sailajanath
-
చంద్రబాబు కోసమే నీ ప్రెస్ మీట్ లు.. షర్మిలకు కౌంటర్
-
‘ఆమె రాజకీయాలు కాంగ్రెస్ కోసమా?, బాబు కోసమా?’
తాడేపల్లి: వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీలు తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్. వక్ఫ్ బిల్లు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిలతో ాట్లాడిస్తున్నారన్నారు. ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరొక అంశాన్ని పైకి తేవడం చంద్రబాబుకి అలవాటని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, డైవర్షన్ చేయడానికి షర్మిలను ఉపయోగించుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్లో ఆమె ఒక భాగంగా మారారన్నారు.‘ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, వారికిచ్చిన మాట తప్పుతూ వక్ఫ్ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబునాయుడుగారు ద్రోహం చేశారు. ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేక టీడీపీ పార్టీ నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా షర్మిలను రంగంలోకి దిగారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. విజయవాడ వరదలు అంశం అయినా, తిరుపతి లడ్డూ విషయం అయినా, ఇప్పుడు వక్ఫ్ బిల్లు విషయం అయినా ఇలా చంద్రబాబుగారి ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా డైవర్ట్ చేయడానికి షర్మిళగారు రావడం, ప్రెస్మీట్లు పెట్టడం అన్నది ఒక రివాజుగా మారింది.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ప్రభుత్వంలో ఉన్నవారిని నిలదీయాలి, ప్రజల తరఫున ప్రజా సమస్యలపై వారిని ప్రశ్నించాలి. కాని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షంలో ఉన్నవారిని నిలదీస్తూ ఒక ప్రతిపక్షానికి చెందిన రాష్ట్రశాఖ అధ్యక్షురాలైన షర్మిల రాజకీయాలు చేస్తున్నట్లుంది. రాజకీయాల్లో ఇది వింతగా ఉంది. చంద్రబాబు ఎప్పుడు డైవర్షన్ కావాలనుకుంటే అప్పుడు ఆమె రంగంలోకి దించుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఏం చేస్తున్నారన్నదానిపైనే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.మరి ఆమె చేస్తున్న రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కోసమా? లేక చంద్రబాబుకోసమా?గత ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించడమే లక్ష్యంగా పనిచేశారు. వారికి సంబంధించిన మాధ్యమాల్లో వారు చెప్పినట్టుగానే మాట్లాడారు. ఆమేరకే నడుచుకున్నారు. ఇక్కడే షర్మిల అసలు ఉద్దేశాలు బయటపడ్డాయి’ అని శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
Sailajanath: మీరు చేసిన ప్రమాణాలు గుర్తుచేసుకోండి..
-
‘చంద్రబాబు నిరుద్యోగ భృతి ఎక్కడ’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు నిరుద్యోగ భృతి ఎక్కడ? అని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం నమ్మక ద్రోహమే అవుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్సార్,వైఎస్ జగన్ పకడ్బందీగా అమలు చేశారువైఎస్ జగన్ లక్షలాది మంది పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించారు. రూ. 3900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం చంద్రబాబు అసమర్థతే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలైనా మెగా డీఎస్సీ ఎందుకు ఇవ్వలేదు?.నిరుద్యోగ భృతి ఎక్కడ చంద్రబాబు’అని ప్రశ్నించారు. -
అబద్ధాలలో చంద్రబాబు PHD చేశారు
-
చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దం: శైలజానాథ్
అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టామా అని అన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నాయకులు శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉంది. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతోంది. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా?.రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంక్షేమ ఫలాలు అందించారు. వైఎస్ జగన్‌ను చూసి చంద్రబాబు పాలన నేర్చుకోవాలి. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారు. టీడీపీ కూటమికి చట్టం చుట్టమా?. వారు ఎన్ని తప్పులు చేసినా ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?’ అని ప్రశ్నించారు.రెడ్‌బుక్ పేరుతో లోకేష్ అరాచకలు..మరోవైపు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం. వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు వ్యాఖ్యలు అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రజలందరికీ బాధ్యుడిగా ఉండాలి. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడు అని భావిస్తాం. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచకాలు చేస్తున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే సీఎం హోదాలో ఉన్న వైఎస్సార్ రాజకీయాలు చూడలేదు. కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌దే’ అని తెలిపారు. -
హామీలు అమలు చేయకుండా బాబు ప్రజలను మోసం చేస్తున్నారు: YSRCP నేతలు
-
‘పవన్.. హామీల అమలు నీ బాధ్యత కాదా?’
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నాయకులు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. అలాగే, కక్ష సాధింపు చర్యలను మానుకుని హామీలను అమలు చేయాలని కూటమి నేతలకు హితవు పలికారు.అనంతరంలో వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు పాలనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు?. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. టీడీపీ కూటమి.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ చంద్రబాబు జారుకునే యత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు తగదు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కొనసాగిస్తుంది. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. ప్రజల గొంతుకను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు మానుకుని ఇచ్చిన హామీలను అమలు చేయండి అని హితవు పలికారు.వైఎస్సార్సీపీ నేత, ప్రభుత్వ విద్యా మాజీ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. హామీల అమలులో చంద్రబాబు, పవన్‌కు చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. టీడీపీ కూటమి అరాచకాలపై నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటాం అని తెలిపారు. -
శైలజానాథ్ పార్టీలో చేరడంపై అనంత వెంకట్రామిరెడ్డి రియాక్షన్
-
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్ (ఫొటోలు)
-
వైఎస్ఆర్ సీపీ పార్టీలో శైలజానాథ్
-
వైఎస్సార్సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీలోకి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Sake Sailajanath) చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy) సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు.వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే..ఈ సందర్భంగా శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరుపున వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైఎస్సార్సీపీలోకి చేరానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదని శైలజానాథ్ అన్నారు.‘‘ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చేందుకు నా వంతు పనిచేస్తా.. రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలే కానీ ఆర్ధిక ప్రయోజనాల కోసం కాదు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం. జగన్ ఏ బాధ్యత అప్పగించినా నా శక్తి మేరకు పనిచేస్తా’’ అని శైలజానాథ్ చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు.కాగా, అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.ఇదీ చదవండి: రెడ్‌బుక్ కుట్రకే ‘పచ్చ’ సిట్! -
పవన్ కల్యాణ్‌వి పిల్ల చేష్టలు
ఉద్దండరాయునిపాలెం(తాడికొండ): పవన్‌కల్యాణ్‌వి పిల్ల చేష్టలని, అమరావతి ఉద్యమానికి మద్దతు అని చెబుతూ..శంకుస్థాపనకు వచ్చిన మోడీని ఎందుకు నిలదీయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం అమరావతి రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో ఆయన పర్యటించారు. శైలజానాథ్ మాట్లాడుతూ..అమరావతి కోసం ప్రణాళికాబద్ధంగా జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తున్న పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనన్నారు. త్వరలో జాతీయ నాయకులతో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి జేడీ శీలం, పార్టీ నేతలు తులసీరెడ్డి, మస్తాన్ వలీ, చిలకా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీమంత్రి శైలజానాథ్‌కు కీలక బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ నూతన అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కార్యనిర్వహణ అధ్యక్షులుగా ఎన్.తులసిరెడ్డి, మస్తాన్ వలీని నియమించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తుందని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే రఘువీరారెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను గత ఏడాది మే నెలలో కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినా, అప్పటి నుంచి రఘువీరా రాజీనామాను కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు. రఘువీరా తన పట్టు వీడకపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి అయింది. దీంతో పలువురు నేతలు ఆ పదవి కోసం పోటీ పడ్డారు. పార్టీ నేతలు సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్, సుంకర పద్మశ్రీ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సాకే శైలజానాథ్‌కు దక్కింది. పూర్వ వైభవాన్ని తెచ్చేలా కృషి చేస్తా.. పీసీసీ చీఫ్‌గా నియమకంపై శైలజానాథ్ ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సీనియర్ల అనుభవాలను కలుపుకుని ఏపీలో ముందుకు వెళతామని శైలజానాథ్ పేర్కొన్నారు. రాజధాని మార్పుపై ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరికొన్ని రోజుల్లోనే రాజధాని అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రజల పక్షాన నిలబడి, వారి అభీష్టం నెరవేర్చేలా పోరాడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని పని చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అధికారంలో ఉన్న బీజేపీ ...ప్రజల ఆలోచనలు, కోరికలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. -
రేసులో సాకే, చింతా మోహన్, పద్మశ్రీ!
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎన్.రఘువీరారెడ్డి ససేమిరా అంటున్నారు. సొంత పనులపై బిజీగా ఉన్నందున నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండలేనంటూ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి కావడంతో పలువురు నేతలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్‌లు ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. అయితే వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని పారీ్టలో అధిక శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీ మాజీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలసి విన్నవించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును ఎంపిక చేయాలని భావిస్తున్నా ఆయన సుముఖంగా లేనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోవాలంటూ ఎక్కువ మంది అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్‌చాందీకి అధిష్టానం సూచించింది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అవును రాజీనామా చేశాను: రఘువీరారెడ్డి -
వైఎస్ఆర్ హయాంలోప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, వైఎస్ఆర్ కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి శైలజనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108,104 వంటి పథకాలను ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాయలసీమలోని ప్రాజెక్టులకు మహర్దశ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో సాగునీటి రంగానికి బడ్జెట్లో అధిక నిధులను కేటాయించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగా శ్రీశైలం ప్రాజెక్టును కేవలం రాయలసీమకు కేటాయిస్తే సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చి మంచిపాలన అందించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నజీర్ అహ్మద్, సత్తార్, బండి జకరయ్య, నీలిశ్రీనివాసరావు, చార్లెస్, గోశాల దేవి తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోంది’
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని మండిపడ్డారు. జేడీఎస్- కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంలో పలు ఎమ్మెల్యేలు వరుస రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం అమలు చేయాలన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. బీజేపీ విలువలను తుంగలో తుక్కి అప్రజాస్వామిక విధానాలను పాటిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీ విధానాలపై తాము పోరాడుతామని శైలజ స్పష్టం చేశారు. -
శైలుకు ఘోర పరాభవం
అనంతపురం: ఆయన గత చరిత్ర ఘనం. రెండు పర్యాయాలు ఒకే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాం లో విప్‌గా పని చేశారు. వైఎస్ అకాలమరణంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినేట్లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఆ పార్టీ కర్ణాటక ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జ్గా పని చేస్తున్నారు. ఇంతటి చరిష్మా ఉన్న నాయకుడికి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర అవమానం జరిగింది. ఇంతకీ ఆయన ఎవరంటే డాక్టర్ సాకే శైలజానాథ్! శింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొన్న జరిగిన ఎన్నికల్లో బరిలో నిలిచిన శైలజానాథ్‌కు కేవలం 1,384 ఓట్లు (0.69 శాతం) మాత్రమే పోలయ్యాయి. ఈ ఓట్లు నన్ ఆఫ్ ద అబౌ (నోటా)తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ కావడం విశేషం. ఇక్కడ ‘నోటా’కు 2,340 ఓట్లు వచ్చాయి. శైలజానాథ్‌కు వచ్చిన ఓట్లు చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రిగా పని చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీలో అన్నీ తానై రాష్ట్రమంతా హడావుడి చేసిన ఆయన తన సొంత నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు సైతం దక్కించుకోలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరంతరం రాష్ట్ర, దేశ రాజకీయాల గురించే మాట్లాడే ఆయన సొంత నియోజకవర్గంలో కనీస రాజకీయ పరువు కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికి ఎగబాకిందన్న చందంగా ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు సాధించిన శైలూ.. కర్ణాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాడట!’ అంటూ జిల్లా ప్రజలు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. -
శైలజనాథ్‌కు శింగనమల సీటు ఆఫరిచ్చిన సీఎం..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సిట్టింగ్‌లను మార్చకపోతే.. ఓటమి తప్పదు. మారిస్తే సహాయ నిరాకరణతోనూ భంగ పాటు తప్పదు.. ఏం చేయాలో తెలియక టీడీపీ అధిష్టానం అయోమయంలో పడిపోయింది. తీవ్ర కసరత్తు అనంతరం 11 స్థానాల అభ్యర్థిత్వాలపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో ఉంచారు. సిట్టింగ్‌లను మార్చి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావించారు. శింగనమలకు బండారు శ్రావణి, గుంతకల్లుకు మధుసూదన్‌గుప్తా, కళ్యాణదుర్గం టిక్కెట్ అమిలినేని సురేంద్రకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి సిఫార్సుతో శింగనమలకు మొదట శ్రావణి పేరు ఖరారు చేశారు. అయితే చంద్రబాబు తాజాగా చేయించిన సర్వేలలో శ్రావణి అయితే... భారీ తేడా ఓడిపోతుందనే తేలింది. దీంతో శ్రావణిని పక్కనపెట్టి మాజీ మంత్రి శైలజానాథ్‌ను టీడీపీలోకి ఆహ్వానించి, టిక్కెట్ ఇవ్వాలని భావించారు. ఈ విషయంపై జేసీ దివాకర్‌రెడ్డితో చర్చించారు. అయితే శైలజానాథ్, రఘువీరారెడ్డి తనకు తీరని ద్రోహం చేశారని, శైలజనాథ్‌కు టిక్కెట్ వద్దని జేసీ అడ్డుకున్నారు. జేసీ మాటలను ఖాతరు చేయని చంద్రబాబు శైలజానాథ్‌తో జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో సంప్రదింపులు జరిపించారు. అయితే టీడీపీలో చేరేందుకు శైలజనాథ్ నిరాకరించారు. కాంగ్రెస్ పార్టీని వీడదలుచుకోలేదని, అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తాను ఈ ఎన్నికల్లో ఓడిపోతానని తెలుసనీ, అయినప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగాలనే నిర్ణయంతో ఉన్నానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు టీడీపీ ఈ దఫా అధికారంలోకి రావడం లేదని, జగన్గాలి బలంగా వీస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. శైలజనాథ్ టీడీపీలోకి చేరేందుకు నిరాకరిచండంతో శింగనమల స్థానంపై చంద్రబాబు పురాలోచనలో పడ్డారు. శ్రావణిని వ్యతిరేకిస్తోన్న టీడీపీ కీలక నేతలు శింగనమల నియోజకవర్గంలోని కీలక నేతలు ముంటిమడుగు కేశవ్‌రెడ్డి, ఆలం నర్సానాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు పలువురు నేతలు శ్రావణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరంతా శ్రావణితో పోలిస్తే యామినీబాలకు టిక్కెట్ ఇవ్వడమే ఉత్తమమని అధిష్టానం వద్ద తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టీడీపీ కేడర్ శమంతకమణితోనే ఉందని, శ్రావణికి సహకరించరని చెప్పారు. ఈ విషయాలను జేసీ దివాకర్‌రెడ్డి కూడా వివరించారు. అయితే జేసీ మాత్రం యామినీకి కాకుండా తాను సిఫార్సు చేసిన శ్రావణికే టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబును పట్టుబడుతున్నారు. దీంతో చివరకు శ్రావణికే టిక్కెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనంతపురంపై మళ్లీ పేచీ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి అభ్యర్థిత్వంపై జేసీ పట్టువదల్లేదని తెలుస్తోంది. చౌదరిని మార్చి తీరాల్సిందేనని గట్టిగా చెబుతున్నారు. ‘చౌదరి మినహా మరో ఆప్షన్ చెప్పండి’ అని చంద్రబాబు జేసీని అడిగితే...‘ నేను ఏ పేరూ సిఫార్సు చేయను. చౌదరి మాత్రం వద్దు. అతడికి ఇస్తే అతను ఓడిపోవడంతో పాటు ఎంపీగా నాకుమారుడి విజయావకాశాలు కూడా దెబ్బతింటాయి’ అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అనంతపురం అభ్యర్థిత్వంపై మళ్లీ చంద్రబాబు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అమిలినేని సురేంద్రబాబు అనంతపురం, లేదా కళ్యాణదుర్గం సీటును ఆశిస్తున్నారు. అనంతపురం సీటుకోసం ఇప్పటికీ ప్రయత్నాలు ఆపలేదు. అయితే కళ్యాణదుర్గానికి ఇతని పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనంతపురంపై జేసీ డిమాండ్ పట్ల చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది. అలాగే గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా మధుసూదన్‌గుప్తా పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే గత ఐదేళ్లలో ఒక్క జన్మభూమి సభలో కూడా పాల్గొనని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఎలా సమర్థిస్తారని ఎమ్మెల్యేలు హనుమంతరాయ చౌదరి, జితేందర్‌గౌడ్, యామినిబాల అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. పనితీరు ఆధారంగానే టిక్కెట్లు కేటాయించాలనుకుంటే జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ పనితీరు అట్టడుగున ఉంటుందని, మరి ఆయనను ఎలా సమర్థిస్తారని ఈ ముగ్గురూ తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన తర్వాత సిట్టింగ్‌ల కీలక నిర్ణయం టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. గుంతకల్లు, కళ్యాణదుర్గం నుంచి తమ పేరు జాబితాలో లేకపోతే కీలక నిర్ణయం తీసుకోవాలని జితేంద్రగౌడ్, హనుమంతరాయచౌదరి భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టిక్కెట్ల దక్కకపోతే తమ కుటుంబాలు పూర్తిగా రాజకీయాలను వదిలేయాల్సి వస్తుందని, కచ్చితంగా ఈ ఎన్నికల్లో టిక్కెట్ తమకే కావాలనే పట్టదలతో ఉన్నారు. టిక్కెట్ దక్కకపోతే అదే నియోజకవర్గాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని జితేంద్రగౌడ్ తన అస్మదీయులతో చెప్పారు. గుప్తాను ఓడించడమే తన కర్తవ్యంగా పనిచేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతి ఏకంగా పార్టీ వీడాలని చౌదరిపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తమకు ఇంతకంటే అవమానం ఏముంటుందని, మరోపార్టీలోకి వెళదామని యోచిస్తున్నారు. ఇప్పటికే జనసేన టిక్కెట్ ఇస్తామని మారుతికి ఆపార్టీ నేత నాదేండ్ల మనోహర్ కబురు పంపినట్లు తెలుస్తోంది. అయితే మారుతి టీడీపీకి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే నిర్ణయంతో ఉన్నట్లు సమాచారం. -
చంద్రబాబు సర్కార్‌కు స్పష్టమైన ప్రణాలిక లేదు
-
'బాబును చూస్తే వర్షం కూడా రాదు'
-
'బాబును చూస్తే వర్షం కూడా రాదు'
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి రైతులంటే చిన్నచూపు అని అందుకే రైతులను అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. బాబు ను చూస్తే వర్షం కూడా రాదనేది నిజమని పేర్కొన్నారు. రైతుల పట్ల బాబు అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అనంతపురం జిల్లా పెద్ద కొడుకని చెప్పిన బాబు.. అక్కడి ప్రజల కంట్లో మట్టి కొట్టి పొయ్యారని తీవ్రంగా విమర్శించారు. అనంతపురంపై నిజంగా ప్రేమ ఉంటే హంద్రీనీవా నుంచి జిల్లాలోని అన్ని చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. ఏపీలో అసమర్ధ పాలన కొనసాగుతోందని అన్నారు. పోలవరాన్ని 2018లో పూర్తి చేస్తానని చెప్పి...ఇప్పుడు 2019 అంటూ మాట మార్చారని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పధకాన్ని భ్రష్టు పట్టించారని.. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అప్పు పడిందని.. ఇది మీకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. కూలీ డబ్బులు ఇవ్వకపోతే.. పేదవారు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. వెంటనే కూలి డబ్బులు ఇచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు. -
సంక్షోభంలో రైతాంగం
గార్లదిన్నె : జిల్లాను కరువు కమ్ముకొని వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, అతివృష్టి, అనావృష్టి ప్రభావం వల్ల రైతుల బతుకులు దయనీయంగా మారాయని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. మండల పరిధిలోని ఇల్లూరు, కల్లూరు, గుడ్డాలపల్లి, కనంపల్లి, తిమ్మంపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరువుపై రైతులతో ఆదివారం ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులు సమస్యలను శైలజానాథ్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్లుగా ఆయకట్టుకు నీరు రాకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా కరువు తాండవిస్తోందన్నారు. భూగర్భజలాలు అడుగంటి తాగునీరు కరువయ్యాయన్నారు. జిల్లాలోనే పంటలు సమృద్ధిగా పండే గార్లదిన్నె మండలంలోని ఇల్లూరు గ్రామంలో వరి, పండ్లతోటలు నీరులేక ఎండిపోయాయని తెలిపారు. దీంతో గ్రామాల్లో ప్రజలు ఇప్పటికే 20 శాతం మంది వలస పోయారన్నారు. అదేవిధంగా రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించినా బిల్లులు రాక కూలీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉపాధి బిల్లులు వచ్చినా బ్యాంకుల్లో అప్పులోకి జమ చేస్తున్నారని తెలిపారు. కరువు నివారణ చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాంగ్రెస్ మండల కన్వీనర్ నాగరాజు, నగర అధ్యక్షుడు దాదా గాంధీ, బీసీ సెల్ అధ్యక్షుడు రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారు
- రైతు కూలీల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టవా..? - మంత్రుల బృందం కరువు గ్రామాల్లో పర్యటించాలి - మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నార్పల (శింగనమల) : ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి శైలజానాథ్‌లు విమర్శించారు. ఆదివారం నార్పల మండలంలోని బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకం అమలు తీరు, కరువు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. స్థానిక రచ్చకట్ట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పేదల అభ్యున్నతి కోసం అప్పటి కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో బండ్లపల్లిలో ప్రారంభించారని గుర్తు చేశారు. రాయల సీమ జిల్లాల్లో ఉన్న కరువును గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తొమ్మిది వారాలు గడుస్తున్నా, కూలీ డబ్బులు అందలేదని ఉపాధి కూలీలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతు కూలీల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు కరువు గ్రామాల్లో పర్యటించి వారిని ఆదుకోవాలన్నారు. రైతు కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, ఉపాధి పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కనీసం రూ.200 కూలీ గిట్టుబాటు కాక గ్రామాల నుంచి కూలీలు వలస వెళ్తున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. -
సీఎంకు పంచాయితీలు చేయడమే పని
మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం అనంతపురం సెంట్రల్ : జిల్లాలో అధికారపార్టీ ఎమెల్యేలు, మం త్రుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచాయితీలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు ఒకరి నియోజకవర్గంలోకి మరొకరు వెళ్లొద్దని హద్దులు గీసి, దందాలు చేసుకోండి అని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జిల్లాలో వరుస కరువులతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మూడేâýæ్లలో జిల్లా అభివృద్ధికి చేసిందేమీలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా ప్రత్యేకించి ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చారని, జేసీబీలతో పనులు చేయిస్తూ నిధులను దండుకుంటున్నారని ఆరోపిం చారు. జిల్లాలో ఉపాధిలేక దాదాపు 4 లక్షల కుటుంబాలు వలసపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శిగా శింగనమలకు చెందిన పూల నాగరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నాగరాజు, వాసు, ప్రతాప్‌రెడ్డి, రామాంజనేయులు, జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి
-
కరువు గుర్తించడంలో ప్రభుత్వం విఫలం
– ప్రభుత్వంపై మాజీ మంత్రి శైలజానాథ్ ద్వజం అనంతపురం సెంట్రల్ : వర్షాభావంతో పంటలు నిట్టనిలువునా ఎండినప్పుడు కాకుండా ఆలస్యంగా కేంద్ర బృందం జిల్లాలో పర్యటించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఽ శనివారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం పొలాల్లో ఏమీ లేదని, ఈ సమయంలో కరువు బృందం పర్యటించడం వల్ల కరువు పరిస్థితులను చూపించడం కష్టమన్నారు. ఇంత ఆలస్యం కావడానికి కేంద్రానికి కరువు నివేదికలు పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కరువు బృందం పరిశీలించి, ఆర్థికసాయం కూడా అందిందని తెలిపారు. రైతులకు తక్షణం ఆర్థిక సాయంగా 5 వేల కోట్లు అందించాలని డిమాండ్ చేశారు. ‘ప్రాజెక్టు అనంత’ను అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. హెచ్చెల్సీ ద్వారా ఏప్రిల్ వరకూ ఆయకట్టు కింద నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధికారప్రతినిధులు రమణ, నాగరాజు, డీసీసీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, నాయకులు వాసు, వశికేరి శివ తదితరులు పాల్గొన్నారు. -
‘కేంద్రం అసమర్థతతోనే ప్రజలు కష్టాలు’
అనంతపురం సెంట్రల్ : పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, దీంతోనే ప్రజలకు కష్టాలని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. అనంతపురం పాతూరులోని గాంధీ విగ్రహం ఎదుట వ్యాపారుల ఇబ్బందులను బుధవారం ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాడిపత్రి బస్టాండ్‌లోని గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీసీ అధికార ప్రతినిధి రమణ, డీసీసీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, యువజన కాంగ్రెస్ నాయకులు జనార్దన్‌రెడ్డి, గోవర్దన్ పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
-
బాబు భూ బకాసురుడయ్యాడు : శైలజానాథ్
హైదరాబాద్: ప్రతిపక్షాలు అన్నీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలని పార్లమెంట్లో పోరాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ బకాసురుడిగా వ్యవహరిస్తున్నాడని ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శైలజానాథ్ ఆరోపించారు. రాజకీయ పార్టీలకు రాజధానిలోను , జిల్లా కేంద్రాల్లోనూ భూములను కేటాయించే చట్టానికి బాబు ఇష్టానుసారంగా సవరించడం సరికాదన్నారు. శ్రీకాకుళం, కడప, కాకినాడలో ఇప్పటికే కోట్ల విలువైన భూముల్ని టీడీపీ చేజిక్కించుకోవడం అన్యాయమన్నారు. పార్టీలకు భూములిచ్చే అంశంలో 1987 లోఎన్టీఆర్ తెచ్చిన చట్టాన్నే యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
పావలా కోడికి ముప్పావలా మసాలా
ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి పావలా కోడికి ముప్పావలా మసాలా ఖర్చు చందంగా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఇందిర భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం రూ. 300 కోట్ల ఒప్పందాలు చేసుకొని అందుకు ప్రచార నిమిత్తం వెయ్యి కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. సీఆర్డీఏ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు తన ప్రయోజనాలకు సంబంధించిన డాక్యుమెంట్లపై మాత్రమే సంతకాలు చేస్తూ వాటి పనులు మాత్రమే వేగవంతం అయ్యేలా చేస్తున్నారన్నారు. ఒక పక్క ప్రభుత్వ భూములను సింగపూర్ కంపెనీలకు ఇస్తూనే రూ. 5,500 కోట్లతో మౌళిక వసతులను కల్పించడానికి పలువురితో ఒప్పందాలు కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థను తొలగిస్తే అపరాధ రుసుం కింద 20 శాతం చెల్లించాలనే నిబంధనను సవరించాలనే ఆర్థిక శాఖ అభ్యంతరానికి చంద్రబాబు ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కంపెనీలు అసెండాస్, సిన్బ్రిడ్జ్, సెంబ్ కార్బలతో ప్రభుత్వం చేసుకున్న స్విస్ ఛాలెంజ్ ఒప్పందాలను తీవ్రంగా తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. రైతులను బెదిరించి పోలీసులు, తహసీల్దార్లు, ఆర్డీవోల ద్వారా బలవంతంగా భూములను సేకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయన్నారు. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉండాలని పొందుపరచినా అర్థాంతరంగా తన ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. -
'400 హామీలిచ్చి.. ఒక్కటీ నిలబెట్టుకోలేదు'
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం కిర్లంపూడి(తూర్పుగోదావరి జిల్లా): ప్రజాస్వామ్యబద్ధంగా తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబంపై ప్రభుత్వం జరిపిన దాడి పాశవికమని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మంగళవారం రాత్రి ఆయన ముద్రగడను పరామర్శించారు. ఆసుపత్రిలో అధికారులు వ్యవహరించిన తీరును ముద్రగడ వివరించారు. దీనిపై శైలజానాథ్ విస్మయం చెందారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుంటే.. ఆయన కుటుంబంపై పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని చంద్రబాబాబు దౌర్జన్యం చేయించడం హేయమైన చర్య అన్నారు. దీని ఫలితాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు అనుభవించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం సుమారు 400 హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. భవిష్యత్తులో ముద్రగడ చేపట్టబోయే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని శైలజానాథ్ చెప్పారు. -
'రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నియంతపాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎస్ .శైలజానాథ్ విలేకర్లతో మాట్లాడుతూ.... రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చేశారని విమర్శించారు. కాపు నేతలను ఇష్టానుసారంగా అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపి వేయడం అప్రజాస్వామికమని శైలజనాథ్ పేర్కొన్నారు. రాజధాని అమరావతిని సింగపూర్‌కు 99 ఏళ్లు లీజుకివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులు అమరావతికి రాకపోతే స్థానికత వర్తించదంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చంద్రబాబుపై శైలజానాథ్ నిప్పులు చెరిగారు. -
'న్యూస్ చానళ్లను నియంత్రించడం సరికాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూస్ చానళ్లను నియంత్రించడం సరికాదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. శనివారమిక్కడ ఆయన మాట్లాడుతూ...తుని ఘటనను అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ కాపు సామాజిక వర్గాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారించాలని శైలజానాథ్ సూచించారు. ముద్రగడ అంగీకరిస్తే తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని మంత్రి నారాయణ చెప్పడం బ్లాక్ మెయిలింగ్‌ను తలపిస్తోందన్నారు. మంత్రి నారాయణ కార్పొరేట్ కాలేజీల సీట్ల వ్యవహారంపై విచారణకు సిద్ధమేనా?? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులకు.. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు తేడాలున్నాయని శైలజానాథ్ ఆరోపించారు. ఏపీలోని పలు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. -
'ఆ కేసు భయంతోనే రాజధానిని తరలిస్తున్నారు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు భయంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధానిని అమరావతికి తరలించాలని తొందరపడుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ....అమరావతికి వెంటనే రావాలని ఉద్యోగులను బెదిరించడం సరికాదన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని సీఎం చంద్రబాబు మర్చిపోవద్దని శైలజానాథ్ సూచించారు. -
బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే హోదా కోసం పోరాడాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలను పక్కదోవ పట్టించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు చేపట్టారని, హోదా కోసం పోరాట దీక్షలు చేయాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమాలు జరిగిన ప్రదేశాల్లో నవనిర్మాణ దీక్షలు చేసి విభజన గాయాలను గుర్తుచేస్తూ వారం పాటు కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడాన్ని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా అమలు కోరుతూ పోరాట దీక్షలు చేయాలని ఏపీసీసీ కమిటీ వారు సూచించారు. ఇందిరా భవన్ లో గురువారం మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, సాకే శైలజానాథ్, పార్టీ ఉపాధ్యక్షుడు సూర్యా నాయక్, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లతో కలిసి గిడుగు రుద్రరాజు మీడియా సమవేశంలో పాల్గొన్నారు. రెండేళ్ల తమ పాలనలో ప్రత్యేక హోదా సాధించలేని తమ అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి, 2014లో ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలను మరిపించడానికి కుట్ర పూరితంగా నవనిర్మాణ దీక్షల పేరిట పిలుపునివ్వడం చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగమని వారు మండిపడ్డారు. -
చంద్రబాబుకు ఒక నీతి.. హరీష్‌కు మరో నీతా?
హైదరాబాద్: స్టింగ్ ఆపరేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఒక నీతి.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు మరో నీతా.. అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. ఎన్డీఏ సర్కార్ స్టింగ్ ఆపరేషన్ల విషయంపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి 'ఓటుకు కోట్లు' కేసులో చంద్రబాబుపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదన్నారు. చంద్రబాబు కొనుగోలు బాగోతం ఆడియో టేపుల్లో రికార్డయింది.. అంతకంటే సాక్ష్యం ఏం కావాలో చెప్పాలన్నారు. విచారణల పేరుతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కక్ష సాధిస్తోందని ఎపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు కోట్లు కేసు ఏమైంది.. ఆ కేసును విచారణ జరిపించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత గండ్ర రమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీఎంలకు ఒక నీతి.. ఏపీ సీఎం చంద్రబాబుకు మరో నీతా? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసిన బాగోతంపై సీబీఐ విచారణ జరిపించాలని గండ్ర రమణారెడ్డి కోరారు. -
'ప్రజల పక్షాన నిలబడితే అరెస్టులా..?'
హైదరాబాద్: కృష్ఱా బేసిన్ లో చుక్క నీరు లేక రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతుంటే.. మరో పక్క టీ సర్కార్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా ధర్నా చేస్తున్న వారికి మద్దతు తెలుపకుండా.. వారిని అరెస్టు చేయడం దారుణమని ఎపీసీసీ ఉపాధ్యక్షులు శైలజానాధ్, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లు మండిపడ్డారు. అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ సోమవారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఎపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుందని వారు విమర్శించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే కరువు సహాయక చర్యలు మానేసి, ప్రజల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్టులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. -
ఢిల్లీ వెళ్లినప్పుడే సీఎంకు ‘హోదా’ గుర్తొస్తుందా?
పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రమే సీఎం చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం గుర్తొస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. సోమవారం ఇందిర భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడుతుంటే చల్లదనం కోసం సీఎంవిహార యాత్రకు స్విట్జర్లాండ్ వెళ్లడం బాధాకరమన్నారు. జిల్లాల పర్యటనల్లో చంద్రబాబు ఏ జిల్లాకు వెళ్తే అక్కడి సమస్యలపై చర్చించకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ కరువుతో ఎడారిగా మారే పరిస్థితి ఉన్నా చంద్రబాబు నోరెత్తకపోవడం దారుణమన్నారు. బాబు నిర్లక్ష్య థోరణికి వ్యతిరేకంగా ఈ నెల 23న విజయవాడ కృష్ణా బ్యారేజీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించన్నుట్లు శైలజానాథ్ వెల్లడించారు. -
'బాబుకు దమ్ము, ధైర్యముంటే ప్రధానిని నిలదీయాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ సవాల్ విసిరారు. అనంతపురం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద శైలజానాథ్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెంటనే రాజీనామా చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
'చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ పీసీసీ ఉపాధ్యక్షులు ఎస్.శైలజానాథ్, తులసీరెడ్డి శనివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనవసరమని కేంద్రమంత్రి ప్రకటించినా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబును బాబును భయపెడుతోందా అని వారు సందేహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కొడుకు లోకష్‌ను సీఎం చేసేందుకు ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ... ప్రతిపక్షాలనే లేకుండా చేయాలనుకుంటున్నారని వారు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రేవేట్ నెంబర్ బిల్లును టీడీపీ వ్యతిరేకించిందని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలంటూ ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబుకు వారు సూచించారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారో... తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారో లేదా సీఎంగా దిగిపోతారో చంద్రబాబే తేల్చుకోవాలని శైలజానాథ్, తులసీరెడ్డి స్పష్టం చేశారు. -
దొంగే ‘దొంగా దొంగా’ అని అరచినట్లుంది
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శ సాక్షి, హైదరాబాద్: తన పొలంలోకి ఎర్రచందనం దుంగలు ఎలా వచ్చాయో తేల్చని ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి చూస్తుంటే దొంగే.. ‘దొంగా దొంగా’ అని అరిచినట్లుందని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. ఇందిర భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు గ్రామంలోని ఆయన తోటలో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను నిల్వ చేశారంటే ఎవ్వరికీ తెలియకుండా జరిగేపనేనా అని ప్రశ్నించారు. వీటి నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకు అధికారుల తీరుపై సీఎం మీడియా ముందు రుసరుసలాడటం విడ్డూరంగా ఉందన్నారు.కాగా తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మించబోతున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరగబోతోందని, ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే నోరు విప్పాలని పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ కె.రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 23న శ్రీశైలం రిజర్వాయర్ వద్ద పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో రైతు చైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
దోచుకోవడం, దాచుకోవడమే ‘బాబు’ ప్రణాళిక
అనంతపురం అర్బన్: రాష్ట్రాన్ని దోచుకుంటూ, దాచుకునేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించుకుని పాలన సాగిస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు శివశంకర్ అధ్యక్షతన చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించి ప్రజలు మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడం, ఇసుక ద్వారా రూ. కోట్లు దోచుకోవడం తప్ప ఈ రెండేళ్లలో సీఎం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఇంటింటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు శైలజానాథ్ సూచించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు దాదాగాంధీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఎన్ ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు లోకేశ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
సీఎంలా కాదు సీఈవోలా వ్యవహరిస్తున్నారు
-
ప్రభుత్వమా.. చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడా?
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగితే వారిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. అంగన్ వాడీల పట్ల టీడీపీ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొన్న అంగన్ వాడీల తొలగింపు జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇచ్చి... ఎన్నికల్లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని నిలబెట్టుకోవాలని శైలజానాథ్ సూచించారు. -
'రహస్యంగా ఎందుకు జారీ చేస్తున్నారు'
హైదరాబాద్: ఏపీ రాజధాని వ్యవహారాల్లో చంద్రబాబు సర్కార్ పారదర్శకంగా పనిచేయడం లేదని కాంగ్రెస్ నేతలు సి.రామచంద్రయ్య, శైలజానాథ్ లు విమర్శించారు. శనివారం వారిక్కడ మాట్లాడుతూ వందలాది జీవోలు రహస్యంగా ఎందుకు జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ జీవోలను అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో సభ ముందుంచాలని నేతలు డిమాండ్ చేశారు. సింగపూర్, ఏపీ ప్రభుత్వాలకు ఒప్పందాలుంటే బయట పెట్టాలన్నారు. రాజధాని నిర్మాణానికి రూ. 27 వేల కోట్లు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
దినేష్ మృతికి చంద్రబాబే భాద్యత వహించాలి: శైలజానాథ్
-
'ఇంటికో ఉద్యోగం కోసం రాష్ట్రంలో ఆందోళనలు'
హైదరాబాద్:టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని.. ఆ హామీలు అమలు కాకపోవడంతో రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు హామీలు కూడా అమలు కాలేదన్నారు. తక్షణమే లక్షా ముప్ఫై లక్షల పోస్టులు భర్తీ చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అనంత జిల్లా లేపాక్షి మండలంలో ఉద్యోగం రాలేదని దినేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి బాధ్యత సీఎం చంద్రబాబుదేనన్నారు. ఆ యువకుని కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. -
వెంకయ్య గొంతు మూగబోయిందా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సీనియన్ నేత, మాజీమంత్రి శైలజానాథ్ అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పట్లో రాజ్యసభలో హామీ ఇచ్చిన వెంకయ్య నాయుడు గొంతు ఇప్పుడు మూగబోయిందా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు అయిదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభ సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి న్యాయం చేయలేరని మరోసారి రుజువైందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెస్తే ప్రత్యేక హోదా సాధ్యమయ్యేదని ఆయన అన్నారు. బాబుతో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ మీద ఒత్తిడి తీసుకు రావాలని శైలజానాథ్ సూచించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు.. మోదీ, రాజ్‌నాథ్, అమిత్ షా ఇళ్లముందు ధర్నాలు చేస్తారో...లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏపీసీసీ రాజకీయ పోరాటం చేస్తోందని, అవసరం అయితే న్యాయపోరాటం చేస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. -
'జిల్లాలో రాజకీయ హత్యలు పెరుగుతున్నాయి'
అనంతపురం: అనంతపురం జిల్లాలో పెరుగుతున్న రాజకీయ హత్యలపై మాజీ మంత్రి శైలజానాథ్ మంగళవారం అనంతపురంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హింసను వదిలి పెట్టి... అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన టీడీపీ నేతలకు హితవు పలికారు. హత్యలపై జరిగే విచారణలో పోలీసులు, అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలని శైలజానాథ్ అన్నారు. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ నేత బి.ప్రసాదరెడ్డిని టీడీపీ నేతలు గత వారం దారుణ నరికి హత్య చేశారు. టీడీపీ అధికారలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు జిల్లాలో దారుణంగా హత్య కావించబడ్డారు. ఈ నేపథ్యంలో అనంతలో జరుగుతున్న హత్యలపై శైలజానాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
'శైలజానాథ్ తో నాకు ప్రాణహాని'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శైలజానాథ్ అక్రమ ఆస్తులు కూడబెట్టారని మంజునాథ నాయుడు అనే వ్యక్తి మంగళవారం ఏసీబీ, సీబీఐలకు ఫిర్యాదు చేశారు. శైలజానాథ్ మంత్రిగా ఉండగా అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ లలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల సహకారంతో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఆరోపించారు. తమ భూమి హైకోర్టు విచారణలో ఉండగా శైలజా నాథ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా శైలజానాథ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. -
'ఎంసెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి'
హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యార్ధులకు ఎంసెట్ మార్కుల ద్వారా కాకుండా ఇంటర్ మార్కుల ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో సీట్లు భర్తీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఎంసెట్ లో మార్పులు చేయదల్చుకుంటే విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యావేత్తలతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని శైలజానాథ్ ప్రభుత్వానికి సూచించారు. -
'ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు విఫలం'
అనంతపురం: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కష్టమేనని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. రాయలసీమకు హక్కుగా రావలసిన రాజధాని విజయవాడకు తీసుకువెళ్లారని మండిపడ్డారు. అనంతపురానికి మంజూరైన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ సేకరణ చట్టం రైతుల హక్కులను కాలరాస్తుందని శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖకు వచ్చి ఏం చేస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలు సీఎం స్థాయికి సరికావని ఆయన అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్నవారిని పరామర్శించటం పార్టీ నేతల బాధ్యత అని శైలజానాథ్ శనివారమిక్కడ అన్నారు. గతంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకోవటానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పెను తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని శైలజానాథ్ విమర్శించారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు నిమగ్నమయ్యారే తప్ప...తుఫాను ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టలేదన్నారు. అందుకే తీవ్ర నష్టం వాటిల్లిందని శైలజానాథ్ అన్నారు. ఒడిశా ప్రభుత్వం మాదిరిగా బాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఆయన తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తుఫాను అంశాన్ని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని శైలజానాథ్ మండిపడ్డారు. -
హంద్రీ - నీవా ఘనత వైఎస్‌దే
సీఎం చంద్రబాబు విమర్శను తిప్పికొట్టిన శైలజానాథ్ సాక్షి, హైదరాబాద్: ‘హంద్రీ-నీవా’ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు కృష్జా జలాలు వచ్చాయంటే ఆ ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కాంగ్రెస్ మాజీ మంత్రి సాకే శైల జానాథ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై నిజా నిజాలను ప్రజల ముందుంచేం దుకు చంద్రబాబు తమతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. వేదిక, సమయం తెలుగుదేశం పార్టీ నాయకులే చెబితే అందుకు తాము సిద్ధమన్నారు. శనివారం ఇందిర భవన్లో శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పథకాన్ని తాగునీటికే పరిమితం చేసి 1996 మార్చి 11న ఒకసారి, 1999 జూలై 13న మరోసారి శంకుస్థాపన చేసి బాబు చేతులు దులుపుకుంటే, రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రాజెక్టును నిర్మించే విధంగా 2004 జూలై 24న (జీఓ ఎంంఎస్ నం: 731) ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేశారని తెలిపారు. -
చంద్రబాబుకు సవాల్ విసిరిన శైలజానాథ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ విరుచుకుపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దీనిపై బహిరంగ చర్చకు శైలజనానాథ్ సవాల్ విసిరారు. ఆయన శనివారం ఇందిరా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో కేవలం ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకున్నారని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఓ పక్క రైతులు సాగునీటితో ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు మాత్రం టూరిజం అంటూ సమావేశాలు పెట్టుకోవటం శోచనీయమన్నారు. బాబు నోట సింగపూర్, మలేషియా తప్ప మరో మాట రావటం లేదని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ విజృంభణ
హైదరాబాద్: ఏపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి విజృంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందిరాభవన్‌లో ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి శైలజానాధ్, ఎమ్మెల్సీ పద్మరాజు మాట్లాడుతూ రుణమాఫీపై టిడిపి సర్కార్ విఫలమవుతున్న తీరును ఎండగడతామని చెప్పారు. రుణమాఫీపై వచ్చేనెల మొదటివారంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బంగారు నగలను వేలం వేయడానికి బ్యాంకులు నోటీసులిస్తున్నాయని తెలిపారు. బ్యాంకుల్లోని బంగారు నగలు వేలం వేస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ** -
రాయలసీమకు అన్యాయం చేశారు!
-
'ఇప్పుడూ కూడా అభివృద్ధి ఒకే ప్రాంతంలోనే'
అనంతపురం : తెలుగు దేశం పార్టీ ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు కూడా అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తున్నారని ఆయన శనివారమిక్కడ విమర్శించారు. అనంతపురంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలు-అనంతపురం మధ్యలో ఉప రాజధాని నిర్మాణం జరగాలని శైలజానాథ్ సూచించారు. -
టీడీపీ మానిఫెస్టోకు ఆర్.బి.ఐ అనుమతి ఉందా?
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాటకు కట్టుబడి మహానాయకుడని మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ అభివర్ణించారు. ఎన్నికల నేపథ్యంలో మహానేత వైఎస్ఆర్ ఇచ్చిన హమీ ప్రకారం ఉచిత విద్యుత్‌ను సీఎం పదవి చేపట్టిన వెంటనే ఆయన అమలు చేశారని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన రైతు రుణ మాఫీని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేయకుండా కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. రుణమాఫీకి ఆర్బీఐ అభ్యంతరం చెబుతుందని చంద్రబాబు అంటున్నారు... టీడీపీ మానిఫెస్టోకు ఆర్బీఐ అనుమతి ఉందా అంటూ శైలజానాథ్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రం కోసం గతంలో కర్నూలు కోల్పోయామని శైలజానాథ్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. హైకోర్టు, ఏయిమ్స్, ఐఐటీ వంటి సంస్థలను రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి శైలజానాథ్ సూచించారు. -
'కేసీఆర్ భయపెట్టే సంస్కృతి విడనాడాలి'
హైదరాబాద్ : సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుంటే సహించేది లేదన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగులను భయపెట్టే సంస్కృతిని కేసీఆర్ విడనాడాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, శైలజానాథ్ హితవు పలికారు. కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను తెలంగాణలో ఉంచితే సహించేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కాదని కయ్యానికి కాలు దువ్వితే, కిరికిరి పెడితే తాము కూడా కొట్లాటకు సిద్ధంగా ఉన్నమని ఆయన నిన్న హెచ్చరించారు. -
శైలజానాథ్‌కు ఎదురు దెబ్బ
మాజీ మంత్రి శైలజానాథ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదంలో ఉన్న భూమి కొనుగోలు చెల్లదంటూ అనంతపురంలోని రిజిస్ట్రేషన్ కోర్టు శనివారం శైలజానాథ్‌కు ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం ఆదర్శనగర్‌లోని వివాదంలో ఉన్న భూమిని శైలజానాథ్ కొనుగోలు చేసి... రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వివాదంలో ఉన్న స్థలం రిజిస్ట్రేషన్ చెల్లదని బాధితుడు మంజునాథ్ నాయుడు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ అంశంపై కోర్టు విచారణ జరిపింది. మాజీ మంత్రి శైలజానాథ్ భూ కొనుగోలు చెల్లదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
శైలూ.. అభాసుపాలు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రవేశం మాజీ మంత్రి శైలజానాథ్ జాతకాన్నే మార్చేసింది. ఆ పోలీసు అధికారి మరదలైన యామినీబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. టీడీపీ టికెట్ దక్కినట్లే దక్కి చేజారడంతో శైలజానాథ్ తీవ్రంగా మనస్థాపం చెందారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలో ఉంటానని మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. శింగనమల టీడీపీ అభ్యర్థిగా బండారు రవికుమార్‌ను రెండో జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఓ సెట్ నామినేషన్‌ను దాఖలు చేసిన రవికుమార్.. శనివారం అట్టహాసంగా మరో సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. కుదిరిన ఒప్పందం మేరకు పైకం ముట్టజెప్పకపోవడంతో బండారు రవికుమార్‌కు ఇచ్చిన టికెట్‌ను చంద్రబాబు వెనక్కి తీసుకున్నారు. ఇందులో అనంతపురం లోక్‌సభ అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డి హస్తం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పసిగట్టిన మాజీ మంత్రి శైలజానాథ్ గురువారం అర్ధరాత్రి నుంచి టీడీపీ టికెట్ పొందేందుకు సీఎం రమేష్ ద్వారా ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ.. ఈనెల 15న కాంగ్రెస్ అభ్యర్థిగా శింగనమల శాసనసభ స్థానానికి శైలజానాథ్ నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబుకు సన్నిహితుడుగా ముద్రపడ్డ ఓ పోలీసు ఉన్నతాధికారి రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్సీ శమంతకమణికి అల్లుడైన ఆ పోలీసు ఉన్నతాధికారి.. శింగనమల టికెట్ తన మరదలు యామినీ బాలకు ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన చంద్రబాబు.. ఆ మేరకు సంకేతాలు పంపారు. తన బావ చెప్పిన మేరకు యామినీ బాల గార్లదిన్నె ఏంఈవో ఉద్యోగానికి రాజీనామా చేసి శనివారం నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఆమెకు శుక్రవారం అర్ధరాత్రి ప్యాక్స్ ద్వారా బీ-ఫారం చేరింది. యామినీ బాలకు టికెట్ ఖరారు కావడాన్ని పసిగట్టిన శైలజానాథ్.. సీఎం రమేష్ ద్వారా చంద్రబాబుకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఆ ఫ్యాన్సీ ఆఫర్‌కు లొంగిపోయిన చంద్రబాబు శైలజానాథ్ వైపు మొగ్గు చూపారు. శనివారం ఉదయం ఫ్యాక్స్ ద్వారా శైలజానాథ్కూ మరో వైపు బీ-ఫారం అందింది. తనకు బీ-ఫారం అందడంతో శనివారం ఉదయం శింగనమల శాసనసభకు యామినీ బాల నామినేషన్ వేశారు. ఇదే సమయంలో శైలజానాథ్ కూడా టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి అనంతపురం నుంచి బయలుదేరారన్న సమాచారం అందుకున్న యామినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి.. అదే అంశాన్ని పోలీసు ఉన్నతాధికారికి వివరించినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని అందుకున్న ఆ పోలీసు ఉన్నతాధికారి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలీసులను ప్రభావితం చేసేందుకు ఆ అధికారి ఉపయోగపడతాడని భావించిన చంద్రబాబు.. చివరకు యామినీ బాలకే టికెట్ ఖరారు చేశారు. చివరి నిముషంలో చంద్రబాబు తనకు మొండిచేయి చూపడంతో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి సిద్ధం చేసిన సెట్‌ను శైలజానాథ్ పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. కానీ.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓబుళేసు.. తానే అసలైన కాంగ్రెస్ అభ్యర్థినని, పీసీసీ చీఫ్ రఘువీరా తనకే టికెట్ ఇచ్చారని హడావుడి చేయడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి.. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి, ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు విఫలయత్నం చేసిన శైలజానాథ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఆయన అనునయులే వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు. -
సైకిలెక్కిసిన మాజీమంత్రి శైలజానాథ్....
అనంతపురం : అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరపున మాజీమంత్రి శైలజానాథ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన నామినేషన్సై మాజీమంత్రి పామిడి శమంతకమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కుమార్తె యామిని బాలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారని, పార్టీలో సభ్యత్వం లేని మీరు నామినేషన్ ఎలా వేస్తారని శైలజానాథ్‌ను శమంతకమణి నిలదీశారు. కాగా రెండు రోజుల క్రితం శైలజానాథ్ కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సీమాంధ్ర కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరుల అడిగిన ప్రశ్నకు శైలజానాథ్ సమాధానమిస్తూ పార్టీ మారి పోటీ చేయాల్సిన దుస్థితి తనకు లేదని కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానని వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం సీన్ మారింది. కాంగ్రెస్ తరపున పోటీకి శైలజానాథ్ విముఖత చూపుతు టీడీపీ తరపున నామినేషన్ వేశారు. -
'ఆరోగ్యం బాగోలేదనే రాజకీయాలకు దూరం'
తిరుమల : తన ఆరోగ్యం సహకరించనందునే రాజకీయాలకు దూరంగా ఉన్నానని మాజీమంత్రి శైలజానాథ్ తెలిపారు. ఆయన బుధవారం తిరుమల విచ్చేసి వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ ఒకటి, రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్‌ను ప్రకటిస్తానని తెలిపారు. కాగా శైలజానాథ్ ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో చెస్ట్ ట్యూమర్‌కు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక శైలజానాథ్ రాజకీయ పయనంపై సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఆయన ఏ పార్టీవైపు వెళతారోనన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా శైలజానాథ్ పనిచేశారు. పార్టీ అధిష్టానం ఎదుట సమైక్య నినాదాన్ని వినిపించారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్ష పదవిని శైలజనాథ్‌కు అప్పగించారు. అయితే ఆ పార్టీకి అనుకున్నంతగా ఆదరణ లేకపోవటంతో ఆయన ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శైలజానాథ్ టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
శైలూకు జేసీ షాక్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఝలక్ ఇచ్చిన మాజీ మంత్రి శైలజానాథ్‌కు ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. రాయ‘బేరం’ కుదరడంతో శింగనమల నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాలన్న శైలజానాథ్ ఆశలకు ఆదిలోనే జేసీ గండికొట్టారు. శైలజానాథ్‌పై శింగనమలలో ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోందని.. అది అనంతపురం లోక్‌సభ అభ్యర్థి అయిన తనపై పడుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జేసీ వివరించారు. శింగనమలలో కాకుండా శైలజానాథ్‌ను మరోప్రాంతంలో బరిలోకి దించితే తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దాంతో మడకశిర నుంచి శైలజానాథ్‌ను బరిలోకి దింపేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. దీనిపై శైలజానాథ్ ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి శైలజానాథ్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో కేంద్రానికి చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే.. రాష్ట్ర విభజనను ఆపేయించే బాధ్యత తనదంటూ అనేక సందర్భాల్లో టీడీపీ నేతలకు శైలజానాథ్ సవాల్ విసిరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతోన్న క్రమంలోనే జై సమైక్యాంధ్ర పార్టీని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించేలా మాజీ మంత్రి శైలజానాథ్ చక్రం తిప్పారు. సీఎం కిరణ్ తనకు అత్యంత సన్నిహితుడని నమ్మి శైలజానాథ్‌కు ఆ పార్టీ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. కానీ.. ఆ పార్టీకి రాజకీయ భవిత లేదని గ్రహించిన శైలజానాథ్ ఇతర పార్టీల వైపు చూశారు. వైఎస్సార్సీపీలో ఖాళీ లేకపోవడంతో టీడీపీపై కన్నేశారు. తనకు అత్యంత సన్నిహితుడైన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మండ్లి నరసింహారెడ్డిని జేసీ దివాకర్‌రెడ్డి వద్దకు రాయబారం పంపారు. జేసీ నుంచి సానుకూల స్పందన లభించకపోవడంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుతో రాయ‘బేరం’ సాగించారు. బేరసారాలు కుదరడంతో శింగనమల టీడీపీ టికెట్‌ను శైలజానాథ్‌కు ఖరారు చేశారు. ఇటీవల టీడీపీలో చేరే ముహూర్తాన్ని ఖరారు చేసుకోవడానికి చంద్రబాబుతో జేసీ చర్చించారు. ఆ చర్చల సమయంలోనే శైలజానాథ్‌ను శింగనమల నుంచి బరిలోకి దింపుతున్నట్లు జేసీకి చంద్రబాబు వివరించారు. ఈ ప్రతిపాదనను జేసీ తీవ్రంగా వ్యతిరేకించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. శైలజానాథ్‌పై శింగనమల నియోజకవర్గంలో తీవ్రంగా వ్యతిరేకత పెల్లుబుకుతోందని.. అది అనంతపురం లోక్‌సభ అభ్యర్థి అయిన తన విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని జేసీ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. శైలజానాథ్‌ను అనంతపురం లోక్‌సభ పరిధిలో కాకుండా ఎక్కడ బరిలోకి దించినా తనకు అభ్యంతరం లేదని జేసీ చెప్పినట్లు సమాచారం. దాంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఇటీవల టీడీపీలో చేరే ముహూర్తం కోసం శైలజానాథ్ సంప్రదించగా.. కొన్నాళ్లు ఆగాలని చంద్రబాబు ఆయనకు సూచించడంలో అంతరార్థం జేసీ మోకాలడ్డటమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. శైలజానాథ్‌ను మడకశిర నుంచి బరిలోకి దించితే ఎలా ఉంటుందని టీడీపీ ముఖ్య నేతలను చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఈ ప్రతిపాదనకు శైలజానాథ్ ఎలా స్పందిస్తారన్న విషయాన్ని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు టీడీపీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఇపుడు శైలజానాథ్ వైఖరేంటన్నది హాట్ టాపిక్‌గా మారింది. -
చెప్పు పార్టీకి ఉపాధ్యక్షుడి షాక్?
చెప్పులతో తమను కొట్టాలని పెట్టుకున్నారో ఏమో గానీ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా స్థాపించిన 'జై సమైక్యాంధ్ర పార్టీ'కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చెప్పులను తమ గుర్తుగా పెట్టుకున్న ఈ పార్టీకి ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న మాజీమంత్రి సాకే శైలజానాథ్ ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అప్పట్లో సమైక్యాంధ్ర కోసం పోరాడినవాళ్లలో శైలజానాథ్ ముందు వరుసలో ఉండటం అందరికీ తెలిసిందే. సొంత పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన చాలాసార్లు మాట్లాడారు. కానీ ప్రయోజనం మాత్రం కనిపించలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన కొత్త పార్టీలో ఆయనకు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టినా, అది వద్దనుకుని ఇప్పుడు సైకిల్ ఎక్కాలని చూస్తున్నారట. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సాగుతాయో చూడాలి!! -
కిరణ్‌కు సొంతపార్టీనేతల షాక్
-
'వాళ్లు సామ్రాట్లు....మనం సామంతులం'
తిరుపతి : రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీవాళ్లు సామ్రాట్లులాగా వ్యవహరిస్తూ... మనల్ని సామంతులుగా చూస్తున్నారని శైలజానాథ్ విమర్వించారు. ఆయన సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ మొత్తం తెలుగు జాతి నాశమైనప్పుడు ఇక రాజధానుల కోసం పోట్లాడుకోవటం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలుగు వారికి అన్యాయం చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను విభజన వాదిని కాదని... ఆరోగ్యం సరిగా లేకున్నా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు పోరాడినట్లు తెలిపారు. కాగా శైలజానాథ్‌తో పాటు రుద్రరాజు పద్మరాజు కూడా వెంకన్నను దర్శించుకున్నారు. -
'టి బిల్లు తిరస్కరణ ప్రజల మనోభావాలు తెలియచేస్తుంది'
-
'విభజన బిల్లును పార్లమెంట్ లో పెట్టవద్దు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టవద్దని అసెంబ్లీలో ప్రభుత్వ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉభయసభలు ఆమోదించాయని మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, శైలజానాథ్, ఆనం రాంనారాయణ్ రెడ్డిలు అన్నారు. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి సీమాంధ్రకు చెందిన 159 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేసి ఉండేవారు, తెలంగాణకు చెందిన 119 మంది తీర్మానాన్ని వ్యతిరేకించేవారు అని వారన్నారు. విభజన బిల్లును తిరస్కరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం మూజువాణి నిర్ణయంతొ ఆమోదం పొందింది అని వారన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తాం మంత్రులు శైలజానాథ్, ఆనం, కన్నా వెల్లడించారు. -
సీఎం తీర్మానాన్ని రేపు చేపట్టే అవకాశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించి వెనక్కి పంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మానాన్ని చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరామని శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ చెప్పారు. బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన గడువు గురువారంతో ముగుస్తున్నందున రేపు స్పీకర్ తీర్మానాన్ని చేపట్టే అవకాశముందని చెప్పారు. విభజనపై బిల్లుపై ఓటింగ్ జరిగే ఆస్కారమూ ఉందని మంత్రి తెలిపారు. తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ అసెంబ్లీకి వచ్చి కూర్చున్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు శైలజానాత్ చెప్పారు. -
'బాబు సిగ్గుంటే... ఎన్టీఆర్ వర్ధంతి రోజైనా వైఖరి స్పష్టం చేయి'
అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శ్రీనివాసులు మాట్లాడారు. ఈ సందర్బంగా చంద్రబాబుకు సిగ్గుంటే... ఎన్టీఆర్ వర్ధంతి అయిన ఈ రోజు సమైక్యవాదో, విభజన వాదో తన వైఖరిని స్పష్టం చేయాలి వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు నోట సమైక్యమన్న మాట ఎందుకు రావడం లేందటూ మీడియా ఎదుట ప్రశ్నించారు. అసెంబ్లీలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. సమైక్యమనే ముసుగులో ఉన్న విభజన వాది శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకే ఆయన ఆ పార్టీని విమర్శించడం లేదన్నారు. సమైక్యసింహమని శైలజానాథ్ చెప్పుకుంటున్నారు, అలాంటి నేత ఇంటి చుట్టు ముళ్లకంచెలు... పోలీసుల పహారా ఎందుకుని శైలజానాథ్‌ను సూటిగా ప్రశ్నించారు. సభలో స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. -
ఆయన... సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది
-
ఆయన... సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది
సమైక్య ముసుగులో విభజనకు పూర్తి స్థాయిలో తోడ్పడుతున్న వ్యక్తి ఎవరైన ఉన్నారంటే అది రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో టి.బిల్లు చర్చ సందర్బంగా గుర్నాథ్రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా శైలజానాథ్ సమైక్యవాదానికి తూట్లు పొడిచారని అన్నారు. సమైక్య కన్వీనర్‌గా ఉన్న శైలజానాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చేశారని గుర్నాథ్రెడ్డి ప్రశ్నించారు. -
రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన'
-
రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన'
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఉమ్మడి రాజధాని చేస్తారని శైలజానాధ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో శనివారం బిల్లుపై జరిగిన చర్చలో శైలజానాథ్ ప్రసంగిస్తూ... ఇరుప్రాంతాలలో రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. విభజన విషయాన్ని రాజకీయ పార్టీలు తేలిగ్గా తీసుకున్నందు వల్లే ఇప్పుడు ఈ సమస్య జఠిలమైందని అన్నారు. తాను సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నానని శైలజానాథ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌పై రిఫరెండం పెడదామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశారని కానీ ఎప్పటిలానే కేసీఆర్ మాటా మార్చారని ఈ సందర్బంగా శైలజానాథ్ గుర్తు చేశారు. విభజన బిల్లును చూస్తుంటే మన రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేనట్లుగా అనిపిస్తోందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. -
మళ్లీ దొరల పెత్తనం వస్తుంది: శైలజానాథ్
విభజన బిల్లుపై చర్చలో మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యలు ఈ బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.. ఓటింగ్ నిర్వహించాలి సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాకే దళితులు, వెనుకబడిన వర్గాలకు స్వేచ్ఛ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నందున్నే వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. ఆ ప్రాంతంలో గతంలో మాదిరిగా మళ్లీ దొరల, పెత్తందార్ల ఆధిపత్యం పెరిగి, బడుగు, బలహీన వర్గాల ప్రజల స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తే విభజన జరగాలో వద్దో తేలిపోతుందన్నారు. శుక్రవారం శాసనసభలో విభజన బిల్లుపై చర్చలో భాగంగా శైలజానాథ్ మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు... - బిల్లు ఏకపక్షంగా ఉంది. గతంలో రాష్ట్రాల ఏర్పాటు సందర్భాల్లో పాటించిన పద్ధతులను కూడా ఇక్కడ పాటించటం లేదు. - బిల్లుపై ఓటింగ్ జరగాలి. తెలంగాణ కావాలంటున్న వారు కూడా ఓటింగ్‌లో పాల్గొనాలి. దాంతో రాష్ట్ర విభజన జరగాలా? వద్దా? అనే విషయం తేలిపోతుంది. - సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు.. తెలంగాణ ప్రాంతంలో పెత్తందార్లు, దొరల పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలు మగ్గిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతే ఇక్కడ పద్ధతులు మారిపోయాయి. ప్రజలందరు సమానంగా బతకడానికి అవకాశం ఏర్పడింది. - మళ్లీ తెలంగాణ ఏర్పడితే పాత రోజులు వస్తాయి. భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల ఫలితాలను కూడా దోపిడీ వర్గాలే పొందుతున్నాయన్న కంచె ఐలయ్య మాటలు నిజం. - తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా దళితులకే పదవి ఇస్తామంటున్న వారు భూములను పంచుతాం అని ఎందుకు చెప్పడం లేదు? - చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల ఒక నేత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. - రాజ్యాంగంలోని 371డీ అధికరణ అంశాన్ని ప్రస్తావిస్తేనే విభజనవాదులు వణికిపోతున్నారు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నారు. ఢిల్లీలో మాట్లాడాల్సిన మాటలు అసెంబ్లీలోనా? శైలజానాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్పందిస్తూ ఒక కులంలో పుట్టడం మనిషి తప్పు కాదని, అయితే పుట్టిన తర్వాత సమాజంలో ఏలా ఉంటున్నారనే విషయాన్ని చూడాలని వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, టీఆర్ఎస్ సభ్యుడు కె.తారకరామారావులు స్పందిస్తూ మంత్రి మాటల్ని ఖండించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో మాట్లాడాల్సిన మంత్రి అసెంబ్లీలో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. -
విభజన వద్దు...చర్చను అడ్డుకుంటాం
-
'ఎమ్మెల్యేలు బెదిరించటం మంచి పద్దతి కాదు'
హైదరాబాద్ : తమ వద్దకు వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెదిరించటం మంచి పద్ధతి కాదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరుగుతుండగా....రాష్ట్రం విడిపోతే సీమాంధ్రుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ అనడంతో ఆయన దగ్గరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు దూసుకు వచ్చారు. దాంతో విద్యాసాగర్ రావును గాదె వెంకటరెడ్డి అడ్డుకోగా ఆయన చొక్కా కూడా చిరిగింది. దాంతో సభలో సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్పీకర్‌దే అని గాదె అన్నారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇరు ప్రాంతాల సభ్యులు పోటాపోటీ వ్యాఖ్యలతో రెచ్చగొట్టవద్దని సూచించారు. -
విభజన అప్రజాస్వామికం: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ అప్రజాస్వామికంగా జరుగుతోందని శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ అన్నారు. ఎవరో తరుముకొస్తున్నట్టుగా కేంద్రం రాష్ట్ర విభజన బిల్లును పంపిందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే విధంగా, మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. గురువారం శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013పై ప్రభుత్వ పక్షాన ఆయన చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడి ప్రజలపై వివక్ష చూపే విధంగా బిల్లును తెచ్చారని, తెలుగు జాతి వైభవం, ఐక్యత, అభివృద్ధి కోసం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేక చర్య. అధికారం ఉంది కదా.. ఎవరూ ఏమీ చేయలేరు కదా.. అనే రీతిలో కేంద్రం వ్యవహరించడం మంచిది కాదు’’ అని అన్నారు. శైలజానాథ్ చర్చను ప్రారంభించి మాట్లాడడంపై తెలంగాణ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శైలజానాథ్ మండలి సభ్యుడు కాదని, మండలి నాయకుడు సభలో ఉండగా ఆయనతో ఎలా మాట్లాడిస్తారని ప్రశ్నించారు. మంత్రిగా ప్రభుత్వం పక్షాన మాట్లాడితే ప్రభుత్వ విధానానికి కట్టుబడి... విషయానికి మాత్రమే పరిమితమై మాట్లాడాలని, తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పేందుకు వీల్లేదని అడ్డుపడ్డారు. దీంతో ఆయన మధ్యలోనే ప్రసంగాన్ని ఆపేశారు. ఎవరికి విధేయులు?: రామచంద్రయ్య శైలజానాథ్ తర్వాత సభానాయకుడు సి.రామచంద్రయ్య (సీఆర్) మాట్లాడుతూ... కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు తమను ఎన్నుకున్న ప్రజలకు విధేయులుగా ఉండాలా? పార్టీలకా? అన్న ప్రశ్న తలెత్తిందన్నారు. అసలు ఎవరి కోసం ఈ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. సెంటిమెంట్ ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటే ఈ దేశాన్ని వెయ్యి ముక్కలు చేయాల్సి వస్తుందని, ఈ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. పదేపదే తెలంగాణ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ‘‘నేను ఏం మాట్లాడాలో మీరు రాసిస్తే చదువుతా. మీ పదాలు నా నోట్లో పెడతారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కౌన్సిల్లో శైలజానాథ్ Vs డిస్
-
టీడీపీలో ఏకాభిప్రాయం లోపించింది: మంత్రి శైలజానాథ్
-
టీడీపీలో ఏకాభిప్రాయం లోపించింది: మంత్రి శైలజానాథ్
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై టీడీపీలో ఏకాభిప్రాయం లోపించిందని శాసన సభా వ్యహహారాల మంత్రి శైలజానాథ్ తెలిపారు. సభలో చర్చ జరగకపోతే అది తెలంగాణ ఏర్పాటుకే సహకరించినట్లువుతుందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన విభజన బిల్లుపై సభలో చర్చ జరగకపోతే కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినట్లేనని తెలిపారు. టీ.బిల్లుపై చర్చించేందుకు టీడీపీ, వైఎస్సార్ సీపీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చర్చ సందర్భంగా కూడా సమైక్య తీర్మానం ప్రవేశపెట్టవచ్చని స్పష్టం చేశారు. బిల్లుపై చర్చించాలా?వద్దా అనే విషయంలో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీఏసీలో టీడీపీ నేతలు ప్రాంతాల వారిగా అభిప్రాయాలు చెప్పారన్నారు. ఆ భేటీకి ఫ్లోర్ లీడర్లు మాత్రమే రావాలని ప్రభుత్వ పరంగా ఇప్పటికే తెలిపామన్నారు. విభజన బిల్లుపై తరగతులు వారిగా చర్చ జరగాల్సిందేనన్నారు. -
కొత్త శాఖ గురించి ఇప్పుడే మాట్లాడను: శైలజానాథ్
కొత్తగా అప్పగించిన మంత్రిత్వ శాఖ గురించి ఇప్పడే స్పందించనని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... 2014లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు శాసన సభ వ్యవహారాల శాఖను పర్యవేక్షిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన డి.శ్రీధర్ బాబును సీఎం కిరణ్ ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను ఎస్. శైలజానాథ్‌కు అప్పగించారు. శ్రీధర్ బాబుకు వాణిజ్య పన్నుల శాఖను కట్టబెట్టారు. అయితే ఆ బాధ్యతలను తాను స్వీకరించనని శ్రీధర్ బాబు ఇప్పటికే కరఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. మంత్రుల శాఖల మార్పుపై శైలజానాథ్‌ను బుధవారం విలేకర్లను ప్రశ్నించారు. ఈ సందర్బంగా శైలజానాథ్‌పై విధంగా స్పందించారు. -
శైలజానాధ్‌కు శాసనసభ వ్యవహారాలు
-
శ్రీధర్‌బాబు శాఖ మారింది
-
సురక్షిత ప్రయాణం సుదూరం
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, భద్రంపల్లి, కొట్టాలపల్లి, పాత చెదుళ్ల, కొత్త చెదుళ్ల తదితర 40 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి నియోజకవర్గం కళ్యాణదుర్గంలోని విట్లంపల్లి, హులికల్లు, కుర్లగుండ, నరసాపురం ప్రాంతాలకు దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అమాత్యుల నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా వందలాది గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. దీంతో వీరంతా సురక్షిత ప్రయాణానికి దూరమయ్యారు. జిల్లాలోని 63 మండలాల్లో 3447 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 700 గామాలకు ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. అనంతపురానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామాలకు సైతం బస్సులు నడపడం లేదు. దీంతో ప్రజలు కాలినడకన లేకపోతే డీజిల్ ఆటోలు, మినీ వ్యాన్లలో కిక్కిరిసి వెళుతున్నారు. ఆర్టీసీ అధికారులేమో రోడ్డు సౌకర్యం లేని, కలెక్షన్ రాని గ్రామాలకు తిప్పడం లేదని, అది కూడా 150 గ్రామాలేనని చెబుతున్నారు. కానీ ఆ సంఖ్య నాలుగు రెట్లకు పైగానే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అనంతపురం రీజియన్‌లో 953 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇందులో 130 సూపర్ డీలక్స్, 330 ఎక్స్‌ప్రెస్, 20 డీలక్స్, 473 పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నా.. కలెక్షన్ తగ్గిందనే సాకుతే అర్ధంతరంగా ఆపేస్తున్నారు. డీజిల్ ఆటోలు, జీపులే దిక్కు... విద్యార్థులు, గ్రామస్తులు పట్టణ, మండల, జిల్లా కేంద్రానికి రావాలంటే డీజిల్ ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రైవేట్ వాహనాలు బాధ్యతారాహిత్యంగా తిప్పుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. ఆదాయాన్ని బట్టే తిప్పాల్సి వస్తోంది జిల్లాలో కొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేని విషయం వాస్తవమే. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకునే బస్సులను తిప్పుతాం. దాదాపుగా 150 గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. అన్ని మండలాలకూ బస్సులు కవర్ చేస్తున్నాం. - మధుసూదన్, డిప్యూటీ సీటీఎం ఆర్టీసీ, అనంతపురం -
దాదా.. సమైక్యంగా ఉంచండి: శైలజానాథ్
రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని అనంతపురం పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర మంత్రి సాకే శైలజానాథ్ విజ్ఞప్తి చేశారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని శైలజానాథ్ అనంతపురంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంటు రాష్ట్రపతికి బాగా తెలుసని, మెజారిటీ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారని ఈ సందర్భంగా శైలజానాథ్ తెలిపారు. -
శైలూ మార్క్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న మైనార్టీ నేత రషీద్ అహ్మద్‌ను తొలగించి తన అనుచరుడైన కాంట్రాక్టర్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి ఆ పదవిని కట్టబెట్టడంలో రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ సఫలీకృతులయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మూడు దశాబ్దాలుగా రషీద్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. 2005 నగర పాలక ఎన్నికల్లో ఎనిమిదో వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల పాటు అనంతపురం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటి నిలిచిన రషీద్ అహ్మద్‌ను 2011 జనవరి 18న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో రెండేళ్ల పాటు రషీద్ అహ్మద్ కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం అనంతపురం శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో అనంతపురం శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆ పార్టీ నేతలు ఏ ఒక్కరూ సాహసించలేదు. ఈ నేపథ్యంలో ముర్షీదా బేగంను అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆమె భర్త రషీద్ అహ్మద్‌పై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గిన రషీద్ అహ్మద్ తన భార్యను అనంతపురం శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం ముందు కాంగ్రెస్ పార్టీ నిలవలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థి ముర్షీదా బేగంకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. రషీద్ అహ్మద్ పదవీ కాలం 2013 జనవరి 18కే పూర్తయింది. పార్టీ కోసం త్యాగాలు చేసిన తనను ఆ పదవిలో మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ఆయన అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. అయితే రషీద్ అహ్మద్ పదవీకాలం పూర్తయినప్పటి నుంచి ఆ పదవిలో తన అనుచరుడైన కాంట్రాక్టర్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని కూర్చోబెట్టాలని ప్రాథమిక విద్యాశాఖతోపాటు గ్రంథాలయాల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్న మంత్రి శైలజానాథ్ తీవ్ర స్థాయిలో సీఎంపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఆ పదవిలో బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని నియమించాలని సీఎం, గవర్నర్‌కు ప్రతిపాదించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం నియామకపు ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 1499) జారీ చేశారు. కాగా.. తనను పదవి నుంచి తొలగించడంపై రషీద్ అహ్మద్ మండిపడుతున్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై రషీద్ అహ్మద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయడం, ప్రజలకు సేవ చేయడం మాత్రమే తనకు తెలుసునన్నారు. కానీ.. పార్టీ కోసం పనిచేస్తోన్న నాయకులకు గుర్తింపు లేకుండా పోతోందని వాపోయారు. అడుగులకు మడుగులొత్తే వారికి.. చెంచాగిరి చేసే వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను శుక్రవారం వెల్లడిస్తానని స్పష్టీకరించారు. -
స్పీకర్‌కు నోటీస్ ఇచ్చాం:శైలజానాధ్
హైదరాబాద్: అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని స్పీకర్‌కు నోటీసు ఇచ్చినట్లు మంత్రి శైలజానాధ్ చెప్పారు. సమైక్యతీర్మానం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరతామని చెప్పారు. రాష్ట్రం ఎందుకు సమైక్యంగా ఉండాలో సభలో చర్చించాలనుకుంటున్నామన్నారు. తెలంగాణ బిల్లులోని అంశాలు క్లాజుల వారీగా సభలో చర్చ జరగాల్సిందేనని ఆయన అన్నారు. బిల్లు అసంబద్ధంగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి చెప్పాలనుకుంటున్నట్లు శైలజానాధ్ తెలిపారు. -
దిగ్విజయ్ సింగ్‌ను కలవాలనుకోవట్లేదు: శైలజానాథ్
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిసి ఉపయోగం ఏమీ లేదని, అందువల్ల ఆయన్ను కలవాలనుకోవడం లేదని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఇప్పటికే తాము చాలాసార్లు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిశామని ఆయన తెలిపారు. గురువారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీని కూడా కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినా ఎలాంటి ఫలితం లేదని, అందువల్ల ఇప్పుడు దిగ్విజయ్ సింగ్‌ను కలవాలని అనుకోవట్లేదని శైలజానాథ్ చెప్పారు. -
మంత్రి శైలజానాథ్‌కు చీరలు,గాజులు!
రాష్ట విభజనను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్ పూర్తిగా విఫలమైయ్యారని అనంతపురంలో సమైక్యవాదులు ఆరోపించారు. అందుకు నిరసనగా భారీ సంఖ్యలో సమైక్యవాదులు శుక్రవారం ఉదయం శైలజానాథ్ నివాసానికి చేరుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలమైన శైలజానాధ్‌కు చీర, గాజులు అందజేసేందుకు అనంత మహిళలు ఆయన నివాసంలోకి చోచ్చుకుపోయేందుకు యత్నించారు. అయితే అప్పటికే మంత్రి శైలజానాథ్ నివాసం వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. దాంతో సమైక్యవాలను మంత్రి నివాసంలోని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో శైలజానాథ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రాయల తెలంగాణ ప్రక్రియ మంచిది కాదు
-
'రాయల తెలంగాణ ప్రతిపాదన మంచిదికాదు'
అనంతపురం: రాయల తెలంగాణ ప్రతిపాదన మంచిది కాదని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. అధిష్టానం విప్ జారీ చేసినా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామని శైలజానాథ్ స్పష్టం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎంపీఆర్ డ్యాం నుంచి 150 కోట్లతో మంచినీటి పథకానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని శైలజానాథ్ తెలిపారు. -
అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం :శైలజానాథ్
ముదిగుబ్బ, న్యూస్‌లైన్: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ధర్మవరం ఆర్డీఓ నాగరాజు, మార్కెట్ యార్డ్ చెర్మైన్ రామకృష్ణారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వర్తింపజేయడమే రచ్చబండ ఉద్దేశ్యమన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ఇందుకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇటీవల గవర్నర్‌తో పాటు పలు పార్టీల జాతీయ నాయకులను కలిసి రాష్ర్ట సమైక్యతకు సహకరించాల్సిందిగా కోరానని గుర్తు చేశారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు తనను గౌరవిస్తున్నారన్నారు. ఇందిరమ్మ పక్కా గృహాల నిర్మాణ వ్యయాన్ని ఎస్సీ, ఎస్టీలు, ఇతరులకు పెంచారన్నారు.అనంతరం 1,800 రేషన్ కూపన్లు, 800 పక్కా ఇళ్లు, 755 పెన్షన్ మంజూరుపత్రాలను మంత్రి, ఎమ్మెల్యే, పంపిణీ చేశారు. -
మొత్తానికి అనుకున్నది సాధించావ్!
అనంతపురం : కొంతకాలంగా ఎడమొహం, పెడ మొహంగా ఉన్న జిల్లా మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లు ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. సొంత పార్టీలోని తమ ప్రత్యర్థి జేసీ దివాకర్ రెడ్డిపై పైచేయి సాధించినందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు. మాజీమంత్రి జేసీ ప్రతిపాదన మేరకు మూడో విడత రచ్చబండలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించాలని సీఎం తొలుత భావించారు. నవంబర్ 24న సీఎం తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తారని, ఆ సమయానికి చాగల్లు రిజర్వాయర్‌ను నీటితో నింపుతామంటూ అక్టోబర్ 30న జేసీ దివాకర్ రెడ్డి జీడిపల్లి రిజర్వాయర్, ఎంపీఆర్ డ్యామ్ వద్ద హడావుడి చేశారు. సీఎం చేతుల మీదుగా చాగల్లు రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేస్తామంటూ ప్రకటించారు. అయితే దీన్ని పసిగట్టిన మంత్రులు శైలజానాథ్, రఘువీరా సీఎం వద్దకు వెళ్లి తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తే, తాము బహిష్కరిస్తామని తెగేసి చెప్పారు. తాడిపత్రి మినహా ఎక్కడైనా పర్యటించాలంటూ రఘువీరా షరతు విధించారు. మంత్రి శైలజానాథ్ మాత్రం తన నియోజకవర్గంలోని నార్పలలో పర్యటించాలని పట్టుబట్టారు. చివరకు కిరణ్ శైలజానాథ్ ప్రతిపాదన వైపే మొగ్గు చూపి.... ఆదివారం నార్పలలో పర్యటించారు. ఈ సందర్భంగా నార్పలకు వచ్చిన రఘువీరా హెలీప్యాడ్ వద్ద మంత్రి శైలజానాథ్‌ను ఆలింగనం చేసుకున్నారు. 'మొత్తానికి అనుకున్నది సాధించావ్, సీఎంను నీ ఇలాకాకు రప్పించుకున్నావ్. కంగ్రాట్స్' అంటూ అభినందించారు. ఇందుకు 'అంతా మీ సహకారం' అంటూ శైలజానాథ్ ప్రతిస్పందించారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోవటం గమనార్హం. -
'సీఎం మార్పుపై తనకు తెలిసింది శూన్యం'
సీఎం పదవి నుంచి కిరణ్‌ను తప్పిస్తారన్న సంగతి తనకు తెలియదని రాష్ట్ర మంత్రి ఎస్. శైలజానాథ్ వెల్లడించారు. సీఎం మర్పు విషయంలో తన వద్ద ఉన్న సమాచారం శూన్యమని పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... నేడు న్యూఢిల్లీలో జరగాల్సిన కేంద్రమంత్రుల బృందం (జోవోఎం) సమావేశం వాయిదా పడింది, అందువల్ల సీఎం ఢిల్లీ వెళ్లలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం కిరణ్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని శైలజానాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై తన దైన శైలీలో ముందుకు వెళ్తుండగా, సీఎం కిరణ్ మాత్రం తాను ముమ్మాటికి సమైక్యవాదినే అని పలు సందర్భాలలో స్పష్టం చేశారు. దాంతో సీఎం కిరణ్ వైఖరిపై అధిష్టానం గుర్రగా ఉన్న సంగతి తెలిసిందే. -
'సమైక్యానికి కిరణ్ ఒక్కడే చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు'
ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రి అయిన శైలజానాథ్ ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎంపీ నిధులతో నిర్మించిన సందర్శకుల గదిని ప్రారంభించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడే చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం కిరణ్ రాష్ట్ర విభజనకు అంగీకరించారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ ఆధిష్టాన్ని దృష్టిలో పెట్టుకుని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల రాజ్యాంగానికి కొత్త సమస్యలు వచ్చిపడతాయని శైలజానాథ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యం కోసం ఉద్యోగులు సమ్మె చేస్తే రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తామని శైలజనాథ్ ఈ సందర్బంగా వెల్లడించారు. -
కొత్తపార్టీ గురించి సీఎం ప్రస్తావించలేదు: శైలజానాథ్
హైదరాబాద్: కొత్త పార్టీ గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమతో ప్రస్తావించలేదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ప్రజలు సంక్షేమంగా ఉంటారని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. విభజనను అడ్డుకునేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల ద్వారా విభజనను అడ్డుకుంటామన్నారు. ఎన్నికల ముందు పొలిటికల్ సర్వేలు సహజమేనని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సర్వేలే ప్రాతిపదికగా చెప్పలేమన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని శైలజానాథ్ తెలిపారు. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో... విభజనకు పూర్తిగా సహకరించి, అంతా అయిపోయాక, చివరికి ‘సమైక్య సింహం’ ముసుగులో కొత్త పార్టీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే నేతృత్వం వహిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి పార్టీ నేతలందరితో ఆయన ఇప్పటికే అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నారు. కొత్త పార్టీకి అవసరమైన ప్రచార సామగ్రిని కూడా సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమైక్యాంధ్ర సింహం పేరుతో ముఖ్యమంత్రి తన బొమ్మతో పలు కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయిస్తున్నారు. అయితే విభజన ప్రక్రియకు రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆటంకాలూ లేకుండా మొత్తం వ్యవహారం నడిపించిన తర్వాతే సమైక్యాంధ్ర ఎజెండాగా కొత్త పార్టీ తెరమీదకొచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
విభజనపై రాష్ట్రపతి, ప్రధానులకు లేఖలు రాశాం: శైలజానాథ్
రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల్ని పాటించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు లేఖలు రాసినట్టు సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ ఎస్.శైలజానాథ్ చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని మంత్రి అన్నారు. అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రాన్ని విభజించలేదని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి విభజన అంశం ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని చెప్పారు. -
విభజన అనివార్యమని దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి
-
'విభజన అనివార్యమని దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి'
రాష్ట్ర విభజన అనివార్యం అంటున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు దమ్ముంటే ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ బుధవారం హైదరాబాద్‌లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కేంద్రమంత్రుల్ని కలసే ఆలోచన సీమాంధ్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీకి లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అందుకోసం రేపు మధ్యాహ్నం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని శైలజానాథ్ వెల్లడించారు. -
17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ భేటీ
సమైక్యాంధ్ర ఎజెండా నుంచి కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు జారిపోవచ్చని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. అలా సీమాంధ్ర నేతలు జారి పోయిన మిగిలిన వారితో కలసి సమైక్య పోరు కొనసాగిస్తామని ఆయన మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఈ నెల 17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్యయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం కేంద్రంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఆ సమావేశంలో చర్చిస్తామని శైలజానాథ్ పేర్కొన్నారు. విభజనపై ఏర్పాటు అయిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ( జీఓఎం)పై తమకు నమ్మకం లేదని శైలజానాథ్ వెల్లడించారు. -
'సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలు బయటపెట్టాలి'
హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి స్థాయి దిగజారి మాట్లాడారని మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పదవిలో ఉన్నప్పుడు దినేష్‌రెడ్డి మాట్లాడితే విలువ ఉండేదన్నారు. హత్యకేసులో ఓ మంత్రి ప్రమేయం ఉందని చెప్పిన దినేష్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆ మంత్రిపై కేసు దాఖలు చేయకుండా సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలను దినేష్‌రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దినేష్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించాలని కేఎల్ఆర్ సూచించారు. -
మా పార్టీది తప్పుడు నిర్ణయం: శైలజానాథ్
హైదరాబాద్: తెలంగాణ తీర్మానం రాష్ట్ర అసెంబ్లీకి వస్తుందని మంత్రి శైలజానాథ్ అన్నారు. విభజన బిల్లు ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. సీఎం కిరణ్‌తో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన తీర్మానం అసెంబ్లీకి రావాల్సిందేనని అన్నారు. చరిత్రలో ఏ రాష్ట్ర ఏర్పాటు అసెంబ్లీ తీర్మానం లేకుండా జరగలేదన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కాదని పార్లమెంట్ ఎలా ముందుకెళ్తుందో చూద్దామన్నారు. సమైక్యాంధ్ర కోసం శాసనసభను సమావేశపరచాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంతో కూడుకున్నది ఆరోపించారు. చంద్రబాబు ప్రసంగంలో సమైక్యాంధ్ర గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాష్ట్ర విభజనపై తమ పార్టీది తప్పుడు నిర్ణయం తీసుకుందని శైలజానాథ్ దుయ్యబట్టారు. విభజన తీర్మానాన్ని ఓడించాలని నిర్ణయించామన్నారు. సమైక్యాంధ్ర కోసం కోట్లాది ప్రజలు పోరాటం చేస్తున్నారని చెప్పారు. తీర్మానం ఓడించాక ప్రజలతో కలిసి ఉద్యమంలోకి వస్తామన్నారు. -
అసెంబ్లీలో తీర్మానం వరకు కొనసాగుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపడంపై సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో గురువారం రాత్రి భేటీ అయిన అనంతరం మంత్రులు శైలజానాధ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. భారతప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజని శైలజానాధ్ వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయం ఏకపక్షమని, రాజ్యాగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించకుండా ఓడించి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. మంత్రి పదవులకు రాజీనామాల విషయం ప్రస్తావించగా.. ‘‘సమైక్య రాష్ట్ర ప్రభుత్వమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి కనుక అంతవరకు మా ప్రభుత్వం ఉంటుంది. అప్పటివరకు మేము కొనసాగి ఆ తీర్మానాన్ని ఓడిస్తాం’’ అని శైలజానాధ్ వివరించారు. ‘‘మంత్రి పదవులతో ఏం ఒరగబెడతాం. శ్మశానాల్లో ఏం ఏరుకుంటాం..’ అని వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడతామని, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీలు పిలుపునిచ్చిన బంద్‌లో కాంగ్రెస్ నేతలు భాగస్వాములవుతారని చెప్పారు. 2004లో, 2009లో అత్యధిక ఎంపీలను ఇచ్చినందుకు మా గొంతు కోశారని, కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. విభజనలో తమపార్టీ అధినేతలతో పాటు ప్రతిపక్ష అధినేత కూడా భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు ఏరాసు, గంటా, కాసు గుడ్‌బై ఇక రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని పలువురు సీమాంధ్ర మంత్రులు భావిస్తున్నారు. ఇంకా ప్రభుత్వంలో, పార్టీలో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందనే అభిప్రాయానికి వచ్చారు. వీరిలో మంత్రి పదవులకు రాజీనామా చేసి పార్టీలోనే కొనసాగాలని కొందరు మంత్రులు భావిస్తుంటే... పదవులతోపాటు పార్టీ పదవులకు కూడా గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు, కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను ఆమోదించుకోవాలని, ఆ మేరకు శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలవాలని నిర్ణయించారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన ఆయా మంత్రులు ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. అయితే సీఎం మాత్రం తొందరపాటు వద్దని బుజ్జగించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించిన తరువాత అందరం కలిసి అసెంబ్లీ సాక్షిగానే పదవులకు గుడ్‌బై చెప్పే అంశంపై నిర్ణయం తీసుకుందామని సూచించారు. అప్పటి వరకు ప్రభుత్వంలో కొనసాగితే తమకు రాజకీయ మనుగడ ఉండదని, మంత్రి పదవులతోపాటు పార్టీకి కూడా రాజీనామా చేయకతప్పదని స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు సీఎంను కలిసిన వారిలో ఆయా మంత్రులతోపాటు శైలజానాథ్, టీజీ వెంకటేశ్ కూడా ఉన్నప్పటికీ వారు మాత్రం ఇప్పటికిప్పుడు రాజీనామా చేయకూడదనే భావనలో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కొండ్రు మురళీమోహన్, పి.బాలరాజు తదితరులు మాత్రం పార్టీని వీడకూడదనే నిర్ణయానికి వచ్చారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు అన్వేషించాలే తప్ప హైకమాండ్ నిర్ణయాన్ని దిక్కరించకూడదని భావిస్తున్నారు. -
అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటాం - శైలజానాథ్
-
'తీర్మానం ముగిసాక రాజీనామాలు చేయొచ్చు'
హైదరాబాద్: అసెంబ్లీ తీర్మానం ముగిసాక రాజీనామాలు చేయడం ద్వారా విభజన తీర్మానాన్ని అడ్డుకోవచ్చని మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. అప్పటి వరకూ సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పదవిలో కొనసాగాలని ఆయన సూచించారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సమ్మె చేస్తున్న టీచర్లు సమ్మెను విరమించాలని శైలజానాథ్ విజ్క్షప్తి చేశారు. అసెంబ్లీ ప్రవేశపెట్టబోయే విభజన తీర్మానాన్ని అడ్డుకోవడానికి ఆ ప్రాంత ప్రతినిధులు పదవిలో కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. విభజనపై భవిష్యత్ కార్యాచరణ కోసం..అక్టోబర్ 3వ తేదీన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమ్మెతో సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతపడ్డాయి.గత రెండు నెలలుగా సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యమ సెగ బాగా తాకింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్దలు సమ్మెను విరమించాలని సూచిస్తున్నా, ఉద్యోగులు యధావిధిగా తమ సమ్మెను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. -
తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తాం: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వస్తే ఓడించి తీరాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం నిర్ణయించుకున్నామని మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ఇతర పార్టీలు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు.గురువారం సీఎల్పీ కార్యాలయంలో విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులతో కలసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాకే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విచారకరమన్నారు. తెలంగాణ ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రాకతప్పదని, అప్పుడు సీమాంధ్రుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండేందుకు ఏ ఒక్కరూ రాజీనామా చేయరాదని కోరారు. ఢిల్లీలో సమైక్యాంధ్ర ధర్నాకు శైలజానాథ్, పద్మరాజు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం జరుప తలపెట్టిన ధర్నాకు కాంగ్రెస్ ప్రతినిధులుగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్, విప్ రుద్రరాజు పద్మరాజు హాజరుకానున్నారు. ధర్నాకు సంఘీభావం తెలపాలని ఉద్యోగ సంఘాలు కోరిన మీదట తాము హాజరవ్వాలని నిర్ణయించుకున్నామని శైలజానాథ్ తెలిపారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. -
వైఎస్సార్ సీపీ డిమాండ్ తో ఏకీభవిస్తున్నాం: శైలజానాథ్
హైదరాబాద్:అసెంబ్లీలో తక్షణమే సమావేశపరచాలన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల డిమాండ్ తో ఏకీభవిస్తున్నామని మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. సీమాంధ్ర రాజీనామాల అంశంపై గురువారం మీడియాతో మాట్లాడిన శైలజానాథ్ అసెంబ్లీ తక్షణమే సమావేశపరచాలన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల డిమాండ్ తో తాను కూడా ఏకీభవిస్తున్నానని శైలజానాథ్ తెలిపారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా ఆలోచన చేయొద్దని ఆయన విన్నవించారు. అసెంబ్లీకి రానున్న తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించాలంటే పదవిలో కొనసాగాలని శైలజానాథ్ తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక డిమాండుతో సీమాంధ్ర ప్రాంతంలో 57 రోజులుగా ఉధృతంగా సమ్మె సాగుతోంది. ఇంత జరుగుతున్నా.. అటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు గానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులకు గానీ రాజీనామాలపై స్పందించడం లేదు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. రెండు నెలల నుంచి జీతాలను సైతం వదులుకుని, జీవితాలను పణంగా పెట్టి రోడ్లమీదే ఉంటున్నారు. ఆర్టీసీ బస్సులు రెండు నెలల నుంచి కదలట్లేదు. రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. -
మొదటి వారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం
రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించేందుకు వచ్చే నెల మొదటి వారంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరం సమావేశం కానున్నట్టు మంత్రి శైలజానాథ్ తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న అంశంపైనే ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎప్పుడు ఎక్కడ సమావేశం ఉంటుందన్న వివరాలను తరువాత తెలియజేస్తామన్నారు. రాష్ట్రం ఐక్యంగా ఉంచడానికి తాము సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తామని, అందులో విజయం సాధిస్తామని తమకు గట్టి నమ్మకం ఉందన్నారు. 56 రోజులలో ప్రక్రియ ఏమి ముందుకెళ్లింది?: మంత్రి గంటా తెలంగాణ విభజన ప్రక్రియ నుంచి కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కొట్టిపారేశారు. అందరూ అవే మాటలు చెబుతున్నారు తప్పితే.. సీడబ్లూసీ నిర్ణయం తీసుకొని ఇప్పటికి 56 రోజులవుతుందని, ఇన్ని రోజులలో ఆ ప్రక్రియ ఏమైనా ముందుకెళ్లిందా అని ప్రశ్నించారు. పదో ఇరువై సార్లు మాత్రం నోట్ తయారవుతుందంటూ ప్రకటనలు మాత్రం వచ్చాయన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాము నమ్ముతున్నామని చెప్పారు. -
'రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయింది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయిందని మంత్రులు గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్ స్పష్టం చేశారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో వారిరువురు భేటీ అయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుపై వర్కింగ్ కమిటీ తీర్మానం చేసి 56 రోజులు అయింది, అయిన తెలంగాణ ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడమే అందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. వచ్చే నెల మొదటివారంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు వివరించారు. ఆ సమయంఓ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొంటామని గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్ వెల్లడించారు. -
కెసిఆర్‌ని వణికించిన APNGO: శైలజానాథ్
-
రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర శ్మశానమే: శైలజానాథ్
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే సీమాంధ్ర ప్రాంతం శ్మశానంగా మారుతుంది. అక్కడేం మిగలదు. వాటిని పరిపాలించేందుకు మేము సిద్ధంగా లేము. అలాంటప్పుడు పదవులను పట్టుకొని వేలాడబోం. రాష్ట్రాన్ని కాపాడేందుకు ఉద్యోగులు, ప్రజలే స్వతహాగా ఉద్యమాలు చేస్తున్నారు. వారినెవ్వరూ ఆపలేరు. రాజకీయ నాయకులుగా మేమొక అజెండాతో పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని విడదీయకుండా ఉంచేందుకు మా వంతు కృషి చేస్తున్నాం’’అని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. ఢిల్లీ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలుగు ఉద్యోగులు ఆదివారం ఏపీభవన్ సమీపంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మంత్రి శైలజానాథ్ విలేకరులతో మాట్లాడారు. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నాక పార్టీ ఎమ్మెల్యేలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరడం ఇదే ప్రథమం అన్నారు. రాజకీయ నాయకులుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అది చేయలేమనుకున్నప్పుడు తమ పార్టీ సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల్లో ఉండబోరన్నారు. సాయంత్రం 4 గంటలకు ఉద్యోగుల దీక్షను మంత్రి శైలజానాథ్ విరమింపచేశారు. -
'చంద్రబాబు తన అభిప్రాయం స్పష్టం చేసి యాత్ర చెయ్యాలి'
-
'సమైక్యం మినహా మరో ప్రత్యామ్నయం లేదు'
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం మినహా మరో ప్రత్యామ్నయం లేదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అందరం నిర్ణయించుకున్నామని మరో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈనెల 7న ఏపీ ఎన్జీవోల సభకు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నేతలు ఈరోజు ఉదయం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటల పాటు ఈ దీక్ష నిర్వహించారు. సమైక్య రాష్ట్రం కోసం తాము 48 గంటలు నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా శైలజానాథ్ ప్రకటించారు. ఈ దీక్షకు దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. -
మా పదవులు ప్రజలిచ్చినవే: శైలజానాథ్
-
మా పదవులు ప్రజలిచ్చినవే: శైలజానాథ్
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు దీక్ష ప్రారంభమైంది. శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వారు మంగళవారం దీక్ష చేపట్టారు. ముందుగా సీమాంధ్ర నేతలు గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్ష ఆరంభించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం చైర్మన్, మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. తమ పదవులు ప్రజలు ఇచ్చినవేనని... వారి డిమాండ్‌లో న్యాయం ఉందని అన్నారు. రాజీనామాలపై వెనకాడే ప్రసక్తే లేదని.... సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. సమైక్యాంధ్ర, ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్షలు 12మంది మంత్రులు, 39మంది ఎమ్మెల్యేలు, 15మంది ఎమ్మెల్సీలు ఇప్పటివరకూ పాల్గొన్నారు. ఇక సీమాంధ్ర నేతల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తున్నారు. మరోవైపు 108 అంబులెన్స్‌లను అధికారులు సిద్ధంగా ఉంచారు. -
సమైక్య రాష్ట్రామే లక్ష్యం: శైలజానాథ్
సమైక్య రాష్ట్రమే తమ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్య ఉంచేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే అంశాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సమైక్యాంధ్ర రాష్ట్రం కోరుతూ నేడు అసెంబ్లీ అవరణలోని జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా దీక్ష చేపట్టనున్నారు. కాగా ఆ దీక్షకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులంతా తరలివస్తారని ఎస్.శైలజానాథ్ తెలిపారు. -
ఆత్మగౌరవ వెన్నుపోటు యాత్ర: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: అధికారంకోసం నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నేడు తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు ఆత్మగౌరవ యాత్రకు సిద్ధమయ్యారని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికిచ్చిన విభజన లేఖను ఉపసంహరించుకోవడంతోపాటు రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలంటూ లేఖ పంపాకే యాత్ర చేపట్టాలని సూచించారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకొచ్చి సమ్మె చేస్తుంటే చంద్రబాబు మాత్రం వారిని మరోసారి మోసగించేందుకు యాత్రకు సిద్ధమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు తన యాత్రకు ఆత్మగౌరవ వెన్నుపోటు యాత్రని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. గాదె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సెప్టెంబర్ 3న అసెంబ్లీ ఆవరణలో సత్యాగ్రహ దీక్ష చేపడతామని తెలిపారు. -
సీడబ్ల్యూసీది తప్పుడు నిర్ణయం: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయం దేశానికి, రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు కీడు చేస్తుంది కనుక వెనక్కు తీసుకోవాలని మంత్రి సాకే శైలజానాథ్, సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. విభజనపై కాంగ్రెస్ మాత్రమే తప్ప ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదంటూనే మెజార్టీలేని యూపీఏ పక్షాలు చేసే తీర్మానానికి ప్రాధాన్యత ఉండదని స్పష్టంచేశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్య ఉద్యమానికి తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. వారు గురువారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా ఉద్యమిస్తామని శైలజానాథ్ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా తాము హైదరాబాద్‌లో దీక్షలు చేయనున్నామని తెలిపారు. వచ్చేనెలలో ఏ తేదీన దీన్ని నిర్వహించాలి? ఎక్కడ పెట్టాలి? అన్న అంశాలపై అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తొలినుంచి పోరాడుతున్నది కేవలం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలేనన్నారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికైనా మనసు మార్చుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానాలు చేయాలని సూచించారు. చంద్రబాబునాయుడు వంటి అసమర్థుణ్ని ఎక్కడా చూడలేదని, స్థాయికి మించి ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై అనుచిత, కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందే: గాదె ఒకప్రాంతానికి న్యాయం, మరో ప్రాంతానికి అన్యా యం చేసే విభజన సరైనది కాదని, దీన్ని వెనక్కు తీసుకోవలసిందేనని గాదె వెంకటరెడ్డి స్పష్టంచేశారు. సమైక్యమనే మాట టీడీపీ, వైఎస్సార్సీపీలనుంచి రాకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు విభజనకు లేఖ ఇచ్చి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అని వెళ్తే ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేరని దుయ్యబట్టారు. విభజనపై కాంగ్రెస్ వెనక్కు వెళ్లకుంటే ఆపార్టీలో ఉండాలో, వద్దో తరువాత ఆలోచిస్తామని గాదె ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
శైలజానాథ్‌కు సమైక్యసెగ
టీడీపీ ఎమ్మెల్యేలు కేశవ్, అశోక్‌లనూ నిలదీసిన ఉద్యమకారులు సాక్షి నెట్వర్క్: అనంతపురంలో మంత్రి సాకే శైలజానాథ్‌కు సమైక్యసెగ తగిలింది. పీఆర్‌ఉద్యోగ సంఘాల జేఏసీ, మునిసిపల్ ఉద్యోగుల జేఏసీ నేతలు ‘గోబ్యాక్ శైలజానాథ్’ అంటూ నినాదాలు చేశారు. బహిరంగసభలో ప్రసంగిస్తున్న సమయంలోనూ ‘శైలజానాథ్ డౌన్ డౌన్.. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇదే జిల్లా కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు చేపట్టిన రిలేదీక్షలకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంఘీభావం తెలపడానికి వెళ్లగా.. ‘గో బ్యాక్’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ వద్ద రిలే దీక్షలు చేపడుతున్న ఉపాధ్యాయులకు సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక గజపతిరాజు వెళ్లగా, ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. -
రాయల తెలంగాణకు ఆమోదం లేదుః శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్ : రాయల తెలంగాణకు ప్రజామోదం లేదని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్.శైలజానాథ్ చెప్పారు. ఎవరో కొంతమంది నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిస్తున్నారే తప్ప సీమాంధ్రలో 99 శాతం మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజుతో కలిసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించడం మినహా మరే ప్రతిపాదనను అంగీకరించేది లేదని, విభజనపై కేంద్ర ప్రభుత్వ కమిటీ ఏర్పడినా...ఆంటోని కమిటీయే కొనసాగినా తమ వైఖరిలో మాత్రం మార్పు ఉండబోదని ఉద్ఘాటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నిజంగా విభజనను వ్యతిరేకిస్తున్నట్లయితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని టీడీపీ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. తెలుగు జాతి ఐక్యతకు విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడినందున ఇప్పటికైనా ఓట్లు, సీట్ల రాజకీయాలు మానేసి విపక్ష పార్టీలు విభజనను వ్యతిరేకించాలని సూచించారు. విభజన పాపం కిరణ్, బొత్సలదేనంటూ కిషోర్ చంద్రదేవ్ చేసిన విమర్శలను శైలజానాథ్ తోసిపుచ్చారు. -
హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ నిర్వహిస్తాం: శైలజానాథ్
హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభను నిర్వహించి తీరుతామని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రభుత్వం తరఫున ఓ కమిటీని నియమిస్తున్నట్లు యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ప్రభుత్వ కమిటీ ఏర్పాటును తాము ఆహ్వానిస్తున్నామని, అయితే విధివిధానాలు తెలిసిన తర్వాతే స్పందిస్తామని ఆయన చెప్పారు. సమైక్యంధ్ర కోసం ఉధృతంగా జరుగుతున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని, తామంతా కూడా సమైక్యాంధ్ర కోసమే కృషి చేస్తున్నామని అన్నారు. -
అసెంబ్లీ తీర్మానాన్ని ఓడిస్తాం: మంత్రి శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో రాష్ట్ర విభజన తీర్మానం ప్రవేశపెడితే కచ్చితంగా ఓడిస్తామని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్.శైలజానాథ్ ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్రకు చెందిన ఇతర పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు సమైక్యవాదానికి కట్టుబడిన తెలంగాణ ప్రజాప్రతినిధులంతా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని కోరారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజుతో కలిసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా మరేది ప్రత్యామ్నాయం కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపామని తెలిపారు. హైకమాండ్ తీసుకున్న విభజన నిర్ణయం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే అసెంబ్లీలో విభజన తీర్మానం ప్రవేశపెడితే ఖచ్చితంగా ఓడించేందుకు తమ శక్తినంతటిని వినియోగిస్తామన్నారు. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ శాసనసభలో తీర్మానం ఆమోదం పొందిన తరువాతే ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఆంధప్రదేశ్ శాసనసభలో విభజన తీర్మానం వీగిపోతే కొత్త రాష్ట్ర ఏర్పాటు ఆగిపోతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించిన తరువాత తాము ఏం చేస్తామనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, మీరే (మీడియా) చూస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ప్రతిరోజూ సీమాంధ్రలో లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ఒక్క మాట కూడా చెప్పకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇకనైనా రాజకీయ కుట్రను పక్కనపెట్టి విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని సమైక్య తీర్మానం చేసి పంపాలని బాబుకు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం సమన్యాయం అని చెప్పడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలమంతా మొదటినుంచి సమైక్య వాదానికే కట్టుబడి ఉండటంతోపాటు హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ తరపున ఏ ఒక్కరూ గెలవరనే విషయాన్ని దిగ్విజయ్‌సింగ్‌కు స్పష్టం చేశామని ఏరాసు చెప్పారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాయలసీమలోని 60 వేల ఎకరాలకు నీరందించే వివాదం ఇంకా పెండింగ్‌లో ఉందని, రాష్ట్రం విడిపోతే సీమలోని 20 లక్షలకుపైగా ఎకరాలకు నీరందించలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి ఆదేశించినా కావేరి సమస్య పరిష్కారం కాలేదని, అలాంటప్పుడు తమ సమస్యలను పరిష్కరించేదెవరని ఆయన ప్రశ్నించారు. -
బాబు దొంగ నాటకాలు ఆపాలి:శైలజానాథ్
విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే అన్ని పార్టీలు కలిసి ఓడిస్తామని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ శుక్రవారం హైదరాబాద్‌లో స్ఫష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరామని ఆయన తెలిపారు. అయిన రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజిస్తారు అని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఇకనైన దొంగ నాటకాలకు తెరదించాలని చంద్రబాబుకు ఈ సందర్భంగా హితవు పలికారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని బాబు ఇప్పటికైనా చెప్పకపోవడం పట్ల ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. కర్నూలులో లక్షమంది రోడ్లపైకి వచ్చి సమైక్యగళం వినిపించిన సంగతిని న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సమైక్య ఉద్యమంలో నేతలను దగ్గరకు రానీయకుండా ప్రజలే ఉద్యమం చేస్తున్నారని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. -
అన్ని పార్టీల నుంచి లెటర్ కావాలి
-
కార్యాచరణ ప్రకటించనున్న సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు
-
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి: శైలజానాథ్
-
రాష్ట్రాన్ని విభజిస్తే జల యుద్ధాలే: సీమాంధ్రనేతలు