రసవత్తరంగా సెపక్‌తక్రా పోటీలు
మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం
చిలకలపూడి(మచిలీపట్నం): మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను అర్పించి చేసిన కృషి, త్యాగాల ఫలితంగానే స్వాతంత్రం లభించిందన్నారు. 1950, జనవరి 26వ తేదీన గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతి పెద్ద రాజ్యాంగ దేశమని, దాని వల్లే ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు చిన్నంశెట్టి రాజు, కేవీ రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక
Comments
Please login to add a commentAdd a comment