఎస్సీ (డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్) వల్లేశ్వరతో కలసి ఆర్పీఎఫ్ బలగాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఆర్ఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్ సాధించిన పురోగతిని వివరించారు. రికార్డు స్థాయిలో ప్రయాణికులు.. సరుకు రవాణాలో రూ.3,155 కోట్ల ఆదాయంతో డివిజన్ అత్యుత్తమ పనితీరు నమోదు చేసిందన్నారు. ప్రయాణికులు రికార్డు స్థాయిలో 49.43 మిలియన్ల మంది ప్రయాణించారని, తద్వారా రూ. 1035.21 కోట్ల ఆదాయం అందుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ బలగాలు ప్రదర్శించిన ఆయుధ, బైక్ విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో.. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాక్ అండ్ జిల్ స్కూల్, ఈ–వరల్డ్ సెంటర్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వర్షా పాటిల్ డీఆర్ఎంతో కలసి ఈ–వరల్డ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం రైల్వే హాస్పిటల్లో రోగులకు సందర్శించి పండ్లు, హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. -
కార్తికేయుని సన్నిధిలో కోలాహలం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో తెల్లవారు జాము నుంచే క్యూలైనులో భక్తులు నిరీక్షించారు. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 108లో ఉద్యోగాలకు దరఖాస్తులు గుడివాడ టౌన్: 108 వాహనంలో ఖాళీగా ఉన్న పైలెట్(డ్రైవర్), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) పోస్టులకు ఈనెల 28న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మేనేజర్ హరీష్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, బయో టెక్నాలజీ, బీఎస్సీ లైఫ్ నర్సింగ్, బీ ఫార్మసీ కోర్సులు పూర్తి చేసినవారు ఈఎంటీ పోస్తులకు అర్హులన్నారు. డ్రైవర్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి హెవీ లైసెన్స్ కలిగి 35 ఏళ్ల లోపు వయస్సుగల వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు 7901240703, 8919197050ను సంప్రదించాలని కోరారు. ఏకగ్రీవంగా ఎన్నిక మధురానగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ప్రైవేటు మెడికల్ ల్యాబొరేటరీస్ అండ్ రేడియోలాజికల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవం అయ్యింది. విజయవాడ గాయత్రి కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీఎన్డీఎస్ఎస్ మూర్తి (విజయవాడ), కార్యదర్శిగా కేవీ శ్రీకిరణ్ (రాజమండ్రి), ప్రధాన కార్యదర్శిగా పీఎం శర్మ (కృష్ణాజిల్లా), ఉపాధ్యక్షుడిగా ఎంవీ నవీన్‌కుమార్ (అనంతపురం), కోశాధికారిగా టీఎల్ నారాయణ(పాలకొల్లు), ఆర్గనైజింగ్ సెక్రటరీ అడ్మిన్‌గా టి. శ్రీహరిబాబు(గుంటూరు), ఆర్గనైజింగ్ సెక్రటరీ రెవెన్యూగా విల్సన్ (అనంతపురం)తో పాటు ప్రతి జిల్లా నుంచి ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌ను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులతో నవీన్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటామని, నూతన పరిజ్ఞానాన్ని టెక్నీషియన్స్‌కు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఏపీ ఆర్బీకే బీజెడ్సీ కార్యవర్గం.. కంకిపాడు: ఏపీ ఆర్బీకే బీజెడ్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక పట్టణంలో ఆదివారం జరిగింది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బచ్చులకూరి రాంబాబు, కార్యవర్గ ప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వీఏఏ అధ్యక్షుడిగా యార్లగడ్డ రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కంకిపాటి సురేష్, ఉపాధ్యక్షుడిగా జుజ్జవరపు నృపేన్చక్రవర్తి, మహిళా కార్యదర్శిగా ఎస్.విజయలక్ష్మి, కోశాధికారిగా పూర్ణ, కార్యవర్గ సభ్యులుగా ఉప్పు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నంబూరులో హాల్టింగ్ రైల్వేస్టేషన్(విజయవాడసెంట్రల్): గుంటూరులోని కాజాలో జరిగే బైబిల్ మిషన్ సదస్సుకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నంబూరు స్టేషన్లో రెండు నిమిషాల పాటు తాత్కాలిక హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నర్సాపూర్–గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17281), సికింద్రాబాద్–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (17015) ఎక్స్‌ప్రెస్ రైళ్లు నంబూరు స్టేషన్లో ఆగనున్నాయి. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ కాకినాడ టౌన్–గుంటూరు మధ్య ప్రత్యేక అన్ రిజర్వ్డ్ రైలును (ప్యాసింజర్) నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాకినాడ టౌన్–గుంటూరు ప్రత్యేక రైలు (07223) ఈ నెల 26న ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు గుంటూరు చేరు కుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (072 24) ఈ నెల 29న మధ్యాహ్నం 1.30 గంటలకు గుంటూరులో బయలుదేరి, రాత్రి 8.40 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఒక నిమిషం పాటు హాల్టింగ్ కల్పించారు. -
రసవత్తరంగా సెపక్తక్రా పోటీలు
మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం చిలకలపూడి(మచిలీపట్నం): మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను అర్పించి చేసిన కృషి, త్యాగాల ఫలితంగానే స్వాతంత్రం లభించిందన్నారు. 1950, జనవరి 26వ తేదీన గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతి పెద్ద రాజ్యాంగ దేశమని, దాని వల్లే ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు చిన్నంశెట్టి రాజు, కేవీ రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక -
గంజాయి గుట్టు రట్టుచేసిన రోడ్డు ప్రమాదం
తిరువూరు: ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం.. గంజాయి రవాణా గుట్టును రట్టు చేసింది. తిరువూరు నుంచి విజయవాడ వైపు ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వెళ్తున్నారు. వారు ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా ఢీకొట్టారు. బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గాయపడగా 108 అంబులెన్సులో తిరువూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్రమాదానికి కారకులైన యువకుల వద్ద బ్యాగులో మూడు ప్యాకెట్ల గంజాయి, కత్తి లభ్యమైంది. దీనిపై స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించగా వారు వచ్చేలోపు యువకులు పరారయ్యారు. ద్విచక్ర వాహనాన్ని, గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.