కలెక్టరేట్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో 76వ భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment