mulayam singh yadav
-
ఘనంగా ములాయం సింగ్ యాదవ్ జయంతి
హైదరాబాద్: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకలను సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 36లోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీ నేత దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, నీలోఫర్, నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ములాయం సింగ్ యాదవ్ ఎంతో ఖ్యాతిని గడించారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేందుకు కృషి చేస్తామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలోనే అన్ని నియోజక వర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో పార్టీ ప్రభుత్వంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరా సమితి అధ్యక్షులు మదిరె నర్సింగ్‌రావు మాదిగ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జ్ఞానవాపి, రామ జన్మభూమి వివాదాల వెనక ములాయం సింగ్ పాత్ర ఏంటి?
లక్నో: అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అయోధ్య, జ్ఞానవాపి మసీదు వివాదాల వెనక ఒక కామన్ పేరు వినిపిస్తోంది. ఆయనే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్. ఈ వివాదాల వెనక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటంటే..? కరసేవకులపై కాల్పులు.. 1990 అక్టోబర్‌లో ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కరసేవ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కరసేవకులపై ములాయం ప్రభుత్వం 28,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించింది. అయినప్పటికీ బారికేడ్లను దాటి కరసేవకులు బాబ్రీ మసీదు ప్రదేశానికి చేరుకున్నారు. మసీదుపై కాశాయ జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెలువడ్డాయి. బాబ్రి మసీదు కూల్చివేత.. అయోధ్యలో కరసేవకుల ఘటన తర్వాత 1991లో యూపీలో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. మరుసటి ఏడాది 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటన జరిగింది. ఈ పరిణామాల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న పీవీ నరసింహరావు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ములాయం మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈ పాలనా కాలంలోనే జ్ఞానవాపి సెల్లార్లో హిందువుల పూజలను ములాయం ప్రభుత్వం నిలిపివేసింది. జ్ఞానవాపిలో పూజలు నిలిపివేత.. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ (వ్యాస్జీ కా తెహ్ఖానా)లో 1993 వరకు పూజాలు జరిగాయి. సెల్లార్లో 200 ఏళ్లకు పైగా వ్యాస్ కుటుంబం పూజలు చేశారు. వారి కుటుంబ పేరుమీదుగానే ఆ సెల్లార్‌కు వ్యాస్జీ కా తెహ్ఖానా అని పేరు వచ్చింది. అయితే.. 1993 డిసెంబర్లో ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపి మసీదులో పూజలను నిలిపివేసింది. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించిందని శైలేంద్ర వ్యాస్ కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. మసీదు ప్రాంతంలో దేవాలయం.. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లు ఏఎస్ఐ సర్వే తెలిపిందని హిందూ తరుపు న్యాయవాది విష్ణశంకర్ జైన్ వెల్లడించారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం.. కాలక్రమంలో అనేక యుద్ధాలు, విధ్వంసం తర్వాత పునర్నిర్మాణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. దక్షిణాసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన పండితుడు యుగేశ్వర్ కౌశల్ ప్రకారం.. మహారాజా జయచంద్ర తన పట్టాభిషేకం తర్వాత సుమారు 1170-89 ADలో ఈ ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ శిథిలాల పైన ప్రస్తుత జ్ఞానవాపి మసీదును నిర్మించాడని విశ్వసిస్తారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం -
చివరి నిమిషంలో ప్రధాని పదవి దూరం.. ఏం జరిగింది?
అదృష్టం తలుపు తట్టినా కలిసి రాని రాజయోగం. చివరి నిమిషంలో దురదృష్టం వెక్కిరించడంతో భోగం దూరమైంది. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా అదృష్ట రేఖ మలుపు తిరిగింది. కొందరికి ఇంటి పోరుతో పదవి దూరమైతే మరికొందరికి వేరే కారణాలెన్నో.. ఇక, ఈ లిస్టులో దిగ్గజ నేతల పేర్లే ఉన్నాయి. వారిలో ముఖ్యులు ములాయం సింగ్ యాదవ్, సోనియా గాంధీ, జ్యోతి బసు, ఎల్కే అద్వానీ ఉన్నారు.. వీరికి ప్రధాని పదవి ఎలా దూరమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. -
ములాయం, కృష్ణ, కృష్ణంరాజులకు పార్లమెంట్ నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, టాలీవడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సహా తదితరులకు తొలుత లోక్‌సభ నివాళులర్పించింది. సంతాప సందేశం చదివిన తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు.. రాజ్యసభలోనూ వారికి నివాళులర్పించారు. మరోవైపు.. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారానున్నారన్నారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్ సమర్థంగా నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: జీ20 నాయకత్వం.. భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం: ప్రధాని మోదీ -
Dimple Yadav: మామ స్థానంలో బరిలో కోడలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణంతో.. ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ట్విటర్లో ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. వీటితోపాటే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఫలితాలు.. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ప్రకటిస్తారు. समाजवादी पार्टी द्वारा लोकसभा क्षेत्र मैनपुरी उपचुनाव - 2022 हेतु श्रीमती डिंपल यादव पूर्व सांसद को प्रत्याशी घोषित किया गया है। pic.twitter.com/gZIvtETfLT — Samajwadi Party (@samajwadiparty) November 10, 2022 మామ ములాయంతో డింపుల్ (పాత ఫొటో) మోదీ 2.0 వేవ్‌ను తట్టుకుని ములాయం సింగ్ యాదవ్.. బీజేపీ అభ్యర్థిపై 94వేల ఆధిక్యంతో 2019 ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి నెగ్గారు. అయితే 2014లో ములాయం ఏకంగా మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గడం గమనార్హం. దీంతో మెయిన్‌పురి ఆయన ఇలాకాగా పేరు దక్కించుకుంది. భర్త అఖిలేష్‌తో డింపుల్ మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్(44).. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె. -
ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. యూపీ, ఒడిశా, రాజస్తాన్, బిహార్, ఛత్తీస్‌ఘడ్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ములాయం సింగ్ మరణంతో మెయిన్‌పురీ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 10 నుంచి 17వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించి, 8న కౌంటింగ్ ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి: (117 ఏళ్ల దేశ తొలి ఓటరు ఇక లేరు.. బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 3 రోజులకే..) -
ములాయం ప్రాభవం కొనసాగేనా?
యాదవుల పార్టీగా మొదలైన సమాజ్ వాదీని మొత్తం ఓబీసీల బలానికి సంకేతంగా ములాయం సింగ్ యాదవ్ మార్చివేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని సవాలు చేయగలిగిన ఏకైక పార్టీగా సమాజ్ వాదీ రంగం మీద ఉందంటే దానికి దశాబ్దాలపాటు ములాయం సిద్ధపర్చిన పునాదే కారణం. మూలాలను అంటిపెట్టుకోవడం, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు నెరపడం, తనకు మద్దతు పలికిన వారికి సహాయం చేయడంలో ములాయం చూపించిన శ్రద్ధ దీనికి కారణం. ములాయం అనంతర సమాజ్ వాదీలో ఈ గుణాలు కొరవడుతున్నందున యాదవులు వేరే రాజకీయ వేదికలను వెతుక్కునే వీలు ఏర్పడుతోంది. అదే జరిగితే సమాజ్‌వాదీ పార్టీపై ములాయం ప్రభావం, ప్రాభవం ముగిసిపోతాయి. భారతదేశంలో 1970ల అనంతరం సోషలిస్టు ఉద్యమానికి సంబంధించి అత్యంత సుపరిచితుడైన నేత ములాయం సింగ్ యాదవ్. ఆయన అస్తమ యంతో భారత రాజకీయాల్లో ఒక గొప్ప శకం ముగిసిపోయింది. ములాయం 1950లలో స్కూల్ టీచర్‌గా పని చేశారు. 1967లో తొలుత ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ తన అగ్రకుల (ప్రధానంగా బ్రాహ్మణుల) పునాదితో ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న కాలం. 1974లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ ప్రధాన ప్రతిరూపంగా ములాయం ఆవిర్భవిం చారు. కాలం గడిచేకొద్దీ యాదవ కుల నేతగా, దాని పొడిగింపుగా వెనుకబడిన కులాల నేతగా ములాయం తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో, తక్కిన దేశంలో కూడా చాలా విషయా లకు ఆయన గుర్తుండిపోతారు. కానీ ఆయన ప్రధాన విజయం, యూపీ రాజకీయాల్లో యాదవ ఆధిపత్యాన్ని సంఘటిత పర్చడమే. కాంగ్రెస్ పార్టీకి ఇది తెలిసి ఉండదని చెప్పలేము. ఎందుకంటే అత్యంత ఆధిపత్యం, దూకుడుతనం, రాజకీయ జాగరూకతతో కూడిన యాదవ కుల ప్రాధాన్యతను ఆ పార్టీ గుర్తించింది. అనేకమంది నాయకుల పూర్వ వైభవం దీనికి సాక్షీభూతంగా నిలుస్తుంది. వీరిలో మొదటివారు చంద్రజిత్ యాదవ్. ఈయన 1967లో, 1971లో లోక్‌సభలో అజాంగఢ్ ఎంపీగా వ్యవహరించారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ తన ప్రాధాన్యతను నిరూపించుకోవడానికి గట్టిగా ప్రయత్నించిన మరొక యాదవ నేత బలరాం సింగ్ యాదవ్. ఎమ్మెల్యేగా, యూపీ మంత్రిగా, ఎంపీగా, ఏఐసీసీ సభ్యుడిగా, కేంద్ర ఉక్కు, గనుల శాఖా మంత్రిగా చాలాకాలం ఈయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. కాంగ్రెస్‌తో 38 సంవత్సరాల అనుబంధం తెగదెంపులు చేసుకుని 1997లో పార్టీని వదిలిపెట్టేశారు. ములాయంకు అపరిమితా నందం కలిగిస్తూ సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందాక యూపీలో యాదవ సామాజిక వర్గం బలం మరింత పెరిగింది. దీనితో కొత్తగా ఏర్పడిన జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రామ్ నరేశ్ యాదవ్‌ను ఎంపిక చేసుకోవలసి వచ్చింది. అయితే ఈయన రాజకీయంగా దుర్బలుడు కావడంతో ములాయం ప్రభ ముందు వీగిపోయారు. ప్రధానంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో యాదవ కుటుంబాలను ఏకం చేయడంలో ములాయం అవిశ్రాంతంగా కృషి చేశారు. రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని యాదవుల మధ్య పెద్దగా సామాజిక, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి కావు. ఈ రెండు ప్రాంతాల్లో గ్రూపులుగా విడిపోయి ఉండటం కంటే రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు బలం పెంచుకోవలసిన అవసరం ఉందని నచ్చజెప్పడంలో కూడా ములాయం విజయం సాధించారు. ములాయంపై ప్రజా విశ్వాసం ఎంతగా పెరిగిందంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పదిసార్లు గెలుపొందుతూ వచ్చారు. అలాగే ఏడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఈ కాలం పొడవునా, ఆయన తన సమీప, దూరపు కుటుంబ సభ్యులను తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి చేరేలా సిద్ధం చేస్తూ వచ్చారు. ఒక సమయంలో ఇలా రాజకీయాల్లో చేరిన ఆయన బంధువుల సంఖ్య మూడు డజన్లకు మించి ఉండేదని చెప్పుకొనేవారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లోనూ, తన ఓటు పునాదిని బలోపేతం చేసుకోవడంలోనూ ములాయం అంకిత భావానికి ఇది కొలమానంగా చెప్పవచ్చు. అదే సమయంలో బిహార్‌లో జేపీ ఉద్యమం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, కర్పూరీ ఠాకూర్, నితీశ్ కుమార్ వంటి పలువురు నేతలు పుట్టుకురాగా, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ములాయం ఏకైక నేతగా ఆవిర్భవించారు. జనతా, జనతాదళ్, లోక్ దళ్ ఎక్కడున్నా సరే... యాదవ నేతలు ఆయన వెన్నంటే నిలిచేవారు. పొత్తులు పెట్టుకోవడంలో, వాటిని విచ్ఛిన్నపర్చడంలో ములాయం సత్తాను ఇతర నేతలందరూ ఆమోదించాల్సి వచ్చింది. కాంగ్రెస్, జనతాదళ్, భారతీయ జనతాపార్టీ, వామపక్షాలు, బహుజన్ సమాజ్ పార్టీ వంటి అన్నిపార్టీలలో తనకు ప్రయోజనం కోరుకున్న ప్రతి సందర్భంలోనూ ములాయం ఈ శక్తిని ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలోనే ములాయం మూడుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో బీజేపీతో పొత్తు కలిపి యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పర్చడం ములాయం రాజకీయ దురంధరత్వానికి మచ్చుతునక. తర్వాత 1991 నుంచి రామాలయ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బీఎస్పీతో పొత్తుతో 1993లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పర్చారు. ఆ తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతితో దశాబ్దాలపాటు వ్యక్తిగత స్థాయిలో బద్ధ శత్రుత్వం కొనసాగింది. తర్వాత కాంగ్రెస్ మద్దతుతో 2003లో ప్రభుత్వం ఏర్పర్చారు. ఆ వెనువెంటనే విదేశీ మూలాలున్న వ్యక్తి ప్రధాని కాకూడదనే దృక్ప థంతో సోనియాగాంధీ అభ్యర్థిత్వాన్నే అడ్డుకున్నారు. రాజకీయంగా ములాయం వేసిన కుప్పిగంతులను మల్లయుద్ధ విన్యాసాలుగా పేర్కొనేవారు. ఈ కుప్పిగంతులు యూపీ రాజకీయాల్లో కీలకమైన రాజకీయశక్తిగా నిలబెట్టడంలో ములాయంకు ఎల్లవేళలా తోడ్పడ్డాయి. ముస్లిం–యాదవ సమ్మేళనంతో ఎన్నికల్లో గెలుపొందడంపై ఆరోపణలను ఎదుర్కొన్నారు. కానీ మైనారిటీలను బుజ్జగిస్తున్నారని వచ్చిన ఆరోపణలు ములాయంకు ఎన్నడూ హాని చేకూర్చలేదు. 1990లలో యూపీలో పోలీసు, పురపాలన యంత్రాంగంలో యాదవుల ఆధిపత్యాన్ని పెంచి పోషించారని వచ్చిన ఆరోపణలు కూడా రాజకీయంగా దెబ్బతీయలేక పోయాయి. ఈ అన్ని ఆరోపణలూ వాస్తవానికి ములాయం స్థాయిని అజేయశక్తిగా పెంచాయి. దీనివల్ల ఆయన ప్రాభవం ఉత్తరప్రదేశ్‌ను దాటి ఆయన పార్టీని జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించే వరకు తీసుకుపోయింది. అయితే, 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని తనయుడు అఖిలేశ్ యాదవ్‌కు కట్టబెట్టాలని ములాయం తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ నిర్ణయాలపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసింది. పార్టీలోని శక్తి కేంద్రాల మధ్య కీలుబొమ్మలా ఉంటున్నారని వ్యాపించిన పుకార్ల మధ్యనే 2012 నుంచి 2017 వరకు అఖిలేశ్ యూపీని పాలించారు. దీనివల్ల అటు పార్టీలోనూ, ఇటు కుటుంబంలోనూ పతనం మొదలైంది. ఈ నేప థ్యంలో ములాయం యూపీ వ్యవహారాల నుంచి మరింతగా దూరం జరిగారు. అదే సమయంలో అఖిలేశ్ ప్రాభవం పెరిగింది. అప్పటి నుంచి ములాయం తన మునుపటి వ్యక్తిత్వానికి కేవలం ఒక ఛాయలా కొనసాగుతూ వచ్చారు. అలాంటి పరిస్థితిలోనూ లాలూ ప్రసాద్ యాదవ్‌తో, ప్రధాని మోదీతో సన్నిహితంగా మెలగడం ద్వారా ములాయం తన రాజకీయ నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని సవాలు చేయగలిగిన ఏకైక పార్టీగా సమాజ్ వాదీ మాత్రమే రంగం మీద నిలబడగలిగిందంటే దానికి దశాబ్దాలపాటు ములాయం సిద్ధపర్చిన పునాదే కారణం. మూలా లను అంటిపెట్టుకోవడం, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరితో సంబంధాలు నెరపడం, తనకు మద్దతు పలికిన వారికి సహాయం చేయడంలో ములాయం చూపించిన శ్రద్ధ దీనికి కారణం. కేవలం యాదవుల పార్టీగా మొదలైన సమాజ్‌వాదీ పార్టీని మొత్తం ఓబీసీల బలానికి సంకేతంగా ములాయం మార్చి వేశారు. ములాయం అనంతర సమాజ్ వాదీ పార్టీలో ఈ గుణాలు కొరవడుతున్నందున, యాదవులు తమ రాజకీయ పలుకుబడిని మరెక్కడైనా చూపించుకునే వీలుంది. అదే జరిగిన పక్షంలో సమాజ్ వాదీ పార్టీపై ములాయం ప్రభావం, ప్రాభవం కచ్చితంగానే ముగిసి పోతాయి. రతన్ మణి లాల్ వ్యాసకర్త కాలమిస్టు, టీవీ కామెంటేటర్ (‘ద డైలీ గార్డియన్’ సౌజన్యంతో) -
తండ్రి చితికి నిప్పుపెట్టిన మరునాడే అఖిలేశ్ ఎమోషనల్ పోస్ట్
లక్నో: తండ్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయిన మరునాడే ట్విట్టర్లో ఎమోషనల్ పోస్టు పెట్టారు అఖిలేశ్ యావద్. ఆయన లేని తొలి రోజు సూర్యుడు ఉదయించకుండానే తెల్లవారినట్లు ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. ములాయం అంత్యక్రియలకు సంబంధించి రెండు ఫోటోలను షేర్ చేశారు. आज पहली बार लगा… बिन सूरज के उगा सवेरा. pic.twitter.com/XlboMo8G2V — Akhilesh Yadav (@yadavakhilesh) October 12, 2022 ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యావద్(82) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను స్వగ్రామం సైఫాయ్‌లో మంగళవారం నిర్వహించారు. భారీ జనసందోహం, అశ్రునయానాల మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. ములాయం అంత్యక్రియలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. అఖిలేశ్ యాదవ్‌కు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానభూతి తెలిపారు. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తజీందర్ బగ్గాకు రిలీఫ్ -
ఢిల్లీ బీఆర్ఎస్ భవనంలో కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ప్రకటించిన అనంతరం తొలిసారి సీఎం కేసీఆర్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం తాత్కాలికంగా సర్దార్ పటేల్ మార్గ్‌లో తీసుకున్న అద్దె భవనాన్ని పరిశీలించారు. అన్ని గదులను కలియతిరిగిన కేసీఆర్.. తన ఛాంబర్, మీడియా హాల్, ముఖ్యనేతల కార్యాలయాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎంపీలు సహా ఇతర నేతలకు పలు సూచనలు చేశారు. వాస్తు, పార్కింగ్‌కు సంబంధించి మార్పులు, చేర్పులు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వసంత్‌విహార్‌లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం పనులను సైతం ఆయన పరిశీలించే అవకాశం ఉంది. కేసీఆర్ మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని, పలువురు జాతీయ రాజకీయ పార్టీల పెద్దలను కేసీఆర్ కలుస్తారని తెలుస్తోంది. అదే సమయంలో మీడియాలోని కీలక వ్యక్తులు, మేధావులు, రిటైర్డ్ కేంద్ర ఉద్యోగులు, రైతు సంఘాల నేతలతోనూ ఆయన భేటీలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. రైతులు, విద్యుత్, బియ్యం సేకరణ, నదుల అనుసంధానం వంటి అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను జాతీయ స్థాయిలో ఎండగట్టే వ్యూహాలపై ఆయన నేతలతో చర్చించే అవకాశాలున్నాయి. ములాయంకు నివాళి తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ వెళ్లిన సీఎం కేసీఆర్.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ స్వగ్రామం అయిన సైఫయి చేరుకొని ఆయన భౌతికకాయానికి అంజలి ఘటించారు. అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్ కూడా దివంగత నేతకు నివాళులర్పించారు. అంత్యక్రియల అనంతరం సీఎం నేరుగా ఢిల్లీకి వచ్చారు. -
అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో జరిగాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. 'నేతాజీ అమర్ రహే' నినాదాలతో సైఫాయ్ గ్రామం మారుమోగింది. అంతకుముందు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ములాయం భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది వెళ్లారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసుకున్నారు. అనంతరం ములాయం భౌతికకాయాన్ని ఓ వాహనంలో అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ సహా కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. #WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. pic.twitter.com/RMCzht2uI3 — ANI (@ANI) October 11, 2022 గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయం సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశంలోని రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ములాయం భౌతికకాయాన్ని హోంమంత్రి అమిత్‌షా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సందర్శించి నివాళులు అర్పించారు. చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం -
దివంగత ములాయం సింగ్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీలో ఆయన పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్‌తోపాటు, ఎమ్మెల్సీ కవిత, పలువురు టీఆర్ఎస్ నాయకులు ములాయంకు నివాళులు అర్పించారు. అనంతరం ములాయం అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ములాయం అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖలతో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. #Telangana Chief Minister KCR paid respects and offered tributes to the mortal remains of the #SamajwadiParty patriarch #MulayamSinghYadav ji and consoles his son and former CM of UP #AkhileshYadav at Saifai today. #Saifai #UttarPradesh #Netaji #Dhartiputra #MulayamSingh #KCR pic.twitter.com/4dPPPlskDi — Surya Reddy (@jsuryareddy) October 11, 2022 #WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. -
రాజకీయ మల్లయోధుడు
-
రాజకీయ మల్లుడు.. సోనియా ‘ప్రధాని’ ఆశలకు గండికొట్టారు
లక్నో: సుశిక్షితుడైన మల్లయోధుడు. రాజకీయాల్లో కాకలుతీరిన వ్యూహకర్త. హిందుత్వ వ్యతిరేక రాజకీయాలకు చిరకాలం పాటు కేంద్ర బిందువు. జాతీయ స్థాయిలో విపక్ష రాజకీయాల్లో కీలక పాత్రధారి. ఇలా బహుముఖీన వ్యక్తిత్వం ములాయంసింగ్ యాదవ్ సొంతం. ఓ సాధారణ రైతు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం ప్రధాని పదవికి పోటీదారుగా నిలిచేదాకా సాగింది. దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా వెలుగొందినా, ఈ రాజకీయ మల్లునికి యూపీయే ప్రధాన రాజకీయ వేదికగా నిలిచింది. సోషలిస్టుగానే కొనసాగినా రాజకీయాల్లో ఎదిగేందుకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకోవడంలో ములాయం ఏనాడూ వెనకాడలేదు. యూపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన ప్రత్యర్థి అయిన బీఎస్పీతో పాటు కాంగ్రెస్‌తోనూ పొత్తుకు సై అన్నారు! రాజకీయంగా గాలి ఎటు వీస్తోందో గమనిస్తూ తదనుగుణంగా వైఖరి మార్చుకుంటూ వచ్చారు. తొలినాళ్లలో లోహియాకు చెందిన సంయుక్త సోషలిస్టు పార్టీ, చరణ్‌సింగ్ భారతీయ క్రాంతిదళ్, భారతీయ లోక్‌దళ్, సమాజ్‌వాదీ జనతా పార్టీ తదితరాల్లో కొనసాగినా, 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించినా ఈ సూత్రాన్నే అనుసరించారు. లోహియా అనుయాయి... ములాయం టీనేజీ దశలోనే సోషలిస్టు దిగ్గజం రాం మనోహర్ లోహియా సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. విద్యార్థి ఉద్యమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడై కొంతకాలం అధ్యాపకునిగా పని చేశారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఉండగా ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. అనంతరం లోక్‌దళ్ యూపీ విభాగానికి అధ్యక్షుడయ్యారు. పార్టీలో చీలిక నేపథ్యంలో చీలిక వర్గానికి రాష్ట్ర చీఫ్‌గా కొనసాగారు. యూపీ అసెంబ్లీలో, మండలిలో విపక్ష నేతగా పని చేశారు. బీజేపీ బయటినుంచి మద్దతుతో జనతాదళ్ నేతగా 1989లో తొలిసారిగా యూపీ సీఎం పదవి చేపట్టారు. 1993లో బీఎస్పీ మద్దతుతో మరోసారి సీఎం అయినా కొంతకాలానికి ఆ పార్టీ మద్దతు ఉపసంహరిచడంతో ములాయం సర్కారు కుప్పకూలింది. అనంతరం ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. మెయిన్‌పురి నుంచి 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు ప్రయత్నించిన సమయంలో ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. చివరికి హెచ్డీ దేవెగౌడ ప్రధాని కాగా ఆయన ప్రభుత్వంలో ములాయం రక్షణ మంత్రిగా పని చేశారు. వివాదాలూ మరకలూ... మలినాళ్ల ప్రస్థానంలో ములాయం ఎన్నో ఎగుడుదిగుళ్లు చవిచూశారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలూ మూటగట్టుకున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నేపథ్యంలో 2019లో ఏకంగా పార్లమెంటులోనే ప్రధాని మోదీపై పొగడ్తలు కురిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మోదీ తిరిగి అధికారంలోకి రావాలంటూ ఆకాంక్షించిన తీరు విశ్లేషకులను కూడా విస్మయపరిచింది. రేప్ కేసుల్లో మరణశిక్షలను వ్యతిరేకించే క్రమంలో ‘అబ్బాయిలన్నాక తప్పులు చేయడం సహజం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. కుటుంబ పోరు ముదిరి 2017లో అఖిలేశ్ పార్టీ పగ్గాలు చేపట్టినా అభిమానుల దృష్టిలో చివరిదాకా ‘నేతాజీ’గానే ములాయం నిలిచిపోయారు! సోనియా ‘ప్రధాని’ ఆశలకు గండికొట్టారు 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వ పతనానంతరం సోనియా ప్రధాని కాకుండా అడ్డుకోవడంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కలిసి ములాయం ప్రధాన పాత్ర పోషించారు. అప్పటికి ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్‌ను కలిసొచ్చి జోరు మీదున్నారు. మెజారిటీకి అవసరమైన 272 మంది ఎంపీలు తమవద్ద ఉన్నారని, ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమేనని మీడియా సాక్షిగా ప్రకటించారు. కానీ 20 మంది ఎంపీల బలమున్న ములాయం మాత్రం సోనియా ప్రధాని అవడాన్ని ఇష్టపడలేదు. సీపీఎం దిగ్గజం జ్యోతిబసు పేరును ప్రతిపాదించి ఆమె ఆశలపై నీళ్లు చల్లారు. అసెంబ్లీకి బాటలు వేసిన ‘కుస్తీ’! స్వయంగా మల్లయోధుడైన ములాయంకు కుస్తీ పోటీలంటే ఎంతో మక్కువ. మల్లయోధులుగా తర్ఫీదు పొందే యువకులను ఎంతగానో ప్రోత్సహించేవారు. కుస్తీ ప్రావీణ్యమే ములాయంకు తొలిసారి ఎమ్మెల్యే టికెట్ తెచ్చిపెట్టడం విశేషం. జస్వంత్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సోషలిస్ట్ పార్టీ నేత నాథూసింగ్ ఒకసారి ములాయంతో కుస్తీకి దిగారు. ఆయన తనతో తలపడ్డ తీరుకు నాథూసింగ్ ఎంతగానో ముచ్చటపడ్డారు. 1967 ఎన్నికల్లో తనకు బదులుగా జస్వంత్‌నగర్ నుంచి సోషలిస్టు పార్టీ తరఫున బరిలో దిగాల్సిందిగా కోరారు. అందుకు ములాయం సరేననడం, ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం చకచకా జరిగిపోయాయి. -
పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మూడుసార్లు సీఎంగా, రక్షణమంత్రిగా పనిచేసిన మూలయంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వ్యక్తిగతంగానూ, రాజకీయపరంగాను ఆయన ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నారు. సొంత కుమారుడు, సీఎం హోదాలో ఉన్న అఖిలేశ్ యాదవ్‌నే ఓ సారి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే ములాయం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఇప్పుడు చూద్దాం. 2012లో మొదలు 2012లో అఖిలేశ్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం అయ్యారు. ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. అయితే అఖిలేశ్ సీఎం అభ్యర్థిత్వాన్ని పార్టీలో కొందరు స్వాగతించగా.. ములాయం, ఆయన సోదరుడు శివ్‌పాల్ యాదవ్ మాత్రం వ్యతిరేకించారు. తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌ను సీఎం చేయాలని ములాయం భావించడమే ఇందుకు కారణం. అంతేకాదు ఆ సమయంలో తన బాబాబ్ అయిన శివ్‌పాల్‌ను అఖిలేశ్ రెండు సార్లు కేబినెట్ నుంచి తొలగించారు. దీంతో కుటుంబ కలహాలు మరింత ముదిరాయి. అఖిలేశ్‌తో ములాయంకు, శివపాల్ యాదవ్‌కు దూరం పెరిగింది. సంచలన నిర్ణయం సమాజ్‌వాదీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో 2016లో సంచలన నిర్ణయం తీసుకున్నారు ములాయం సింగ్. తన కుమారుడు, సీఎం అఖిలేశ్ యాదవ్, తన బంధువు రామ్ గోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీ రెండుగా చీలిపోకుండా కాపాడేందుకు, తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌కు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. కానీ ఆ మరునాడే సీఎం అఖిలేశ్ యాదవ్ తన బలమేంటో నిరూపించుకున్నారు. వెంటనే తన నేతృత్వంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ భేటికి మొత్తం 229 ఎస్పీ ఎమ్మెల్యేల్లో 200మంది హాజరయ్యారు. అలాగే కొందరు ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అఖిలేశ్ యాదవ్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ వేలాది మంది సీఎం కార్యాలయం ఆవరణలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు అప్పుడు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్ యాదవ్‌తో అఖిలేశ్, రామ్ గోపాల్ యాదవ్ వర్గం బాహాబాహీకి దిగింది. దీంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెనక్కితగ్గి.. అయితే పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ములాయం సింగ్ వెంటనే అప్రమత్తయ్యారు. తన కుమారుడు అఖిలేశ్, సోదరుడు రామ్ గోపాల్‌పై సస్పెన్షన్‌ను 24 గంటల్లోనే ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. ములాయంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2017 కొత్త ఏడాదికి ముందు ఇదంతా జరిగింది. కానీ పార్టీలో అంతర్గత విభేదాలు అక్కడితో ఆగిపోలేదు. 2017 జనవరి 1న జరిగిన పార్టీ జాతీయ సదస్సులో అఖేలిశ్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు రామ్ గోపాల్ యాదవ్. అప్పటికే ఆ పదవిలో ములాయంను పార్టీ సంరక్షుడి పదవికి పరిమితం చేశారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివ్‌పాల్ యాదవ్‌ను తొలగించారు. మరో షాక్.. ములాయం సింగ్ యాదవ్ మాత్రం వీటికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడైన తాను లేకుండా ఈ సమావేశం నిర్వహించడం అక్రమం అన్నారు. తానే సమాజ్ పార్టీ అధినేత అని, అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అని, శివ్‌పాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని స్ఫష్టం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం మాత్రం అఖిలేశ్ యాదవ్‌నే సమర్థించింది. ఆయన వర్గానికే ఎస్పీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందే ఇదంతా జరిగింది. ఈసీ నిర్ణయం అనంతరం తాను కొత్తగా సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా పార్టీని స్థాపిస్తానని, ములాయం సింగ్ యాదవ్ దానికి నేతృత్వం వహిస్తారని శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. కానీ.. కొన్ని నెలల తర్వాత తాను కొత్త పార్టీ స్థాపించడం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఎస్పీ చీలిపోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం. చివరకు శివ్‌పాల్ యాదవ్ మాత్రం ఎస్పీ నుంచి బయటకు వెళ్లిపోయారు. 2018 ఆగస్టులో ప్రగతిషీల్ సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. కానీ అనూహ్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేష్ యాదవ్ కూటమిలోనే చేరారు. ఎస్పీ గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. చదవండి: అర్బన్ నక్సల్స్ గుజరాత్లో పాగా వేయాలని చూస్తున్నారు.. జాగ్రత్త! -
ములాయం సింగ్ యాదవ్ అరుదైన (ఫొటోలు)
-
సొంతంగా కారు కూడా లేదు.. ములాయం సింగ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
లక్నో: రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూసిన విషయం తెలిసింది. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆనారోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. ములాయం సింగ్ మరణాన్ని ఆయన కుమారుడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘మా తండ్రి, మీ ‘నేతాజీ’ ఇక లేరు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు అక్టోబర్ 11(మంగళవారం) సౌఫయ్ గ్రామంలో జరుగుతాయి’. అని తెలిపారు. ములాయం సింగ్ ఆస్తులు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతగా గుర్తింపు పొందిన ములాయం సింగ్ ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ములాయం సింగ్ నికర ఆస్తులు విలువ రూ. 20.56 కోట్లు. ఈ అఫిడవిట్ ప్రకారం తన మొత్తం చర, స్థిరాస్తులు దాదాపు రూ.16.5 కోట్లు.(16,52,44,300). 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే ఇది రూ. 3.20 కోట్లు తక్కువ. వీటితోపాటు ములాయం ఏటా రూ.32.02 లక్షలు సంపాదిస్తుండగా.. ఆయన భార్య సాధనా యాదవ్ వార్షికాదాయాన్ని రూ. 25.61 లక్షలుగా పేర్కొన్నారు. చదవండి: ప్చ్.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు బ్యాంక్ డిపాజిట్లు, బంగారం ములాయం సింగ్ యాదవ్ వద్ద రూ.16,75,416 నగదు ఉండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్బీఎఫ్సీల్లో రూ.40,13,928 డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం రూ. 9,52,298 విలువైన ఎల్ఐసీ ఇతర బీమా పాలసీలను కలిగి ఉన్నాడు. అంతేగాక ఆభరణాల విషయానికొస్తే.. ఆయన వద్ద 7.50 కిలోల బంగారం ఉంది. దీని విలువ రూ.2,41,52,365. తదితర ప్రాంతాల్లో ఆయనకు రూ.7,89,88,000 విలువైన వ్యవసాయ భూమి కూడా ఉంది. వ్యవసాయేతర భూమిపరంగా రూ.1,44,60,000 విలువైన ఆస్తులు ఉన్నాయి. యూపీలో అతని నివాస ప్రాపర్టీ ధర రూ.6,83,84,566. చదవండి: రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు! కారు లేదు, కొడుకు నుంచి అప్పు ములాయం సింగ్ యాదవ్ తన వద్ద కారు లేదని అఫిడవిట్లో వెల్లడించారు. అలాగే కుమారుడు అఖిలేష్ యాదవ్ నుంచి రూ.2,13,80,000(2.13 కోట్లు) అప్పు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక ములాయం చదువు విషయానికొస్తే 1968లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. 1964లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి బీటీ పట్టా పొందారు. ఎస్పీలో విషాదఛాయలు ములాయం మృతితో ఎస్పీ పార్టీలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి, రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. కాగా 22 నవంబర్ 1939న యూపీలోని ఇటావా జిల్లాసైఫయ్ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ములాయం రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా సేవలు అందించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. ఇది కూడా చదవండి: ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా! ములాయం సింగ్ ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పనిచేశారు. యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పడంతోపాటు జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రముఖపాత్ర పోషించారు.పదిసార్లు ఎమ్మెల్యే, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో(1996-98) రక్షణశాఖ మంత్రిగానూ సేవలందించారు. సుధీర్ఘకాలంపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగారు. పార్టీ నేతలు, అభిమానులు ఆయన్ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకుంటారు. ఆయన తుదిశ్వాస వరకు మెయిన్‌పూరి లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. -
రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు!
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన దిగ్గజ నేత ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ట పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ములాయం సింగ్‌తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ....ములాయం సింగ్ మృతితో సోషలిస్ట్ స్వరం మూగబోయింది. ఆయన రక్షణ మంత్రిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. అంతేగాదు ఆయన అణగారిన వర్గాల కోసం చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరని చెప్పారు. దేశంలోని రాజ్యంగ విలువలను పరీరక్షించాల్సి అవసరం వచ్చినప్పుడల్లా తన మద్దతు కాంగ్రెసుకు ఉంటుందని ములాయం సింగ్ అనేవారని సోనియా గాంధీ భావోద్వేగంగా చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో గురుగ్రాంలో మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. (చదవండి: ఓటమెరుగని నేత.. అయినా ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు) -
ప్చ్.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు
ఢిల్లీ: ప్రాంతీయ పార్టీ ద్వారా జాతీయ నేతగా ఎదిగిన ములాయం సింగ్ యాదవ్‌కు.. అభిమాన గణం ఎక్కువే. పదిసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఈ రాజకీయ దిగ్గజం.. ఎన్నికల్లో ఓటమి ఎరుగని యోధుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ములాయంకు ఒక్కగానొక్క కోరిక మాత్రం తీరలేదు. యూపీ రాజకీయాల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో చక్రం తిప్పిన ములాయం.. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే ఆ రాజకీయాల్లో ప్రముఖంగా రాణించడం మాత్రం ఎందుకనో ఆయన వల్ల కాలేకపోయింది. సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా, రక్షణ మంత్రిగా పేరు దక్కినప్పటికీ.. అంతకు మించి ముందుకు వెళ్లడం ఆయన వల్ల కాలేదు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు దక్కినప్పటికీ.. అప్పటికే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పార్టీల హవా ముందు ఆయన పాచికలు పారలేకపోయాయి. అంతెందుకు.. మూడో దఫా ముఖ్యమంత్రి అయిన టైంలోనూ.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతో 2004 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి మెయిన్‌పురి నుంచి ఎంపీగా నెగ్గారు. అయితే.. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో అధికారం కొనసాగించింది. దీంతో ములాయం, సమాజ్‌వాదీ పార్టీకి కేంద్రంలో అంతగా ప్రాధాన్యం దక్కలేదు. దీంతో రాష్ట్ర రాజకీయాలకు మళ్లి.. యూపీ సీఎంగానే కొనసాగారాయన. 2007 ఎన్నికల్లో బీఎస్పీ చేతిలో ఓటమి పాలయ్యేదాకా ఆయన సీఎంగా కొనసాగారు. ఆపై తనయుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్నప్పటికీ.. ఎస్పీ వర్గపోరు, ఆపై అనారోగ్యం తదితర కారణాలతో ఆయన జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురాలేకపోయారు. అయితే.. ములాయం సింగ్ యాదవ్ తన తరం రాజకీయ నాయకులలో తన విలువలను చెక్కుచెదరకుండా, తన రాజకీయాలను కార్పొరేట్ పరం కాకుండా కాపాడుకుంటూ వచ్చిన నేతనే చెప్పొచ్చు. -
ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా!
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ఒక ఎత్తు అయితే.. యూపీ రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారాయన. ఓటమెరుగని నాయకుడిగా, రాజకీయ దురంధరుడిగా.. భారతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు. బీసీ నేతగా.. యూపీలో అత్యధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, ఔనత్యానికి ఆయన చేసిన కృషి విశేషమైనది. అంతేకాదు.. అభిమానుల చేత ముద్దుగా ‘నేతాజీ’ అని పిలిపించుకుంటూ.. లక్షల మంది ఎస్పీ కార్యకర్తలను విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు. ► ములాయం సింగ్ యాదవ్.. 1939 నవంబర్ 22న ఎటావా జిల్లా సైఫయి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మూర్తి దేవి, సుఘార్ సింగ్‌లు. పేద కుటుంబం అయినప్పటికీ కష్టపడి బాగా చదువుకుని పైకొచ్చారు ములాయం. ► ములాయం సోదరి కమలా దేవి, శివపాల్ సింగ్ యాదవ్, రతన్‌సింగ్ యాదవ్, అభయ్ రామ్ యాదవ్, రాజ్‌పాల్ సింగ్ యాదవ్ సోదరులు. దగ్గరి బంధువు రామ్ గోపాల్‌యాదవ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ► ములాయం చదివింది ఎంఏ. సోషలిస్ట్ మూమెంట్లో, రాజకీయాల్లో చేరకముందు మెయిన్‌పురిలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పాఠాలు చెపారు ములాయం. ► సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, కీలక నేతలు అంతా ములాయంను నేతాజీ( గౌరవ నేత) అని పిలుస్తుంటారు. ఎప్పుడైతే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి దూరం అయ్యారో.. అప్పటి నుంచి అఖిలేష్‌కు ఆ పిలుపు సొంతం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎస్పీ నుంచి ఆ గౌరవం అందుకునే అర్హత ఒక్క ములాయంకే పార్టీ శ్రేణులు బలంగా ఫిక్స్ అయిపోయాయి. ప్రొఫెషనల్ రెజ్లర్ ములాయం సింగ్ యాదవ్ ప్రొఫెషనల్ కుస్తీ వీరుడు కూడా. రాజకీయాలు ఛాయిస్ కాకుంటే ఆయన మల్లు యుద్ధవీరుడిగా గుర్తింపు దక్కించుకునేవారేమో. మెయిన్‌పురిలో ఓసారి జరిగిన కుస్తీ పోటీల్లో కుర్రాడిగా ములాయం పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నాథూ సింగ్.. ములాయం కుస్తీ పట్లకు ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత జస్వంత్ నగర్ సీటును ములాయంకు ఇప్పిదామని నాథు సింగ్ ప్రయత్నాలు చేసినా అది ఎందుకనో కుదర్లేదు. ఇక ములాయంను ముద్దుగా పహిల్వాన్ అని పిలుస్తుంటారు. రెండు వివాహాలు.. ములాయం సింగ్ యాదవ్‌కు రెండు వివాహాలు జరిగాయి. మొదటి వివాహం మాలతీ దేవి. వీరికి అఖిలేష్ యాదవ్ సంతానం. దీర్ఘకాలిక సమస్యలతో 2003లో మాలతీ దేవి కన్నుమూశారు. మొదటి భార్య బతికున్న సమయంలో.. 1980 సమయంలో సాధనా గుప్తాతో ఆయన సహజీవనం కొనసాగించారు. వీళ్లకు ప్రతీక్ యాదవ్ అనే కొడుకు ఉన్నాడు. 2007 ఫిబ్రవరిలో ములాయం చెప్పేదాకా వీళ్లిద్దరికీ వివాహం అయ్యిందనే విషయం ఈ సమాజానికి తెలియలేదు. జులై 9, 2022న సాధనా గుప్తా అనారోగ్యంతో కన్నుమూశారు. రాజకీయాలు ఇలా.. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన.. రామ్ మనోహర్ లోహియా ఆదర్శాలతో ఇటుగా అడుగులేశారు. పదిహేనేళ్ల వయసులో ములాయం.. జానేశ్వర్ మిశ్రా, రామ్ సేవక్ యాదవ్, కర్పూరీ థాకూర్.. ఇలా ఎందరినో కలిశారు. ► 1960లో జనతా దళ్‌లో చేరారు ములాయం. 1962లో ములాయం.. షికోహాబాద్‌లోని ఏకే కాలేజీ విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ► 1967లో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1977ల తొలిసారి రాష్ట్ర మంత్రి అయ్యారు. 1989లో జనతాదళ్ పార్టీ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో ఏకంగా జనతా దళ్‌కు జాతీయాధ్యక్షుడు అయ్యాడు. ► 1982లో యూపీ కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్లపాటు అలా ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1985లో జనతా దల్ చీలిపోయాక.. చంద్ర శేఖర్, సీపీఐలతో కలిసి క్రాంతికారి మోర్చాను స్థాపించారు. ఈ పార్టీ ఆధ్వర్యంలోనే 1989లో తొలిసారి ఉత్తర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారాయన. ► 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పకూలాక.. చంద్ర శేఖర్ జనతా దల్(సోషలిస్ట్)లో చేరారు ములాయం. కాంగ్రెస్, జనతా దల్ మద్దతుతో సీఎంగా కొనసాగారు. ► 1991 ఏప్రిల్‌లో.. కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోగా.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ములాయం.. బీజేపీ చేతిలో ఓడిపోయారు. ► ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్సీ)తో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ► ఆపై దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర కొనసాగింది. పార్లమెంటేరియన్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. అదే సమయంలో(1996లో) మెయిన్‌పురి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ములాయం. దీంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా ములాయం సింగ్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ► అయితే.. 1998లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో ఆయన రక్షణ మంత్రి కోల్పోవాల్సి వచ్చింది. 1999 ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంభల్, కన్నౌజ్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో నెగ్గారు ఆయన. అయితే తనయుడు అఖిలేష్ కోసం కన్నౌజ్ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ► 2003, సెప్టెంబర్‌లో తిరిగి.. స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయానికి ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. శాసనసభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో.. గున్నావుర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి.. రికార్డు స్థాయి బంపర్‌మెజార్టీతో 2004 జనవరిలో గెలిచారాయన. ఆ ఎన్నికల్లో 94 శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. అందుకే సైకిల్ సింబల్! పేద కుటుంబంలో పుట్టిన ములాయంకు.. చిన్నప్పుడు సైకిల్ నడపాలనే కోరిక విపరీతంగా ఉండేదట. కానీ, తండ్రి సంపాదన తక్కువగా ఉండడంతో ఆ స్తోమత లేక చాలా కాలం ఆ కోరిక తీరలేదు. ఇక కొంచెం సంపాదన వచ్చాక.. అద్దె సైకిల్‌తో ఇరుగు పొరుగు ఊర్లకు వెళ్తూ సరదా తీర్చుకున్నారాయన. ఎప్పుడైతే.. సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించారో.. అప్పుడే తన పార్టీకి సైకిల్ గుర్తుగా ఉంటే బాగుంటుందని ఆయన ఫిక్స్ అయిపోయారట. ► తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012-17 మధ్య అఖిలేశ్ యాదవ్ యూపీ సీఎంగా వ్యవహరించారు. ► ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. మొత్తం జీవిత కాలంలో వివిధ రకాల ఉద్యమాలు, ఇతరత్రాలతో తొమ్మిసార్లు జైలుకు వెళ్లారు. వివాదాలు.. ► అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేతకు ముందు.. తరువాత జరిగిన పరిణామాలు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితాన్ని కీలక మలుపులు తిప్పాయి. ► 2012 నిర్భయ ఘటనపై స్పందించే క్రమంలో ములాయం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మగాళ్లు అన్నాక తప్పులు చేయడం సహజమని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ సైతం స్పందించారు. ఇక ములాయం చేఏసిన వ్యాఖ్యలకు మోహాబా జిల్లా కోర్టు ఆయనకు సమన్లు సైతం జారీ చేసింది. ► టిబెట్ సార్వభౌమాధికారం కోసం చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. ► ఇక ములాయం పెద్ద కొడుకు అఖిలేష్ యాదవ్ 2012లో యూపీ సీఎం అయ్యాక.. కుటుంబ కలహాలు బయటపడ్డాయి. సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ వేరు కుంపటితో వివాదం రచ్చకెక్కింది. ఒక గ్రూప్‌కు అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వం వహించగా.. మరో గ్రూప్‌నకు ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌లు, అమర్ సింగ్‌లు నేతృత్వం వహించారు. ► తండ్రికి ఎదురు తిరిగేలా అఖిలేష్ నిర్ణయాలు తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. చివరికి.. 2016 డిసెంబర్ 30న ఏకంగా కొడుకు అఖిలేష్, బంధువు రామ్ గోపాల్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు. అయితే.. 24 గంట్లోలనే ఆ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. కానీ.. ► దానికి బదులుగా తన తండ్రికి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ.. తనను తాను పార్టీ చీఫ్‌గా ప్రకటించుకున్నారు. ఈ మేరకు జనవరి 1, 2017 నిర్వహించిన జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ములాయం బహిరంగంగా ఖండించారు. అయితే.. ఎన్నికల సంఘం కూడా అఖిలేష్ నిర్ణయానికి మద్దతుగా.. ములాయం ఆదేశాలను తప్పుబట్టడంతో.. అప్పటి నుంచి అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ జాతీయ నేతగా కొనసాగుతూ వస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మీద 2021లో డైరెక్టర్ సువేందు రాజ్ ఘోష్ ‘మెయిన్ ములాయం సింగ్ యాదవ్’ అనే చిత్రాన్ని తీశాడు. అమిత్ సేథీ ఇందులో ములాయం పాత్రలో కనిపించారు. ఇక 2019లో విజయ్ గుట్టే డైరెక్ట్ చేసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో సుభాష్ త్యాగి, ములాయం సింగ్ యాదవ్ పాత్రలో కనిపించారు. -
ములాయం మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
తాడేపల్లి/హైదరాబాద్: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. 82 ఏళ్ల ములాయం అనారోగ్య సమస్యలతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ములాయం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ములాయం కీలక పాత్ర పోషించారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని సీఎం జగన్ సంతాప ప్రకటనలో తెలియజేశారు. ఇక ములాయం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ములాయం తన జీవితాంతం పని చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ములాయం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
-
ములాయం కన్నుమూత.. ప్రధాని భావోద్వేగం
రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ములాయంతో ఉన్న అనుబంధాన్ని ట్విటర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. ములాయం సింగ్ యాదవ్‌గారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. ప్రజల సమస్యల పట్ల సున్నితంగా ఉండే నిరాడంబరమైన నాయకుడిగా విస్తృతంగా ప్రశంసించబడ్డారు. శ్రద్ధతో ఆయన ప్రజలకు ఎన్నో ఏళ్లు సేవలదించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్, డాక్టర్ లోహియా ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ములాయం తన జీవితాన్ని అంకితం చేశారు అని మోదీ ట్వీట్ చేశారు. యూపీ, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యంలో కీలక సైనికుడిగా పనిచేశారు. రక్షణ మంత్రిగా, బలమైన భారతదేశం కోసం పనిచేశారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు తెలివైనవి. వేర్వేరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయం నుంచే ములాయం సింగ్‌ను ఎన్నోసార్లు కలిశాను. ఆయన అభిప్రాయాలను వినడానికి నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను. ఆయన మరణం బాధించింది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షల మంది కార్యకర్తలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.. ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు. Shri Mulayam Singh Yadav Ji was a remarkable personality. He was widely admired as a humble and grounded leader who was sensitive to people’s problems. He served people diligently and devoted his life towards popularising the ideals of Loknayak JP and Dr. Lohia. pic.twitter.com/kFtDHP40q9 — Narendra Modi (@narendramodi) October 10, 2022 I had many interactions with Mulayam Singh Yadav Ji when we served as Chief Ministers of our respective states. The close association continued and I always looked forward to hearing his views. His demise pains me. Condolences to his family and lakhs of supporters. Om Shanti. pic.twitter.com/eWbJYoNfzU — Narendra Modi (@narendramodi) October 10, 2022 Rest in peace Pahlwan ji 🙏🏽#MulayamSinghYadav pic.twitter.com/o9ksAs8jHy — Vijender Singh (@boxervijender) October 10, 2022 రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, పీసీసీ చీఫ్‌లు, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ములాయం కన్నమూత పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. Deeply saddened to hear about the demise of Former Union Defence Minister and Chief Minister of Uttar Pradesh Mulayam Singh Yadav Ji. Netaji was one of the tallest socialist leader our country has seen. pic.twitter.com/nraDdLim5O — Supriya Sule (@supriya_sule) October 10, 2022 End of an Era ! Extremely saddened by the demise of Samajwadi Party supremo and ex-UP CM Sh #MulayamSinghYadav ji . He was a true Statesman . Deepest condolences 🙏🏻 May his departed soul be blessed 🙏🏻 Om Shanti 🙏🏻 pic.twitter.com/t3pazMAzyM — Sonal Goel IAS (@sonalgoelias) October 10, 2022 Former UP CM & one of tallest Indian politician #MulayamSinghYadav ji passes away. A true people’s leader respected across different parties 🙏 Deepest condolences to his family members. May he rest in peace. Om shanti! pic.twitter.com/DiVYfOXYgl — YSR (@ysathishreddy) October 10, 2022 Saddened to learn about the demise of Former Uttar Pradesh chief minister and Samajwadi Party Patron Mulayam Singh Yadav ji. He gave a strong foothold to Samajwadi Party in UP and worked for the upliftment of weaker sections of the society. My condolences. Om Shanti 🙏🏻 pic.twitter.com/ZjegjYuxTP — Praful Patel (@praful_patel) October 10, 2022 -
ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. యూపీకి మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 2న ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ములాయం సింగ్ యాదవ్.. 1967లో తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ములాయం మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించడంతో పాటు సైఫయిలో అధికారిక లాంఛనాలతో ములాయం అంత్యక్రియలకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
విషమంగానే ములాయం ఆరోగ్యం
లక్నో/గురుగ్రామ్: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి వర్గాలు గురువారం తెలిపాయి. ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆరోగ్యం విషమించడంతో ములాయంను ఆదివారం మేదాంత ఐసీయూలో చేర్పించిన విషయం తెలిసిందే. -
విషమంగా ములాయం సింగ్ ఆరోగ్యం
లక్నో: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం వరకు ఆయనకు క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు వైద్యులు. ఈ క్రమంలో ఇవాళ ఆరోగ్యం విషమించడంతో ఆయన్ని ఐసీయూలోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి మెరుగుపడడం లేదని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్‌ను పార్టీ వర్గాలు ట్విటర్ ద్వారా ధృవీకరించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి. मेदांता अस्पताल ने जारी किया आदरणीय नेताजी का हेल्थ बुलेटिन। हम सभी आदरणीय नेताजी के जल्द स्वस्थ और दीर्घायु होने की कामना करते हैं। pic.twitter.com/myCZJIzKMY — Samajwadi Party (@samajwadiparty) October 4, 2022 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆదివారం(అక్టోబర్ 2న) ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఇదీ చదవండి: జమ్ములో రక్తపాతమా? ఏమైందిప్పుడు?- అమిత్ షా -
ములాయం సింగ్ ఆరోగ్యంపై మోదీ ఆరా.. అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని, తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని అఖిలేశ్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనారోగ్యంత గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్‌కు మొదట ప్రవేటు వార్డులో చికిత్స అందించారు వైద్యులు. అయితే అకస్మాతుగా ఆక్సీజన్ స్థాయిలు తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం హూటాహుటిన ఐసీయూకు తరలించారు. దీంతో అఖిలేశ్ సహా ఇతర కుటుంబసభ్యులంతా ఆదివారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి వైద్యులకు కూడా యోగి ఫోన్ చేశారని, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నాయి. అయితే ములాయం సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అఖిలేశ్ యాదవ్ ఎస్పీ కార్యకర్తలకు తెలిపారు. ఆయనను చూసేందుకు ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ మేరకు ఆదివారం వెల్లడించారు. చదవండి: మోగిన ఎన్నికల నగారా.. 6 రాష్ట్రాల్లో 7 సీట్లకు ఉప ఎన్నిక -
ములాయం హెల్త్ కండీషన్ సీరియస్.. హుటాహుటిన ఆసుపత్రికి అఖిలేష్!
Mulayam Singh.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ములాయంను గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అయితే, కొద్దిరోజులుగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. కాగా, మూలయంకు డాక్టర్ సుశీల కటారియా ఆధ్వర్యంలో వైద్య చికిత్స జరుగుతోందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఇక, ములాయం సింగ్ హెల్త్ కండీషన్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ హుటాహుటిన ఢిల్లీ నుంచి ఆసుపత్రికి చేరుకున్నట్టు సమాచారం. #SamajwadiParty founder Mulayam Singh Yadav shifted to ICU at Gurugram's Medanta hospitalhttps://t.co/dVN0bXMzca — TIMES NOW (@TimesNow) October 2, 2022 -
ములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సాధన మరణ వార్తపై స్పందించిన ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. యులాయం సింగ్, అతని కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్వీటర్లో.. ‘మాజీ ముఖ్యమంత్రి ములాయం భార్య సాధన మరణించిన చేదు వార్త తెలిసింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు దేవుడు అండగా ఉండి, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు’ ట్వీట్ చేశారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విటర్లో కూడా పార్టీ వ్యవస్థాపకుడి భార్య మృతిపై సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. చదవండి: ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్‌కు కరోనా ఎవరీ సాధన 2003లో ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య, అఖిలేష్ యాదవ్ తల్లి మాల్తీ యాదవ్ మరణించే వరకు సాధన గుప్తా గురించి చాలా మందికి తెలియదు. అప్పటికే సాధనా గుప్తాతో సంబంధం కలిగి ఉన్న ములాయం అదే సంవత్సరం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. వయసులో అతని కంటే సాధన 20 ఏళ్లు చిన్నది. ఆమెకు ఇంతకుముందే పెళ్లి అయ్యింది. ప్రతీక్ యాదవ్ ఆమె కుమారుడు కాగా.. భారతీయ జనతా పార్టీ నాయకురాలు అపర్ణా యాదవ్ ఆమె కోడలు. -
ములాయం సింగ్‌కు స్మృతి ఇరానీ పాదాభివందనం, వీడియో వైరల్
Mulayam Singh Yadav blesses Smriti Irani: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ మెట్లు దిగుతూ పార్లమెంటు హాల్లోకి వస్తున్న సమయంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ ములాయం పాదాలను తాకి నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమెను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం కాగా ఇటీవల ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం ఆమె కూడా లక్నోలోని తన మామ ములాయం సింగ్ ఇంటికి వెళ్లి అక్కడ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమె తలపై చేయి వేసి దీవించారు. చదవండి: బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా? #WATCH | Samajwadi Party (SP) founder-patron and MP Mulayam Singh Yadav blesses Union Minister Smriti Irani, as she greets him at the Parliament. pic.twitter.com/3ti42DXkpa — ANI (@ANI) January 31, 2022 -
UP Assembly Election 2022: నువ్కొకటి కొడితే... నేను రెండేస్తా!
ఇప్పుడు సరిగ్గా.. ఇదే పంథాలో ఉత్తరప్రదేశ్ రాజకీయ యవనికపై టిట్ ఫర్ టాట్ క్రీడ రక్తికడుతోంది. అబ్బురపరిచే ఎత్తులతో సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. హిందుత్వ కార్డుతో ఓటర్లు సంఘటితం కాకుండా చూసుకుంటే సగం యుద్ధం గెలిచినట్లేనని భావించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్... చాణక్యాన్ని ప్రదర్శించారు. కీలకమైన ఓబీసీ నేతలను లాగేశారు. తామేమి చేయకపోతే చేష్టలుడిగి చూస్తుండిపోయిందనేది ప్రజల్లోకి వెళుతుందని... దిక్కుతోచని స్థితిలోకి బీజేపీ వెళ్లిపోయిందని భావిస్తారని కమలదళం భయపడింది. ఎత్తుకు పైఎత్తుకు వేసింది. చిన్న కోడలు అపర్ణా యాదవ్‌ను లాగేయడం ద్వారా ములాయం సింగ్ ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ఈ రాజకీయ సమయంలో వ్యూహాలు పదునెక్కుతున్న వైనంపై ‘సాక్షి’ సవివర కథనం... మౌర్య ఇచ్చిన షాక్‌తో ‘మైండ్ బ్లాంక్’ ఇతర వెనుకబడిన వర్గాల్లో (ఓబీసీల్లో) బలమైన నాయకులైన మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య జనవరి 12న, దారాసింగ్ చౌహాన్ 13న మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కలకలం రేగింది. రోజుకో మంత్రి, ఒక ఎమ్మెల్యే చొప్పున పార్టీని వీడిపోవడంతో బీజేపీకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తం ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. కాషాయపార్టీ తేరుకునే లోగానే... ఓబీసీలను బీజేపీ అవమానిస్తోందని... అందుకే వారంతా సమాజ్‌వాదీ పార్టీలోకి క్యూ కడుతున్నారనే సందేశం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ములాయం ఇంట్లోనే ముసలం నష్టనివారణకు దిగిన బీజేపీ దిమ్మతిరిగేలా కొట్టాలని భావించి అసంతృప్తితో ఉన్న అఖిలేశ్ మరదలు అపర్ణా యాదవ్‌కు (సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ భార్య) గాలం వేసింది. సొంత మనిషినే ఆపలేకపోతే అఖిలేశ్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. సరిగ్గా బీజేపీ అక్కడే కొట్టి లక్ష్యాన్ని సాధించింది. మైండ్‌గేమ్ కీలక ఓబీసీ మంత్రులు పార్టీని వీడి వెళ్లిపోవడంతో తూర్పు యూపీలో నష్టం తప్పదని భావించిన బీజేపీ దీన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దింపింది. తర్వాత బీజేపీ కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగడానికి భయపడుతున్నారని ప్రతిరోజూ వల్లెవేస్తూ ఎస్పీ చీఫ్‌ను పిరికివాడిగా చూపే ప్రయత్నం చేశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అఖిలేశ్ తాను మెయిన్‌పురి నుంచి పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. నిజానికి వీరిద్దరూ పోటీచేసింది... కంచుకోటలైన సొంత నియోజకవర్గాల నుంచే. నిజానికి ఈ విషయంలో ఏటికి ఎదురీదే గుండె ధైర్యాన్ని ప్రదర్శించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒకప్పటి తన కుడిభుజం సువేందు అధికారికి కంచుకోటగా మారిన ‘నందిగ్రామ్’ నుంచి పోటీచేస్తానని ప్రకటించి నివ్వెరపరిచారు. తాను నందిగ్రామ్ బరిలో ఉంటే సువేందు అధికారి సొంత నియోజకవర్గానికి బాగా సమయం కేటాయించాల్సి వస్తుందని, ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి తిరగలేరనేది దీదీ ఎత్తు. తాను ఓడిపోయినా... మమత వ్యూహం మాత్రం బ్రహ్మాడంగా వర్క్ అవుట్ అయి దీదీ హ్యాట్రిక్ కొట్టారు. కొట్టారు.. తీసుకున్నాం. మాకూ టైమొస్తుంది.. మేమూ కొడతాం – 2017లో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిశాక... చంద్రబాబు సర్కారు కుట్రపూరిత వేధింపులపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంధించిన ఈ వాగ్భాణం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ‘ఇది కదా... సిసలైన పోరాటయోధుడి గుండెధైర్యం’ అనుకున్నారు జనం. ప్రియాంక నినాదం తుస్సుమనేలా.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కొడిగట్టిన కాంగ్రెస్ కనీసం గౌరవప్రద స్థితిలో నిలిపితే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సానుకూలత రావడానికి ఉపయోగపడుతుందని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ప్రియాంకా గాంధీ ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ (ఆడబిడ్డను... పొరాడగలను)’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. తద్వారా ‘మేమెందుకు పురుషులతో సమానం కాదు. మాకేం తక్కువ’ని నేటితరం యువతుల్లో బలంగా నాటుకుపోయిన భావజాలాన్ని ప్రేరేపించారు. బాగా జనంలోకి వెళ్లిపోవడంతో ఈ నినాదంతో కాంగ్రెస్ యూపీ నలుమూలగా నిర్వహించిన మారథాన్లకు యువతుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రియాంక ఎత్తుగడ ఫలించింది. దాంతో ఆమె 40 శాతం అసెంబ్లీ టిక్కెట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించి.. చేతల్లో చూపడం ద్వారా మహిళా ఎజెండాను మరిం త ముందుకు తీసుకెళ్లారు. చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!) ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రియాంక పోరాట సన్నద్ధంగా ఉన్న ముగ్గురు యువతుల ఫోటోతో కూడిన హోర్డింగ్‌లు, పోస్టర్ల ను యూపీ వ్యాప్తంగా విస్తృతంగా అతికిం చారు. ఈ ముగ్గురిని లీడ్ చేస్తూ మధ్యలో ఉన్న యువతి పేరు ప్రియాంకా మౌర్య, వృత్తిరీత్యా డాక్టర్. మంచి వక్త. లింగ సమానత్వం కోసం ప్రియాంకా గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిందని ప్రియాం క మౌర్య. ఆమె స్వభావం, ఆహార్యం దీనికి బాగా ఉపకరించాయి. దాంతో ఈ ఉద్యమానికి ప్రియాంక మౌర్య బ్రాండ్ అంబాసిడర్‌గా, పర్యాయపదంగా మారారు. సరిగ్గా బీజేపీ ఇక్కడే గురిచూసి కొట్టింది. 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తే మహిళల్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత వస్తుందని, అసలే ఒకవైపు ఎస్పీ– రాష్ట్రీయ లోక్‌దళ్ పొత్తులో తమ హిందూత్వ కార్డు నిర్వీర్యమైన పోయిన పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఎత్తుగడ తమకు భారీ నష్టం కలుగుజేస్తుందని భయపడ్డ బీజేపీ మాస్టర్ గేమ్ ఆడింది. ‘అడపిల్లను... పోరాడగలను’ అనే నినాదానికి బ్రాండ్ అం బాసిడర్‌గా ఉన్న ప్రియాంక మౌర్యను లాగేస్తే కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టొచ్చని భావించి అమలులో పెట్టేసింది. మహిళలకు 40 టిక్కెట్లు ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని.. చేతల విషయానికి వచ్చే సరికి కష్టజీవి ప్రియాంక మౌర్యకే మొండి చేయి చూపిందనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది. ఇప్పుడిక ప్రియాంకా గాంధీ మహిళలకు ఇచ్చే టికెట్లు 50 శాతానికి పెంచినా, ఈ విషయాన్ని ఎన్నికల ర్యాలీల్లో 500 సార్లు చెప్పినా జనం నమ్మరు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీ గెలవాలని కోరుకుంటున్న ములాయం!
లక్నో: ములాయం సింగ్ యాదవ్ చిన్న అపర్ణా యాదవ్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ములాయం ఆశీస్సులు తీసుకున్న ఫొటోను శుక్రవారం ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ‘బీజేపీలో చేరిన తర్వాత లక్నోలో మా నాన్న/నేతాజీ ఆశీస్సులు తీసుకున్నాను’ అని క్యాప్షన్ జోడించారు. దీనిపై ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘అంటే దీనర్థం నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) కూడా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నార’ని వ్యాఖ్యానించారు. బీజేపీకి ధన్యవాదాలు: అఖిలేశ్ అపర్ణా యాదవ్.. గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ‘వారసత్వ భారాన్ని తగ్గించినందుకు బీజేపీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆమెను బీజేపీకి వెళ్లకుండా వారించేందుకు తన తండ్రి ములాయం సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరడం గమనార్హం. भारतीय जनता पार्टी की सदस्यता लेने के पश्चात लखनऊ आने पर पिताजी/नेताजी से आशीर्वाद लिया। pic.twitter.com/AZrQvKW55U — Aparna Bisht Yadav (@aparnabisht7) January 21, 2022 టిక్కెట్ దక్కదని తెలిసి.. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి సమాజ్‌వాదీ టికెట్‌పై పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడి పోటీ చేయాలని భావించిన అపర్ణా యాదవ్.. సమాజ్‌వాదీ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఆమెకు ఈసారి టిక్కెట్ ఇచ్చేందుకు అఖిలేశ్ సుముఖంగా లేకపోవడంతో తన దారి తను చూసుకున్నారు. మరి కంటోన్మెంట్ సీటును బీజేపీ ఆమెకు ఇస్తుందా, లేదా అనేది వేచిచూడాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రీటా బహుగుణ తన కుమారుడికి ఈ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. -
లాలూ, ములాయం భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌లు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. దీనిపై లాలూ ప్రసాద్ సమావేశపు ఫొటోలతో కూడిన ట్వీట్ చేశారు. అందులో ఆయన ‘దేశంలో మోస్ట్ సీనియర్ సోషలిస్టు మిత్రుడు ములాయం సింగ్‌ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాను. రైతులు, అసమానత, పేదరికం, నిరుద్యోగంపై పోరాడేం దుకు మాకు ఉమ్మడి భావాలున్నాయి’ అని పేర్కొ న్నారు. దేశంలో ఇప్పుడు సమానత, లౌకికత్వ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్
లక్నో: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ గురువారం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనను గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యానికి గురైన ములాయం సింగ్ యాదవ్‌ని ఆస్పత్రిలో చేర్చి అన్ని పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: నేను ములాయం సింగ్ -
అయోధ్యకు మాజీ సీఎం కోడలు విరాళం
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరిగిన మందిరాన్ని 1500 కోట్లతో నిర్మించాలని ఆలయ ట్రస్ట్ భావిస్తోంది. రానున్న మూడేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దీనికి అనుగుణంగానే డిజైన్‌ను సైతం సిద్ధంచేశారు. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ కూడా భాగస్వామ్యం కావాలని దేశ వ్యాప్తంగా హిందువులు, ఇతర వర్గాలు పరితమిస్తున్నారు. దీని కోసం తమ వంతుగా పెద్ద ఎత్తున విరాళాలను అందిస్తున్నారు. సామాన్యుడి నుంచి బడా వ్యాపారుల వరకు అందరూ విరాళాలు ఇస్తున్నారు. నిధుల సమీకరణపై ఓవైపు కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ.. వందలకోట్ల రూపాయాలు ట్రస్టుకు విరాళంగా అందుతున్నాయి. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుంటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు నిర్ణయించారు. దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా నిధులను సమీకరిస్తున్నారు. ట్రస్టు సభ్యులు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1511 కోట్ల రూపాయాలు అందాయి. ఫిబ్రవరి 27 వరకే నిధుల సేకరణ కార్యక్రమం జరుగనుంది. దీంతో విరాళాలు అందించేందుకు సామాన్యులు మొదలు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు రామాలయం కోసం తమ వంతుగా భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయ్ సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణయాదవ్ అయోధ్య మందిరానికి విరాళం అందించారు. తన వ్యక్తిగతంగా 11 లక్షల రూపాయాలను అందిస్తున్నట్లు శనివారం తెలిపారు. ఈ మేరకు తన నివాసానికి వచ్చిన రామభక్తులు, ప్రచారక్ సభ్యులకు చెక్‌ను అందించారు. తన కుటుంబ సభ్యుల తరఫున తాను విరాళం ఇవ్వలేదని, కేవలం తన వ్యక్తిగతమని అపర్ణ స్పష్టం చేశారు. కాగా యూపీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అపర్ణ యాదవ్ విరాళం ఇవ్వడం యూపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున ఆమె పోటీచేశారు. -
నేను ములాయం సింగ్
సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ జీవితం ఆధారంగా ‘మై ములాయం సింగ్ యాదవ్’ (నేను ములాయం సింగ్ యాదవ్) అనే సినిమా తెరకెక్కుతోంది. సువేందు రాజ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ములాయం పాత్రలో అమిత్ సేథి నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్ని విడుదల చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా సువేందు రాజ్ ఘోష్ మాట్లాడుతూ– ‘‘ములాయం సింగ్ యాదవ్ అనే పేరే ఎంతో శక్తివంతమైంది. ఒక రైతు కొడుకు ముఖ్యమంత్రిగా, అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారు. భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఆయన ఎంతో చేశారు. అలాంటి వ్యక్తి జీవితం గురించి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నా’’ అన్నారు. -
ములాయం త్వరగా కోలుకోవాలి
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో రెండు రోజుల క్రొతమే ఆసుపత్రి పాలైన ములాయం..సోమవారం తెల్లవారుజామున మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత ఐదు రోజుల్లోనే రెండు సార్లు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ములాయం సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అంతకుముందు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ , ములాయం సోదరుడు శివపాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం ఆరోగ్యం గురించి చాలామంది శ్రేయాభిలాషులు ఆందోళన చెందుతున్నారు..ప్రస్తుతం దేవుని దయ వల్ల ములాయంసింగ్ ఆరోగ్యం బాగానే ఉంది. దీర్ఘకాలం ఆయన జీవించాలని దేవుడిని ప్రార్థించండి" అంటూ కోరారు. श्री मुलायम सिंह यादव जी के अस्वस्थ होने का समाचार मिला। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वे उन्हें शीघ्र ही पूर्ण स्वस्थ करें। — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 10, 2020 -
ఆసుపత్రిలో చేరిన ములాయం సింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. కుడుపు నొప్పి కారణంగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆయన్ని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. 80 ఏళ్ల ములాయం సింగ్ కడుపునొప్పి, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. ములాయం సింగ్ కుమారుడు, ఎస్పీ ప్రస్తుత అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు గురువారం ఆయన్ని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్లారని రాజేంద్ర చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామనేది సాయంత్రంలోగా వెల్లడిస్తామని వైద్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ములాయంకు తీవ్ర అస్వస్థత; ముంబైకి తరలింపు
ముంబయి : సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ములాయంను ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ములాయంను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా తర్వాతే ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది సాయంత్రంలోగా వెల్లడిస్తామని వైద్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఓటమి షాక్‌తో ఒక్కటైన తండ్రీ కొడుకులు
లక్నో : ఓటమి నేర్పే గుణపాఠాలే సరైన దారిచూపుతాయనే రీతిలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పార్టీ వ్యవస్ధాపకుడు, పెద్దదిక్కైన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను సలహాల కోసం ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురైంది. దాదాపు రెండున్నరేళ్లు ములాయంను పక్కనపెట్టిన అఖిలేష్ యాదవ్‌కు వరుస ఓటములు పలకరించడంతో వాస్తవ పరిస్థితి బోధపడింది. పార్టీని అన్ని వర్గాలకు చేరువ చేసేందుకు తండ్రి మార్గదర్శకత్వం కోసం యువనేత వెంపర్లాడుతున్నారు. 2017లో యూపీ సీఎంగా వ్యవహరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం, ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో దోస్తీ కట్టినా మెరుగైన స్దానాలు రాకపోవడం అఖిలేష్‌ను ఆలోచనలో పడవేశాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. గతంలో తండ్రిని ఖాతరు చేయని అఖిలేష్ వరుస ఓటములతో మళ్లీ ఆయన సలహాల కోసం సంప్రదిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీపై నెలకొన్న యాదవుల పార్టీ ముద్రను చెరిపేసేందుకు యాదవేతర నేతలకూ ప్రాధాన్యత ఇవ్వాలని అఖిలేష్‌కు ములాయం సూచించినట్టు సమాచారం. పార్టీలో నిర్ణయాలు తీసుకునే క్రమంలో సీనియర్ నేతలను సంప్రదించాలని అఖిలేష్‌కు ఆయన సూచించారు. పార్టీ నుంచి దూరమైన శివపాల్ యాదవ్‌నూ చేరదీయాలని ములాయం తన కుమారుడిని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్ హయాంలో పార్టీలో కిందిస్ధాయి కార్యకర్తలు, నేతలతో సమాచార లోపం నెలకొందని, ఇక పార్టీ వర్గాలతో నేరుగా అఖిలేష్ సమాలోచనలు జరుపుతారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. -
ములాయంకు సీబీఐ క్లీన్చిట్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల్లో వాస్తవం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తును 2013 ఆగస్టు 7న ముగించామనీ, ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆధారాలేవీ తమకు లభించలేదని కోర్టుకు సీబీఐ చెప్పింది. ఈ కేసుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించింది. ములాయం, ఆయన కొడుకు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, మరో కుమారుడు ప్రతీక్ యాదవ్, అఖిలేశ్ భార్య డింపుల్ తదితరులపై అక్రమాదాయ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు విశ్వనాథ్ చతుర్వేది 2005లో పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా 2007లో సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణను నిలిపివేయాలంటూ ములాయం, ఆయన కొడుకులు వేసిన పిటిషన్‌ను 2012లో సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ, దర్యాప్తు కొనసాగించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటికీ డింపుల్ ప్రభుత్వ పదవిలో లేనందున ఆమెపై మాత్రం విచారణ నిలిపేయాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. 2012లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తాము విచారణ కొనసాగించగా, అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించారనేందుకు తమకు ప్రాథమిక ఆధారాలేవీ లభించలేదని సీబీఐ తన 21 పేజీల అఫిడవిట్లో పేర్కొంది. 2013 ఆగస్టు 7 నాటికే ఈ కేసులో విచారణను ముగించామంది. ప్రాథమిక ఆధారాలు కూడా లేనందున ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని సీబీఐ తెలిపింది. -
అక్రమాస్తుల కేసులో ములాయం, అఖిలేష్‌కు క్లీన్ చిట్
-
అక్రమాస్తుల కేసు : ములాయం, అఖిలేష్‌లకు క్లీన్చిట్
లక్నో : అక్రమాస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఊరట లభించింది. గురువారం ఈ కేసులో సీబీఐ తండ్రికొడుకులిద్దరికి క్లీన్చిట్ ఇచ్చింది. అంతేకాక అఖిలేష్, ములాయంల మీద రెగ్యూలర్ కేసు నమోదు చేసేందుకు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని సీబీఐ, సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ములాయం సింగ్ అధికారంలో ఉన్న రోజుల్లో వారి ఆస్తులు అనూహ్యంగా పెరగాయంటూ గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని మీద విచారణ చేపట్టాలంటూ విశ్వనాథ్ చతుర్వేదీ అనే వ్యక్తి 2005లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్, ప్రతీక్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్‌లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత 2012లో కోర్టు ఈ కేసు నుంచి డింపుల్ యాదవ్‌కు మినహాయింపు కల్పించింది. అయితే ఈ కేసులో సీబీఐ ఇంత వరకూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవటంతో విశ్వనాథ్ మరోసారి సుప్రీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈ ఏడాది మార్చిలో మరోసారి విచారణ చేపట్టిన కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ములాయం, అఖిలేష్‌ల కేసు దర్యాప్తు ఎంత వరకూ వచ్చిందో తెలుపుతూ.. రెండు వారాల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాంతో సీబీఐ నేడు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. -
కుటుంబ ‘రుణాలు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, సినీ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా.. వీరంతా తల్లి, కొడుకు, కూతురు తదితర కుటుంబసభ్యులకు బాకీ ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న వీరంతా కుటుంబ సభ్యులకు బకాయి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. రాహుల్ తన తల్లి సోనియా నుంచి అప్పు తీసుకోగా, ములాయం కొడుకు అఖిలేశ్ నుంచి, శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా నుంచి రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రాహుల్‌కు రూ.5 లక్షల అప్పు యూపీలోని అమేథీ నుంచి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తన తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నుంచి రూ.5 లక్షలను అప్పు రూపంలో తీసుకున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ఇది తప్ప ఇతర అప్పులేవీ లేవని తెలిపారు. సోనియా మాత్రం ఎవరి వద్దా రుణం తీసుకోలేదని పేర్కొన్నారు. యూపీలోని మైన్‌పురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ తన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ నుంచి రూ.2.13 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండో భార్య సాధనా యాదవ్‌కు రూ.6.75 లక్షలు, కొడుకు ప్రతీక్‌కు రూ.43.7 లక్షలు, కుటుంబ సభ్యురాలు మృదులా యాదవ్‌కు రూ.9.8 లక్షలు అప్పు ఇచ్చినట్లు ములాయం తెలిపారు. కూతురి నుంచి రూ.10 కోట్ల అప్పు పట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా తన కూతురు, సినీ నటి అయిన సోనాక్షి సిన్హాకి రూ.10.6 కోట్లు బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, తన కుమారుడు లవ్ సిన్హాకు రూ.10 లక్షలు, భార్య పూనమ్ తదితరులకు రూ.80 లక్షల మేర అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు. యూపీలో లక్నో నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పూనమ్ సిన్హా తన కూతురు సోనాక్షి నుంచి రూ.16 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎటువంటి రుణం లేదని వెల్లడించారు. శత్రుఘ్న సిన్హా ప్రత్యర్థి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎటువంటి బకాయిలు లేవని తెలిపారు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు, ఆర్జేడీ తరఫున పాటలీపుత్రలో బరిలో ఉన్న మిసా భారతి వ్యక్తిగత రుణాలు లేవని, తన భర్త శైలేష్ కుమార్‌కు మాత్రం రూ.9.85 లక్షల బ్యాంకు లోన్ ఉందని పేర్కొన్నారు. రుణాలు, అడ్వాన్సుల రూపంలో తాను రూ.28 లక్షలు, తన భర్త రూ.2.9 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీకి చెందిన ఆమె ప్రత్యర్థి రామ్‌కృపాల్ రూ.17.17 లక్షలు‡ తన కూతురి కోసం విద్యారుణం తీసుకున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగిగా పేర్కొన్న కన్హయ్యకుమార్ బిహార్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తనకు రూ.5.86 లక్షలు, తన భార్యకు రూ.26.5 లక్షలు రుణం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకు రూ.75 లక్షలు, తన భార్యకు రూ.15 లక్షల ఆస్తిపాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈయన ప్రత్యర్థిగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ బ్యాంకు అకౌంటు లేదని, నిరుద్యోగినని తెలిపారు. చండీగఢ్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని కిరణ్ ఖేర్ తన కుమారుడి నుంచి రూ.25 లక్షలు తీసుకున్నట్లు, భర్త, ప్రముఖ సినీ నటుడు అయిన అనుపమ్ ఖేర్‌కు రూ.35 లక్షలను రుణంగా ఇచ్చినట్లు చెప్పుకున్నారు. దక్షిణ ముంబై నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరా తన భార్య పూజాకు బదులు రూపంలో రూ.4.96 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. -
ఆస్పత్రిలో చేరిన ములాయం
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్ధాపక నేత ములాయం సింగ్ యాదవ్ అస్వస్ధతతో శుక్రవారం లక్నోలోని పీజీఐ ఆస్పత్రిలో చేరారు. ములాయం ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు ఆయనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. కొద్ది గంటల్లోనే ములాయంను డిశ్చార్జి చేస్తామని పీజీఐ వైద్యులు వెల్లడించారు. సాధారణ చెకప్ కోసమే ములాయం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు. రొటీన్ చెకప్‌లో భాగంగా తనకు గ్యాస్ర్టో, నరాల సంబంధిత సమస్యలపై ఆయన ఫిర్యాదు చేశారని పరీక్షల అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడైనట్టు వైద్యులు తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో మొయినాబాద్ నుంచి బరిలో నిలిచిన ములాయం ఇటీవల తన బద్ధ శత్రువు, బీఎస్పీ చీఫ్ మాయావతితో కలిసి ప్రచార వేదికను పంచుకున్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
ఎన్నికల అప్డేట్స్: పూణెలో ఓటేసిన రేణూదేశాయ్
► మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు వరకు 61.31 శాతం పోలింగ్ నమైదయింది. ► మహారాష్ట్రలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడోదశలో పోలింగ్ జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ నటి రేణూదేశాయ్ పూణెలోని ఖోత్రోడ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ► ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్ర బారామతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముర్షీదాబాద్ రానీనగర్ ప్రాంతంలోని 27, 28 నంబర్ పోలింగ్ బూత్‌ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ► మధ్యాహ్నం మూడు గంటల వరకు అస్సాంలో 62.13 శాతం, బిహార్‌లో 46.94 శాతం, గోవాలో 58.55 శాతం, గుజరాత్లో 50.36 శాతం, కశ్మీర్లో 10.64 శాతం, కర్ణాటకలో 49.96 శాతం, కేరళలో 55.05 శాతం, మహారాష్ట్రలో 44.70 శాతం, ఒడిశాలో 46.70, త్రిపూరలో 61.38 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 46.99 శాతం, పశ్చిమ బెంగాల్లో 67.52 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 55.29 శాతం, దాద్రానగర్ హవేలీలో 56.81 శాతం, డామన్ అండ్ డయ్యూలో 55.02 శాతం పోలింగ్ నమోదైంది. ► ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ గుజరాత్‌లోని ఉంజా పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మోదీ దేశానికి ఎంతో చేశారని.. ఇంకెంతో చేస్తారని అన్నారు. ► ఒడిశాలోని దెంకనల్‌లో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న అధికారి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. ► కేరళ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓటర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో మణి అనే వ్యక్తి చనిపోయాడు. మరోవైపు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఇద్దరు వృద్ధులు చనిపోయారు. తలిపరంబాలో పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి చేరుకున్న 72 ఏళ్ల వేణుగోపాల మరార్ అస్వస్థతకు లోనై మరణించారు. ► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాంలోని దిస్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► పశ్చిమ బెంగాల్ ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన పియార్యుల్ అనే ఓటర్ మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ► బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అహ్మదాబాద్‌లోని షాపూర్ హిందీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పోలింగ్ బూత్‌లోకి అనుకోని అతిథి వచ్చింది. కేరళలో కన్నూర్ జిల్లాలో ఓ పోలింగ్ బూత్‌లో అకస్మాత్తుగా ఓ పాము దర్శనమిచ్చింది. దీంతో అక్కడి ఓటర్లు, అధికారులు భయాందోళనలకు గురయ్యారు. పామును పట్టుకున్న తరువాత పోలింగ్ సజావుగా సాగుతోంది. ►సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైఫైలోని పోలింగ్‌బూత్‌లో వారు ఓటు వేశారు. భారత క్రికెటర్ చతేశ్వర పుజారా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. ►ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ బగేల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలే నిజమైన న్యాయనిర్ణేతలని, వారికి చెప్పాల్సింది చెప్పామని ప్రస్తుతం ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ►ఉదయం 11 గంటలకు వరకు నమోదైన పోలింగ్‌లో పశ్చిమ బెంగాల్(23.85) మొదటి స్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ వివరాలు (శాతాల్లో).. బీహార్ 20.80, గుజరాత్ 13.24, జమ్మూ కాశ్మీర్ 3.39, కర్ణాటక 12.72, కేరళ 21.09, మహారాష్ట్ర 9.03, ఒడిశా 8.67, త్రిపుర 15.28, ఉత్తరప్రదేశ్ 16.18, ఛత్తీస్‌ఘడ్ 19.31, దాద్రానగర్ హవేలి 11.40, డామన్ డయ్యూ 19.43 ►కాంగ్రెస్ సీనియర్ నేత, గుల్బర్గ ఎంపీ అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు హార్థిక్‌పటేల్ ఓటు వేశారు. సురేంద్రనగర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మలయాళ సూపర్స్టార్లు మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు కూడా ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముట్టి , తిరువనంతపురంలో మోహన్‌లాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►సామాజిక కార్యకర్త అన్నాహజారే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్దిలో ఏర్పాటుచేసిన పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు. ►వయనాడ్‌లో ఏర్పాటుచేసిన ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లి రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే పోటీచేయడంతో అందరి దృష్టి వయనాడ్‌పై పడింది. ►దేశ వ్యాప్తంగా 14రాష్ట్రాలు, రెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరగుతున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు పలు రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలు.. బిహార్‌లో 9.35, కర్ణాటకలో 6.02, అసోంలో 12.36, గోవాలో 9.30, గుజరాత్లో 6.76, కేరళలో 6.57, మహారాష్ట్రలో 3.79, ఒడిశాలో 4.98, త్రిపురలో 4.28, యూపీలో 9.80, బెంగాల్లో 16.23, ఛత్తీస్‌ఘడ్‌లో 9.59 శాతం నమోదైంది. ►ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. రాయిసన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సీనియర్ నాయకుడు శశిథరూర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటును వేశారు. ములాయం సింగ్ సోదరుడు అభయ్ సింగ్ యాదవ్.. మణిపురి నియోజకవర్గంలోని సైఫైలో ఓటు వేశారు. ►బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటు వేశారు. అహ్మదాబాద్‌లోని నరన్పురా సబ్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన తన సతీమణి సొనాల్ షాతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పినరయి గ్రామంలో ఆర్సీ అమల బేసిక్ యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కేరళ సీఎం ఓటు వేశారు. ►వికలాంగులు, ముసలివాళ్లు అందరూ పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటుండగా.. నవ వధూవరులు సైతం ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద వీరు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణి అంజలితో కలిసి రాజ్‌కోట్‌లోని అనిల్ జ్ఞాన్ మందిర్ పాఠశాలలో ఓటు వేశారు. కేరళ గవర్నర్ పి. సదాశివం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశాలోని తాల్చేర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓటు వేశారు. ►గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి సఖాలి నియోజకవర్గంలో ఓటు వేశారు. భువనేశ్వర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అపరాజితా సారంగి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐఆర్సీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ►ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాణిప్ పోలింగ్ కేంద్రంలో క్యూలైనులో నిలబడి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం కలిగిందన్నారు. భారత ఓటర్లు విజ్ఞత కలవారని ప్రశసించారు. ►కేరళ సీఎం పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కన్నూర్ జిల్లాలోని పినరయిలోని ఆర్సీ అమల బేసిక్ యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కేరళ సీఎం ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చున్నారు. ►ప్రధాని నరేంద్రమోదీ నేడు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాసేపటి క్రితమే గాంధీనగర్‌లోని తన తల్లి ఇంటికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. బీహార్‌లోని సుపాల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 151 బూత్ నెంబర్లో నిర్వహించిన మాక్‌పోలింగ్‌లో ఈవీఎం మొరాయించడంతో.. ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ►పశ్చిమ బెంగాల్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. మహారాష్ట్రలోని ఓ సీనియర్ సిటిజన్ తన ఓటు హక్కును వినియోగించేందుకు వీల్‌చైర్‌పై పోలింగ్ బూత్‌కు వచ్చారు. పుణేలోని మేయర్ కాలనీలోని బూత్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ పెద్దాయనకు సహాయం చేశారు. ఎన్నికల్లో తమకు విజయం చేకూరాలని కర్ణాటక మాజీ సీఎం యాడ్యూరప్ప, బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ పూజలు నిర్వహించారు. షిమోగ జిల్లాలోని శికాయిపురాకు చెందిన హుచార్య దేవాలయాన్ని యాడ్యూరప్ప సందర్శించగా.. కాలాబురాగిలోని శరణ బసవేశ్వరాలయాన్ని బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ►దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. నేడు 14 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుజరాత్(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్(7), ఒడిశా(6), బిహార్ (5), బెంగాల్(5), గోవా(2), దాద్రనగర్ హవేలీ, డామన్డయ్యూ, త్రిపురలో చెరో స్థానానికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 14 రాష్ట్రాల్లో మొత్తం 2.10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. -
24 ఏళ్లకు ఒకే వేదికపై..
మైన్‌పురి / న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. గత 24 ఏళ్లుగా ఉప్పు–నిప్పుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఒకే వేదికను పంచుకున్నారు. ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. యూపీలోని మైన్‌పురిలో క్రిస్టియన్ కాలేజీ గ్రౌండ్ ఇందుకు వేదికైంది. ఎస్పీ కంచుకోట అయిన మైన్‌పురిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ములాయం, బీఎస్పీ చీఫ్ మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, మద్దతుదారులను ఉద్దేశించి ములాయం మాట్లాడుతూ.. ‘చాన్నాళ్లకు మేమిద్దరం ఒకే వేదికపై మాట్లాడుతున్నాం. మాయావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు మద్దతివ్వాలని ఆమెను కోరుతున్నా’ అని అన్నారు. ప్రధాని మోదీ నకిలీ బీసీ: మాయావతి ములాయం అనంతరం మాయావతి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘గెస్ట్ హౌస్ ఘటన తర్వాత కూడా నేను ములాయం జీ తరఫున ప్రచారం కోసం ఇక్కడికి ఎందుకు వచ్చానని చాలామంది ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. కొన్నికొన్ని సార్లు ప్రజా, దేశ, పార్టీ ప్రయోజనాల రీత్యా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ములాయం జీ సమాజంలోని అన్నివర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకున్న మోదీ, తన అగ్రకులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. కానీ ప్రధాని మోదీలా ములాయం నకిలీ వ్యక్తి, అబద్ధాలకోరు కాదు. ఆయన వెనుకబడ్డ కులంలోనే జన్మించారు. ములాయం నిజమైన నేత’ అని ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా యూపీలోని 80 లోక్‌సభ సీట్లకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో కలిసి పోటీచేస్తున్నాయి. రాయ్‌బరేలీ(సోనియాగాంధీ), అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం ఈ ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థులను నిలబెట్టలేదు. ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీ పొత్తు: బీజేపీ ములాయం–మాయావతి కలిసి మైన్‌పురి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై బీజేపీ మండిపడింది. ఈ విషయమై బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ, తుపాను లాంటి మోదీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఎద్దేవా చేశారు. యూపీలో ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీలు చేతులు కలిపాయని దుయ్యబట్టారు. ఇందుకోసం తన జీవితంలో జరిగిన అతిపెద్ద అవమానాన్ని(గెస్ట్‌హౌస్ ఘటన) మాయావతి దిగమింగారన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావగా తయారైందని చతుర్వేదినుద్దేశించి అన్నారు. పాతికేళ్లనాటి పంచాయితీ! ములాయం, మాయావతి బద్ధ విరోధులుగా మారడానికి కారణమైన గెస్ట్‌హౌస్ ఘటన 1995 జూన్‌లో జరిగింది. ములాయం నేతృత్వంలోని ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వం యూపీలో కొనసాగుతోంది. కొత్త సర్కార్ కొలువుదీని అప్పటికి ఏడాదిన్నర. అంతలోనే బీఎస్పీ అధినేత కాన్షీరాం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తారని ములాయంకు జూన్ 1న సమాచారం అందింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే బీఎస్పీని చీల్చాలనీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయాలని కొంతమంది ఎస్పీ నేతలు భావించారు. అదేసమయంలో అప్పటి బీఎస్పీ ప్రధాన కార్యదర్శి మాయావతి రాష్ట్రప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో జూన్ 2న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఎస్పీ ఎమ్మెల్యేలు, జిల్లాల నేతలు అనుచరులతో కలిసి ఆయుధాలతో గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను చితక్కొట్టారు. గదిలో దాక్కోవడంతో మామావతి తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఎస్పీ సర్కారుకు బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకోవడం, బీజేపీ, జనతాదళ్ పార్టీల బయటినుంచి మద్దతు ఇవ్వడంతో మాయావతి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. -
24 ఏళ్ల తర్వాత మళ్లీ వాళ్లిద్దరూ ...
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ ... 24 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి వేదికను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ మణిపూరిలో శుక్రవారం జరిగిన ర్యాలీలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. వీరిద్దరితో పాటు ఎస్పీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్ తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న బీఎస్పీ చీఫ్ మాయావతి ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. వెనుకబడిన వర్గాలకు ములాయం రియల్ హీరో అని, అంతేకాకుండా మొయిన్‌పురిలో ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. దేశ భవిష్యత్ కోసమే విభేదాలు పక్కనపెట్టి ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయని మాయావతి తెలిపారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాటకాలు, అబద్దాలు పని చేయవన్నారు. ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాలకు మోదీ చేసిందేమీ లేదని మాయావతి విమర్శలు గుప్పించారు. వెనుకబడిన వర్గాల కోసమే ఎస్పీ, బీఎస్పీ ఆలోచిస్తాయని, తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాలు, పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆమె హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని అన్నారు. ఇక ములాయం సింగ్‌కు సరైన వారసుడు అఖిలేష్ యాదవే అని మాయావతి పేర్కొన్నారు. మరోవైపు మాయావతి తనకు మద్దతుగా ప్రచారం చేయడంపై ములాయం సింగ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ మాయావతిని గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మళ్లీ మాయావతితో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన ఎస్పీ - బీఎస్పీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకనాటి ప్రత్యర్థి పక్షాలు సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు చేతులు కలిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని దూరంపెట్టి ఈ రెండు పార్టీలు యూపీలోని 80 సీట్లకుగాను చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. -
కుటుంబ కథా చిత్రం
కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గెలిచిన ఐదు సీట్లూ పార్టీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు పోటీ చేసినవే. ఈసారి ఈ ఐదు స్థానాల్లో మూడు చోట్ల ఎస్పీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్టు కనిపిస్తున్నారు. మిగిలిన రెండు సీట్లలో (కనౌజ్, ఫిరోజాబాద్) ములాయం కోడలు డింపుల్, ఆయన అన్న మనవడు అక్షయ్ యాదవ్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో ములాయం సొంత స్థానం మైనపురీ, తూర్పు యూపీలోని ఆజమ్గఢ్ నుంచి పోటీచేసి గెలిచారు. మైన్‌పురీ సీటుకు రాజీనామా చేశాక జరిగిన ఉప ఎన్నికలో ఆయన అన్న రతన్‌సింగ్ యాదవ్ మనవడు తేజ్‌ప్రతాప్ విజయం సాధించారు. కోడలు డింపుల్ తమ కంచుకోటగా భావించే కనౌజ్ నుంచి మూడోసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. వరుసకు తమ్ముడైన ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌యాదవ్ కొడుకు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్‌లో తొలిసారి విజయం సాధించారు. బదాయూన్ నుంచి ములాయం మరో అన్న అభయ్‌రాం కొడుకు ధర్మేంద్ర యాదవ్ ఎస్పీ టికెట్‌పై విజయం సాధించారు. ఈ ఐదుగురూ మళ్లీ తమ పాత నియోజకవర్గాల నుంచే ఎస్పీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ మిత్రపక్షం బీఎస్పీ ఎస్పీకి మద్దతు ఇవ్వడం. అంతేకాదు, కాంగ్రెస్ ఈ స్థానాల్లో ఒక్కచోటే అభ్యర్థిని నిలిపింది. కనౌజ్లో డింపుల్‌కు గట్టి పోటీ? గతంలో రెండుసార్లు (2012 ఉప ఎన్నిక, 2014) కనౌజ్ నుంచి గెలిచిన డింపుల్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఎస్పీ, అధ్యక్షుడైన ఆమె భర్త అఖిలేశ్ అంతకు ముందు మూడు సార్లు, మామ ములాయం ఒకసారి విజయం సాధించిన స్థానం ఇది. 2019లో డింపుల్‌కు బీఎస్పీ మద్దతు ఉంది. కాంగ్రెస్ ఇక్కడ పోటీ పెట్టలేదు. ములాయం తమ్ముడు, మాజీ మంత్రి శివపాల్‌సింగ్ కూడా తన సొంత పార్టీ ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) తరఫున మొదట అభ్యర్థిని ప్రకటించి తర్వాత నామినేషన్ వేయించకపోవడంతో డింపుల్ సునాయాసంగా గెలవాలి. అయితే, 2014లో ఆమె సమీప బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాఠక్‌పై కేవలం 19 వేలకు పైగా ఓట్లతోనే విజయం సాధించారు. మళ్లీ బీజేపీ టికెట్‌పై పాఠక్ పోటీచేస్తున్నారు. ఈ ముఖాముఖి పోటీలో పాఠక్ నుంచి డింపుల్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 1999 నుంచీ ఎస్పీ గెలుచుకుంటున్న కనౌజ్లో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 18.5 లక్షలు. వారిలో ముస్లింలు 3 లక్షలు, యాదవులు 2.5 లక్షలు, దళితులు మూడు లక్షలు, బ్రాహ్మణులు రెండు లక్షల మంది ఉన్నారు. బ్రాహ్మణుడైన బీజేపీ అభ్యర్థి పాఠక్ ఈసారి డింపుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఫిరోజాబాద్‌లో ముసలం ఫిరోజాబాద్ ప్రస్తుత ఎంపీ అక్షయ్ తండ్రి, ములాయంకు వరుసకు సోదరుడైన రాంగోపాల్ 2014లో తన కొడుకుకు పార్టీ టికెట్ ఇప్పించడంలో విజయం సాధించారు. కాని, ములాయం తమ్ముడు శివపాల్ తన కొడుకు ఆదిత్యకు ఫిరోజాబాద్ టికెట్ వస్తుందని ఆశించారు. ఫలితంగా తమ్ముడు, వరుసకు తమ్ముడి మధ్య అప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పగ్గాలు అఖిలేశ్ చేతుల్లోకి పోవడంతో ఇవి ముదిరాయి. పీఎస్పీ పార్టీ పెట్టిన శివపాల్ ఇప్పుడు తానే స్వయంగా ఫిరోజాబాద్‌లో అక్షయ్‌పై పోటీకి దిగి రాంగోపాల్‌పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అక్షయ్‌కు ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చంద్రసేన్ జాదోన్ నుంచి గట్టి పోటీ ఉంది. శివపాల్‌సింగ్ కూడా రంగంలో ఉండటంతో ఎస్పీ మద్దతుదారుల ఓట్లు చీలి బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఏర్పడింది. అయితే, తమ ఎన్నికల ప్రచారం లక్ష్యం శివపాల్‌ను గెలిపించడమేనని, ఆయన విజయం ఖాయమని పీఎస్పీ నేత రాందర్శన్ యాదవ్ చెప్పారు. శివపాల్ పోటీ వల్ల ఇక్కడ యాదవులు, ముస్లింల ఓట్లు చీలిపోయే మాట నిజమేగాని అక్షయ్ గెలుస్తారని జిల్లా ఎస్పీ నేత సుమన్ దేవి భర్త రఘువీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంపీగా ఎన్నికయ్యాక అక్షయ్ నియోజవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో వారు కోపంతో ఉన్న మాట వాస్తవమే. కాని, ఈ సమస్య పరిష్కరించాం’ అని ఆయన వివరించారు. బీజేపీ అభ్యర్థి జాదోన్ ఎన్నికల బరిలో దిగడం ఇదే మొదటిసారి. 2014లో ఓడిన బీజేపీ అభ్యర్థి ఎస్పీ బాఘేల్‌ను ఇక్కడ పోటీకి దింపకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొన్నది. ఈ సీటులో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని నిలపలేదు. 2009లో కనౌజ్‌తో పాటు ఫిరోజాబాద్ నుంచి కూడా ఎన్నికైన అఖిలేశ్ రాజీనామా చేశాక ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య డింపుల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. ఆజంగఢ్‌లో అఖిలేశ్.. ఆజంగఢ్‌లో తొలిసారి పోటీచేస్తున్న అఖిలేశ్‌పై భోజ్‌పురీ నటుడు దినేశ్‌లాల్ యాదవ్ ‘నిరాహువా’ను బీజేపీ బరిలోకి దింపింది. అఖిలేశ్ సీఎంగా ఉన్న కాలంలోనే ఈ నటుడికి సీఎం చేతుల మీదుగా ‘యశ్భారతీ’ అవార్డు ప్రదానం చేశారు. ఇక్కడ మాత్రం శివపాల్‌యాదవ్ పార్టీ పీఎస్పీ తన అభ్యర్థిని పోటీకి దింపలేదు. ఇక్కడ అఖిలేశ్ విజయం నల్లేరు మీద నడకగా సాగిపోతుందని అంచనా. మైన్‌పురీ నుంచి ములాయం మళ్లీ.. 2014 ఎన్నికల్లో ములాయం సొంత నియోజకవర్గం మైన్‌పురీలో బీజేపీ ప్రత్యర్థి శత్రుఘన్సింగ్ చౌహాన్‌ను భారీ మెజారిటీతో ఓడించారు. అనంతరం ములాయం రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన అన్న మనవడు తేజ్‌ప్రతాప్ తన బీజేపీ ప్రత్యర్థి ప్రేంసింగ్ శాక్యాను మూడు లక్షల 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇప్పుడు మళ్లీ ములాయం ఇక్కడి నుంచే బరిలోకి దిగగా, ఆయనపై బీజేపీ నుంచి ప్రేంసింగ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పోటీలో లేదు. బదాయూన్‌లో త్రిముఖ పోటీ ములాయం అన్న మనవడు, సిట్టింగ్ సభ్యుడు ధర్మేంద్ర మళ్లీ పోటీ చేస్తున్న బదాయూన్‌లో బీజేపీ తరఫున యూపీ కేబినెట్ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కూతురు సంఘమిత్ర బరిలోకి దిగారు. 2014లో ఆమె బీఎస్పీ అభ్యర్థిగా మైన్‌పురీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2016లో సంఘమిత్ర తన తండ్రితోపాటు బీజేపీలో చేరారు. ఇక్కడ పీఎస్పీ అభ్యర్థిని నిలపకపోవచ్చని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సలీం షేర్వానీ పోటీ చేస్తున్నారు. ఆయన 1996 నుంచి ఎస్పీ తరఫున మూడుసార్లు పోటీచేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరి ఇక్కడ నుంచి ఆ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. -
2013లోనే ములాయంపై కేసు మూసేశాం
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు,సమాజ్‌వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్‌యాదవ్‌లపై నమోదయిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రాథమిక విచారణను 2013లోనే ముసివేశామని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. సీబీఐ మౌఖిక నివేదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన దాఖలైన తాజా పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని సీబీఐని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ అధ్యక్షతన గల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ ఏ స్థాయిలో ఉందో తెలపాలని కోరుతూ కాంగ్రెస్ నేత విశ్వనాథ్చతుర్వేది తాజాగా పిటిషన్దాఖలు చేశారు. ములాయం రెండో కుమారుడు ప్రతీక్‌ను కూడా తాజా పిటీషన్లో చేర్చారు. దీనిని మార్చి25న విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు రెండు వారాల్లోగా దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా సీబీఐ న్యాయవాది తుషార్ మెహతా,సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌లను ఆదేశించింది. ఈ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా, రాజకీయంగా తనను దెబ్బతీయడానికి, ఎన్నికల్లో తన పరువు తీయడానికే చతుర్వేదీ ఈ పిటషన్ దాఖలు చేశారని ములాయం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ,ఆదాయం పన్ను శాఖల అధికారులు 2005లోనే దర్యాప్తు జరిపారని, తమనేరాన్ని నిరూపించే ఆధారాలేమీ వారికి లభించలేదని తెలిపారు. చతుర్వేది ఆ పాత కేసును తిరగదోడటం ద్వారా తమ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.తాను, తన కుమారుడు అఖిలేశ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిసి రాజకీయ దురుద్దేశంతోనే చతుర్వేది ఈ పిటిషన్ దాఖలు చేశారన్నారు.తమపై పెట్టిన కేసులో సీబీఐ రెండేళ్ల పాటు దర్యాప్తు జరిపినా ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయిందని ములాయం తెలిపారు. -
బరిలో కోటీశ్వరులు
లోక్‌సభ 2019 ఎన్నికలకు తొలి దశ పోలింగ్ మొదలైంది. మొత్తం ఏడు దశల్లో 545 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ దశల్లో జరగబోయే పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండుచోట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల అఫిడవిట్లలో.. ఆస్తులు, అప్పులు, స్థిర చరాస్తులు, భూముల వివరాలు ఇలా ఉన్నాయి. ములాయంసింగ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: మణిపురి ప్రకటించిన ఆస్తులు: రూ.20.54 కోట్లు 2014లో ఆస్తులు: రూ.15.95 కోట్లు స్థిరాస్తులు: రూ.16.21 కోట్లు (2014: రూ.12.54 కోట్లు) చరాస్తులు: రూ.4.33 కోట్లు (2014: రూ.3.41 కోట్లు) పెట్టుబడులు: రూ.50.09 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.40.13 లక్షలు (ములాయంసింగ్ యాదవ్: రూ.11.25 లక్షలు, భార్య పేరిట: 28.88 లక్షలు) అప్పులు: రూ.2.2 కోట్లు క్రిమినల్ కేసులు: లక్నోలో ఒక కేసు అధీనంలోని భూమి: రూ.7.89 కోట్ల విలువైన 10.77 ఎకరాలు, 5,000, 5,974 చ.అ. ప్లాట్లు, 16,010, 3,230 చ.అ. వైశాల్యం గల రెండు ఇళ్లు. అమిత్ షా (బీజేపీ జాతీయ అధ్యక్షుడు) పోటీ చేస్తున్న స్థానం: గాంధీనగర్ ప్రకటించిన ఆస్తులు: రూ.30.81 కోట్లు స్థిరాస్తులు: రూ.15.29 కోట్లు చరాస్తులు: రూ.23.51 కోట్లు పెట్టుబడులు: రూ.21.95 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.37.61 లక్షలు అప్పులు: రూ.47.69 లక్షలు క్రిమినల్ కేసులు: పశ్చిమ బెంగాల్, బిహార్‌లో రెండు చొప్పున మొత్తం నాలుగు అధీనంలోని భూమి: 22 ఎకరాల పొలం, 3,511, 59,890 చ.అ. వ్యవసాయేతర ప్లాట్లు రెండు. సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: బారామతి ప్రకటించిన ఆస్తులు: రూ.140.88 కోట్లు 2014లో ఆస్తులు: రూ.116.46 కోట్లు స్థిరాస్తులు: రూ.22.55 కోట్లు (2014: రూ.17.47 కోట్లు) చరాస్తులు: రూ.118.33 కోట్లు (2014: రూ.98.99 కోట్లు) పెట్టుబడులు: రూ.97.86 కోట్లు (రూ.16.74 సుప్రియా సూలే పేరిట, రూ. 81.12 కోట్లు భర్త సదానంద సూలే పేరిట) చేతిలో ఉన్న నగదు: రూ. 94,320 (సుప్రియ పేరిట: రూ.28,770, భర్త సదానంద్: పేరిట రూ.23,050, కుమార్తె రేవతి పేరిట రూ.28,900, కొడుకు విజయ్ పేరిట రూ.13,600) అప్పులు: రూ.55 లక్షలు క్రిమినల్ కేసులు: లేవు అధీనంలోని భూమి: రూ.2.7 కోట్ల విలువైన 16.7 ఎకరాలు. రూ.1.03 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి 1.77 ఎకరాలు. 2765, 2541 చ.అ. విస్తీర్ణంలో ఉన్న రెండు ఇళ్లు. భర్త సదానంద్ పేరుతో 4,442 చ.అ. ఇల్లు మరొకటి). నితిన్ గడ్కరీ (బీజేపీ) పోటీ చేస్తున్న స్థానం: నాగ్‌పూర్ ప్రకటించిన ఆస్తులు: రూ.25.12 కోట్లు 2014లో ఆస్తులు: రూ.28.04 కోట్లు స్థిరాస్తులు: రూ.69.38 లక్షలు చరాస్తులు: రూ.91.99 లక్షలు పెట్టుబడులు: రూ.3.55 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.8.99 లక్షలు, భార్య పేరిట రూ.11 లక్షలు) ∙అప్పులు: రూ.1.57 కోట్లు ∙క్రిమినల్ కేసులు: లేవు ∙అధీనంలోని భూమి: నాగ్‌పూర్‌లోని ధపేవాడలో 29 ఎకరాలు. ఇందులో 15 ఎకరాలు భార్య పేరుతో, 14.60 ఎకరాలు కుటుంబ ఉమ్మడి ఆస్తిగా నమోదైంది. నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో పూర్వీకుల ఇల్లు, ముంబైలోని ఎమ్మెల్యే సొసైటీలో ఒక ఫ్లాట్. ఊర్మిళ మటోండ్కర్ (కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: ముంబై నార్త్ ప్రకటించిన ఆస్తులు: రూ.68.88 కోట్లు స్థిరాస్తులు: రూ.41.24 కోట్లు చరాస్తులు: రూ.27.64 కోట్లు క్రిమినల్ కేసులు: లేవు ప్రియా దత్ (కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: ముంబై నార్త్ సెంట్రల్ స్థిరాస్తులు: రూ.72 కోట్లు (2014: రూ.60.30 కోట్లు) చరాస్తులు: రూ.24.20 కోట్లు (2014: రూ.6 కోట్లు) పెట్టుబడులు: రూ.55.50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్:రూ.8.05 కోట్లు అప్పులు: రూ.3.5 కోట్లు క్రిమినల్ కేసులు: లేవు డింపుల్‌యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: కనౌజ్ ప్రకటించిన ఆస్తులు: రూ.37.78 కోట్లు 2014లో ఆస్తులు: రూ.28.04 కోట్లు స్థిరాస్తులు: రూ..26.20 కోట్లు (2014: రూ.21.71 కోట్లు) చరాస్తులు: రూ.11.58 కోట్లు (2014: రూ.6.33 కోట్లు) పెట్టుబడులు: రూ.55.50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.8.05 కోట్లు అప్పులు: రూ.14.26 లక్షలు క్రిమినల్ కేసులు: లేవు అధీనంలోని భూమి: రూ.8.39 కోట్ల విలువైన 18.74 ఎకరాలు, 925.36 చదరపు అడుగుల ప్లాట్. రెండు ఇళ్లు. రాహుల్ గాంధీ (కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు) పోటీ చేస్తున్న స్థానం: వయనాడ్ (కేరళ) ప్రకటించిన ఆస్తులు: రూ.15.88 కోట్లు 2014లో ఆస్తులు: రూ.9.4 కోట్లు స్థిరాస్తులు: రూ.10.08 కోట్లు (2014: రూ.1.32 కోట్లు) చరాస్తులు: రూ.5.80 కోట్లు (2014: రూ.8.07 కోట్లు) ∙అప్పులు:రూ.72 లక్షలు క్రిమినల్ కేసులు: 5 (పరువు నష్టం దావాలు నాలుగు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన కేసు మరొకటి నమోదై ఉంది) -
‘అప్పుడు వాళ్లింట్లో కుక్కలు కూడా ఎమ్మెల్సీలే’
లక్నో : సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌పై స్థానిక బీజేపీ నేత తేజేంద్ర నిర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ములాయం కుటుంబం నుంచి గనుక ఎవరైనా ప్రధాన మంత్రి గనుక అయితే.. వాళ్లింట్లోని కుక్కలు కూడా ఎమ్మెల్సీలు అవుతాయని తేజేంద్ర వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ ఒకవేళ ములాయం సింగ్ కుటుంబానికి ప్రధాని పదవి దక్కితే.. వాళ్ల కుటుంబ సభ్యులు మొత్తం రాజ్యసభలో ప్రవేశిస్తారు. అప్పుడు ములాయం ఇంట్లోని కుక్కలు కూడా ఎమ్మెల్సీలు అవుతాయి. ఇలా కాకుండా మాయావతికి గనుక ఆ పదవి దక్కితే వాళ్ల ఇరుగు పొరుగు వారు, బంధువులు ఎమ్మెల్సీలు అవుతారు’ అని జితేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రిలో చేరడం ఖాయం.. ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తారన్న జితేంద్ర... ‘ ప్రతిపక్షంలో ఉండి ప్రధాని పదవి చేపట్టాలని ఆశిస్తున్న ప్రతీ ఒక్క నేతకు సవాల్ విసురుతున్నా. ప్రతిరోజూ 18 గంటల చొప్పున ఎనిమిది రోజుల పాటు ఏకదాటిగా పనిచేస్తే.. ఆ తర్వాతి రోజు వారంతా కచ్చితంగా ఆస్పత్రి పాలవుతారు. ఇందుకు నాది గ్యారెంటీ’ అని పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టులో ములాయం కుటుంబానికి చుక్కెదురు
న్యూఢిల్లీ: ములాయం సింగ్ కుటుంబానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్‌లకు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో వ్యతిరేకంగా నమోదైన అభియోగాలను దర్యాప్తు నివేదికలో పొందుపరచాలని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్, ప్రస్తుత దర్యాప్తు పత్రాలతో సహ దీనికి సంబంధించిన మరింత సమాచారాన్నిసేకరించి రెండు వారాల్లో సీబీఐ తమ బాధ్యతను నిర్వహించాలని సూచించింది. కేసు దర్యాప్తును కోర్టుకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది. కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది వేసిన పిటిషన్‌ను విచారించిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. -
ములాయం స్టార్ క్యాంపెయినర్ కాదా?
లక్నో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ పేరు లేకుండానే శనివారం ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ స్థానం అయిన ఆజంగఢ్ నుంచి ఈసారి ములాయం కొడుకు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో నిలవనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ శనివారం 40 మంది నేతలతో కూడిన ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. ఇందులో అఖిలేశ్, ఆయన భార్య డింపుల్‌తోపాటు నేతలు ఆజంఖాన్, రామ్‌గోపాల్, జయా బచ్చన్ తదితరుల పేర్లున్నాయి. ములాయం పేరు లేదు. పొరపాటును గుర్తించిన పార్టీ నాయకత్వం వెంటనే ఆ జాబితాలో ఆయన పేరును చేర్చి మరో లిస్టును ఎన్నికల సంఘానికి పంపించింది.. -
50 ఏళ్ల నిరీక్షణ.. ఈ సారైనా విజయం దక్కెనా?
లక్నో : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ 16 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్ని ఎన్నికలు వచ్చినా కొన్ని నియోజకవర్గాల ఫలితాల్లో మాత్రం మార్పుండదు. ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన మైన్‌పూరి నియోజక వర్గం గురించి. సమాజ్‌వాద్ పార్టీకి పెట్టని కోటగా నిలిచిన ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం జనసంఘ్, బీజేపీ దాదాపు 50 ఏళ్లుగా దండయాత్రలు చేస్తూనే ఉన్నాయి. ఆఖరికి 2014లో దేశవ్యాప్తంగా మోదీ హవా ప్రభంజనం సృష్టించినప్పటికి మైన్‌పూరి నియోజకవర్గ ఫలితాన్ని మాత్రం ప్రభావితం చేయలేకపోయింది. ఓ సారి గతాన్ని పరిశీలించనట్లయితే.. 1967లో మైన్‌పూరి నియోజకవర్గంలో తొలిసారి జనసంఘ్ తరఫున జగ్దీష్ సింగ్ పోటీ చేసి 46, 627 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత 1971, 1977, 1980, 1984, 1989 సంవత్సరాలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనసంఘ్, బీజేపీ తరఫున అభ్యర్థులేవరు ఇక్కడ పోటీ చేయలేదు. దాదాపు 24 ఏళ్ల తర్వాత 1991లో బీజేపీ తరఫున రామ్ నరేష్ అగ్నిహోత్రి మైన్‌పూరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ 1. 14 లక్షల ఓట్లు సంపాదించి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత 1996లో ఉపదేశ్ సింగ్ చౌహన్ బీజేపీ తరఫున బరిలో నిలిచాడు. కానీ ములాయం సింగ్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఉపదేశ్ సింగ్ కూడా 2. 21 లక్షల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఇక 1998లో జరిగిన లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల్లో మైన్పూర్ నియోజకవర్గంలో ఏకంగా 53 మంది అభ్యర్థులు పోటికి దిగారు. వారిలో బీజేపీకి చెందిన అశోక్ యాదవ్ ఒకరు. కానీ సమాజ్‌వాద్ పార్టీ తరఫున పోటీ చేసిన బలరాం సింగ్ యాదవ్‌నే విజయం వరించింది. అయితే 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బలరాం సింగ్ యాదవ్ ఓటమి చవి చూశారు. కారణం ఏంటంటే 2004 ఎన్నికల సమయంలో ఆయన ఎస్పీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరడమే కాక ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ములయాం సింగ్ యాదవ్ చేతిలో ఓటమి చవి చూశారు. ఇక 2014లో దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీచినప్పటికి మైన్‌పూరి నియోజకవర్గంలో మాత్రం బీజేపీ ఓటమి చవి చూడక తప్పలేదు. 2014లో మైన్పూర్లో పోటీ చేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ములాయం చేతిలో ఓటమి పాలయ్యారు. మరి ఈ సారి ఇక్కడ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో నెల రోజులు ఎదురు చూడాల్సిందే. -
24 ఏళ్ల తర్వాత తొలిసారి ములాయం కోసం
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ రాజకీయాల్లో దిగ్గజాలైన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మధ్య దశాబ్దాలు సాగిన బద్ధవైరానికి త్వరలోనే అధికారికంగా ముగింపు పడబోతోంది. ములాయం సింగ్‌తోనే వేదిక పంచుకోవడమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి నియోజకవర్గంలో ఆయన తరఫున మాయావతి ప్రచారం నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ 19వ తేదీన ఎస్పీ మెయిన్‌పురిలో నిర్వహించనున్న సభకు హాజరుకావాలని మాయావతి నిర్ణయించారు. యూపీ రాజకీయాలను కుదిపేసిన 1995 నాటి గెస్ట్‌హౌస్ సంఘటన తర్వాత మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ఎప్పుడు కలిసి పనిచేయలేదు. అప్పట్లో గెస్ట్‌హౌస్‌లో మాయావతి ఉండగా.. ఎస్పీ కార్యకర్తలు, నేతలు దాడులు జరిపారు. అయితే, ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ శత్రుత్వాన్ని పక్కనబెట్టి.. ఎస్పీ-బీఎస్పీ లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. యూపీలో మోదీని, బీజేపీని నిలువరించేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. అయితే, గెస్ట్‌హౌస్ అవమానాన్ని మరిచిపోయి.. మాయావతి ఎస్పీతో చేతులు కలిపిందని బీజేపీ చేస్తున్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు ములాయంతో వేదిక పంచుకునేందుకు మాయావతి సిద్ధమయ్యారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తులో భాగంగా అఖిలేశ్, మాయావతి కలిసి యూపీలో మొత్తం 11 ర్యాలీల్లో సంయుక్తంగా పాల్గొనబోతున్నారు. -
యూపీ కురువృద్ధుడు
సాక్షి వెబ్ ప్రత్యేకం : దేశ రాజకీయాల్లో ఆయన ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించారు. జాతీయ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కీలకనేత. నేడు ఇంటిపోరుతో సతమతమవుతున్నా... ఒకనాడు దేశరాజకీయాలను తనచుట్టూ తిప్పుకున్న సీనియర్ నాయకుడు ములాయం సింగ్ యాదవ్. పెద్ద కొడుకు అఖిలేష్, తమ్ముడు శివపాల్ యాదవ్, ఎస్పీ సీనియర్ నేత అమర్‌సింగ్ మధ్య తలెత్తిన విభేదాలు సమాజ్‌వాదీ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పరాజయానికి ఈ విభేదాలే ప్రధాన కారణమయ్యాయి. సీఎం అఖిలేష్ నిర్ణయాలతో ములాయం తీవ్రంగా వ్యతిరేకించడంతో.. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దాంతో ఎస్పీ రెండుగా చీలిపోయి.. పార్టీ గుర్తు కోసం తండ్రీ కొడుకుల మధ్య వార్ నడిచింది. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న ములాయం.. పార్టీలో కేవలం అభిప్రాయాలను వెల్లడించే స్థితిలో మాత్రమే ఉన్నారు. అయితే, కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ ఎస్పీ కింగ్ .. బీజేపీ ఓటమే లక్ష్యంగా ఎస్పీ-బీఎస్పీ కూటమి కట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని కావాలంటూ పార్లమెంటు సాక్షిగా వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. మరి కేంద్రంలో ఎవరుండాలని నిర్ణయించే యూపీలో ములాయం వ్యాఖ్యలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో తెలియాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే ! మల్లయోధుడు.. ఎత్వా జిల్లాలోని సైఫీ ప్రాంతంలో గల వ్యవసాయ పేద కుటుంబంలో సుఘార్ సింగ్, మూర్తి సింగ్‌లకు 1939, నవంబర్ 22న జన్మించారు. ఆరుగురు తోబుట్టువుల్లో ఒకరు. తొలుత మల్లయోధుడిగా రాణించాలనుకున్నారు. అది కుదరకపోవడంతో ఆగ్రా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందారు. బడుగులు, ముస్లింల పక్షపాతిగా పేరు గడించారు. సోషలిస్టు నాయకుడు రామ్మనోహర్ లోహియా రచనలకు ప్రభావితమై ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాలవైపు అడుగులేశారు. ఆయనకు కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్ ఉన్నారు. ములాయంకు ఇద్దరు భార్యలు ఒకరు మాలతీ దేవీ. మరొకరు సాధనా గుప్తా. రాజకీయ ప్రస్థానం.. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక. 1975 ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 1977లో లోక్‌దళ్ (జనరల్ పీపుల్స్ పార్టీ)కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండుగా చీలిన లోక్‌దళ్-బీ వర్గానికి నాయకత్వం వహించారు. 1980 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1982లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1985 వరకు మండలిలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. 1985 నుంచి రెండేళ్లే పాటు శాసనసభలో ప్రతిపక్షపాత్ర నాయకుడిగా ఉన్నారు. బీజేపీ మద్దతు ఉపసంహరణ.. 1989లో బీజేపీ బయటి నుంచి మద్దతివ్వడంతో తొలిసారిగా సీఎం పీఠం అధిరోహించారు. అయితే, హిందూ మితవాదుల ‘బాబ్రీ ఆక్రమణ’ను ములాయం ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకొంది. కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో 1991 వరకు సీఎంగా కొనసాగారు. కాంగ్రెస్ కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌దళ్ ప్రభుత్వం పడిపోయింది. ఇతర పక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాబ్రీ మసీదు ఘర్షణలు ములాయం రాజకీయ జీవితంలో కీలక మార్పులు తెచ్చాయి. సమాజ్‌వాది పార్టీ స్థాపన.. 1992, అక్టోబర్ 4న న్యాయవాదులు, ముస్లింల మద్దతుతో సమాజ్‌వాది పార్టీ (సోషలిస్టు)ని స్థాపించారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సరైన రక్షణ చర్యలు తీసుకోలేదంటూ ఆక్షేపించారు. బాబ్రీ వ్యవహారంతో బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరమైనా ముస్లిం ప్రజలకు దగ్గరయ్యారు. ఈసారి బీఎస్పీ వల్ల.. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ములాయం రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 1995 లో జరిగిన గెస్ట్‌హౌజ్ ఉదంతంతో ఎస్పీ-బీఎస్పీ ప్రభుత్వం కుప్పకూలింది. ఈసారి కూడా ములాయం పూర్తికాలం సీఎంగా కొనసాగలేకపోయారు. 1995 లో బీఎస్పీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఆయన జాతీయ రాజకీయాలవైపు మళ్లారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో విపక్షాలన్నీ కలిసి యునైటెడ్ ఫ్రంట్‌గా అవతరించాయి. ఇతర పక్షాల మద్దతుగా ములాయం ప్రధాని పీఠం ఎక్కాలనుకున్నారు. కానీ, యూఎఫ్లోని పార్టీలన్నీ దేవెగౌడకు మద్దతివ్వడంతో ప్రధాని అయ్యారు. 17 ఎంపీ సీట్లున్న ములాయంకు రక్షణశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ముచ్చటగా మూడోసారి జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెట్టిన ఎస్పీకి.. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో 143 స్థానాలే వచ్చాయి. దీంతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమైంది. మరోమారు బీఎస్పీ-బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే, ఆ ప్రభుత్వం కూలిపోవడంతో.. ఇతర పక్షాలతో కలిసి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ములాయం మూడోసారి సీఎం అయ్యారు. 2007లో బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. 2009లో ములాయం మరోమారు లోక్‌సభకు ఎనికయ్యారు. కాగా, బీఎస్పీ అయిదేళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి భారీ మద్దతు ప్రకటించారు. దీంతో 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ఎస్పీ 224 సీట్లు గెలుచుకుంది. అయితే, ఈ సారి ములాయం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తను జాతీయ రాజకీయాల్లో కొనసాగుతూనే.. యూపీ ముఖ్యమంత్రిగా కొడుకు అఖిలేష్‌కు అవకాశం కల్పించారు. - వేణు.పి -
లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ
లక్నో : లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై వేగం పెంచింది. తొలివిడతగా శుక్రవారం ఎస్పీ ఆరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో యూపీ మాజీ సీఎం, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్, మేనల్లుడు ధర్మేంద్ర యాదవ్, రామ్‌గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ పేర్లు ఉన్నాయి. మెయిన్‌పూరి నుంచి ములాయం సింగ్ యాదవ్, బదౌన్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, ఎతవా నుంచి కమలేశ్ కతిరియా, బహ్రెచ్ నుంచి షబ్బీర్ వాల్మికీ, రాబర్ట్స్‌గంజ్ నుంచి భాయ్ లాల్ బరిలో దిగనున్నారు. ఎస్పీ రెండో జాబితా కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. కాగా అఖిలేష్ బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ ఎస్పీ నాయకత్వనికి వ్యతిరేకంగా మరో రాజకీయ పార్టీని నెలకొల్పిన విషయం తెలిసిందే. కానీ ఇవాళ ఎస్పీ ప్రకటించిన జాబితాలో ఆయన కుమారుడు అక్షయ్ పేరు కూడా ఉండటం గమనార్హం. -
పదేళ్లలో సోనియా, రాహుల్ ఆస్తి ఎంత పెరిగింది?
లక్నో: ఉత్తరప్రదేశ్ లోక్‌సభ, విధాన సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురి రాజకీయ వేత్తలు ఆస్తులు 13ఏళ్లలో 10 రెట్లు పుంజుకున్నాయి. 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యూపీ రాజకీయాల్లో ధన(బాహు)బలుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) శనివారం ప్రకటించింది. వీటితోపాటు 2004, 2019 నాటికి ఆస్తులు బాగా వృద్ధి చెందిన పలువురు ఎంపీలు, ఎంఎల్ఏల వివరాలను కూడా వెల్లడించింది. ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్, మరికొంత ఎంపీలు ఈ జాబితాలో ఉన్నారు. 2004-14 మధ్య కాలంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆస్తులు రూ. 7కోట్లు వృద్ది చెందాయి. అలాగే కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆస్తుల విలువ రూ. రూ.30కోట్లు పెరిగింది. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ ఆస్తులు రూ.14కోట్లు పెరిగాయి. 2004 నుంచి 2014 మధ్యకాలంలో ఎస్పీ ఎంఎల్ఏ దుర్గా ప్రసాద్ యాదవ్ , ముక్తార్ అన్సారీ (ఇండిపెండెంట్) రూ. 8 కోట్లు పెరిగాయి. శాసనసభ్యుల సగటు ఆదాయం 2007లో 1.2 కోట్లుగాను, 2012 రూ .3.87 కోట్లుగాను ఉంది. అదే 2017నాటికి వచ్చేసరికి రూ. 7.74 కోట్లకు అసాధారణంగా పెరిగిందని ఎడిఆర్ తెలిపింది. మొత్తం19,971 మంది అభ్యర్థులను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఇందులో 1,443 మంది ఎంపీలు, 38 శాతం మంది శాసనసభ్యులు తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్టుఅంగీకరించారు. వీటిలో 328మంది శాసనసభ్యులు, ఎంపీలు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఎడీఆర్ నివేదించడం గమనార్హం. -
అఖిలేష్ నిర్ణయంపై ములాయం ఆగ్రహం..!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ పొత్తువల్ల ఎస్పీ తీవ్రంగా నష్టపోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని కాపాడాల్సిన వారే బద్ధ శత్రువైన బహుజన్ సమాజ్‌వాది పార్టీతో చేతులు కలిపి భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సార్లు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పటిష్టమైన ఎస్పీని సొంత మనుషులే నాశనం చేస్తున్నారని వాపోయారు. (మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ములాయం) యూపీలో ఉన్న 80 ఎంపీ స్ధానాలకు గాను ఎస్పీ 37, బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేస్తాయని మయావతి, అఖిలేష్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈప్రకటన వెలువడిన కొద్దిసేపటికే పార్టీ కార్యకర్తల సమావేశంలో ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీకి 38 సీట్లు కేటాయించడం మరీ మింగుడు పడని వ్యవహారమని అన్నారు. ఇక మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విపక్షాలతో కలిసి అఖిలేష్ అడుగులేస్తుండగా.. మళ్లీ మోదీయే ప్రధాని కావాలని పార్లమెంటు సాక్షిగా ములాయం ఆకాక్షించారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ములాయం అన్నారు. (పొత్తు ఖరారు : బీఎస్పీ 38, ఎస్పీ 37) -
ములాయం వ్యాఖ్యల వెనుక కారణముంది!
లక్నో: నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నానని పార్లమెంటులో ఎస్పీ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ పేర్కొనడం దేశ రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్న తరుణంలో, మోదీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించేందుకు మహాకూటమిగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ.. సాక్షాత్తూ లోక్‌సభలో ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ములాయం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు రుసరుసలాడుతుండగా.. ఆయన చిన్న కోడలు అపర్ణా యాదవ్ మాత్రం ములాయం వ్యాఖ్యలను సమర్థించారు. ‘ఆయన వ్యాఖ్యల వెనుక కారణం ఉండి ఉంటుంది. ప్రతిపక్షం, అధికార పక్షం అన్న తేడా లేకుండా ఆయన ప్రతి ఒక్కరికీ ఆశీర్వాదాలు అందజేశారు. పెద్దవారు దీవెనలు ఇవ్వడం పరిపాటే. ఆశీర్వాదాలు ఇచ్చినంత మాత్రాన ఎన్నికలు గెలిచినట్టు కాదు. అందుకు ఎంతో శ్రమ కావాలి. ఆయన శుభాశీస్సులు అందరి వెంట ఉంటాయి’ అని అపర్ణ పేర్కొన్నారు. -
ములాయంకు మతి చలించిందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘అందరిని కలుపుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించిన ప్రధానమంత్రికి నా అభినందనలు. సభలోని సభ్యులందరూ విజయం సాధించి మళ్లీ సభకు వస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరు (మోదీ) మళ్లీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాను’ అని సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ బుధవారం 16వ లోక్‌సభ ఆఖరి సెషన్లో వ్యాఖ్యానించడం ఇంటా బయట సంచలనం సష్టించింది. లక్నో విమానాశ్రయంలో పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్బంధానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో ఆందోళన నిర్వహిస్తున్న సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలను ములాయం వ్యాఖ్యలు ఇబ్బందికి గురిచేశాయి. రానున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో ప్రయత్నాలను ముమ్మరం చేసిన వివిధ పార్టీల నాయకులకు కూడా ములాయం వ్యాఖ్యలు చికాకును కలిగించాయి. ములాయం ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సమాజ్‌వాది పార్టీ నాయకులు అంటున్నారు. ‘ములాయం సింగ్ యాదవ్ తన చుట్టూ ఉన్న ప్రజలనే కాదు. కుటుంబ సభ్యులను కూడా గుర్తించని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన జ్ఞాపక శక్తి పూర్తిగా మందగించింది. ఆయన మాటల మధ్య పొందిక ఉండడం లేదు. మోదీ గురించి ఆయన అలా మాట్లాడడానికి అదే కారణమై ఉంటుంది’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ‘గత ఏడాది లక్నోలో ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయన ఇలాగే పొరపాటు వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అనుకొని శివపాల్ యాదవ్ పార్టీకి మద్దతివ్వాల్సిందిగా ప్రజలను కోరారు. ఇది సమాజ్‌వాది పార్టీ సమావేశం కాదంటూ ప్రేక్షకుల నుంచి అనేక మంది అరిచారు. దాంతో సర్దుకున్న ములాయం సింగ్ యాదవ్ ఆ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించినందుకు తన సోదరుడిని అభినందిస్తున్నాను అని చెప్పారు’ అని ఎస్పీ సీనియర్ నాయకుడు వివరించారు. బుధవారం నాడు పార్లమెంట్ భవనం నుంచి బయటకు వస్తున్న ములాయం సింగ్ యాదవ్‌ను సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కలుసుకొని ‘మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎందుకు కోరుకున్నారు ?’ అని ప్రశ్నించగా, ‘నేను అలాంటిదేమీ అనలేదే! మీరే ఏదో ఊహించుకుంటున్నారు!’ అని ములాయం వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
‘వయసైపోయింది.. ఆయన మాటలు పట్టించుకోకండి’
పట్నా : నరేంద్రమోదీ మరోసారి దేశ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నానని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ములాయం వ్యాఖ్యలపై బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి స్పందించారు. ‘ఆయనకు వయసైపోయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలన్నది గుర్తుకురాదు. ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రబ్రీదేవి ముక్తాయించారు. ములాయం వ్యాఖ్యల పట్ల సమాజ్‌వాదీ పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. ఇదిలా ఉండగా లోక్‌సభలో మోదీకి మద్దతుగా ములాయం మాట్లాడటంతో.. బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. Former Bihar CM Rabri Devi on Mulayam Singh Yadav's statement in Lok Sabha 'I want you (PM Modi) to become PM again': Unki umar ho gayi hai. Yaad nahi rehta hai kab kya bol denge. Unki boli ka koi mayene nahi rakhta hai pic.twitter.com/bNL5DePBkK — ANI (@ANI) February 14, 2019 -
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలన్న ములాయం
-
విపక్షాలకు షాకిచ్చిన ములాయం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలకు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ గట్టి షాక్ ఇచ్చారు. బుధవారం ఆయన పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ములాయం అన్నారు. మోదీ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారని అభినందించారు. ఆయన పాలన బాగుందని.. ఆయనను ఎవరు వెలేత్తి చూపలేరని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న మోదీ చిన్నగా చిరునవ్వులు చిందించారు. ములాయం వ్యాఖ్యలతో ఎస్పీ సభ్యులు షాక్‌కు గురయ్యారు. కాగా, మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి బీఎస్పీతో సైతం అఖిలేశ్ జత కట్టారు. మోదీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న అఖిలేశ్ మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రస్తుతం ములాయం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు తలెత్తినప్పటి నుంచి అఖిలేశ్, ములాయం మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు సరికొత్త కాపురం కాంగ్రెస్‌తో..
సాక్షి, న్యూఢిల్లీ: పరస్పరం బద్ధ శత్రువులైన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పురుడు పోసుకున్న తెలుగుదేశం ఇప్పుడు అదే పార్టీతో కలిసి కాపురం చేసేందుకు సన్నద్ధమైంది. ఇన్నాళ్లూ నరనరాన జీర్ణించుకున్న కాంగ్రెస్ వ్యతిరేకతకు ఇక మంగళం పాడేయాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. గతంలో ఉన్న వైరుధ్యాలను మరిచిపోవాలని, ఇకపై కలిసి నడవాలని ఇరు పార్టీలు నిర్ణయానికొచ్చాయి. తమ మధ్య గతాన్ని మరిచిపోయి, ఇద్దరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రకటించారు. చంద్రబాబు గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బాబు వెంట టీడీపీ ఎంపీలు, పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీతో పరిచయాలు అయ్యాక ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు బయటకు వచ్చేశారు. తర్వాత రాహుల్, చంద్రబాబు గంటకుపైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. భేటీ తర్వాత రాహుల్, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ రక్షణకు విపక్షాలన్నీ ఏకం కావాలి ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భవిష్యత్తు కోసం మేం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం. గతంలో మా మధ్య చాలానే వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమే. దాన్ని మేం కూడా అంగీకరిస్తాం. ఎన్ని ఉన్నా ప్రస్తుతానికి పాత విషయాల జోలికి వెళ్లడం లేదు. వాటిని మరిచిపోయి కలిసి పనిచేయాలని నిర్ణయించాం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశ పరిరక్షణ కోసం విపక్షాలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్‌తో చంద్రబాబు యువతకు ఉపాధి లేదు. రాఫెల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి రూ.30,000 కోట్లు దోచిపెట్టారు. ఈ పరిస్థితుల్లో దేశ రక్షణకు, ప్రజాస్వామ్య బలోపేతానికి అన్ని విపక్షాలు కలిసి పని చేయాలి. దానికి అనుగుణంగా చంద్రబాబు, నేను కలిసి పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే పనిలో పడతాం. ఇక విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుంటారన్నది ప్రస్తుతానికి అనవసరం. మీడియాకు దీనిపైనే ఆసక్తి ఎక్కువ. కానీ, మాకు మాత్రం దేశ రక్షణపైనే ఆసక్తి. ముందు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకంచేసి ముందుకెళ్లడంపై ప్రణాళికలు రచిస్తాం. వాటిని త్వరలోనే వెల్లడిస్తాం’’అని రాహుల్‌గాంధీ ఉద్ఘాటించారు. వ్యవస్థలను నాశనం చేశారు ‘‘ఎన్డీయే ప్రభుత్వం దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. దేశ రక్షణ కోసం రాహుల్ గాంధీ, నేను కలిసి పనిచేయాలని నిర్ణయించాం. అన్ని విపక్షాలను కలుపుకొనిపోతాం. దేశంలో ప్రస్తుతంæ సాగుతున్న అరాచక పరిపాలనను గతంలో ఎన్నడూ చూడలేదు. వ్యవస్థలను నాశనం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ, గవర్నర్ల వ్యవస్థ, సుప్రీంకోర్టు వ్యవస్థలను నాశనం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతానికి అనవసరం. రాఫెల్ కుంభకోణాన్ని రాహుల్ గాంధీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. దీనిపై మేము కూడా మాట్లాడుతున్నాం. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తాం. అన్ని పార్టీలతో చర్చించి, ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం’’అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పవార్, ఫరూక్ కంటే చిన్నవాడినే.. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా దేశంలో చాలా సీనియర్ నేతలని, తాను వారికంటే చిన్నవాడినేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అనంతరం ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించేందుకు ఎన్డీయేయేతర పక్షాలను ఎలా కలుపుకొని ముందుకెళ్లాలన్న దానిపై చర్చించినట్టు తెలిపారు. శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లాతో చంద్రబాబు దీనిపై ఇంకా ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని పేర్కొన్నారు. మున్ముందు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల నాయకులతో మాట్లాడిన తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రస్తుతానికి ఇంతకుమించి ఏమీ చర్చించలేదని శరద్ పవార్ వెల్లడించారు. భావసారూప్యం గల పార్టీలను ఏకం చేసేందుకు త్వరలో బీజేపీయేతర పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, దానికి తాము ముగ్గురం కన్వీనర్లుగా ఉంటామని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇతర పార్టీలతో మాట్లాడే బాధ్యతను పవార్, ఫరూక్ తనకు అప్పగించారని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగానే, తనకు ఫ్లైట్ టైం అయిందంటూ ఫరూక్ అబ్దుల్లా లేచి వెళ్లిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లతో వారి నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబును బీజేపీ తిరుగుబాటు నేత అరుణ్ శౌరీ ఏపీ భవన్లో కలిశారు. అలాగే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. -
రామ మందిరం : ములాయం కోడలి సంచలన వ్యాఖ్యలు
లక్నో : సమాజ్ వాదీ పార్టీలోని రాజకీయ విబేధాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. వారం రోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ అసమ్మతిదారుడిగా పేరొందిన శివపాల్ సింగ్ యాదవ్ కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ కూడా ఇదే బాటలో నడవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రామ మందిరం నిర్మాణం గురించి అపర్ణ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం తప్పక జరగాల్సిందే. జనవరిలో జరగబోయే కోర్టు విచారణ కోసం మేము ఎదురు చూస్తున్నాం’ అంటూ అపర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక శివ్‌పాల్ యాదవ్ స్థాపించిన ప్రగతిశీల్ సమాజవ్ వాదీ పార్టీ 2019 ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అపర్ణ తెలిపారు. ‘2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే ఏ పార్టీ నుంచి రంగంలోకి దిగుతారు’ అని ప్రశ్నించగా.. ‘పెద్దలు ఎటువైపు ఉంటే నేను అటే. అయినా 2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంద’న్నారు. దాంతో అపర్ణ కూడా శివ్‌పాల్, నేతాజీ(ములాయం సింగ్ యాదవ్)ల దారిలోనే నడవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కుమారుడు.. సోదరుని మధ్య విభేదాలతో సతమతమవుతోన్న నేతాజీకి చిన్న కోడలు అపర్ణ వ్యాఖ్యలు మరిన్ని కొత్త సమస్యలు తెచ్చి పెట్టేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
ఒకే వేదికపై ములాయం, అఖిలేశ్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్, అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చాన్నాళ్ల తరువాత ఒకే వేదికను పంచుకున్నారు. పార్టీలో చీలిక వచ్చిన తరువాత ఇద్దరి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఆదివారం ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీ సైకిలు ర్యాలీ ముగింపు కార్యక్రమంలో అఖిలేశ్‌తో కలసి ములాయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో పాటు, ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేలా పనిచేయాలని ఎస్పీ కార్యకర్తలకు సూచించారు. -
2019లో అఖిలేశ్, ములాయం పోటీచేసే స్థానాలు
లక్నో : వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులు పోటీ చేసే స్థానాలపై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ స్పష్టతనిచ్చారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం తన భార్య డింపుల్ యాదవ్ ఎంపీగా కొనసాగుతున్న కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి తను పోటీ చేయనున్నట్టు తెలిపారు. అలాగే నేతాజీ(ములాయం సింగ్ యాదవ్) మణిపురి నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. ఇదివరకే తన భార్య స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పిన అఖిలేశ్ దానిపై మరింత స్పష్టతనిచ్చారు. ప్రతిపక్ష నాయకులు సమాజ్‌వాది పార్టీని కుటుంబ పార్టీగా ఆరోపిస్తున్నారని.. అందుకనే తన భార్య 2019 ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. అలాగే పొత్తులు, సీట్ల పంపకాలపై మాట్లాడుతూ.. మిత్ర పక్ష అభ్యర్థులు బరిలో నిలిచిన చోట కార్యకర్తలందరు వారి విజయానికి, బీజేపీ ఓటమికి కృషి చేయాలని కోరారు. ఈ సారి బీజేపీకి ప్రజల మద్దతు ఉండదన్నారు. బీజేపీ కేవలం మాటలకే పరిమితమవుతుందని.. క్షేత్ర స్థాయిలో అంత శూన్యమని అఖిలేశ్ విమర్శించారు. -
పరువూ పాయె...సీట్లూ పాయె....
సాక్షి, న్యూఢిల్లీ : పది రాష్ట్రాల పరిధిలోని నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గురువారం వెలువడిన ఫలితాల్లో కేంద్ర పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెల్సిందే. ముఖ్యంగా బిహార్‌లో పాలకపక్ష బీజేపీతో అంటకాగిన జేడీయూ మరీ నష్టపోయింది. జోకిహట్ అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీయూ ఓడిపోయింది. లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. లాలూ పార్టీతోని తెగతెంపులు చేసుకొని బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జేడీయూ పరాజయం కావడం వరుసగా ఇది మూడవసారి. గత మార్చి నెలలో అరారియా లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో జెహనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కూడా రాష్ట్రీయ జనతాదళ్ యూ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ మూడు ఎన్నికలను కూడా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ (29) చేతుల్లో ఈ పరాభవాన్ని చవిచూడటం నితీష్ కుమార్‌కు మింగుడు పడని విషయం. నాలుగు పశుదాణా కేసుల్లో లాలూకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో తేజస్వీ యాదవ్ ఆర్జేడీ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లినప్పటికీ ప్రజల్లో ఆయన ప్రతిష్ట దెబ్బతినలేదని తెలుస్తోంది. పైగా రాజకీయ కక్ష సాధింపులకు లాలూ బలయ్యారన్న సానుభూతి కూడా ప్రజల్లో కనిపిస్తోంది. జోకిహట్ నియోజకవర్గంలో తాము ఓడిపోవడానికి ఇతర కారణాలున్నాయని జేడీయూ వాదిస్తోంది. ఏదీ ఏమైనా ఇది నితీష్ కుమార్ ప్రతిష్టకు సంబంధించిన విషయమని ఒప్పుకోక తప్పదు. బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకోవడానికి ముందు అన్ని ప్రతిపక్షాలను నడిపించగల సమర్థుడైన నాయకుడని పేరు తెచ్చుకున్న నితీష్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి నష్టపోతున్నారు. ఆయన ప్రధాని అయ్యే అవకాశం ఉన్న నాయకుడని కూడా పేరు పొందారు. ఇప్పుడు ఆయనకిదంతా గతించిన చరిత్ర. బీజేపీతో పొత్తు కారణంగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయిన నితీష్ కుమార్ రాష్ట్రంలో కూడా బీజేపీ–జేడీయూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుపటిలాగా కాకుండా ఇప్పుడు ఆయనపై బీజేపీ ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2019లో జరిగే ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి ఆ పార్టీనే ఎక్కువ సీట్లను తీసుకొని జేడీయూకు తక్కువ సీట్లను కేటాయించే అవకాశం ఉంది. -
అఖిలేష్ కోరిన గడువునే.. తండ్రి కూడా
న్యూఢిల్లీ : పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వ బంగ్లాలలో ఉంటున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లకు వాటిని ఖాళీ చేయమని కేంద్రం నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత మంగళవారం స్పందించిన అఖిలేష్ యాదవ్ తనకు అద్దె ఇల్లు దొరికేంత వరకు సమయం ఇవ్వలని లేక సొంత ఇంటి నిర్మాణ చేసుకునేంత వరకు రెండేళ్ల సడళింపు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును కోరారు. ఇప్పుడు తండ్రి ములాయం సింగ్ కూడా కొడుకు మాటనే అనుసరిస్తూ.. తనకు కూడా రెండు సంవత్సరాల గడువు ఇవ్వాలని కోరారు. కాగా ములాయం సింగ్ లక్నోలోని విక్రమాదిత్య రోడ్డులో నెం.5 బంగ్లాలో గత 27 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆయన పక్కన నెం.4 బంగ్లాలో అఖిలేష్ యాదవ్ ఉంటున్నారు. ఇది చదవండి : సొంతిల్లు కట్టుకోకుండా తప్పు చేశా: మాజీ సీఎం -
సొంతిల్లు కట్టుకోకుండా తప్పు చేశా: మాజీ సీఎం
లక్నో : పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వ బంగ్లాలలో ఉన్న మాజీలను ఖాళీ చేయించాల్సిందిగా ఈ నెల 7న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయవతి ముఖ్యమంత్రి పదవులలో ఉన్న సమయంలో వారికి అధికారిక ప్రభుత్వ బంగ్లాలను కేటాయించారు. అయితే ముఖ్యమంత్రి పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా వారు బంగ్లాలను ఖాళీ చేయకుండా అందులోనే ఉంటున్నారు. దీనిపై సుప్రీం తీర్పును అనుసరిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, బంగ్లాలను ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై స్పందించిన అఖిలేష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సొంత ఇంటిని నిర్మించుకోకుండా తప్పు చేశానని అన్నారు. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి అద్దె ఇంటికి మారేందుకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును కోరినట్టు తెలిపారు. లేక కోర్టు కొంత సమయం ఇస్తే గడువులోగా సొంత ఇంటిని నిర్మించుకుంటానని అన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు అందుకున్న వారిలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్, ఎన్డీ తివారీలు కూడా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ లక్నోలోని విక్రమాదిత్య రోడ్డు 4 నెంబర్ ప్రభుత్వ బంగ్లాలో ఉండగా, అదే విధిలో ఐదో నెంబర్ బంగ్లాలో గత 27 ఏళ్లుగా ములాయం సింగ్ యాదవ్ ఉంటున్నారు. -
మాజీ సీఎంలకు యూపీ సర్కార్ నోటీసులు
లక్నో: ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాలని యూపీ సర్కార్ ఆరుగురు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులకు నోటీసులు జారీ చేసింది. పదవి నుంచి దిగిపోయిన తర్వాత అందరూ సమానమేనని, మాజీలుగా మారిన ముఖ్యమంత్రులు కూడా సాధారణ పౌరులేనని.. వారికి ప్రత్యేక వసతులు, హోదాలు అక్కర్లేదని ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రులు ఇంకా ప్రభుత్వ బంగ్లాల్లో ఉంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఉత్తర్వులను అనుసరించి యోగీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, నారాయణ్ దత్ తివారీ, అఖిలేష్ యాదవ్, కల్యాణ్ సింగ్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు నోటీసులు జారీ చేసింది. మరో 15 రోజుల్లో భవనాలు ఖాళీ చేయాలని వాటిల్లో వెల్లడించింది. అయితే, సుప్రీం ఉత్తర్వులపై సుముఖంగా లేని ములాయం సింగ్ బుధవారం యోగీతో భేటీ అయ్యారు. ములాయం, ఆదిత్యానాథ్ మధ్య తాజా రాజకీయ పరిణామాలపై మాత్రమే చర్చ జరిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కాగా, ఈ భేటీకి సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన పలు విషయాల్ని బహిర్గతం చేశారంటూ సీఎం కార్యాలయం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం గమనార్హం. సీఎం వ్యక్తిగత కార్యదర్శి పితాంబర యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహాయకుడు శిశుపాల్లపై వేటు పడింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రులకు శాశ్వత నివాస వసతి చట్టం సుప్రీం కోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. ‘ఉత్తరప్రదేశ్ మినిస్టర్స్ చట్టం- 2016’ రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ చట్టాన్ని అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తయారు చేసింది. -
రోడ్డు ప్రమాదంలో యోగా గురు మృతి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యోగా గురుతో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. వీరిలో ఓ కాంగ్రెస్ నాయకుడు కూడా ఉన్నారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఫాగుహ బాటియా ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యోగా గురు లక్ష్మీపతి వర్మ వెళ్తున్న కారును ఎదురుగా వ్యతిరేక మార్గంలో వచ్చి మరో కారు బలంగా ఢీకొట్టింది. ఇదే సమయంలో యోగా గురు ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం ముగ్గురు చనిపోయారు. మృతుడు యోగాగురు లక్ష్మీపతి ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు సన్నిహితుడు. ఈ ఘటనలో యోగాగురుతో పాటు కాంగ్రెస్ నాయకుడు ధరం రాజ్ వర్మ, హరి మోహన్ అగర్వాల్(58) మరో కారులో చనిపోయారు. గాయపడిన ఆరుగురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఎస్పీ విందుకు ములాయం హాజరయ్యేనా?
లక్నో : రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు సమాజ్‌వాదీ పార్టీ ఏర్పాటు చేసిన విందు ప్రాధాన్యత సంతరించుకుంది. నరేశ్ అగర్వాల్ బీజేపీలో చేరడంతో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించేందుకు ఎస్పీ నేతలు ఈ విందు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ ఒకవైపు నిలవడంతో విజయాన్ని సాధించాయి. అందుకే పార్టీలోని విభేదాలను పక్కన బెట్టి ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం జరగనున్న ఈ విందులో ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్‌తో పాటు 200 మంది నాయకులు పాల్గొంటరాని పార్టీ నేతలు ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేశ్, ములాయం వర్గాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ విందు ద్వారా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విందుకు ములాయం, శివపాల్ హాజరయ్యేది ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యసభ ఎన్నికలపై చర్చించడానికి అఖిలేశ్ కాల్ చేసి ఆహ్వానించినా శివపాల్ ఆ సమావేశానికి హాజరుకాలేదు. శివపాల్ ప్రస్తుతం తన సొంత గ్రామానికి వెళ్లడంతో ఆయన సాయంత్రం విందుకు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం విందుకు హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు సీఎం యోగి అదిత్యనాథ్ కూడా రాజ్యసభ ఎన్నికల్లో అనుసారించాల్సిన వ్యుహంపై బీజేపీ మిత్ర పక్షాలతో చర్చలు జరుపనున్నారు. -
ట్రిపుల్ తలాఖ్‌కు అపర్ణ ప్రశంసలు
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ ట్రిపుల్ తలాఖ్ చట్టంపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వ బిల్లుపై లోక్‌సభలో మాట్లాడిన అపర్ణ.. ట్రిపుల్ తలాఖ్ బిల్లు మహిళల హక్కులను కాపాడుతుందని అన్నారు. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ట్రిపుల్ తలాఖ్ ద్వారా పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌కు చిన్నమార్పులతో సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా మద్దుతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
వైరల్ వీడియో: మాజీ సీఎం కోడలు అదిరేటి స్టెప్పులు..
సాక్షి, లక్నో: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం పద్మావతిపై పలు రాష్ట్రాల్లో వివాదం కొనసాగుతుంటే యూపీ మాజీ సీఎం కోడలు మూవీలోని ఓ పాటకు ఓ ఫంక్షన్ల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మూవీ పాటకు ఆమె ఎందుకు డ్యాన్స్ చేసిందంటూ కర్ణిసేన ప్రశ్నించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ అపర్ణా యాదవ్ సోదరుడి నిశ్చితార్థం లక్నోలో జరిగింది. ఆ వేడుకలో అపర్ణా యాదవ్ మస్త్ మస్త్ స్టెప్పులేసి అదర గొట్టేశారు. వివాదాస్పద పద్మావతి మూవీలోని ఘుమర్ పాటకు ఆమె చక్కటి డ్యాన్స్ చేశారు. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. అపర్ణ స్టెప్పులకు ఫంక్షన్‌కు హాజరైనవారంతా ఫిదా ఐపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరఫున లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి అపర్ణా యాదవ్ ఓటమి పాలయ్యారు. రాణి పద్మావతికి సంబంధించిన కొన్ని సీన్లు తొలగించాలన్న రాజ్‌పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన.. దర్శకుడు భన్సాలీ చరిత్రను వక్రీకరించాడంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా కొన్ని రాష్ట్రాల్లో పద్మావతి మూవీపై ఆంక్షలు విధించారు. ఇదివరకే పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు పద్మావతి మూవీపై నిషేధం విధించగా.. ఈ చిత్రాన్ని బిహార్‌లోనూ ప్రదర్శించొద్దని సీఎం నితీశ్ కుమార్ నిన్న (మంగళవారం) అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. -
మాజీ సీఎం కోడలు అదిరేటి స్టెప్పులు..
-
కర సేవకుల కాల్పుల కేసు వెంటాడుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు ఊహించని ఝలక్ తగిలింది. కర సేవకులపై కాల్పుల ఘటన కేసులో ఆయనకు సంబంధం ఉందంటూ సుప్రీంకోర్టులో మంగళవారం ఓ పిటిషన్ దాఖలైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మనుషులను కాల్చి చంపాలంటూ ములాయం ఆదేశాలు ఇవ్వటం దారుణం. ఆయనపై అభియోగాలు నమోదు చేసి.. విచారణ జరిపించాల్సిందేనని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. కాగా, అక్టోబర్ 30, 1990లో అయోధ్య దగ్గర అల్లర్లు చెలరేగగా.. కర సేవకులపై కాల్పులు జరపాల్సిందిగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ములాయం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే పలుమార్లు ఆయన తన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలను రక్షించాలన్న ఉద్దేశ్యంతోనే తాను అలా ఆదేశాలు జారీ చేశానని.. ఒకవేళ ఆనాడు ప్రభుత్వం వారిని అడ్డుకోకపోయి ఉంటే మారణహోమం జరిగి ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ముస్లిం కమ్యూనిటీ విశ్వాసం, దేశ సమైక్యతను కాపాడాలన్న ఉద్దేశ్యంతోనే ఆదేశాలు ఇచ్చా’’ అని ఆయన సమర్థించుకున్నారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి ఏడాదే అంటే 1991 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ములాయం గద్దె దిగిపోవాల్సి వచ్చింది. -
హమ్ సాత్ సాత్ హై...
సాక్షి, లక్నో : ఈ దీపావళి పండగ ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో.. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీలో కొత్త వెలుగులు నింపింది. ఏడాదిన్నర కాలంగా అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పార్టీ కేడర్ ఒక్క తాటిపైకి వచ్చింది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం మొత్తం కలుసుకుని వేడుకలో పాల్గొనటంతోపాటు రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చించింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్‌తో కలిసి గురువారం అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లారు. వీరంతా కలిసి సైఫై నిలయంలో సందడి చేశారు. తొలుత ములాయం సైఫైలోని కుమారుడి ఇంటికి చేరుకుని నేతలతో సమావేశమయ్యారు. కాసేపటికే శివపాల్ అక్కడికి చేరుకోగా.. అఖిలేశ్ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో శివ్‌పాల్ అబ్బాయిని ఆశీర్వదించగా.. ఈ దృశ్యంతో అక్కడున్న మిగతా పార్టీ నేతల ముఖంలో ఒక్కసారిగా వెలుగులు వెలిగాయి. ములాయం ఇంట ముసలం, ఆపై యూపీ ఎన్నికల దారుణ ఓటమి తర్వాత తండ్రి.. బాబాయ్, అబ్బాయ్‌లు కలుసుకోవడం ఇదే తొలిసారి. బుధవారమే సైఫై నిలయానికి చేరుకున్న అఖిలేశ్ కుటుంబం అంతకు ముందు అక్కడికి చేరుకున్న మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్‌తో సరదాగా గడిపారు. అయితే ఆ కాసేపటికే ములాయం కూడా అక్కడికి చేరుకుని రాంగోపాల్ యాదవ్‌తో ఏకాంతంగా రాజకీయాలపై చర్చించారంట. ఇక ఈ దీపావళితో తమ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయని ములాయం ప్రకటించారు. పార్టీ-కుటుంబం ఇప్పుడు అంతా ఒక్కట్టే. అంతా కలిసి పార్టీని బలోపేతం చేసి.. ఉన్నతస్థాయికి చేర్చేందుకు యత్నిస్తాం అని ములాయం చెప్పారు. ఈ సందర్భంగా ‘మిషన్-2019’ను తెరపైకి తెచ్చి.. వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేసే దిశగా ములాయం కుటుంబం ప్రణాళికలు రచిస్తోంది. -
ములాయంకు మరో షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీలో చెలరేగిన సంక్షోభం ఇంకా ముగియలేదు. పార్టీ వ్యవస్థాపకుడైన తన తండ్రి ములాయం సింగ్‌కు అఖిలేశ్ యాదవ్ మరోసారి ఝలక్ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ నుంచి ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌ను తొలగించారు. వీరికి ఎటువంటి పదవులు కేటాయించ లేదని ఎన్నికల సంఘానికి సమర్పించిన పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్స్ లిస్టులో పేర్కొంది. అఖిలేశ్‌తో ఎటువంటి విభేదాలు లేవని, తాను కొత్త పార్టీ పెట్టడం లేదని ములాయం ప్రకటించిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే సమాజ్‌వాదీ పార్టీ సంరక్షుడిగా(పాట్రాన్) ములాయంను కొనసాగిస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పార్టీలో అలాంటి పదవి ఏదీలేదని అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధురి తెలిపారు. 'ఇలాంటి పదవి కోసం పార్టీ రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదు. ములాయం పార్టీ సంరక్షుడి పదవిలో ఉన్నారో, లేదో నాకు తెలియద'ని ఆయన పేర్కొన్నారు. కొడుకుతో విభేదాల కారణంగా పార్టీ అధ్యక్ష పదవిని ములాయం కోల్పోయారు. జనవరి 1 అత్యవసరంగా నిర్వహించిన పార్టీ జాతీయ సమావేశంలో అఖిలేశ్ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. తన తండ్రికి నామమాత్రమైన సంరక్షుడి పదవిని కట్టబెట్టారు. తాజా పరిణామంపై ములాయం ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఒకే వేదికపై అఖిలేష్-ములాయం
సాక్షి, లక్నో : దాదాపు ఏడాది తరువాత సమాజ్‌వాదీ వ్యవస్థాపకనేత ములాయం సింగ్ యాదవ్, పార్టీ ప్రస్తుతం అధ్యక్షుడు, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ గురువారం ఒకే వేదికమీద కనిపించారు. ఒకే వేదికమీద ఇద్దరు నేతలు కనిపించడం.. పక్కపక్కనే కూర్చోవడం వంటి దృశ్యాలతో సమాజ్ వాదీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతల మధ్య మళ్లీ తత్సంబంధాలు ఏర్పడేందుకు ఇది దోహదం చేస్తుందని సమాజ్‌వాదీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. గురువారం నాడు ప్రముఖ సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియా 50వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలేష్, ములాయం పక్కపక్కనే కూర్చుకున్నారు. ఈ ఇద్దరినీ ఇలా చూడ్డంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఉద్వేగానికిలోనయ్యారు. కొద్దిసేపటి తరువాత ఇరువురు నేతలు లోహియా విగ్రహానికి నివాళులర్పించి వెళ్లిపోయారు. -
ఎస్పీ అధినేతగా అఖిలేష్
సాక్షి, న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ గురువారం ప్రకటించారు. గురువారం ఆగ్రాలో జరిగిన ఎస్పీ జాతీయ సదస్సులో అధినేత ఎన్నిక జరిగింది. అఖిలేష్ యాదవ్ పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్ల పాటు కొనసాగుతారని ఆయన తెలిపారు. అఖిలేష్ యాదవ్ నాయత్వంలోనే 2019 లోక్‌సభ, 2022 ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, అఖిలేష్ తండ్రి అయిన ములాయం సింగ్ యాదవ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడి పదవీకాలం గతంలో మూడేళ్లు ఉండగా.. దానిని పార్టీ రాజ్యాంగాన్ని సవరించి ఐదేళ్లకు పెంచినట్లు రాంగోపాల్ యాదవ్ తెలిపారు. యూపీ ఎన్నికల సమయంలో ములాయంకు, అఖిలేష్‌కు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. సమయంలోనే ములాయంను పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఆ స్థానాన్ని అఖిలేష్ ఆక్రమించారు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ములాయం దూరంగా ఉంటున్నారు. ఈ కారణం వల్లనే అఖిలేష్ యాదవ్ స్వయంగా ఆహ్వానించినప్పటికీ ములాయం సింగ్ యాదవ్ ఆగ్రా సమావేశానికి రాలేదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై స్వయంగా అఖిలేష్ స్పందిస్తూ.. నేతాజీ ’ములాయం‘ నన్ను ఫోన్లోనే ఆశీర్వదించారని చెప్పారు. అలాగే శివపాల్ యాదవ్ కూడా నన్ను ప్రత్యేకంగా అభినందించారని ఆయన తెలిపారు. -
ములాయంతో అఖిలేశ్ భేటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తన తండ్రి ములాయంను గురువారం ఆయన స్వగృహంలో కలుసుకున్నారు. అక్టోబర్ 5న ఆగ్రాలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకావాల్సిందిగా ఆయన్ను అఖిలేశ్ ఆహ్వానించినట్లు ఎస్పీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ యాదవ్ తెలిపారు. త్వరలోనే ములాయం మరో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆయనతో అఖిలేశ్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 23న జరిగిన ఎస్పీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు ములాయం, ఆయన సోదరుడు శివపాల్‌కు ఎలాంటి ఆహ్వానం అందలేదు. -
నాన్నా.. ఒక్కసారి రండి..!
సాక్షి, లక్నో: సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ గాడిన పడుతోందా? తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య చిగురుస్తోందా? ఏమో ఏదైనా జరగవచ్చు అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదంతా ఎందుకంటే.. వచ్చేవారం ఆగ్రాలో జరగనున్న సమాజ్‌వాదీ పార్టీ సమావేశానికి రావాలని.. ములాయంను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. పార్టీలో తండ్రీ కొడుకుల విబేధాలు తారాస్థాయికి చేరిన తరువాత.. ఇంతటి సామరస్యపూర్వక పలకరింపులు లేవని.. ఈ ఏడు నెలల్లో ఇదే మొదటిసారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ములాయంను ఆయన ఇంట్లోనే ప్రత్యేకంగా కలిసిన అఖిలేష్ యాదవ్ దాదాపు 20 నిమిషాల సేపు ఆయనతో చర్చలు జరిపారు. ఇద్దరూ కలిసి ఏం చర్చించారన్న విషయంపై స్పష్టత లేకపోయినా.. ఇదొక శుభపరిణామమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ములాయం సింగ్ యాదవ్ కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలోనే ములాయంను అఖిలేష్ ప్రత్యేకంగా కలిసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
ఇప్పుడు లేదు, భవిష్యత్తులో చెబుతా
లక్నో: కొత్త పార్టీ ఇప్పట్లో పెట్టే ఉద్దేశం లేదని సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేనిప్పుడు కొత్త పార్టీ పెట్టడం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకటనలు చేస్తాన’ని చెప్పారు. అఖిలేశ్ యాదవ్‌కు తన ఆశీస్సులు ఉంటాయని, అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఆ నిర్ణయాలు ఏమిటనేది రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. కేంద్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమయ్యాయని ములాయం విమర్శించారు. ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా హామీలు అమలు చేయలేదు. పెట్రోలు-డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బాలికలకు రక్షణ లేకుండాపోయింది. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయి. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. యోగి పాలనలో అన్నదాతలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నార’ని ములాయం మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ములాయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారనగానే ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తారని అంతకుముందు ప్రచారం జరిగింది. సొంత పార్టీలో చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో ‘పెద్దాయన’ వేరు కుంపటి పెడతారని వార్తలు వచ్చాయి. ములాయం తాజా ప్రకటనతో ఊహాగానాలకు తెరపడింది. -
‘రాజకీయ వేశ్యలా వాడుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ తనను ఒక రాజకీయ వేశ్యలా వాడుకునేందుకు ప్రయత్నించారంటూ.. అమర్ సింగ్ సంచలన ఆరోపణ చేశారు. చాలాకాలంగా క్రియాశీల రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న అమర్‌సింగ్ తాజాగా ములాయంపై నిప్పులు చెరిగారు. కుటుంబంలో చిచ్చు రేగి అఖిలేశ్ యాదవ్ పార్టీ పగ్గాలు అందుకున్న సమయంలో ములాయం, రామ్‌గోపాల్ యాదవ్ ఎవరికీ తెలియకుండా నన్ను కలిసేందుకు ప్రయత్నించారని అమర్‌సింగ్ వెల్లడించారు. ఒకదశలో అఖిలేశ్‌కు భయపడిన ములాయం, రామ్‌గోపాల్ యాదవ్‌లు రాత్రి సమయంలో దొడ్డిదారిగుండా.. వచ్చి కలుస్తామని చెప్పారన్నారు. అంతేకాక తమ మధ్య జరిగే సమావేశాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని వారు కోరినట్లు అమర్‌సింగ్ తెలిపారు. ములాయంతో ఉంటే ఎటువంటి రాజకీయ భవిష్యత్ ఉండదని.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి మంగళవారం తన వద్ద వాపోయారని చెప్పారు. ఇదిలా ఉండగా.. తాను ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలోనే కొనసాగుతున్నాని అమర్ సింగ్ ప్రకటించారు. అయితే పార్టీలో ఎటువంటి పాత్ర పోషించడం లేదని చెప్పారు. -
సమాజ్‌వాదీ ముసలం.. ముగియలేదా?
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములాయం కుటుంబంలోని గొడవలతో సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ములాయం, తనయుడు అఖిలేష్‌ల వర్గాలుగా చీలిపోయిన పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించుకోగా.. ఒకానోక టైంలో తనను తాను పార్టీ జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ ప్రకటించుకోవటం.. సైకిల్ గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించటం లాంటివి చూశాం. చివరకు పరిస్థితి సర్దుమణిగినా.. పార్టీకి భారీ ఓటమి మాత్రం తప్పలేదు. ఇదిలా ఉంటే నాలుగైదు నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ పార్టీలో పరిస్థితులు ఏం మారలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23న రాష్ట్ర సర్వసభ్య సమావేశం, అక్టోబర్ 5న పార్టీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ యువనేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. అయితే విభేధాల అనంతరం భారీ స్థాయిలో నిర్వహించబోతున్న పార్టీ సమావేశాల విషయంలో నేతాజీ ములాయం పేరు ప్రస్తావన రాకపోవటం విశేషం. ములాయం వర్గీయులకు కూడా ఈమేర ఆహ్వానం అందలేదనే తెలుస్తోంది. మరోవైపు ములాయం సింగ్ నేతృత్వంలో ఈ నెల 21న లొహియా ట్రస్ట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రస్ట్ 11 మంది సభ్యుల్లో తనయుడు అఖిలేష్‌తోపాటు, సోదరుడు రామ్‌గోపాల్ యాదవ్‌లు కూడా ఉన్నారు. అయినప్పటికీ మొన్నామధ్య నిర్వహించిన సమావేశాలకు వీరిద్దరూ హాజరుకాకపోవటంతో.. త్వరలో నిర్వహించబోయేదానిపై కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకోవటంతో సమాజ్‌వాదీ పార్టీ అధికార జగడం ఇంకా సర్దుమణగలేదనే చెప్పుకుంటున్నారు. -
'చైనా రెడీగా ఉంది..అణ్వస్త్రాలు పాక్‌లో పెట్టింది'
న్యూఢిల్లీ: భారత్‌పై చైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని సమాజ్‌వాది పార్టీ అధినేత, రక్షణశాఖ మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ హెచ్చరించారు. పాకిస్థాన్‌తో కలిసి భారత్‌పై దాడి చేసేందుకు చైనా సిద్ధమైందని, వెంటనే టిబెట్ విషయంలో తన వైఖరిని మార్చకొని టిబెట్‌కు స్వాతంత్ర్యం ఇప్పించే విషయానికి మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. చైనా, భారత్ మధ్య డోక్లామ్ సరిహద్దు విషయంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బుధవారం సాయంత్రం ఆయన లోక్‌సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పొరుగు దేశం(చైనా) చేస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. 'ఇప్పుడు భారత్ చైనా నుంచి పెద్ద అపాయాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నో సంవత్సరాలుగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునే ఉన్నాను. ఇప్పటికే అది భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. చైనా భారత్‌కు అతిపెద్ద ప్రత్యర్థి. కశ్మీర్లో భారత ప్రభుత్వం ఏం చేసింది? పాక్ ఆర్మీతో చైనా కుమ్మక్కవుతోంది. భారత్‌పై దాడి చేసేందుకు ఇప్పటికే చైనా తన అణ్వాయుధాలను పాక్‌లో పాతిపెట్టి ఉంచింది. ఈ విషయం భారత ఇంటెలిజెన్స్‌కు ఇంకా బాగా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు తేల్చుకోవాల్సింది టిబెట్ భూవివాదం కాదు. ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతివ్వాలి' అని ఆయన జీవరో అవర్ సమయంలో తెలిపారు. -
‘ములాయం కోపం నా మీదే, ఆయన మీద కాదు’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరోసారి తన బాబాయి రాంగోపాల్ యాదవ్‌పై మీద ప్రశంసల జల్లు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఎన్నికల చిహ్నాన్ని కూడా ఆయనే కాపాడారని అన్నారు. కాగా నిన్న (గురువారం) రాంగోపాల్ యాదవ్ పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో అఖిలేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ యాదవ్ నేతృత్వంలో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిందన్నారు. అయితే ఈ వేడుకకు ములాయం సింగ్ యాదవ్‌తో పాటు మరో సోదరుడు శివపాల్ యాదవ్ కూడా దూరంగా ఉన్నారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అఖిలేష్ సమాధానం ఇస్తూ ‘ వాళ్లు ఎందుకు రాలేదో నాకు తెలుసు. మిగతా వాళ్ల మీద కన్నా నా మీదే కోపం’ అని తెలిపారు. అయితే తండ్రితో విభేదించి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ అఖిలేష్ మాత్రం తన చిన్నాన్నపై ఏ మాత్రం విశ్వాసం తగ్గలేదు సరికదా, ఆయన వల్లే తాము అధికారంలో ఉన్నప్పుడు క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేశామన్నారు. మరోవైపు రాంగోపాల్ యాదవ్ కూడా అఖిలేష్‌పై తన వాత్సల్యాన్ని ప్రదర్శించారు. 2022లో తిరిగి అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇప్పటి నుంచి పని చేయాలంటూ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను తప్పుదోవపట్టిస్తున్నాడని వరుసకు సోదరుడయ్యే రాంగోపాల్ యాదవ్‌పై ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహంగా ఉన్న విషయం విదితమే. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ ఆధిపత్యం కోసం ములాయం సింగ్, అఖిలేష్ మధ్య జరిగిన పోరులో అఖిలేషే పై చేయి సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుల్లో విభేదాలు రావడంతో అఖిలేష్, రాంగోపాల్ ఓ వర్గంగా.. ములాయం, శివపాల్ మరో వర్గంగా విడిపోయిన సంగతి తెలిసిందే. -
ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి: ములాయం
లక్నో: కశ్మీర్లో తలెత్తిన పరిస్థితులు చక్కబడాలంటే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన ఐషాబాగ్ ఈద్గాను సందర్శించారు. తన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వెళ్లిపోయిన తర్వాత ఇక్కడి వచ్చారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ..‘ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే అక్కడి(కశ్మీర్) పరిస్థితులు చక్కబడతాయి. శాంతి నెలకొంటుంది. అదే సమయంలో వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచివేస్తుంద’ని అన్నారు. తీవ్రవాద దాడులు, సైనిక దళాలపై పౌరుల దాడులతో కశ్మీర్‌లోయ అట్టుడుకుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికపై మాట్లాడేందుకు ములాయం నిరాకరించారు. ఇప్పుడేమి మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు. -
బాహుబలి చూసిన పెద్దాయన.. మాజీ సీఎం మిస్
రాజకీయాల్లో మునిగి తేలుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. మంగళవారం నాడు థియేటర్‌కు వెళ్లి బాహుబలి-2 సినిమా చూశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను కొంతమందిని తీసుకెళ్లి, లక్నోలోని ఓ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని మరీ ఆ సినిమాను చూశారు. తన సన్నిహిత సహచరులను మాత్రమే ఆయన ఆ సినిమాకు తీసుకెళ్లారు. వారిలో శివపాల్ యాదవ్‌కు సన్నిహిత అనుచరుడైన అషు మాలిక్, మహ్మద్ షాహిద్ తదితరులున్నారు. మొత్తం థియేటర్ అంతటినీ కేవలం తమ కోసమే ములాయం బుక్ చేయించుకున్నారు. అయితే, ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ములాయం వెంట సినిమా చూసేందుకు యూపీ మాజీ ముఖ్యమంత్రి, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ మాత్రం వెళ్లలేదు. అలాగే, అఖిలేష్ వర్గానికి చెందినవాళ్లుగా ముద్రపడిన వాళ్లు కూడా ఈ సినిమా చూసిన బృందంలో లేరు. ములాయం వెంట మాత్రం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా థియేటర్లో ఉన్నారు. -
అఖిలేష్.. ఇక చాలు దిగిపో!
తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ రగడ మొదలైంది. తన కొడుకు అఖిలేష్ యాదవ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోరారు. పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలను అఖిలేష్ నెరవేర్చలేకపోయారని ములాయం విమర్శించారు. పార్టీ అధ్యక్ష పదవిని తీసుకునేటప్పుడు మూడు నెలల తర్వాత మళ్లీ తనకు తిరిగి అప్పగిస్తానని అఖిలేష్ చెప్పాడని ఆయన ఆగ్రాలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కానీ ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. తనకు పదవుల మీద ఆశ లేదని, అయితే అఖిలేష్ తన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదో జాతీయ మీడియా అతడినే అడగాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏంటని అడిగితే మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. వాస్తవానికి ములాయం జాతీయాధ్యక్షుడిగా ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఆ విషయం తనకు పెద్దగా తెలియదని ములాయం అన్నారు. -
పెద్దాయనా.. ఇదేం పని?
ములాయంపై కాంగ్రెస్, బీజేపీ మండిపాటు లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఓటమికి కాంగ్రెస్ పార్టీతో పొత్తే కారణమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ములాయం మాటలకు చేతలకు పొంతనే లేదని పేర్కొంది. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేసినప్పుడల్లా ములాయం దూరంగా వెళ్లారని గుర్తు చేసింది. అలాగే ములాయం కుటుంబంలో తలెత్తిన సంక్షోభం ప్రజల వరకు చేరకుండా, ఇరు వర్గాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ఉండాల్సిందని యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ వ్యాఖ్యానించారు. యూపీలో ఓటమికి కాంగ్రెస్‌తో పొత్తే కారణమని ములాయం చేసిన వ్యాఖ్యలు నిరాధారమని కొట్టిపారేశారు. కాగా, ప్రధాని మోదీపై ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. యూపీ ప్రజల తీర్పును ఆయన అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ములాయం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించింది. తన కుమారుడే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టిన తీరుతో ఆయన ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నారని, ఆయన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి మనీశ్శుక్లా పేర్కొన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ రూ.15వేలు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ములాయం విమర్శించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ పార్టీ నా జీవితాన్ని నాశనం చేసింది
- అప్పుడు కేసులు పెట్టించింది.. ఇప్పుడు ఎస్పీ పుట్టి ముంచింది - ములాయం సింగ్ యాదవ్ తీవ్ర విమర్శలు మోయిన్‌పురి: సమాజ్‌వాదీ పార్టీ కురువృద్ధుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. గతంలో తనపై కేసులు పెట్టించడం మొదలు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం దాకా కాంగ్రెస్ తనను నిలువునా ముంచిందని అన్నారు. ఆదివారం తన సొంత నియోజకవర్గం మోయిన్పురిలో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ నామీద ఎన్నో కేసులు పెట్టించింది. ఎన్నిరకాలుగా ఏడిపించాలో అంతా చేసింది. ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ దారుణంగా దెబ్బతిన్నదంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనే. ఇక నామీద విసరడానికి వాళ్ల(కాంగ్రెస్) దగ్గర రాళ్లేవీ లేవు’ అని ములాయం వ్యాఖ్యానించారు. (బాబ్రీ)మసీదు కూల్చివేతకు కారణమైన పార్టీకి ముస్లింలు ఓట్లు వేయరని, కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు వద్దని ఎంత చెప్పినా అఖిలేశ్ వినిపించుకోలేదని ములాయం కార్యకర్తలకు వివరించారు. ‘227 స్థానాల నుంచి 47 స్థానాలకు పడిపోయాం. అదికూడా నేను, శివపాల్ గట్టిగా ప్రయత్నిస్తే గెలిచిన స్థానాలు! అసలు అఖిలేశ్‌ని కాకుండా నేనే ముఖ్యమంత్రిగా ఉండేదుంటే పార్టీకి ఈ పరిస్థితి దాపురించేదేకాదు’ అని చెప్పుకొచ్చిన ములాయం.. సమాజ్‌వాదీ పార్టీ మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ప్రధాని మోదీ చెవిలో నాన్న ఏం చెప్పారంటే..!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వేదికపై చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరికీ ఆసక్తి కలిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌ను పలకరించగా.. ఆయన మోదీ దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పారు. పక్కనే ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ ఉన్నారు. మోదీలో చెవిలో ములాయం ఏం చెప్పారన్న దానిపై అప్పట్లో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఓ ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్ బయటపెట్టారు. 'నేతాజీ (ములాయం) ప్రధాని మోదీతో.. కాస్త చూసుకోండి, ఇతను నా కొడుకు అఖిలేష్ అని చెప్పారు' అని అఖిలేష్ వెల్లడించారు. మీరు నమ్మినా నమ్మకపోయినా తాను నమ్మింది చెబుతున్నాని తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఎస్పీ ఓడిందని అఖిలేష్ ఆరోపించారు. -
ములాయం కొత్త పార్టీ!!
-
ములాయం కొత్త పార్టీ!!
కన్న కొడుకుతో విభేదాలు.. తమ్ముడికి అందలం.. చివరకు పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగింపు.. ఇంతటి ఘోర అవమానాలను చూసిన రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్.. పాతికేళ్ల తర్వాత మళ్లీ కొత్త పార్టీ పెడుతున్నారు. అన్నయ్య ములాయం సింగ్ నేతృత్వంలో 'సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా' అనే ఈ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన తమ్ముడు, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు. నేతాజీకి ఆయన గౌరవం తిరిగి ఇప్పించడానికి, సమాజ్‌వాదీ పార్టీకి చెందినవాళ్లందరినీ మళ్లీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నామని శివపాల్ యాదవ్ చెప్పారు. సుమారు పాతికేళ్ల క్రితం సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్ యాదవ్.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో విభేదాలతో ఒక విధంగా రోడ్డున పడ్డారు. తాను స్థాపించిన పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించినా.. ప్రచారపర్వంలో మళ్లీ ఆ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. కేవలం తన తమ్ముడు పోటీ చేసిన నియోజకవర్గంతో పాటు చిన్నకోడలు పోటీ చేసిన లక్నో కంటోన్మెంటు స్థానంలో మాత్రమే ములాయం ప్రచారం చేశారు. అందులో చిన్నకోడలు అపర్ణాయాదవ్ ఓడిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు అధికారం లేక, అటు పార్టీ మీద కూడా పట్టులేకుండా ఎందుకని అనుకున్నారో ఏమో.. చివరకు సొంత పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీని పెట్టినప్పుడు తనకు తోడుగా ఉన్న తమ్ముడు శివపాల్ యాదవ్‌ను కూడా తీసుకెళ్తున్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నవారిలో ఎంతమంది ములాయం వెంట వస్తారో చూడాల్సి ఉంది. ఈ వయసులో మళ్లీ ఆయన రాష్ట్రమంతా తిరిగి కొత్త పార్టీకి ప్రచారం చేసి, దాన్ని జనంలోకి తీసుకెళ్లడం కూడా ఎంవతరకు సాధ్యమో తెలియాల్సి ఉంది. -
ఆ ప్రశ్న అడగ్గానే.. అఖిలేష్‌కు కోపం వచ్చింది
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశంలో సహనం కోల్పోయారు. పార్టీ పగ్గాలను తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు అప్పగించాలంటూ బాబాయ్ శివపాల్ యాదవ్ చేసిన ప్రతిపాదన గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అఖిలేష్‌కు కోపం వచ్చింది. 'ఈ విలేకరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు. ఆయన చొక్కా కూడా కాషాయ రంగులో ఉంది. అతనితో పాటు ఇతర జర్నలిస్టులకు చెబుతున్నా.. మేలో ఏ తేదీ అయినా నిర్ణయించుకోండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. అయితే ఆ తర్వాత మీరు నా కుటుంబం గురించి ఏ ప్రశ్న కూడా అడగరాదు' అని అఖిలేష్ అన్నారు. నీలాంటి వాళ్ల వల్లే దేశం నాశనమవుతోందని, దేశం నాశనమైతే నీవు కూడా ఉండవంటూ ఆ విలేకరిపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన తర్వాత అఖిలేష్ మీడియా సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అఖిలేష్ భద్రత సిబ్బంది ఓ సీనియర్ జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్, శివపాల్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగిన సంగతి తెలిసిందే. ములాయం తన సోదరుడు శివపాల్ వర్గానికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎస్పీ చీఫ్‌గా ఉన్న ములాయంను పదవి నుంచి తొలగించి, అఖిలేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఆయన వర్గీయులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వర్గాలు రాజీపడ్డాయి. యూపీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిలేష్ స్థానంలో ములాయంకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని వారి కుటుంబంలో డిమాండ్లు వస్తున్నాయి. -
మాజీ సీఎం విద్యుత్ బకాయి రూ.4 లక్షలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీఐపీ సంస్కృతికి చెక్ పెట్టడంతో విద్యుత్ శాఖ సిబ్బంది మొండి బకాయిలను వసూలు చేసేందుకు తనిఖీ నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 4 లక్షల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లించలేదని గుర్తించారు. ఎతావ్లోని ములాయం ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. రోజుకు 5 కిలోవాట్ల విద్యుత్ వాడేందుకు అనుమతి ఉండగా, ములాయం ఇంట్లో ఎనిమిది రెట్లు ఎక్కువగా వాడుతున్నట్టు గుర్తించారు. ఈ నెలలోపు విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు గడువు విధించారు. ములాయం సొంత నియోజకవర్గమైన ఎతావ్లో సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆయనకు సువిశాలమైన బంగ్లా ఉంది. 12 గదులు ఉన్న ఈ బంగ్లాలో స్విమ్మింగ్ పూల్ ఉంది. -
‘యశ్ భారతి’పై కన్నేసిన యోగి ఆదిత్యనాథ్
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూకుడు కొనసాగుతోంది. పరిపాలన ప్రక్షాళనలో భాగంగా ఆయన దృష్టి ఈసారి గత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యశ్ భారతి సమ్మాన్’ పై పడింది. సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు, అప్పటి సీఎం యులాయం సింగ్ యాదవ్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ అవార్డుల వ్యవహారంపై విచారణకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ విచారణకు ఆదేశించారు. అవార్డుల పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సీఎం విచారణకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ అవార్డును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన యోగీ ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగంపై దృష్టి పెట్టారు. కాగా 1994లో యశ్ భారతి సమ్మాన్ అవార్డును ములాయం ఈ అవార్డును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆ రాష్టంలో వివిధ రంగాల్లో కృషి చేసినవారికి అవార్డుతో పాటు రూ.11 లక్షల నగదుతో పాటు నెలకు 50 వేల రూపాయల పెన్షన్ ను జీవిత కాలం అందిస్తోంది. ఈ అవార్డును అమితాబ్ బచ్చన్ తండ్రి ప్రముఖ కవి, రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్‌కు 1994లో ‘యశ్ భారతి’ బిరుదును ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అందించింది. దీంతో ఈ పథకం కింద అమితాబ్, ఆయన సతీమణి జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఒక్కొక్కరు నెలకు 50 వేల రూపాయల పెన్షన్ పొందడానికి అర్హులయ్యారు. అయితే ఈ డబ్బును పేదల కోసం ఖర్చు చేయాల్సింది ఆ కుటుంబం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. కాగా స్వాతంత్ర్య సమరయోధుల కంటే ఈ పెన్షన్ భారీగా ఉండటం.. బిగ్ బీ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్న నేపథ్యంలో గత యూపీ సర్కారు నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఈ అవార్డును అందుకున్నవారిలో అమితాబ్ బచ్చన్, నసీరుద్దీన్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శుభా ముద్గల్, కైలాష్ ఖేర్, క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు ఉన్నారు. అయితే ములాయం అనంతరం అధికారంలోకి వచ్చిన మాయవతి ఆ అవార్డును నిలిపివేయగా, మళ్లీ అఖిలేష్ సర్కార్ యశ్ భారతి సమ్మాన్ అవార్డును పునరుద్దరించింది. -
‘పొత్తెందుకు?’ కొడుకుపై ములాయం గుస్సా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చురకలంటించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమి ఏర్పాటుచేసే విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరితోనూ ముఖ్యంగా బీఎస్పీతో పొత్తు అవసరం లేదని, సొంతంగా గెలుచుకునే సత్తా పార్టీకి ఉందని అఖిలేశ్‌కు గట్టిగా చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఆ దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేయాలి తప్ప ఇలా పొత్తుల గురించి మాట్లాడొద్దని గట్టిగా మందలించినట్లు కూడా తెలిపారు. ‘భారీ కూటమి ఉండాల్సిందే. మేం దానికి మద్దతిస్తాం’ అని అఖిలేశ్ యాదవ్ చెప్పిన ఒక రోజులోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ తాము కూడా భారీ గ్రాండ్ అలయెన్స్‌కు సిద్ధమేనని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతోనైనా జతకడతామని తెలిపారు. సమాజ్‌వాది పార్టీ ఇందుకు మినహాయింపు ఏం కాదని, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నుంచి రక్షించేందుకు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటామని అన్నారు. దీంతో వెంటనే అఖిలేశ్ వెళ్లి ఈ విషయాన్ని ములాయంకు విన్నవించగా ‘ఒంటరిగా గెలిచ్చే సత్తా మన పార్టీకి ఉంది.. అసలు పొత్తులు ఎందుకు’ అని అన్నారంట. -
‘మీడియా మా ఇంటిపైనే పడింది.. అందుకే ఓడాం’
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ ఓటమికి మీడియా, ఓటర్లు కారణమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ కుటుంబ వివాదంపైనే మీడియా తన దృష్టిని కేంద్రీకరించిందని, ప్రజలంతా బీజేపీ చేతిలో మూర్ఖులయ్యారని విమర్శించారు. అఖిలేశ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిన ప్రజలు బీజేపీ ప్రభావానికి లోనై ఓటమిని కట్టబెట్టారని ఆరోపించారు. చల్ మోదీ, చల్ మోదీ అనే పిలుపుతో ప్రజలు మూర్ఖులుగా మారి బీజేపీతో వెళ్లిపోయారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో పార్టీ చీఫ్‌ను మార్చే ఆలోచన ఏదైనా ఉందా అని ప్రశ్నించగా ప్రస్తుతానికి ఆ ఆలోచనేది లేదని, ఇప్పుడా విషయం మాట్లాడటం కూడా అర్థం లేదన్నారు. మరోపక్క, ములాయం వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ప్రజలకు ఉన్న వ్యూహాన్ని ములాయం తక్కువ అంచనా వేస్తున్నారని, ప్రజల అవగాహనను ఆయన తక్కువ అంచనా వేస్తున్నారని మండిపడింది. -
పాత కేసు.. ములాయంకు కొత్త కష్టాలు
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు కొత్త కష్టాలు ఎదురవనున్నాయి. గతంలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలకు సంబంధించి మరోసారి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌ను బెదిరించినట్లు గతంలో నమోదైన కేసుకు సంబంధించి ఆయన బెదిరించింది నిజామా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ముందడుగు వేస్తున్నారు. త్వరలో ములాయం స్వరానికి సంబంధించి నమూనాలు సేకరించబోతున్నారు. 2015లో ములాయం తనను ఫోన్లో బెదిరించారంటూ ఠాకూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. అక్రమాస్తులు పోగేశారని ఆరోపిస్తూ గాయత్రి ప్రజాపతిపై లోకాయుక్తలో ఠాకూర్, ఆయన సతీమణి నూతన్ ఠాకూర్ పిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ములాయం వారిని బెదిరించారంట. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు విచారణ నెమ్మదిగా జరిగింది. దీంతో ప్రస్తుతం కేసు పరిస్థితిపై దర్యాప్తు అధికారి లక్నో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సంధ్యా శ్రీవాత్సవ ముందు హాజరై ఎన్నికల కారణంగా పోలీసులు ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేకపోయారని, త్వరలోనే యాదవ్ ఠాకూర్ మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేయడంతోపాటు ములాయం స్వర నమూనాలు కూడా సేకరిస్తామని చెప్పారు. ఈ కేసు ఏప్రిల్ 24న తిరిగి విచారణకు రానుంది. -
ములాయంతో వైఎస్ జగన్ భేటీ
-
ములాయంతో వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్న విషయమై ఢిల్లీలో పలువురు పెద్దలను కలుస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. శుక్రవారం ఉదయం సమాజ్‌వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన వైనాన్ని వివరించారు. దాదాపు అరగంట పాటు ములాయంతో సమావేశమైన జగన్.. అసలు స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు పెండింగులో ఉండగానే ఆ నలుగురిని ఎలా మంత్రులు చేస్తారని అడిగారు. ఇలాగే జరుగుతుంటే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని కోరారు. తాము ఇచ్చిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెట్టాల్సి ఉందని ఆయనకు తెలియజెప్పారు. ముఖ్యమంత్రి, స్పీకర్, గవర్నర్.. ఈ ముగ్గురూ ఉన్నా కూడా ప్రజాస్వామ్యానికి పాతరేశారని చెప్పారు. వైఎస్ జగన్ వాదనకు ములాయం సింగ్ యాదవ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ములాయం సింగ్‌ను కలిసిన వారిలో వైఎస్ జగన్‌తో పాటు పార్టీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి ఇతర నేతలు ఉన్నారు. -
అఖిలేశ్‌లా నన్నెవరూ అవమానించలేదు
-
అఖిలేశ్‌లా నన్నెవరూ అవమానించలేదు
ఎస్పీ చీఫ్ ములాయం ఆవేదన లక్నో: మాజీ సీఎం అఖిలేశ్‌లా ఇప్పటివరకు తననెవరూ అవమానించలేదని ఆయన తండ్రి, ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోదరుడు శివ్పాల్నూ అగౌరవపరిచాడన్నారు. ‘తండ్రిని అవమానపరిచిన పుత్రుడు రాష్ట్ర ప్రజలకు ఎలా విధేయుడిగా ఉండగలడు’అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అఖి లేశ్పై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ములాయం ప్రస్తావించారు. మోదీ నిజమే చెప్పారని, తండ్రినే పట్టించుకోనివాడు ఇంకెవరికీ ఉపయోగపడలేడని శనివారం ఇక్కడ ఓ హోటల్ ప్రారంభోత్సవంలో ములాయంసింగ్ ఘాటుగా విమర్శించారు. మోదీ వ్యాఖ్యలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయని, ఎస్పీ పరాజయానికి నాంది పలికాయని చెప్పారు. ‘నాలా పూర్తిస్థాయి రాజకీయ జీవితంలో ఉన్న నేతలెవరూ తమ కుమారులను ముఖ్యమంత్రులను చేయలేదు. 2012 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు ఓటేసి గెలిపించినా అఖిలేశ్ యాదవ్‌ను ఆ పీఠంపై కూర్చోబెట్టా. కానీ అతను నన్ను తీవ్రంగా అవమానించాడు. నా రక్తమే నాకు వ్యతిరేకంగా మారింది’ అని ములాయం చెప్పుకొచ్చారు. తనపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్‌తో అఖిలేశ్ జతకట్టడం అత్యంత బాధాకరమన్నారు. -
బీజేపీలోకి ములాయం కోడలు?
లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అపర్ణ నేతృత్వంలోని ఎన్జీవో నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్(గోశాల)ను శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. బీజేపీలో చేరే అవకాశముందా అని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా.. సమయం వచ్చినప్పుడు చెబుతా అని అపర్ణ సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నారు. బీజేపీలో చేరికను ఆమె ఖండించకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం పోటీ చేసిన అపర్ణ.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. ఈ నెల 24న తన భర్త ప్రతీక్ యాదవ్ తో పాటు సీఎం యోగిని కలిసి 20 నిమిషాల పాటు మంతనాలు జరిపారు. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిసినట్టు అపర్ణ అప్పుడు చెప్పారు. ఈ పరిణామాలన్ని చూస్తుంటే ఆమె బీజేపీలోకి వెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. -
ములాయంకు ఎమ్మెల్యేల ఝలక్
-
ములాయంకు ఎమ్మెల్యేల ఝలక్
సమాజ్‌వాదీ పార్టీకి ఇంకా తానే పెద్ద అనుకుంటున్న ములాయం సింగ్ యాదవ్‌కు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు భారీ షాకిచ్చారు. వాళ్లందరితో ఓ సమావేశం ఏర్పాటుచేసి, వాళ్లకు భోజన ఏర్పాట్లు కూడా చేద్దామనుకున్న పెద్దాయనను కాదని, తాము ఉండబోయేది అఖిలేష్ యాదవ్‌తోనే అని తేల్చిచెప్పేశారు. దాంతో చిన్నబుచ్చుకున్న పెద్దాయన.. తాను ఏర్పాటుచేసిన సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున గత ఎన్నికల్లో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వాళ్లతో పాటు ఎమ్మెల్సీలు కూడా కలిసి తమ శాసనసభాపక్ష నాయకుడిగా అఖిలేష్ యాదవ్‌ను ఎన్నుకున్నారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన సమావేశంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అఖిలేష్ యాదవ్ ఏర్పాటుచేసే సమావేశాలకు మాత్రమే వెళ్లాలి తప్ప పార్టీ తరఫున మరెక్కడికీ వెళ్లకూడదని సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే లలాయ్ సింగ్ ప్రతిపాదించారు. సమావేశంలో ఎక్కడా ములాయం పేరు ప్రస్తావనకే రాలేదు. జనవరి వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన ములాయం నుంచి.. అఖిలేష్ యాదవ్ ఆ పదవి లాగేసుకున్న విషయం తెలిసిందే. పార్టీ పగ్గాలను పూర్తిగా తన చేతిలో పెట్టుకుని కూడా అఖిలేష్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడక తప్పలేదు. అయినా సరే పార్టీ మీద మాత్రం తన ఆధిపత్యం కొనసాగించాలని అఖిలేష్ గట్టి పట్టుతో ఉన్నారు. అయితే.. అఖిలేష్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి ఆయన బాబాయ్, ఎమ్మెల్యే శివపాల్ యాదవ్ డుమ్మా కొట్టారు. అలాగే తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆజంఖాన్ కూడా ఈ సమావేశానికి రాలేదు. అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయకపోవడంతో ఆజంఖాన్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. శాసనమండలిలో సభ్యుడిగా ఉన్న అఖిలేష్ యాదవ్.. ఆ హోదాతో శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యేందుకు, ప్రతిపక్ష నేతగా వ్యవహరించేందుకు అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలకు కలిపి 325 స్థానాలు రాగా, రెండోస్థానంలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలే వచ్చాయి. -
ములాయం, అఖిలేశ్ తాజా పోరు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా సమాజ్ వాదీ పార్టీలో ‘పరివార్’ పంచాయతీ తేలలేదు. ప్రతిపక్ష నేతగా ఎవరు ఉండాలన్న దానిపై తండ్రీకొడుకు ములాయం, అఖిలేశ్ యాదవ్ మధ్య పోరు మొదలైంది. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో తండ్రీకొడుకు వేర్వేరుగా సమావేశం కావాలని నిర్ణయించడమే ఇందుకు తాజా రుజువు. అఖిలేశ్ మంగళవారం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. బుధవారం ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని ‘పెద్దాయన’ నిర్ణయించారు. మాజీ మంత్రి రామగోవింద్ చౌదరిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని అఖిలేశ్ భావిస్తుండగా, ములాయం తన సోదరుడికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. తన సోదరుడు శివపాల్ యాదవ్ ను ప్రతిపక్ష నాయకునిగా ఎంపిక చేయాలని ములాయం తలపోస్తున్నారు. పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కూడా విపక్ష నేత రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ములాయం, అఖిలేశ్ విడివిడిగా కొత్త ఎమ్మెల్యేలతో మంతనాలు జరపాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి 325 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 54 స్థానాలకే పరిమితమైంది. -
వెక్కివెక్కి ఏడ్చిన యోగి.. ఎందుకు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం చాలాకష్టం. ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేస్తుండగా ఈ ఘట్టాన్ని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు పదేళ్ల కిందట జరిగిన ఘటన గుర్తొచ్చి ఉండాలి. అప్పుడు అధికారంలో ఉన్న ములాయం ప్రభుత్వం 11 రోజులపాటు యోగిని జైల్లో పెట్టింది. దీంతో బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన సాక్షాత్తు పార్లమెంటులోనే వెక్కివెక్కి ఏడ్చారు. గోరఖ్‌పూర్‌లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించారనే ఆరోపణలపై యోగిని పోలీసులు జైల్లో పెట్టారు. తనకు ఎదురైన ఈ చేదుఅనుభవాన్ని వివరిస్తూ లోక్‌సభలో యోగి భోరుమన్నారు. అప్పటి స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ అనుమతి ఇవ్వడంతో సభలో మాట్లాడిన యోగి.. రాజకీయ కుట్ర కారణంగానే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. తనకు ’న్యాయం’ కావాలని, ఒకవేళ న్యాయం జరగకపోతే ఎంపీ పదవి నుంచి తప్పుకుంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు. తాను సన్యాసినని, తనకు రాజకీయాలు వృత్తి కాదని చెప్పారు. ఆయన భావజాలంతో వ్యతిరేకించినా.. ఆయనకు ఎదురైన చేదు అనుభవంపై సీపీఐ గురుదాస్ దాస్‌గుప్తా, సీపీఎం వర్కల రాధాకృష్ణన్, జేడీయూ ప్రభూనాథ్ సింగ్ తదితర సభ్యులు గళమెత్తారు. యోగి భావోద్వేగంతో మాట్లాడుతూ.. ములాయం ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. ఎస్పీ సభ్యులు ప్రసంగాన్ని అడ్డుకోలేదు. అప్పట్లో గోరఖ్‌పూర్‌లో మొహార్రం సందర్భంగా ఒక వ్యక్తి చనిపోయాడు. అతనికి సంతాపం తెలిపేందుకు వచ్చిన ఎంపీ యోగిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వల్ల మతఘర్షణలు మరింత పెరిగిపోవచ్చునని భావనతో అరెస్టు చేసి 11రోజులు జైల్లో పెట్టారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన యోగి నాడు ములాయం ప్రభుత్వంపై మండిపడ్డారు. నేడు అదే యోగి దేశంలో కీలకమైన యూపీ ప్రభుత్వాధినేతగా పగ్గాలు చేపడుతుండగా ములాయం మౌనసాక్షి అయ్యారు. -
మోదీతో ములాయం గుసగుసలు
లక్నో: రాజకీయ విభేదాలను, ఎన్నికల ప్రచారంలో చేసుకున్న దూషణలను పక్కనపెట్టి సమాజ్‌వాదీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌లు యోగి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తండ్రీకొడుకులు మోదీ వద్దకు వెళ్లడం, పరస్పరం పలకరించుకోవడం కనిపించింది. మోదీ అఖిలేశ్‌తో కరచాలం చేసి భుజం తట్టారు. పలకరింపుగా తన చేతులు పట్టుకున్న మోదీతో ములాయం ఏదో గుసగుసగా చెప్పారు. ప్రధాని ఆయన చెప్పినదాన్ని శ్రద్ధగా విన్నారు. కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి రాలేదు. యూపీ అభివృద్ధే ఏకైక లక్ష్యం: మోదీ న్యూఢిల్లీ: యూపీ అభివృద్ధే యోగి ప్రభుత్వ ఏకైక లక్ష్యం, ఉద్దేశమని మోదీ చెప్పారు. అతివాద హిందుత్వనేత అయిన యోగి అధికారంలోకి రావడంపై వ్యక్తమవుతున్న ఆందోళనను తొలగించేందుకుఈమేరకు పేర్కొన్నట్లు కనిపిస్తోంది. ‘మా ఏకైక లక్ష్యం, ఉద్దేశం అభివృద్ధే. యూపీ అభివృద్ది చెందితే దేశం అభివృద్ధి అవుతుంది. యూపీ యువతకు సేవ చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా.. ప్రజల ఆశీస్సులు, బీజేపీ కార్యకర్తల కఠిన శ్రమతో పార్టీ నాలుగు చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భవ్య, దివ్య భారత నిర్మాణం కోసం నిరంతర కృషి కొనసాగుతుంది. నవ్య, పరివర్తన భారత ఆవిర్భావానికి దేశ జనశక్తి బలాన్నిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. యోగి ప్రమాణం తర్వాత మోదీ ట్వీట్లు చేస్తూ.. కొత్త ప్రభుత్వం రికార్డు స్థాయి అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని ‘ఉత్తమ‘ ప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తుందన్న నమ్మకముందన్నారు. -
అందుకే ఓడిపోయాం: ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓటమిపై ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ స్పందించారు. ఓటమికి ఏ ఒక్కరూ కారణం కాదని ములాయం అన్నారు. ఓటర్లను సంతృప్తి పరచలేకపోయామని, అందుకే ఓటమి చవిచూశామని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి 54 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ అంచనాలకు మించి 325 సీట్లు కైవసం చేసుకుంది. ములాయం కొడుకు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఎన్నికలకు ముందు ములాయం కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాలు ఎస్పీ ఓటమి కారణాలుగా భావిస్తున్నారు. ములాయం ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. కేవలం సోదరుడు శివపాల్ యాదవ్, కోడలు అపర్ణ పోటీచేసిన జశ్వంత్ నగర్, లక్నో కంటోన్మెంట్లలో మాత్రమే ప్రచారం చేశారు. శివపాల్ విజయం సాధించగా, అపర్ణ ఓటమి చవిచూశారు. కాగా తమకు ఓటమి కొత్త కాదని, పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని ములాయం అన్నారు. -
రాజకీయాల్లోకి రాను కానీ.. : ములాయం భార్య
లక్నో: తాను రాజకీయాల్లోకి రావాలని భావించడం లేదని, తన కొడుకు ప్రతీక్ యాదవ్ రాజకీయ ప్రవేశం చేయాలని కోరుకుంటున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎస్పీ గెలవాలని, మరోసారి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాని చెప్పారు. ములాయంకు.. సాధన రెండో భార్య కాగా, అఖిలేష్ మొదటి భార్య కొడుకు. సాధన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కుటుంబ విషయాలు, అఖిలేష్‌తో అనుబంధం గురించి చెప్పారు. ములాయంను, తనను అఖిలేష్ ఎంతో గౌరవిస్తారని సాధన చెప్పారు. తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్‌లతో అఖిలేష్ విభేదించడాన్ని ప్రస్తావించగా.. అతన్ని ఎవరు తప్పుదోవ పట్టించారో తనకు తెలియదని, ఇందులో అతని తప్పు లేదని అన్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే జనవరి 1 నుంచే అఖిలేష్‌తో చాలాసార్లు మాట్లాడానని చెప్పారు. కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధించాయన్నారు. ఏ అధికారి బదిలీ అయినా దాని వెనుక తన హస్తం ఉందని మాట్లాడుకున్నారని, తనపై వచ్చిన ఆరోపణలకు ఎవరినీ నిందించనని సాధన చెప్పారు. ములాయం కుటుంబంతా ఒక్కటేనని, ఆయన సమాజ్‌వాదీ పార్టీని స్థాపించి అధికారంలోకి తెచ్చారని, నేతాజీ పట్ల ఎవరూ అమర్యాదగా ప్రవర్తించే పరిస్థితి లేదని అన్నారు. -
అయ్యో! తల్లీ!!
ఆకలికాలం ఉత్తరప్రదేశ్‌లో రేపు చివరి విడత పోలింగ్ జరుగుతోంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈ పోలింగ్ గురించి కాదు. ఎప్పుడో జరిగిపోయిన నాల్గవ విడత పోలింగ్ గురించి! ఆ విడతలో 53 స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటిల్లో కల్పి అసెంబ్లీ నియోజకర్గం కూడా ఉంది. అక్కడి నుంచి ఛోటేసింగ్ (బి.ఎస్.పి.), నరేంద్రపాల్ సింగ్ (బి.జె.పి.), ప్రస్తుత ఎమ్మెల్యే ఉమాకాంతి (కాంగ్రెస్) పోటీ చేశారు. ప్రజలకు వీళ్లు ఎలాంటి హామీలు ఇచ్చారో కానీ, ఈ ముగ్గురిలో ఎవరైతే తనకు ఇంత ముద్ద పెడతారో వారికే నా ఓటు అని మూలాదేవి అనే ఓటరు పోలింగ్‌కి ముందే చెప్పేశారు. మూలాదేవిది కల్పి నియోజకవర్గంలోని షేక్‌పూర్‌గూడా గ్రామం. 70 ఏళ్ల ఈ వృద్ధురాలు దాదాపుగా ఆకలితో మరణించే స్థితిలో ఉన్నట్లు అక్కడి కరువు గ్రామాలపై సర్వేచేసిన ‘బుందేల్‌ఖండ్ దళిత్ అధికార్ మంచ్’ అనే ఎన్జీవో ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఒక నిరుపేద... ఆకలిబాధతో కడుపు చేతపట్టుకోవడం మన దేశంలో ఎప్పుడూ ఉండే విషాదమే. కానీ మూలాదేవి వేరు. మీర్జాపూర్ ఎంపీ అయిన ఫూలన్‌దేవి తల్లి ఆమె! అయితే పదిహేడేళ్ల క్రితం ఫూలన్‌ని ఆమె ఎంపీగా ఉన్నప్పుడే ఆమె విరోధులు ఢిల్లీలో కాల్చి చంపారు. అప్పటి నుంచి మూలాదేవి ‘పూలన్ తల్లి’గా ప్రత్యేక హోదాను కోల్పోయారు. ఉన్న కొద్దిపాటి భూమినీ కబ్జాదారులు తన్నుకుపోయారు. మూలాదేవి, ఆమె చిన్న కూతురు రామ్‌కలి ఇప్పుడు చిరుగుల డేరాలాంటి పూరి గుడిసెలో ఉంటున్నారు. రామ్‌కలిలో ఫూలన్ పోలికలు ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో లబ్ది పొందడానికి కొన్ని పార్టీలు రామ్‌కలిని స్టేజ్ ఎక్కిస్తుంటాయి. అప్పుడు మాత్రం ఇంతో అంతో ఆమె చేతిలో పెడతుంటాయి. మిగతా అప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో గిన్నెలు కడిగి రామ్‌కలి కొంత డబ్బు సంపాదించుకొస్తుంది. అదే వారి కుటుంబానికి ఆధారం. రామ్‌కలికి టిక్కెట్ ఇస్తానని ములాయం సింగ్ హామీ ఇచ్చారు కానీ, అదీ జరగలేదు. చూడాలి ఇక్కడ ఎవరు గెలుస్తారో? గెలిచినవారు మూలాదేవికి ఇంత ముద్ద పెడతారో లేదో! అధికారంలోకి వచ్చిన వారెవరైనా ముందు చేయవలసిన పని అదే కదా. ‘బందిపోటు రాణి’ ఫూలన్ దేవి -
ఆరో దశలో 57% పోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం జరిగిన ఆరో దశ పోలింగ్‌లో 57.03 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1.72 కోట్ల ఓటర్లున్న 49 స్థానాలకు 635 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 63 మంది మహిళలున్నారు. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని యూపీ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ అజాంగఢ్తో పాటు, బీజేపీ ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్, కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా డియోరియా వంటి కీలక నియోజకవర్గాలు ఈ దశ పోలింగ్‌లో ఉన్నాయి. బీఎస్పీ ముఖ్యనేత స్వామి ప్రసాద్ మౌర్య (పద్రౌనా), ఎస్పీ తరఫున మాజీ గవర్నర్ రాంనరేశ్‌యాదవ్ తనయుడు శ్యాంబహదూర్ యాదవ్ (ఫుల్పూర్ పవాయ్) ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖలు. మణిపూర్‌లో 84 శాతం పోలింగ్ ఇంఫాల్: మణిపుర్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో గురువారం రికార్డు స్థాయిలో 84 శాతం పోలింగ్ నమోదైంది. 38 స్థానాల్లో 168 మంది పోటీపడ్డారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు అధికారులు చెప్పారు. -
నాడు 300 ర్యాలీల్లో ములాయం.. నేడు ఏమైంది?
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల హోరాహోరీ ప్రచారం, దూషణల పర్వం కొనసాగుతుంటే.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఈసారి ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఒకప్పటి రాజకీయ యోధుడు ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైందని విమర్శలు వినబడుతున్నాయి. 2012 ఎన్నికల్లో 300 ర్యాలీల్లో పాల్గొని ఓటర్లను ఆకర్షించిన ములాయం.. ఈసారి కేవలం రెండంటే రెండే ర్యాలీలకు హాజరయ్యారు. అదీ తమ్ముడు శివ్‌పాల్ తరపున ఒకటి.. చిన్న కోడలు అపర్ణయాదవ్ తరపున మరొకటి. 2014 పార్లమెంటు ఎన్నికల్లోనూ.. అనారోగ్య కారణాలతో కేవలం 18 ర్యాలీల్లోనే ములాయం పాల్గొన్నారు. ‘పార్టీ సంరక్షకుడిగా ములాయంను నియమించిన మరుక్షణమే.. ఆయన అధికారాలు తగ్గిపోయాయి. ఎస్పీలో ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం.. ములాయం బాధ్యతలు అఖిలేశ్ తీసుకున్నారు’ అని బీజేపీ సీనియర్‌నేత హృదయ్ నారాయణ్ దీక్షిత్ తెలిపారు. ‘ఎస్పీ కార్యకర్తలే కాదు. ఇతర పార్టీన నేతలూ ములాయం గురించి బాధపడుతున్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు’ అని సీనియర్ సోషలిస్టు నాయకుడు రఘునందన్ సింగ్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థాపకుడికి ఇప్పుడు పార్టీలో కనీస గౌరవం కూడా లేదని ఆర్ఎల్డీ అధ్యక్షుడు సునీల్ సింగ్ అన్నారు. బాలియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం సైకిల్ (ఎస్పీ పార్టీ గుర్తు)ను పంక్చర్ చేస్తే.. శివ్‌పాల్ చైన్ తెంపేశాడు’ అని విమర్శించారు. ములాయం పుత్రవ్యామోహంలో పడిపోయారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. అయితే ఎస్పీ నేతలు మాత్రం.. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ములాయం ఆశీస్సులున్నాయంటున్నారు. -
‘ఆ ఇద్దరి’కే పరిమితమైన ములాయం
లక్నో: గత అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ ఈసారి నామమాత్రపు ప్రచారానికే పరిమితం అయ్యారు. ఆయన కేవలం ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేశారు. 2012 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి, 300 ర్యాలీల్లో పాల్గొన్న ములాయం ఈసారి తన సోదరుడు శివపాల్ యాదవ్, చిన్న కోడలు అపర్ణ యాదవ్ తరఫున మాత్రమే క్యాంపెయినింగ్ చేశారు. కాగా కాంగ్రెస్‌తో పొత్తు పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ తరఫున కూడా ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో సోదరుడు శివ్‌పాల్‌యాదవ్ పోటీ చేస్తున్న జశ్వంత్‌నగర్ నియోజకవర్గంతో పాటు చిన్న కోడలు అపర్ణ యాదవ్ పోటీ చేస్తున్న లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రమే ఆయన ప్రచారం చేశారు. కాగా యూపీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా పెద్దాయన కేవలం సమాజ్‌వాదీ తరఫున మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌లో ఇప్పటివరకూ ఐదు దశలు పూర్తికాగా, మరో రెండు దశల పోలింగ్ ఈ నెల 4, 8వ తేదీల్లో జరగనున్నాయి. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
పూర్వాంచల్‌లో పోటాపోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశలో (శనివారం పోలింగ్) ఎస్పీ నేత, మాజీ సీఎం ములాయంసింగ్‌ను లోక్‌సభకు పంపిన ఆజంగఢ్, మాజీ ప్రధాని చంద్రశేఖర్ పుట్టిన బలియా, రెచ్చగొట్టే ప్రసంగాలతో పేరుమోసిన కాషాయ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్(ఆర్థిక నేరాలతో జైలు జీవితం అనుభవిస్తున్న ‘సహారా శ్రీ’ సుబ్రతో రాయ్ కూడా) ఆధ్యాత్మిక పీఠమున్న గోరఖ్‌పూర్ జిల్లాలున్నాయి. నేపాల్, బిహార్‌కు సరిహద్దున ఉన్న ఈ పూర్వాంచల్‌లోని జిల్లాలతో కలిపి మొత్తం ఏడు జిల్లాల్లోని 49 సీట్లకు మార్చి నాలుగున పోలింగ్ జరుగుతుంది, బాగా వెనుకబడిన ఈ ప్రాంతంలో యాదవులు, ముస్లింలు, యాదవేతర ఎంబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ బలహీనమైందని అంటున్నారు. ప్రధాన పోటీ బీజేపీ, పాలకపక్షం సమాజ్‌వాదీ పార్టీ మధ్యనేనని అభిప్రాయపడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఎస్పీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఈ పార్టీ 27, బీఎస్పీ 9 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 4, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. పూర్వాంచల్‌లో భాగమైన ఈ ఏడు జిల్లాలు నేపాల్, బిహార్, ఝార్ఖండ్‌కు విస్తరించిన భోజపురీ ప్రాంతం కిందకి వస్తాయి. ఉపాధి అవకాశాలు లేక ఈ ప్రాంత ప్రజలు ముంబై, పంజాబ్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలసపోతుంటారు. మవూ జిల్లా ‘బాహుబలి’ ముక్తార్ అన్సారీ బీఎస్పీ నుంచి పోటీ! ఇక్కడి మూడు జిల్లాల్లో పేరుమోసిన నేరగాడు ముక్తార్ అన్సారీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి మవూ సాదర్ నుంచి పోటీచేస్తున్నారు. ఆయన 1996 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. మొదటిసారి బీఎస్పీ తరఫున, తర్వాత రెండుసార్లు ఇండిపెండెంట్‌గా గెలిచారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. పొరుగునున్న ఘాజీపూర్ జిల్లా మహ్మదాబాద్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్ హత్యకేసులో నిందితునిగా ముక్తార్ 2005 నవంబర్ నుంచీ జైల్లోనే ఉన్నారు. ఎస్పీలో చేరడానికి ముక్తార్ ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి అఖిలేశ్ అడ్డుకోవడంతో బీఎస్పీలో చేరారు. అంతేగాదు, నాలుగుసార్లు జాతీయ షూటింగ్ చాంపియన్ అయిన కొడుకు అబ్బాస్‌ను పక్కనున్న ఘోసీ నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేయిస్తున్నారు. ఈ రెండు సీట్లపై అందరి దృష్టి నిలిచింది. పది సీట్ల పెద్ద జిల్లా ఆజంగఢ్ గతంలో కేంద్ర మాజీ మంత్రి చంద్రజీత్ యాదవ్, మాజీ సీఎం రాంనరేష్ యాదవ్ వంటి హేమాహేమీలు ఈ జిల్లా నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలు, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలోని పది సీట్లకు బీజేపీ, ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీట్ల రీత్యా ఇది అతి పెద్ద జిల్లా కాగా, గోరఖ్‌పూర్(9), కుషీనగర్(8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీజేపీ ఓట్లు చీల్చే హిందూ యువ వాహిని అభ్యర్థులు హిందువులను రెచ్చగొడుతూ, ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ కొంత అసంతృప్తితో ఉన్నా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆశీస్సులతో పనిచేసే హిందూ యువసేన చీలికవర్గం గోరఖ్‌పూర్ జిల్లా, దాని చుట్టు పక్కల దాదాపు డజను సీట్లలో పోటీచేస్తూ బీజేపీకి నష్టం కలిగిస్తోంది. యువవాహిని రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్‌ను ఇప్పటికే ఆదిత్యనాథ్ బహిష్కరించారు. క్షత్రియ వర్గానికి చెందిన ఈ యోగి అత్యంత వివాదాస్పద నేత. మాజీ ప్రధాని, అప్పటి కాంగ్రెస్ యంగ్‌టర్క్ గ్రూపు నేత అయిన చంద్రశేఖర్ జిల్లా బలియా. బాగా వెనుకబడిన ఈ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగకపోవడంతో పరిస్థితి కొంత బీజేపీకి అనుకూలంగా ఉంది. ఎస్పీ 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సాధించిన ఫలితాలు మెజారిటీ అందించాయి. అయినా, 2014 ఎన్నికల సమయంలో పార్టీకి ‘ఊపు’ తీసుకురావడానికి ములాయం ఆజంగఢ్ నుంచి పోటీచేసి గెలిచారుగాని ఇక్కడ బీజేపీయేతర పక్షాలకు దక్కింది ఈ ఒక్క సీటే. స్వామిప్రసాద్ మౌర్యకు బీజేపీ సీనియర్ల నుంచి ఇబ్బందులు 2012 మార్చి నుంచి వరుసగా నాలుగేళ్లు బీఎస్పీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కిందటి జూన్‌లో బీజేపీలో చేరారు. ఇప్పుడు కుషీనగర్ జిల్లా ముఖ్యపట్టణం పడరౌనా నుంచి ఆయన మూడోసారి పోటీచేస్తున్నారు. ఆయన బీఎస్పీలో ఉండగా బ్రాహ్మణులు, హిందువులను దూషిస్తూ చేసిన ప్రసంగాల్లోని మాటలతో కూడిన కరపత్రాలను హిందూ జాగరణ్ మంచ్‌లోని అసమ్మతివర్గం రహస్యంగా పంపిణీచేస్తోంది. మాయవతి కేబినెట్లో కీలకశాఖలు నిర్వహించిన మౌర్య ఫిరాయింపుతో బీజేపీకి ఎంతో ప్రయోజనం ఉంటుందని భావించారు. ఏదేమైనా పూర్వాంచల్‌లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే బీజేపీ యూపీలో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడం సాధ్యమౌతుంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అన్న పంచర్ చేస్తే.. తమ్ముడు చైన్ లాగాడు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి ఖాయమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆ పార్టీ గుర్తు సైకిల్‌ను పంచర్ చేయగా, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ చైన్ తెంచారని అన్నారు. దీంతో సైకిల్ నడవలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీలో ములాయం కుటుంబంలో ఇటీవల విభేదాలు ఏర్పడి, ఆ తర్వాత సమసిపోయిన సంగతి తెలిసిందే. ఎస్పీలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, శివపాల్ వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత విభేదాలను పక్కనబెట్టి తామంతా ఒక్కటేనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎస్పీలో విభేదాల కారణంగా ఆ పార్టీ బలహీనపడిందని రాజ్‌నాథ్ అన్నారు. -
అదంతా ములాయం నాటకం: అమర్‌సింగ్
-
అదంతా ములాయం నాటకం: అమర్‌సింగ్
న్యూఢిల్లీ: యావద్దేశంలో ఆసక్తి రేకెత్తించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కుటుంబ కలహమంతా నాటకమేనా? పార్టీ సమావేశాల్లో మైకు లాక్కోవడం, ఆగ్రహావేశాలు.. తర్వాత కన్నీళ్లు, ఆలింగనాలతోసద్దుమణిగిన యాదవ పరి‘వార్’ అంతా తూచ్ వ్యవహారమేనా? అవుననే అంటున్నారు ఈ గొడవలకు కారకునిగా ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ సీనియర్ నేత, ములాయంకు అత్యంత సన్నిహితుడూ అయిన అమర్‌సింగ్. ఎస్పీ అంతర్గత వివాదమంతా ములాయం సింగ్ యాదవ్ పథకం ప్రకారం ఆడించిన నాటకమేనని, కొడుకు అఖిలేశ్‌కు లబ్ధి చేకూర్చేందుకు ఈ పని చేశారని అమర్ బాంబు పేల్చారు. ‘ములాయం, అఖిలేశ్ ఒక్కటిగానే ఉన్నారు, ఉంటారు’ అని అని సీఎన్ ఎన్–న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘కొడుకు చేతిలో ఓడిపోవాలని ములాయం కోరిక. సైకిల్ (పార్టీ గుర్తు), కొడుకు, ఎస్పీ ఆయన బలహీనతలు. మరైతే ఎందుకీ నాటకం? ఇదంతా పథకం ప్రకారం ఆడించిన డ్రామా. మా అందరికీ పాత్రలు దక్కాయి. మమ్మల్ని వాడుకుంటున్నట్లు తర్వాత తేలింది.. ఎస్పీతో ఉన్న అనుబంధం నా బహిష్కరణతో(పార్టీ నుంచి) తెగిపోయింది.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి పన్నిన ప్రణాళిక అని తెలుసుకున్నా.. దీనికి మాస్టర్ స్క్రిప్ట్ రైటర్ ములాయం. కాంగ్రెస్‌తో పొత్తు ములాయంకు ఇష్టం లేకపోతే ఆయన ప్రియాంక గాంధీతో అంతసేపు ఎందుకు సమావేశం అయ్యారు?’ అని పేర్కొన్నారు. -
ములాయంపై అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై అమర్‌సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్‌వాది పార్టీ సంక్షోభం అంతా కూడా ములాయం సింగ్ ఆడిన ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. కొడుకు అఖిలేశ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఆ డ్రామా అడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ పొత్తుకు కారణం ములాయం సింగే అని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాదు, ములాయం సింగ్ పెద్ద స్క్రిప్ట్ రైటర్ కూడా అంటూ చతుర్లు విసిరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు సమాజ్‌వాది పార్టీలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను అసలు పదవినే ఆశించనని, పోటీ కూడా చేయననే ములాయం తనకు గుండెలాంటివాడని ఆయన ఏం చెబితే అది చేస్తానంటూ చెప్పిన అమర్ సింగ్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అఖిలేశ్ సీఎం అయితే ఆయనే మంత్రి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని, ఈ కొత్త ప్రభుత్వంలోనూ తన సోదరుడు శివ్‌పాల్ యాదవ్ మంత్రిగా కొనసాగుతారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. 'బంఫర్ మెజారిటీతో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధిస్తుంది. అఖిలేశ్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు' అని ఆయన ఆదివారం ఎటావా జిల్లా సాఫైలో ఓటు వేసిన అనంతరం పేర్కొన్నారు. అబ్బాయి అఖిలేశ్ యాదవ్, బాబాయి శివ్‌పాల్ యాదవ్ మధ్య పార్టీ ఆధిపత్యం కోసం తీవ్రస్థాయి పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోరులో ములాయం తమ్ముడు శివ్‌పాల్ వైపు నిలిచినా.. ఆఖరికీ అఖిలేశ్ విజయం సాధించి.. పార్టీని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా శివ్‌పాల్ యాదవ్‌పై విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. అయితే, అఖిలేశ్ విమర్శలను ములాయం తోసిపుచ్చారు. పార్టీని దెబ్బతీయాలనుకున్న కొందరిని ఉద్దేశించి అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారని, శివ్‌పాల్ గురించి కాదని పేర్కొన్నారు. అఖిలేశ్ కొత్త ప్రభుత్వంలోనూ శివ్‌పాల్ మంత్రిగా కొనసాగుతారని పేర్కొన్నారు. -
‘అనుమానం వద్దు.. అఖిలేశే సీఎం’
-
అఖిలేష్, ప్రతీక్.. నాకు రెండు కళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ మూడో దశ ఎన్నికల్లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ములాయం, ఆయన భార్య సాధన గుప్తా.. కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్.. కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ ఓటు వేశారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే సాధనా గుప్తా.. ఓటు వేసిన అనంతరం కాసేపు విలేకరులతో మాట్లాడారు. అఖిలేష్, ప్రతీక్ ఇద్దరూ తనకు రెండు కళ్లలాంటివారని అన్నారు. తమ కుటుంబమంతా ఒక్కటేనని చెప్పారు. అఖిలేష్.. ములాయం మొదటి భార్య కొడుకు కాగా, ప్రతీక్.. ములాయం రెండో భార్య సాధన కొడుకు. అఖిలేష్ భార్య డింపుల్ కనౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రతీక్ భార్య అపర్ణ లక్నో కంటోన్నెంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆ మధ్య ములాయం ఇంట్లో, ఎస్పీలో ఆధిపత్య పోరు సాగినపుడు ఆయన కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. సాధన, అపర్ణ, ములాయం సోదరుడు శివపాల్ ఒకవైపు.. అఖిలేష్, ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మరో వైపు ఉన్నట్టు కథనాలు వినిపించాయి. విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చిన ములాయం కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో తామంతే ఒక్కటేనని చెబుతున్నారు. -
‘అనుమానం వద్దు.. అఖిలేశే సీఎం’
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు మళ్లీ అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాల్లేవని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ మూడో దశ ఎన్నికల సందర్భంగా సఫాయ్ నియోజకవర్గంలో తన కోడలు అపర్ణాయాదవ్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ అఖిలేశ్ సీఎం అన్నారు. తన సోదరుడు శివపాల్ యాదవ్ కూడా భారీ మెజార్టీతో గెలుస్తాడంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోపక్క అఖిలేశ్ కూడా తాజా ఎన్నికలపై స్పందిస్తూ ఈసారి కూడా విజయం తమకే వస్తుందని చెప్పారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి భారీ విజయం సాధించనుందని అన్నారు. బీజేపీ దెబ్బతినడం ఖాయమని తెలిపారు. తన తండ్రి ములాయం ఆశీస్సులు తనకు నిండుగా ఉన్నాయని, మళ్లీ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. -
ఎప్పుడూ సీఎం అయ్యేవాడు కాదు!
అఖిలేశ్‌పై ములాయం వ్యాఖ్య ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఉమ్మడి వెళుతున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్ పార్టీ పొత్తుపై ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీ మాత్రమే లబ్ధి పొందుతుందని ఆయన పేర్కొన్నారు. 'ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎలాంటి బలం లేదు. ఈ పొత్తు వల్ల ఆ పార్టీ పునరుత్తేజం పొంది కొన్ని స్థానాలు గెలుపొందవచ్చు. కానీ పోటీ మాత్రం ఎస్పీ-బీజేపీ మధ్యే ఉంటుంది' అని ఆయన స్పష్టం చేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనయుడు అఖిలేశ్ యాదవ్‌ను ముఖ్యమంత్రి చేయడంపై తనకెలాంటి విచారం లేదని పేర్కొన్నారు. 'నిజానికి నేనే అఖిలేశ్‌ను ముఖ్యమంత్రిని చేశాను. నాకు తెలుసు అప్పుడు నేను చేయకుంటే.. అతను ఎప్పుడూ సీఎం అయ్యేవాడు కాదు' అని పేర్కొన్నారు. తమ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తుందన్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. టికెట్ రాని కొందరు ఆగ్రహంతో ఉన్నారు తప్ప కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. -
చిన్న తేడాతో గెలుపు గల్లంతే
► విజయావకాశాల్ని నిర్దేశిస్తున్న ఓట్లశాతంలో స్వల్ప తేడా ► గత ఫలితాల్ని ఉదాహరణగా చూపుతున్న విశ్లేషకులు లక్నో: ఓటరు నాడి అంతుపట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎస్పీ–కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరులో విజేత ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా కూడా సీట్ల సంఖ్యలో భారీ అంతరానికి కారణమవచ్చంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల ఆలోచనా ధోరణిలో చిన్న మార్పు పార్టీలు, అభ్యర్థుల గెలుపోటముల్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితా లు అందుకు నిదర్శనంగా వారు ఉదహరిస్తున్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 30 శాతం, ఎస్పీ 26 , బీజేపీ 17, కాంగ్రెస్ 8.5 శాతం ఓట్లు గెలుచుకున్నాయి. అప్పుడు సమాజ్‌వాదీ గెలుపొందిన స్థానాలు 97. ఐదేళ్ల అనంతరం 2012లో ఎస్పీ కేవలం అదనంగా మూడు శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుని 97 స్థానాల నుంచి రికార్డు స్థాయిలో 224 స్థానాలకు ఎగబాకింది. 2007తో పోల్చితే బీఎస్పీ 4.5 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా సాధించినా.... ఆ పార్టీ గెలుపొందిన స్థానాలు 206(2007) నుంచి 80కు పడిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లోను... ఇక 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 (18.25 ఓట్లశాతం), ఎస్పీ 23 (23.26%) స్థానాలతో మంచి ఫలితాలు సాధించాయి. బీఎస్పీ 20 (27.42%) స్థానాలకు పరిమితం కాగా... బీజేపీ కేవలం 10 (17.5%) స్థానాలతో సరిపెట్టుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారమారయ్యాయి. బీజేపీ ఓట్లశాతం 42.6కు ఎగబాకడంతో 71 స్థానాలతో ప్రత్యర్థి పార్టీల్ని చిత్తుచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... మొత్తం 403 గాను 80 శాతం స్థానాల్లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఎస్పీ 42 అసెంబ్లీ స్థానాల్లో, బీఎస్పీ కేవలం 9 స్థానాల్లో ఆధిక్యం కనపరిచాయి. కోడలు, తమ్ముడి కోసం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్... కోడలు, తమ్ముడి కోసం రంగంలోకి దిగారు. వారిద్దరి గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆయన... ఆ రెండు స్థానాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ పోటీచేస్తున్న జశ్వంత్‌నగర్‌లో ప్రచారం చేస్తూ... ఈ ఎన్నికలు తనకు, శివ్‌పాల్‌కు ఎంతో ముఖ్యమైనవన్నారు. కోడలు అపర్ణ విజయంతో తన గౌరవం ముడిపడిఉందంటూ ఉద్వేగంగా చెప్పారు. 2014 కంటే 10% తగ్గినా.. విశ్లేషకుల అంచనా ప్రకారం... 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీకి 10 శాతం తగ్గినప్పటికీ అధికార పీఠం దక్కించుకునే అవకాశాలున్నాయి. బీజేపీ 32 శాతం ఓట్లు సాధిస్తే మెజార్టీకి అవసరమైన 202 సీట్లను సులువుగా గెలుచుకోవచ్చు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోను ఆ స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఓబీసీల్లో పట్టున్న అప్నాదళ్‌తో పొత్తు తమకు లాభిస్తుందనే ఆలోచనలో బీజేపీ ఉంది. -
ములాయం హత్యకు కాంగ్రెస్ కుట్ర: మోదీ
-
ములాయం హత్యకు కాంగ్రెస్ కుట్ర: మోదీ
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను చంపించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని, అలాంటి పార్టీతో ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్న విషయాన్ని 1984లో స్వయంగా ములాయం సింగ్ యాదవే చెప్పారని గుర్తు చేశారు. ములాయం మీద హత్యాయత్నం జరిగిన తర్వాత.. చరణ్ సింగ్, వాజ్‌పేయి కలిసి రాష్ట్రాయ లోక్తాంత్రిక్ మోర్చాను ప్రారంభించి కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అధికారం కోసం.. తన తండ్రిని చంపేందుకు ప్రయత్నించినవాళ్లతో అఖిలేష్ చేతులు కలిపారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని చిబ్రాము నియోజకవర్గం పరిధిలోని గుర్సాయ్గంజ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ విషయం తెలిపారు. 1984 మార్చి 4వ తేదీన ములాయం ఇటావా నుంచి లక్నో వెళ్తుండగా కారుపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని, ఆ కేసులో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ ప్రముఖ యాదవ నాయకుడి పేరు బయటకు వచ్చిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ ఆ విషయాన్ని గతంలో చెప్పడమే కాక, ఇటీవల కూడా యాదవ్ కుటుంబంలో చెలరేగిన అంతర్యుద్ధం సమయంలో కూడా ప్రస్తావించారని మోదీ అన్నారు. ''కాంగ్రెస్ కన్నింగ్ అన్న విషయాన్ని అఖిలేష్ తెలుసుకోవడం లేదు. కానీ ములాయంకు తెలుసు'' అని ప్రధాని చెప్పారు. రాజకీయాలు దారుణంగా దిగజారిపోయాయని, కుర్చీకోసం ఇలాంటి పనులు కూడా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. యూపీ విధాన పరిషత్తులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ పదే పదే ప్రభుత్వం మీద విరుచుకుపడటంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన మీద దాడి చేయించింది గానీ దాన్నుంచి ఆయన తప్పించుకున్నారన్నారు. కాంగ్రెస్ ఒళ్లో కూర్చునే ముందు అఖిలేష్ ఈ విషయాన్ని గుర్తుచేసుకోవాలని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను గౌరవిస్తానని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ అధికారం కోసం ఒక కాలు సమాజ్‌వాదీ పడవలోను, మరో కాలు బీఎస్పీ పడవలోను వేశారని ఎద్దేవా చేశారు. -
తోటికోడలి కోసం ప్రచారం
అపర్ణకు బాసటగా డింపుల్ లక్నో: యూపీ సీఎం అఖిలేశ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ లక్నోలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బుధవారం తోటికోడలు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ స్థానం నుంచి ములాయం రెండో భార్య కుమారుడైన ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన డింపుల్.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, లక్నో మెట్రో ప్రాజెక్టును డింపుల్ ప్రస్తావించినపుడు ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషి బరిలో ఉన్నారు. కుటుంబంలో ఇటీవల నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇద్దరు కోడళ్లు ఒకే వేదికపైకి రావటం విశేషం. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కూడా చిన్న కోడలి తరపున బుధవారం కంటోన్మెంట్లో ప్రచారం చేశారు. బీజేపీవి విద్వేష రాజకీయాలు:రాహుల్ బారాబంకి: బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని జైద్పూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తనూజ్ పూనియా తరఫున ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ విద్వేషం ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ ప్రజల మధ్య సామరస్యం పెంచడానికి పాటుపడుతోందనే సందేశాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీకి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ మాటలు మాత్రమే చెబుతారని పనులు చేయరని ఎద్దేవా చేశారు. యూపీ అభివృద్దికి కాంగ్రెస్–ఎస్పీ కూటమి మాత్రమే పనిచేస్తుందని అన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ మాట నిజం కాలేదని, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును నవంబర్ 8న చిత్తుకాగితాలు చేశారని చురకలంటించారు. -
యూపీలో రాజకీయ సినిమా..!
ముందు శత్రుత్వం.. విరామం తర్వాత స్నేహం ⇒ కాంగ్రెస్–ఎస్పీ పొత్తుపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు ⇒ కాంగ్రెస్ జనాలు ఎలాంటి వారో అఖిలేశ్‌కు తెలీదు ⇒ ములాయంపై హత్యాయత్నం సంగతి గుర్తుతెచ్చుకోవాలని సూచన కన్నౌజ్: ‘‘ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వేదికగా ఓ సినిమా నడుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు. ‘27 ఏళ్లుగా యూపీ వెనుకబడింది’అంటూ ఒకరు.. యాత్రల పేరుతో మరొకరు.. సినిమా మొదటి సగభాగాన్ని రక్తికట్టించారు. ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఇంటర్వెల్(విరామం) తర్వాత ఈ ప్రత్యర్థులు మిత్రులుగా మారిపోయారు. ఎన్నికల ప్రకటన వచ్చేసరికి ఒకరిపై మరొకరు ప్రేమ ఒలకబోసుకుంటూ కూటమిగా జనం ముందుకు వచ్చారు’’ అని కాంగ్రెస్–సమాజ్‌వాదీ పార్టీ పొత్తును తప్పుపడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. మోసపూరిత కాంగ్రెస్ జనాల వైఖరి ఎలా ఉంటుందో అఖిలేశ్‌కు తెలియదని, అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. 1984లో ములాయంసింగ్‌యాదవ్‌పై జరిగిన హత్యాయత్నం గురించి ఒకసారి ఆలోచించాలని గుర్తుచేశారు. అప్పుట్లో ఓ కాంగ్రెస్ నాయకుడు ములాయంపై చేసిన హత్యాయత్నాన్ని మరచిపోయావా అని ప్రశ్నించారు. అఖిలేశ్‌కు అనుభవం తక్కువని, అందుకే కాంగ్రెస్ మోసపూరిత వైఖరి ఎలా ఉంటుందో అతనికి తెలియదని, కానీ ములాయంకు కాంగ్రెస్ వైఖరి ఎలాంటిదో తెలుసని అందుకే ఆ పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్–ఎస్పీ పొత్తు మీ కలలను కల్లలు చేస్తుందని ఓటర్లను మోదీ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకునే.. మరోవైపు బీఎస్పీతోనూ సంబంధాలు కొనసాగిస్తోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్–ఎస్పీ కూటమి ఏర్పాటైన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలేశ్ మాయావతిపై విమర్శలు చేస్తే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆమె గురించి మాట్లాడేందుకు నిరాకరించారని గుర్తుచేశారు. యూపీ ఎందు లో ముందుంది అని చెప్పాలంటే.. అవినీతి, అల్లర్లు, మహిళలపై ఆకృత్యాలు, నిరుద్యోగం, పేదరికం, వలసలు వీటిలోనే అని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, కనీస మద్దతుధర, చిన్న రైతులకు రుణాలు మాఫీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా.. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే.. తొలి సమావేశంలోనే రుణాల మాఫీ హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, దీనికి సంబంధించి తనపై అన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. అయితే దేశప్రజలు చాలా ఆలోచనాపరులని, ఇలాంటి అబద్ధపు ప్రచారం వారిపై పనిచేయదని చెప్పారు. మోదీ నివాళి న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో మంగళవారం ఉగ్రవాదులతో పోరు సందర్భంగా అమరులైన నలుగురు ఆర్మీ సిబ్బందికి ప్రధాని మోదీ బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరులైన సైనికుల్లో మేజర్ ఎస్.దహియా కూడా ఉండటం తెలిసిందే. సైనికుల భౌతికకాయాలను శ్రీనగర్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి తరలించారు. ‘ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు నివాళులర్పించాను. వారి త్యాగాన్ని, శౌర్యాన్ని భారత్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. -
ఒకే వేదికపై ములాయం కోడళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ నిరూపించారు. ఎన్నికల ప్రచారంలో డింపుల్, అపర్ణ ఇద్దరూ కలసి ఒకే వేదికను పంచుకున్నారు. తోడికోడలు అపర్ణకు మద్దతుగా డింపుల్ ప్రచారం నిర్వహించారు. బుధవారం లక్నో కంటోన్మెంట్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో డింపుల్, అపర్ణ పాల్గొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా డింపుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. అపర్ణకు ఓట్లు వేసి గెలిపించాలని స్థానికులను కోరారు. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అయిన అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. సమాజ్‌వాదీ పార్టీ ఇంతవరకు ఎప్పుడూ నెగ్గని లక్నో కంటోన్మెంట్ స్థానాన్ని ఆమె ఎంచుకున్నారు. ఇక ములాయం పెద్ద కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ లోక్ సభ సభ్యురాలు. ఆమె కనౌజ్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. బుధవారం ములాయం కోడళ్లు ఇద్దరూ లక్నోలో ప్రచారం చేశారు. ఇద్దరి వ్యక్తిత్వాలు వేరయినా డింపుల్, తాను చాలా సన్నిహితంగా ఉంటామని అపర్ణ చెప్పారు. ఎస్పీలో తలెత్తిన అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ వెలుగులోకి వచ్చారు. ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు కథనాలు వచ్చాయి. ఓ దశలో సీఎం అఖిలేశ్ ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే సందేహం వచ్చినా.. చివరికి అపర్ణకు, బాబాయి శివపాల్ యాదవ్ లకు పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ములాయం కుటుంబంలో ఆధిపత్య పోరు, ఎస్పీలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కినా.. ఎన్నికలు వచ్చేసరికి తమ మధ్య విభేదాలు లేవని, అందరూ కలసికట్టుగా ఉన్నామని ములాయం కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
‘మార్చి 11న వారి పాలనకు శుభంకార్డే’
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే మార్చి 11న సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వంశపరిపాలనకు శుభం కార్డు పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. శుక్రవారం ఎతవాహ్లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ పరిపాలన చేపట్టి ఏడాదిలోనే తాము యూపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎస్పీ, బీఎస్పీ విఫలమయ్యాయని ఆరోపించారు. రాకుమారులు(అఖిలేశ్, రాహుల్ గాంధీ) అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని, ఇప్పటికే యూపీలో సర్వం దోచారని, ప్రతి రంగంలో అవినీతి పేరుకుపోయిందని మండిపడ్డారు. ఉత్తరభారతంలో హత్యలు ఎక్కువగా జరిగే రాష్ట్రం యూపీనే అని, శాంతిభద్రతలు పూర్తిగా ఇక్కడ నశించాయని, ఒకే వంశ పాలనకు త్వరలోనే ముగింపు రానుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారం వస్తుందనే నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నారని, ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రైతులనుంచి నేరుగా విత్తనాలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. -
నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు?
సమాజ్‌వాద్ పార్టీలో ప్రస్తుతం తండ్రికొడుకులు బాగానే ఉన్నప్పటికీ, గత కొన్ని రోజుల క్రితం వరకు తండ్రి ములాయం, పెద్ద కొడుకు అఖిలేష్ మధ్య రాజుకున్న వివాదం అంతాఇంతా కాదు. సైకిల్ గుర్తు కోసం ఆ ఇద్దరి పోరు ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్‌లో కలవరం సృష్టించింది. అదే సమయంలో ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ లంబోర్గిని కార్లో లక్నో రోడ్లపై చక్కర్లు కొట్టడం పేపర్లలో హెడ్‌లైన్స్‌గా నిలిచింది. ఇది కాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయింది. తన రూ. 5 కోట్ల లంబోర్గిని కారుపై సోషల్ మీడియాలో తలెత్తిన వివాదంపై ప్రతీక్ యాదవ్ తొలిసారి స్పందించారు. ఆ లంబోర్గిని హురాకాన్ కారును రుణం తీసుకుని మరీ కొనుకున్నానని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పారు. రాజకీయాలంటే పెద్దగా ఇష్టంలేని ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్, జిమ్స్ వంటి బిజినెస్‌లను కలిగి ఉన్నారు. ఈ కారుకు సంబంధించిన అన్ని పేపర్లు తన దగ్గరున్నాయని, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్టు ప్రతీక్ తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా దీనిపై ఎందుకంత రాద్ధాంతమని ప్రశ్నించారు. ఒకవేళ ఈ రూ.5 కోట్లను ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టుంటే ఎవరూ ఏమి అనేవారు కాదుకదా? అని ప్రశ్నించారు. సమాజ్ వాద్ పార్టీలో చిచ్చు రేగడానికి ఓ వంతు కారణమైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ఈ సారి ఎన్నికల్లో లక్నో నుంచి పోటీకి దిగబోతున్నారు. తన భార్య అపర్ణ యాదవ్ కచ్చితంగా గెలుస్తారని ప్రతీక్ ధీమా వ్యక్తంచేశారు. తను పోటీకి దిగబోతున్న ప్రాంతంలో అపర్ణ చాలా చేశారని ప్రతీక్ తెలిపారు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో 250 సీట్ల నుంచి 300 సీట్ల వరకు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తనకు రాజకీయాలంటే ఇష్టంలేదని, ఒకవేళ ఆ ఇష్టమే ఉంటే ఎప్పుడో రాజకీయాల్లోకి ప్రవేశించే వాడినని చెప్పారు. ఎక్కువగా తన బిజినెస్‌ల వైపే దృష్టిసారిస్తానని ప్రతీక్ పునరుద్ఘాటించారు. -
తండ్రి సన్నిహితుడికి అఖిలేష్ ఝలక్
లక్నో : మరో రెండు రోజుల్లో(ఫిబ్రవరి11న) ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికలకు తెరలేవబోతున్న నేపథ్యంలో మళ్లీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన క్యాబినెట్లో ఉన్నతవిద్యా శాఖామంత్రిగా పనిచేస్తున్న శారదా ప్రసాద్ శుక్లాకు ఉద్వాసన పలికారు. శుక్లను ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా తీసివేయడానికి తన క్యాబినెట్ ఆమోదం తెలిపిందని తెలుపుతూ ఆ రాష్ట్ర గవర్నర్ రాం నాయక్‌కు అఖిలేష్ ఓ లేఖను రాశారు. ఎస్పీ సుప్రిం, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు శుక్ల సన్నిహితుడు. అయితే సమాజ్ వాద్ పార్టీ తరుఫున ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శుక్ల ఇటీవలే రాష్ట్రియ లోక్‌దళ్‌లో చేరారు. పొత్తు పెట్టుకుందామనుకున్న ఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్లు చివరి నిమిషాల్లో విరమించుకున్నాయి. ఎస్పీ ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకోదని, కేవలం కాంగ్రెస్‌తో కలిసి మాత్రమే పోటీచేస్తామని ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఎస్పీ నుంచి టిక్కెట్ దక్కకపోవడంతో శారదా ప్రసాద్ శుక్ల లక్నో సరోజిని నగర్ నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ తరుఫున బరిలోకి దిగబోతున్నారు. -
అలక తుస్.. ఇక ప్రచార హోరులో పెద్దాయన
న్యూఢిల్లీ: అనుకున్నదే అయింది. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అలక పూర్తిగా పోయింది. చిన్నచితక అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రేపటి నుంచి ప్రచార రంగంలోకి ఆయన దూకుతున్నారు. అది కూడా పూర్తి సంతృప్తితో.. తమ పార్టీ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ విషయంలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ‘ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మా కూటమి విజయం సాధిస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కూటమి గెలిస్తే అఖిలేశ్ సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి’ అని ములాయం సోమవారం పార్లమెంటులో చెప్పారు. ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ఎస్పీతో విభేదించి ఎన్నికల తర్వాత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న అంశంపై ప్రశ్నించగా ‘అతను ఎలా కొత్త పార్టీ పెడతారు? ఒక వేళ మాట్లాడి ఉంటే ఏదో కోపంలో అనుంటాడు. పార్టీని విడిచి పెట్టి నాసోదరుడు ఎక్కడికీ వెళ్లడు. నేను కూడా రేపటి నుంచి ప్రచారంలోకి దిగుతాను’ అని స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్-ఎస్పీ కూటమి విషయంలో ములాయం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన ప్రచారంలోకి కూడా వెళ్లకపోవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, వాటన్నంటికీ ముగింపు పలుకుతూ ములాయం తాజా నిర్ణయం ప్రకటించారు. -
సైకిల్ గుర్తు నేతాజీదే
లక్నో : సమాజ్‌వాద్ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన సైకిల్ గుర్తు నేతాజీదేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. తండ్రికొడుకుల సంబంధం ఎప్పటికీ విడదీయరానిది ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన ఈవెంట్లో పేర్కొన్నారు. నేతాజీ ఆశీర్వాదాలు ఎప్పటికీ తన కొడుకు ఉంటాయన్నారు. తమ ప్రచారంలో నేతాజీ ఫోటోలను వాడతాం.. తమ ప్రతి స్లోగన్‌లో నేతాజి ఉంటారు. పొత్తుకోసం నేతాజీ కూడా ప్రచారం నిర్వహించబోతున్నారంటూ అఖిలేష్ తెలిపారు. ఒకవేళ ఎస్పీ గెలిస్తే అత్యంత ఎక్కువగా సంతోషపడేది నేతాజీనేనని పేర్కొన్నారు. తండ్రి కొడుకుల బంధం అన్ని సందర్భాల్లో అలాగే ఉంటుందని, ఏం మార్పులుండవని అఖిలేష్ చెప్పారు. ఇటీవల తండ్రి, ఎస్పీ సుప్రిం ములాయం సింగ్ యాదవ్‌తో అఖిలేష్‌కు తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. తనకు ప్రధాని అయ్యే లక్ష్యమేమి లేదని తేల్చిచెప్పేశారు. రాష్ట్రంలోనే తన బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నట్టు చెప్పారు. ఢిల్లీకి దూరంగా ఉన్న వ్యక్తులే చాలా సంతోషంగా ఉంటారని అంటూ ప్రధాని అయ్యే ఉద్దేశ్యాలేమి లేవని తేలికగా చెప్పేశారు. ఈ సారి యూపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పీ పొత్తు కచ్చితంగా పూర్తి మెజార్టీతో గెలుపు కెరటం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 403 సీట్లు కలిగిన సభలో, 300 పైగా సీట్లు తామే గెలుపొందుతామన్నారు. తమ ప్రభుత్వం అందించిన పథకాలతో లబ్ది పొందిన ప్రతిఒక్కరూ తమకు ఓటువేస్తారని చెప్పారు. దీంతో తాము 300 సీట్లు సంపాదిస్తామన్నారు. 55 లక్షల మంది మహిళలకు సమాజ్‌వాద్ పెన్షన్, 18 లక్షల ల్యాప్‌టాప్‌ల సప్లై, కన్య విద్యా ధన్ యోజన, మెడికల్ సీట్లు రెట్టింపు వంటి పలు పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన చెప్పారు. -
మళ్లీ యూటర్న్ తీసుకున్న ములాయం!
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో చెప్పలేం. తాజాగా ఆ పార్టీ పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. నిన్న కాక మొన్న తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేది లేదని.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా కేవలం సమాజ్‌వాదీ తరఫున మాత్రమే ప్రచారరంగంలో ఉంటానని చెప్పిన ములాయం, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తరఫున కూడా ప్రచారంలో పాల్గొంటానన్నారు. ''ఎంతైనా వాడు నా కొడుకు కదా'' అని అఖిలేష్ గురించి అన్నారు. ముఖ్యమంత్రికి మీ ఆశీస్సులుంటాయా అని ఒక విలేకరి అడిగినప్పుడు ఆయనిలా చెప్పారు. ఫిబ్రవరి తొమ్మిదో తేదీ తర్వాత తాను ప్రచార పర్వంలోకి వస్తానన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అని అడిగినప్పుడు.. ''వాళ్లు మా మిత్రపక్షం కదా, మరెందుకు ప్రచారం చేయను?'' అని ఎదురు ప్రశ్నించారు. జనవరి 22వ తేదీన అఖిలేష్ యాదవ్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు అక్కడ ములాయం కనిపించలేదు. అదేరోజు తాను తన భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి ములాయంకు మేనిఫెస్టో కాపీ ఇచ్చినట్లుగా ఉన్న ఒక ఫొటోను అఖిలేష్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సరిగ్గా ఒక రోజు తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుపై ములాయం మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తును తాను అంగీకరించనని స్పష్టం చేశారు. హస్తం పార్టీతో పొత్తు తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా సమాజ్ వాదీ పార్టీకి ఉందని పేర్కొన్నారు. ఈ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని చెప్పడంతో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఊపిరి పీల్చుకున్నాయి. -
ములాయం ఘాటు వ్యాఖ్యలు
-
ములాయం ఘాటు వ్యాఖ్యలు
లక్నో: అఖిలేశ్, రాహుల్ గాంధీ కలిసి మీడియా ముందుకు వచ్చిన కొద్దిసేపటికే ములాయం సింగ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తును తాను అంగీకరించనని స్పష్టం చేశారు. హస్తం పార్టీతో పొత్తు తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా సమాజ్ వాదీ పార్టీకి ఉందని పేర్కొన్నారు. ఈ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని ప్రకటించారు. ‘కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో ఉంది. కానీ దేశానికి ఏమీ చేయలేదు. ఈ ఎన్నికల్లో నేను ప్రచారం చేయను. కాంగ్రెస్-ఎస్పీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేయమని కార్యకర్తలను కోరతాన’ని ములాయం చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి నారద్ రాయ్.. బీఎస్పీలో చేరడంతో ఆయన ఈవిధంగా స్పందించారు. శివపాల్ యాదవ్ తో పాటు నారద్ రాయ్ ను గత అక్టోబర్ లో కేబినెట్ నుంచి అఖిలేశ్ తొలగించారు. నారద్ పార్టీ మారకుండా చూసేందుకు ములాయం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
నా కొడుకుపై అంత కోపాన్ని చూపగలనా!?
దాదాపు నెలరోజులపాటు జరిగిన కుటుంబ ఆధిపత్యపోరులో నెగ్గి పార్టీపై పూర్తి పట్టు సాధించిన యూపీ సీఎం, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్వరం మార్చారు. అందరూ తనవారేనంటూ దగ్గరికి తీసుకుంటున్నారు. ఒకప్పుడు బద్ధ శత్రువుగా పరిగణించిన అమర్‌సింగ్‌ను ఉద్దేశించి సైతం 'అంకుల్' అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఓ హిందీ చానెల్ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన అఖిలేశ్ తన వర్గం, కుటుంబం అంతా ఒక్కటే అన్న సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించారు. తండ్రి ములాయం సింగ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఆయన సమాజ్‌వాదీ (సోషలిస్ట్). ఇంట్లో, బయటా ఒకేవిధంగా కోపాన్ని వ్యక్తం చేస్తారు' అని అన్నారు. కుటుంబ వివాదంలో తనకు కలిగిన భావోద్వేగాలను వ్యక్తంచేస్తూ.. 'నా కొడుకుపై నేనెప్పుడైనా ఈవిధంగా కోప్పడగలనా? అని అనుకున్నాను' అని పేర్కొన్నారు. ములాయం పలుసందర్భాల్లో బాహాటంగానే అఖిలేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బహిరంగంగా అఖిలేశ్ పాలనను ఆయన విమర్శించారు కూడా. ఇక, తనను ఎస్పీ నుంచి గెంటేశారని అమర్‌సింగ్ ఒకవైపు ఆవేదన చెందుతుండగా.. ఆయన మంచి వ్యక్తి అని, తమ కుటుంబాన్ని ఎంతోగానో ప్రేమిస్తారని అఖిలేశ్ సాంత్వనపూరిత వ్యాఖ్యలు చేశారు. -
నేను.. నాన్న.. మేనిఫెస్టో..
లక్నో: ‘కామ్ బోల్తా హై(పనే మాట్లాడుతుంది)’ నినాదంతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్.. భారీ ఉచిత హామీలు గుప్పించారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఆదివాంర జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి అఖిలేశ్ తండ్రి ములాయంసింగ్ యాదవ్, చిన్నాన్న శివ్‌పాల్ యాదవ్ గైర్హాజరయ్యారు. దీంతో కొడుకుపై తండ్రి ఇంకా కోపంగానే ఉన్నారని, ములాయంను సంప్రదించకుండా అఖిలేశ్ మేనిఫెస్టో విడుదల చేశారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ చర్చకు ఫుల్స్టాప్ పెడుతూ, నేతాజీ తనవెంటే ఉన్నారనడానికి నిదర్శనంగా సీఎం అఖిలేశ్ యాదవ్ ఒక ఫొటోను పోస్ట్‌చేశారు. (ఎస్పీకి గట్టి షాక్!) ములాయం రెండు చేతుల్లో రెండు మేనిఫెస్టో కాపీలు పట్టుకుని ఉండగా, పక్కనే అఖిలేశ్, డింపుల్ యాదవ్‌లు, మరోవైపు మంత్రి ఆజం ఖాన్ నిల్చున్న ఫొటోను అఖిలేశ్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. తద్వారా తనకు తండ్రి ఆశీర్వాదాలున్నాయని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఫొటోకు మాత్రమే పోజిచ్చిన ములాయం.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న అఖిలేశ్ అభ్యర్థనను మాత్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. (ప్రెషర్ కుక్కర్లు.. స్మార్ట్ఫోన్లు!) ములాయం ప్రచారంలో పాల్గొనకపోవడం వల్ల ఎస్పీకి నష్టం వాటిల్లుతుందనే వాదన బలంగా వినిపించినప్పటికీ పెద్దాయన ససేమిరా అనడంతో.. అఖిలేశ్ ఈ తరహా ఫొటోలతో నష్టనివారణ చర్యలకు నడుంకట్టారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగానూ యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 11 మొదటిదశ, మార్చి 4న ఆఖరిదశ పోలింగ్ ఉంటుంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 105 సీట్లు కేటాయించిన ఎస్పీ 298 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. -
ములాయం హోదా, నేమ్ ప్లేట్ మారాయి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ హోదా మారింది. మొన్నటి వరకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరించిన ములాయం ఇకనుంచి గార్డియన్‌గా ఉంటారు. శనివారం రాత్రి లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఆయన నేమ్ ప్లేట్‌ను మార్చారు. చాలా ఏళ్లుగా ఉన్న ‘ములాయం సింగ్ యాదవ్, జాతీయ అధ్యక్షుడు’ నేమ్ ప్లేట్ స్థానంలో, ‘ములాయం సింగ్ యాదవ్, గార్డియన్’ అనే నేమ్ ప్లేట్‌ను ఉంచారు. ములాయం కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గం.. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ములాయంను తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అఖిలేష్‌ను ఎన్నుకున్నారు. ములాయం కుటుంబంలో ఏర్పడ్డ విభేదాలు అనేక మలుపులు తిరుగుతూ, చివరకు అఖిలేష్ వర్గం పూర్తి ఆధిపత్యం సాధించింది. ఈ నేపథ్యంలో ములాయంను గార్డియన్‌గా పేర్కొంటూ పార్టీ ఆఫీసులో నేమ్ ప్లేట్ ఉంచారు. పార్టీలో ములాయంకు, అఖిలేష్‌కు సమాన హోదా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్‌కు ములాయం మార్గదర్శకుడిగా ఉంటారని తెలిపారు. -
ములాయంకు మరో ఎదురుదెబ్బ
-
కొడుకు కోసం తమ్ముణ్ని బలి చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌పై విమర్శలు కురిపించారు. ములాయం తన కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కోసం, తమ్ముడు శివపాల్ యాదవ్‌ను బలిపశువును చేశారని విమర్శించారు. ములాయం కుటుంబంలో విభేదాలన్నీ డ్రామాగా ఆమె అభివర్ణించారు. అఖిలేష్ తమతో విభేదిస్తున్నట్టుగా ములాయం డ్రామా నడిపించారని ఆరోపించారు. అఖిలేష్ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ములాయం కుటుంబ సభ్యులు ఈ నాటకం ఆడారని ధ్వజమెత్తారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అఖిలేష్‌కు ఓటమి ఖాయమని మాయావతి అన్నారు. ఇక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రథయాత్రపై స్పందిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, అభ్యర్థులను నిలబెట్టలేని దయనీయ పరిస్థితిలో ఉందని అన్నారు. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో మాయావతి పైవిధంగా స్పందించారు. -
ములాయంకు మరో ఎదురుదెబ్బ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న మొన్నటివరకు తనకు కుడిభుజంగా భావించిన పార్టీ సీనియర్ నాయకుడు అంబికా చౌదరి పార్టీకి రాజీనామా చేసి.. బీఎస్పీలో చేరారు. పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని, ఇక తనను తాను పూర్తిగా బహుజన సమాజ్ పార్టీకి అంకితం చేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో తొలుత వెనకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అంబికా చౌదరి.. మరో ఎనిమిది మందితో పాటు ఉద్వాసనకు గురయ్యారు. ఈయన ఒకప్పుడు ములాయంకు సన్నిహితుడిగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా పార్టీని వీడి వెళ్లిపోవడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టమే అవుతుందని అంటున్నారు. -
ములాయం సింగ్ యాదవ్‌కు మరో షాక్!