Sand
-
నిద్రిస్తున్న కూలీలపై ఇసుక అన్లోడ్.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర: జల్నాలో విషాదం జరిగింది. నిద్రిస్తున్న తీసుకుంటున్న కూలీలపై టిప్పర్ ట్రక్కు డ్రైవర్ ఇసుక లోడ్ వేయడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. నిద్రిస్తున్న కూలీలను గమనించకుండా ట్రక్కు డ్రైవర్.. ఇసుకను అన్లోడ్ చేశాడు.ఇసుక అన్లోడ్ చేసే సమయంలో షెడ్డు కూలడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, శిథిలాల నుంచి మహిళ, బాలికను రక్షించారు. శనివారం తెల్లవారుజామున జాఫ్రాబాద్ తహసీల్‌లోని పసోడి-చందోల్‌లోని వంతెన నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పరారీలో ఉండగా, అతని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వీఆర్ వో నాగేంద్రతో టీడీపీ నేత నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ
-
3 జలాశయాల్లో పూడిక తీతకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో పైలట్ ప్రాజెక్టు కింద పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించడానికి రా ష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిoది. ఇందులోని నిబంధనల మేరకు పూడిక తొలగింపుతో లభ్యమయ్యే ఇసుకను కాంట్రాక్టర్లు అమ్ముకోవచ్చు. ఈ నేపథ్యంలో మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.406.64ను కనీస బిడ్డింగ్ ధరగా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ ధరను ఎప్పటికప్పుడు సవరిస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు తాము కోట్ చేసిన ధర ఆధారంగా ఎంత ఇసుకను తవ్వితే ఆ మేరకు ప్రభుత్వానికి చెల్లింపు లు చేయాల్సి ఉంటుంది. పూడిక తొలగింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణ వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీడబ్ల్యూఆర్డీసీ) ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కాంట్రాక్టర్లు ఇసుక నిల్వలను స్టాక్‌యార్డులో నిర్వహించాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖ, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)లు దీనిని పర్యవేక్షించనున్నాయి. ఈ మేరకు పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించాలని కరీంనగర్ ఈఎన్సీని ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకుపోయిన పూడిక రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 జలాశయాలున్నాయి. కాగా, ఇందులో సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో పూడిక పెరిగి క్రమంగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమై న సాగునీటికి లోటు ఏర్పడుతోంది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భా గంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పో యినట్టు తేలింది. దేశంలో పీఎం కిసాన్ సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది. కాగా, పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మూడు జలాశయాల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. సర్కారుకు ఖర్చు లేకుండా.. జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పూడికతీత కోసం రాజస్తాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ ఆర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) నిర్వ హించనున్నారు. దీనికోసం ప్రభు త్వం ఎలాంటి ఖ ర్చు చేయదు. అత్యధిక ధర కోట్ చేసిన బిడ్డర్లు పన్నులు, సెస్, జీఎస్టీ, రాయల్టీని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపున కు ఇదే విధానాన్ని అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది. పూడిక తొలగింపు గడువు 20 ఏళ్లు! జలాశయాల్లో భారీగా ఉన్న పూడికను ఇప్పటికిప్పుడు తొలగించడం సాధ్యం కాదు. పూడిక తొలగింపునకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లు కాంట్రాక్టర్లతో 20 ఏళ్ల గడువుతో ఒప్పందా లు చేసుకోగా, మరో ఐదేళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్రంలో సైతం ఇదే రీతిలో 20 ఏళ్ల గడువు విధించి, ఆ తర్వాత గరిష్టంగా 5 ఏళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. -
పది వేలిస్తేనే.. ఇసుక లోడింగ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతల ఇసుక దందా యథేచ్ఛంగా సాగుతోంది. రూ.10 వేలు ఇస్తేనే ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఇక్కడంతా టీడీపీ ఎంపీ ఒకరి అనుచరుల దందానే. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్ చేసుకొన్నా తట్టెడు ఇసుక దొరకదు. చలానాకు ఇసుక దొరకదని కరాఖండిగా చెబుతున్నారు. గట్టిగా అడిగిన వారిపై పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలకు డబ్బు ముట్టజెబితే దండిగా ఇసుక లోడ్ చేస్తారు.టీడీపీ ఎంపీ పీఏలుగా వ్యవహరిస్తున్న జగదీష్, కిశోర్లే ఈ రీచ్‌లను పర్యవేక్షిస్తున్నారు. ఓ లారీ యజమానికి, ఇసుక రీచ్‌లో ఉన్న మనుషులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు రావడంతో ఈ విషయం బట్టబయలైంది. కంచికచర్ల మండలం వేములపల్లి, పెండ్యాల, కాసరబాద రీచ్‌లను వీరు గుప్పిట్లో పెట్టుకొని లారీకి రూ.10 వేలు రేటు కట్టి వసూలు చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వారికి భారీ పొక్లెయిన్లతో ఇసుక ఎత్తిపోస్తున్నారు. అంతే కాకుండా, రోజుకు 200కు పైగా లారీల ఇసుక అక్రమంగా ఖమ్మం, వైరా, హైదరాబాద్, విజయవాడకు తరలించి పెద్ద ఎత్తున దండుకొంటున్నారు.ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుతీరగానే 8 స్టాకు యార్డుల్లో ఉన్న ఇసుకను టీడీపీ నాయకులు లూటీ చేశారు. ఇక్కడ 2 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను మింగేశారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి భారీ ధరలకు తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీని వెనుక జిల్లాకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధుల హస్తం ఉందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇసుక రీచ్‌లను గుప్పిట్లో పెట్టుకొని రేటు కట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. -
ఇది 'గంగా' దందా
సాక్షి, టాస్క్ ఫోర్స్ : ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. అధికార పార్టీ నేత మాత్రమే. ఇది చాలు దండుకోవడానికన్నట్లు ప్రభుత్వేతర శక్తిగా రెచ్చిపోతున్నారు. సొంత పార్టీలోని ఇతర నేతలకు సైతం కొరకరాని కొయ్యలా మారి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయడం లేదు. తన నియోజకవర్గం మీదుగా వెళ్లే ప్రతి ఇసుక లారీ తను చెప్పిన రేటుకు అన్లోడ్ చేసి వెళ్లాల్సిందేనని రూల్ పెట్డారు. ఏకంగా నేషనల్ హైవేపై అనధికారికంగా టోల్గేట్ పెట్టి, తన ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గంగా ప్రసాద్. ఈయన వ్యవహారం ప్రధానంగా వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని అధికార కూటమి పార్టీల నేతలకు మింగుడు పడటం లేదు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, అది క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలవ్వడం లేదు. లోకల్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో రీచ్‌ల నిర్వహణ సాగుతోంది. ఈ ప్రాంతంలో పెన్నా నదిలో భారీ యంత్రాలు పెట్టి టన్నుల లెక్కన లోడింగ్ చార్జీల పేరుతో నగదు వసూలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. పెన్నా ఇసుకకు ఇతర జిల్లాలతో పాటు చెన్నై, బెంగళూరులో ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతో అధికార పార్టీ నేతలు పెన్నా నది నుంచి ఇసుకను చెన్నై, బెంగళూరులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాకు చెందిన గంగాప్రసాద్ కన్ను ఈ దందాపై పడింది. 20 రోజులుగా జాతీయ రహదారిపై ప్రైవేటు సైన్యం ద్వారా టోల్గేట్ పెట్టి, ఇసుక లారీలను ఆపుతున్నారు. టన్ను ఇసుకను రూ.750 చొప్పున వదిలేసి వెళ్లాలని నిబంధన పెట్టారు. లేదంటే వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాల దృష్ట్యా స్థానిక నేతలెవరూ ఈయన వ్యవహారాన్ని నేరుగా ప్రశ్నించలేక పోతున్నారు. ఇప్పటికే సిలికా, సైదాపురం గనుల్లో సైతం అనధికారికంగా మైనింగ్ దందా నడుపుతున్న గంగాప్రసాద్.. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న స్వర్ణముఖి నది గర్భాన్ని సైతం తోడేస్తూ చెన్నైకి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ పెద్ద టిప్పర్ ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్ష ధర పలుకుతోంది.నెల్లూరు ఇసుక మాఫియా ఆయన కనుసన్నల్లోనే..నెల్లూరు జిల్లా ఇసుక మాఫియాను కూడా గంగా ప్రసాద్ తన గుప్పిట్లోకి తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తిరుపతి, నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో నేషనల్ హైవేపై ఏకంగా టోల్గేట్ పెట్టి, ప్రైవేటు సైన్యం చేత వాహనాలను తనిఖీలు చేయిస్తున్నారు. ఇందుకు పోలీసులు సైతం ఈయనకు సహకరిస్తుండటం విడ్డూరం. తన మాట వినకుండా ఏ లారీ అయినా ముందుకు వెళితే.. గూడూరు రూరల్ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయిస్తున్నారు. టన్ను ఇసుక రూ.750 చొప్పున కారు చౌకగా కొట్టేస్తున్న గంగాప్రసాద్... శ్రీసిటీలో నిర్మాణాలకు టన్ను రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీసిటీలో 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని తెలుసుకుని ఈ దందాకు దిగారు. ఈయన వ్యవహారం అటు తిరుపతి, ఇటు నెల్లూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. ఆయా జిల్లాల నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే ఇసుక లారీలకు ఆరు నెలలుగా లోకల్ ఎమ్మెల్యేలు వెన్నుదన్నుగా ఉన్నారు. గంగా ప్రసాద్ రంగంలోకి దిగడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారంతా నిర్ణయించినట్లు తెలిసింది. -
ఇసుక ఫ్రీ ఫ్రీ ఫ్రీ..
-
పుష్పగిరిలో భక్తుల్ని ఆకర్షిస్తున్న సైకత లింగం
వైఎస్సార్, సాక్షి: పుష్పగిరిలో నది తీరాన భక్తుల చేత ప్రశంసలందుకుంటున్న సైకత లింగం. వల్లూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన రెండవ దక్షిణ కాశి పుష్పగిరి పుణ్యక్షేత్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయ సమీపాన పంచమ నది ఒడిలో సైకత శివలింగాన్ని ఇoటాక్ సభ్యులు కడిమెల్ల రాఘవేంద్ర వర్మ తన స్వహస్తాలతో తయారుచేశారు. వర్మ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాన్ని గురువారం సందర్శించారు. లింగాన్ని తిలకించిన పలువురు భక్తుల చేత ప్రశంసలు అందుకొoటోoది. -
‘ఇసుక’ లేని ఇన్‌కం కోసం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించింది. సంస్థకు ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా, అదంతా రాష్ట్ర ఖజానాకు చేరుతోంది. దీంతో టీజీఎండీసీ ఖాతా ఎప్పటికప్పుడు ఖాళీ అవుతోంది. ఫలితంగా ఇసుక వెలికితీస్తున్న కాంట్రాక్టు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు నెలల తరబడి పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుక విక్రయాల్లో లోపాలను అరికట్టడంతోపాటు ఇతర ఖనిజాల అన్వేషణ, విక్రయం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. నాపరాయి, మార్బుల్, సున్నపురాయి, క్వారŠట్జ్, ఫెల్డ్‌స్పార్ గనులను లీజుకు తీసుకొని వెలికితీత, విక్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు జాతీయస్థాయిలోనూ సున్నపురాయి గనులను లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఏటా రూ.వందల కోట్ల ఆదాయం వస్తున్నా..రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సగటున ఏటా రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర ఇసుక విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ఏటా సుమారు కోటిన్నర క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుకను వెలికితీసి ఆన్లైన్ విధానంలో విక్రయిస్తోంది. సంస్థ నిర్వహణ వ్యయం, ప్రభుత్వ ఖజానాకు చేరుతున్న ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే టీజీఎండీసీ లాభాలు ఏటా రూ.30 కోట్లకు మించడం లేదు. ఇదిలా ఉంటే రీచ్‌ల నుంచి ఇసుకను వెలికితీసి స్టాక్ పాయింట్లకు తరలిస్తున్న కాంట్రాక్టు సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా రూ.400 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నట్టు టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి.సంస్థ ఆదాయం రాష్ట్ర ఖజానాకు మళ్లుతుండటంతో ఈ తరహా పరిస్థితి తలెత్తినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థ ఆదాయం పెంచుకునే దిశగా టీజీఎండీసీ ఆలోచన చేస్తోంది. సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ(ఎన్ఈఏ) గుర్తింపు ఉండటంతో జాతీయస్థాయిలోనూ ఖనిజాల వెలికితీత, విక్రయాలపై దృష్టి సారించింది.సున్నపురాయి గనుల లీజు కోసం.. రాష్ట్రంలో ఐదుచోట్ల 83.23 హెక్టార్ల ప్రభుత్వ, అటవీభూముల్లో ఉన్న నాపరాయిని వెలికితీయడం, ఖమ్మం జిల్లా ఇల్లెందు పరిసరాల్లో పాలరాయి నిల్వల మదింపుపై టీజీఎండీసీ దృష్టి పెట్టింది. ⇒ మంచిర్యాల జిల్లా దేవాపూర్ సమీపంలో 880 హెక్టార్ల అటవీ భూ మిని సున్నపురాయి వెలికితీత కోసం 2018లోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో క్వారŠట్జ్, ఫెల్డ్‌స్పార్ క్వారీల లీజు కోసం దరఖాస్తులు అందాయి. ⇒ గుండాల అటవీ ప్రాంతంలోని పలు కంపార్ట్మెంట్లలో నిల్వలు ఉన్నట్టు తేలడంతో ప్రస్తుతం మైనింగ్ లీజుల అనుమతుల ప్రక్రియను ప్రారంభించింది. ⇒ గతంలో నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ) నిధులతో తెలంగాణతోపాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో సున్నపురాయి అన్వేషణ ప్రాజెక్టులను టీజీఎండీసీ పూర్తి చేసింది. కేవలం అన్వేషణకే పరిమితం కాకుండా సున్నపురాయి గనులను లీజుకు తీసుకోవాలని సంస్థ భావిస్తోంది. ఒడిశాలోని కొన్ని సున్నపురాయి క్వారీలను లీజుకు తీసుకోవడంపై ఆసక్తి చూపుతున్న టీజీఎండీసీ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. ⇒ ఎన్ఎంఈటీ నిధులతో మాంగనీస్, మాలిబ్డినం అన్వేషణ కార్యకలాపాలు కూడా చేపట్టనుంది. ⇒ రాబోయే రోజుల్లో రోడ్ మెటల్‌కు భారీ డిమాండ్ ఉంటుందని టీజీఎండీసీ అంచనా వేస్తోంది. రంగారెడ్డి జిల్లా బండ రావిర్యాలలో రోడ్మెటల్ క్వారీయింగ్ చేపట్టేందుకు టీజీఎండీసీ సన్నద్ధమవుతోంది. ఇతర కార్యకలాపాల ద్వారా ఆదాయం పెంచుకునే ప్రణాళికలపై కసరత్తు జరుగుతున్నట్టు సంస్థ ఎండీ సుశీల్ కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
మితిమీరిన టీడీపీ ఇసుక దందా..ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
ఉచిత ఇసుక ఊరికే రాదు .. డబ్బులిస్తే మాత్రం .
-
పెన్నా నదిలో ‘వసూళ్ల గేటు’
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరుడు గుర్రప్ప అలియాస్ గురివిరెడ్డి ఏకంగా పెన్నా నదిలో అనధికార గేటు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒంటెద్దు బండికి రూ.150, రెండు ఎడ్ల బండ్లకు రూ.300, ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.1,200 చెల్లిస్తే కానీ పెన్నా నదిలోకి అనుమతించడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా పెన్నా నదిలో గేటు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని కొందరు వ్యక్తులు పెన్నా నదిలోని ఇసుకకు మీకు ఎందుకు గేటు చార్జీలు చెల్లించాలని సోమవారం వాగ్వాదానికి దిగడంతో ఈ పంచాయితీ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అయినా ఫలితం లేకపోయింది. గేటు దగ్గర వసూళ్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.అక్రమ రవాణాకు అడ్డారామాపురం గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండటంతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మండల పరిధిలోని పెన్నా నది పరీవాహక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
కేసులకు, జైళకు భయపడే పిరికి వోళ్ళం కాదు: Govardhan Reddy
-
ఇసుకపై ఇంకో అబద్ధం
సాక్షి, అమరావతి: ఇసుకపై కేబినెట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలను వల్లె వేసింది. ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. నిజానికి జీఎస్టీని రద్దు చేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. అయినా సరే ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందని మంత్రి రవీంద్ర ప్రకటించడంపై అధికార యంత్రాంగం సైతం విస్తుపోతోంది.ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం వినియోగదారులపైనే పడుతుంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఇసుక సేల్ పాయింట్ల దగ్గర విక్రయిస్తే ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇది కూడా వినియోగదారులపైనే పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధికారంతో జీఎస్టీని రద్దు చేస్తూ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.జీఎస్టీ కౌన్సిల్‌దే నిర్ణయంఇసుక సహా ఏదైనా సరే జీఎస్టీ నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై జీఎస్టీ నుంచి మినహాయింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్ జారీ చేస్తారని, అది దేశమంతా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రానికో మాదిరిగా జీఎస్టీ ఉండదని, మీడియా సమావేశంలో మంత్రి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇసుకపై సీనరేజ్ రద్దు చేసే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే జీఎస్టీ కూడా రద్దు చేశామని ప్రకటించడమంటే ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చట్టం గురించి తెలియదా?ఇసుక కార్యకలాపాలపై ఎస్జీఎస్టీని మాత్రమే రీయింబర్స్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, అంతకు మించి జీఎస్టీని రద్దు చేసే అధికారం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. అందరి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేశానని, తనకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు జీఎస్టీని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలియదా? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిర్మాణ రంగానికి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే ఇసుకపై 2017 సీజీఎస్టీ చట్టం సెక్షన్ 9 ప్రకారం ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంలో సీజీఎస్టీ చట్టం సెక్షన్ 7 (1) ప్రకారం 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ చట్టం జమ్మూ–కశ్మీర్ మినహా దేశమంతా వర్తిస్తుంది.మాఫియాను అరికట్టలేక చేతులెత్తేశారు..!తనకు ఏమాత్రం అధికారం లేని జీఎస్టీని రద్దు చేసినట్లు అబద్ధాలు చెబుతూ సీఎం చంద్రబాబు ఇసుక వినియోగదారులతో చెలగాటం ఆడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో ఇసుక దొరకపోవడానికి, అత్యధిక ధరలకు విక్రయించడానికి మూల కారణం పచ్చ ముఠాలేనని తెలిసినా వారిని నిరోధించకుండా గత ప్రభుత్వంపై నిందలు మోపటాన్ని బట్టి ఇసుక మాఫియాను అరికట్టలేక చంద్రబాబు చేతులెత్తేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని, అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ అధికారులు ఇచ్చిన నివేదికలను పట్టించుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లితే ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రిగా తానే ఉన్నాననే విషయాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు టీడీపీ నేతల ఇసుక దోపిడీని అరికట్టకుండా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. ఇసుక విధానంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు మార్పులు చేసినా ప్రయోజనం శూన్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరఫరా కేంద్రాల వద్ద గంటల తరబడి వాహనాలు నిరీక్షించాల్సి రావడం వల్ల ఎక్కువ రవాణా చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. బ్లాక్ మార్కెటింగ్, అస్తవ్యస్థంగా రీచ్‌ల నిర్వహణ గురించి తెలిసినా పట్టించుకోకపోవటాన్ని బట్టి ప్రభుత్వం ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నిర్మాణ రంగం కుప్పకూలింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందని, ఇందుకు ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్, నిర్వహణ లోపాలు, అక్రమ కార్యకలాపాలే కారణమని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఇసుక ఉచితం ప్రకటనలకే పరిమితమని, ధరలు మాత్రం భారీగా పెరిగాయని పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలి వెళ్లడం, అక్రమ విక్రయాల కారణంగా డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయలేకపోతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సుమారు 40 లక్షల మంది కార్మికులకు జీవనోపాధి కల్పించే నిర్మాణ రంగం కుప్పకూలిపోవడానికి ఇసుక ధరలు భారీగా పెరగడంతో పాటు లభ్యత లేకపోవడమేనని కారణమని తేల్చారు. ఈ ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి నిర్మాణ రంగంలో జీఎస్టీ ద్వారా రూ.1,260 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.955 కోట్లు మా త్రమే సమకూరినట్లు ప్రభుత్వానికి నివేదించారు. రూ.300 కోట్లకుపైగా ఆదాయం పడిపోవడానికి కారణం నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోవడమేనని, ఇసుక లభ్యత లేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. గత ఆర్నెళ్లలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకకు డిమాండ్ ఉండగా కే వలం 32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి నట్లు తెలిపారు. ఇసుక రీచ్‌లను దక్కించుకునేందుకు తక్కువ ధరకు కోట్ చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు అక్రమాలకు తెరతీశాయన్నారు. గత 30 రోజుల్లో సగటున రోజుకు 26, 000 మెట్రిక్ టన్నుల చొప్పున 5.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇసుక సరఫరా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి రోజుకు 80,000 నుంచి 90,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ఇసుక కొరతకు గత సర్కారు విధానాలే కారణమంటూ ప్రభుత్వ పెద్దలు నిందలు మోపడంపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం పెరుగుదల ఇసుక కొరతతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని, నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోయాయని ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అధికారుల నివేదికలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో జీఎస్టీ రూపంలో రూ.974 కోట్లు ఆదాయం రాగా 2023–24 నాటికి రూ.2,083 కోట్లకు పెరిగిందని, అంటే సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం మేర పెరిగిందని అధికారులు తెలిపారు. -
దళారులెవరు బాబూ.. తమ్ముళ్లేగా?
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా, మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
నన్ను చంపేందుకు.. పోలీసులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే స్కెచ్
-
తమకు దక్కలేదని.. ఇసుక టెండర్లే రద్దు
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక మంత్రి ఇసుక రీచ్‌ల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారు. జిల్లాలో గురువారం నాలుగు ఓపెన్ ఇసుక రీచ్‌లకు టెండర్లు తెరిచారు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువవడంతో కలెక్టర్ లాటరీ విధానంలో నలుగురికి అనుమతులు ఇచ్చారు. మెట్ట నియోజకవర్గంలో ఒక రీచ్ దక్కిన కాంట్రాక్టర్‌పై మంత్రి వీరంగం వేశారు. ఆ కాంట్రాక్టర్‌ను పిలిపించుకుని.. నా ఇలాఖాలో ఎలా టెండర్ వేస్తావంటూ బూతులు తిట్టారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఏకంగా ఇసుక టెండర్లనే రద్దుచేయించారు. జరిగింది ఇలా.. జిల్లాలోని పెన్నానదిలో నాలుగుచోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇహ్వాది. మినగల్లు, పడమటి కంభంపాడు, పల్లిపాడు, విరువూరుల్లో ఓపెన్ రీచ్‌ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల ఏడో తేదీన టెండర్లు ఆహ్వానించారు. ఆ రీచ్‌లకు 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిలో ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది. మిగిలిన దరఖాస్తులు అర్హత సాధించడంతో కలెక్టర్ ఆనంద్ లాటరీ విధానంలో నలుగురు కాంట్రాక్టర్లకు నాలుగు రీచ్‌లు కేటాయించారు. రీచ్‌లను పంచుకునేందుకు.. నాలుగు ఓపెన్ రీచ్‌లను పంచుకునేందుకు ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు తమ షాడోలతో టెండర్లు దాఖలు చేయించారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రం చేసి తమ షాడోలకు అప్పగించేందుకు పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపించేందుకు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.90–100 చొప్పున చెల్లించారు. ఇప్పుడు అదే ధరతో టెండర్లు ఆహ్వానించినా.. తమ్ముళ్లు మాత్రం రీచ్‌ల్లోకి ఎంట్రీ అయితే చాలన్నట్లుగా గిట్టుబాటు చూడకుండానే టన్నుకు రూ.36 మాత్రమే కోట్ చేశారు. అంత తక్కువ ధరకే కేటాయిస్తే గిట్టుబాటు కాదని, అక్రమ రవాణాను ప్రోత్సహించినట్లే అవుతుందని భావించి టన్నుకు రూ.114.90 వంతున నిర్ణయించిన కలెక్టర్ లాటరీతో ఒక్కో రీచ్‌కు ముగ్గురిని ఎంపికచేసి ప్రథమస్థానంలో ఉన్నవారికి రీచ్ కేటాయించారు. మరో ఇద్దరిని రిజర్వులో ఉంచారు. తమ అనుచరులకు టెండర్లు దక్కలేదని ఆ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు టెండర్ల ప్రక్రియ జరిగినప్పుడు లాటరీ విధానంలో ఎలా ఎంపిక చేస్తారంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్లనే రద్దుచేయించారు. నా ఇలాఖాలోకి వస్తావా.. తాట వలిచేస్తా.. లాటరీ విధానంలో ఇసుక రీచ్ దక్కించుకున్న ఒక కాంట్రాక్టర్‌పై మెట్ట ప్రాంతానికి చెందిన ఒక మంత్రి చిందులు తొక్కారు. తన నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్‌కు తన అనుమతి లేకుండా టెండర్ ఎలా దాఖలు చేస్తావంటూ గురువారం రాత్రి బండబూతులతో రెచి్చపోయారు. ‘నా ఇలాఖాలోకి వచ్చి ఇసుక రీచ్‌కు టెండరు వేస్తావా.. నీ తాట తీస్తా..’ అంటూ మంత్రి కన్నెర్ర చేయడంతో వణికిపోయిన కాంట్రాక్టర్ తాను రీచ్ నుంచి తప్పుకుంటానని వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
జంగారెడ్డిగూడెం: ఇసుక ఉచితమంటూ ప్రచారం చేస్తున్నారని.. తీసుకెళుతుంటే మాత్రం అధికారులు కేసులు నమోదు చేస్తున్నారంటూ శుక్రవారం ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం జల్లేరు వాగు నుంచి ఇసుకను రవాణా చేసేందుకు 8 ట్రాక్టర్లు వెళ్లాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు జల్లేరు వాగు సమీపానికి వెళ్లి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దుర్గారావు అనే ట్రాక్టర్ యజమాని ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల వారు దుర్గారావును నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఎస్ఐ ఎస్కే జబీర్, సీఐ వి.కృష్ణబాబులు బైపాస్ రోడ్డుకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. వారికి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని చెబితే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు ఓట్లేసి ఇప్పుడు నట్టేట మునిగామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇసుకను ఫ్రీగా ఇస్తామని చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం వచ్చాక ఆ హామీని విస్మరించారని, ఉపాధి లేక తమ పరిస్థితి దయనీయంగా మారిందని ట్రాక్టర్ డ్రైవర్ వెంకటే‹Ù, ట్రాక్టర్ యజమాని దుర్గారావు చెప్పారు. నమ్మి ఓట్లు వేశాం ఇసుక ఉచితంగా ఇస్తే గ్రామాల్లో ఉపాధి పెరుగుతుందని నమ్మి కూటమి పార్టీలకు ఓట్లేశాం. పవన్‌కళ్యాణ్, చంద్రబాబు చెబుతున్న మాటలకు, ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ట్రాక్టర్లు కొనుకున్న ఉపాధి పొందుతున్న యువతను సైతం నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలున్నాయి. ఇకనైనా మేలుకోకుంటే కూటమి ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. –కుక్కల సత్యనారాయణ, వేగవరం, జనసేన ఎంపీటీసీ -
నల్లబజారులో యథేచ్ఛగా
సాక్షి, అమరావతి: ఇసుకను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని, నిజంగా అవసరమైన వారికి దొరకడం లేదని, ధర బాగా ఎక్కువగా ఉందని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకున్నవారు తిరిగి అధిక ధరకు విక్రయిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని తెలిపారు. రోజు, వారం కోటాల లెక్కన ఇసుక బుకింగ్ జరుగుతుండటంతో అత్యవసరంగా కావాల్సినవారికి బుకింగ్ అవకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. పరిమిత బుకింగ్‌తో ఇసుక అవసరమైన వారికి లభ్యత ఉండటం లేదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై అధికారులు ప్రభుత్వానికి రెండురోజుల కిందట నివేదిక సమర్పించారు. ఇసుక తీసుకున్నవారు తిరిగి విక్రయించడం, బ్లాక్ మార్కెట్‌తో ధర చాలా ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఇసుక వినియోగదారులు సొంత వాహనాల్లో తీసుకెళ్లి తిరిగి అత్యధిక ధరకు విక్రయిస్తుండటంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా చార్జీలతో పాటు బ్లాక్ మార్కెటింగ్, తిరిగి ఇసుకను విక్రయిస్తుండటంతో వినియోగదారులు గతంలో కన్నా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. పేరుకు ఉచిత ఇసుక విధానమేగానీ వినియోగదారులు మాత్రం అత్యధిక ధర చెల్లించాల్సి వస్తోందని, ఇది వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని వివరించారు. లోడింగ్, రవాణా చార్జీలనే వసూలు చేస్తున్నామని చెబుతున్నా గతంలో కన్నా ఇసుక ధర ఎక్కువగా ఉందని వినియోగదారులు చెబుతున్నారని తెలిపారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్లు లేని ఏడు జిల్లాల్లో రవాణా చార్జీలతో ఇసుక ధర తడిసిమోపెడవుతోందని, ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి దారితీస్తోందని వివరించారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్లు లేని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి జిల్లాలవారు ఇసుక కోసం పొరుగు జిల్లాలపై అధారపడాల్సి రావడంతో రవాణా చార్జీలు భరించలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఈ జిల్లాల్లో వచ్చే మార్చి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ఏడు జిల్లాల్లో ఇసుక సరఫరా, స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అధికారబలంతో ఇష్టారాజ్యం అధికారుల నివేదికనుబట్టి చూస్తే కూటమి నేతలు అధికార బలంతో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి పాల్పడి, బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఇసుక రీచ్‌ల నుంచి తీసుకువెళ్లి మళ్లీ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పేరుకు ఉచిత ఇసుక విధానం అని చెప్పి అధికార పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా రీచ్‌ల నిర్వహణ, విక్రయాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఉచిత ఇసుక పేరుతో వినియోగదారుల జేబులకు భారీగా కన్నం వేస్తూ తమ జేబులు నింపుకొంటున్నట్లు అధికారుల నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా ఇసుక బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారంటే.. ప్రభుత్వ పెద్దల అండతోనే జరుగుతున్నట్లు ఎవరికైనా అర్థం అవుతుంది. -
ఈ దొంగల రాజ్యంలో బ్రతకలేం.. ఇసుక దోపిడీపై డ్రైవర్ల ఆగ్రహం
-
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు మోడస్ ఆపరండీకూడా అలాగే ఉందంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? ‘‘గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అందుకే ఆయన్నే అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అసలు ఇసుక కొందామంటేనే మా ప్రభుత్వంలోకన్నా రేటు రెండింతలు ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నలు గుప్పించారు.ఇది నిజం కాదా?‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయింది? ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజం కాదా?’’ అని ఎక్స్ వేదికగా నిలదీశారు.ఇదీ చదవండి: ఉచిత ఇసుకకు ‘టెండర్’!మోడస్ ఆపరండీకి సృష్టికర్త మీరే కదా చంద్రబాబూ..‘‘2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవం కాదా? ఈ మోడస్ ఆపరండీకి సృష్టికర్త, మూలపురుషుడు మీరే కదా చంద్రబాబూ.. ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు, 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. పేరుకు ఉచితం అంటున్నారంతే.. ..ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్ టు సేమ్. అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంతే.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా వల్ల, ముఠాకొరకు, ముఠా చేతులమీదుగా నడుస్తోంది. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజం కాదా చంద్రబాబు? దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదా? ఎవ్వరినీ టెండర్లలో పాల్గొనకుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా?’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానం‘‘అదే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది. దోపిడీలకు అడ్డుకట్టవేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించింది. రీచ్‌ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరాచేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుకరేట్లను ప్రకటించింది. 1.పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో @ncbn గారి మోడస్ ఆపరండీకూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 13, 2024ప్రజలకూ ఉచితంగా అందడంలేదన్నది నిజం కాదా? ..వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చింది. ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసింది. మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావడంలేదన్నది వాస్తవం కాదా? ప్రజలకూ ఉచితంగా అందడంలేదన్నది నిజం కాదా? ఇసుక ఉచితమే అయితే వైఎస్సార్సీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఇదీ చదవండి: సిండికేట్ కైవశం! -
రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం .. పామర్రులో టీడీపీ నేతల కుమ్ములాటలు
-
ఉచిత ఇసుకకు ‘టెండర్’!
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు..’ అని చిన్నప్పుడు చదువుకున్న పద్యంలో ప్రభుత్వ పెద్దలు ఈ వాక్యాన్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇసుకను అడ్డు పెట్టుకుని ఎన్ని విధాలా డబ్బులు పిండుకోవచ్చో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. గత ప్రభుత్వం ముందు చూపుతో సమకూర్చిన 80 లక్షల టన్నుల ఇసుకను అడ్డగోలుగా దోచేసి జేబులు నింపుకున్నది చాలదన్నట్లు.. తాజాగా దొడ్డి దారిలో అంతకు మించి దోపిడీకి భారీ స్కెచ్ వేశారు. రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు పిలిచి వారికి కావాల్సిన వాళ్లకు కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి : ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్‌లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.సీఎంవోలో ముఖ్య నేత నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలు పూర్తి ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీ వారికి రీచ్‌లను కట్టబెట్టేశాయి. ఇందుకోసం గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికీ తెలియనీయకుండా అత్యంత రహస్యంగా జిల్లాల్లో టెండర్ల ప్రక్రియను నిర్వహించాయి. లక్షల రూపాయల విలువ ఉండే చిన్న టెండర్లకే వారం రోజుల వ్యవధి ఇవ్వాల్సివుండగా, రూ.వందల కోట్ల విలువైన ఇసుక టెండర్లను ఎటువంటి ప్రచారం లేకుండా, ఎవరికీ సమాచారం కూడా ఇవ్వకుండా రెండు రోజుల్లోనే గోప్యంగా తన వాళ్లకు కట్టబెట్టడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవడం, ఖరారు చేసేయడం భారతదేశ టెండర్ల చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదని నిపుణులు సైతం విస్తుపోతున్నారు. అసలు ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలుస్తున్న విషయమే ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేశారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇసుకను ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం దానికి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏమిటి? అది కూడా షార్ట్ టెండర్లు ఎందుకు పిలవాల్సివచ్చింది? ఎవరికీ తెలియకుండా ఆగమేఘాల మీద వాటిని ఎందుకు ఖరారు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అడ్డగోలుగా తవ్వేయొచ్చనే అతి తక్కువ ధరకు.. టన్ను ఇసుక ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120 వరకు వివిధ జిల్లాల్లో బేస్ ధరగా నిర్ణయించారు. చాలా జిల్లాల్లో టన్ను ఇసుకను రూ.50 నుంచి రూ.60కే తవ్వుతామని బిడ్లు దాఖలవ్వడం గమనార్హం. అధికారం ఉండడంతో ఎలాగైనా టెండర్ దక్కించుకుని, ఆ తర్వాత అడ్డగోలుగా తవ్వేయొచ్చనే ఉద్దేశంతో అతి తక్కువకు కోట్ చేసి రీచ్‌లు దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా ఉన్న జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రభుత్వం చెప్పిన వారికి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాయి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ప్రశ్నించినా వారిని దబాయించి, బెదిరించి పంపించేశారు. రెండు, మూడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఇసుక టెండర్లు ఖరారైపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి అక్కడ తవ్వకాలు ప్రారంభించనున్నారు. తూ.గోలో అడ్డగోలుగా టెండర్ల ప్రక్రియ తూర్పుగోదావరి జిల్లాలోని 17 రీచ్‌లకు 7వ తేదీన టెండరు పిలిచి 9వ తేదీ సాయంత్రం లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశించారు. 48 గంటల్లోనే అప్పటికే సిద్ధంగా ఉన్న టీడీపీ వారి నుంచి బిడ్లు స్వీకరించి 9వ తేదీ రాత్రికల్లా ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో విషయం తెలుసుకుని కొందరు టెండర్లు వేయడానికి వస్తే వారిని బెదిరించి కలెక్టరేట్ లోపలికి సైతం వెళ్లనీయలేదు. మరికొందరు ఎలాగోలా టెండరు దాఖలు చేసినా, బిడ్లు ఓపెన్ చేసే సమయంలో వారిని కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఉండనీయకుండా పంపేశారు. వారంతా గురువారం రాత్రి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసుల సాయంతో వారిని బయటకు పంపి, టెండర్లు ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్వయంగా తన కంపెనీ పేరుతో సీతానగరం మండలంలోని ఒక రీచ్‌కు టెండర్ వేసి దక్కించుకున్నట్లు తెలిసింది. కర్నూలులో నోటిఫికేషన్ ఇవ్వకుండానేకర్నూలు జిల్లాలో ఇసుక టెండర్ల నోటిఫికేషన్ ఇవ్వకుండానే టెండర్‌ను ఖరారు చేశారు. కేవలం మైనింగ్ శాఖ వెబ్సైట్లో మాత్రమే ప్రకటన ఇచ్చారు. టెండర్ గురించి ఎవరికీ తెలియకుండా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బంగారయ్య అనే వ్యక్తితో మాత్రమే టెండర్ దాఖలు చేయించారు. ఎవరినీ రానీయకుండా ఒకే టెండర్ వచ్చేలా చేయడంతో అతనికే రీచ్ తవ్వకాల కాంట్రాక్టు ఖరారైంది. ఒకే టెండర్ దాఖలైతే టెండర్ రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనకు నీళ్లొదిలారు. పల్నాడు జిల్లాలో 8వ తేదీన టెండర్ పిలిచి 10వ తేదీన ఖరారు చేశారు. బాపట్ల జిల్లాలో 7న పిలిచి 8న టెండర్లు ఫైనల్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి టెండర్ వేసేందుకు వెళ్లగా వెనక్కి పంపించారు. మీ వాహనాలకు జీపీఎస్ సిస్టం (డివైస్) బాగా లేదని, టెండర్ వేసేందుకు వీలు లేదని నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు. పాలసీ లేకుండానే తవ్వకాలకు రెడీ మూడు నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక విధానాన్ని రద్దు చేసింది. త్వరలో పూర్తి స్థాయి ఇసుక విధానాన్ని ప్రకటించి రీచ్‌ల్లో తవ్వకాలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈలోపు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను ఉచితంగా ప్రజలకు సరఫరా చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వం వర్షాకాలం కోసం స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు సగానికి సగం వారం రోజుల్లోనే మాయం చేశారు. మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను ఎక్కడికక్కడ భారీ రేట్లకు ప్రభుత్వం విక్రయించడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఉచిత ఇసుక పేరుతో జనాన్ని నిండా ముంచిందే కాక, ఇప్పుడు అడ్డగోలు తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరో భారీ దోపిడీకి తెరలేపింది. 2, 3 రోజులే సమయం.. అంతా రహస్యంసరికొత్త దోపిడీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మాన్యువల్ ఇసుక రీచ్‌ల్లో (యంత్రాలు ఉపయోగించకుండా) తవ్వకాలకు ఉన్నట్టుండి ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఎటువంటి ఇసుక విధానం లేకుండా, మార్గదర్శకాలు చెప్పకుండా అన్ని జిల్లాల్లో ఈ రీచ్‌ల్లో తవ్వకాలకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీల ద్వారా షార్ట్ టెండర్లు పిలిచింది. ఇసుక తవ్వకాల గురించి ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, టెండర్లలో తమ వారు తప్ప బయట వారు పాల్గొనే అవకాశం లేకుండా చేసేందుకే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టింది. షార్ట్ టెండర్‌కు కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. కానీ దాదాపు అన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. ఆ జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వారు మాత్రమే టెండర్లు వేయడానికి ముందుగానే సిద్ధం చేశారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి వారితో దగ్గరుండి దాఖలు చేయించి, వారికే ఖరారు చేయించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద నిర్ణయాన్ని పాలసీ ప్రకటించకుండా ఎలా చేశారనే దానికి అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. -
ఉచిత ఇసుక వట్టిదే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సంక్షోభం నెలకొందని, 4 నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటికీ ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతోందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. లాసన్స్‌బే కాలనీలోని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్మాణ రంగం కుదేలు కాగా, దానిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా, వాస్తవానికి గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితం అని ప్రకటిస్తున్న నేపథ్యంలో సీనరేజ్ చార్జీలు రూ.3,500 తగ్గించి, 10 టన్నుల ఇసుకను రూ.10 వేలకే సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ భాగస్వాములు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసుపై సీఎం, డీజీపీ, సీబీఐకి లేఖ రాస్తామన్నారు. -
ఇసుక దొరక్క.. ఉపాధి లేక.. కార్మికుల ఆకలి కేకలు
గతంలో ఆదివారం కూడా పని ఉండేది. ఇప్పుడు వారంలో రెండు రోజులు కూడా పని దొరకడం లేదు. రోజూ సెంటర్‌కు వెళ్లి ఎవరైనా కూలికి పిలుస్తారేమోనని ఎదురుచూస్తున్నాం. పిల్లల చదువు కోసం వేరే ఊరి నుంచి విజయవాడకు వచ్చాం. రోజు పనికి వెళితేగానీ పూట గడవదు. పనులు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – శ్రీనివాస్, సెంట్రింగ్ కార్మికుడు, విజయవాడ‘మేం అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తా... పేదలకు పంచుతా... ఇందుకోసం పెద్దగా చేయాల్సింది కూడా ఏమీలేదు.. ఉచిత ఇసుక ఇస్తే చాలు... రోజూ పెద్ద ఎత్తున పనులు జరుగుతాయి. ప్రజల ఆదాయం పెరుగుతుంది...’ అంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చెప్పిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. ఉచిత ఇసుకను ప్రచారానికే పరిమితం చేశారు. రాష్ట్రంలో ఇసుకను ‘తమ్ముళ్ల’కు ఆదాయ వనరుగా మార్చేశారు.భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి ఉరి వేశారు. ఒకవైపు ఇసుకను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించుకుని ‘తమ్ముళ్లు’ తమ సంపదను పెంచుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పనుల్లేక పస్తులు ఉంటున్నారు. అదేవిధంగా గతంలో ఇసుకపై ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఇప్పుడు అలా రాకపోగా ధర మూడు రెట్లు పెరిగింది. ఆ రేటుకు కూడా బ్లాక్‌లో దొరకని పరిస్థితి నెలకొంది. సాక్షి, అమరావతి: విజయవాడ బెంజ్ సర్కిల్ భవన నిర్మాణ కార్మికులకు అడ్డా. ఉదయం ఆరు గంటలకే తలకు కండువా చుట్టుకుని, క్యారేజీ పట్టుకుని వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇక్కడికి చేరుకుంటారు. మేస్త్రీలు, కాంట్రాక్టర్లు వచ్చి కూలీలను పనికి తీసుకువెళతారు. ఉదయం తొమ్మిది గంటల్లోపే ఆ ప్రాంతం ఖాళీ అవుతుంది. కానీ.. రెండున్నర నెలలుగా అక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పని కోసం కూలీలు పడిగాపులు పడుతున్నారు.అటుగా బైక్, కారుపై వెళ్లేవారు ఒక్క క్షణం ఆగితే... వారి వద్దకు పరుగున వెళ్లి ‘సార్... ఏదైనా పని ఉంటే చెప్పండి... ఎంతో కొంత ఇద్దురుగానీ..’ అని వేడుకుంటున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరికి ఎవరూ పనికి పిలవకపోవడంతో ఉపాధి లేక ఉసూరుమంటూ ఇంటి ముఖం పడుతున్నారు. విజయవాడలోని రామవరప్పాడు వంతెన, చిట్టినగర్ సెంటర్... గుంటూరులో గాంధీ పార్క్, లాడ్జి సెంటర్... విశాఖపట్నంలోని ఇసుకతోట, పూర్ణా మార్కెట్ జంక్షన్, ఎన్ఏడీ జంక్షన్.. నెల్లూరులోని కొండాయిపాలెంగేటు... అనంతపురంలోని రామ్‌నగర్ రైల్వేగేటు సెంటర్... ఇలా రాష్ట్రవ్యాప్తంగా కూలీలు పని కోసం పలు అడ్డాల్లో ఎదురు చూస్తూ అల్లాడిపోతున్నారు. ఎవరిని కదిలించినా రెండున్నర నెలలుగా ఇసుక లేక భవన నిర్మాణాలు నిలిపివేశారు... మాకు పని దొరకడంలేదు.. అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు చౌడాడ వెంకటరమణ. సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా పాలకొండ. తమ ఊరిలో ఉపాధి లేక భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పదేళ్ల కిందట విశాఖపట్నం వచ్చేశాడు. గాజువాక పరిధిలోని దయాల్‌నగర్‌లో అద్దెకు ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పనికి వెళుతూ వచ్చిన డబ్బులతో పిల్లలను చదివిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర నెలలుగా ఇసుక దొరక్క భవన నిర్మాణాలు నిలిచిపోయాయని, పని దొరకడం లేదని వెంకటరమణ తెలిపారు. రోజూ ఉదయం మేస్త్రీల వద్దకు వెళ్లి రెండు గంటలు కూర్చుంటున్నానని, ఎక్కడా పని లేదని చెబుతుండటంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నానని, ఆరి్థకంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పనులు లేక తాను, తన భార్య ఒకపూట పస్తు ఉండాల్సి వస్తోందని, తమ భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదని వెంకటరమణ ఆందోళన వ్యక్తంచేశారు. ‘తమ్ముళ్ల’కు కాసులు.. కార్మికులకు కష్టాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా ముందుచూపుతో 80 లక్షల టన్నులు నిల్వ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే 40 లక్షల టన్నుల ఇసుకను ఆయా పార్టీల నేతలు ఊడ్చేశారు. మిగిలిన 40 లక్షల టన్నులను ఉచితం పేరుతో అధిక ధరలకు విక్రయించారు. దాదాపు రెండున్నర నెలలుగా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీంతో బ్లాక్‌లో 18 టన్నుల ఇసుక లారీ రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు పలుకుతోంది. అంత ధర చెల్లించి ఇసుక కొనుగోలు చేయలేక భవన యజమానులు, కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు.ఒక ట్రాక్టర్ ఇసుక దొరికినా పూర్తయ్యే పనులు కూడా ఆగిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న తాపీ మేస్త్రీలు, కూలీలతోపాటు అనుబంధంగా ఇటుకల తయారీ, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, కార్పెంటర్, పెయింటింగ్, సీలింగ్, టైల్స్, మార్బుల్స్, గ్రానైట్ తదితర 36 రకాల విభాగాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికులకు పని లేకుండాపోయింది. భవన నిర్మాణ, అనుబంధ రంగాలపై ఆధారపడి మన రాష్ట్రానికి చెందిన సుమారు 31 లక్షల మంది జీవనం సాగిస్తుండగా.. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి మరో 14 లక్షల మంది ఈ పనుల కోసం వలస వచ్చారు. మొత్తం 45 లక్షల మంది కూటమి ప్రభుత్వ తీరుతో జీవనోపాధి కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జీవనాధారం కరువు నేను రోజూ తాపీ పనులకు వెళితేనే మా ఇల్లు గడుస్తుంది. రోజువారి కూలీతో భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభ్యత బాగుండటంతో వారం రోజులు పని ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అంటున్నారు. కానీ కైకలూరు నియోజకవర్గానికి రాజమండ్రి, విజయవాడ, భద్రాచలం వంటి ప్రాంతాల నుంచి ఇసుక రావాలి. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఇసుక రావడం లేదు. దీనివల్ల మాలాంటి కార్మికులకు జీవనాధారం కరువైంది. – కోమటి శ్యామ్‌ప్రసాద్, పెరికెగూడెం, ఏలూరు జిల్లా ఇళ్లలో పనికి పోతున్నా గతంలో రోజూ భవన నిర్మాణ పనులకు వెళ్లేదానిని. రెండు నెలలుగా ఇసుక లేక భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇక పిల్లల కోసమైనా కష్టపడి ఏదో ఒక పని చేయాలి కదా... చివరికి ఏ పనీ దొరక్క ఇళ్లలో పాచిపని చేయడానికి వెళుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పరిస్థితి ఏ రోజూ లేదు. – సరోజని, నెల్లూరు కొరత తీవ్రంగా ఉంది ఉచిత ఇసుక పాలసీ సక్రమంగా అమలు కావడంలేదు. దీనివల్ల ఇసుక కొరత తీవ్రంగా ఉంది. భవన నిర్మాణాలు ఆగిపోతున్నాయి. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం సక్రమంగా అమలు చేసి భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలి. – మామిడి రాము, క్రెడాయ్ గుంటూరు చాప్టర్ అధ్యక్షుడు -
చంద్రబాబు.. ఉచిత ఇసుక ఎక్కడ?: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి : కూటమి ప్రభుత్వ నిర్వాహాకాలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా, ఇసుక మాఫియాపై చంద్రబాబును నిలదీశారు విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వంలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికుల జీవన ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇసుక టన్ను ధర రూ.475కే అందితే.. కూటమి హయాంలో టన్ను ఇసుక ధర రూ.3వేలు పలుకుతుందన్నారు. ఇక చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక పథకం నీటిమీద రాతల్లా తయారైందని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.With TDP, the devil always lies in the detail. On one hand, Chandrababu @ncbn promises free Sand on the other hand TDP is causing sand scarcity in the state affecting the livelihood of lakhs of construction workers. The cost of sand has spiked to ₹3,000/tonne now instead of the…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 7, 2024 -
అసలే కరువు.. ఆపై చేతివాటం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో నాలుగున్నర టన్నులు పట్టే ట్రాక్టర్ ఇసుక రూ.9 వేలు, రూ.10 వేల చొప్పున అమ్ముతున్నారు. అంత ధర పెట్టి కొనుగోలు చేద్దామంటే కూడా నూటికి పది మందికి కూడా దొరకడంలేదు. దీంతో చాలా మంది పనులు ఆపుకున్నారు. చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూముల నుంచే కాక వరద కాలువ గట్లలోని ఇసుకను కూడా టీడీపీ నేత ఒకరు అక్రమంగా తరలించి అమ్ము కుంటున్నాడు. రేపల్లె నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. వేమూరు నియోజకవర్గంలోని జువ్వలపాలెం, ఓలేరు, పెసర్లంక, గాజుల్లంక గ్రామాల పరిధిలో కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని కృష్ణా నది నుంచి 300 ఎద్దుల బండ్లలో ఇసుకను తరలిస్తున్నారు. వెల్లటూరు, కొల్లూరు, పెదపులివర్రు గ్రామాల సమీపంలోని కరకట్టకు వెలుపల గుట్టగా పోసి ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. బాపట్లలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పని దొరక్క తిరిగొచ్చేస్తున్నాంనేను తెనాలి, గుంటూరులో పనులకు వెళతాను. కొంత కాలంగా ఇసుక అందుబాటులో లేక పోవడంతో సక్రమంగా పనులు జరగడం లేదు. పనికి వెళ్లిన తర్వాత ఇసుక లోడు రాకపోవడంతో పని నిలిపి వేశామని నిర్మాణ దారులు చెబుతున్నారు. రోజూ పనికి వెళ్లే వారిలో పది శాతం మందికి కూడా పనులు దొరకడం లేదు. అంత దూరం వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తున్నాము. – డి.రవీంద్రనాథ్, రాడ్ బెండింగ్ మేస్త్రీ, వరహాపురం, వేమూరు మండలంఉపాధి కరువైందిమా ప్రాంతంతో పాటు తెనాలికి పనుల కోసం వెళతాము. కొంత కాలంగా ఇసుక కొరత వల్ల పనులు అందరికీ దొరకడం లేదు. పని కోసం వెళితే ఇసుక దొరకడం లేదని కట్టుబడి దారులు చెబుతున్నారు. బయట కూడా పనులు లేవు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.– కట్ట మరియదాసు, బేల్దార్ మేస్త్రీ, బలిజేపల్లి, వేమూరు మండలంప్రత్యేక సాయం ప్రకటించాలికూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నాం. ఉచిత ఇసుక విధానం అంటూ అసలు ఇసుకే లేకుండా చేశారు. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నెలలో పది రోజులు కూడా పనులు దొరకని పరిస్థితి. దీంతో పస్తులు ఉండాల్సి వస్తోంది. భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రభుత్వం వెంటనే ఉపాధి చూపాలి. లేదంటే ప్రత్యేక సాయం ప్రకటించాలి. – జొన్నలగడ్డ ధర్మరాజు, భవన నిర్మాణ కార్మికుడు, పేటేరుపెనమలూరులో పెద్ద ఎత్తున లూటీకృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని యనమలకుదురులో అక్రమ ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతోంది. టీడీపీ నేతలు ఏకంగా 40 ట్రాక్టర్లును అక్రమంగా నదిలోకి దించి, పొక్లయినర్‌తో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 300 ట్రిప్పులకు పైగానే తరలిస్తున్నారు. ట్రాక్టర్ రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. విజయవాడ నగర శివారులో ఇంతలా ఇసుక మాఫియా నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ కొరడా ఝుళిపించారు. ఒకేసారి మల్టీజోన్–2లోని తొమ్మిది జిల్లాల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వేటు పడిన వారిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టు నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నట్టు ఐజీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేటు పడింది వీరిపైనే..సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్సైలు ఉన్నారు. త్వరలో వీరిని లూప్లైన్కు బదిలీ చేస్తామని ఐజీ తెలిపారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణల ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్‌పేట, తాండూర్, చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేసినట్టు పేర్కొన్నారు.వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్పై వేటుజోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓబా లికపై జరిగిన రేప్ కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవక లకు పాల్పడినందుకు సీఐ నాగరాజును సస్పెండ్ చేసినట్టు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. నాగరాజు ప్రస్తుతం వికారాబాద్ టౌన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాడు.రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాలో స్థానిక నిందితులతోపాటు అంతర్రాష్ట్రంగా అక్రమ రవాణా చేసే ప్రధాన నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఐజీ ఆదేశించారు. -
ఇసుక బంద్.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : ఇసుక ఉచితం.. ఇసుక ఉచితం అంటూ ఊరూవాడా ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు సర్కారు చేతకానితనంతో ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చి0ది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఏ జిల్లాలోనూ ఇసుక దొరకడంలేదు. అన్ని జిల్లాల్లోనూ స్టాక్ యార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సర్కారు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలం తర్వాతే ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతాయని.. అప్పటివరకు ఇసుక ఉండదని అధికారులు తేల్చిచెబుతున్నారు. మరోవైపు.. ఉచిత ఇసుక అంటూ తెగ హంగామా చేసిన చంద్రబాబు అసలు ఇసుకే దొరక్కుండా చేశారని జనం.. తమకు ఉపాధి లేకుండా చేశారని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు మండిపడుతున్నారు. వాస్తవానికి.. స్టాక్ యార్డుల్లో గత ప్రభుత్వం నిల్వచేసిన 80 లక్షల టన్నుల ఇసుకకుగాను టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చీ రాగానే 40 లక్షల టన్నులను ఊడ్చేసి సొమ్ము చేసుకోవడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ ఖజానాకు ఒక్క పైసా రాకుండా మొత్తం దోచేశారు. అక్కడక్కడా కొద్దిగా మిగిలిన ఇసుక బ్లాక్ మార్కెట్‌కి తరలిపోవడంతో ఆ రేటు ఇప్పుడు షాక్ కొడుతోంది. ఎంతలా అంటే.. 18 టన్నుల లారీ ఇసుక రూ.30 నుంచి రూ.60 వేలు పలుకుతోంది. దీంతో నిర్మాణ రంగం రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా స్తంభించిపోయింది. లేని ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్.. ఇక మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు గెలవగానే వారంతా ముందుగా ఇసుక స్టాక్ యార్డులపై పడ్డారు. వీరు ఆ ఇసుకను మొత్తం ఊడ్చేశాక ప్రభుత్వం సెపె్టంబరు 13 నుంచి ఆన్లైన్ ఇసుక బుకింగ్‌ను ప్రారంభించింది. మొదట్లో ఉ.10 నుంచి సా.5 గంటల వరకు స్లాట్లు ఓపెన్ అవుతాయని చెప్పారు. ఫోన్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుకింగ్ అవకాశం ఉంటుందన్నారు. తీరా ఆచరణలోకి వచ్చాక వాటిలో ఒక్కటంటే ఒక్కటీ అమలుకాలేదు. స్టాక్ యార్డుల్లో ఇసుక ఖాళీ అయిపోవడంతో ఆన్లైన్ బుకింగ్ ఉపయోగం లేకుండాపోయింది. దీంతో ప్రజలకు ఇసుక కష్టాలు రెట్టింపయ్యాయి. ఇక కొద్దిరోజులుగా అయితే అసలు ఇసుక బుకింగ్ పోర్టల్ తెరుచుకోవడమేలేదు. అంతకుముందు కూడా అప్పుడప్పుడు రాత్రి 12 గంటల సమయంలో ఓపెన్ అయ్యేదని.. 10 నిమిషాల్లోనే స్లాట్లన్నీ అయిపోయేవని, ఎంత ప్రయతి్నంచినా తాము ఇసుకను బుక్ చేసుకోలేకపోయామని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కూటమి నేతల అక్రమ తవ్వకాలు.. మ్యాన్యువల్‌గా ఇసుక బుకింగ్‌లు లేకపోవడంతో ఎవరిని అడగాలో తెలీక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్వల్ల లారీ ఓనర్లు సిండికేట్ అయిపోయి బల్క్ బుకింగ్‌లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నందిగామలో ఒక వ్యక్తి మూడు టిప్పర్ల ఇసుక కోసం ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ శతవిధాలుగా ప్రయత్నించినా ఇసుక దొరకలేదు. సామాన్య జనం ఇలా ఇసుక దొరక్క అల్లాడుతుంటే ఆయా జిల్లాల్లో కూటమి పార్టీలకు చెందిన కొందరు అక్రమార్కులు మాత్రం నదులు, పొలాల్లో అక్రమంగా ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేసుకుంటున్నారు. వీరి అక్రమాలను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇసుక మాఫియా వారిపై దాడులకూ తెగబడుతోంది. ఈ వార్తలు రాసే విలేకరులను సైతం భయకంపితుల్ని చేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తాం.. నువ్వు అడ్డుకోగలవా.. దమ్ముంటే రా అని సవాల్ చేస్తున్నారు.భవన నిర్మాణ కార్మికులు కుదేలు..మరోవైపు.. కూటమి ప్రభుత్వం అధికారికంగా స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయకుండా తమ పార్టీ నాయకులకు లబి్ధచేకూరేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో పెద్దపెద్ద బిల్డర్లు తప్ప సాధారణ ప్రజానీకం ఎవరూ ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితిలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ రంగం స్తంభించిపోయింది. ఫలితంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు.. ఇసుక ఎగుమతి, దిగుమతి కూలీలు పస్తులుండాల్సిన దుస్థితి. వీరితోపాటు.. ఈ రంగంపై ఆధారపడ్డ టైల్స్ కార్మికులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర కార్మికులకు సైతం పనులు తగ్గిపోయాయి. ఉత్తరాంధ్రలో 18 టన్నుల లారీ రూ.40 వేల పైనే..సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఇసుక ధర పేలుతోంది. 18 టన్నుల ఇసుక లారీ ధర రూ.40 వేలకు పైమాటే పలుకుతోంది. రాత్రి సమయాల్లో అక్కడక్కడ అనధికారికంగా తవ్వకాలు చేపడుతున్న కూటమి నేతలు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకుంటున్నారు. టన్ను ఇసుక రూ.2,200 నుంచి రూ.2,300 చొప్పున విక్రయిస్తున్నారు. వాస్తవానికి.. ఎన్నికలకు ముందు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా నాలుగు లక్షల టన్నుల ఇసుకను స్టాకు పాయింట్ల వద్ద నిల్వ ఉంచింది. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి నేతలు రాత్రికి రాత్రి ఈ ఇసుక మొత్తాన్ని స్వాహా చేసేశారు. మిగిలిన కొద్దిపాటి ఇసుకను అధిక ధరకు అమ్ముతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని కొన్నిచోట్ల చీకటిపడితే ఇసుక లారీల జాతర నడుస్తోంది.అధికారంలోకి రాగానే 40 లక్షల టన్నుల ఇసుక హాంఫట్..నిజానికి.. వర్షాకాలంలో ఇసుక కొరత వస్తుందనే ఉద్దేశంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 70కి పైగా స్టాక్‌యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేసింది. కానీ, జూన్‌లో అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు ఆ నిల్వలను అడ్డగోలుగా అమ్మేసుకున్నారు. రోజుల వ్యవధిలోనే 40 లక్షల టన్నులకు పైగా ఇసుకను దోచేశారు. ఆ తర్వాత చంద్రబాబు తీరిగ్గా ఉచిత ఇసుక విధానమని ప్రకటించినా ఎక్కడా ఉచితంగా ఇచ్చిన పాపానపోలేదు. ప్రతిచోటా వినియోగదారులు రెట్టింపు రేట్లకు ఇసుకను కొనుక్కోక తప్పలేదు. 18 టన్నుల ఇసుక లారీ రూ.30 వేల నుంచి రూ.60 వేలకు చేరుకోవడంతో జనం నానా ఇబ్బందులు పడ్డారు. గోదావరి పరీవాహక ప్రాంతం రావులపాలెంలో అయితే ఐదు యూనిట్ల ఇసుక రూ.25 వేల వరకు ధర పలికింది. మిగిలిన చోట్ల ఇది రూ.30 వేల వరకు ధర పలుకుతోంది. గతంలో ఎనీ్టఆర్ జిల్లా పరిధిలో లారీ ఇసుక ధర రూ.13 వేలు ఉండేదని.. ఇప్పుడు రూ.36 వేలకు చేరిందంటున్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు అధిక రేట్లతో ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రభుత్వానికి చిల్లిగవ్వ ఆదాయం కూడా రాలేదు. ఇక టీడీపీ నేతలు దోపిడీ చేయగా అక్కడక్కడా కొన్ని స్టాక్ యార్డుల్లో మిగిలిన కొద్దిపాటి ఇసుకను వారు రెట్టింపు రేట్లకు అమ్ముకున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఏ స్టాక్ యార్డులోనూ ఇసుక లేకపోవడంతో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉంది. వర్షాకాలం తర్వాతే ఇసుక అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతుండడంతో నిర్మాణ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇసుక కోసం నానా ఇబ్బందులు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ ఒక్క ఇసుక రీచ్ కూడా పూర్తిగా తెరవలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డైరెక్ట్‌గా ఇసుక రీచ్‌లోనే టన్ను రూ.475కి ఇచ్చేవారు. దీనిని మేం కస్టమర్‌కి రూ.1,000 లేదా రూ.1,100కి విక్రయించే వాళ్లం. ఇప్పుడు అష్టకష్టాలు పడితే శ్రీకాకుళం రీచ్‌లో రూ.1,200కి టన్ను ఇసుక దొరుకుతోంది. దానిని విశాఖ తీసుకొచ్చి రూ.2,200 నుంచి రూ.2,300 చొప్పున విక్రయిస్తున్నాం. ప్రస్తుతం వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లారీ యజమానులూ రోడ్డున పడ్డారు. – కర్రి వెంకటరమణ, లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి, మధురవాడ (విశాఖ జిల్లా) -
ఇసుక లారీలకు డిపాజిట్టా?
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : లక్షలాది రూపాయలు అప్పులు చేసి, లారీ కొనుక్కొని కిరాయికి తిప్పుకుంటున్న తమను ప్రభుత్వం వేధిస్తోందని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సరఫరాకు తాము ప్రభుత్వానికి ముందస్తుగా ఎందుకు డిపాజిట్ చెల్లించాలని, ఇది ఎవరి నిర్ణయమని నిలదీశారు. పైగా రూ.50 బాండ్ పేపర్‌పై మైనింగ్ శాఖతో అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) చేసుకుని, లారీని కిరాయికి తిప్పుకోవాలా? అని ప్రశ్నించారు. విజయవాడ విద్యాధరపురంలోని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీపై ధ్వజమెత్తుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇసుక రీచ్‌కు లోడు కోసం వెళితే ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. కొన్ని ఊళ్లల్లో స్థానిక కూటమి నాయకులు లోకల్ అంటూ రోజుకు మూడు ట్రిప్పులు తోలుకుంటుంటే తాము అలా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్లమూడి వెంకటేశ్వరరావు (విజయవాడ అర్బన్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్), అన్నే చిట్టిబాబు (ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు) సూరెడ్డి సాంబిరెడ్డి (పైపుల రోడ్ శాండ్ లారీ ఓనర్ల అసోసియేషన్), చుక్కాపు రమేష్, రత్తయ్య, తన్నీరు పాపారావు (డిస్ట్రిక్ట్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు) తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి» కిరాయికి ఇసుక తోలే ట్రాక్టర్‌కు రూ.1500, 6 టైర్ల లారీకి రూ.3 వేలు, 10 టైర్ల లారీకి రూ.6 వేలు, 12–14 టైర్ల లారీకి రూ.10 వేలు డిపాజిట్ చేయాలనడం దుర్మార్గమైన చర్య కాదా?» ఇసుక రవాణా చార్జిల విషయంలో రవాణా శాఖ, కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారులు లారీ యజమానులతో చర్చించకుండా వారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం లారీ ఓనర్లను మోసం చేయడం కాదా?» లారీ కిరాయి ధరపై జీఎస్టీ విధింపు ఎంత వరకు సమంజసం?» బుక్ చేసుకున్న వారికి లోడును చేరవేయడంలో జాప్యం (ట్రాఫిక్ రద్దీ లేదా లారీ రిపేర్) జరిగితే జరిమానా విధిస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయం?» ఇంతకూ ఇసుక కిరాయి ఎవరు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారు.. ఎక్కడ ఇస్తారు? » వేలకు వేలు ట్యాక్స్‌లు, డ్రైవర్ జీతభత్యాలు కట్టుకుంటూ ప్రభుత్వ ఆంక్షలు పాటించే కంటే మా లారీలను సర్కారుకే అప్పగిస్తాం.. అలా చేస్తే నెలకు ఎంత ఇస్తారు?ఇసుక ఫ్రీ అని చెప్పి బ్లాక్‌లో అమ్ముకుంటారా? డాబాగార్డెన్స్: ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి ధరలు మరింత పెంచి బ్లాక్‌లో అమ్ముతూ.. భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొడుతున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కార్మికులను తీవ్రంగా మోసం చేశారని భవన నిర్మాణ కార్మికులు ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకపోతే వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక రోడ్డున పడ్డామంటూ సిటూ ఆధ్వర్యంలో మంగళవారం గొల్లలపాలెం సింగ్ హోటల్ జంక్షన్ వద్ద నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం.సుబ్బారావు, కె.నర్సింగరావు, చంద్రమౌళి, సిమ్మినాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ గాల్లోకి వదిలేసిందన్నారు. ఇసుక లభించకపోవడంతో వేలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇంతగా రోడ్డున పడినా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. -
ఏపీ వ్యాప్తంగా ఖాళీగా దర్శనమిస్తున్న ఇసుక స్టాక్ యార్డులు
-
ఇసుక ఖతం.. దోచేస్తున్న పచ్చ నేతలు
-
సోమిరెడ్డి అవినీతి బట్టబయలు.. రూ.100 కోట్ల దోపిడీకి స్కెచ్!
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి బట్టబయలైంది. రీచ్ టు రిచ్‌కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగానే ప్లాన్ వేశారని స్పష్టమవుతోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.వందల కోట్లు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్న ఆయన మనుషులు సూరాయపాళెం ఇసుక రీచ్‌లో సాగించిన హెచ్చరికలు, దూషణల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక వెలికి తీసేందుకు వచ్చిన గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోర్డ్ వర్కర్స్ అండ్ అదర్ వర్క్స్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాంట్రాక్టర్లను సోమిరెడ్డి మనుషులు బెదిరించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సోమిరెడ్డి తన మనుషులను రీచ్ వద్దకు పంపి డ్రెడ్జింగ్ వినియోగించే పడవలను వెనుక్కు పంపే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు కలెక్టర్‌నే తూలనాడారు. స్థానిక శాసన సభ్యుడిని కాదని మీరు ఏమి చేయలేరని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.చంద్రబాబునాయుడు స్థానిక ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పా రు. మధ్యలో కలెక్టర్ ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ బూతుపురాణం అందుకున్నాడు. కలెక్టర్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పద్ధతి ప్రకారం డ్రెడ్జింగ్ చేసేందుకు వచ్చారు. అయితే సోమిరెడ్డి అనుచరులు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికి తీస్తే ఎలాంటి ఆదాయం ఉండదని, మధ్యలో ఇసుక దిబ్బలను ఎత్తాలని సూచించారు.ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడిఇందు కోసం తాము 300 ట్రిప్పుల గ్రావెల్ తోలి రీచ్‌కు దారులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. ఆయన (సోమిరెడ్డి) ఇంత చేస్తుంటే.. మీరు ఆయనకు తెలియకుండా ఏమైనా చేసినట్లు తెలిస్తే చాలా గొడవలు అవుతాయంటూ కంఠస్వరం పెంచుతూ మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే ఉచిత ఇసుక పాలసీ డొల్లతనం ఇట్టే అర్థం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్లు ఇసుక ద్వారా సొమ్ము చేసుకోవాలని ఎంతగా పరితపిస్తున్నారో తెలుస్తోంది. ఓ పక్కన రైతులు ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమ సంపాదనకు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వెనుక్కు తగ్గడమే లేదు. -
ఇసుక రాకాసులు.. రెండు చేతులా కోట్ల రూపాయల సంపాదన
-
పారని మంత్రి సుభాష్ పాచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ద్రాక్షారామం జగనన్న కాలనీలో ఇసుక చోరీ వ్యవహారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరుల మెడకే చుట్టుకుంది. ఈ వ్యవహారం నుంచి తన అనుచరులను తప్పించేందుకు మంత్రి రెండు రోజులుగా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయన అనుచరులే ఇసుకను చోరీ చేశారని తేటతెల్లమవటంతో చేసేది లేక అధికార యంత్రాంగం కేసు నమోదు చేసింది. మంత్రి ప్రధాన అనుచరుల్లో ఒకరైన టీడీపీ నేత దొంగల శ్రీధర్, మరి కొందరిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని రామచంద్రపురం ఆర్డీవో ఎస్.సుధాసాగర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 26న ద్రాక్షారామ జగనన్న కాలనీ లేఅవుట్–04లో జరిగిన ఇసుక దోపిడీపై ‘జగనన్న కాలనీలో టీడీపీ దొంగలు’ అనే శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. ఈ కథనం అధికారులను, అధికార పార్టీ నేతలను పరుగులు పెట్టించింది. ఈ కేసు నుంచి మంత్రి సుభాష్ అనుచరుడు దొంగల శ్రీధర్‌ను తప్పించే ప్రయత్నాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. అయినా అతనిపైన, ఇతర అనుచరులపైన కేసు నమోదు కాకుండా మంత్రి సుభాష్ తీవ్రంగా ప్రయతి్నంచారు. అధికార బలాన్ని ఉపయోగించారు. మంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇసుక వ్యవహారంలో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇదంతా వైఎస్సార్సీపీ నేతల పనేనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బెడిసికొట్టాయి. ఆయన మీడియా సమావేశం పెట్టిన రెండు గంటలకే అధికారులు దొంగల శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనే ఇసుక చోరీలో నిందితుడని స్పష్టం చేశారు. కాగా, ఈ ఇసుక దోపీడిపై పోలీసులు కేసు నమోదు చేసిన వాసంశెట్టి బాల, కాండ్రేగుల సాయిరాంలను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి సుభాష్ ప్రకటించారు. ప్రధాన అనుచరుడైన దొంగల శ్రీధర్‌పై మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
అమాంతం పెరిగిన ఇసుక రేట్లు.. ఇదేనా చంద్రబాబు నీ పాలన..
-
ఇసుక స్టాక్ యార్డులో.. తుళ్లూరు సీఐ వీరంగం
గుంటూరు టాస్‌్కఫోర్స్: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం ఇసుక స్టాక్ యార్డులో తుళ్లూరు సీఐ ఆగడాలు మితిమీరుతున్నాయని, అకారణంగా, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వీరంగం వేస్తున్నట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నోటితో చెప్పలేని రీతిలో బండ బూతులు తిడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా.. శనివారం సాయంత్రం ఇసుక లోడింగ్ చేసుకుంటుండగా ఆ సీఐ వచ్చి.. రికార్డులు పరిశీలించి లోడింగ్ జరుగుతున్న ట్రాక్టర్ డ్రైవర్‌ను కిందకు దించి ‘నీకిది మూడో ట్రిప్పు.. నువ్వెందుకు వచ్చావురా? నీ ఊరేది, నీ కులం ఏంటి రా..?’ అని గద్దించారు. డ్రైవర్ ఉద్దండరాయునిపాలెం అని బదులివ్వగానే.. మా.. లం..కో..ల్లారా.. అంటూ అతన్ని బిల్లులు రాసే దగ్గరకి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి బూతులు తిడుతూ ఇష్టమొచ్చినట్లు కొట్టి వే బిల్లును లాక్కొని ట్రాక్టర్‌ను వే బ్రిడ్జి దగ్గర కాటా పెట్టించి స్టేషన్‌కు తీసుకురావాలని కానిస్టేబుల్‌కు చెప్పారు. నిజానికి.. లోకల్ ట్రాక్టర్ కావడం, ట్రాక్టర్లు తక్కువ సంఖ్యలో ఉండటంతోపాటు స్థానిక గ్రామాల్లోనే ఇసుకను తోలుతుండటంవల్ల సదరు ట్రాక్టర్ ఆ రోజు క్యూలోనే మూడో ట్రిప్పు కింద వచ్చింది. అయితే, అసలు వే బిల్లులు ఇచ్చిన వారిని వదిలిపెట్టి తనను కావాలనే టార్గెట్ చేసి కులం పేరుతో దూషించి కొట్టాడని బాధితుడు ప్రసన్నకుమార్ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వానికి నిర్ణీత ధర చెల్లించి వే బిల్లులు తీసుకుని ఇసుకను తీసుకెళ్తున్న దళితుడినైన తనపై సీఐ దుర్మార్గంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించాడు. స్టాక్ యార్డులో వేబ్రిడ్జి ఉండాల్సి ఉన్నప్పటికీ అవేమీ నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా కేవలం జేసీబీ బొచ్చ ప్రామాణికంగా లోడింగ్ జరుగుతుంటే వాహనాలపై అధిక లోడు కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరో యువకుడిపైనా మాటల దాడి.. ఇక ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన మణికంఠ అనే మరో ఎస్సీ యువకుడి లారీపై కూడా ఓవర్ లోడింగ్ కేసు నమోదు చేసిన సీఐ అతన్ని కూడా పిలిపించి.. రాయడానికి వీల్లేని భాష మాట్లాడుతూ.. ‘మా.. నా కొ.. నీ మీద తొమ్మిది కేసులున్నాయి.. ఇంకోసారి కనపడితే నీ మీద రౌడీïÙట్ ఓపెన్ చేసి బొక్కలో వేస్తా నువ్వు ఊరు వదిలి పారిపోవాలి’.. అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని బాధితుడు వాపోయాడు. ఇలా ఉద్దండరాయునిపాలెం ఎస్సీ యువకులే టార్గెట్‌గా సీఐ బెదిరింపులు ఎక్కువయ్యాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. పడిగాపులు కాసి ఒక్క ఇసుక ట్రాక్టరు తీసుకెళ్లి అన్లోడ్ చేస్తే యజమాని వద్ద నుంచి మాకు వచ్చేది రూ.300–రూ.400లేనని.. పోలీసులు ఇలా తమను టార్గెట్ చేస్తే బతికేదెలా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్.. ఇసుక తరలింపులో టీడీపీ నేతల వాహనాలను వదిలేసి వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలే టార్గెట్‌గా సీఐ వ్యవహరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అదే టీడీపీకి చెందిన వారి వాహనాలు కూడా ఎక్కువ ట్రిప్పులు వేసినట్లు రికార్డుల్లో ఉన్నా తమనే టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కులం పేరుతో తిట్టి కాళ్లతో తన్నాడు.. బిల్లు రాయించుకుని లోడింగ్ చేసుకునేందుకు వెళ్లిన నన్ను పిలిచి మాదిగ లం..కొ..ల్లారా అంటూ జుట్టు పట్టుకుని (రాయలేని భాషలో తిడుతూ) చెంపల మీద కొట్టి కిందపడేసి బూట్లతో కడుపులో గట్టిగా తన్ని ‘నా కొ.. ఉద్దండరాయునిపాలెం మా.. నా కొ.. ఊళ్లో ఒక్కడినీ ఉండనివ్వను’ అంటూ నానా మాటలన్నాడు. – ప్రసన్నకుమార్, ట్రాక్టర్ డ్రైవర్ రౌడ్‌షీట్ ఓపెన్ చేసి బొక్కలో.. నాపై గతంలో టీడీపీ వాళ్లు పెట్టిన కేసు విషయంలో స్టేషన్‌కు పిలిపించి ఏ కులం అని అడిగి.. ‘మా.. నా కొ.. మీకు ఎక్కడవిరా ఈ లారీలు? నీ మీద 9 కేసులున్నాయి. ఇంకోసారి కనబడితే ‘నా కొ.. నీ మీద రౌడీïÙట్ ఓపెన్ చేస్తానంటూ చెప్పలేని మాటలతో దూషించాడు. – నందిగం మణికంఠ -
పగలు తోడేస్తూ.. రాత్రి తోలేస్తూ..
జగ్గయ్యపేట: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఆపేవారే కనబడకపోవడంతో సరిహద్దులు దాటిపోతోంది. ఉచిత ఇసుక పథకం అక్రమార్కుల జేబులు నింపుతోంది. మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్ నుంచి జూలై 8న ఇసుక విక్రయాలు ప్రారంభించింది. మొత్తం 81వేల టన్నుల ఇసుకను ఈ ప్రాంతంలోని లబ్ధిదారులకు ఇచ్చేందుకు టన్ను రూ.290 చొప్పున ధర నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు విక్రయిస్తోంది. ఇందు కోసం ఇక్కడ రెవెన్యూ, పంచాయతీ, ఎస్ఈబీ అధికారులను నియమించారు. ఇసుక ప్రారంభం నాటి నుంచి నేటి వరకు 16,800 మెట్రిక్ టన్నులు ఇసుక విక్రయించినట్లు అధికారులు చెబున్నారు. అయితే ఇందులో కొన్ని వందల టన్నులు తెలంగాణకు తరలినట్టు సమాచారం.తెలంగాణకు తరలింపు ఇలా..స్టాక్ పాయింట్ వద్ద కొందరు అక్రమార్కులు తెలంగాణకు అక్రమంగా ఇసుకను రవాణా చేసేందుకు ప్రత్యేక వ్యూహాలను రచించారు. ఈ ప్రాంతం తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో ఏ గ్రామం నుంచి చూసినా 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే తెలంగాణ సరిహద్దు గ్రామాలు కనిపిస్తాయి. దీంతో అక్రమార్కులు ఇసుకను సామాన్యులకు అందనీయకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు 10 నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఇసుకను రహస్య ప్రదేశాలకు తరలిస్తారు.అధికార పార్టీ నేత హవా?స్టాక్ పాయింట్ వద్ద గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు తన హవా కొనసాగిస్తున్నారు. తన గ్రామంలో స్టాక్ పాయింట్ ఉండటంతో గ్రామానికి ప్రతి రోజు 30 ట్రాక్టర్ల ఇసుక తను చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేయడంతో అధికారులు కూడా ఆయనకు తలొగ్గి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక ఒక్కో ట్రాక్టర్ నుంచి సదరు నాయకుడికి రూ.200 ఇస్తున్నట్లు కూడా సమాచారం.ఉదాసీనంగా అధికారులు..అక్రమంగా తరలిపోతున్న ఇసుకను నియంత్రించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ముఖ్యంగా స్టాక్ పాయింట్ వద్ద అనుభవం లేని పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులను నియమించడంతో కూపన్లు జారీ చేసి విషయంలో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వే బిల్లుపై 2 నుంచి 3 సార్లు ఇసుకను తీసుకువెళ్తున్నారు. కనీసం వీటి పర్యవేక్షణకు సిబ్బంది లేకపోవడంతో ప్రతి రోజు 20 నుంచి 80 టన్నుల ఇసుక అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఎస్ఈబీ అధికారులు సమాచారం ఇస్తే తప్ప నియంత్రణ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఏపీ ఇసుకకు మంచి డిమాండ్..తెలంగాణలో మునేరు, కృష్ణా ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. ఒక లారీ ఇసుక రూ.30వేలు నుంచి రూ.70వేల వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇసుక కొరత ఉండటంతో ఏపీ ఇసుక కోసం ధర ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.చెక్‌పోస్ట్‌లు ఉన్నా..65వ నంబర్ జాతీయ రహదారి రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన ముక్త్యాల, గండ్రాయి, అన్నవరం గ్రామాల్లో చెక్ పోస్టులు ఉన్నప్పటికీ తూతూ మంత్రంగానే సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ముక్త్యాల చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది ఉన్నప్పటికీ అనుమంచిపల్లి స్టాక్ పాయింట్ నుంచి తెలంగాణ రాష్ట్రం వజినేపల్లికి ఓ ట్రాక్టర్ ఇసుకలోడు సిబ్బంది కనుచూపులోనే వెళ్లింది. సమీపంలోని తెలంగాణ బుగ్గ మాధవరం చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక తరలి వెళ్లడం గమనార్హం. -
ఇసుక పేరుతో పచ్చ మోసం
తిరుపతికి చెందిన శ్రీనివాసరావు ఆటోనగర్ సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది కదా అని గురువారం ట్రాక్టర్ తీసుకుని పాడిపేట వద్ద స్వర్ణముఖి నదికి వెళ్లారు. అక్కడ ఇసుక తీసుకునేందుకు అనుమతి లేదని స్థానికులు చెప్పారు. దీంతో ఇసుక అనుమతి కోసం తిరుపతి, రేణిగుంట తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లారు. వెంకటగిరి లేదా నాగాలాపురం, పిచ్చాటూరు మండలాల్లోని అధికారిక రీచ్‌లకు వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక శుక్రవారం ఉదయం ముందుగా వెంకటగిరి మండలం మోగళ్లగుంటలోని రీచ్‌కు కారులో చేరుకున్నారు. అక్కడ ఇసుక నిల్వ లేకపోవడంతో దొరవారిసత్రం మండలం మావిళ్లపాడులోని ఇసుక రీచ్‌కు వెళితే మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఉసూరుమంటూ నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిగకు చేరుకున్నా అక్కడా ఇసుక లేదు. ఇక మిగిలిన పిచ్చాటూరు మండలం అడవికోయంబేడు రీచ్‌కు వెళితే ఇసుకైతే ఉంది కానీ.. డంప్ యార్డు వద్ద అధికారులెవ్వరూ లేరు. కాపలాగా ఓ కానిస్టేబుల్ ఉన్నారు. ఇసుక కోసం వచ్చిన సుమారు 100 టిప్పర్లు ఉదయం నుంచి వేచి ఉన్నాయి. రాత్రి వరకు ఎదురుచూసి తిరిగి తిరుపతికి వచ్చేశారు. శ్రీనివాసరావు తన కారుకి రూ.2,500 పెట్రోల్ పట్టుకుని రోజంతా సుమారు 350 కిలోమీటర్లు ప్రయాణించి తిప్పలు పడినా చివరకు ఇసుక దొరకలేదు. కుప్పం పట్టణానికి చెందిన మురుగప్ప అసంపూర్తిగా నిలిచిపోయిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు అప్పుచేశాడు. ఈనెల 9వ తేదీన పనులు ప్రారంభించాడు. నిర్మాణ పనుల కోసం ఇసుక తెచ్చుకునేందుకు ప్రయతి్నంచాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్కారు ఏర్పాటు చేసిన రీచ్‌ల వద్దే ఇసుక కొనుగోలు చేయాలి అని అధికారులు స్పష్టం చేశారు. కుప్పానికి సమీపంలో ఇసుక తెచ్చుకునేందుకు అనుమతులు లేవని తెగేసి చెప్పారు. దీంతో సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని గంగవరం మండలం నాలుగురోడ్ల కూడలి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌కు వెళ్లాడు. తీరా అక్కడ రీచ్‌లో ఇసుక లేదు. తిరిగి వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉట్టి చేతులతో ఇంటికి వచ్చేశాడు. చివరకు చేసేది లేక కుప్పం సమీపంలో తయారుచేసే కృత్రిమ ఇసుకను అధిక ధరకు కొనుగోలు చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించుకున్నాడు.శ్రీకాళహస్తికి చెందిన రమేష్‌బాబు స్వగృహ నిర్మాణం చేపట్టాడు. పట్టణానికి సమీపంలోని విరూపాక్షిపురం, పెన్నలపాడులో ఇసుక దొరుకుతుందని తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. టిప్పర్ ఇసుక తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. వెంటనే అక్కడున్న టీడీపీ నేతల అనుచరులు అడ్డుకున్నారు. ‘మీరంతా నదిలో యంత్రాలతో తవ్వి ఇసుక తరలిస్తున్నారు కదా.’ అని రమేష్‌బాబు ప్రశ్నించడంతో కొట్టినంత పనిచేశారు. మరి ఇసుక కావాలంటే ఏం చేయాలని అడిగితే టిప్పర్ ఇసుకకు రూ.25వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము అడిగినంత సొమ్ము ఇస్తే ఇసుకను ఇంటికే చేరుస్తామని స్పష్టం చేశారు. ఇసుక ఉచితమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కదా అని రమేష్‌బాబు అడిగితే.. అదంతా తమకు తెలియదని, నగదు కడితేనే ఇసుక పంపుతామని తేలి్చచెప్పారు. అక్కడి నుంచి పలువురికి ఫోన్‌చేసి ఇసుక గురించి ఆరా తీసినా ఎక్కడా ఉచిత ఇసుక దొరకదని, టీడీపీ వాళ్లే విక్రయిస్తున్నారని తెలియడంతో చేసేదిలేక రమేష్‌బాబు రూ.25వేలు చెల్లించి టిప్పర్ ఇసుక కొనుగోలు చేసుకున్నాడు.‘‘మీ ఊరి దగ్గర వాగు ఉందా..? కాలువ ఉందా..? నది ఉందా..? అక్కడకు వెళ్లి తట్టలతో తెచ్చుకుంటారో.. ఎద్దుల బండిలో తెచ్చుకుంటారో.. కావాల్సినంత ఇసుకను ఉచితంగా తీసుకెళ్లండి.. ఎవరు వద్దంటారు..? పైసా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.’’ అని చాలా తేలిగ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించేశారు. అంతలోనే బండిలో ఇసుక తరలించడం నిషేధం అంటూ ప్లేటు మార్చేశారు. ఎప్పటికప్పుడు ఉచిత ఇసుక అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు. దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు.. ఇసుక కోసం వెళ్లిన వారికే లోగుట్టు తెలుస్తోంది. ఉచితం పేరిట టీడీపీ నేతల అనుచిత వైఖరి అర్థమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీచ్‌లలో మాత్రం ఇసుక రేణువు కూడా ఉండదు. అదే పచ్చమూక అనధికారికంగా పాగా వేసిన పాయింట్లలో మాత్రం కావాల్సినంత ఉంటుంది. అక్కడ వాళ్లు చెప్పిందే రేటు.. అడిగినంత చెల్లిస్తేనే పనవుతుంది. ఉచిత ఇసుక అంటూ ఊదరగొడుతూ జనం చెవిలో పువ్వులు పెడుతున్న కూటమి సర్కారు నాటకాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వం ఏడు ఇసుక రీచ్‌లను అధికారికంగా ఏర్పాటు చేసింది. అయితే వాటిలో కేవలం మూడు రీచ్‌లలో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. తిరుపతి జిల్లా పిచ్చాటూరు అడవికోయంబేడు, చిత్తూరు జిల్లా గంగవరం మండలం నాలుగురోడ్ల కూడలి, చిత్తూరు రూరల్ మండలం దిగువమాసపల్లె, పాలూరులో మాత్రమే ఇసుక నిల్వలు ఉన్నాయి. మిగిలిన నాలుగు రీచ్‌లలో ఇసుక డంప్‌లు లేవు. ప్రభుత్వం ఉచితమంటూ ప్రకటించిన రెండు రోజులు మాత్రమే ఇక్కడ ఇసుక డంప్‌చేశారు. తర్వాత ఖాళీ అయిన రీచ్‌లలో ఇసుకను మళ్లీ డంప్ చేయలేదు. యథేచ్ఛగా ట్రాక్టర్లతో ఇసుక తరలింపు అడిగినంత చెల్లిస్తేనే.. ప్రస్తుతం మూడు రీచ్‌లలో ఉన్న ఇసుక కోసం వెళ్లిన వినియోగ దారులకు నిర్వాహకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం టన్ను ఇసుక రూ.155 లెక్కన ట్రాక్టర్ (ఐదు టన్నులు)రూ.775 అవుతుంది. బాడుగ 0–10 కిలోమీటర్ల అయితే రూ.1,200. అదే టిప్పర్ ఇసుక అయితే రూ.1,550. దూరం పెరిగే కొద్దీ వాహనం బాడుగ పెరుగుతుంది. ఇదిలా ఉంచితే.. టీడీపీ నేతలు ఒక వాహనానికి అదనంగా రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని అధికారులతో కలిసి వాటాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. పిచ్చాటూరు మండలం అడవికోయంబేడులో అదనపు వసూళ్లకు పాల్పడడంతో వినియోగదారులు నిలదీశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అధికారులు శుక్రవారం ఇసుకను విక్రయాలు నిలిపివేసినట్లు సమాచారం. ఫలితంగా వందలాది వాహనాలు రోజంతా వేచి ఉండాల్సి వచ్చింది. పిచ్చాటూరు మండలం అడవికోయంబేడు రీచ్‌లో ఇసుక నింపకపోవడంతో బారులు తీరిన వాహనాలు ఊరూరా అక్రమ రీచ్‌లు! ప్రభుత్వ రీచ్‌లలో ఇసుక లేకుండా చేసి.. కూటమి నేతలు సొంతంగా ఇసుక పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు. చంద్రగిరి నుంచి నాయుడుపేట వరకు స్వర్ణముఖి నదీ తీరంలో టీడీపీ నేతల అనధికారికంగా రీచ్‌లే కనిపిస్తున్నాయి. భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కంటైనర్ల ద్వారా చెన్నై, బెంగుళూరుకు తరలించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. మరో వైపు రైతులను బెదిరించి వారి భూముల్లోని ఇసుకను సైతం తవ్వేసి విక్రయించేస్తున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజక వర్గాల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. రెండు రోజుల క్రితం తిరుపతి రూరల్ మండలం పాడిపేట వద్ద, ఏర్పేడు మండలం పెనుమల్లం వద్ద వెలుగుచూసిన టీడీపీ నేతల బాగోతమే ఇందుకు నిదర్శనం. డీకేటీ పట్టాలు పొందిన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో టీడీపీ నేతలు దౌర్జన్యంగా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి వందలాది వాహనాల ద్వారా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అదే విధంగా శ్రీకాళహస్తి మండల పరిధిలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.7వేలకు విక్రయించి డబ్బులు పోగేసుకుంటున్నారు. టిప్పర్ అయితే రూ.25వేల నుంచి రూ.36వేలకు విక్రయించేస్తున్నారు. చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు అయితే లోడ్ ఇసుక రూ.లక్షపైనే ఉంటుందని అంచనా.పాడిపేట వద్ద స్వర్ణముఖిలో ఇసుక తవ్వకాలకు వచ్చిన టీడీపీ వారిని అడ్డుకున్న స్థానికులు(ఫైల్) వెలుగులోకి మరో మోసం ఇసుక ఉన్న రీచ్‌ల వద్ద అధికారులు, టీడీపీ నేతలు లాలూచీ పడి ఎవరికీ అనుమానం రాకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. 10 టన్నులకు చలానా కట్టి టిప్పర్‌లో 15 టన్నులు ఇసుక నింపి సొమ్ముచేసుకుంటున్నారు. అలాగే 4 టన్నులకు రశీదు వేసి ట్రాక్టర్లో 5 టన్నుల ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు.తట్టలతో ఇసుక లోడ్ చేస్తున్న కూలీలు తమ్ముళ్లవైతే కేసే లేదు!టీడీపీకి చెందిన వారు ఎక్కడైనా ఇసుకను తవ్వి తరలించుకెళ్లినా అధికారులు పట్టించుకోరు. ఇంకొకరు చలానా కట్టి ఇసుక తీసుకెళుతున్నా కేసులు తప్పవు. శ్రీకాళహస్తి పరిధిలో ఓ వ్యక్తి రూ.1,200 చెల్లించి ట్రాక్టర్ ఇసుక తీసుకెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పైసా కట్టకుండా రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డారు. ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత ఒకరు పోలీసులకు ఫోన్ చేయటంతో తెలుగు తమ్ముళ్లను మాత్రం రాచమర్యాదలు చేసి విడిచిపెట్టేశారు. ప్రభుత్వానికి నగదు చెల్లించి ఇసుక తరలించిన వ్యక్తిపై మాత్రం కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేయడం గమనార్హం.రాచ‘మార్గం’లో.. అక్రమార్జన కోసం టీడీపీ నేతల కుయుక్తులు అన్నీ ఇన్నీ కావు. ఇసుక తవ్వకాల కోసం ఏకంగా స్వర్ణముఖి నదిలోకి పలు ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటు చేసేశారు. నేరుగా నది మధ్యలోకే వెళ్లేలా దారులు వేసేశారు. ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు సులువుగా సజావుగా బయటకు వచ్చేలా ఆయా మార్గాలను రూపొందించారు. ఈ క్రమంలోనే యంత్రాలు అందుబాటులోని చోట్ల ఇసుక లోడ్ చేసేందుకు కూలీలను వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనానికి ఇంత అని కూలి చెల్లించి.. అది కూడా ఇసుక కొనుగోలు చేసేవారిపైనే భారం మోపుతున్నారు. ఏది ఏమైనా కాసులు మూటగట్టుకోవడమే లక్ష్యంగా నదీమతల్లికి గర్భశోకం కలిగిస్తున్నారు. -
రాజకీయ పాలనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక రాజకీయ పాలనే ఉంటుందని, అధికార యంత్రాంగం అందుకనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇసుక రవాణా వ్యయం ఐదు రెట్లు పెరిగిందని, రవాణా చార్జీలు పెరిగినా తామే పెంచామనుకుంటారని చెప్పారు. సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకుని రవాణా చార్జీలు సైతం చెల్లించవచ్చన్నారు. వినియోగదారుడికి ఇసుక అందినట్లు నిర్థారించుకున్నాకే రవాణా ఛార్జీలు ట్రక్కు యజమానికి విడుదలయ్యే పద్ధతి తెస్తామన్నారు. ఇసుక తరలించే ట్రక్కులను ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఊబరైజేషన్ చేస్తామన్నారు.లారీలు ఇసుక రీచ్‌ల దగ్గరకు వచ్చి రెండేసి రోజులు ఉండకూడదన్నారు. బడి మానేసిన పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలోనూ చేర్పించాలని నిర్దేశించారు. రోడ్లు అన్నీ పీపీపీ విధానంలోనే నిర్మాణం చేపట్టాలన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్నకు ఆకాశమే హద్దని, అమరావతిలో ప్రత్యేకంగా ఒక పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.రోడ్ల నిర్వహణను 50 కి.మీ. చొప్పున అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలనూ అవుట్ సోర్సింగ్‌కు అప్పగించాలన్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రైవేట్ రంగంలో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కొనసాగించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో శాఖల వారీగా సీఎం సమీక్షించారు. సమావేశం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు కొనసాగింది. అనంతరం సచివాలయం గార్డెన్లో కలెక్టర్లకు విందు ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే చర్యలుసహజ వనరులైన ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ఇబ్బందులను తొలగించాలని అంతకుముందు సమావేశంలో సీఎం సూచించారు. ఉచిత ఇసుకపై సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రవాణా చార్జీలు పెరగకుండా రీచ్‌లను దగ్గరగా ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సహజ వనరుల దోపిడీ జరిగిందని ఆరోపించారు.ఇసుక రీచ్‌లో ఏం జరిగిందో సుప్రీంకోర్టుకు వాస్తవాలు చెప్పాలని, లేదంటే మీకు ఇబ్బందులు వస్తాయని కలెక్టర్లకు స్పష్టం చేశారు. గత సర్కారు పాలనలో ఇసుక దోపీడీపై సీఐడీతో విచారణ జరిపి తప్పుచేసిన వారిని శిక్షిస్తామన్నారు. వరదను ఒడిసిపట్టి తక్షణమే రిజర్వాయర్లను నింపాలని జలవనరులపై సమీక్షలో ఆదేశించారు. ఎక్కడైనా గేట్లు కొట్టుకుపోతే ఏఈ, డీఈని డీమ్డ్ సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించారు. డ్రాప్ అవుట్స్ సున్నాకు రావాలిబడికి వెళ్లే పిల్లలకు కిట్స్ ఇవ్వడం ఇప్పటికే మూడు నెలలు జాప్యమైందని, వీలైనంత త్వరగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైన ఏజెన్సీని పక్కనబెట్టాలని ఆదేశించారు. డ్రాప్ అవుట్స్ సున్నాకు రావాలన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పామని, అందుకోసం ప్రైవేట్‌లో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తద్వారా 5–10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రోడ్లు అన్నీ పీపీపీలోనేరహదారులన్నీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టాలని, రాష్ట్ర హైవేలన్నీ కూడా పీపీపీలోనే ఉండాలని సీఎం చెప్పారు. పీపీపీలో విధానంలో చేపట్టేందుకు 14 ప్రాజెక్టులను గుర్తించామని అధికారులు పేర్కొనగా ఇంకా పాత మూసలోనే ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. టోల్ గేట్లు ఏర్పాటు ద్వారా వ్యయం రాబట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించి ఒక్క ఫిర్యాదు రాకూడదన్నారు.వైద్య సేవలు అవుట్ సోర్సింగ్ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో 20 సేవలకు పైగా అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చామని, ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్‌కు వైద్య సేవలను అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను పీపీపీ విధానంలో కాకుండా ఈపీసీ విధానంలో చేపట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈపీసీ విధానంలో పోర్టుల నిర్మాణానికి డబ్బులు, గ్యారెంటీ ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడు తాను వెనక్కు వెళితే చెడ్డపేరు వస్తుందని, అందువల్ల వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.డ్రోన్లతో డ్రైనేజీల పూడికల గుర్తింపుసోలార్ పవర్‌కు భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, మడకశిర ప్రాంతంలో నాలుగైదు వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని సీఎం చెప్పారు. దీన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాన్నింటిపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 1,000 నుంచి 2,000 ఫీడర్లలో సోలార్ పవర్ ద్వారా వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని తెస్తామన్నారు. గతంలో దోమల నివారణకు డ్రోన్స్ వినియోగించామని, ఇప్పుడు డ్రైనేజీల పూడికలు, రహదారుల మరమ్మతులను డ్రోన్స్ ద్వారా గుర్తించాలని సీఎం సూచించారు. జిల్లాకో జాయింట్ కలెక్టర్‌ను అదనంగా నియమించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సూచించారు. ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం..రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తామని సీఎం చెప్పారు. పీఎంఏవై–అర్బన్, రూరల్, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ తదితర పథకాల కింద 9,11,594 గృహాలు పెండింగ్‌లో ఉండగా, 5,74,710 ఇళ్ల నిర్మాణం అసలు చేపట్టలేదన్నారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకుంటామన్నారు. 25 లక్షల ఇళ్లు కడతానని గొప్పగా చెప్పి కేవలం 7 లక్షలు మాత్రమే చేపట్టారన్నారు. నీరు – చెట్టు, ఉపాధి హామీ పెండింగు బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. సంపద సృష్టించండి.. వంద రోజుల్లో మార్పుకలెక్టర్లు, అధికారులు వినూత్న ఆలోచనతో సంపద సృష్టించాలని సీఎం సూచించారు. అక్టోబర్ 2న రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు. జిల్లాల్లోనూ కలెక్టర్లు విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలన్నారు. సెప్టెంబర్ 20న ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయ్యేనాటికి మార్పు కనిపించాలని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని, ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గరా ఉంటుందని తెలిపారు. సమర్థులైన అధికారులు గత ఐదేళ్లలో నిర్వీర్యమైపోయారని చెప్పారు. తాను కూడా మళ్లీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని, గతంలో స్పీడు మళ్లీ చూపిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. తనకు వచ్చిన ఐదు వేల పిటిషన్లలో సగం భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నాయని చెప్పారు. ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష గత ప్రభుత్వంలో బటన్ నొక్కడం మినహా ప్రజలను పరామర్శించలేదన్నారు. పేదరికాన్ని సున్నాకి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు చెప్పే అంశాలను కలెక్టర్లు, అధికారులు వినాలని స్పష్టం చేశారు. త్వరలో పరిపాలనకు సంబంధించి ఒక యాప్ తెస్తామని తెలిపారు. ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేసి ఏపీలో 36 మందిని చంపామని ఆరోపణలు చేశారని, నిజంగా అలా జరిగి ఉంటే ఎఫ్ఐఆర్లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. అడవులంటే పవన్‌కు ఇష్టం.. 2014–19 మధ్య ఉచితంగా నిర్వహించిన భూసార పరీక్షలను మళ్లీ మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం పేర్కొన్నారు. అడవులంటే పవన్ కల్యాణ్‌కు చాలా ఇష్టమని, వాటి విస్తీర్ణం పెంచాలని సూచించారు. ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని చీరాలలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదన్నారు. గత ఐదేళ్లుగా స్వచ్ఛ భారత్ నిధుల యూసీలు ఇవ్వలేదని కేంద్ర అధికారులు తనకు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. కొత్త లిక్కర్ పాలసీ..రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ గురించి ఆలోచించి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో ఏపీలోకి లిక్కర్‌ను అనుమతిస్తామన్నారు. తద్వారా మద్యం అక్రమ రవాణాను అరికడతామన్నారు. కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ, ఎంటర్ ప్రెన్యూర్ పాలసీ, ఎఫ్‌డీఐ, ఎంఎస్ఎంఈ, హార్డ్ వేర్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, స్టార్టప్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, పీపీపీ మోడల్లో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, వయబులిటీ గ్యాప్ ఫండింగ్, వాటర్, లాజిస్టిక్, యూత్, స్పోర్ట్స్ పాలసీలు తెస్తున్నట్లు ప్రకటించారు.జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఐదేళ్ల కిందట రూ.వందల కోట్లు ఖర్చు చేసి 15వేల కెమెరాలు ఏర్పాటు చేస్తే అవి ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసి కొట్టేసే పరిస్థితికి వచ్చారన్నారు. ఐదేళ్లలో జరిగిన తప్పులను వెలికితీసి శిక్షిస్తామన్నారు. ‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’ అంటూ వాహనాలు తెచ్చి రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టారు. రేషన్ పంపిణీకి 15రోజుల పాటు ఇద్దరిని నియమించి వారికి జీతాలు ఇచ్చారు. పంపిణీ పూర్తయ్యాక ఆ వాహనాలను మళ్లీ వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారు. రేషన్ దుకాణాలకు రాలేని వారి ఇంటికి వెళ్లి ఇవ్వాలి. కాకినాడలో ఒకే ఫ్యామిలీ నుంచి సివిల్ సప్లై శాఖకు సంబంధించి మూడు పదవులు నిర్వహిస్తున్నారు. దీంతో దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లయింది. ఇలాంటి వాటిని నియంత్రించాలి’ అని సీఎం పేర్కొన్నారు.రాజధానిలో పేదలకిచ్చిన 50,800 ఇళ్ల స్థలాలు రద్దు!వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, గుంటూరు వాసులకు రాజధాని అమరావతిలో ఇచ్చిన ఇళ్ల స్థలాల స్థానంలో ప్రత్యామ్నాయంగా మరోచోట ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్‌లోని ఆర్–5 జోన్లో లేఅవుట్లు వేసి సుమారు 50,800 మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి లబ్ధిదారులకు వారి ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలన్నారు. అవసరమైతే టిడ్కో తరహా ఇళ్లను నిర్మించి, ప్రథమ ప్రాధాన్యం వారికే ఇవ్వాలని పేర్కొన్నారు.సార్.. హామీలు నెరవేర్చండిసీఎం చంద్రబాబు సమావేశం సందర్భంగా లైవ్‌లో విన్నపాలు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సమావేశాన్ని సమాచార శాఖ యూట్యూబ్ లింక్ ద్వారా లైవ్ ఇచ్చింది. దీన్ని ప్రత్యక్షంగా చూసిన పలువురు పలు సమస్యలను వివరిస్తూ కామెంట్లు పెట్టారు. సీఎం సార్.. హామీలు నెరవేర్చండంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుని చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ‘వీజీఎన్’ అనే పేరుతో కామెంట్ చేశారు.ఎంఎల్‌హెచ్‌పీలకు జీతాలు రాలేదంటూ విజయ్‌కుమార్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పేదలకు స్థలాలు, ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని గౌరి నాయుడు కోరాడు. ప్రతి ఇంటికి ఉచిత విద్య, వైద్యం అందించే దిశగా విద్యా సంస్థలు, ఆసుపత్రులను సన్నద్ధం చేయాలని చంద్రధర్ అనే వ్యక్తి సూచించాడు. కేజీబీవీ టీచర్ల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ సమస్యలను కొందరు ప్రస్తావించారు.వ్యవస్థల బలోపేతంగత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చింది. వ్యవస్థలను బలోపేతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. పంచాయతీల బలోపేతానికి అందరూ సహకరించాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. పిఠాపురంలో ద్రవ వ్యర్థాల నిర్వహణను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. – పవన్ కళ్యాణ్, ఉపముఖ్యమంత్రిత్వరలో ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరిస్తాం. గత ప్రభుత్వ పాలనలో 9 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించగా అందులో దాదాపు 25 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మాకు అందే విజ్ఞప్తుల్లో 80 శాతం రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయి. – అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రికలెక్టర్లకు వంద రోజుల ప్రణాళికరాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్లు సమర్థంగా అమలు చేయాలి. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. కలెక్టర్ల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చొరవ చూపాలి. – నీరభ్ కుమార్ ప్రసాద్, సీఎస్ -
ఇసుక ధర పెంపు.. కొనుగోలుదారుల నిరసన
భీమునిపట్నం/అగనంపూడి (విశాఖ): ఒక పక్క ప్రభుత్వం ఇసుక ఉచితమని ప్రకటనలు గుప్పిస్తూ.. మరోవైపు భారీ మొత్తంలో వసూలు చేస్తుండటంపై ఇప్ప టికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. అయినా రేటు రోజురోజుకు పెంచేస్తున్నారు. బుధవారం భీమిలి ర్యాంపు వద్ద ఒక్కసారిగా టన్నుకు రూ.318 పెంచడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఒకటే ధర ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్ సారథ్యంలోని కమిటీ ధరలను సమీక్షించింది. అగనంపూడి, భీమిలి డిపోల్లో టన్ను రూ.1,076 కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో భీమిలి వద్ద ధర పెరగ్గా, అగనంపూడి డిపోలో అంతే స్థాయిలో ధర తగ్గింది. భీమిలి వద్ద మంగళవారం టన్ను రూ.758కి ఇవ్వగా, బుధవారం ఒక్కసారిగా రూ. 1076కు పెరగడంతో కొనుగోలుదారులు నిరసనకు దిగారు. ఉచిత ఇసుకపేరుతో ఒక్కో వ్యక్తికి ఆధార్ కార్డుపై రోజుకు 20 టన్నులు ఇస్తున్నారు. రవాణా ఖర్చులు కొనుగోలుదారులే భరించాలి. దీంతో ఇసుక భారం మోయలేనంతగా పెరిగింది. ఉచితమని ప్రకటించి ప్రభుత్వం ఇలా డబ్బులు వసూలు చేస్తున్నా గత్యంతరం లేక విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల వారు భీమిలి వద్ద ఇసుక కొంటున్నారు. ఒక్కసారిగా ధర పెరగడంతో వారంతా షాక్ తిన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా పెంచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి లారీలు తెచ్చామని, ఇప్పుడు పెరిగిన రేటుకు ఇసుకను కొనలేక ఖాళీ లారీలతో వెనక్కి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితమన్న పేరుతో ఇలా దోచేస్తే ఇళ్లెలా కట్టుకొంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరను తగ్గించి ఇసుకను అందివ్వాలని డిమాండ్ చేశారు.ఒక్కసారిగా పెంచేస్తే ఎలా కొనగలం?ఇసుక ధరను ఇలా పెంచుతారని ఎవరూ ఊహించలేదు. ఉదయం ర్యాంపు వద్దకు లారీలు తీసుకొస్తే... రేటు పెంచినట్టు తెలిపారు. టన్నుకు రూ.300 పైనే పెంచేశారు. ఉచితమని చెబుతూ ఇలా రేటు ఒక్కసారిగా పెంచేస్తే తట్టుకునే పరిస్థితి లేదు. – తుపాకుల సురేష్, మజ్జివలసఉచితమని ప్రకటించడం ఎందుకు?ఇసుక ధర ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించడం ఎందుకు? కనీసం పాత ధరకు కూడా ఇవ్వకుండా కొద్ది రోజుల్లోనే ధర ఇలా పెంచేయడం పద్ధతి కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? – జి.శ్రీను, ఆనందపురం -
ఉచితం అన్నారు.. దోచేస్తున్నారు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేశాం. ఫలితంగా ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.765 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,825 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు చంద్రబాబు హయాంలో ఈ ఆదాయం అంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఎవరెవరు ఎంత పంచుకున్నారో చెప్పగలరా?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా, సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందుబాటులో ఉండేలా చూస్తే అవినీతి జరిగిపోయిందంటూ లేనిపోని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని నమ్మబలికి, తీరా ఇప్పుడు ఉచిత ఇసుక మచ్చుకైనా కన్పించని విధంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇసుక పాలసీపై చంద్రబాబు విడుదల చేసిన వైట్ పేపర్‌పై జగన్ ఫ్యాక్ట్ పేపర్ ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే.. ఏ రేటుకు అమ్మాలో పత్రికల్లో ప్రచారం చేసే వాళ్లంఉచిత ఇసుక పేరిట జరిగిన దోపిడీకీ అడ్డుకట్ట వేస్తూ 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అత్యంత పారదర్శకంగా ఇసుక పాలసీని తీసుకొచ్చాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా టెండర్లు పిలిచాం. ఈ టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు. చంద్రబాబు, రామోజీ మనుషులే కాదు.. ఎవరైనా నేరుగా పాల్గొనే అవకాశం ఉంది. 2 కోట్ల మెట్రిక్ టన్నుల మినిమమ్ గ్యారంటీ పెడుతూ ఏటా రూ.765 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కట్టేలా చర్యలు తీసుకున్నాం. ఫలితంగా ఐదేళ్లలో రూ.3,825 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. పైగా ప్రతి టన్నుకు రూ.375 చొప్పున ముందుగా ప్రభుత్వానికి రాయిల్టీ చెల్లించిన తర్వాతే ఇసుక తవ్వే కార్యక్రమం చేపట్టాం. ఇలా తవ్విన ఇసుకను రీజనబుల్ ట్రాన్స్‌పోర్టు చార్జీతో కలిపి ఏ నియోజకవర్గంలో ఏ రేటుకు విక్రయించాలో ప్రజలందరికీ తెలిసేలా ప్రతి ఆదివారం పత్రికల ద్వారా ప్రచారం చేశాం. నిర్దేశించిన ధరకు ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాం. తప్పు చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా అంటూ ప్రతి వారం పత్రికల్లో ప్రచారం చేశాం.40 లక్షల టన్నుల ఇసుక కాజేశారు వర్షా కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ముందు చూపుతో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేస్తే ఎన్నికల్లో ఆ యార్డుల వద్దకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ వెళ్లి సెల్ఫీలు దిగారు. ఇసుకగుట్టలు చూపించి లేనిపోని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడా ఇసుక గుట్టలు, కొండలు ఏమైపోయాయి? అధికారంలోకి వచ్చీ రాగానే ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు మనుషులు ఎడాపెడా అమ్మేసుకున్నారు. వాళ్లపై యాక్షన్ తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఈ రోజు ఉచిత ఇసుక అని చెప్పిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన రేటు కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. వైఎస్సార్సీపీ హయాంలో టన్నుకు రూ.375 చొప్పున ఏటా రూ.765 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తే నేడు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. అలాగని ఉచిత ఇసుక అమలవుతుందా.. అంటే అదీ లేదు. ఎడాపెడా దోచుకుంటున్నారు. ఇసుక రేట్లు చూస్తుంటే వైఎస్సార్సీపీ హయాంలోనే మేలు.. అప్పుడే రేట్లు తక్కువగా ఉన్నాయని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. ఎక్కడా స్టాక్ లేదు. దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. కళ్లెదుట దోపిడీ కనిపిస్తుంటే వేరొకరిపై వేలెత్తి చూపిస్తున్నారు. -
తమ్ముళ్లే ఇసుకాసురులై..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ పెద్దలే ఇసుకాసురుల అవతారమెత్తారు. ఎన్టీఆర్ జిల్లాలోని స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలను యథేచ్ఛగా తోడేస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాల్లో మాత్రమే ఇసుక లోడ్ చేస్తూ కాసులు దండుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కానర్ వద్ద తిష్టవేసి భవన నిర్మాణదారులకు ఇసుక దొరకనివ్వడం లేదు. స్టాక్ పాయింట్లలో స్కానర్లు పని చేయడం లేదని బుకాయిస్తూ సామాన్యులకు ఇసుక దొరక్కుండా చేస్తున్నారు. ఇదేమని ఉద్యోగులు ప్రశ్నిస్తే.. ఉద్యోగం చేయాలంటే తాము చెప్పింది వినాలని, లేకపోతే ఉద్యోగం ఉండదని బెదిరిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న రెవెన్యూ, మైనింగ్ శాఖల కిందిస్థాయి ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహించలేమని వాపోతున్నారు. రవాణా వాహనాలూ వారివేనందిగామ సమీపంలోని కీసర స్టాక్ యార్డు పూర్తిగా నందిగామ మండల టీడీపీ నేత చేతుల్లో ఉంది. అక్కడ ఇసుక లోడుచేసే జేసీబీలు మొదలు ఇసుక రవాణాచేసే వాహనాలన్నీ టీడీపీ నేతలవే ఉండేలా పెత్తనం చేస్తున్నారు. వాస్తవానికి కూపన్ తీసుకున్నా.. అనధికారికంగా ప్రొక్లెయిన్ ఉపయోగించి రూ.700 వసూలు చేస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల నుంచి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నారు. తాము చెప్పిన వారికే ఇసుకపోయాలని అక్కడి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితే అనుమంచిపల్లె స్టాకు యార్డు వద్ద నెలకొంది. గ్రామస్థులు కొందరు మహిళలకు కూలీ ఇచ్చి క్యూలో నిలబెట్టి కూపన్లు పొందుతున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కీసర స్టాక్ యార్డు నుంచి భారీ ఎత్తున ఇసుకను లోడ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారు.ఒకే బిల్లుపై మూడు ట్రిప్పులుటీడీపీ నేతలు స్టాక్ పాయింట్ల వద్ద తిష్టవేసి ఉదయం 20 వేల టన్నులకు ఒక బిల్లు తీసుకుంటున్నారు. ఆ బిల్లుతో ఇసుకను లోడ్ చేయించుకుని విజయవాడ పరిసర ప్రాంతాలకు మూడుసార్లు రవాణా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. 20 టన్నులకు బదులు 36 టన్నుల వరకు లోడ్ చేసుకుని ఇసుకను లూటీ చేస్తున్నారు. టీడీపీ నేతలు, ప్రొక్లెయిన్ యజమాని కలసి ఒక్కో లారీ టిప్పర్‌కు అదనంగా ఇసుకను లోడ్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డుల వద్ద నిల్వ ఉంచిన ఇసుకను టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. 47 వేల టన్నులకు పైగా విక్రయంఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 7న ఉచిత ఇసుక ప్రారంభం కాగా.. అప్పటికి 5,54,361 టన్నుల ఇసుక నిల్వలు ఉండేవి. ఇప్పటికే దాదాపు 47 వేల టన్నులకు పైగా స్టాక్ యార్డుల నుంచి తరలించేశారు. రోజుకు 8 వేల నుంచి 9 వేల టన్నుల ఇసుక జిల్లాలోని యార్డుల నుంచి తరలిపోతోంది. ప్రస్తుత ఇసుక నిల్వలు కేవలం 30 నుంచి 40 రోజుల మాత్రమే సరిపోతాయి. వర్షాకాలంలో నది నుంచి ఇసుక తీసేందుకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ లోపు సిల్ట్ లేదా ఓపెన్ రీచ్‌లను గుర్తించకపోతే ఇసుక కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నేతలు ముందస్తుగానే యార్డుల నుంచి ఇసుకను డంప్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలో 8 స్టాకు యార్డులున్నాయి. కృష్ణా జిల్లా స్టాకు యార్డులో ఇసుక నిల్వలు లేవు. ఎన్టీఆర్ జిల్లా నుంచే కృష్ణా జిల్లాకు ఇసుక తీసుకెళ్లాల్సి వస్తోంది.‘అక్రమ ఇసుక’లో మా వాటా ఏదీ?» శ్రీకాకుళం జిల్లా పెద్దసవళాపురంలో టీడీపీ సీనియర్ల ఆక్రోశం » వంశధార నదిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు» అక్రమ ఇసుక రవాణా అవకాశం చోటామోటా కార్యకర్తలకు అప్పగింత » తమకూ వాటా ఇవ్వాలంటూ నాయకులపై సీనియర్ల ఒత్తిళ్లు సాక్షి, టాస్క్‌ఫోర్స్: అక్రమ ఇసుక తవ్వకాలు, వసూళ్లు, రవాణాలో తమకు వాటా ఇవ్వడం లేదంటూ టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి టీడీపీకి సేవ చేసిన తమను పక్కనపెట్టి.. ఎన్నికలకు నెల రోజుల ముందు పార్టీలో చేరిన చోటామోటా కార్యకర్తలకు అవినీతిలో భాగస్వామ్యం కల్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక దందాలో తమకూ వాటా ఇవ్వాలంటూ నాయకులపై ఒత్తిడి చేస్తున్నారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని పెద్దసవళాపురం వద్ద ఉన్న వంశధార నదిలో నుంచి ఎలాంటి అనుమతి లేకుండా టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ ఇసుకను ప్రతి రోజూ దాదాపు 20 ట్రాక్టర్ల ద్వారా.. వెన్నెలవలస వద్ద గల ఆశ్రమ పాఠశాల సమీప ప్రదేశానికి తరలించి నిల్వ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఆ ఇసుకను ఇష్టారీతిన అమ్మేస్తున్నారు. ఇసుక కోసం వచ్చే ప్రతి ట్రాక్టర్ నుంచి రూ.100, టైరు బండ్ల నుంచి రూ.50 చొప్పున టీడీపీ కార్యకర్తలు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక దందా, రవాణాను నెల రోజుల కిందట పార్టీలో చేరిన వారికి అప్పగించారంటూ స్థానిక టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య లుకలుకలు వచ్చి.. ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు సమాచారం ఇవ్వడంతో ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి పోలీసులు మంగళవారం ఉదయం ఇసుక ర్యాంపు వద్దకు చేరుకున్నారు. కానీ అప్పటికే సమాచారం లీక్ అవ్వడంతో తెలుగు తమ్ముళ్లు ఇసుక రవాణా నిలిపేశారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ రమేశ్‌బాబును ప్రశ్నించగా.. ప్రతి రోజు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. మండలంలో ఇసుక ర్యాంపుల నిర్వహణకు ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.పెనుమూడి రేవులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు»రెవెన్యూ మంత్రి అండతో రెచ్చిపోతున్న కూటమి నేతలు» చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులురేపల్లె రూరల్: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడి రేవులో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అండదండలతో కూటమి నేతలు అక్రమార్జనకు తెగబడుతున్నారు. అనుమతి లేకుండా రేవు లోపలకు చొరబడి పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ట్రాక్టర్లలో లోడ్ చేసి పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. రేవు వద్ద ట్రాక్టర్లలో లోడ్ చేసినందుకు రూ.1500 నగదు, రేవు వద్ద నుంచి రేపల్లె పట్టణానికి చేరవేస్తే రూ.2500 నుంచి రూ.3000 వరకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తే దూరాన్ని బట్టి మరింత నగదు వసూలు చేస్తున్నారు. ఒక పక్క ఉచిత ఇసుక విధానం అంటూనే మరో వైపు పెనుమూడి రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వి అమ్ముకుంటున్నారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటంలేదని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తహసీల్దార్ రవీంద్ర వివరణ ఇస్తూ పెనుమూడి ఇసుక రీచ్‌లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. రీచ్ వద్ద తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే గ్రామ రెవెన్యూ అధికారిని ఆదేశించామని తెలిపారు. తవ్వకాలను అడ్డుకోవటంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. -
ఈ ఉచితం చాలా కాస్ట్లీ!
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసినా.. తెలుగు నిఘంటువులు,శబ్ద రత్నాకరం తిరగేసినా వాటిల్లో వాస్తవ అర్థాలే ఉంటాయి.కానీ సీఎం చంద్రబాబు డిక్షనరీ మాత్రం వేరే ఉంది. ప్రతి పదానికీ తనదైన అర్థాలు, నిర్వచనాలు ఉంటాయి! అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఎలాగంటే.. ఉచితం అంటారు.. కానీ దానికో ధర ఉందంటారు! ఇసుక ఉచితంగా ఇస్తామంటూనే ఊరికే ఏదీ రాదంటారు మరి!! ఉచితం అంటే టీడీపీ పెద్దల దృష్టిలో అమ్మకమే. రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ యార్డుల వద్ద బోర్డు పెట్టి మరీ టన్నుల చొప్పున బహిరంగంగా విక్రయిస్తున్నా సరే అది ఉచితంగా ఇవ్వడమే!సీనరేజి ఫీజు, తవ్వకం, లోడింగ్, ఇతర పన్నులతోపాటు రవాణా చార్జీలు కూడా వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించి కొన్నా సరే ఇసుకను ఉచితంగా ఇస్తున్నారనే చెప్పాలి. లేదంటే సీఎం చంద్రబాబుకు కోపం వస్తుంది. ‘ఉచితం అంటే మీ ఇంటికి నేనే ఫ్రీగా తీసుకొచ్చి ఇవ్వాలా?’ అని ఎదురుదాడి చేస్తారు. డబ్బులిచ్చి కొంటున్నాం..కదా అని ఎవరైనా వినియోగదారుడు ఉచితం కాదని చెబితే టీడీపీ శ్రేణులు చితకబాదినా దిక్కుండదు. ఎందుకంటే అది టీడీపీ సర్కారు ఉచిత విక్రయ పథకం కాబట్టి! – సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్పల్నాడులో పచ్చనేతలు చెప్పిందే ధరమాచర్లలో.. 30,000పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమ డంప్‌లు పెద్ద ఎత్తున ఉన్నాయి.కృష్ణానది, గుండ్లకమ్మ, వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి డంపింగ్ యార్డులలో నిల్వ ఉంచారు. ఇటీవల వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తలర్లపల్లిలో గుండ్లకమ్మ వాగు నుంచి టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఓ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. కొండమోడులో టన్ను ఇసుక ధర రూ.564లు ఉండగా, వినుకొండలో రూ.793లు ఉంది. వీటికి రవాణా చార్జీలు అదనం. తాళ్లాయపాలెం నుంచి గుంటూరుకు ఇసుక లారీ రావాలంటే రూ.15,000 పైనే అవుతోంది. మాచర్లలో 18 టన్నుల ఇసుక రవాణాతో కలిపి రూ.30వేలు అవుతోంది.కడపలో కొల్లగొట్టేస్తున్నారు.. మదనపల్లెలో..28,300వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ఉచిత ఇసుక పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పోటాపోటీగా ఉచిత ఇసుకను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ వర్గీయులకు పోటీగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇసుక అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు. మదనపల్లెకు 18 టన్నుల ఇసుక తరలించాలంటే రవాణా చార్జీలతో కలిపి రూ.28,300 వరకు ఖర్చవుతోంది. జమ్మలమడుగుకు అయితే రూ.20వేలకు పైగా అవుతోంది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా వేలల్లో ధరలుఎన్టీఆర్ జిల్లాలో..25,200ఉచిత ఇసుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రవాణా, లోడింగ్, సీనరేజీ, జీఎస్టీ చార్జీల పేరుతో స్టాకు యార్డుల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ట్రక్కు బాడుగ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. కంచికచర్ల మండలం మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద అధికారులు నామమాత్రంగా ఉండగా, 20 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకే బిల్లుపై రెండు వాహనాల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. పెనమలూరు పరిధిలోని చోడవరంలో 50–70 లారీలకు పైగా ఇసుక నిల్వలను అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు లారీ రూ.16 వేల నుంచి రూ.20 వేల చొప్పున అమ్మేశారు. స్టాకు యార్డుల్లో నిల్వలు లేవంటూ కృత్రిమ కొరత సృష్టించి ట్రాక్టరు లోడ్ రూ.6 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. దూరప్రాంతాలకు 18 టన్నుల ఇసుక లారీలో తేవాలంటే బాడుగ, పన్నులతో కలిపి రూ.20,835 నుంచి రూ.25,200 అవుతుంది. కర్నూలులో కొనలేం..శ్రీశైలంలో 32,000కర్నూలు జిల్లాలో ఇసుక ధరలు భారీగా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పెట్టి దోచుకుంటున్నారు. మరోవైపు కౌతాళం మండలం గుడికంబాళి రీచ్‌లోని ఇసుకను టీడీపీ నాయకులు ఇతరుల ఆధార్ కార్డులతో కొల్లగొట్టి డంపింగ్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో 18 టన్నులు ఇసుక గరిష్టంగా లారీ రవాణా చార్జీలతో కలిపి రూ.32వేలు వరకు అవుతోంది. ఉత్తరాంధ్రలో విచ్చలవిడిగా లూటీ.. పెందుర్తిలో.. 28,800ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉచితం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా.. ఆచరణలో మాత్రం అధిక ధరలు వసూలు చేస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 18 టన్నుల ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.20వేల నుంచి 28,800 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక డిమాండ్ ఎక్కువగా ఉండే విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అనంతలో అతి కష్టం పెనుకొండలో..25,000అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురంపల్లి సమీపంలో వేదావతి హగరి నది వద్ద ఇసుక విక్రయాలు ప్రారంభించారు. ఇక్కడి నుంచి అనంతపురం లాంటి దూర ప్రాంతాలకు తరలించాలంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. పెనుకొండలో గరిష్టంగా 18టన్నుల ఇసుక రవాణాచార్జీలతో కలిపి రూ.25,000 వరకు అవుతోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చిత్ర విచిత్రాలు.. నెల్లూరు రూరల్..23,000 ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు మండలం దిగువ మాసపల్లి రీచ్‌లో టన్నుకు రూ.289 సీనరేజీ కింద చెల్లిస్తూ అదనంగా రూ200 వసూలు చేస్తున్నారు. నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల ప్రజలు చిత్తూరు రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపో వద్దకు వచ్చి తీసుకెళ్లేందుకు రవాణా చార్జీలతో కలిపి ట్రాక్టర్ లోడు ఇసుక రూ.7,500 వరకు ఖర్చు అవుతోంది. కుప్పం, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల ప్రజలు గంగవరం మండలం బైరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఇసుక డిపోనకు వచ్చి ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి రవాణా ఖర్చులతో కలిపి ట్రాక్టర్ లోడు రూ.8,500 వరకు ఖర్చు అవుతోంది. గూడూరుకు వెళ్లేందుకు ట్రాక్టర్ ఇసుకకు రూ.9 వేల నుంచి రూ.10వేలు వ్యయం అవుతోంది. చంద్రగిరికి లారీ ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.21,600 వరకు అవుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 18 టన్నుల ఇసుక లారీ తీసుకువెళ్లేందుకు రూ.23,000 అవుతోంది. -
వాటాలు తేలకపోవటంతో ఇసుక దందా గుట్టు బయటపెట్టిన టీడీపీ నేతలు
-
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మాయం మాయం 25 రోజుల్లో అంతా మాయం ఇదే చంద్ర తంత్రం
-
ఉచిత ఇసుక పేరుతో ప్రజలకు పంగనామాలు
-
రండి బాబు రండి.. ఇసుక ఫ్రీ..కానీ..!
-
35 లక్షల టన్నుల ఇసుక మాయం..
-
నర్సీపట్నం ఇసుక డిపోలో!
సాక్షి, అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఇసుక డిపోలో రూ.5 కోట్ల విలువైన ఇసుక తరలించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ వేశారని.. ఉచిత ఇసుక అంటూ ప్రజల్ని టీడీపీ మోసం చేస్తోందంటూ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మండిపడ్డారు.టన్నుకు కేవలం రూ.175 తగ్గించి ఉచిత ఇసుక అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమ్తెతారు. మా ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇచ్చామని ఉమాశంకర్ అన్నారు. డిపోకి వచ్చిన, అమ్మిన ఇసుక వివరాలు వెల్లడించాలని అధికారులను ఉమా శంకర్ గణేష్ కోరారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. -
పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
సాక్షి, అమరావతి : ఉచితంగా ఇసుక పేరుతో అందినకాడికి దండుకోవడానికి అధికార పార్టీ నేటి నుంచి ముసుగు తీయనుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినా స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుక నిల్వలను నేటి నుంచి అవసరమైన వారికి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఆ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే పరిస్థితి ఉండడంతో కొరత రాకుండా ఉండేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టాక్ పాయింట్లలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసింది. ఇప్పుడు ఆ ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఆ ముసుగులో ఆ పార్టీ నేతలకు భారీగా లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమైంది. పైకి మాత్రం వినియోగదారులే సొంతంగా వాహనాన్ని సమకూర్చుకుంటే, అందులో ఉచితంగా ఇసుకను నింపి పంపుతారని అధికారులు చెబుతున్నప్పటికీ అది ఆచరణలో మరో రకంగా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. ఇసుక లోడింగ్, స్టాక్ యార్డ్ నిర్వహణ, రవాణా, పన్నులు, లెవీకి సంబంధించి కొంత మొత్తాన్ని వసూలు చేయనున్నారు. వీటన్నింటికీ కలిపి జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపి టన్నుకు రూ.250 నుంచి రూ.300 వరకు వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నా, వాస్తవంగా అంతకు రెట్టింపు వసూలు చేయనున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టన్నుకు రూ.475తో ఇసుకను విక్రయించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.780 కోట్లకుపైగా ఆదాయం లభించేది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొత్తగా అమలు చేసే విధానంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. అదే సమయంలో వినియోగదారులపై భారం తప్పదు. ‘వాహనాలన్నీ టీడీపీ నేతలవే.. అలాంటప్పుడు ఆ పన్ను, ఈ పన్ను అంటూ బాదుడు మామూలే’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. సచివాలయ ఉద్యోగులకు స్టాక్ యార్డ్ బాధ్యతలు ఇసుక స్టాక్ యార్డు బాధ్యతలను ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కాంట్రాక్టు సంస్థలుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమి ఇన్ఫ్రా సంస్థలకు చెందిన సిబ్బందిని గత నెల అధికారం మారగానే టీడీపీ శ్రేణులు బెదిరించి అక్కడి నుంచి పంపించేశాయి. స్టాక్ యార్డులన్నీ ప్రస్తుతం టీడీపీ శ్రేణుల చేతిలో ఉన్నాయి. ఉచిత ఇసుక సరఫరాను అమలు చేయడం కోసం శనివారం నుంచి జిల్లా కలెక్టర్లు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కొలిక్కి వచ్చినట్లు లేదు. మైనింగ్ సిబ్బందితోపాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి వాటిని అప్పగించనున్నట్లు తెలిసింది. వారితోపాటు వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా ఇసుకను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి స్టాక్ యార్డ్రే ఒక ఇన్‌ఛార్జిని నియమించి, అతని ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ సిబ్బంది కొందరు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో సెప్టెంబర్ వరకు ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అప్పటి వరకు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుక నిల్వల్ని ఉచిత ఇసుక విధానంలో సరఫరా చేయనున్నారు. ఆ తర్వాత ఇసుక రీచ్‌లను తెరిచి తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఇసుక కాంట్రాక్టు సంస్థలు జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలను పక్కకు తప్పించి ఇసుక తవ్వకాలకు కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇసుక స్టాక్ యార్డులను స్థానిక టీడీపీ లీడర్లే నిర్వహించనున్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల పాత్ర నిమిత్త మాత్రమేనని తెలుస్తోంది. -
టీడీపీలో ఇసుక దుమారం?
సాక్షి, రాజమహేంద్రవరం : నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజమహేంద్రవరంలో ఇప్పుడు ఇసుక తుపాను చెలరేగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చీరావడంతో ఆ పార్టీల నేతలు ఇసుక మీద పడ్డారు. వర్షాకాలం పురస్కరించుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందస్తుగా నిల్వ ఉంచిన ఇసుకను ఊడ్చేశారు. ఇప్పుడిదే వారి మధ్య వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఓ జనసేన నేత అత్యుత్సాహం రాజమహేంద్రవరంలోని ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. నగర రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఇసుక బాగోతం కథాకమామిషు ఏంటంటే.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య ఈ ఇసుక దుమారం రేగింది. గోరంట్లకు అనుచరుడిగా పేరుగాంచిన ఓ జనసేన నేత ఇసుక వ్యాపారమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు ఇసుక దందాకు తెరలేపారు. ఇందులో భాగంగా.. గోదావరి వరదల సమయంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా ర్యాంపుల్లో నిల్వ ఉంచిన ఇసుకను ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు ఆ గుట్టలు మింగేశారు. రాత్రి, పగలు అన్న తేడాలేకుండా అక్రమంగా తరలించి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ పరిధిలోని గ్రాయత్రి–1, 2, 3, 4, 5 పేర్లతో ఉన్న ఇసుక ర్యాంపుల్లోని నిల్వలను ఆ నియోజకకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా బుచ్చయ్య అనుచరుడైన ఓ జనసేన నేత ఇసుక మొత్తం ఊడ్చేశాడు. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో అధికారులు అటువైపు వెళ్లేందుకు కూడా సాహసించలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ నేత రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలోని కోటిలింగాల ర్యాంపులపై కూడా కన్నేశాడు. పరిస్థితులు అనుకూలంగా ఉండటం.. నూతన ఇసుక పాలసీ త్వరలో రానుండటంతో ముందుగానే తరలించేయాలన్న ఆలోచనతో దానిని ఎడాపెడా తరలించేసి అమ్మేశారు. ఇలా రూరల్, సిటీ నియోజకవర్గాల పరిధిలో నిల్వ ఉన్న సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ఇసుక కొల్లగొట్టినట్లు సమాచారం. దోపిడీ చేసిన సొమ్ములో తన గురువుకు కొంత లాభం చేకూర్చినట్లు తెలిసింది. సిటీ ఎమ్మెల్యే తండ్రి సీరియస్.. ఇదిలా ఉంటే.. ఈ విషయం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దృష్టికి వెళ్లడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తమ ఇలాకాలో తమకు తెలీకుండా ఇసుక తరలించుకుపోవడంపై అవాక్కయ్యారు. అదీ తన విరోధి బుచ్చయ్యచౌదరి అనుచరుడని తేలడంతో మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న నిల్వలకు సంబంధించిన నగదు తనకివ్వాలని సదరు నేతకు కబురు పంపినట్లు సమాచారం. ఆ నేత నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై అప్పారావు కారాలు మిరియాలు నూరుతున్నారు. అలాగని ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే కూటమిలో భాగమైన జనసేన నేత కావడం, పార్టీ పెద్దలకు మరో రకమైన సంకేతాలు వెళ్తాయని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అధికారులపై చిందులు? మరోవైపు.. ఇసుక తరలించేస్తుంటే ‘మీరేం చేస్తున్నారు? అడ్డుకోవాలి కదా..’ అంటూ ఆదిరెడ్డి అప్పారావు మైనింగ్ అధికారులపై చిందులేసినట్లు తెలిసింది. రాజమండ్రి సిటీ పరిధిలో ఒక్క ఇసుక రేణువు తీసుకెళ్లాలన్నా తన అనుమతి ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో ఏమీ చెప్పలేక అధికారులు మిన్నకుండిపోయారు. ఇసుక తరలించిన వ్యక్తి కూటమి నేత కావడం, ఆయన్ను ఏమీ అనలేక తమపై రుబాబు చూపడంపట్ల అధికారుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
రామాపురంలో టీడీపీ నేత ఇసుక తవ్వకం
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం రామాపురంలో టీడీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలు మళ్లీ మొదలుపెట్టారు. పార్టీ నాయకుడు పెన్నానది పరిధిలో ఏర్పాటుచేసిన ఇసుక డంప్‌పై ఆదివారం బ్లూకోట్ పోలీసులు దాడి చేశారు. పెన్నానదిలో జేసీబీ ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్లను వెంబడించడంతోపాటు పెన్నానదిలోకి వెళ్లారు.టీడీపీ అధికారంలోకి వచి్చన వారం రోజుల్లోనే ప్రొద్దుటూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుక అక్రమ తవ్వకాలు మొదలుపెట్టారు. పలు గ్రామాల్లో ఇసుక తవ్వుతుండటంతో రెవెన్యూ అధికారులు పెన్నానది పరిసర ప్రాంతాల్లో గోతులు తవ్వారు. దీంతో వారం రోజులుగా ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రామాపురం వద్ద ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. చాలాకాలంగా రామాపురానికి ఇసుక అక్రమ తవ్వకాల అడ్డాగా పేరుంది. గతంలో గ్రామ టీడీపీ నేతలు ఏకంగా తహసీల్దార్ భాస్కర్‌రెడ్డిని నడిరోడ్డుపై బెదిరించారు. -
మేడిగడ్డలో సిరుల మేట!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ‘మేడిగడ్డ బ్యారేజీ’ రాష్ట్ర ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిపించబోతోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మేటలు బయట పడ్డాయి. దీంతో వీటిని తవ్వి ఇసుకను విక్రయించడం ద్వారా భారీఎత్తున ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మేడిగడ్డలో బయటపడిన ఇసుక నిల్వల ద్వారా ఖజానాకు రూ.800 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశమున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తొలిదశలో రూ.380 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకునేలా 14 బ్లాక్‌లను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)కు అప్పగించారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్ల షెడ్యూల్‌ను ప్రకటించిన టీజీఎండీసీ జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే మరిన్ని బ్లాక్‌ల నుంచి ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ ఇసుక లభ్యతపై ఇప్పటికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు (డీఎల్ఎస్సీ) ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇసుక వెలికితీతకు ఇతరత్రా ఎలాంటి ఆటంకాలు లేకుంటే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని టీజీఎండీసీ లెక్కలు వేస్తోంది. వెలికితీతకు 18–24 నెలల గడువు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద సుమారు రూ.800 కోట్ల విలువైన సుమారు 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక మేట వేసినట్లు డీఎల్ఎస్సీ గుర్తించింది. అయితే ప్రస్తుతానికి రూ.380 కోట్ల విలువైన 92.77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక వెలికితీత సాధ్యమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇసుక వెలికితీత, స్టాక్ యార్డుకు చేరవేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ‘ఇ ప్రొక్యూర్మెంట్ టెండర్’ ద్వారా టీజీఎండీసీ కాంట్రాక్టర్లను ఎంపిక చేయనుంది. ఈ నెల 25 వరకు టెండర్లు స్వీకరించి, వచ్చే నెల 3న తెరిచేలా సంస్థ ఇప్పటికే టెండర్ షెడ్యూల్‌ను ప్రకటించింది. మహదేవ్పూర్ మండలంలోని 14 బ్లాక్‌ల నుంచి ఇసుకను వెలికితీస్తారు. బెగ్లూరు, ఎలే్కశ్వరం, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్ పరిధిలో ఈ బ్లాక్‌లు ఉన్నాయి. గోదావరి నదికి ఎగువ నుంచి వచ్చే వరద, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇసుక వెలికితీతకు 18 నుంచి 24 నెలల గడువును టీజీఎండీసీ నిర్దేశించింది. అన్నారం, సుందిళ్ల ఇసుకతో రూ.500 కోట్ల ఆదాయం! మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఉన్న ఇసుక మేటల పరిమాణాన్ని గుర్తించడంపై డీఎల్ఎస్సీలు దృష్టి సారించాయి. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఎల్ఎస్సీ సభ్యులుగా ఉన్న రెవెన్యూ, పంచాయతీ, భూగర్భ జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, భూగర్భ వనరుల విభాగాలకు చెందిన అధికారులు ఇప్పటికే ఈ బ్యారేజీలను సందర్శించినట్లు సమాచారం. రెండు బ్యారేజీల్లోని ఇసుకతో మరో రూ.500 కోట్ల ఆదాయం లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డీఎల్ఎస్సీల నుంచి నివేదికలు అందిన తర్వాత వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి. -
బ్యూటీఫుల్ ఫాదర్ అండ్ డాటర్
ఆటవిడుపులో భాగంగా సెలబ్రిటీలు కుటుంబంతో గడిపే సంతోష సమయాలు వారికి మాత్రమే పరిమితమైనవి కాదు. అభిమానులకు కూడా సంతోషం కలిగిస్తాయి. ‘క్రికెటర్‌గా రోహిత్‌శర్మ ఏమిటి?’ అని చెప్పడానికి బోలెడు సమాచారం ఉంది. ‘తండ్రిగా రోహిత్ ఏమిటి?’ అని చెప్పడానికి ఈ వైరల్ ఫొటో ఒక్కటి చాలు. ‘ఫాదర్స్ డే’ సందర్బంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సముద్రపు ఒడ్డున తన కూతురు సమైరతో కలిసి రోహిత్‌శర్మ ఇసుకలో పిచ్చుక గూడు కడుతున్న ఫొటో ‘ఆహా’ అనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘ఫ్యామిలీ టైమ్ ఈజ్ ది బెస్ట్ టైమ్’ అని కాప్షన్ ఇచ్చారు నెటిజనులు.‘ది ఫాదర్, ది కెప్టెన్, ది హిట్‌మ్యాన్, ది భయ్యా, ది ఓపెనర్’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.మరో యూజర్ ‘బ్యూటీఫుల్ డాటర్ అండ్ ఫాదర్. లవ్ యూ మై మ్యాన్’ అని కామెంట్ పెట్టాడు. -
ఇసుక వాహనాలపై టార్పాలిన్ కవర్ తప్పనిసరి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనంపైనా టార్పాలిన్ కవర్ కప్పడాన్ని హైకోర్టు తప్పనిసరి చేసింది. ఇసుక రవాణా సమయంలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం, రోడ్లపై సంచరించే పాదచారులు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నివారణకు హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమ ఇన్ఫ్రా లిమిటెడ్, వారి అసైనీలను ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధించాలి, ఇసుక రవాణా చేయాల్సిన సమయాలను తదుపరి విచారణలో తేలుస్తామని తెలిపింది. జరిమానా విషయంలో అడ్వొకేట్ జనరల్, కోర్టు సహాయకారి సలహాలు ఇవ్వొచ్చునంది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. టార్పాలిన్ కవర్ విషయంలో తాము కూడా లీజుదారులకు తగిన ఆదేశాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. ఇసుక రవాణా విషయంలో హైకోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటిస్తామని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాల విషయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కే వదిలేయాలని ఏజీ శ్రీరామ్, అమికస్ క్యూరీ నోర్మా అల్వరీస్ విన్నవించారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, ఇసుక విషయంలో మరికొన్ని అంశాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇసుక రవాణాకు వేళలు నిర్ణయించాల్సిన అవసరం ఉందని అమికస్ క్యూరీ తెలిపారు. రవాణా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిలను పర్యవేక్షించి, పరిమితులను దాటితే ఆ ప్రాంతాల్లో ఇసుక వాహనాల రాకపోకలను తగ్గించాలని, అవసరమైతే రవాణా మార్గాన్ని మార్చాలని సూచించారు. -
చంద్రబాబు ఉచిత ఇసుకలో ఉచితం లేదు
-
లోకేశ్ కపట ప్రేమ!
తాడేపల్లిరూరల్: ఇసుక కార్మికులపై టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ కపట ప్రేమ చూపుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్ర భుత్వ హయాంలో ఇసుక కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, భారీ యంత్రాలతో ఇసుక దోచుకుంటున్నారని ఎన్నికల వేళ పసలేని ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను అమ్ముకున్న సంఘటనలు, అడ్డుకున్న అధికారులపై జరిగిన దాడులు మరిచి, మేము అధికారంలోకి వస్తే ఇసుక, భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామంటూ హామీ లు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లోకేశ్ వ్యాఖ్యల నేపథ్యంలో 2014 నుంచి 2019 వరకు పరిణామాలను పరిశీలిస్తే... 2014కు ముందు... ఉండవల్లి ప్రకాశం బ్యారేజ్ పైభాగంలో సైతం ఇసుక కార్మికులు నీటిలోకి దిగి పారలతో ఇసుక లోడింగ్ చేసేవారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని పాతూరు, గుండిమెడ, చిర్రావూరు, గొడవర్రు, రామచంద్రాపురం, పెదకొండూరు, వీర్లపాలెం దళిత కుటుంబాలు ఇసుక ట్రాక్టర్లకు, లారీలకు లోడింగ్ చేసి, పొట్ట నింపుకునేవారు. 2014 తర్వాత అక్రమంగా హైదరాబాద్‌కు ఇసుక టీడీపీ అధికారం చేపట్టగానే ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు రేపల్లె నుంచి అచ్చంపేట వరకు మకాం వేశారు. దొరికిన కాడికి ఇసుక దోచుకుంటూ జేబులు నింపుకొన్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉన్న ఇసుక కార్మికులను ఒక్కొక్కరిని తొలగించారు. అనుమతులు లేని భారీ పడవలను దించి, వాటికి ఇసుక తోడే యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు ఒక్కొక్క ఇసుక క్వారీ నుంచి 30 వేల టన్నుల ఇసుకను హైదరాబాద్ తదితర ప్రాంతాలకు భారీ వాహనాల్లో తరలించేవారు. ఇది గమనించిన స్థానిక నాయకులు మా ప్రాంతంలో కూడా ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని తలచారు. అంతే... భారీ యంత్రాలతో దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి గుంటూరు ఎమ్మెల్యే సోదరుడిది కీలక పాత్ర ఈ దోపిడీలో అప్పటి గుంటూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, నారా లోకేశ్ మిత్రుడు కీలక పాత్ర పోషించారు. చినబాబుకు సైతం భారీగా సొమ్ములు పంపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాతూరు, గుండిమెడ ఇసుక రీచ్‌లో కార్మికులను పోలీసులతో బెదిరించి మరీ బయటకు పంపివేశారు. చిర్రావూరులో కొంతకాలం అక్కడి కార్మికులకు పని కల్పించారు. తర్వాత భారీ వాహనాల్లో ఇసుకను బయటకు తరలించాలంటే కార్మికుల వల్ల కాదని తాత్కాలికంగా మూడు రోజులపాటు క్వారీని నిలుపుదల చేశారు. అనంతరం 200 యంత్రాలు తీసుకువచ్చి ఇసుక లోడింగ్ నిర్వహించారు. దీంతో కార్మికులకు ఉపాధి కరవైంది. అధికారులను బెదిరించి... ఇసుక రీచ్‌ల్లో అధికారులు యంత్రాలకు అనుమతులు ఇవ్వనప్పటికీ వారిని భయభ్రాంతులకు గురిచేసి భారీగా తవ్వకాలు చేపట్టారు. అనుమతులకు మించి తవ్వకాలు వల్ల ఆ గుంతల్లో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వీటిని మూసివేయాలని పాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులచేత బెదిరించి, ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిపారని నేటికీ కార్మికులు చెబుతున్నారు. -
ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!
ఇల్లు కట్టాలంటే ముందుగా చేతినిండా దండిగా డబ్బు ఉండాలి. అప్పుడే కలల ఇంటిని నిర్మించగలం. దీనికి సిమ్మెంట్, ఇటుక, ఇసుక తదితరాలు లేకుండా ఇంటి నిర్మాణమే మొదలవ్వదు. నిజానికి ఇప్పుడు, సిమ్మెంట్, ఇటుకలు ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో మనకు తెలిసిందే. ఇక అందులో ఇసుకను కొనడం ఒక ఎత్తు తరలించేందుకు మరింత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఓ ఇంటి నిర్మాణానికి చాలా ఇసుక కావాల్సి ఉంటుంది. అలా ఇసుకు అవసరమే లేకుండా ఇల్లునే కట్టేయొచ్చట. ఎలాగంటే.. సహజ ఇసుకకు బదులుగా నిర్మాణాలకు ఉపయోగపడేలా ఓ సరికొత్త మెటీరియల్‌ను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు నిర్మాణాలకు అవసరమయ్యే సహజ ఇసుక స్థానంలో కొత్త మెటీరియల్‌ను రూపొందించారు. నిర్మాణ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఇసుక కొరత కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ (సీఎస్టీ)లోని ఒక బృందం పారిశ్రామిక వ్యర్థ వాయువులలో సేకరించిన కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉపయోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది. తవ్విన మట్టి, నిర్మాణ వ్యర్థాలను కార్బన్ డయాక్సైడ్తో శుద్ధి చేసి ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని నిర్థారించారు. ఈ కొత్త మెటీరియల్ నిర్మాణాల కారణంగా ఏర్పడే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి, నిర్మాణ నాణ్యతను మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ప్రిఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సౌరదీప్ గుప్తా పేర్కొన్నారు. సాధారణంగా నిర్మాణ రంగాల్లో మట్టికి కార్బన్ డయాక్సైడ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇసుక బదులుగా వాడే ఈ ప్రత్యేక మెటీరియల్ సిమెంట్, సున్నం మధ్య చర్యను మెరుగుపరుస్తుంది. ఈ ఆవిష్కరణ విజయంవంతం అయితే.. ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఇసుక, కంకర, చువ్వ వీటికే లక్షలు ఖర్చు అవుతాయి.. పైగా రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించాలంటే కనీసం 30 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. ఈ ఆవిష్కరణతో ఇసుకకు ప్రత్యామ్నాయం వస్తే ఖర్చు తడిసిమోపడవ్వడం తగ్గుతుంది. ఎకో ఫ్రెండ్లీగా మంచి ఇంటిని నిర్మించుకోవచ్చు కూడా. (చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!) -
ఇసుక కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలోనూ వెసులుబాటు.. తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది. ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. -
ఇసుక తవ్వకాలపై..తప్పుడు రాతలు
-
డేంజర్ లోడ్స్!
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణ రహదారి భద్రతకు సవాల్‌గా మారింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఇసుకలారీలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఓవర్‌లోడ్‌తో వచ్చే లారీల వల్ల రహదారులు సైతం ధ్వంసమవుతున్నాయి. ప్రతి రోజు సుమారు 5 వేల లారీలు వివిధ జిల్లాల నుంచి నగరానికి భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నాయి. ఈ క్రమంలో మోటారు వాహన నిబంధనలకు బేఖాతరు చేస్తూ యధేచ్చగా పరిమితికి మించిన బరువుతో రోడ్లపైకి వస్తున్నట్లు రవాణాశాఖ గుర్తించింది.కృష్ణా,గోదావరి, తదితర పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలించే క్రమంలోనే కచి్చతమైన పరిమితిని విధించే అవకాశం ఉన్నప్పటికీ చాలా వరకు తూకం వేయకుండానే రోడ్డెక్కుతున్నాయి. కొన్ని లారీల్లో 25 టన్నుల వరకే అనుమతి ఉండగా అందుకు విరుద్దంగా 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. 35 టన్నుల ఇసుక రవాణాకు అవకాశం ఉన్న 16 టైర్ల లారీల్లో ఏకంగా 45 టన్నులకు పైగా ఇసుకను తరలిస్తున్నట్లు అంచనా. ఓవర్‌లోడ్..చీకట్లో స్పీడ్ ఇలా ఓవర్‌లోడ్‌తో వచ్చే భారీ వాహనాల వల్ల తరచుగా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఇసుక లారీలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు రవాణా అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారు జామున సిటీకి వచ్చే క్రమంలో ఓవర్‌లోడ్ లారీలను డ్రైవర్లు అదుపు చేయలేకపోతున్నారు. వేగాన్ని నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇక ఓవర్‌లోడ్ వచ్చే వాహనాలను కట్టడి చేసేందుకు గ్రేటర్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. తూకంలోనే మోసం... హైదరాబాద్‌లో భవననిర్మాణ రంగానికి ప్రతి రోజు వేల టన్నుల ఇసుకను వినియోగిస్తున్నారు.నదీతీరాల్లో లభించే సన్న ఇసుకకు నగరంలో ఎంతో డిమాండ్ ఉంది.దీంతో కృష్ణా,గోదావరి పరీవాహాక ప్రాంతాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, తదితర ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద మొత్తంలో ఇసుక తరలివస్తుంది.అలాగే విజయవాడ నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుకను లారీల్లో నింపిన తరువాత క్వారీల్లోనే తూకం వేయవలసి ఉంటుంది. కానీ చాలా వరకు క్వారీల్లో కాంటాలు అందుబాటులో లేకపోవడం వల్ల పెద్దమొత్తంలో ఇసుకను నింపేస్తున్నారు. నిర్ధేశించిన బరువుపైన 5 శాతం వరకు అదనంగా తెచ్చేందుకు ఆర్టీఏ అనుమతిస్తుంది.ఉదాహరణకు 25టన్నులకు అవకాశం ఉన్న లారీల్లో మరో ఒకటిన్నర టన్ను అదనంగా తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొందరు వాహన యజమానులు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకటిన్నర టన్నుకు బదులు 10 టన్నులకు పైగా అదనంగా నింపేసి తరలిస్తున్నారు. క్వారీలు దాటిన 20 కిలోమీటర్ల దూరంలో కాంటాలు ఉంటాయి. కానీ ఇక్కడి వరకు వచి్చన లారీల్లో ఓవర్‌లోడ్‌ను తొలగించకుండా ఏదో ఒకవిధంగా కాంటాల నిర్వాహకులతో కుమ్మౖMð్క తప్పుడు తూకం లెక్కలతో రోడ్లపైకి వస్తున్నారు. ఇలా ఓవర్‌లోడ్‌తో వచ్చే వాహనాలను చెక్‌పోస్టుల వద్ద నిలిపేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొందరు మోటారు వాహన ఇన్స్పెక్టర్లు ఇసుక వ్యాపారాల నుంచి ప్రతి లారీకి కొంత మొత్తంగా వసూలు చేసుకొని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘ఆరీ్టఏ అధికారులు బడా వ్యాపారులను వదిలేసి నిబంధనల మేరకు ఇసుకను తెచ్చే చిన్న వ్యాపారులు, లారీ డ్రైవర్లపైన మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నారని’ పలువురు వాహనయజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్.. వివిధ దశల్లో ఏదో ఒక విధంగా తనిఖీలను తప్పించుకొని నగరానికి చేరుకొనే ఓవర్‌లోడ్ ఇసుక లారీలపైన ఆర్టీఏ ప్రస్తుత స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పరిమితికి మించిన బరువుతో నగరానికి వచ్చే లారీలపైన తనిఖీలను ప్రారంభించారు.సోమవారం ఒక్క రోజే 19 వాహనాలపైన కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు జేటీసీ రమేష్ తెలిపారు.ఓవర్‌లోడ్ వాహనాలపైన తనిఖీలను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.క్వారీల్లోంచి ఇసుకను నింపే సమయంలోనే మోటారు వాహన నిబంధనలకనుగుణంగా నింపాల్సి ఉంటుందన్నారు. -
బాబుకి ముందస్తు: ఆ మూడు కేసుల్లో జరిగింది ఇదే!
గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అన్ని కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం మధ్యాహ్నాం తీర్పు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి రాష్ట్ర నేర దర్యాప్తు సంస్థ(సీఐడీ) చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇసుకను అలా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్‌ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్‌ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
fact check: మేలెంచినా కీడెంచుతారా!?
సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపాటిగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా? రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది. ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..! పేదలకు మేలు జరుగుతుంది.. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ రుసుం, డీఎంఎఫ్, మెరిట్ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు.. ప్రతి ఖరీఫ్ సీజన్‌కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు. ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది? ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది. ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీలు, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు ఊహించని షాక్
-
సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోగల సొరంగంలో కూలీలు చిక్కుకుపోయి నేటికి (బుధవారం) సరిగ్గా 11 రోజులు అయ్యింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఈ సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ నేపధ్యంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. బాధిత కార్మికులను రక్షించేందుకు ఓన్జీసీ, ఎస్జేవీఎన్ఎల్, ఆర్వీఎన్ల్, ఎన్‌హెచ్‌డీసీఎల్ బృందాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశాలోని పూరీ నగరానికి చెందిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రత, రక్షణను కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. దీనికి ప్రతిగా ఇసుకతో ఒక కళాఖండాన్ని రూపొందించారు. సొరంగంలో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యత అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు.. #WATCH पुरी, ओडिशा: रेत कलाकार सुदर्शन पटनायक ने उत्तरकाशी में सुरंग में फंसे श्रमिकों की सुरक्षा और बचाव के लिए प्रार्थना करने के लिए रेत से एक कलाकृति बनाई। (21.11) pic.twitter.com/YSmCnML9ZY — ANI_HindiNews (@AHindinews) November 22, 2023 -
రాజకీయంగా బురద జల్లేందుకే ఇసుకపై అసత్య కథనం
-
కేబినెట్ కళ్లుగప్పి ఖజానాకు కన్నం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి బరి తెగించిన మాజీ సీఎం చంద్రబాబు ఉచిత విధానం ముసుగులో నిర్భీతిగా అన్ని విధి విధానాలను ఉల్లంఘించారు. ఒకపక్క ఇసుక ఉచితమంటూనే మరోపక్క అక్రమ తవ్వకాలకు భారీ జరిమానాలంటూ మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతోపాటు కేబినెట్‌ను చీకట్లో ఉంచి మరీ దోపిడీకి తెరతీశారు. కేబినెట్ ఆమోదం లేకుండా మొదట ఓ మెమో.. తరువాత జీవో ద్వారా ఇసుక దందాకు తెగబడ్డారు. ఇప్పుడు పారదర్శకంగా ఇసుక తవ్వకాలను నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రెండేళ్లలో దాదాపు రూ.770 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అంటే గత సర్కారు హయాంలో దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి ఖజానాకు చంద్రబాబు గండి కొట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆ ఆదాయం అంతా పచ్చ ముఠాలకు చేరిపోయింది. అంతేకాకుండా ఉచితం ముసుగులో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. వీటిని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణా రహితంగా దాడులకు బరి తెగించారు. స్వయంగా నాటి సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం పక్కనే ఇష్టారాజ్యంగా ఇసుక లూటీ జరుగుతున్నా కళ్లు మూసుకుని కూర్చోవడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా తప్పుబడుతూ భారీ జరిమానా సైతం విధించింది. రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని ఆక్షేపించినా చంద్రబాబు చలించలేదు. ఈ ఇసుక దోపిడీ కేసులో సీఐడీ తీగ లాగుతుంటే పచ్చ ముఠాల డొంక కదులుతోంది. ఆది నుంచి కన్ను 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక రీచ్‌లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించినట్లు చంద్రబాబు కథ నడిపారు. మహిళా సమాఖ్యల ముసుగులో రెండేళ్ల పాటు భారీగా ఇసుక కొల్లగొట్టినా ఆయన సంతృప్తి చెందలేదు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు 2016లో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రీచ్‌లను వేలం వేసి ఇసుక విధానాన్ని రూపొందించారు. ఈమేరకు కేబినెట్ తీర్మానం చేసి 2016 జనవరి 1న జీవో 19 ఇవ్వగా అదే ఏడాది జనవరి 15న జీవో 20 వెలువడింది. ఈ విధానం ద్వారా కూడా మిగిలిన మూడేళ్లలో తాను ఆశించిన మేరకు ఇసుక దోపిడీ సాధ్యం కాదని భావించిన చంద్రబాబు రెండు నెలల్లోనే టెండర్ల ద్వారా ఇసుక రీచ్ కేటాయింపు విధానాన్ని పక్కన పెట్టేశారు. పచ్చ ముఠాలకే ఉచితం రాష్ట్రంలో ఇసుకను ప్రజలందరికీ ఉచితంగా ఇస్తున్నట్లు చంద్రబాబు నమ్మబలికారు. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండా జారీ చేసిన మెమో 3066, జీవో 43 మధ్యలో మరో జీవో కూడా తెచ్చారు. 2016 మార్చి 14న జారీ చేసిన ఆ జీవో ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు భారీ జరిమానాలను నిర్దేశించారు. ఇసుక ఉచితం అన్నప్పుడు ఇక అక్రమ తవ్వకాలు అనే మాటే ఉత్పన్నం కాకూడదు కదా? అంటే ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు కనికట్టు చేశారన్నది స్పష్టమైంది. ఆ పేరుతో కేవలం చంద్రబాబు బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుక రీచ్‌లను గుప్పిట్లో పెట్టుకున్నారు. మూడేళ్లపాటు దోపీడికి పాల్పడ్డారు. ఇతరులు ఇసుక రీచ్‌ల జోలికి రాకుండా కట్టడి చేసేందుకే జీవో 35 తెచ్చారు. కొసమెరుపు ఏమిటంటే జీవో 35కు కూడా కేబినెట్ ఆమోదం లేదు. ఉచిత ఇసుక విధానం పేరుతో తెచ్చిన మెమో 3066, అనంతరం జారీ చేసిన జీవోలు 35, 43లకు కేబినెట్ ఆమోదం లేదన్నది నిర్ధారణ అయింది. వాటికి సంబంధించిన నోట్ ఫైళ్లు అటు ఏపీఎండీసీలోగానీ ఇటు గనుల శాఖ, జలవనరుల శాఖ కార్యాలయాల్లోగానీ లేవని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు పక్కాగా సాగించిన పన్నాగంపై పూర్తి ఆధారాలతో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేబినెట్‌ను చీకట్లో ఉంచి.. ఉచిత ఇసుక విధానంతో దోపిడీ ఎంత ఇసుక అందుబాటులో ఉంది? ఎంత తవ్వుతున్నాం? ఎంతకు అమ్ముతున్నాం? అనే ప్రాథమిక లెక్కలతో కూడా నిమిత్తం లేకుండా యథేచ్ఛగా కాజేసేందుకు ఈ విధానాన్ని తెచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలోకి తొక్కారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే కథ నడిపారు. అందుకోసం 2016 మార్చి 4న మెమో 3066 జారీ చేశారు. అది కూడా అప్పటికి రెండు రోజుల ముందు నుంచి అంటే 2016 మార్చి 2 నుంచే ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. అప్పటివరకు కేబినెట్ ఆమోదంతో అమలులో ఉన్న ఇసుక విధానాన్ని తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మెమో జారీ చేశారు. ఈ మెమోకు కేబినెట్ ఆమోదం లేదు. అంటే కేబినెట్ ఆమోదంతో రూపొందించిన విధానాన్ని పక్కనపెట్టి అడ్డదారిలో మెమో ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అక్రమంగా ఇసుక తవ్వకాలపై భారీ జరిమానాలు విధించేందుకు విధివిధానాలను నిర్దేశిస్తూ 2016లో గత సర్కారు జీవో 35 జారీ చేసింది. రెండు నెలల తరువాత అంటే 2016 ఏప్రిల్ 6న జీవో 43 వెలువరించి అప్పటివరకు మెమో ద్వారా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానానికి రాజముద్ర వేసింది. విడ్డూరం ఏమిటంటే ఆ జీవో 43కు కూడా కేబినెట్ ఆమోదం లేదు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఉచిత ఇసుక విధానాన్ని దొడ్డిదారిలో తెచ్చి ఇసుక దోపిడీకి చంద్రబాబు తెరతీశారు. చదవండి: రోత పుట్టించే రాతలు రాయడంలో పచ్చమీడియా రికార్డు -
కనీస జ్ఞానం లేకుండా రాస్తే ఎలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఇసుక గనులపై దురుద్దేశ్యంతో ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై ఆ పత్రిక ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంఓనా?’’ అంటూ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. అనుమతుల్లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థంలేని రాతలు రాయడంపై ఆయన మండిపడ్డారు. నిజానికి.. ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం ఒక పారదర్శక విధానాన్ని అమలుచేస్తోందని, దానిపై అపోహలు కలిగించేలా ఇసుక తవ్వకాలు చేసే వారు సీఎంఓ పేరు చెబుతున్నారంటూ పొంతనలేని అంశాలతో అసత్య కథనాన్ని వండివార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మళ్లీ టెండర్లు అయ్యేవరకూ జేపీనే.. గతంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు టెండర్లు నిర్వహించామని.. ఈ టెండర్లలో జేపీ సంస్థ సక్సెస్ఫుల్ బిడ్డర్‌గా ఎంపికైన విషయాన్ని వెంకటరెడ్డి గుర్తుచేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గత రెండేళ్లుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తుందన్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, అప్పటివరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయని, గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినా అవే తప్పుడు కథనాలను ప్రచురించడం ఈనాడు దురుద్దేశ్యాన్ని తెలియజేస్తోందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అభూతకల్పనలతో రాయొచ్చా?.. ఇక వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయినందున ఎండాకాలంలో జేపి సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్‌లలో నిల్వచేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే, తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సిద్ధమవుతోందని, దీన్ని వక్రీకరిస్తూ బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంఓ నుంచి తమకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు అభూత కల్పనలతో కథనాన్ని ప్రచురించడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ప్రశ్నించారు. ఇసుక ఆపరేషన్స్‌కు గనుల శాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయని.. మైనింగ్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలుసునన్నారు. అటువంటిది సీఎంఓ అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎవరైనా ఎలా చెబుతారని, ఒక్క ఈనాడుకు మాత్రమే ఇలా చెబుతున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక అంశంపై రాసే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అసత్య కథనాలను ప్రచురించడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలోని అక్రమాలు ఈనాడుకు కనిపించలేదా? గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్దఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకున్న రోజుల్లో ఈనాడుకు ఆ అక్రమాలు కనిపించలేదా అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో, వర్షాకాలంలోనూ ఇసుక కొరతలేకుండా ఇసుకను అందిస్తుంటే ఈనాడు తట్టుకోలేక తప్పుడు వార్తలను వండివారుస్తోందన్నారు. నిజానికి.. ఎలాంటి విమర్శలకు అవకాశంలేకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీరత్నగా గుర్తింపు పొందిన ఎంఎస్టీసీ ద్వారా ఇసుక టెండర్లు నిర్వహిస్తున్నామని.. ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశముందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలిలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయని.. జిల్లాకో ఇన్చార్జిని నియమించారంటూ ఈనాడు అబద్ధాలను పోగేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించిందన్నారు. ఇకనైనా ఇటువంటి తప్పుడు కథనాలను మానుకోకపోతే ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
చంద్రబాబు ఇసుక స్కాం జరిగిందిలా.. ఆ నివేదికలో ఏముంది?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మాజీ ఎమ్మెల్యేపైన ఇసుక కుంభకోణం కేసు నమోదు అవడం విశేషం. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో జరిగిన అవినీతిని ఈ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని గనుల అభివృద్ది సంస్థ అంచనా వేసింది. సీఐడీ ఆ మేరకు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తెలియచేసింది. బహుశా దీనికి కూడా 17ఎ వర్తింపచేయాలని, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేయవచ్చు. ✍️తాము ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నందున తమపై ఇసుక కేసును బనాయించారని టీడీపీ నేతలు చేస్తున్న ప్రతి విమర్శ. ఎప్పుడు అక్రమం జరిగినా అది బయటకు రావల్సిందే కదా! టీడీపీ వారు ఆరోపిస్తేనే అవినీతి, ఏపీ ప్రభుత్వ సీఐడీ కేసు నమోదు చేస్తే అది అక్రమం అని ఎలా వాదిస్తారు?. ఇసుక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా సుమారు మూడు దశాబ్దాలుగా ఉంది. 1990వ దశకం మొదట్లో సుమారు వంద కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. పంచాయతీల ద్వారా కొంత కాలం, ఆ తర్వాత కేవలం ఎడ్ల బండ్ల మీద తీసుకువెళ్లేవారికే ఉచితం అని కొంత కాలం ఇలా పలు విధానాలు అమలు జరిగాయి. కాని అప్పట్లో ఇసుకలో ఇంత అవినీతి సొమ్ము ఉందని ఊహించలేకపోయారు. ✍️2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు జరిగేవి. చంద్రబాబు వచ్చాక అందులో పలు మార్పులు చేశారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు ఈ రీచ్‌లు అప్పగిస్తున్నామని, తద్వారా వారికి ఇది ఉపయోగం అవుతుందని ఆయన ప్రకటించారు. నిజంగానే ఇది మహిళోద్దరణమోనని అనుకున్నారు. తీరా చూస్తే మహిళా సంఘాలను అడ్డుపెట్టుకుని అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఇసుకపై అక్రమ సంపాదనకు అది ఒక మార్గం మార్చారన్న సంగతిగా తేలింది. ఈ సంఘాల మహిళలకు కొద్దిపాటి డబ్బు ముట్టచెప్పి, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా ఇసుకను తరలించి అమ్ముకునేవారు. ఒకే చలాన్ పై అనేక మార్లు లారీలను తిప్పడం, తదితర అవకతవకలకు పాల్పడేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ✍️కారణం ఏమోకాని, ఈ పద్దతి కన్నా అసలు ఇసుక ఉచితం అని చెబితే టీడీపీ నేతలకు ఎక్కువ లాభం అనుకున్నారేమో తెలియదు కాని ఉచిత విధానం తెచ్చారు. దీనికి మంత్రివర్గ ఆమోదం లేకపోవడం కూడా గమనించాలి. పోనీ చిత్తశుద్దితో దానిని అమలు చేశారా అంటే అదీ లేదు. ఇక పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి కలిగిన టీడీపీ నేతల ఇష్టారాజ్యం అయిపోయింది. వారు ఎక్కడ కావాలంటే అక్కడ తవ్వడం, అమ్ముకోవడం చేశారు. చివరికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగేవి. ✍️నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. ఉచిత ఇసుకలో దందా జరిగిందనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై పాతికవేల కోట్ల అక్రమాలు జరిగాయంటూ దావాలు కూడా వేశారు. తర్వాత అవి ఏమయ్యాయోకాని, ఆయన మాత్రం తదుపరి టీడీపీ మద్దతుదారుగా మారారు బహుశా. ఆ శ్రవణ్ కుమారే అనుకుంటా! కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని అప్పట్లో ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని ఆ సంస్థ తన నివేదికలో కూడా తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తే దానిపై కూడా కేసు పెడతారా అని టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా సంస్థలు ప్రశ్నించాయి. ✍️ఈనాడు అయితే జగన్ ప్రభుత్వంపై వేల కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసేసింది. ఇక్కడ సంగతి ఏమిటంటే చంద్రబాబు ఉచితం ఇసుక విధానం తెచ్చినందుకు కేసు పెట్టలేదు. ఆ పేరుతో ఇసుక దందా చేసినందుకు, వందల కోట్ల అక్రమార్జన చేసినందుకు అని గుర్తుంచుకోవాలి. అప్పట్లో ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు ఆమెపై దౌర్జన్యం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆ సందర్భంలో చింతమనేనిని కాకుండా వనజాక్షినే చంద్రబాబు మందలించడం కూడా విమర్శలకు గురైంది. ✍️అంతేకాదు. ఒకసారి ఈనాడు పత్రికలోనే ఏ ఏ టీడీపీ ఎమ్మెల్యే ఇసుక రీచ్‌లను ఎలా దోచుకుంటున్నారో వివరిస్తూ ఒక కథనాన్ని ఇచ్చింది. కాకపోతే లోపలి పేజీలో ఆ ఎమ్మెల్యేల పేర్లు రాయకుండా స్టోరీ ప్రచురించారు. బహుశా ఆయా ఎమ్మెల్యేలను బెదిరించడానికి అయి ఉండవచ్చు. ఇసుక దోపిడీ పై ప్రస్తుతం సీఐడి పెట్టిన కేసు వివరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి, జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికే ఈనాడు, తదితర టీడీపీ మీడియాలు ప్రయత్నించాయి. కొద్ది రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జగన్ ప్రభుత్వంపై ఇసుక దోపిడీ అంటూ ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ఇసుకకు సంబంధించి ఒక నిర్దిష్ట విధానం తెచ్చి ఏడాదికి 750 కోట్ల మేర ఆదాయం సమకూర్చింది. అయినా అవినీతి జరిగిందని చెబుతున్నవారు గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన దందా గురించి ఎందుకు ప్రశ్నించడం లేదో తెలియదు. చదవండి: పురందేశ్వరి గారూ.. మీది వెన్నుపోటు రాజకీయమా?’ ✍️అసలు సీఐడీ కేసులు పెట్టడమే తప్పని వీరు వాదించడం ఆరంభించారు. మరి అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై టీడీపీ నేతలు, వారి అంతేవాసులు నిత్యం కోర్టులకు వెళ్లి ఎందుకు కేసులు వేస్తున్నారు?. వైసీపీ అసమ్మతి ఎంపీని అడ్డం పెట్టుకుని ఏకంగా జగన్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరుతూ పిల్ ఎలా వేశారు. అలా చేయడం రైట్ అయినప్పుడు ఇప్పుడు ఏపీ సీఐడీ వారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా కేసులు వేయడం ఎలా తప్పు అవుతుంది?టీడీపీ కాని, ఈనాడు వంటి మీడియా సంస్థలు కాని పరస్పర విరుద్దంగా వ్యవహరిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నాయని పదే, పదే రుజువు చేసుకుంటున్నాయి. ✍️గత ప్రభుత్వంలో ఇసుకకు సంబంధించి వేల కోట్ల అవినీతి జరిగిందన్నది పచ్చి నిజం. టీడీపీ హయాంలో వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని కేసు పెట్టారు. దానిని రుజువు చేయడానికి సీఐడీ ఎలాంటి ఆధారాలు చూపుతుందన్నది చూడాలి. అవినీతి జరగడం వేరు. దానిని కోర్టులలో రుజువు చేయడం వేరు. ఏది ఏమైనా ఇప్పటికే పలు అవినీతి కేసులలో కూరుకుపోయిన చంద్రబాబు నాయుడిని ఈ అవినీతి ఇసుక ఎలా కప్పివేస్తుందో, దానిని ఆయన ఎలా కడుక్కుంటారో వేచి చూడాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం
సాక్షి, అమరావతి : పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం ద్వారా స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందని శ్రావణ్‌కుమార్ అనే న్యాయవాది తమ దృష్టికి తెచ్చిన అంశాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రజల ఆస్తి అయిన సహజ వనరులను ధర్మకర్తలా పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర వహించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సహజ వనరులపై ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయనే అంశాన్ని గుర్తుచేసింది. ప్రజలకు సమాన హక్కులు ఉన్న సహజ వనరులను కొందరు పెద్దల ముఠాకే దోచిపెట్టడం సమానత్వం సిద్ధాంతాన్ని అవహేళన చేయడమేనని స్పష్టంచేసింది. ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తవ్వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని అప్పట్లో ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం ద్వారా పర్యావరణం దెబ్బతిన్నదని.. దానివల్ల ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ప్రజల హక్కులను ఇసుక స్మగ్లర్లు కాలరాస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమిటని నాటి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని 2019, ఏప్రిల్ 4న అల్టిమేటం జారీచేసింది. మహిళా సంఘాల ముసుగులో దోపిడీ.. నిజానికి.. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇసుక రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అప్పగిస్తూ తొలుత ప్రకటించింది. మహిళా సంఘాల ముసుగులో ముఖ్యనేత దన్నుతో టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్‌లను హస్తగతం చేసుకుని.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2016, మార్చి 4న ఆ విధానాన్ని రద్దుచేసి.. ఉచిత ఇసుక ముసుగులో తమ ముఠా దోపిడీకి అప్పటి సీఎం చంద్రబాబు రాచబాట వేశారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ జారీచేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో ప్రకాశం బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా నదీ గర్భంలో భారీ పొక్లెయిన్లు, మర పడవలు ఏర్పాటుచేశారు. తద్వారా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు మార్కెట్లో విక్రయించిన ముఠా పెద్దఎత్తున అక్రమార్జన సాగించింది. దీనిపై 2016లోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2017, ఫిబ్రవరి 23న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. అయినా.. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 2019 జనవరి 17–18న చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టంచేసింది. ‘‘సహజ వనరులు ప్రజల ఆస్తులు. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరించాలి. నియంత్రణ లేకుండా ఇసుకను తవ్వి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం అవివేకమైన చర్య. ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేయడంవల్ల పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగింది. ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించిన వారి నుంచి పరిహారాన్ని వసూలుచేసి.. దానితో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వం బాధ్యత’’. – 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేసిన వ్యాఖ్య. -
చంద్రబాబు ముఠా రూ.10 వేల కోట్ల దోపిడీపై మరో కేసు
-
బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు!
నిర్మాణ రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన భవనాలు ఈ రోజుకీ పురుడుపోసుకుంటున్నాయి. ఇలాంటి భవనాలు లేదా నగరాల నిర్మాణానికి కావాల్సిన ప్రధానమైన ముడిపదార్ధాలు సిమెంట్, ఉక్కు (స్టీల్), ఇసుక. 2020లో ప్రపంచంలో ఈ ముడిపదార్ధాల ఉత్పత్తి ఎంత? ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిమెంట్ అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 2020లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసిన దేశాల జాబితాలో చైనా (2200 మిలియన్ టన్నులు) అగ్ర స్థానంలో, రెండవ స్థానంలో భారత్ (340 మిలియన్ టన్నులు) నిలిచాయి. చివరి స్థానంలో సౌత్ కొరియా మొదలైన దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సిమెంట్ ఉత్పత్తి 2020లో 4.1 బిలియన్ టన్నులు. ప్రపంచలోని అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన సిమెంటుతో ఒక దిమ్మె నిర్మిస్తే.. అది 1,195 మీటర్ల పొడవు, 1.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు ఏకంగా 4.1 బిలియన్ టన్నులు ఉంటుంది. ఈ దిమ్మె పొడవు బుర్జ్ ఖలీఫా కంటే 365 మీటర్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సిమెంట్ తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలవుతుంది, అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కాంక్రీట్ ఉత్పత్తిలో అధిక కార్బన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, స్వీడిష్ పవర్ కంపెనీ వాటెన్ఫాల్ ఓ ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా CO2 ఉద్గారాలు బాగా తగ్గుతాయి. ఉక్కు (స్టీల్) సిమెంట్ తరువాత నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన లోహం ఉక్కు. 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి మొత్తం 180 కోట్ల టన్నుల బరువైన ఉక్కుని ఉత్పత్తి చేశాయి. అంతకు ముందు 1900 నుంచి ఉక్కు పరిశ్రమ 2500 కోట్ల టన్నుల స్టీల్ స్క్రాప్‌ను రీసైకిల్ చేసింది. దీని వల్ల 3500 కోట్ల టన్నుల ఇనుము వినియోగం, 1800 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గింది. ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి అయిన ఉక్కుతో ఓ దిమ్మె నిర్మిస్తే.. అది 610 మీటర్ల ఎత్తు, 227.8 మిలియన్స్ ఘనపు మీటర్ల పరిమాణం, 180 కోట్ల టన్నుల బరువుతో నిర్మితమవుతుంది. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! రంగాల వారీగా రికవరీ రేట్లు ఇసుక నిర్మాణ రంగంలో మరో ముఖ్యమైన మెటీరియల్ ఇసుక, కంకర (చిన్న రాళ్లు). 2020లో ఉత్పత్తి అయిన ఇసుక 26.5 కోట్ల టన్నులు. ఇంత ఇసుకతో ఏకంగా 555 మీటర్ల ఎత్తు, 171 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంతో ఓ దిమ్మె నిర్మించవచ్చు. ప్రస్తుతం చాలా నగరాల్లో ఇసుక అవసరం లేకుండానే పెద్ద పెద్ద భవనాలను గాజు, ఇతర మెటీరియల్స్ ఉపయోగించి ఎంతో అందంగా నిర్మిస్తున్నారు. -
'ఇసుక' అనుమతులు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటు ధరలో ఇసుకను అందించాలని అధికారులను గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక వెలికితీతకు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న మైనింగ్, క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు తదితర అంశాలతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో గనుల శాఖ సాధించిన పురోగతిని పరిశీలించారు. ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వీలుగా పర్యావరణ అనుమతులను వేగవంతం చేయాలని.. గనులు, చిన్న తరహా మైనింగ్ లీజులపై మరింత మంచి విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. లీజులో ఉండి పని నడవని గనులను క్రియాశీలం చేయాలని, జిల్లాల వారీగా మినరల్ రెవెన్యూ పెంచాలని ఆదేశించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన 127 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడేళ్లలో ఇసుక విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,444 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. -
పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో శివనందన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) ప్రాంతంలో గోతులు పడిన ప్రదేశంలో ఇసుకతో నింపి వైబ్రో కంపాక్షన్ చేసిన పనులను ఆయన తనిఖీ చేశారు. రానున్న వరదల కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం
పోలవరం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని కేంద్రం చెబితే.. వద్దు మాకు ప్యాకేజీ చాలన్నారు చంద్రబాబు. అలా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగబోమని హామీనిచ్చేశారు. కేంద్రం సరేనని ప్యాకేజీలో భాగంగా పోలవరాన్ని అప్పగిస్తే.. రామోజీరావు వియ్యంకుడి కంపెనీ నవయుగకు ఎలాంటి టెండర్లూ లేకుండా నామినేషన్‌పై రూ.3,302 కోట్ల విలువైన పనులు కట్టబెట్టేశారు బాబు. పనిలోపనిగా యనమల రామకృష్ణుడి బావ మరిదికీ కొంత పంచారు. ఇక అందిన ప్యాకేజీలో దత్తపుత్రుడు, తోక పత్రికకు వాటా చేరిపోయింది. కాబట్టే... ఎందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వాళ్లు ప్రశ్నించలేదు. ఒక్క ఒక్కరం ముక్కా రాయలేదు. ఇదీ.. దోచుకో– పంచుకో–తినుకో అంటే! మూసేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ గానీ, నడుస్తున్న మార్గదర్శి చిట్స్ గానీ ఏ నిబంధననూ పాటించవు. కోట్లకు కోట్లు డిపాజిట్లు తీసుకున్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు క్రిమినల్ కేసులు నడుస్తుండగా.. రూ.2వేల కోట్లు ఫైన్ కట్టాల్సిన పరిస్థితుల్లో తప్పించుకునేందుకు ఏకంగా సంస్థనే మూసేశారు. ఇక చిట్స్ సంస్థ బిడ్ పాడుకున్న వాళ్లనూ ష్యూరిటీల పేరిట నెలలకు నెలలు తిప్పుతుంది. అక్రమంగా డిపాజిట్లూ తీసుకుంటోంది. ఇలా ఏం చేసినా... చంద్రబాబు ప్రశ్నించరు. ముఖ్యమంత్రిగా ఉన్నా దాని జోలికెళ్లరు. ఇది కాదూ.. డీపీటీ అంటే!! ముఖ్యమంత్రిగా షాపుర్జీపల్లోంజీ సంస్థకు వేల కోట్ల నిర్మాణ కాంట్రాక్టులు కట్టబెట్టారు నారా వారు. ఆ సంస్థను పిలిచి... పార్టీకి కాదు, మా ‘బాబు’ గారికి ఫండ్ కావాలన్నారు బాబు పీఏ శ్రీనివాస్. డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో వందల కోట్లు ప్రవహించాయి. వాటిలో కొంత రామోజీ తనయుడి వియ్యంకుడి కంపెనీకీ (ఆర్వీఆర్ ఇన్ఫ్రా) చేరాయి. అక్కడి నుంచి చంద్రబాబు జేబులోకీ కొంత మళ్లాయి. దుబాయ్‌లో ఆస్తులు కూడబెట్టిన బాబు... అక్కడా కొంత క్యాష్ తీసుకున్నారు మరి!. ఇదంతా సంబంధిత వ్యక్తులు స్వయంగా సంతకం చేసిన ఇన్‌కమ్‌ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్లోనిదే!. కానీ దీని గురించి రామోజీ, ఆయన తోకపత్రిక పెన్నెత్తితే ఒట్టు. ఇదీ.. తోడు దొంగల డీపీటీ అంటే!!. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఫైబర్‌నెట్ వరకూ దోచుకో– పంచుకో– తినుకో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన దుష్ట చతుష్టయం... ఇపుడో కొత్త రాగం ఎంచుకుంది. అధికార పారీ్టయే ఇసుక తవ్వకాల్లో ‘దోచుకో, పంచుకో, తినుకో’ అన్నట్లుగా వ్యవహరిస్తోందనే కథనాలకు దిగింది. మరి ఇందులో నిజం వీసమెత్తయినా ఉందా? బాబు హయాంలో ఇసుక విషయంలో జరిగిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఎవరి హయాంలో దోపిడీ జరిగింది? ఎవరు పంచుకున్నారు? ఎవరు తిన్నారు? ఒకసారి చూద్దాం.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. పేరుకే ఇసుక ఉచితం!!. కానీ సామాన్యులు ఒక్కరికైనా ఫ్రీగా అందితే ఒట్టు!. అంతా బాబు కనుసన్నల్లోనే. అంతా టీడీపీ నేతల చేతుల్లోనే. ఉచితం పేరిట ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాకుండా వేల కోట్లు దోచేసి.. పంచుకుతినేశారు. సామాన్యులకు ఉచితంగా ఇవ్వకుండా... ప్రభుత్వానికి కూడా రూపాయి రాకుండా ఇసుకను తవ్వేయటం దారుణమని భావించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అందుకే జాతీయస్థాయిలో టెండర్లు పిలిచారు. అలా టెండర్లు పిలిచే బాధ్యతను ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించారు. బహిరంగ టెండర్లలో ఇసుక తవ్వి, విక్రయించే కాంట్రాక్టును జయప్రకాశ్ గ్రూపునకు చెందిన ‘జేపీ పవర్ వెంచర్స్’ దక్కించుకుంది. దీనికోసం ఇది ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లించాలి. అంటే... ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు. గతంలో ఇందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాలేదు. మరి ఈ సొమ్ము ఎక్కడికి పోయింది? ప్రజలకు కూడా ఇసుక ఫ్రీగా దొరకనప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది? ఇంకెవరు... చంద్రబాబు, రామోజీ, తోకపత్రిక యజమాని, దత్తపుత్రుడు. ఈ చతుష్టయమే మొత్తం ఇసుక వ్యాపారాన్ని శాసించింది. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు కట్టిన ఇంటి వెనకాల... రాత్రీపగలూ విరామం లేకుండా ఇసుక లారీలు తిరిగేవంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు! అక్రమంగా తవ్వేస్తున్నారని, ఉచితం పేరిట తినేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అడ్డుకోబోయిన నాటి ఎమ్మార్వో వనజాక్షిని... ఏకంగా జుట్టుపట్టుకుని ఈడ్చేశాడా ఎమ్మెల్యే. అంత దారుణం జరిగినా ‘ఈనాడు’ వ్యతిరేకించలేదు. మనవాడే కదా అని కిమ్మనకుండా ఊరుకున్నారు రామోజీ, ఆయన తోక మీడియా. ఇక చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఆ ఎమ్మార్వోను పిలిచి, ఎమ్మెల్యేపై ఎలాంటి ఫిర్యాదూ చేయకుండా ‘రాజీ’ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇదీ.. బాబు, ఆయన బృందం స్థాయి. ఇసుకను ఉచితంగా ఇస్తూ రామోజీరావు చెప్పినట్లుగా చంద్రబాబు మహా యజ్ఞమే చేసి ఉంటే... ఈ దౌర్జన్యాలెందుకు? ఈ దొంగ తవ్వకాలెందుకు? ఒకవేళ ఇసుక తవ్వకాలు తమ చేతుల్లోనే ఉండాలనుకుంటే జాతీయ స్థాయి టెండర్లలో రామోజీరావు కూడా పాల్గొని ఉండొచ్చుగా? ఎందుకు పాల్గొనలేదు?!. మరి ఇప్పుడెందుకీ కడుపు మంట? తమ అక్రమాలకు ఇపుడు ఫుల్స్టాప్ పడిందనేనా? వాళ్ల జేబుల్లోకి పోయిన సొమ్ము ఇపుడు నేరుగా ప్రభుత్వానికి అందుతోందనా? ఇసుక తవ్వకాలపై మరీ పనిగట్టుకుని అపోహలు రేకెత్తించేలా తరచూ రామోజీ రాస్తున్న కథనాల్లో నిజమెంత? ఒకసారి సబ్కాంట్రాక్టరుగా టర్న్‌కీని తప్పించారంటూ బాధ!. మరోసారి టర్న్‌కీ సంస్థ దోచేస్తోందని శివాలు. ఇంకోసారి ఇసుక దొరకటం లేదని బాధ! మరోసారి ఇసుక విచ్చలవిడిగా విక్రయంచేస్తున్నారని బాధ!. వీటన్నిటి వెనకా అసలు బాధ మాత్రం... తమ డీపీటీకి అడ్డుకట్ట పడిందనే!. 2 కోట్ల టన్నుల ఇసుకతో... రూ.1800 కోట్లు ఎలా సాధ్యం? ‘ఈనాడు’ వాదన ఎంత ఘోరమంటే... రాష్ట్రంలో ఇసుకను ఎడాపెడా తవ్వేస్తున్నారని... ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని శుక్రవారంనాటి వార్తలో రామోజీ మండిపడ్డారు. కానీ అదే వార్తలో... తూర్పు గోదావరి జిల్లాను సబ్‌కాంట్రాక్టుగా తీసుకున్న వ్యక్తి... వ్యాపారం సరిగా జరగటం లేదని, తాను చెల్లించాల్సింది తగ్గించమన్నాడట. కుదరదనటంతో ఆత్మహత్య చేసుకున్నాడని కూడా రాసేశారు. ఎడాపెడా తవ్వేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నపుడు... వ్యాపారం జరగకుండా డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటుందా? ఏమనుకోవాలి రామోజీ మీ తెలివిని? మరో వాదన చూద్దాం. ఇసుకపై రూ.1800 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి రూ.765 కోట్లు కట్టి మిగిలిన సొమ్ము వైఎస్సార్సీపీ నేతలు దోచుకుంటున్నారనేది ‘ఈనాడు’ కథ. నిజానికి రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక అవసరం. దీనికి అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక టన్ను ఇసుకను ఓపెన్ రీచ్‌లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అంటే.. మొత్తంగా రూ.900 కోట్లు వస్తాయి. రాష్ట్రంలో లభ్యమయ్యే ఇసుకే 2 కోట్ల టన్నులైతే దానికి రెండు రెట్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలిసి కూడా జేపీ సంస్థ నుంచి అంతకన్నా ఎక్కువ మొత్తం చెల్లించి వైఎస్సార్ సీపీ నాయకులెందుకు సబ్‌కాంట్రాక్టులు తీసుకుంటారు? ఒకటీఅరా చోట్ల తీసుకున్నా అంత ఎక్కువ మొత్తం ఎలా చెల్లిస్తారు? ఇవన్నీ కాస్త ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే అర్థమవుతాయి కదా రామోజీ? అక్రమ రవాణాపైనా అబద్ధాలేనా? యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అబద్ధాలన్నిటినీ రాసి పారేసింది ‘ఈనాడు’. వాస్తవానికి పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీనికోసమే ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడా ఇసుక ఎక్కువ రేట్లకు విక్రయించరాదన్న ఉద్దేశంతో ప్రతి వారం పత్రికల్లో స్థానికంగా విక్రయించే రేటును ప్రకటనల రూపంలో ప్రచురిస్తోంది. అక్కడే... ఒకవేళ ఎక్కువ ధరకు విక్రయిస్తే ‘సెబ్’ నెంబరుకు కాల్ చెయ్యవచ్చంటూ ఆ ఫోన్ నెంబరు కూడా ఇస్తున్నారు. ఇక వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్‌ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ ఎక్కడైనా అక్రమంగా తరలిస్తున్న వ్యవహారాలు, ఎక్కువ ధరలకు విక్రయించిన ఘటనలు జరిగితే సెబ్ తక్షణం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేసులు కూడా పెడుతోంది. ఇదిగో... ఈ చర్యల ఫలితంగానే ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందుతోంది. మరి ఇసుక విధానం ఇంత పారదర్శకంగా ఉన్నపుడు ‘దోచుకో.. పంచుకో.. తినుకో’ ఎలా అవుతుంది రామోజీ? అబద్ధమైనా అతికినట్లుండాలి కదా? బాబు అక్రమాలకు... ఎన్జీటీ 100 కోట్ల జరిమానా చంద్రబాబు హయాంలో ఇసుక విధానం ఎంత దారుణంగా ఉందో సాక్షాత్తూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునలే తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు.. సాక్షాత్తూ తన ఇంటి పక్కనే కృష్ణా నదిని తొలిచేస్తూ టీడీపీ నేతలు ఇసుకను తరలించడాన్ని ప్రోత్సహించారంటే దోపిడీ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ వందల లారీలు తన ఇంటి మీదుగానే అక్రమంగా తరలిపోతున్నా... వాటా వచి్చందో లేదో చూసుకున్నారు తప్ప పర్యావరణానికి జరుగుతున్న డ్యామేజీని ఆయన పట్టించుకోలేదు. దీనిపై ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ జరిపి... అక్రమాలు ముమ్మాటికీ నిజమని తేల్చింది. టీడీపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. విచిత్రమేంటంటే జాతీయ స్థాయిలో బాబు ఇసుక మాఫియా గురించి బట్టబయలైనా... కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ ఒక్క అక్షరం కూడా రాయటానికి పూనుకోలేదు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరిగినా... వినియోగదారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇసుకను కొనుక్కోవాల్సి వచి్చనా ఇప్పుడు రాసిన తరహాలో రామోజీ ఎన్నడూ ఒక్క వార్త కూడా రాయలేదెందుకు? ఇసుక లారీలు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా... టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా ఎందుకు ప్రశి్నంచలేదు? తమ వాటా తమకు అందేసిందనా? అది కదా... అసలైన డీపీటీ!! సబ్ కాంట్రాక్టులు ఎవరికివ్వాలో చెప్పగలమా? వాస్తవానికి టెండర్లలో పాల్గొని దక్కించుకున్న కాంట్రాక్టరు... ఆ తరవాత టెండరు నిబంధనలను పాటిస్తూ ఎవరికి సబ్‌కాంట్రాక్టుకు ఇచ్చుకున్నా, తనను అలా చేయకుండా నిలువరించటం కష్టం. సబ్‌కాంట్రాక్టు ఎవరికివ్వాలన్నది కాంట్రాక్టరు ఇష్టం. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఇదే పద్ధతి. పోనీ చంద్రబాబు హయాం చూసుకున్నా ఇదే తీరు కదా? కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్‌కు ఇస్తే... ఆ శ్రీనివాస్ సదరు పనులను సీఎం రమేష్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుకిచ్చాడు. మరి అప్పుడెందుకు కలమెత్తలేదు రామోజీరావు గారూ? అసలు నిజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి. చదవండి: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
అక్రమాలకు అడ్డుకట్ట.. ఇసుక కోరినంత
అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ.. పారదర్శకంగా జిల్లా ప్రజలకు కోరినంత ఇసుకను జిల్లా యంత్రాంగం సరఫరా చేస్తోంది. కృష్ణా, పెన్నా తీర ప్రాంతాల నుంచి ఉప్పునీటి తాకిడి లేని ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న స్టాక్ పాయింట్లను రెట్టింపు చేసి భారీగా నిల్వ చేసింది. జగనన్న కాలనీలకే కాకుండా ఇతర కట్టడాలకు సరిపడా ఇసుకను సరఫరా చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇసుక అక్రమార్కుల చెర నుంచి వినియోగదారులను గట్టున పడేసినట్లు అయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అన్ని రకాల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. ప్రధానంగా పెన్నా నది ఇసుక సంగం రీచ్ ద్వారా జిల్లాకు సరఫరా అవుతోంది. ప్రతి నెలా 40 నుంచి 50 వేల టన్నుల ఇసుకను జిల్లాలోని వినియోగదారులకు అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఒంగోలుతో పాటు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెంలలో ప్రధాన ఇసుక స్టాక్ పాయింట్లు ఉండేవి. పుష్కలంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అదనంగా ఏడు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. త్వరలో కృష్ణా నది ఇసుకను జిల్లాకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 500 ఇళ్లకుపైగా ఉన్న జగనన్న కాలనీలకు ప్రత్యేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇసుక ఉచితంగా సరఫరా అవుతోంది. అందులోనూ ప్రత్యేకంగా 500 ఇళ్లకు పైగా ఉన్న జగనన్న కాలనీల్లోనే జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఆయా కాలనీల సమీపంలో పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో జగనన్న కాలనీలకు సకాలంలో నాణ్యమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సింగరాయకొండలోని నిర్మిత కేంద్రం, కనిగిరి పట్టణం, పొదిలి, దర్శి, గిద్దలూరు టిడ్కో ఇళ్ల పక్కన, యర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని జగనన్న కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల్లోని జగనన్న కాలనీలకు కూడా అక్కడ నుంచే ఇసుక సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక జిల్లాలో ఇతర కట్టడాలకు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక ఉంచేలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా రీజనబుల్ రవాణా చార్జీలతో కలిపి టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు సరఫరా చేస్తోంది. ఎవరైనా ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే ఎస్ఈబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. నెలకు 20 వేల టన్నులకు పైగా... జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు, ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు నెలకు దాదాపు 20 వేల టన్నులకు పైగా ఇసుకను గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తోంది. ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు కోర్టు కేసుల వలన నిలిచిపోయాయి. అవి కూడా ప్రారంభమైతే మరో 5 నుంచి 10 వేల టన్నుల వరకు అదనంగా ఇసుక వాడకం పెరుగుతుంది. జిల్లాలో మొత్తం 570 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం ప్రస్తుతం 50,813 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యమైన ఇసుకతో ఇళ్లు నిర్మించుకున్నాం గ్రామంలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ అధికారులు నెల్లూరు జిల్లా, సంగం ప్రాంతంలోని పెన్నా నది నుంచి తీసుకొచ్చిన ఇసుకను ఉచితంగా అందజేశారు. హాండ్లింగ్ చార్జీల కింద టన్నుకు రూ.175 చొప్పున మాత్రమే ఇచ్చిన ఇసుక తెచ్చుకున్నాం. నాణ్యమైన ఇసుక కావటంతో నిర్మాణం కూడా బాగా వచ్చింది. పటిష్టంగా నిర్మించుకున్నాం. జగనన్న కాలనీ వల్ల సొంతింటి కల నెరవేరింది. అందుకే ఇంటిపై జగనన్న ఫొటోను కూడా ఏర్పాటు చేసుకొని శాశ్వతంగా మా కుటుంబంలో జగనన్నను ఒక సభ్యునిగా చేసుకున్నాం. – ధారా నందిని భవానీ, రామాయణ కండ్రిక, పొదిలి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా... ప్రభుత్వం అందిస్తున్న ఇసుకను లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్లకు కూడా అందిస్తున్నాం. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా 20 నుంచి 25 వేల టన్నుల వరకు సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలకు అందుబాటులోనే ఇసుక సరఫరా చేస్తున్నాం. – ఈమని పేరయ్య, పీడీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ -
ముందస్తు చర్యలు..మస్తుగా ఇసుక నిల్వలు
సాక్షి ప్రతినిధి, కడప : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదులు పొంగి పొర్లాయి. దీంతో ఇసుక రీచ్‌లు దాదాపు మూతపడ్డాయి. అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా డిపోల్లో లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను సిద్ధంగా ఉంచడంతో ప్రస్తుతానికి కొరత లేకుండా పోయింది. అవసరమైన వినియోగదారులకు ఇసుక డిపోల నుంచే తరలిస్తున్నారు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టిన వెంటనే అన్ని రీచ్‌ల ద్వారా 12,98,835 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది. ∙ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వైఎస్సార్ జిల్లాలో పెన్నా, చిత్రావతి, కుందూ, పాపాఘ్ని నదులు పొంగి ప్రవహించాయి. వీటి పరిధిలో జిల్లాలో 18 ఇసుక రీచ్‌లు ఉండగా, వరద ప్రభావంతో ప్రస్తుతం 15 మూతపడ్డాయి. జిల్లాలోని వెంకాయ కాలువ, ఏటూరు, గడ్డంవారిపల్లె రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. మొత్తం 18 రీచ్‌ల పరిధిలో 88.722 హెక్టార్ల పరిధిలో 8,43,765 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండేది. అయితే ఈ రీచ్‌లు మూతపడడంతో ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వం ముందస్తు చర్యగా జిల్లాలోని బద్వేలు, చిన్నచౌకు, పోరుమామిళ్ల, మైదుకూరు, పగడాలపల్లె, కమలాపురం, నందిపల్లె, పులివెందుల, కె.వెంకటాపురం, పి.అనంతపురం, నంగనూరుపల్లె డిపోలలో 5,07,476 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచింది. అన్నమయ్య జిల్లాలో చెయ్యేరు, బాహుదా, మాండవ్యలు పొంగి ప్రవహించాయి. దీంతో ఆ జిల్లా పరిధిలోని 13 ఇసుక రీచ్‌ల్లో 11 మూతపడ్డాయి. కేవలం మందరం, గంగిరెడ్డిపల్లె రీచ్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. మొత్తం 13 రీచ్‌ల పరిధిలో 53.427 హెక్టార్లలోని రీచ్‌ల ద్వారా 4,55,070 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండేది. అయితే రీచ్‌లు మూతపడడంతో ప్రస్తుతం అక్కడి నుంచి ఇసుక తరలించడం నిలిచిపోయింది.జిల్లాలోని మంగంపేట, వెంకటరాజుపేట, రాయచోటి, మందపల్లె, టంగుటూరు, పీలేరు ఇసుక డిపోల పరిధిలో 1,77,395 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. నదుల్లో నీరు తగ్గాక రీచ్‌లను పునరుద్ధరిస్తాం వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదుల్లో నీరు పారుతుండడంతో 90 శాతానికి పైగా ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. అయితే వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 19 ఇసుక డిపోల పరిధిలో ప్రస్తుతం 6,84,873 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇసుక అందుబాటులో లేదన్న ఫిర్యాదులు మాకు లేవు. నదుల్లో నీరు తగ్గిన వెంటనే రీచ్‌లను పునరుద్ధరిస్తాం. – పి.వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భగనులశాఖ, కడప రెండు జిల్లాల పరిధిలో ప్రస్తుతం 19 ఇసుక డిపోల్లో 6,84,873 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. దీంతో అవసరమైన వినియోగదారులకు డిపోల నుంచి ప్రభుత్వం ఇసుకను తరలిస్తోంది. వరద ప్రవాహం తగ్గిన వెంటనే రెండు జిల్లాల్లోని 31 రీచ్‌ల పరిధిలో 142.149 హెక్టార్లలో 12,98,835 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది. -
రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా?
విశాఖ సాగరతీరం అంటే బంగారు వర్ణంతో కనిపించే ఇసుక తిన్నెలు.. సముద్రపు నీటితో శుద్ధి చేశారా? అన్నంతగా స్వచ్ఛతను తలపించే ఒంపులు తిరిగిన చిన్న చిన్న ఇసుక దిబ్బలు.. వాటిని ఎంత సేపు చూసినా, వాటిపై మరెంత సేపు సేద తీరినా తనివి తీరని అనుభూతిని పొందుతారు పర్యాటక ప్రియులు. అలాంటి విశాఖ బీచ్ ఇటీవల తన సహజ సౌందర్యానికి భిన్నంగా కనిపిస్తోంది. సుందర సాగరతీరం ఒంటికి మసి పూసుకున్నట్టు అగుపిస్తోంది. ఔరా! ఇది మన విశాఖ బీచేనా? అనిపించేలా రూపు మారిపోయింది. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ వరకు బీచ్ ఎక్కడ చూసినా నల్లని ఇసుకను పరుచుకున్నట్టు దర్శనమిస్తోంది. ఇది సాగరతీరానికి వచ్చే సందర్శకులు, పర్యాటక ప్రేమికులకు తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. విశాఖ బీచ్‌ను చూడడానికి ఎక్కడెక్కడ నుంచో నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇసుక తిన్నెలపై కూర్చుని తీరం వైపు నురుగలు కక్కుతూ వచ్చే కెరటాలను చూస్తూ మైమరచి పోతుంటారు. కొద్ది రోజుల నుంచి ఆ పరిస్థితి లేదు. ఇసుకంతా మురుగు పులుముకున్నట్టు ఉండడంతో బీచ్‌లో కూర్చుని అలలను ఆస్వాదించడానికి వీలు పడడం లేదు. దీంతో బీచ్‌కు వచ్చే సందర్శకుల్లో పలువురు మునుపటిలా కూర్చోకుండా నిలబడే ఉంటున్నారు. బీచ్ రోడ్డుకు అనుకుని ఉన్న గోడపై కొందరు, తీరంలో కొబ్బరిచెట్ల మధ్య ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలపై మరికొందరు సేద తీరుతున్నారు. అలా అలలకు అల్లంత దూరం నుంచే బీచ్ అందాలను అరకొరగా ఆస్వాదిస్తున్నారు. దీంతో నిత్యం సందర్శకుల రద్దీతో కళకళలాడుతూ కనిపించే సాగరతీరం కళా విహీనంగా కనిపిస్తోంది. ఎందుకిలా? కొద్ది రోజుల క్రితం నుంచి సాగరతీరం కోతకు గురవుతోంది. ఈ పరిణామమే సందర్శకులకు ఇబ్బందికరంగా ఉంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇసుక నలుపు రంగును పులుముకుంటోం ది. ఈ పరిస్థితికి సముద్రంలోకి నగరం నుంచి మురుగు నీరు వదిలిపెట్టడం, పోర్టులో బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్‌తో పాటు ఇనుప రజను వంటివి కారణమని సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. సంవత్సరంలో ఏడెనిమిది నెలలు నగరంపైకి నైరుతి గాలులే వీస్తాయి. విశాఖ నగరానికి నైరుతి దిశలోనే అనేక పరిశ్రమలున్నాయి. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థాలు కూడా సముద్రంలోనే కలుస్తున్నాయి. ఇవన్నీ సముద్రం అడుగున ఉంటాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడినప్పుడు కడలి కల్లోలంగా మారుతుంది. దీంతో దిగువన ఉన్న ఈ వ్యర్థాలు పైకి, కిందకు కలుషితమవుతాయి. కెరటాల ఉధృతితో అవి ఇసుకతో సహా తీరానికి కొట్టుకు వస్తాయి. ఫలితంగా అప్పటివరకు తీరంలో గోధుమ, బంగారు వర్ణంలో ఉన్న ఇసుక నల్లగా మసి పూసినట్టుగా మారిపోతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఈడ్పుగంటి ధనుంజయరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం బీచ్‌లో ఇసుక నలుపు రంగులోకి మారిపోవడానికి ఇదే కారణమని తెలిపారు. కొద్దిరోజుల్లో మళ్లీ ఈ నల్లని ఇసుక కెరటాల ఉధృతికి వెనక్కి సముద్రంలోకి వెళ్లిపోతుందని, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని వివరించారు. -
కళ్ళు ఉండి చూడలేని కబోది రాతలు
-
ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపు.. జాగ్రత్త సుమా!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సీతానగరం మండలంలో రాత్రిపూట ఎడ్ల బండ్లు(నాటుబళ్లు)తో ప్రయాణం చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కె.నీలకంఠం హితవు పలికారు. ఈ మేరకు నాటుబళ్లతో రాత్రి పూట ప్రయాణం చేస్తున్న రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుబళ్లతో ఇసుక తరలించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం వల్ల బూర్జ, పెదంకలాం, లక్ష్మీపురం, చినభోగిలి, పెదభోగిలి, సీతానగరం, తామరఖండి అంటిపేట, వెంకటాపురం, నిడగల్లు, కాశీపేట, పణుకుపేట తదితర గ్రామాల్లో నాటుబళ్లు ఉన్న రైతులు సువర్ణముఖినదిలో రేవులనుంచి రాత్రిపూట ఇసుక తరలించి విక్రయాలు చేస్తున్నారన్నారు. రాత్రిపూట నాటుబళ్ల ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటుబళ్లు ఉన్న రైతులు బళ్లకు ‘రేడియం’ స్టిక్కర్లు విధిగా వాడాలని సూచించారు. రేడియం స్టిక్కర్లు అతికించడం వల్ల రాత్రిపూట ఎదురుగా రాక పోకలు చేస్తున్న భారీ వాహనాలకు నాటుబండి వస్తున్నట్లు తెలుస్తుంద న్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులున్న చోట భారీవాహనాల డ్రైవర్లు, నాటుబళ్లతో వెళ్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. -
Kuppam: బరి తెగించిన టీడీపీ నేతలు.. అంతా వారి కనుసన్నల్లోనే..
కుప్పం(చిత్తూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మట్టిని నీటితో శుభ్రం చేయడం ద్వారా కృత్రిమ ఇసుకను తయారు చేసి అమ్మేసుకుంటున్నారు. నాణ్యత లేని ఈ ఇసుకతో కట్టిన నిర్మాణాలు కుప్ప కూలడం ఖాయమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇసుక కొరత ఏర్పడడంతో ఆ పార్టీ నేతలే విచ్చలవిడిగా కృతిమ ఇసుక తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయా కేంద్రాల్లో యథేచ్ఛగా ఇసుక తయారు చేస్తుండడం గమనార్హం. టీడీపీ స్థానిక నేతల కనుసన్నల్లోనే దందా సాగుతున్నట్లు ఆయా ప్రాంత ప్రజలు వెల్లడిస్తున్నారు. చదవండి: టీడీపీకి ఊపిరి పోయాలనుకోవడం పవన్ అవివేకం ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలు పట్టణంలో ఒక్క ట్రాక్టర్ కృత్రిమ ఇసుకను రూ.2 వేల నుంచి 3 వేల వరకు విక్రయిస్తున్నారు. అక్కమార్కులు పగటి సమయంలో రోడ్డు మార్గాలను పరిశీలించుకుంటారు. ఉదయం 4 నుంచి 9 గంటల్లోపు ఎక్కడికి చేర్చాలో అక్కడికి గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తారు. ప్రతి రోజూ రాత్రి వేళల్లో ఇసుక తయారు చేసుకోవడం, తెల్లవారు జామున అనుకున్న మార్గంలో తరలించేయడం కొన్నేళ్లుగా సాగిస్తున్నారు. రవాణాకు 70 వాహనాలు కృత్రిమ ఇసుక రవాణా చేసేందుకు కుప్పంలో 70 వరకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నట్లు తెలిసిది. ఈ వాహనాల యజమానులు పట్టణంలోని గుడుపల్లె క్రాస్, విజలాపురం క్రాస్, మల్లానూరు క్రాస్, దళవాయి కొత్తపల్లి క్రాస్‌లో నిలబడి రవాణాను పర్యవేక్షిస్తుంటారు. ఒక్కో ట్రాక్టర్ యాజమాని మామూళ్ల కింద అధికారులకు నెలకు రూ.12 వేలు చొప్పున చెలిస్తున్నట్లు సమాచారం. 70 ట్రాక్టర్లకు మొత్తం కలిపి ఇసుక రవాణాకు ఇబ్బంది కలగకుండా పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు వాటాలు అందిస్తున్నట్లు వారే బహిరంగంగా చెబుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళ గస్తీకి వెళ్లే పోలీసు సిబ్బంది అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిర్యాదులకు దిక్కులేదు ఎన్నో ఏళ్ల తర్వాత జలకళ సంతరించుకున్న చెరువులను ఇసుక మాఫియా వదలడంలేదు. ఇసుక తయారీ కోసం ఇష్టారాజ్యంగా నీరు తోడేస్తోంది. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. పోలీసులు తమకు ఫిర్యాదు చేసిన వారిని రెవెన్యూ అధికారుల దగ్గరకు, వారు విద్యుత్ శాఖకు అక్కడి సిబ్బంది గనుల శాఖను సంప్రదించాలని వంతులు వేసుకుని పంపేసి చేతులు దులిపేసుకుంటున్నారు. 20 రోజుల క్రితం గుడపల్లె గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే వారికి ఎదురైన అనుభవమే ఇది. ఇష్టారాజ్యంగా విద్యుత్ చౌర్యం ఇసుక తయారీకి విద్యుత్ అవసరం. వ్యవసాయ బోర్లకు త్రీ ఫేజ్ విద్యుత్ ఉంటేనే మోటార్లు పనిచేస్తాయి. అయితే ఆధునిక పద్ధతులను వినియోగించుకుని సింగిల్ ఫేజ్ విద్యుత్‌తో నడిచే మోటార్లు అమర్చుకున్నారు. కరెంటు తీగలకు రాత్రి వేళల్లో కొక్కీలు తగిలించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. గుండ్లసాగరం వద్ద అక్రమంగా విద్యుత్ తీగలకు కోక్కీలు తగిలించిన దృశ్యం ఇవే కీలకం కుప్పం పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి ఇసుక తయారీ కేంద్రాలను నడుపుతున్నారు. కృష్ణదాసన పల్లె పంచాయతీ టీడీపీ యువత అధ్యక్షుడికి గొల్లపల్లె, యానాదనపల్లె, కృష్ణదాసనపల్లెల్లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. పరమసముద్రం, వరమనూరు, గట్టప్పనాయపల్లి, డీకే పల్లె, పీబీనత్తం గ్రామాల్లో టీడీపీ నాయకులే తయారీ కేంద్రాలు నడిపిస్తున్నారు. గుడుపల్లె మండలం గుండ్లసాగరం పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ, క్రియాశీల కార్యకర్త ముగ్గురూ కలసి దర్జాగా దందా నడుపుతున్నారు. అగరంలో టీడీపీ బూత్ కన్వీనర్లు, యామనూరు, పీబీవాడ, శెట్టిపల్లె, కంచి బందార్లపల్లె గ్రామాల్లో స్థానికంగా ఉన్న టీడీపీ కేడర్ కృత్రిమ ఇసుక దందా సాగిస్తోంది. పెద్దసంఖ్యలో తయారీ కేంద్రాలు కుప్పం నియోజకవర్గంలో సుమారు 56కు పైగా కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని నడిపేది ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నాయకులే. వ్యవసాయ బోర్లు, చెరువులు, బావులు అందుబాటులో ఉన్న ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడకు మట్టిని తోలుకుంటారు. అక్కడ మోటార్లతో మట్టిని శుభ్రం చేసి వచ్చే ఇసుకను వేల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తయారీని ప్రభుత్వం నిషేధించినా కుప్పంలో మాత్రం యథేచ్ఛగా దందా సాగుతోంది. -
అర్ధరాత్రి ఎస్ఐ హల్చల్.. లాఠీలు తీసుకుని..
సాక్షి,వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): మండలంలోని కుర్నూతల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఎస్ఐ హల్చల్ చేశారు. అధికారుల అనుమతితో మట్టి తోలుకుంటున్న రైతులపై లాఠీలు ఝుళిపించారు. అదేమని అడిగిన సర్పంచ్‌నూ దుర్భాషలాడారు. లాఠీతో కొట్టారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. కుర్నూతలలోని మైనర్ ఇరిగేషన్ చెరువులో పూడిక తొలగించి ఆ మట్టితో తమ పొలాల్లో భూమిని చదును చేసుకుంటామంటూ చింతపల్లిపాడుకు చెందిన కొందరు రైతులు కొద్దిరోజుల కిందట ఇరిగేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి చెరువులో మట్టిని పొక్లెయినర్‌తో ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్న సమయంలో వట్టిచెరుకూరు ఎస్ఐ కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. వస్తూవస్తూనే రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్సీపీ సర్పంచ్ గోపాలకృష్ణ ఘటనా స్థలానికి వెళ్లారు. రైతులను అన్యాయంగా ఎందుకు కొడుతున్నారంటూ ప్రశ్నించారు. దీంతో ఎస్ఐ సర్పంచ్ గోపాలకృష్ణపైనా దుర్భాషలాడారు. ఆయననూ లాఠీతో కొట్టారు. ఎస్ఐ తీరుతో కంగుతిన్న పక్కనే ఉన్న కానిస్టేబుళ్లు సర్పంచ్‌ను కొట్టవద్దంటూ నిలురించేందుకు యత్నించినా ఎస్ఐ ఆవేశంతో ఊగిపోయారు. విషయం బయటకు రావడంతో కుర్నూతలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. ఇదేం పద్ధతంటూ ఎస్ఐను నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు అనుమతిచ్చిన తరువాతే చెరువులో మట్టి తవ్వుకుంటున్న తమను కొట్టడం ఏంటని ప్రశ్నించారు. చేబ్రోలు సీఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు గ్రామస్తులతో చర్చించారు. సీఐ హామీతో గ్రామస్తులు శాంతించారు. ఎస్ఐ అడిగినట్లుగా రూ.ఐదు లక్షలు ఇవ్వనందువల్లే ఇలా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్ఐ కేవీ కోటేశ్వరరావును ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపినట్లు చేబ్రోలు సీఐ తెలిపారు. -
ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలి
ఒంగోలు అర్బన్: జిల్లాల పునర్విభజన తర్వాత పెద్ద జిల్లాగా ఏర్పడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్పందన భవనంలో ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన శుక్రవారం డీఆర్సీ (జిల్లా సమీక్ష సమావేశం) నిర్వహించారు. దీనిలో ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా నీటి సరఫరా సక్రమంగా చేయాలన్నారు. గృహాల నిర్మాణాలతో పాటు ప్రజలకు ఇసుక కొరత లేకుండా నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు స్థానికంగా ఎడ్ల బండ్లు, టైర్ బండ్లపై ఇసుక తీసుకెళ్లే వారిపై సెబ్ అధికారులు చర్యలు తీసుకోవడం మంచిది కాదన్నారు. అటువంటి చర్యలపై అందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక అవసరాల కోసం జీవో ప్రకారం ఇసుకను తీసుకెళ్తే అడ్డుకోవడం వలన ప్రజలకు ఇబ్బందులు రావడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. పంచాయతీ అధికారులు ఇసుక రవాణాను పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక డిపోలే అందుబాటులో ఉంచడంపై జేపీ వెంచర్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి ఒక ఇసుక డిపో ఉండాలన్నారు. ఇసుక సరఫరాలో విఫలమైతే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని హెచ్చరించారు. తాను ఇన్చార్జ్ మంత్రిగా ప్రకాశం జిల్లాకు ఉండటం సంతోషంగా ఉందని తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, శ్మశాన భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఒంగోలు శివారు ప్రాంతం అయిన పేర్నమిట్టలో ఆంధ్రకేసరి యూనివర్శిటీ స్థలం కూడా ఆక్రమణలకు గురవుతున్నట్లు సమావేశంలో తెలిపారు. యూనివర్శిటీ భూములను పరిరక్షించాలని ఇన్చార్జ్ మంత్రి కలెక్టర్‌కు తెలిపారు. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సరిహద్దుల్లో కందకాలు తవ్వాలని సూచించారు. కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లా ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. సదరమ్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యల రాకుండా పైప్‌లైన్ లేని ప్రాంతాల్లో ప్రజల అవసరాల మేరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు. నీటి సరఫరాలో మూగ జీవాలను పరిగణలోకి తీసుకుని నీటిని అందించాలని అధికారులకు సూచించారు. ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు తాగునీటి సమస్యను ప్రధానంగా ప్రస్తావించారని, సమస్యను అధిగమించేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో పరిష్కరించాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు బాధితుల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. కనిగిరిలో ఈ సంవత్సరంలో ట్రిపుల్ ఐటీ క్లాసు ప్రారంభించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అవసరమైన వసతులు కల్పించాలని ఆ మేరకు అధికారులు దృష్టి సారించాలని అన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ట్యాంకర్లతో నీటి సరఫరా చేసినందుకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన చెల్లించాలని కోరారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకల నుంచి సారవంతమైన మట్టిని పొలాలకు చేరవేసుకునేందుకు రైతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. సదరమ్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్నారు. వెలిగొండ మొదటి దశ కింద ఎత్తిపోతల పథకం పనులు త్వరగా చేపట్టేందుకు టెండర్లు నిర్వహించాలన్నారు. కాకర్ల ముంపు ప్రాంత వాసులకు వెంటనే పరిహారం అందచేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్న నాటు సారాను అరికట్టాలన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ఓటీఎస్ కింద నగదు చెల్లించిన పేదలకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని, వెంటనే ప్రక్రియను ప్రారంభించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. దొనకొండ, కురిచేడు మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. దర్శి నగర పంచాయతీలో జల జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.6.50 కోట్ల నిధులు వెనక్కి వెళ్లకుండా పనులు చేపట్టాలని కోరారు. పింఛన్ పంపిణీలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలన్నారు. పంచాయతీల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు త్వరగా ప్రారంభించి జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. ఇసుక సరఫరాలో సెబ్ అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ డీఆర్సీ సమావేశాల్లో చర్చించిన అంశాలను అధికార యంత్రాంగం దృష్టి సారించి ఫలితాలు సాధించాలన్నారు. గత డీఆర్సీలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు. కమిటీ సభ్యుల సూచనల మేరకు వారి సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జిల్లా రెవెన్యూ అధికారి పులి శ్రీనివాసులు అన్నీ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మార్కాపురంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెలకు రెండు పంచాయతీలను లక్ష్యంగా పెట్టుకుని సమగ్రమైన ప్రణాళికతో తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సెర్ప్ ప్రోత్సాహంతో స్వయం సహాయక సంఘాల ద్వారా పరిశ్రమలు స్థాపించేలా చూడాలన్నారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ అనధికారిక చేపల ఉత్పత్తి కేంద్రాలను అరికట్టాలని కోరారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వాటికి చట్టబద్ధత కల్పించాలన్నారు. శిథిలావస్థకు చేరిన తుఫాను షెల్టర్లను తొలగించి నూతనంగా నిర్మాణాలు చేయాలన్నారు. శింగరాయకొండలో దేవదాయ భూములుగా నమోదైన రెండు వేల ఎకరాల భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. టంగుటూరులో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు కోసం రూ.136 కోట్లతో చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కమిటీలో తెలిపారు. తిరిగి ఆ పనులు సత్వరమే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రిపుల్ ఐటీ తాత్కాలిక భవనాల నిర్మాణాలకు రూ.25 కోట్లు కేటాయించాలన్నారు. కనిగిరి రెవన్యూ డివిజన్ పరిధిలో వచ్చే ప్రభుత్వ కార్యాలయ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కంబాలదిన్నె పాఠశాలలో చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారని, నాడు–నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రకేసరి యూనివర్శిటీ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చూడాలన్నారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఒంగోలు–పొదిలి రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలన్నారు. గుండ్లకమ్మ నుంచి ఆయా ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసే పైపులైన్లు మరమ్మతులు చేయాలని కోరారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపల అక్రమ వేటను అరికట్టాలన్నారు. పారిశ్రామికవాడ నుంచి వచ్చే ఆదాయంలో 40 శాతం నిధులు స్థానిక ప్రాంతాలకు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. ఉప్పుగుండూరులో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. -
ముంచుకొస్తున్న ఇసుక కొరత
గాలి, నీరు తర్వాత మనిషి అత్యధికంగా ఉపయోగించే, అత్యధికంగా దుర్వినియోగం చేసే ప్రకృతి వనరు ఇసుక! భూమిపై మానవుడు అత్యధికంగా తవ్వితీసుకునేది కూడా ఇసుకే! అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న మనిషి అక్రమ తవ్వకాల ప్రభావంతో ఇసుక కొరత పొంచి ఉందంటోంది ఐరాస నివేదిక. ఎడారుల్లో ఇసుక తుఫానులు ముంచెత్తుకొస్తాయి. అవి వచ్చినప్పుడు ప్రజా జీవనం అతలాకుతలం అవుతుంది. అయితే ప్రపంచమంతటినీ ఇబ్బంది పెట్టే తుఫాను ఇసుక కొరత రూపంలో రాబోతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇసుక కొరత పెరిగిపోతోందని, తక్షణమే దీనిపై స్పందించకుంటే సమస్యలు తప్పవని, అందుకే తస్మాత్ జాగ్రత్త అని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇసుక సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే బీచ్‌ల తవ్వకంపై నిషేధం సహా పలు చర్యలు తీసుకోవాలని కోరింది. పలు దేశాల్లో ఇసుక వాడకంపై ప్రభుత్వ ఆజమాయిషీ లేదని, ఈ పద్ధతి సరికాదని తెలిపింది. ప్రపంచంలో అతిగా తవ్వితీసే ఉత్పత్తుల్లో ఇసుక ప్రథమస్థానంలో నిలుస్తోంది. చాలా దేశాల్లో ఇసుక అక్రమ మైనింగ్ సాధారణంగా మారింది. భౌగోళిక ప్రక్రియల కారణంగా ఇçసుక ఏర్పడుతుంది. ఇందుకు వందల సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇలా ఉత్పత్తయ్యే ఇసుక కన్నా మనిషి తవ్వేస్తున్న ఇసుక పరిమాణం ఎక్కువని ఐరాస అనుబంధ సంస్థ యూఎన్ఈపీ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఇసుకపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకుంటే భవిష్యత్ తరాల అవసరాలకు తగిన లభ్యత ఉండదని హెచ్చరించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందిస్తే సంక్షోభం రాకముందే అరికట్టవచ్చని యూఎన్ఈపీ ఎకానమీ డివిజన్ డైరెక్టర్ షెహీలా అగర్వాల్ ఖాన్ చెప్పారు. మనిషికి 17 కిలోలు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గ్లాసు, కాంక్రీట్, నిర్మాణ పదార్ధాల వాడకం మూడురెట్లు పెరిగింది. దీనివల్ల వీటి ముడిపదార్ధమైన ఇసుక వాడకం ఏడాదికి 5వేల కోట్ల టన్లుకు చేరింది. అంటే సరాసరిన ప్రతి మనిషి రోజుకు 17 కిలోల ఇసుక వాడుతున్నట్లవుతోంది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో నదులు, సముద్రతీరాలు ధ్వంసమవడమే కాకుండా చిన్నద్వీపాలు కనుమరుగవుతున్నాయని ఐరాస నివేదిక తెలిపింది. పర్యావరణ పరిరక్షణలో ఇసుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వరదల నుంచి రక్షణగా నిలుస్తుంది. భూముల క్రమక్షయాన్ని తగ్గిస్తుంది. ఇసుక అక్రమ వాడకం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసి జీవవైవిధ్యతను కనుమరుగు చేస్తుంది. ఇప్పటికే భూమిపై కొన్ని చోట్ల ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఉదాహరణకు దక్షిణాసియాలో పొడవైన మీకాంగ్ నదిలో ఇసుక అక్రమమైనింగ్ కారణంగా డెల్టా ప్రాంతమంతా మునిగిపోయింది. పలు సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారాయి. శ్రీలంకలోని నదిలో ఇసుక తవ్వకాలు నీటి ప్రవాహ దిశనే మార్చివేశాయి. దీంతో నదిలోనించి సముద్రంలోకి వెళ్లకుండా సముద్రపు నీరు నదిలోకి రావడం మొదలైంది. ప్రపంచమంతా ఈ పరిస్థితులు రాకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదిక చర్చించింది. బీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను నిషేధించాలని సూచించింది. ఇలా ఏర్పడుతుంది.. శిలల క్రమక్షయంతో ఇసుక ఏర్పడుతుంది. ఇందుకు వందల, వేల సంవత్సరాల సమయం పడుతుంది. క్వార్ట్›్జశిలలు శిధిలమయ్యేందుకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. నదులు, ప్రవాహాల్లో నీటివేగం రాళ్లను కదిలిస్తుంది. దీనివల్ల అవి ప్రవాహం వెంట దొర్లుకుంటూ రాపిడి, క్రమక్షయం చెందుతూ వస్తాయి. వీటివల్ల ఇసుక మేటలు ఏర్పడతాయి. సముద్ర తీరాల్లో అలల ప్రభావం వల్ల ఇసుక ఉత్పత్తి అవుతుంది. బీచ్‌లో ఇసుక రంగు ఎర్రగా ఉండేందుకు ఐరన్ ఆక్సైడ్ కారణమని నిపుణులు తెలిపారు. సాధారణ ఇసుక రేణువు వ్యాసం 0.3 నుండి 2 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. ఎడారి ఇసుక సమృద్ధిగా ఉన్నప్పటికీ, అది కాంక్రీటు తయారీకి సరిపోదు. అందుకే నదులు, బీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుపుతారు. -
గంగను మళ్లించి.. ఇసుకను తరలించి
ఆదిలాబాద్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. జిల్లా సరిహద్దులో పారుతున్న పెన్‌గంగ నుంచి అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో నదిలో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ఏకంగా ప్రొక్లెయిన్‌తో నదిని తోడేస్తున్నారు. నదిలోని నీటిపాయకు అడ్డుకట్ట వేసి ప్రవాహాన్ని మళ్లించి పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు. జైనథ్, బేల మండలాల పరిధిలోని సాంగ్వి, అనంతపూర్, సాంగిడి, బెదోడ గ్రామాల శివారు నుంచి ఇసుక దోపిడీ జోరుగా సాగుతోంది. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇసుక అక్రమ రవాణా వెనుక అధికారులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
YSR Jagananna Colonies: కావాల్సినంత ఇసుక
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ పక్కా ఇంటి భాగ్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఆచరణలోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా లే అవట్లను వేసింది. వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేసి స్థలాలను కేటాయించింది. విశాలమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన సామగ్రిని విరివిగా సమకూర్చుతోంది. అందులో భాగంగా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. దీనికోసం ప్రతి మండలంలోనూ ఒక్కొక్కటి చొప్పు న స్టాక్ పాయింట్‌ను జిల్లా అధికారులు ప్రారంభించారు. సమీప ఇసుక డిపోల నుంచి వాటికి ఇసుకను చేరవేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా జారీ అయిన బిల్లుల ఆధారంగా ఇప్పటివరకూ 17 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా గృహాల లబ్ధిదారులకు సమకూర్చారు. ఆ బిల్లులపై హాలోగ్రామ్ ఉండడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. 77 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని నాలుగు డిపోల్లో మంగళవారం నాటికి 41,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడమే తరువాయి!. ఇళ్ల మంజూరు ఇలా... పేదలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 80,547 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో చాలా ఇళ్ల నిర్మాణ పను లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 17వేల ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాల్సి ఉంది. వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు పనులు వేగవంతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రతి లేఅవుట్‌లోనూ ఇళ్ల నిర్మాణాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించలేనివారితో మాట్లాడి వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సక్రమంగా ఇసుక అందేలా... ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. గతంలో ఇసుక సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జేపీ పవర్ కన్స్ట్రక్ష న్స్‌కు ఇసుక సరఫరా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రీచ్‌ల నుంచి లారీల్లో ఇసుక జిల్లాలోని నాలుగు డిపోలకు వస్తోంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు సులువుగా చేరవేసేందుకు వీలుగా మండలానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 77 ఇసుక రీచ్‌లు ఉన్నా యి. వీటిలో ఒక్కోచోట వెయ్యి నుంచి రెండు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతోంది. ఆ ఇసుకను డిపోలకు, అక్కడి నుంచి స్టాక్ పాయింట్లకు తీసుకొస్తున్నారు. అక్కడ ఇళ్ల లబ్ధిదారులకు హాలోగ్రామ్ ఉన్న బిల్లుల ఆధారంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని జేపీ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి హర్షవర్దన్ ప్రసాద్ చెప్పారు. ఇసుక పక్కదారి పట్టకుండా... గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ జనరేట్ చేసి ఇచ్చిన బిల్లును లబ్ధిదారులు స్టాక్ పాయింట్‌కు తీసుకెళ్లి చూపిస్తే ఇసుక ఇస్తున్నారు. చేతిరాతతో ఇస్తే కుదరదు. హలోగ్రామ్ బిల్లులతో ఇసుక పక్కదారి పట్టకుండా నిరోధించగలుగుతున్నారు. సత్వరమే బిల్లుల చెల్లింపు.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ ద్వారా బిల్లులను వారంలోగా జనరేట్ చేస్తున్నారు. ప్రతీ మండలం నుంచి ఆయా ఏఈలు, డీఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి బిల్లులు వారి వ్యక్తిగత ఖాతాలకు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇసుక, సిమెంట్ కొరత లేదు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. ఇనుము కోసం చర్చలు జరుగుతున్నాయి. ప్రతి లబ్ధిదారునికీ వారంలోగా బిల్లులు వారి ఖాతాల్లోకి జమవుతున్నాయి. – ఎస్వీ రమణమూర్తి, ప్రాజెక్టు డైరెక్టర్, గృహనిర్మాణ శాఖ, విజయనగరం -
సముద్రం, భూమి కలిసి చెస్ ఆడుతూ..
ఇక్కడ సముద్ర తీరంలో చెస్ కాయిన్లలా కనిపిస్తున్నవి ఏమిటో తెలుసా?.. ఏవో శిల్పాల్లా ఉన్నాయి, ఎవరో పెట్టి ఉంటారులే అనిపిస్తోందికదా.. కానీ అవి శిల్పాలూ కాదు, ఎవరూ ఏర్పాటు చేయలేదు. ఇవి ప్రకృతి సృష్టించిన చిత్రాలు. కేవలం ఇసుకతో ఏర్పడిన చిన్నపాటి స్తంభాలు. అమెరికాలోని లేక్ మిషిగన్ ప్రాంతంలో రెండు రోజుల కింద ఈ చిత్రమైన ఇసుక ఆకృతులు ఏర్పడ్డాయి. వీటిని అక్కడ ‘హూడూస్’ అని పిలుస్తారు. (క్లిక్: అరుదైన గ్రహాంతర వజ్రం.. కాసులుంటే మీ సొంతం !) అక్కడ చలికాలంలో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. సముద్ర తీరంలో నీళ్లు ఇసుకలో చేరి అక్కడక్కడా గడ్డకడతాయని, ఆ తర్వాత అలలకు ఇసుక కోతకు గురవడం, దానికి గాలి తోడవడంతో.. ఇలా రకరకాల ఆకారాల్లో ఇసుక స్తంభాలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా టెర్రీ అబ్బాట్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్రం, భూమి కలిసి సరదాగా చెస్ ఆడుతూ.. మధ్యలో వదిలేసినట్టుగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. (చదవండి: అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు) -
సాండ్స్టోన్ ఐస్ క్లైంబింగ్ ఫెస్టివల్..
-
అత్యంత పారదర్శకంగా ఇసుక ఆపరేషన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ అత్యంత పారదర్శకతతో నిర్వహిస్తున్నామని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. వినియోగదారులకు అందుబాటు ధరలో ఇసుక విక్రయానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, దాని ప్రకారమే విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవగాహన లేకుండా కొన్ని మీడియాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయంపై అసత్య కథనాలను ప్రచురిస్తున్నారని అన్నారు. జేపీ సంస్థదే బాధ్యత: ద్వివేది ‘ఇసుక ఆపరేషన్స్‌ను పారదర్శకంగా నిర్వహించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ ద్వారా టెండర్ల ప్రక్రియను నిర్వహించింది. ఎంఎస్టీసీ నిర్వహించిన టెండర్ల లో జేపీ పవర్ వెంచర్స్ సంస్థను ఎంపిక చేశాం. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం నిర్ణయిం చిన రేటుకు ఇసుక విక్రయాలు జరుపుతున్నాం. రెండేళ్ల కాలానికి ఇసుక ఆపరేషన్స్ కాంట్రాక్ట్‌ను జేపీ సంస్థకు ఇచ్చాం. ఇతర రాష్ట్రాల్లో ఏపీఎండీసీ గనులను నిర్వహిస్తోంది. అక్కడ ఆపరేషన్స్ కోసం సబ్ కాంట్రాక్ట్‌లకు కొన్ని పనులు అప్పగించాం. ఇసుక టెండర్ల నిబంధనల్లో కూడా లీజు అనుమ తులు పొందిన సంస్థ సబ్ కాంట్రాక్ట్ కింద కొన్ని పనులు ఇతరులకు ఇవ్వవచ్చు. అయితే మొత్తం ఇసుక ఆపరేషన్స్‌కు జేపీ సంస్థ మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా జరిగితే జేపీ సంస్థపైనే చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లను జేపీ సంస్థ నిర్వహిస్తు న్నందున వారు సబ్ కాంట్రాక్ట్ కింద ఇతరుల సేవలను తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి నిబం ధనల ఉల్లంఘనా లేదు. కొత్తగా ఏర్పాటైన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఇసుకను తీసుకువచ్చే బాటకు కొందరు స్థానికులు డబ్బు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోప ణల నేపథ్యంలో దానిపై ఎవరైనా సరే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇటువంటివి అటు జేపీ సంస్థ దృష్టికి వచ్చినా, లేదా మా దృష్టికి వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరతాం. వినియోగదారులకు సరైన రేటుకు, నిర్దిష్టమైన నాణ్యతతో కూడిన ఇసుక అందుతుందా లేదా అనేదానిపైనే మేం దృష్టి సారిస్తున్నాం. జేపీ సంస్థ ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ బుకింగ్‌లు చేస్తోంది. ఆన్లైన్ ద్వారా కూడా చేయాలని çసూచించాం. ప్ర జలకు ఇబ్బంది లేకుండా మంచి సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేయడానికి ఆ సంస్థ రూపొం దించిన ఫోన్ యాప్‌ను కూడా పరిశీలిస్తున్నాం. గతంలో ఆన్లైన్ విధానంలోని లోపాలవల్ల విని యోగదారులు ఇబ్బందులు పడ్డారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా సాఫ్ట్వేర్ ఉండేలా చూస్తాం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుని, అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. గతంలో పట్టా భూము ల్లో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల నాణ్యత లేదనే ఫిర్యాదులు చాలా వచ్చాయి. వాటికి అనుమతులు రద్దు చేశాం. ప్రస్తుతం వందకు పైగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదల వల్ల కొన్ని రీచ్‌ల ప్రారంభంలో జాప్యం జరిగింది. త్వరలోనే దాదాపు 150 రీచ్‌లు ప్రారంభమవుతాయి’ అని ద్వివేది చెప్పారు. అవాస్తవాలు ప్రచురించారు: వెంకటరెడ్డి ‘ఇసుక విక్రయాలపై అవగాహన లేకుండా ఒక మీడియా సంస్థ అవాస్తవాలను ప్రచురించింది. గతంలో ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్న సమయంలో వినియోగదారులకు ఉచితంగా ఇసుక లభించలేదు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లింది. దీనిని నియంత్రించడానికే ఈ ప్రభుత్వం సుస్థిర ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఏపీఎండీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్ చేశాం. కొత్త ఇసుక విధానంలోని లోటుపాట్లను పరిష్కరించేందుకు మెరుగైన విధానం కోసం సీఎం జగన్ మంత్రుల కమిటీని వేసి ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చారు. జేపీ సంస్థ ఎక్కడా సబ్ లీజులు ఇవ్వలేదు. నిబంధనల ప్రకారమే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దానినే జేపీ సంస్థ అనుసరిస్తోంది. కొత్తగా పుట్టిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని అంటూ ఒక మీడియాలో వచ్చిన కథనంలో వాస్తవం లేదు. జేపీ సంస్థ నగదుతో పాటు యూపీఐ. బ్యాంకు ఖాతాల ద్వారా సొమ్ము జమ చేసిన వినియోగదారులకు కూడా ఇసుకను విక్రయిస్తోంది. అందుకోసం 26 బ్యాంకు ఖాతాలను జేపీ సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఆ బ్యాంకు ఖాతాల్లో వినియోగదారులు సొమ్ము డిపాజిట్ చేసి ఇసుకను తీసుకోవచ్చు. బాట చార్జీల పేరుతో స్థానిక నేతలు ఎక్కడ డబ్బు వసూలు చేస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా కథనాలు రాస్తున్నారు. దానిపై పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతివారం నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లపై ప్రకటనలు జారీ చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ రేటును ఎవరైనా డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్ పాయింట్లలో ఇసుక సిద్ధంగా ఉంది. ప్రతి రీచ్‌లోనూ మైనింగ్ ప్లాన్ తయారు చేస్తాం. దానికి పర్యావరణ అనుమతులు తీసుకుంటాం. దానికి అనుగుణంగానే సరిహద్దులు గుర్తించి జియో కోఆర్డినేట్స్ ప్రకారం లీజుదారులకు మైనింగ్ ప్రాంతాన్ని అప్పగిస్తాం. ఈ ప్రాంతం మినహా మరెక్కడైనా ఇసుక ఆపరేషన్స్ చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏడాదికి రెండు కోట్ల టన్నుల వరకు ఇసుక తవ్వాలని జేపీ సంస్థకు నిర్దేశించాం. ప్రతి నెలా ఇసుక తవ్వకాలు, రవాణా, అమ్మకాల వివరాలను తీసుకుంటున్నాం. దీనిని గనులశాఖ ఏడీ, డీడీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జేపీ సంస్థ మాన్యువల్‌గానే బిల్లులు ఇస్తోంది. ఆన్లైన్ కావాలని వినియోగదారులు కొందరు కోరుతున్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నాం. అధికారుల నుంచి నిర్దిష్టమైన అంశాలపై వివరణ కోరకుండానే మీడియాలో కథనాలను ప్రచు రించడం తగదు’ అని వెంకటరెడ్డి చెప్పారు. -
దేవదాయశాఖలో రచ్చకెక్కిన విభేదాలు
Conflicts In AP Endowment Department Officials మహారాణిపేట (విశాఖ దక్షిణ): దేవదాయశాఖలో ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఒక అధికారి మీద మరో అధికారిణి ఇసుక పోయడం సంచలనం కలిగించింది. విశాఖపట్నంలోని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఇ.పుష్పవర్ధన్ గురువారం కార్యాలయంలో విధుల్లో ఉండగా సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతి ఇసుక పోశారు. దేవదాయశాఖ హుండీల ఆదాయం లె క్కింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెం డ్ చేయడంతోపాటు భూముల స్వాధీనం విషయంలో వీరిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పై ఘటన చోటుచేసుకుంది. ఈ విషయమై దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాసినట్లు డీసీ పుష్పవర్ధన్ చెప్పా రు. ఏసీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు పెట్టడానికి అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు. డీసీ తనను మానసికంగా వేధించారని, ఒక స్త్రీగా తాను ఇంతకుమించి ఏమీ చేయలేనని ఏసీ శాంతి విలపిస్తూ మీడియాకు తెలిపారు.పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించి, వాటి ఆధారంగా సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదీ నేపథ్యం.. జూన్ 23న దేవదాయశాఖ ఉప కమిషనర్‌గా పుష్పవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. సింహాచలం భూముల జాబితా నుంచి కొన్ని భూములు మినహాయించిన ఘటన, మాన్సాస్ భూములపై విచారణ సంఘంలో ఆయన్ని కూడా ప్రభుత్వం నియమించింది. హుండీల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని జూలై 19న జ్ఞానాపురం శ్రీఎర్నిమాంబ దేవాలయం ఈవో, అనకాపల్లి ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరాజును ఆయన సస్పెండ్ చేసి 34 చార్జ్‌లు నమోదు చేశారు. అనంతరం జూలై 28న విశాఖ అర్బన్ ఇన్స్పెక్టర్, పలు ఆలయాల ఈవో మంగి పూడి శ్రీధర్‌ను ఏసీ కె.శాంతి సస్పెండ్ చేసి 31 చార్జ్‌లు నమోదు చేశారు. డీసీ చర్యకు ప్రతిచర్యగానే ఏసీ వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాదం నెలకొంది. -
ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. జగనన్న కాలనీలకు ఇసుకను నేరుగా రీచ్‌ల నుంచి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఇసుక సరఫరాలో పారదర్శకత కోసం ఈ-పర్మిట్ విధానం తీసుకొచ్చామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ముందుగా నిల్వలు పెడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 50 లక్షల టన్నులకుపైగా ఇసుక నిల్వ చేస్తామన్నారు. ప్రస్తుతం రోజుకి 3 లక్షల టన్నుల ఇసుక తీస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం గ్రామ పాలనలో విప్లవాత్మక మార్పులు: మంత్రి పెద్దిరెడ్డి -
ఏ పీ లో మరింత పారదర్శకంగా ఇసుక పాలసీ
-
ఏపీ: ఇకపై ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్
సాక్షి, అమరావతి: ఇకపై ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ తప్పనిసరి చేశామని.. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసినట్లు భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఇసుకకు ఈ-పర్మిట్ కోసం మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశామని, ఇప్పుడు అమలులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ-పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింపచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ఇకపై రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్లైన్లో ఈ-పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా డీఎంజీ కార్యాలయం నుంచి ఈ-పర్మిట్‌ను జారీ చేస్తామన్నారు. ఈ పర్మిట్ వల్ల ఏ రీచ్‌లో ఎంత ఇసుక తవ్వకానికి సంబంధించి అనుమతులు ఇచ్చాం. ఏ మేరకు మైనింగ్ జరిగిదనేది ఖచ్చితంగా తెలుస్తుందని, ఆన్లైన్లో దీనికి సంబంధించిన వివరాలు నమోదవ్వడం వల్ల మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందన్నారు. చదవండి: వ్యాక్సినేషన్: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం: కన్నబాబు -
Mars: మార్స్ మీద మంచు.. ఇసుక
ఇసుక తిన్నెల్లో మంచుతో ఫొటో బాగుంది కదూ.. ఎక్కడిదీ ఫొటో తెలుసా? ఆ.. ఏముందీ.. ఏదో ఓ ఎడారిలో తీసి ఉంటారు అనుకుంటున్నారా.. కాదు.. ఇది ఎడారిలోనో, ఆ చుట్టూ ఉన్న ఏదో ఓ దేశంలోనో తీసిన ఫొటో కాదు. అసలు భూమి మీద ఏ ప్రాంతం కూడా కాదు.. మనకు కోట్ల కిలోమీటర్ల దూ రంలో ఉన్న అంగారక గ్రహం (మార్స్) మీద తీసిన ఫొటో ఇది. అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ‘మార్స్ ఆర్బిటార్’ శాటిలైట్ తీసిన ఫొటో ఇది. మార్స్ మీద ఉన్న ఓ పేద్ద బిలంలో ఉన్న ఇసుక తిన్నెలను ‘మార్స్ ఆర్బిటార్’కు అమర్చిన హైరైజ్ కెమెరాతో చిత్రీకరించారు. సౌర కుటుంబంలో మన భూమి మాత్రమేనా.. మరో గ్రహం మీద మనిషి బతకగలడా.. అంతరిక్ష శాస్త్రవేత్తల్లో చాలా మందిని తొలిచేస్తున్న ప్రశ్నలివి. శాస్త్రవేత్తలకే కాదు చాలా మంది సాధారణ జనానికీ ఇదే ఆసక్తి. అందుకే భూమితో పోలిస్తే దగ్గరి పోలికలు ఉండే అంగారకుడిపై శాస్త్రవేత్తలు ఏనాడో దృష్టి పెట్టారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా చాలా దేశాలు మార్స్ దగ్గరికి శాటిలైట్లను, ఆర్బిటర్లను పంపాయి. అలా నాసా పంపిన ‘మార్స్ ఆర్బిటర్’ అంగారకుడికి సంబంధించిన ఎన్నో రహస్యాలను గుర్తించింది. ఈ క్రమంలోనే తాజాగా ఫొటోలు పంపింది. ఆ ఫొటోలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై మంచు ఏర్పడుతూ, అప్పుడప్పుడూ కరిగి ప్రవహిస్తోందని గుర్తించారు. అందుకే కాలువల్లాంటి నిర్మాణాలు ఏర్పడినట్టు తేల్చారు. ఇక్కడ చదవండి: మార్స్‌పై తొలి నగరం ఇలా ఉంటుందా..! మార్స్ సంచలన నిజాలు బయటపెట్టిన నాసా...! -
'నో ఆన్లైన్ బుకింగ్.. ఎక్కడినుంచైనా ఇసుకను తీసుకెళ్లొచ్చు'
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం విలేకరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇసుక టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ కొత్త పాలసీ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, ప్రజల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని పాలసీలో మార్పులు చేసి నూతన ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. నిర్ణయించిన ధరకే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రీచ్‌ల్లోనూ ఒకే ధర అమలు చేస్తున్నామని, ప్రతి ఇసుక రీచ్ వద్ద 20 వాహనాలు ఏర్పాటు చేసిట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రీచ్‌ల్లోనూ ధరను ముందే నిర్ణయిస్తున్నామని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా వినియోగదారులు నేరుగా వచ్చి వారి సొంత వాహనాల్లో ఇసుకను తీసుకెళ్లొచ్చని, నాణ్యతను పరిశీలించి తమకు నచ్చినచోట ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు ఉందని వివరించారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. 'ఇసుక తవ్వకాలు, రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలకు సంబంధించి టెండర్లను ఆహ్వానించాం. ఎవ్వరైనా పాల్గొనేందుకు వారం రోజులు అదనపు సమయం కూడా ఇచ్చాం. పూర్తి పారదర్శకంగా టెండర్లను నిర్వహించాం. ఇందులో భాగంగానే జనవరి 4న ఎంఎస్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ సంస్థ టెండర్ల విధానంలో ఎంతో అనుభవం ఉన్న ఏజెన్సీ. మూడు ప్యాకేజీల కు కచ్చితంగా నిబంధనలు పెట్టాం. సాంకేతిక, ఆర్థిక అర్హతలు అన్ని ముందే పరిశీలించాం. ఏడాదికి సుమారు వెయ్యి కోట్లు ఇసుకను సరఫరా చెయ్యగలరు. ప్రతి 15 రోజులకు ప్రభుత్వానికి టెండర్ సంస్థ డబ్బులు చెల్లించాలి. 70 శాతం రీచ్ లు ఖచ్చితంగా నిరంతరం అందుబాటులో ఉండాలి. ఇసుక కొరత సృష్టించడానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించాం. వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చెయ్యలేరు. ప్రతి రీచ్ దగ్గర టన్ను ఇసుక 475 ధర ను ఖరారు చేశాం. దానికి అదనంగా రవాణా ఛార్జీల ఉంటాయి' అని స్పష్టం చేశారు. చదవండి : విశాఖలో బీఎస్–6 ఇంధన ఉత్పత్తి స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: విజయసాయిరెడ్డి -
భవిష్యత్‌లో ఇసుక దొరకదా!?
ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణరంగం ప్రస్తుతం తీవ్ర ఇసుక కొరతను ఎదుర్కొంటోంది. భవిష్యత్‌లో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇసుక నిల్వల్లో పనికొచ్చేది మాత్రం కొంతే ఉంటుందని, ఆ ఇసుక నిల్వలు వేగంగా అడుగంటి పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరుల్లో నీరు తర్వాత స్థానం ఇసుకదే. షాపింగ్ మాల్స్, ఆఫీస్‌లు, అపార్ట్మెంట్లు.. ఇలా ఒకటేమిటి ఏది నిర్మించాలన్నా ఇసుక ప్రధాన ముడిసరుకు. అంతేకాదు స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ల నుంచి కిటీకీల గ్లాస్‌ల తయారీ వరకూ.. కంప్యూటర్లలో చిప్స్ నుంచి ఇంట్లో వినియోగించే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులోనూ ఇసుక మరో అవతారం సిలికా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సరాసరి 50 బిలియన్ టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని లెక్కతేల్చారు. పట్టణీకరణతోనే ముప్పు.. మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పట్టణీకరణ జరుగుతుండటమే ఇసుక కొరతకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి ఏటా లక్షలాది మంది పట్టణాల బాట పడుతున్నారు. 1950 నుంచి ఇప్పటి వరకూ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల్లో నాలుగురెట్ల జనాభా పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న 4.2 బిలియన్ల జనాభాకు వచ్చే మూడు దశాబ్దాల్లో మరో 2.5 బిలియన్ల జనాభా తోడవుతుందని ఐరాస అంచనా వేసింది. వీళ్లందరికి మౌలిక సదుపాయాలు కల్పించే నిర్మాణాల్లో భారీ ఎత్తున ఇసుక వినియోగించాల్సి ఉంటుంది. భారతదేశంలో అయితే 2000 సంవత్సరం నుంచి ఏటా ఇసుక వినియోగం మూడు రెట్లు పెరుగుతూ వస్తోంది. 20వ శతాబ్దం మొత్తంలో అమెరికా వినియోగించినంత ఇసుక ఈ ఒక్క దశాబ్దంలోనే చైనా వాడేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఆకాశ హార్మ్యాలను నిర్మించే దుబాయ్ ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది. తీరంలో పర్యావరణానికి ముప్పు.. సముద్రంలో ఇసుక తవ్వకంతో కెన్యా, పర్షియన్ గల్ఫ్, ఫ్లోరిడా తీరంలోని అత్యంత విలువైన కోరల్ రీఫ్స్‌కు ముప్పు ముంచుకొచ్చింది. ఇసుక తవ్వకంతో ఏర్పడ్డ బురద వల్ల సముద్రంలో సహజ వాతావరణంలో బతికే జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అలాగే నదుల్లో ఇసుక మైనింగ్‌తో నీటి జీవులు ఊపిరాడక చనిపోతున్నాయి. క్వాలిటీ సిలికా మైనింగ్ కోసం ఏటా వేలాది ఎకరాల అడవులను నరికేస్తున్నారు. ఇసుక మైనింగ్ వల్ల వియత్నాంలోని మెకాంగ్ డెల్టా మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. కంబోడియా, లావోస్‌లో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల నదుల గట్లు దెబ్బతిని పొలాలు, ఇళ్లు ఆ నదుల్లో కలసిపోతున్నాయి. అయెయార్వాడీ నదిలో ఇసుక తవ్వకం వల్ల తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని మయన్మార్ రైతులు వాపోతున్నారు. శాండ్ మైనింగ్‌తో 2000వ సంవత్సరంలో తైవాన్‌లో ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఆ తర్వాత ఏడాది కూడా ఇలాంటి తవ్వకాలతో పోర్చుగల్‌లో బ్రిడ్జి కూలడం వల్ల బస్సులో వెళ్తున్న 70 మంది మృత్యువాత పడ్డారు. కృత్రిమ ఇసుక దీవులు ఉన్న స్థలం చాలకపోవడంతో సింగపూర్ గడిచిన 40 ఏళ్లలో 130 చదరపు మైళ్ల మేర సముద్రాన్ని ఇసుకతో నింపి ఇళ్లు నిర్మించింది. దీని కోసం ఇతర దేశాల నుంచి భారీగా ఇసుకను దిగుమతి చేసుకుంది. ఇలాగే దుబాయ్‌తో పాటు ఇతర దేశాలు కూడా సముద్రంలో నయా నగరాలను ఇసుకతో నిర్మిస్తున్నాయి. ఓ డచ్ పరిశోధన బృందం లెక్కల ప్రకారం 1985 నుంచి ఇప్పటి వరకూ వివిధ దేశాలు ఇసుక వినియోగించి తీరంలో 13,563 చదరపు కిలోమీటర్ల మేర కృతిమ భూమిని సృష్టించాయి. ప్రత్యామ్నాయమే దారి.. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక వినియోగాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. కాంక్రీట్‌లో ఇతర ముడిసరుకులను వినియోగించడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఫ్లైయాష్, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బూడిద, ఆయిల్ పామ్ పొట్టు, ఊక తదితరాలను ఇసుకకు ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు. రీసైకిల్ కాంక్రీట్‌ను మరింత సమర్థంగా ఉపయోగించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే నదుల్లో మైనింగ్‌కు స్వస్తిపలికారు. ఇతర దేశాలు దీనిని అనుసరించడం కష్టమైనా.. నదులకు జరిగే నష్టాన్ని నివారించడానికి నిర్మాణ రంగం ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. – ఏపీ సెంట్రల్ డెస్క్ -
మ్యాజిక్ ఇసుక : మండిస్తే.. బంగారమా?!
సాక్షి, ముంబై: నమ్మిన వాడినే నట్టేట ముంచిన వైనం ఒకటి వెలుగులోకి వచ్చింది. మ్యాజిక్ సాండ్ పేరుతో ఏకంగా బంగారు వ్యాపారికే టోకరా ఇచ్చాడో ఘరానా మోసగాడు. తాను తీసుకొచ్చిన మహిమ గల ఇసుకను మండిస్తే మేలిమి బంగారం పుట్టుకొస్తుందని వ్యాపారిని నమ్మించాడు. అలా నాలుగు కిలోల ఇసుకను విక్రయించి 50 లక్షల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టాడు..ఈ విచిత్రమైన సంఘటన పుణేలో నమోదైంది. వివరాల్లో వెళితే..బంగారు ఉంగరం కొనడానికి షాపునకు వచ్చిన నిందితుడు పూణేకు ఆభరణాల వ్యాపారితో గత ఏడాది కాలంనుండి పరిచయం పెంచుకున్నాడు. అంతేకాదు, పాల ఉత్పత్తులు, బియ్యం, ఇతర వస్తువులను విక్రయిస్తూ మంచివాడిగా నటించి నమ్మకాన్ని పొందాడు. ఆ తరువాత తనప్లాన్ను అమలు చేశాడు. తన దగ్గర ఉన్న ప్రత్యేక ఇసుకను మండిస్తే.. బంగారం తయారవుతుందంటూ వ్యాపారిని బురిడీ కొట్టించాడు. స్వయంగా ఆభరణాల వ్యాపారి అయి ఉండి కూడా, అమాయకంగా అతని మాయలో పడిపోయిన వ్యాపారి ఆ మాయా ఇసుకను తీసుకొని రూ .30 లక్షల నగదు, సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ముట్టజెప్పాడు. ఆనక విషయం తెలిసి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
‘ఇసుక’ బాధ్యత ఎంఎస్‌టీసీకి..
సాక్షి, అమరావతి: ఇసుక సరఫరాలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాస్త్రీయమైన విధానంలో ఇసుక సరఫరా చేసేందుకు సంస్థల ఎంపిక బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ)కి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర గనులు, పంచాయతీరాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో గనుల శాఖ, ఎంఎస్టీసీ సోమవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఎంఎస్టీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గణేష్ ఎన్ జయకుమార్, గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.హరినారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు ప్యాకేజీలుగా విభజన ఇసుక సరఫరాకు సంస్థల ఎంపిక కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 3 ప్యాకేజీలుగా విభజించి వేర్వేరుగా టెండర్లు నిర్వహిస్తారు. మొదటి ప్యాకేజీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలు ఉంటాయి. రెండో ప్యాకేజీలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు.. మూడో ప్యాకేజీలో నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు ఉంటాయి. వాటి పరిధిలో ఇసుక తవ్వకం, రీచ్‌లు/స్టాక్ యార్డుల నిర్వహణ, సరఫరా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ఎంఎస్టీసీ బిడ్లు ఆహ్వానిస్తుంది. సాంకేతిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్లు స్వీకరిస్తుంది. ఇలా 2 రకాల బిడ్ల ద్వారా 3 ప్రాంతాలకూ ఇసుక సరఫరా సంస్థలను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఎంఎస్‌టీసీపై ఉంటుంది. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇసుక సరఫరాకు ఈ ఒప్పందం దోహదపడుతుందని, దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీని వెనుక కచ్చితంగా టీడీపీ వాళ్లే ఉన్నారన్నారు. మెరుగైన విధానం తీసుకొచ్చేందుకే.. 2019 ఇసుక పాలసీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్Ð దీనిపై మంత్రుల కమిటీ నియమించారు. కమిటీ పలుమార్లు చర్చించి ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్‌లైన్ ద్వారా ఇసుక సరఫరా చేయాలని సూచించింది. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి నిర్వహణ బాధ్యతను పెద్ద సంస్థలకు అప్పగించాలంటూ పలు సిఫార్సులతో నివేదిక సమర్పించింది. దీనిపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరించారు. శాస్త్రీయ అధ్యయనం తర్వాత రూపొందించిన ఇసుక పాలసీకి సవరణలను మంత్రివర్గం ఆమోదించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే శాస్త్రీయంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు ఇసుక అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎంఎస్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు ఆసక్తి ఉన్న ఏ సంస్థ అయినా తమ సంస్థను సంప్రదించి టెండర్లలో పాల్గొనవచ్చని ఎంఎస్టీసీ డిప్యూటీ జనరల్ మేనేజరు గణేష్ ఎన్ జయకుమార్ సూచించారు. తమ సంస్థ రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లో ఇసుక నిర్వహణకు సంస్థలను ఎంపిక చేసిందని ఆయన వివరించారు. – గణేష్ ఎన్ జయకుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎంఎస్టీసీ -
బ్యారేజీల్లో భారీగా ఇసుక నిల్వలు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీల్లో భారీగా పేరుకుపోయిన ఇసుకను వెలికితీయడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరితగతిన చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 పైగా ఓపెన్ ర్యాంపుల్లో తవ్వకాలు జరపడం, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేయడం ద్వారా డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక విధానం–2019కి సవరణల ద్వారా పాలసీని మరింత పారదర్శకంగా, లోపరహితంగా మార్చిన ప్రభుత్వం డ్రెడ్జింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కాటన్, ప్రకాశం బ్యారేజీల్లో ఇసుక పరిణామాన్ని అంచనా వేయడం కోసం బాతిమెట్రిక్ (నీటి లోతుల్ని, నేలల్ని పరీక్షించడం) సర్వే జరిపించింది. ఒక్కొక్క బ్యారేజీలో రెండేసి కోట్ల టన్నుల చొప్పున ఇసుక నిక్షేపాలున్నట్లు సర్వేలో తేలింది. నిబంధనల ప్రకారం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్ చేసుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కూడా అంగీకారం తెలిపింది. అవరోధాలు తొలగిపోవడంతో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) తయారు చేయాలని రాష్ట్ర గనుల శాఖ అధికారులు జల వనరుల శాఖను కోరారు. ఆ శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపించి ఎలా చేయాలనే దానిపై ఉన్నత స్థాయిలో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గనుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రెండు శాఖల సమన్వయంతో డ్రెడ్జింగ్ రెండేళ్లుగా భారీ వర్షాలు కురవడం, వరదలు రావడంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల్లోకి భారీగా ఇసుక చేరి పేరుకుపోయింది. దీనిని జల వనరుల, గనుల శాఖలు సమన్వయంతో డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసి ప్రజల డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. గుర్తించిన ఓపెన్ రీచ్‌లకు చట్టబద్ధమైన పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకునే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. -
ఇసుక విధానం.. మరింత సరళం
సాక్షి, అమరావతి: కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో మెరుగైన ఇసుక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఆఫ్‌లైన్‌లోనే ఇసుక పొందే అవకాశం కల్పించనుంది. రాజకీయ జోక్యానికి తావులేకుండా పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. నూతన ఇసుక విధానంపై చర్చిస్తూ.. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలను, ఎన్ఎండీసీ వంటి వాటిని సంప్రదించామని, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకుంటే 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి, పారదర్శక పద్ధతిలో టెండర్లు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఓ భాగం.. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం రెండో భాగం.. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు మూడో భాగంగా టెండర్లు జరుగుతాయి. ఇసుక సరఫరా కూడా పూర్తి పారదర్శకంగా జరగాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మొత్తంగా 33 అంశాలపై చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశంలో వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లొచ్చు ► ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇందుకు గ్రామ సచివాలయాల్లో కూపన్లు పొందాలి. బోట్స్‌మెన్ సొసైటీలు తదితరాలకు నిబంధనలు పూర్తిగా అమలు చేస్తారు. ► బలహీన వర్గాల కాలనీలు, రీచ్‌లకు దగ్గర్లోని గ్రామాలు, ఆర్అండ్ఆర్ గ్రామాలకు సబ్సిడీపై ఇసుక ఇస్తారు. ► మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ను మరింత బలోపేతం చేస్తారు. మత్తు పదార్థాలు, నిషేధిత గుట్కా విక్రయాలు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్, డ్రగ్స్ నిర్మూలన పూర్తిగా ఎస్ఈబీ పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకున్నారు. ► ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏర్పాటైన్ టాస్క్‌ఫోర్స్‌ను ఎస్ఈబీకి అనుసంధానం చేస్తారు. ఎస్ఈబీని బలోపేతం చేసేందుకు ఔట్ సోర్సింగ్‌లో 71 పోస్టులు, డిప్యుటేషన్‌పై 31 మంది అధికారుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఇళ్ల వద్దే రేషన్ బియ్యం ► జనవరి 1 నుంచి లబ్ధిదారుల ఇంటికే నాణ్యమైన (సార్టెక్స్) రేషన్ బియ్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంటికి నాణ్యమైన బియ్యం చేర్చేందుకు 9,260 మొబైల్ వాహనాలు సిద్ధం చేశారు. మొబైల్ వాహనాల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 20 శాతం ఈబీసీలకు కేటాయిస్తారు. ఆరేళ్లకు వాహనం లబ్ధిదారుడికి సొంతమవుతుంది. ► బియ్యం బస్తాలు దారి మళ్లకుండా ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. వాహనాలకు జీపీఎస్ అమరుస్తాం. ప్రతి లబ్ధిదారుడికి రెండు రీ యూజ్డ్ బ్యాగులు అందజేస్తాం. ప్రస్తుతం ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. పాడి పరిశ్రమ బలోపేతం ► సహకార రంగంలో మహిళల స్వావలంబనకు రూ.1,362.22 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు రూపొందించాం. 500 లీటర్ల కన్నా ఎక్కువ పాల సేకరణ జరిగే 9,899 గ్రామాల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► రాష్ట్రంలో పాల విప్లవం వెల్లి విరియనుంది. అమూల్‌తో ఎంఓయూ కుదిరింది. పశువుల దాణా, మందులు అన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తాం. ఇక్కడే మహిళలు నిర్వహించేలా పాల ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభిస్తాం. ఆర్బీకేకు అనుసంధానంగా ఇవి పనిచేస్తాయి. ► ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా పాడి పశువుల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించాం. ‘భూమి రక్ష’ పేరుతో సమగ్ర భూసర్వే సమగ్ర భూసర్వే జనవరి 1న ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,500 సర్వే బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 15 వేల మంది సర్వేయర్లు ఉంటారు. ఒక్కో మండలంలో నాలుగు నెలలు చొప్పున సర్వే కొనసాగుతుంది. 2023 జూన్ నాటికి సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్కడికక్కడే భూ వివాదాలను పరిష్కరించేలా ప్రత్యేక మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. ► సర్వే చేసిన ప్రతి భూమికి యునిక్ నంబర్ కేటాయిస్తారు. ఈ నంబర్ ద్వారా పట్టాదారుడు తన భూమి వివరాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అన్ని లావాదేవీలకు ఈ నంబర్ వర్తిస్తుంది. ► వ్యవసాయ భూములతో పాటు గ్రామ కంఠాలు, మున్సిపాల్టీలలోని నివాసిత స్ధలాలకు సంబంధించి పక్కా పాస్‌బుక్, లీగల్ టైటిల్ కల్పించడమే లక్ష్యం. గ్రామ సచివాలయం కేంద్రంగా రిజిష్ట్రారు కార్యాలయం ఉంటుంది. భూ రక్షణకు సంబంధించి ఇదో విప్లవం. ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్–2020కి ఆమోదం ► 2006లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ –2006 కు సవరణలు చేస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్–2020కి కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఉత్పతులు అందుబాటులో ఉంటాయి. ►ఆక్వా రైతులకు నాణ్యమైన ఫిష్ ఫీడ్ అందించేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్టు –2020ని కూడా కేబినెట్ ఆమోదించింది. వైద్య కళాశాలకు స్ధలాల కేటాయింపు ► నూతన వైద్య కళాశాలల కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిలకలపూడిలో 29.6 ఎకరాలు, విజయనగరం మండలం గాజులరేగలో 80 ఎకరాలు, విశాఖ జిల్లా పాడేరు మండలం తలారిసింగి వద్ద 35.01 ఎకరాలు, అనంతపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం పెనుకొండలో 48.49 ఎకరాల స్థలం కేటాయించారు. ► రాజమండ్రిలో 12.57 ఎకరాలు, నంద్యాల మండలం నూనెపల్లిలో 50 ఎకరాలు, విశాఖ జిల్లా అనకాపల్లిలో 50 ఎకరాలు, గుంటూరు జిల్లా బాపట్ల మండలం జమ్ములపాలెంలో 51.07 ఎకరాలు, గుంటూరు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి విస్తరణ కోసం 6 ఎకరాలు కేటాయించారు. ► తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల విస్తరణ కోసం కాకినాడ అర్బన్ మండలం రమణయ్యపేట వద్ద 15.76 ఎకరాలు కేటాయింపు. ► విజయవాడ కృష్ణలంకలో నిర్మల శిశుభవన్ (అనాథ శరణాలయం)కు మిషనరీ ఆప్ ఛారిటీస్‌కు 2 వేల గజాల స్థలాన్ని గజం రూపాయి చొప్పున 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► విజయవాడ బందరు కాలువ పక్కన 2,266 గజాల స్థలాన్ని మిషనరీ ఆప్ ఛారిటీస్‌కు నిర్మల హృదయ భవన్ (వృద్ధాశ్రమం) ఏర్పాటు కోసం దీర్ఘకాలిక లీజుకు అనుమతించింది. ఏ సీజన్లో పంట నష్టానికి ఆ సీజన్లోనే చెల్లింపు ► నవంబరు 17న ప్రారంభించనున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► 2019–20 ఖరీఫ్ నాటి నుంచి అమలయ్చే ఈ పథకం వల్ల 14.58 లక్షల రైతులకు ప్రయోజనం ఉంటుంది. దీని కోసం సుమారు రూ.510 కోట్లు కేటాయించారు. ► గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,050 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. దీంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్లో జరిగిన పంట నష్టాన్ని ఆ సీజన్లో చెల్లిస్తున్నాం. అక్టోబర్‌లో జరిగిన పంట నష్టాన్ని ఈ నెలలోనే చెల్లించాలని నిర్ణయించాం. క్రికెట్ స్టేడియంల ఏర్పాటుకు లీజు ► శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం జగ్గుశాస్త్రులపేటలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు 7.66 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తారు. ఏడాదికి రూ.2 లక్షలు లీజు ధర కాగా.. ఏటా 12.5 శాతం లీజు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం కేవీ పల్లెలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు 11 ఎకరాలను 30 యేళ్లపాటు లీజుకు కేటాయిస్తారు. ఏడాదికి రూ.2 లక్షల లీజు ధర కాగా.. ఏటా 12.5 శాతం లీజు పెంపునకు కేబినెట్ ఆమోదించింది. వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ ► వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్–18, జీవో ఎంఎస్ నెంబర్–19లలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► తద్వారా ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చు ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు తగ్గనుంది. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ)ను బలోపేతం చేయడంతో పాటు ఆ సంస్థకు చట్టబద్దత కల్పించడం కోసం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ► ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన నూటికి నూరు శాతం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏపీఎస్డీసీ. ఇది సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు ఇది ప్లానింగ్, ఫండింగ్ చేస్తుంది. మచిలీపట్నం పోర్టుకు రూ.5,835 కోట్లు ► మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులకు రైట్స్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించడంతో పాటు ఆ ప్రాజెక్టు మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5,835 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ► మొదటి దశ పనులకు అవసరమైన 225 ఎకరాల భూసేకరణ కోసం ఏపీ మారిటైం బోర్డు రూ.90 కోట్లు కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మారిటైం బోర్డు మొత్తం రూ.4,745 కోట్లు సేకరించనుంది. రూ.1,050 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ రూ.700 కోట్ల పెట్టుబడితో ఇంటిలిజెంట్ సెజ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో పాదరక్షల తయారీ యూనిట్, రూ.1,050 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ కంపెనీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల వల్ల 36,900 మందికి ఉపాధి లభిస్తుంది. మరిన్ని నిర్ణయాలు ఇలా.. ► వైఎస్సార్ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో కొత్తగా 224 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 138 టీచింగ్, 86 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ► హోం శాఖ పరిధిలో రాష్ట్రంలోని 8 జిల్లా జైళ్ల (పురుషులు)లో డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులను అడిషనల్ సూపరింటెండెంట్‌గా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు నాలుగు కేంద్ర కారాగారాల్లో 4 అడిషనల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం. ► అగ్నిమాపక శాఖలో జోనల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడున్న రెండు జోన్లు నాలుగు జోన్లుగా మార్పు. ► కొత్తగా రీజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్టు –1, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ పోస్టులు–2 మంజూరు. ► వైద్య, ఆరోగ్య శాఖలో టీచింగ్ ఫ్యాకల్టీకి ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం యూజీసీ తరహాలోనే జీతాలివ్వాలన్న నిర్ణయం. దీని వల్ల ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.400 కోట్లు అదనపు భారం పడుతుంది. సుమారు 3,500 మంది మెడికల్ టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రయోజనం కలుగుతుంది. ► ఐదు సంవత్సరాల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను విడుదల చేయాలన్న కేబినెట్ నిర్ణయంతో 48 మంది మహిళా ఖైదీలు విడుదల కానున్నారు. ► కాపు నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న చేదోడు, చేయూత పథకాల్లో మిగిలిపోయిన అర్హులకు నవంబర్ 6వ తేదీ నుంచి పథకాలు వర్తింప చేయాలన్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖలో రూ.14,634 కోట్లతో సుమారు 25 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ వర్సిటీ, రిక్రి యేషన్ సెంటర్‌కు కేబినెట్ ఆమోదం తెలి పింది. 2018లో అదాని సంస్థ ప్రతిపాదించిన భూమి కంటే తక్కువ భూమి కేటాయిస్తూ అప్పటి కంటే ఎక్కువ మందికి ఉపాధి లభిం చేలా నిర్ణయం తీసుకున్నారు. 2018లో చేసిన ప్రతిపాదనల ప్రకారం 500 ఎకరాల్లో డేటా సెంటర్ నిర్మాణం ద్వారా 6,000 మందికి ఉపాధి లభించనుండగా, ప్రస్తుతం మంత్రి మండలి ఆమోదించిన ప్రతిపా దన ద్వారా 130 ఎకరాల్లో ప్రాజెక్టు చేపట్టడం ద్వారా 24,990 మందికి ఉపాధి లభించనుంది. చిన్న, వీధి వ్యాపారాలు చేసుకునే వారు, చేతి వృత్తుల కళాకారులకు వడ్డీ లేకుండా ‘జగనన్న తోడు’ పథకం కింద రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇస్తారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించిన ఈ పథకం నవంబర్ 24న ప్రారంభం అవుతుంది. ఈ పథకం కింద 9.18 లక్షల మంది నమోదయ్యారు. బ్యాంకుల ద్వారా 5.60 లక్షల మందిని టై అప్ చేశారు. డ్రోన్లు, రోవర్లు, 70 బేస్ స్టేషన్లు (కంటిన్యూస్ ఆపరే టింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ కోర్స్) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట నున్న సమగ్ర భూ రీసర్వే ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.987.46 కోట్లతో సమగ్ర భూ రీసర్వే చేపట్టనున్నారు. ప్రతి ఇసుక రీచ్ దగ్గర 20 వాహనాలు ఏర్పాటు చేస్తారు. ఇసుక రీచ్‌ల వద్దే ధర నిర్ణయిస్తారు. అధిక ధరలకు అమ్మితే స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కావాల్సిన వాహనాన్ని బుక్ చేసుకుని ఇసుక తీసుకెళ్లొచ్చు. వినియోగదారుడు సొంత వాహనంలోనైనా తీసుకెళ్లొచ్చు. పట్టా భూముల నుంచి ఇసుక తీసుకునే విధానాన్ని రద్దు చేశారు. -
ఇసుక కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదు..
సాక్షి, అమరావతి: వర్షాకాలం నేపథ్యంలో ఎవరికీ ఇబ్బందుల్లేకుండా ఇసుక అందించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఇసుక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమితులైన కమిటీ సభ్యులు, మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్యలు సమీక్ష నిర్వహించారు. భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హరినారాయణ్, గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. ► గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలుగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ► గుర్తింపు పొందిన జలవనరుల నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా ప్రజలు సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడంలో ఇబ్బందుల్లేకుండా చూడాలి. ► నాడు–నేడు, ఉపాధి హామీ పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. -
ఇసుక మరింత చౌకగా..
శృంగవరపుకోట: ఇసుక కొరత రానీయకూడదన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకుంటోంది. అన్ని వర్గాల అవసరాలకూ ఇసుక ఉచితంగా అందివ్వాలన్న నిర్ణయంతో ఎంతోమందికి మేలు కలగనుంది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లను ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి ఈ నెల 13న ఆదేశాలు వెలువడ్డాయి. శుక్రవారం నుంచి ఇది అమలులోకి రానుంది. భారీగా తగ్గనున్న ధరలు జిల్లాలో 80 ఇసుక రీచ్‌లు ఉండగా ఇవన్నీ 1 నుంచి 3 స్ట్రీమ్స్‌గానే పరిగణిస్తున్నారు. ప్రస్తుతం 34 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక లభిస్తోంది. ఇప్పటి వరకూ టాక్టర్తో ఇసుక తరలించాలంటే ప్రభుత్వానికి రూ.1300లు చలానా కట్టాల్సి వచ్చేది. టైరు బండ్లు మాదిరిగా ట్రాక్టర్లతో ఇసుక రవాణాకు ఎటువంటి చెల్లింపులు అవసరం లేదని తాజా ఉత్తర్వుల్లో తేల్చడంతో భారీగా ధర తగ్గనుంది. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుకకు చలానాగా రూ.1300లు, లోడింగ్ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1000 నుంచి 1500లు మొత్తం రూ3500 నుంచి 4000 వరకూ వసూలు చేస్తున్నారు. ఇకపై చలానా ధర తగ్గడంతో వినియోగదారునికి వెసులుబాటు కలగనుంది. తాజా మార్గదర్శకాలు -వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్–1లో ఇసుక కోసం దరఖాస్తు చేయాలి. ∙24 గంటల్లో అర్జీని పరిశీలించి అనెక్సర్–2లో పర్మిట్‌ను సమయం, తేదీలతో ఇస్తారు. ఇసుకను రీచ్ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు. -ఇసుక రవాణా సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్ కచ్చితంగా ఉండాలి. నోటిఫై చేసిన రీచ్‌ల నుంచి ఇసుక తరలించాలి. -గ్రామకార్యదర్శి ఇసుక పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాలి. 1నుంచి 3స్ట్రీమ్స్‌లో ఇసుక లభ్యత లేకుంటే జిల్లా కలెక్టర్ 4, 5 స్ట్రీమ్స్ నుంచి ఇసుక తెప్పించి స్టాక్‌యార్డుల ద్వారా సరఫరా చేస్తారు. లోడింగ్ చార్జీల భారం తగ్గాలి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న పలు రీచ్‌లలో ట్రాక్టర్ లోడింగ్‌కు రూ. 800 నుంచి 1000లు వసూ లు చేస్తున్నారు. గతంలో లోడింగ్ చార్జీలు రూ.400లే ఉండేది. క్రమంగా ఇసుకకు డిమాండ్ పెరగటంతో లోడింగ్ చార్జీలు కూడా పెంచేశారు. దీని భారం వినియోగదారులపై పడుతోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకా రం లోడింగ్‌కు టన్నుకు రూ.90లు చొప్పున ట్రాక్టర్ (4.5టన్నులు)కు రూ.405లు తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా లోడింగ్ చార్జీలపై నియంత్రణ లేక పోవటంతో ఇసుక ధర తగ్గటం లేదు. ఇదే తీరుగా వినియోగదారుల అవసరాలను ట్రాక్టర్ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల అవసరాలు తీర్చటం కోసం ఆదాయాన్ని వదులుకున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లోడింగ్, ట్రాన్స్‌పోర్టు చార్జీలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్‌కు రూ.1300లు భారం తగ్గింది. సామాన్యులకు అందుబాటు.. ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆశయం. తాజా ఉత్తర్వుల ప్రకారం ట్రాక్టర్లను రూ.1300లు చలానా నుంచి మినహాయించారు. జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న 34రీచ్‌ల నుంచి ఎక్కడైనా నిబంధనలకు లోబడి ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. శుక్రవారం నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ట్రాక్టర్ లోడింగ్‌కు రూ.405లు తీసుకోవాలి. అధిక వసూళ్లపై జిల్లా కలెక్టర్, జేసీలతో సంప్రదిస్తాం. – కర్రా ప్రవీణ్‌కుమార్, జిల్లా ఇసుక సహాయ అధికారి -
ఇసుక వివాదం: తండ్రీ, కొడుకుల హత్య..
భోపాల్ : ఇసుక గొడవ కారణంగా పక్కింటి వారు దాడి చేయడంతో తండ్రీ, కొడుకులు మృతిచెందిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే.. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న టికంగఢ్ గ్రామంలో దేశ్రాజ్(57) కుటుంబం నివాసముంటోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పొరుగున ఉన్న మోహన్‌లోధి, తన కుమారుడు బృందావన్ లోధితో కలిసి తమ ఇంటి ముందు ఇసుకను కడుగుతుండగా ఇందుకు దేశ్రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇసుక కడిగిన నీళ్లన్నీ తమ ఇంట్లోకి వస్తుందని వాదించాడు. దీంతో కోపానికి గురైన మోహన్‌లోధి దేశ్రాజ్పై గొడవకు దిగారు. ఇద్దరి మధ్య నెలకొన్న వాగ్వాదం పెద్దది కావడంతో మోహన్ లోధి, బృందావన్ లోధి తమ కుటుంబ సభ్యులతో కలిసి దేశ్రాజ్పై కర్రలతో దాడికి తెగబడ్డారు. (పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి బలి ) ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు వెళ్లిన దేశ్రాజ్ కుమారులు గులాబ్, జహార్‌తోపాటు ఆయన భార్యపైనా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘర్షణలో గులాబ్ అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేశ్రాజ్ కూడా మృతి చెందాడు. కాగా దేశ్రాజ్ భార్య సోనాభాయి, మరో కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తండ్రీ, కొడుకుల హత్య కేసుకు సంబంధించి మొత్తం 17 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బ్రజేష్ కుమార్ తెలిపారు. నిందితులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, ఘటన అనంతరం పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (బెంగళూరు: కూతురిపై తండ్రి అఘాయిత్యం) అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి! -
అక్రమ ఇసుక, మద్యం రవాణాపై కఠిన చర్యలు
సాక్షి, కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక, మద్యం రవాణా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు. ఆయన గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక, మద్యం రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. గుర్తించిన మార్గాలలో సీసీ కెమెరాలు, మొబైల్ చెక్ పోస్ట్, ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేశాని తెలిపారు. సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (ఆగస్ట్ నుంచి గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన) పాత నేరస్తులుగా ఉంటే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై రౌడీషీట్ కూడా తెరుస్తామని వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు. గురువారం ఒక్క రోజే 41 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. 65 వాహనాలు స్వాధీనం చేసుకొన్నామని, 851 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజలు సహకరిస్తే అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడం సులభతరం అవుతుందని అన్నారు. (జగనన్న చేదోడుపై సర్వత్రా హర్షం!) -
ఏపీ: ఇసుక విక్రయాలు మరింత పారదర్శకం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారులకు ఇసుకను సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈనెల 5న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రకటించిన తరువాత ఎపిఎండిసి ద్వారా పారదర్శకతతో ఇసుక విక్రయాలను నిర్వహిస్తున్నామని అన్నారు. (ఎడ్ల బండ్లకు ఇసుక ఉచితం) ఇసుక డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే ఆన్ లైన్ విధానంలో ఇసుకను వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు వుందన్నారు. కొత్త విధానం ద్వారా వినియోగదారులకు ఇసుకను అందిస్తున్న క్రమంలో ఎదురవుతున్న సమస్యలను కూడా గుర్తించి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అదే క్రమంలో ఇసుక మాఫియాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు రీచ్ లు, స్టాక్ పాయింట్లు, చెక్ పోస్ట్ లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడం, గనుల శాఖ, రెవెన్యూ, రవాణా శాఖల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఇబి) ద్వారా తనిఖీలు చేయడం ద్వారా అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండేళ్ళ జైలుశిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టాన్ని చేసిందని పేర్కొన్నారు. (రీచ్‌లలో అక్రమాలు లేకుండా చూడాలి: సీఎం జగన్) ఇకపై సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ ఇప్పటి వరకు ఇసుక కావాల్సిన వారు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వారని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం వున్న వారికే ముందుగా ఇసుక లభిస్తుండటంతో, పోర్టల్ ప్రారంభించిన కొద్దిసేపటికే బుక్ అవుతోందన్నారు. దీంతో మిగిలిన వినియోగదారులకు ఇసుక బుకింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ లు నిర్వహించేందుకు ఈ నెల 5న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం వుంటుందని వెల్లడించారు. వినియోగదారులు సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకున్నట్లయితే స్థానికంగా వున్న సచివాలయ వ్యవస్థ ద్వారా నిజమైన అవసరానికే సదరు బుకింగ్ జరుగుతోందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, నిర్ధారించుకునేందుకు అవకాశం వుంటుందని పేర్కొన్నారు. దీనివల్ల అవసరం లేని వారు కూడా ఇసుకను బుక్ చేసి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే అవకాశం వుండదని స్పష్టం చేశారు. స్థానికులకు ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుకకు అనుమతి రాష్ట్రంలో వాగులు, వంకలతో పాటు చిన్న నీటిపాయల నుంచి ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా స్థానికులు వాడుకునేందుకు వీలుగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. గతంలో వాగులు, వంకలకు చెందిన 1 నుంచి 3వ ఆర్డర్ స్ట్రీమ్ ల నుంచి మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుక తీసుకునే వీలుండేదన్నారు. తాజాగా ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నదులు, జలవనరులకు సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు తమ అవసరాల కోసం ఎడ్లబండ్ల ద్వారా తీసుకునే ఉచిత ఇసుక పరిధిని 4, 5 ఆ పై ఆర్డర్ స్ట్రీమ్ ల వరకు కూడా పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని చెప్పారు. గుర్తించిన వాటర్ స్ట్రీమ్ ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఉచితంగా ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీనివల్ల జలవనరుల సమీపంలోని ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని, ఇసుక బుకింగ్ లపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు మరింత వేగవంతం.. లాక్ డౌన్ తరువాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలను మరింత వేగవంతం చేశామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిని అతి త్వరలోనే రోజుకు మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,53,197 మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వితీశామని, దానిలో డోర్ డెలివరీ ద్వారా 33,28,553 ఎంటిలు, ఇతర వినియోగదారులకు 53,57,003 ఎంటిలు అందించామని తెలిపారు. ఇక ఉపాధి హామీ పనుల కోసం 7,51,189 ఎంటిలు, నాడు-నేడు పనులకు 3,29,814 ఎంటిలు, బల్క్ బుకింగ్ లకు 21,47,386 మెట్రిక్ టన్నుల ఇసుకను రవాణా చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం అవసరాల కోసం మొత్తం డెబ్బై లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వినియోగదారులు 48,99,916 టన్నులను బుక్ చేసుకోగా, వారికి 46,20,217 టన్నులను రవాణా చేశామని తెలిపారు. కేవలం 5.7శాతం మాత్రమే వారికి పెండింగ్ వుందని తెలిపారు. అలాగే 16,70,678 టన్నుల బుల్క్ బుకింగ్ కి గానూ 14,25,797 టన్నులు రవాణా చేశామని, ఇంకా పెండింగ్ లో కేవలం 2,44,540 టన్నులు మాత్రమే వుందని వివరించారు. ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు పర్యావరణ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఇసుక అందించే నదుల్లోని ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. ఇక్కడ యంత్రాలను, ఇసుకను బయటకు పంపేందుకు లారీలు, టిప్పర్లను ఉపయోగించేందుకు నిబంధనలు అంగీకరించని నేపథ్యంలో కూలీలతో తవ్వకాలు చేసి, ట్రాక్టర్ ల ద్వారానే తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్ లకు పంపుతున్నామని తెలిపారు. అయితే కోవిడ్-19 కి ముందు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇసుక తవ్వకాల్లో ఎక్కువశాతం పనిచేశారని, లాక్ డౌన్ కారణంగా పనులు నిలిపివేయడంతో కూలీల్లో అధికశాతం తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు. దీనితో ప్రస్తుతం స్థానికంగా వున్న కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. దీనివల్ల కూడా ఓపెన్ రీచ్ ల నుంచి వచ్చే ఇసుక నిల్వలు కొంత మందగించాయని అన్నారు. జిల్లాల్లోని కలెక్టర్ల ద్వారా తిరిగి ఇసుక తవ్వకాల్లో నైపూణ్యం వున్న వలస కూలీలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓపెన్ రీచ్ లలో కూడా ఇసుక తవ్వకాలను పెంచాలని అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు, మైనింగ్, ఎపిఎండిసి, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఎక్కువ ఇసుకను తవ్వేందుకు, రీచ్ లలో ఆపరేషన్లు సక్రమంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో ఇసుక పై పూర్తి పర్యవేక్షణ ఇసుక ఆపరేషన్లపై జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. జిల్లాలో టెక్నికల్ టీంల ఆధ్వర్యంలో రీచ్ లు, పట్టాభూముల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పట్టాభూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఇకపై బల్క్ బుకింగ్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ల పర్యవేక్షణలోనే అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. -
ఇసుకపై సీఎం జగన్ సమీక్ష
-
ఇక ఇసుకకు ఇబ్బందుల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటు భవన నిర్మాణ రంగం పనులు తిరిగి ఊపందుకుంటున్నాయి. రెండు నెలల పాటు పనులు నిలిపేసిన నిర్మాణ సంస్థలు తిరిగి తమ కార్యకలాపాలను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో నిర్మాణ సామగ్రిలో అత్యంత కీలకమైన ఇసుకకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే కోవిడ్‌తో నష్టపోయిన నిర్మాణదారులు వానాకాలం ప్రారంభం కావడంతో రాబోయే రోజుల్లో ఇసుక కొరత తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వానాకాలంలోనూ ఇసుక సరఫరాలో అంతరాయం లేకుండా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాది అనుభవంతో..! గతేడాది కూడా వానాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా టీఎస్ఎండీసీ ముందస్తుగా స్టాక్ యార్డుల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్లు నిల్వ చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ప్రణాళిక అమల్లో ఆలస్యంతో పాటు భారీ వర్షాల మూలంగా ఇబ్బందులు తలెత్తాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 19 జిల్లాల పరిధిలోని 52 స్టాక్ యార్డుల్లో 41.18 లక్షల క్యూబిక్ మీటర్లు ఇప్పటికే నిల్వ ఉండగా, 34 రీచ్‌ల్లో ఇంకా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు సరిహద్దు జిల్లాల్లోని నిర్మాణ రంగం కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, భౌరంపేటలో టీఎస్ఎండీసీ సబ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసింది. సబ్ స్టాక్ యార్డుల్లోనూ వానాకాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఎండీసీ పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేస్తోంది. అదనపు స్టాక్ యార్డులు.. కొత్త రీచ్‌లు వానాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా ఈ ఏడాది స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు పెంచడంతో పాటు, రీచ్‌లకు వెళ్లే మార్గాలను మెరుగు పరిచాం. మెరుగైన రోడ్డు వసతి ఉన్న చోట కొత్త స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో ఉన్న ఇసుక డిమాండును దృష్టిలో పెట్టుకుని సబ్ స్టాక్ యార్డుల్లోనూ నిల్వ చేస్తున్నాం. కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు లభించాయి. మరో 31 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. – జి.మల్సూర్, వీసీ అండ్ ఎండీ, టీఎస్ఐఐసీ -
ఎడ్ల బండ్లకు ఇసుక ఉచితం
సాక్షి, అమరావతి: నదుల పరిసర గ్రామాల ప్రజల సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పించాలని సూచించారు. ఇసుకపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. శాండ్ పోర్టల్ ఓపెన్ చేయగానే నిల్వలు ఖాళీ అవుతున్నాయనే భావన ఉండరాదని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక బుకింగ్స్ సమయం కొనసాగించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► శాండ్ పోర్టల్ నుంచి బల్క్ ఆర్డర్లను తొలగించాలి. బల్క్ ఆర్డర్లకు సరైన నిర్వచనం ఇవ్వాలి. బల్క్ ఆర్డర్లకు అనుమతుల అధికారం జాయింట్ కలెక్టర్ (జేసీ)కు అప్పగించండి. ► డిపోల్లో ఇసుకను ఎక్కువగా అందుబాటులో ఉంచండి. ప్రభుత్వ నిర్మాణాలకు బల్క్ బుకింగ్ ఉంటే సూపరింటెండెంట్ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వండి. ► డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలి. నియోజకవర్గమంతా ఒకే రేటు ఉండేలా చూడాలి. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలకు తావివ్వకూడదు. రోజుకు 3 లక్షల టన్నుల సరఫరాకు సన్నద్ధం ► కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల రీచ్‌లన్నీ మూత పడ్డాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడిప్పుడే రీచ్‌లు మళ్లీ ప్రారంభమవుతున్నాయని చెప్పారు. వారం, పది రోజుల్లో రోజుకు 3 లక్షల టన్నుల ఉత్పత్తికి చేరుకుంటామని తెలిపారు. ► చిన్న చిన్న నదుల నుంచి పరిసర గ్రామాల వారికి ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పారు. అయితే ఇందుకు పంచాయతీ కార్యదర్శి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న షరతు పెడతామని తెలిపారు. ► ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లి వేరే చోట నిల్వ చేసి, విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సొంత అవసరాలకే ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు అమలు చేస్తామన్నారు. -
ఇసుక కోసం ఆందోళన చెందవద్దు
సాక్షి, తూర్పుగోదావరి : ఇసుక కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా స్ధాయిలో ఇసుకపై ఒక అధ్యయనం చేశామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నూతన ఇసుక పాలసీ వచ్చిన తరువాత 112 రీచ్‌లకు అనుమతి ఇచ్చాం. ప్రస్తుతం 48 ఇసుక రీచ్‌లు పని చేస్తున్నాయి. 30 రీచ్‌లు ఇసుక లేని కారణంగా పని చేయడం లేదు. వాటిని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాధారణ ఇసుక వినియోగదారులు ఇప్పటి వరకు 9,19,900 మెట్రిక్ టన్నుల ఇసుకను బుక్ చేసుకున్నారు. దాంట్లో 8.29 లక్షల మెట్రిక్ టన్నులు( 90 శాతం) సరఫరా చేశాం. ప్రభుత్వ పనులకు 3.72 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం. నాడు-నేడు కార్యాక్రమానికి 50 వేల మెట్రిక్ టన్నులకు గానూ 39 వేల మెట్రిక్ టన్నులు ఇసుకను సప్లయి చేశాం. ఇసుక రీచ్‌ల వద్ద సమస్యలు, ఆన్లైన్ బుకింగ్ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి. వాటి మీద మైనింగ్, ఎపీఎండీసీ అధికారులతో చర్చించాం. జేసీకే ఇసుక తవ్వకాలకు సంబంధించిన అనుమతులు ఇచ్చాం. అనుమతి కోసం అమరావతికి వెళ్లనవసరం లేదు. ఇసుక బల్క్ బుకింగ్ కూడా జాయింట్ కలెక్టర్( సంక్షేమం)కే అనుమతి అధికారం ఇచ్చాం. జిల్లాలో ఇసుక రిజర్వర్స్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టోర్ చేసి పెట్టుకున్నాం. ప్రతి రోజు వీటి నుండి 30 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సప్లయి అవుతుంది. కెడ్రాయి సంస్ధ వాళ్లు తమ ఇసుక అవసరాల కోసం జేసీ (సంక్షేమం) నుండి అనుమతి తీసుకోవాలి. -
రీచ్‌లలో అక్రమాలు లేకుండా చూడాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఇసుకపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కరోనా వైరస్ కారణంగా రీచ్‌లన్నీ మూతబడ్డాయని, ఇప్పుడిప్పుడే మళ్లీ రీచ్‌లు ప్రారంభమవుతున్నాయని, వారం, పదిరోజుల్లో రోజుకు 3 లక్షల టన్నుల ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘బల్క్ ఆర్డర్‌కు సరైన నిర్వచనం ఇవ్వండి. డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టండి. పోర్టల్ నుంచి బల్క్ ఆర్డర్లను తొలగించండి. బల్క్ ఆర్డర్లకు సంబంధించిన అనుమతులను జేసీకి అప్పగించండి. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలి. ( మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్) పోర్టల్ ఆన్ చేయగానే.. వెంటనే నిల్వలు అయిపోతున్నాయన్న భావన పోగొట్టాలి. ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్ బుకింగ్ ఉంటే.. సూపరింటెండెంట్ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వండి. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ను చేసుకునే అవకాశం ఇవ్వాలి. డిపోలనుంచే ఇసుక సరఫరా చేయాలి. నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడండి. బుకింగ్ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంచండి. చిన్న చిన్న నదులనుంచి పక్కనే ఆనుకుని ఉన్న గ్రామాలకు ఎడ్ల బళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలని’ ఆదేశించారు. -
గ్రామ సచివాలయంలో కూడా ఇసుక బుకింగ్
సాక్షి, విజయవాడ: గ్రామ సచివాలయ పరిధిలో ఎవరైనా ఇసుక కావాలంటే ఆ గ్రామ సచివాలయంలో బుకింగ్ చేసుకోవచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులు, మైనింగ్ అధికారులతో సోమవారం ఆయన సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ: ఇసుక బుకింగ్‌కు సంబంధించిన వెబ్సైట్ 5 నిమిషాల్లోనే క్లోజ్ అవుతుందని ప్రజా ప్రతినిధులు, వినియోగాదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఇసుక బుకింగ్ ప్రక్రియను ఏపీఎండీసీ నుంచి గ్రామ సచివాలయాలకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయంలో వచ్చిన డిమాండ్‌ను బట్టి ఏపీఎండీసీ అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. (పల్లె పల్లెకూ ఎల్ఈడీ వెలుగులు) ఈ పద్ధతి ద్వారా వినియోగదారులకు న్యాయం జరుగుతుందని, ఒకే ఆధార్ కార్డుతో వందలాదీ మంది తీసుకుంటూన్నారన్నారు. అందుచేత ఇసుక దుర్వినియోగం కాకుండా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నామని తెలిపారు. ఇసుక యాడ్ గురించి పది కిలోమిట్లర్లలోపే స్టాక్ పాయింట్ ఉండాలని నిర్ణయించామన్నారు. దీనివల్ల వినియోగదారులకు ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గతాయని, దీనివల్ల వినియోగాదారునికి మేలు జరుగుతుందన్నారు. త్వరలోనే వీటన్నిటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
అక్రమరవాణాను అరికట్టేందుకు సాంకేతిక టెక్నాలజీ వినియోగం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రం సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నాం. ప్రభుత్వ లక్ష్యాన్ని ఛేదించేందుకు సాంకేతిక టెక్నాలజీని వినియోగిస్తున్నాం. రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేశాం. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపు దాడులు చేస్తున్నాం. సీసీ కెమెరాలు, మొబైల్ చెక్‌పోస్టులతో పాటు ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు ఎంత పటిష్టంగా పనిచేసినా ప్రజల సహకారం కీలకం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తేనే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో చేరుకోగలం. ఇప్పటి వరకు 485 కేసులు నమోదు చేశాం. 955 మంది పై కేసులు పెట్టాం. 730 వాహనాలు సీజ్ చేశాం. 29629.075 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకొన్నాం. ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పాత నేరస్థులైతే పీడీయాక్టు ప్రయోగిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీట్స్ తెరవాలని యోచిస్తున్నాం. ఆస్తులను కూడా జప్తు చేసేందుకు వెనకాడం. అక్రమార్కులను వెంటనే రిమాండ్‌కు తీసుకునేలా జ్యుడీషియల్ వ్యవస్థనూ సంప్రదిస్తున్నాం. ఇసుక, సిలికా, గ్రావెల్ నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం అని వినీత్ తెలిపారు. -
ఆన్లైన్లో బుకింగ్‌కు సిద్ధం
ఇసుక ఇక అందరికీ అందుబాటులోకి రానుంది. ఒకటి రెండురోజుల్లో ఆన్లైన్ బుకింగ్‌కు అనుమతి లభించనుంది. లాక్డౌన్ కారణంగా కుదేలైన నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 49 రోజులుగా పనుల్లేక కూలీలు సైతం అల్లాడిపోతున్నారు. ఈ రంగంలో పనులు ఊపందుకునేందుకు జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా ఇసుక కొరతను తీర్చేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా రెండు స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసి సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వచేసేలా కసరత్తు చేశారు. నెల్లూరు(సెంట్రల్): ఇసుక తరలింపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో గతంలో బుక్ చేసుకున్న వారికి, ప్రభుత్వ పనులకు ప్రస్తుతం డోర్ డెలివరీ ప్రారంభించారు. కాగా ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకునేలా మంగళ లేదా బుధవారాల నుంచి అనుమతి ఇవ్వనున్నారు. ఈ వ్యవస్థను పర్యవేక్షించేందుకు జిల్లాకు ప్రత్యేక డిప్యూటీ డైరెక్టర్‌ను కూడా నియమించారు. ♦ ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆ సమయంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు సంబంధిత శాఖ అధికారులు ముందుస్తు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా రెండు స్టాక్ రిజర్వ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వాకాడు సమీపంలోని కోట మండలం కొండగుంట ప్రాంతంలో ఒకటి, నెల్లూరు సమీపంలోని కొండాయపాళెం జాతీయ రహదారిపై మరొకటి ఉంచారు. రెండుచోట్ల 3 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వచేసేలా తరలిస్తున్నారు. ♦ జిల్లాలో పొట్టేపాళెం (నాలుగు రీచ్‌లు), సజ్జాపురం, గొల్లకందుకూరు, మినగల్లు, విరువూరు, ముదివర్తి, పడమటికంభంపాడు, అప్పారావుపాళెం, లింగంగుంటల్లో రీచ్‌లను ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా ఆయా రీచ్‌లకు దగ్గర్లో పొట్టేపాళెం, జొన్నవాడ, విరువూరు, ముదివర్తి, పడమటి కంబంపాడు, అప్పారావుపాళెం ప్రాంతాల్లో ఆరు స్టాక్ పాయింట్లను ఉంచారు. కాగా పడమటికంభంపాడు, పెన్నా బద్వేల్, లింగంగుంట, దువ్వూరు, జొన్నవాడ, గొల్లకందుకూరు ప్రాంతాల్లో చిన్నపాటి సమస్యల కారణంగా రవాణా చేయలేని పరిస్థితి ఉంది. మిగిలిన ప్రాంతాల నుంచి ఇసుకను ప్రస్తుతం తరలిస్తున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ♦ వినియోగదారుల కోసం వెంకటగిరి, వింజమూరు, కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ప్రత్యేక ఇసుక డిపోలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ముందుగానే ఇసుకను స్టాక్ చేశారు. వర్షాకాలంలో రీచ్‌ల నుంచి తరలించే పరిస్థితి లేకపోతే ఇక్కడి నుంచి వినియోదారులకు సరఫరా చేస్తారు. ఏర్పాట్లు చేశాం జిల్లాలో ఇసుక కొరత లేకుండా సరఫరా చేసేందుకు ఐదు డిపోలను ఏర్పాటు చేశాం. అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఇసుకను నిరంతరం సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా రెండు రిజర్వ్ పాయింట్లను పెట్టాం. వీటి ద్వారా ఎప్పుడు ఇసుక అవసరమైనా తరలించేలా చర్యలు తీసుకున్నాం.– గంగాధర్‌రెడ్డి, జిల్లా మేనేజర్,ఏపీ ఎండీసీ -
దంగల్..కండల్..
మట్టిని నమ్ముకున్నోడికి ఎప్పుడూ నష్టం రాదన్నట్టే... మట్టిలో వ్యాయామ చేసేవారి ఆరోగ్యం ఎన్నటికీ చెక్కుచెదరదు అంటున్నారు పాతకాలం నాటి వ్యయామ ప్రియులు. ఇక్కడ వ్యాయామం చేసేందుకు ఉంచే దంగల్ మట్టిలో వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్న పదార్థాలను కలుపుతారు. జల్లెడ పట్టిన చెక్కపొట్టు, నూనె, గంధం పౌండర్, పచ్చ కర్పూరం, నిమ్మకాయ రసం, నెయ్యి వంటి పదార్థాలను కలుపుతారు. దీని ద్వారా మట్టి సుగంధభరితమై అలసటను దూరం చేస్తోంది. ఈ మట్టిలో వ్యాయామాలు చేయడం ద్వారా చర్మవ్యాధులు కూడా దూరమవుతాయని ట్రైనర్స్ చెబుతున్నారు. సనత్‌నగర్: నగరంలో దశాబ్దాల నాటి చరిత్ర కలిగిన వ్యాయమశాలలకు ఆదరణ పూర్తిగా తగ్గలేదు. సరికొత్తగా పుట్టుకొస్తున్న జిమ్‌ల పోటీని ఎదుర్కొంటున్న స్వదేశీ వ్యాయామానికి మరేదీ సాటి లేదు.. రాదు.. అంటున్నారు పాతకాలం నాటి వ్యాయామశాల నిర్వాహకులు. నాలుగ్గోడల మధ్య ఏసీల మధ్య మెత్తని కార్పెట్స్ మీద చేసే వర్కవుట్స్ సిసలైన శారీరక ఫిట్నెస్ను అందివ్వలేవని, దంగల్ మట్టిలో చేసే వ్యాయామానికి తిరుగులేదని అంటున్నారు. బలం.. అ‘పార’ం.. కాయం కష్టిస్తేనే ఆరోగ్యం సిద్దిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఇసుక లారీలపై పారలతో పనిచేసే వారిని గమనిస్తే ఆ కాయాకష్టం వారి దేహాన్ని ఏవిధంగా మలుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆనాటి వ్యాయామశాలల్లో మట్టిని నేలపై పోసి పారలతో తవ్వడం, కాళ్లతో దున్నడాన్ని వ్యాయమ ప్రక్రియగా చేర్చారు. పారలతో మట్టిని తవ్వడం ద్వారా కాలి చిటికెన వేలు నుంచి మెదడు వరకు నరాలు ఉత్తేజితమవుతాయి. అలాగే పారకు ఉన్న కర్రను సడలకుండా పట్టుకోవడం అంటే మల్లయుద్ధంలో ప్రత్యర్థిని పట్టుకోవడంలో గ్రిప్‌ను సాధించడమే అన్నమాట. ఈ పారతో వ్యాయామం చేసే మట్టి ప్రాంతాన్ని దంగల్గా పేర్కొంటారు. ఆధునిక వ్యాయామ పద్ధతులకు భిన్నంగా ఇక్కడ కేవలం లంగోటిల మీదనే వ్యాయామం చేస్తారు. దీని ద్వారా శరీరంలో ప్రతి అవయానికి ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. పాతొక వింత.. ప్రస్తుతం రాజ్యమేలుతున్న ఫిట్నెస్ సెంటర్ల ద్వారా ఫిజిక్ షేపులే తప్ప సిసలైన శారీరక దృఢత్వం రాదని, పాతకాలపు వ్యాయామ స్ట్సైల్స్ ద్వారా సిసలైన ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా సంతరించుకోవచ్చన్నది నాటి వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. నగరంలో బల్కంపేట, ఫతేనగర్, బేగంబజార్, గౌలిగూడ, మూసాపేట్, సనత్‌నగర్, కింగ్‌కోఠి, చిలకలగూడ, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్ బీకేగూడ తదితర ప్రాంతాల్లో పాతకాలపు శైలిని కొనసాగిస్తున్న వ్యాయామశాలలు ఇంకా రద్దీగానే ఉన్నాయి. దీనికి కారణం వీటి ద్వారా వచ్చే లాభాలే అంటున్నారు వ్యాయామప్రియులు. మట్టిలో చేసే పలు రకాల వ్యాయామాల గురించి ఇలా చెబుతున్నారు. ముగ్దార్.. భుజబలం.. పొడవాటి దుంగ మాదిరిగా గుండ్రంగా ఉండే బరువైన ముగ్దార్ను రెండు చేతులతో తల వెనుక వైపుగా చుట్టూ తిప్పడం ద్వారా మోచేతులు, భుజ కండరాలు బలోపేతం అవుతాయి. ఈ కసరత్తు కూడా దంగల్ మట్టిలో గానీ, నేలపై తమకు అనుకూలమైన ప్రదేశంలో ఎక్కడైనా చేయవచ్చు. అస్లీ.. సత్తా.. రింగ్ ఆకృతిలో దాదాపు 40 కిలోల బరువున్న రాయి(అస్లీ) మెడలో వేసుకుని దంగల్ మట్టిని కాళ్లతో దున్నుతారు. దీనిని మెడకు గర్దన్ వ్యాయామంగా కూడా పేర్కొంటారు. ఈ ప్రత్యేకమైన కసరత్తుతో మెడ భాగంలోని నరాలు చైతన్యమవుతాయి. అలాగే మెడలో అంతటి బరువుతో దంగల్ను దున్నడం ద్వారా కాళ్ల జాయింట్స్ బలంగా మారతాయి. కాలి కండరాల సామర్థ్యం పెరుగుతుంది. క్లైంబ్..రోప్ పాతకాలం నాటి వ్యాయామ ప్రక్రియలో రోప్ క్లైంబింగ్ ఒకటి. తాడును ఎక్కి, దిగడం ద్వారా తన బరువును తాము మోసుకుంటూ పైకి వెళ్లడమే కసరత్తు. దీని ద్వారా చేతుల నరాలు రాటుదేలుతాయి. రోప్ ఎక్కి దిగే క్రమంలో సమయాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు. వయస్సును బట్టి నిర్దేశిత టైమ్‌లో రోప్ క్లైంబింగ్ చేయాల్సి ఉంటుంది. దమ్ బై టక్ (సపాయ్).. పాతకాలం వ్యాయామంలో దమ్ బైటక్ ఒకటి. నేలపై అరచేతులు ఉంచి కాలి మునివేళ్లపై నుంచి మొత్తం బాడీని లేపడమే ఈ కసరత్తు. బైటక్(బస్కీలు కొట్టడం) ద్వారా కూర్చొని, లేవడం మరో కసరత్తు. ఇక ‘అతా’ (రెండు వైపులా హ్యాండిల్ కలిగిన పరికరం)పై చేతులు ఉంచి దమ్ బై టక్ చేయడం ఇంకోరకమైన కసరత్తు. ఇది చెస్ట్‌కు మంచి వ్యాయామం. ఆహారమూ.. సహజమే.. ఈ తరహా వ్యాయామశాలల్లో వర్కవుట్ చేసేవారు నేచురల్ డైట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. శెనగలు, బెల్లం, ఎండుకొబ్బరి, మినపప్పు తదితర ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అది కూడా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే. బార్ బార్ దేఖో.. సమాంతరంగా ఉన్న రెండు రాడ్ల ఆధారంగా బార్ కసరత్తు జరుగుతుంది. వెనుక వైపుగా సింగిల్ రాడ్‌ను రెండు చేతులతో పట్టుకుని మొత్తం బాడీని మెలితిప్పి రెండో రాడ్‌కు కాళ్లను తాకించడమే ఈ కసరత్తు ప్రత్యేకం. ఇది ఛాతీ కండరాలను బలంగా మారుస్తుంది. ఇదే ఆరోగ్యకరం.. ఆధునిక జిమ్‌ల్లో షూస్, చెప్పులతో చేయిస్తారు. ఇక్కడ చెప్పులకు కూడా అనుమతి ఉండదు. అంతా సహజమైన పద్ధతుల్లో ఉంటుంది. ఇక్కడ వస్తాదుగా ఉన్న లక్ష్మయ్య ఇదే వ్యాయామం చేసి 98 ఏళ్లు జీవించాడు. – రాజు, ఖలీఫ్, శ్రీవీర హనుమాన్ వ్యాయామశాల శరీరం ఉత్తేజితం.. శరీరాన్ని మొత్తం ఉత్తేజితం చేసే వ్యాయాయ పద్ధతులు ఇక్కడ ఉంటాయి. అందుకే పాతకాలం పద్ధతులైనా ఇలాంటి జిమ్‌ను ఎంచుకున్నాను. నాతో పాటు ఎంతోమంది ఈ జిమ్‌కు వస్తున్నారు. – కార్తీక్, శిక్షకులు -
ఉపేక్షించొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు కనిపించకూడదని, అక్రమ మద్యం తయారీ అనేది ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా నిరోధంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. ఇన్ని విప్లవాత్మక కార్యక్రమాల మధ్య బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా లాంటివి మన ఉద్దేశాలను దెబ్బ తీస్తాయన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ ఉండకూడదు. ఇసుక అక్రమ తవ్వకాలు.. అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణా, మద్యం రవాణా ఉండకూడదు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాలి. గ్రామాల్లో 11 వేలకు పైగా ఉన్న మహిళా పోలీసులతో పాటు మహిళా మిత్రలను సమర్థవంతంగా వాడుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచండి. ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖలో మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనుల కోసం వినియోగించాలి. కలిసి కట్టుగా ఫలితాలు సాధించాలి. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేసుకోవడం ద్వారా విధి నిర్వహణలో సమర్థత పెంచుకోవాలి. -
వారంలో మేడిగడ్డ ఖాళీ?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని వారంలో పూర్తిగా ఖాళీ చేయాలని నిర్ణయించింది. దిగువ బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి లభ్యతను పెంచుతూ, మేడిగడ్డలో అవసరమైన మరమ్మతులు, ఇతర సాంకేతిక అంశాల పరిశీలనకు వీలుగా నీటినంతా దిగువకు పంపింగ్ చేయనుంది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి నాలుగు టీఎంసీల మేర నీటిని పంపింగ్ చేయగా, ఆది వారం సైతం ఏడు పంపుల ద్వారా ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగింది. ఈ నీరంతా దిగువ అన్నారం (సరస్వతి), అటు నుంచి సుందిళ్ల (పార్వతి) మీదుగా ఎల్లంపల్లికి చేరుతోంది. అనుకున్న దానికన్నా ముందుగానే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటినంతా ఏప్రిల్‌లో ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయిం చింది. అయితే ప్రస్తుతం కాస్త ముందుగానే ఖాళీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇసుక అవసరాలు పెరగడం, లభ్యత తగ్గిన నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ నుంచి మొత్తం సీజన్లో 45 టీఎంసీల నీటిని దిగువకు ఎత్తిపోయగా, ఈ వారం రోజుల నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. బ్యారేజీలో 16.12 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా, కొన్నిరోజుల్లో నీటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆదివారం సైతం ఏడు మోటార్ల ద్వారా 15 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువ అన్నారం తరలించారు. ఇదే రీతిని పంపింగ్ కొనసాగిస్తే వారంలో మేడిగడ్డ ఖాళీ కానుంది. ఇక్కడ కనీసంగా కోటి క్యూబిక్ మీటర్ల మేర ఇసుక లభ్యత ఉంటుందని అంచనా. ఇప్పుడు ఖాళీ చేస్తేనే మార్చి నుంచి జూన్ ఆరంభం వరకు మూడు నెలలపాటు ఇసుకను తరలించవచ్చనే ప్రణాళికతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ చేసిన అనంతరం బ్యారేజీని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అవసరమైన మరమ్మతులు సైతం చేయనున్నారు. ఇక ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో అన్నారంలో లభ్యత పెరగడంతో అక్కడ 10.87 టీఎంసీలకు గానూ 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. దీంతో ఇక్కడి పంప్‌హౌస్‌లోని 8 మోటార్లతో నీటిని సుందిళ్లకు తరలిస్తున్నారు. సుందిళ్ల నుంచి మరో 4 పంపుల ద్వారా నీటిని ఎల్లంపల్లి చేరుస్తున్నారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 20.18 టీఎంసీలకు గానూ 8.30 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేసిన అనంతరం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సైతం ఖాళీ చేయనున్నారు. ఈ నీటితో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో నిల్వలను పెంచనున్నారు. అనంతరం వీలునుబట్టి నీటిని పునరుజ్జీవం ద్వారా ఎస్సారెస్పీకి పంపనున్నారు. -
ఇసుకకు ఇక్కట్లే!
ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగాలంటూ ప్రభుత్వ ఆదేశాలు ఒకవైపు... ఇసుక లభ్యత తగ్గుదల మరోవైపు.. వెరసి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక లభ్యత తగ్గుతుండటంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండటంతో ఇసుక లభ్యత కష్టంగా మారింది. ప్రాజెక్టుల ప్రాంతాల్లో నీటి నిల్వలు తగ్గితేగానీ ఇసుక తీయడం సాధ్యమయ్యేలా లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగించేందుకు ఇసుక ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన మేర.. ఇసుక లభ్యత లేకపోవడం పెను ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఇసుక లభ్యత అధికంగా ఉండే గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి లభ్యత అధికంగా ఉండటంతో కొరత తీవ్రమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగించాల్సిన సమయంలో లభ్యత తగ్గుతుండటం శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రాజెక్టులేమో నిండు కుండలా.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఇదివరకే నిర్ణయించింది. సాగునీటి శాఖ చేపట్టిన బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ప్రధానంగా ప్రాజెక్టులు చేపడుతున్న పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఇసుక తవ్వకాలు చేపడుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ వద్ద 4.18 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యత ఉంటుందని గుర్తించి, అక్కడి నుంచే ప్రాజెక్టుల అవసరాలకు వాడుకున్నారు. అన్నారం బ్యారేజ్ వద్ద మరో 1.26 కోట్ల క్యూబిక్ మీటర్లు, సుందిళ్ల వద్ద సైతం అదే స్థాయిలో ఇసుక లభ్యత ఉంటుం దని గుర్తించి ఇందులో కొంతమేర వినియోగం చేశారు. అయితే ప్రస్తుతం ఈ బ్యారేజీలన్నీ నిండుకుండలుగా ఉన్నాయి. మేడిగడ్డలో 16.12 టీఎంసీలకు ప్రస్తుతం 14 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అన్నారంలోనూ 10.87 టీఎంసీలకు గాను 6 టీఎంసీల మేర లభ్యత ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఇసుక తీయడం సాధ్యం కాదు. సుందిళ్లలోనూ ఇదే పరిస్థితి మిడ్‌మానేరు రిజర్వాయర్ పరిధిలోనూ నీటి నిల్వలు నిండుగా ఉన్నాయి. 25.87 టీఎంసీలకు గాను, 24 టీఎంసీల మేర నిల్వలు ఉండటం, ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండటం, దిగువకు వదులుతుండటంతో పరీవాహకంలోనూ పూర్తిగా ఇసుక లభ్యత తగ్గింది. అవసరాలేమో ఆకాశంలో.. సమయంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇసుకఅవసరాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రధాన ప్రాజెక్టులకు మొత్తంగా 3కోట్ల క్యూబిక్ మీటర్ల అవసరం ఉండగా, ఇప్పటివరకు 1.50కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక వినియోగం జరగ్గా, మరో 1.50కోట్ల ఇసుక అవసరాలున్నాయని ఖనిజాభివృధ్ధి సంస్థకు నివేదిక అందింది. ఇందులో ఒక్క కాళేశ్వరం పరిధిలోనే 75 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని తేల్చారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి 40 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం కాగా ఇందులో 18 లక్షలు వినియోగం చేయగా, 22 లక్షల క్యూబిక్ మీటర్లు ఇంకా వినియోగించాల్సి ఉంది. వీటితో ఆదిలాబాద్ జిల్లాలోని కుఫ్టి, పెనుగంగ, చనాకా–కొరట, సదర్‌మఠ్ సహా ఇతర పనులకు 18 లక్షల క్యూబిక్ మీటర్లు, సీతారామ ఎత్తిపోతలకు 3.5 లక్షలు, దేవాదుల పరిధిలో 5.75 లక్షలు, పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో మరో 3 లక్షలు, నల్లగొండ జిల్లాలోని డిండి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు 26 లక్షల క్యూబిక్ మీటర్ల మేర అవసరాలను ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఈ సీజన్లోనే జూన్ వర్షాలు కురిసే నాటికి 50 నుంచి 75 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం కానుంది. ఈ స్థాయిలో ప్రస్తుతం ఇసుక లభ్యత లేదు. తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల ప్రాంతాల్లోనే కొద్దిమేర లభ్యత ఉండగా, దాన్ని స్థానిక కాల్వలు, బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు వాడుతున్నారు. ఖాళీ అయితే లభ్యత ఓకే.. ఏప్రిల్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కాస్త ఉపశమనం కల్గించేలా ఉంది. ఏప్రిల్ నుంచి బ్యారేజీలు ఖాళీ అయితే మూడు నెలల పాటు ఇసుక తీసుకునే అవకాశం దొరుకుతుంది. కనిష్టంగా కోటి క్యూబిక్ మీటర్ల మేర తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక తుపాకులగూడెం, దమ్ముగూడెం ఎగువన గోదావరి ప్రవాహాలు తగ్గడంతో ఇసుక లభ్యత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఇసుకతోనే గట్టెక్కాలని సాగునీటి శాఖ భావిస్తోంది. -
48 గంటల్లో ఇసుక డోర్ డెలివరీ..
ఇసుక కష్టాలు తొలగిపోయాయి. ఎదురు చూడాల్సిన పని లేదు.ఆన్లైన్ విధానంతో ఇసుక పొందడం మరింత సులభతరమైంది.పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం గతనెల 10 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. కంప్యూటర్ ముందు కూర్చుని అడిగిన వివరాలుసమర్పిస్తే ఇసుక 48 గంటల్లో ఇంటికి చేరుతోంది. దీంతో వినియోగదారుల ఆనందానికి అవధులు లేవు. గతంలో రీచ్‌లలో నీరు చేరడంతో కొంత ఇబ్బంది ఎదురుకావడంతో విపక్ష నాయకులు ‘ఇసుక దుమారం’రేపిన సంగతి తెలిసిందే..ఇప్పుడు విమర్శించే గళాలన్నీ మూతపడ్డాయి.అవసరాలకు మించి ఇసుక లభ్యత కావడం..సక్రమంగా ఇంటికి చేరుతుండటం ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టాయి. సాక్షి ప్రతినిధి కడప : జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ జోరందుకుంది. బుక్ చేసిన 48 గంటల్లోనే ఇసుక ఇంటికి చేరుతోంది. జనవరి 10న డోర్ డెలివరీ విధానం అమలులోకి వచ్చింది. నాటి నుంచి ఈనెల 3 వరకూ( సెలవులుపోను) 18 రోజుల వ్యవధిలో 24,834 టన్నులు డోర్ డెలివరీ కింద సరఫరా చేశారు. జనరల్, బల్క్‌గా వినియోగదారులను విభజించి అధికారులు ఇసుక సరఫరా చేస్తున్నారు. వంద టన్నులకు పైబడి అవసరమైన వారు బల్క్ కన్జ్యూమర్ లాగిన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి జిల్లా అధికారులు అఫ్రూవల్ ఇస్తారు. తర్వాత విజయవాడ హెడ్ ఆఫీసు నుంచి మరో అఫ్రూవల్ వచ్చాక ఇసుక సరఫరా చేస్తారు. జనరల్ వినియోగదారులు జిల్లాలో ఎక్కడి నుంచయినా ‘శాండ్.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకోవచ్చు. 48 గంటల్లో వారికి ఇసుక కేటాయిస్తున్నారు. వివరాలు వాహన యజమానికి వెళతాయి. రీచ్‌లకు వెళ్లి వే బిల్లులు తీసుకుంటే వినియోగదారునికి ఫోన్ ద్వారా సమాచారం అందించి డెలివరీ చేస్తారు. పెరుగుతున్న బుకింగ్స్ రోజురోజుకూ బుకింగ్స్ పెరుగుతున్నాయి. అందుబాటులోకి ఇసుక రావడంతో వినియోగదారులు సులభతరంగా బుక్ చేసుకుంటున్నారు. నేరుగా కాకుండా సచివాలయాల నుంచి కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. పులివెందుల, కడప, రాయచోటి స్టాక్ యార్డుల నుంచి సరఫరా చేస్తున్నారు. పెన్నానది పరిధిలో జ్యోతి, ఇల్లూరు, చిత్రావతి పరిధిలో కొండాపురం వద్ద ఏటూరు, పాపాఘ్ని నదిలో వేంపల్లె వద్ద కొమరాంపల్లె, చెయ్యేరు పరిధిలో బాలరాజుపల్లె, నారాయణ నెల్లూరు, అడపూరు, టంగుటూరు తదితర తొమ్మిది ఇసుక రీచ్‌లతోపాటు పట్టా ల్యాండ్స్ పరిధిలో కొండూరు 1, 2, 3 రీచ్‌లు, రాజంపేట పరిధిలో కిచ్చమాంబపురం నాలుగు రీచ్‌ల నుండి ఇసుక సరఫరా చేస్తున్నారు. టన్ను ఇసుక రూ. 375 చొప్పున విక్రయిస్తున్నారు. 0 నుండి 40 కిలోమీటర్లలోపు టిప్పర్‌కు రూ.7, ట్రాక్టర్‌కు రూ.10 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. 40 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు రూ. 4.90 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇసుక డిపోలలో 60 వేల టన్నులకు పైగా ఇసుక సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వినియోగదారులకు సకాలంలో ఇసుకను అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే పెన్నా, కుందూ, పాపాగ్ని, చిత్రావతి తదితర నదుల పరిధిలో మరిన్ని ఇసుక రీచ్‌లను తెరిచేందుకు అధికారులు సిద్దమయ్యారు. అవసరమైతే పట్టాల్యాండ్స్ నుండి కూడా సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. డోర్ డెలివరీ విధానం సత్ఫలితాలనిస్తోంది. ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావడం లేదు. మైనింగ్, పోలీసు, విజిలెన్స్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఇసుక.. ఇంటికే వచ్చేస్తుందిక
సాక్షి, అమరావతి: అడిగిన వారి ఇంటికే నేరుగా ఇసుక సరఫరా (డోర్ డెలివరీ) విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే ఆరు జిల్లాల్లో ఇసుకను డోర్ డెలివరీ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) విజయవంతంగా అమలు చేస్తోంది. త్వరలో ఈ విధానాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. రవాణా చార్జీల ఖరారు, ఇసుక వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లాస్థాయి ఇసుక కమిటీల (డీఎల్ఎస్సీ)తో ఏపీఎండీసీ అధికారులు నిత్యం సమీక్షిస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, రవాణా అధికారులతో కూడిన డీఎల్ఎస్సీ ప్రతినిధులు ఇసుక రవాణా చార్జీల ఖరారుకు సంబంధించి లారీ, ట్రాక్టర్ యజమానుల సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. 6 జిల్లాల్లో విజయవంతంగా అమలు ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఇసుకను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో.. ఈనెల 14వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డోర్ డెలివరీ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలనే పట్టుదలతో ఏపీఎండీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7వ తేదీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, 14వ తేదీనుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నూతన విధానం అమలు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1.80 లక్షల టన్నుల ఇసుక డోర్ డెలివరీ ఆరు జిల్లాల్లో ఇప్పటికే 1.80 లక్షల టన్నుల ఇసుకను డోర్ డెలివరీ చేశాం. కేవలం నెల రోజుల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే 1.06 లక్షల టన్నుల ఇసుక డోర్ డెలివరీ చేశాం. కొత్త విధానం విజయవంతం అయ్యిందనడానికి ఇది నిదర్శనం. ఈనెల 14వ తేదీకల్లా రాష్ట్రమంతా దీనిని అమల్లోకి తెస్తాం. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారి ఇంటికి ఇసుక చేరవేసిన వాహన యజమానులకు ప్రస్తుతం 48 గంటల్లో రవాణా చార్జీలు చెల్లిస్తున్నాం. ఇకపై 24 గంటల్లోనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూధన్‌రెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
-
ఇసుకపై టీడీపీ తప్పుడూ ప్రచారాన్ని నమ్మద్దు
-
ఇంటి వద్దకే ఇసుక
-
జనవరి 2 నుంచి.. ఇంటికే ఇసుక
సాక్షి, అమరావతి : ఇక నుంచి ఇసుకను ఇంటి వద్దకే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి 2 నుంచి కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేయాలని, జనవరి 7 నుంచి ఉభయ గోదావరి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అమలు చేయాలని సూచించారు. ఇసుక పాలసీ అమలవుతున్న తీరు, డోర్ డెలివరీపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇసుక సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా సాగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలోని 200 పైచిలుకు స్టాక్ యార్డులకు గాను.. 13 యార్డుల్లో బుకింగ్ ఓపెన్ చేసిన కాసేపట్లోనే ఇసుక అయిపోతోందని అధికారులు చెప్పగా.. సమీపంలోని యార్డుల్లో బుకింగ్‌కు అవకాశం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ మేరకు వెబ్సైట్లో మార్పులు, చేర్పులు చేయాలని, వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నారు. రవాణా ఛార్జీలు తగ్గుతాయనే కారణంతో చాలామంది ఆ 13 స్టాక్ యార్డుల నుంచే బుక్ చేస్తున్నారని, ఆ మేరకు ఇసుక లభ్యతను మరింత పెంచుతామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. సగటున రోజుకు 80 వేల టన్నుల ఇసుక విక్రయిస్తున్నామని, సెప్టెంబరు 5 నుంచి ఇంత వరకు 43.7 లక్షల టన్నుల ఇసుకను బుక్ చేసుకున్నారని, స్టాకు యార్డుల్లో 9.63 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు. జనవరి 20 కల్లా చెక్‌పోస్టుల ఏర్పాటు పూర్తవ్వాలి వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రోజుకు 2.5 లక్షల టన్నుల చొప్పున తవ్వి నిల్వ చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నాలుగు నెలల్లో నెలకు 15 లక్షల టన్నులు చొప్పున వర్షాకాలం అవసరాల కోసం రిజర్వ్ చేయాలని, 60 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసుకోవాలన్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేస్తున్న చెక్పోస్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వచ్చే నెల 20కల్లా చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, ఇసుక డోర్ డెలివరీ ప్రారంభం కావాలని ఆదేశించారు. ఇప్పటికే 349 చెక్‌పోస్టుల ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పగా.. అక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ కమాండ్ కంట్రోల్ రూంకు అందుబాటులో ఉండాలన్నారు. మిగిలిన చెక్‌పోస్టులు వీలైనంత త్వరలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇసుకను సరఫరా చేస్తున్న అన్ని వాహనాలకూ జీపీఎస్ పెట్టారా? లేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. 9,020 వాహనాలకు జీపీఎస్ అమర్చామని సమాధానమిచ్చారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఏపీఎండీసీ ద్వారా డోర్ డెలివరీ: మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో ఇసుకను ఎపీఎండీసీ ద్వారా డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక డోర్ డెలివరీపై సమీక్షా సమావేశంలోని నిర్ణయాలను సచివాలయంలో ఆయన మీడియాకు వివరించారు. టెక్నాలజీని వాడుకుని కొందరు మాత్రమే ఇసుకను బుక్ చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో వినియోగదారులకే నేరుగా ఇసుక అందించాలనే లక్ష్యంతో డోర్ డెలివరీని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. రవాణా చార్జీలతో కలిపి వినియోగదారుడి నుంచి ఇసుక రేటును ఏపీఎండీసీ వసూలు చేస్తుందని.. రవాణా కోసం అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఇసుకను అక్రమ ఆదాయంగా చూసిన చంద్రబాబు సర్కార్ విధానాలకు భిన్నంగా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయిస్తోందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ అక్రమాల వల్ల ఎన్జీటీ ఏకంగా రూ. 100 కోట్ల జరిమానా విధించిందని గుర్తు చేశారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి ఇసుక విధానానికి రూపకల్పన చేశారని, కేంద్ర ప్రభుత్వ అధికారులను కూడా తీసుకువచ్చి ఈ విధానాన్ని వివరించనున్నట్ల తెలిపారు. ఇసుక రవాణా చార్జీల వివరాలు 20 కిలోమీటర్ల లోపు దూరమైతే ప్రతి కిలోమీటర్‌కు టన్నుకు రూ.6.60 చొప్పున, 20 నుంచి 30 కిలోమీటర్ల లోపు కిలోమీటరుకు టన్నుకు రూ.6లు, 30 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు టన్నుకు రూ.4.90 చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. డోర్ డెలివరీ విధానంలో ఏపీఎండీసీ నేరుగా వినియోగదారుల నుంచి ఈ రవాణా చార్జీలను వసూలు చేసి ఆ తర్వాత వాహన యజమానులకు చెల్లిస్తుంది. నగరాల్లో రాత్రి 10.30 నుంచి ఉదయం 6.30 గంటల వరకూ, మిగిలిన ప్రాంతాల్లో 24 గంటలపాటు ఇసుక డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
జనవరి 2న ఇసుక డోర్ డెలివరీ
సాక్షి, అమరావతి: ఇసుక డోర్ డెలీవరీ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇసుక డోర్ డెలివరీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇసుక పాలసీ, అమలు తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక పాలసీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 7న ఉభయ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో డోర్ డెలివరీ ద్వారా ఇసుక అందించాలని పేర్కొన్నారు. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ ప్రారంభించాలని తెలిపారు. దీనికోసం రోజుకు 2.5 లక్షల టన్నుల చొప్పున ఇసుక సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టి పెట్టుకొని పటిష్ట ప్రణాళికలతో ముందుకెళ్లాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వర్షాకాలంలో పనుల కోసం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 15 లక్షల టన్నుల ఇసుకను సిద్ధం చేయాలన్నారు. సుమారు 60 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ చేసుకోవాలని తెలిపారు. ఇసుక సరఫరాను పర్యవేక్షించడానికి చెక్‌పోస్ట్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నారు. ఇసుక సరఫరా వాహనాలకు అమర్చే జీపీఎస్‌పైనా సీఎం జగన్ ఆరా తీశారు. -
ఇకపై ఏపీలో ఇసుక డోర్ డెలివరీ
సాక్షి, తాడేపల్లి: సామాన్యులకు సకాలంలో ఇసుకను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇక నుంచి ఏపీలో ఇసుక డోర్ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు జరపనుంది. జనవరి 7న తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప జిల్లాల్లో డోర్ డెలివరీ చేయనున్నారు. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో డోర్ డెలివరీ అమలు చేయనున్నారు. ర్యాంపుల్లో ఏవిధమైన దోపిడీకి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో వినియోగదారులకు సకాలంలో ఇసుక లభ్యమవుతోంది. -
‘డిసెంబర్ 31 వరకు చెక్‌పోస్టులు ప్రారంభించాలి’
సాక్షి, అమరావతి:రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 31 వరకు అన్ని జిల్లాలో చెక్ పోస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఆయా జిల్లాల్లో చెక్‌పోస్టుల పనితీరును క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వ్యక్తిగతంగా పర్యటించాలని ప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. దీంతోపాటు గనులు, పంచాయతీరాజ్, పోలీసు శాఖలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది. ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల ఏర్పాటుకు గతంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతి చెక్‌పోస్టు వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఇసుక సౌలభ్యం
జిల్లాలో ఇసుక కష్టాలకుతెరపడింది. గోదావరినదీ తీరంలో 33 అనువైనప్రదేశాల్లో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతించింది.దీంతో రోజుకు సుమారు30 వేల టన్నులకుపైగాఇసుక సేకరణ అవుతోంది. రోజువారీగా ర్యాంపుల నుంచి 18 వేల నుంచి 20 వేల టన్నులఇసుక రవాణా అవుతోంది. కొవ్వూరు: అవసరాలకు సరిపడినంత ఇసుక అందుబాటులోకి రావడంతో సామాన్యులకూ సకాలంలో లభ్యమవుతోంది. మరోవైపు ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. అనుమతుల్లేకుండా, పరిమితికి మించి ఇసుక అక్రమంగా తరలిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లావ్యాప్తంగా 14 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఆన్లైన్ బుకింగ్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కువ ర్యాంపులు అందుబాటులోకి రావడంతో ఇసుక దొరకడం సులభమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ర్యాంపుల్లో దోపిడీ సాగింది. ప్రస్తుతం ర్యాంపుల్లో ఏవిధమైన దోపిడీకి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చారు. ముందస్తుగా నియోజవర్గాలవారీగా రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను ప్రకటించారు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో వినియోగదారులకు సకాలంలో ఇసుక లభ్యమవుతోంది. రాష్ట్రంలో ఇసుకతవ్వకాల్లో జిల్లాదే ప్రథమ స్థానం రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లోనూ, అమ్మకాల్లోనూ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈనెల 20న గరిష్టంగా జిల్లాలో 23,339 టన్నుల ఇసుక అమ్మకం ద్వారా జిల్లా మొదటి స్థానం దక్కించుకుంది. తూర్పుగోదావరి జిల్లా రెండోస్థానంలో నిలిచింది. సామాన్యులందరికీ ఇసుక అందుబాటులోకి తీసుకుని రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించింది. వారోత్సవాల ప్రారంభం రోజు జిల్లా వ్యాప్తంగా 6,329 టన్నుల ఇసుక సేకరించారు. ప్రస్తుతం ఇసుక సేకరణ ఐదు రెట్లకుపైగా పెరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న ఇరవై ఇసుక ర్యాంపుల సంఖ్యను వైఎస్సార్ సీపీప్రభుత్వం 33కి పెంచింది. ర్యాంపులు పెరగడం వల్ల ఇసుక తవ్వకాలు క్రమేణా పెరిగాయి. ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ నిల్వలు చేసేవారిపైనా, అనుమతుల్లేకుండా రవాణా, తవ్వకాలు చేసిన వారిపైనా భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ రవాణాకు వినియోగించిన వాహనాలను సీజ్ చేయడంతోపాటు, ఆయా వాహనాలు, బోట్ యాజమానులపైనా కేసు నమోదు చేయడం ద్వారా అక్రమాలకు కళ్లెం పడింది. గడిచిన ఆరు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 150 కేసులకుపైగా నమోదయ్యాయి. వీటిలో కొవ్వూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోనే 96 కేసులు నమోదు చేసి 561.5 యూనిట్ల ఇసుకను సీజ్ చేశారు. 212 మందిని అరెస్ట్ చేశారు. 134 వాహనాలను సీజ్ చేశారు. ఒక బోట్, ఒక జేసీబీ సైతం సీజ్ చేశారు. వీటిలో గరిష్టంగా సమిశ్రగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో 40 కేసులు నమోదయ్యాయి. 45 వాహనాలను సీజ్ చేసి ఇక్కడ 84 మందిని అరెస్ట్ చేశారు. పెరవలి మండలంలో 95 యూనిట్లు ఇసుక, పది వాహనాలు స్వాధీనం చేసుకుని 20 మందిపై∙కేసులు నమోదు చేశారు. ఉండ్రాజవరంలో అక్రమంగా నిల్వ ఉంచిన 178 యూనిట్ల ఇసుకను సీజ్ చేశారు. 3 లారీలు సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 యూనిట్ల ఇసుక స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిడదవోలు పరిధిలో 36 యూనిట్లు స్వాధీనం చేసుకుని తొమ్మిది వాహనాలను సీజ్ చేసి, 17 మందిని అరెస్ట్ చేశారు. కొవ్వూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 42 యూనిట్లు సీజ్ చేసి 18 వాహనాలను స్వాధీనం చేసుకుని 21 మందిని అరెస్ట్ చేశారు. కొవ్వూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 32.5 యూనిట్లు సీజ్ చేసి 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో 9 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. తాళ్లపూడిలో 2 కేసులు, దేవరపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఒక్క కేసు నమోదయ్యాయి. ఆన్‌లైన్‌తో అవస్థలు ఇసుక ఆన్లైన్ బుకింగ్‌లో కొంతమేర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాడపల్లి, ఔరంగాబాద్ వంటి పెద్ద ర్యాంపుల్లో స్టాకు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఇసుక నో స్టాక్ అని చూపిస్తుంది. ప్రధానంగా బల్క్ బుకింగ్ కొన్ని ర్యాంపులకే ఎక్కువగా కేటాయించడం వల్ల సామాన్యులు బుకింగ్‌లో ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ సమయంలో ఆధార్ నంబర్‌తోపాటు ఓటీపీ నంబర్ చెప్పాల్సి రావడం వల్ల కొన్ని∙ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నెట్వర్క్ సక్రమంగా లేకపోవడంతో సకాలంలో ఓటీపీలు రావడం లేదు. దీంతో కొద్దిమందికే ఇసుక బుక్ అవుతోంది. తద్వారా ఇసుక తాము అనుకున్న ర్యాంపుల నుంచి కాకుండా అందుబాటులో ఉండే ర్యాంపుల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. తాళ్లపూడి మండలంలోని ర్యాంపుల్లో సాధారణంగా మెత్తని ఇసుక లభిస్తుంది. వాడపల్లి, ఔరంగాబాద్, కొవ్వూరులో మూడు ర్యాంపుల్లో ఎక్కువ శాతం గండర (గరుకు) ఇసుక లభిస్తుంది. గండర ఇసుక కాంక్రీటు పనులు, నిర్మాణం(కట్టుబడి)కి ఎక్కువ వినియోగిస్తారు. మెత్తని ఇసుక కేవలం ప్లాస్టింగ్లకే వినియోగిస్తారు. అయితే వినియోగదారుడు ఆన్లైన్లో అందుబాటులో ఉండే ర్యాంపుల నుంచే ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించాలంటేబల్క్ బుకింగ్‌ను అన్ని ర్యాంపులకు కేటాయించడం ద్వారా కొంతమేరకు వినియోగదారులకు నచ్చిన ర్యాంపుల్లో ఇసుక బుకింగ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఒక్కోసారి సర్వర్ డౌన్ కావడం, ఇసుకకు సొమ్ములు కట్ అయినా బుకింగ్ కాకపోవడం వంటి సాంకేతికపరమైన సమస్యలు వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నాయి. అక్రమార్కులపై చర్యలు తప్పవు ఏవిధమైన అనుమతుల్లేకుండా ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించం. అక్రమార్కులకు రూ.2లక్షల వరకు జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సబ్ డివిజన్ పరిధిలో ప్రధాన కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నాం. ఇసుక అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్లో విక్రయించినా కేసులు నమోదు చేస్తాం.– కె.రాజేశ్వరరెడ్డి, డీఎస్పీ,కొవ్వూరు -
మస్తుగా ఇసుక!
సాక్షి ప్రతినిధి విజయనగరం: వర్షాలు విస్తారంగా కురవడంతో వచ్చిన వరదల కారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలకు అంతరాయం కలిగింది. అంతేగాకుండా సరఫరాలో పారదర్శకత ఉండాలనీ... ఎలాంటి అక్రమాలకు తావుండకూడదనీ కొత్తగా ఇసుక పాలసీ తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సరఫరాలో కాస్తంత అతరాయం జరిగింది. దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని విపక్షం చూసింది. ఇదేదో ఘోర వైఫల్యం అన్నట్టు ఆందోళనలకు... విమర్శలకు తెరతీసింది. కానీ అనూహ్యంగా వారి కుట్రలను భగ్నం చేస్తూ విరివిగా రీచ్‌లు ప్రారంభించి... అవకాశం ఉన్న చోట స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి కావలసినంత ఇసుక అందుబాటు ధరకు సరఫరా చేయడంతో వారి గొంతులో ఇప్పుడు పచ్చివెలక్కాయ పడినట్టయింది. గత నెల 15న ఇసుక వారోత్సవాల పేరుతో జిల్లాలో ఇసుక సరఫరా మొదలుపెట్టారు. ప్రారంభంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇసుక అందించేవారు. ఇప్పుడిక ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇసుక అందుబాటులోకి రావడంతో ఆఫ్‌లైన్‌లోనే అందిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలకు నగదు చెల్లించి ఇసుక తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించారు. ట్రాక్టర్ ఇసుక ఇసుక రేటు, లేబర్ చార్జీలతో కలుపుకుని దాదాపు రూ.1600 వరకూ ఉంది. వాహనాన్ని వినియోగదారుడే తీసుకువెళితే ఈ రేటు. లేదంటే వాహనం అద్దెను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రీచ్‌లలో తవ్వకాల జోరు.. జిల్లాలో మొత్తం 76 ఇసుక రీచ్‌లుండగా వీటిలో 60 రీచ్‌లను తెరిచారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 1,34,577.25 టన్నుల ఇసుక సరఫరా చేశారు. డెంకాడ స్టాక్‌యార్డ్ నుంచి ఇప్పటి వరకూ 3156.5 టన్నులు, బొబ్బిలి స్టాక్‌యార్డ్ నుంచి 400 టన్నులు డెంకాడ పట్టాభూమి నుంచి 9014 టన్నులు ఇసుక విక్రయించారు. ఆదివారం ఒక్కరోజే 974 టన్నుల ఇసుకను వినియోగదారులకు అందించారు. డెంకాడ పట్టాభూముల్లో ఇసుక విక్రయాలు ఆదివారంతో ముగిశాయి. అక్కడే మరో 20వేల టన్నుల ఇసుక త్వరలోనే అందుబాటులోకి రానుంది. అధికారులు ఇప్పటికే భూమిని పరిశీలించి ప్రభుత్వ అనుమతికోసం నివేదిక పంపించారు. నిర్మాణానికి ఇక కొరత ఉండదు నిర్మాణ పనులకు ఇసుక కొత లేకుండా అవసరమైన మేరకు లభ్యతను బట్టి వినియోగదారులకు అందిస్తున్నాం. ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. రేవులకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్లు కూడా లేవు. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నిటినీ అదిగమించాం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీస్, రెవిన్యూ, గనుల శాఖలతో మూడు చెక్‌పోస్టులు కూడా నడుపుతున్నాం. ఇకపై ఇసుకకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా -
ఇసుక దొంగకు మూడేళ్ల జైలు శిక్ష
సాక్షి, అమరావతి: ఇసుక దొంగతనం కేసులో ఓ వ్యక్తికి కడప కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ప్రజల ఆస్తికి నష్టం కలిగించినందుకు ప్రజా ఆస్తి విధ్వంస నిరోధక చట్టం (పీఓపీపీడీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా కూడా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కడప జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పి.భానుసాయి రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా, అక్రమంగా రవాణా చేసినా, బ్లాక్ మార్కెట్లో విక్రయించినా, ఒకరి పేరిట కొని, మరొకరికి అమ్మినా రెండేళ్ల జైలు, రూ.2 లక్షల జరిమానా విధించేలా చట్ట సవరణ చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కొద్ది రోజులకే ఈ తీర్పు వెలువడటం విశేషం. పాపాగ్నిలో అక్రమంగా ఇసుక తవ్వకం వైఎస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లికి చెందిన నంద్యాల సుబ్బారాయుడు పాపాగ్ని నదిలో ఇసుకను దొంగిలిస్తున్నారంటూ ఈ ఏడాది జూలై 15న పెండ్లిమర్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సుబ్బారాయుడు ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ట్రాక్టర్లో ఇసుకను లోడ్ చేస్తూ సుబ్బారాయుడు కనిపించాడు. అతడని పోలీసులు పట్టుకొని విచారణ చేశారు. -
జిల్లాలో ఇసుక కొరత లేదు: జాయింట్ కలెక్టర్
సాక్షి, పెరవలి(పశ్చిమ గోదావరి): జిల్లాలో ఇసుక కొరత లేదని.. రోజుకు 20 వేల టన్నులు లభిస్తుందని, జిల్లా అవసరాలు పోను మిగిలింది ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నామని జిల్లా జాయింట్ కలక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఇసుక వారోత్సవాల సందర్భంగా కానూరు–పెండ్యాల ఇసుక ర్యాంపును బుధవారం ఆయన ప్రారంభించారు. జిల్లాలో 22 రీచ్‌ల ద్వారా ఇసుక తీస్తున్నామని, ఓపెన్ రీచ్‌లు అయిన ఖండవల్లి నుంచి ఇసుక సరఫరా అవుతుందని, వారం రోజుల్లో ఉసులుమర్రు, కానూరు–పెండ్యాల ర్యాంపుల నుంచి కూడా ఇసుక లభ్యమవుతుందని చెప్పారు. దీంతోపాటు కొత్త రీచ్‌ల కోసం సిఫార్సులు చేస్తున్నామని వాటికి అనుమతులు వస్తే ఇసుక రాష్ట్రం అంతా సరఫరా చేయవచ్చన్నారు. డ్రెడ్జింగ్‌కు అనుమతులు గోదావరిలో ఆనకట్టపైన ఉన్న ప్రాంతాల్లో డ్రెడ్జింగ్ చేయటానికి అనుమతులు వచ్చాయని దీని ద్వారా కూడా ఇసుక లభ్యమవుతుందని జేసీ తెలిపారు. డ్రెడ్జింగ్‌కు టెండర్లు పిలుస్తున్నామని అవి పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. దీని కోసం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ఇలా చేయడం ద్వారా గోదావరిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు జిల్లా సరిహద్దు అయిన చింతలపూడి నుంచి కుక్కునూరు వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. ఇందుకోసం రెవెన్యూ, మైనింగ్, రవాణా, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులను నియమించామన్నారు. అక్రమంగా ఇసుక తరలించినా, నిల్వ చేసినా, ఇతర ప్రాంతాలకు తరలించినా రెండేళ్ల జైలు, రూ.2 లక్షల జరిమానా తప్పదని హెచ్చరించారు. స్టాకు యార్డుల ఏర్పాటు జిల్లాలో ఇసుకను లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించటానికి ప్రధాన పట్టణాలతో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో స్టాకుయార్డులను ఏర్పాటు చేస్తున్నామని జేసీ తెలిపారు. ఏలూరు, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, జంగారెడ్డి గూడెం, తణుకు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యార్డుల వద్దే ఇసుక ధరలు పట్టిక కూడ ఉంటుందని, అంతకుమించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇసుక తోలటానికి 500 వాహనాలకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటికి జీపీఎస్ అమర్చుతామని దీని వలన వాహనం ఎక్కడ ఉందో తెలుస్తుందని తెలిపారు. జీపీఎస్ విధానాన్ని సక్రమంగా అమలు చేయడానికి బృందాన్ని ఏర్పాటుచేస్తామని, పది రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయన్నారు. కొత్త ర్యాంపులకు సిఫార్సు జిల్లాలో గోదావరి ప్రాంతంలో కొత్త ర్యాంపుల ఏర్పాటు చేయటానికి సిఫార్సులు పంపించామని అనుమతులు వచ్చిన వెంటనే వాటిని ఏర్పాటు చేస్తామని జేసీ తెలిపారు. ఇలా చేస్తే జిల్లా అవసరాలతో పాటు రాష్ట్రం నలుమూలకు ఇసుక సరఫరా చేయవచ్చన్నారు. ఇసుక మాఫియాకు చెల్లు ఇసుక ర్యాంపుల్లో మాఫియా ఆగడాలకు కాలం చెల్లిందని దళారీ వ్యవస్థ లేకుండా చేయటమే తమ ముందున్న లక్ష్యమని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దోచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తే తమ ప్రభుత్వం ప్రజలకు సేవలు చేయటానికి కృషి చేస్తుందన్నారు. ఇసుక అమ్మకాల్లో అక్రమాలకు తావులేకుండా ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, కేంద్రపార్టీ రాజకీయ సలహాదారుడు జీఎస్ రావు, జిల్లా మైనింగ్ డీడీ వైఎస్ బాబు, ఏపీఎండీసీ జిల్లా ఇన్చార్జి గంగాధరరావు, కొవ్వూరు ఆర్డీఓ నవ్య, తహసీల్దార్ పద్మావతి, మండల కనీ్వనర్ కార్చెర్ల ప్రసాద్, ఉపాధ్యక్షుడు కొమ్మిశెట్టి రాము, యూత్ ప్రెసిడెంట్ తోట సురేష్, కరుటూరి గోపి, నిడదవోలు పట్టణ, రూరల్ కనీ్వనర్లు మద్దిపాటి ఫణీంద్ర, అయినీడి పల్లారావు వైíసీపీ నాయకులు పాల్గొన్నారు. -
కోరినంత ఇసుక.. నిర్మాణాలు చకచకా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో ఇసుక కొరత లేదు. టీడీపీ హయాంలో ఉచిత విధానం ముసుగులో వసూలు చేసిన రేటు కన్నా తక్కువకు దొరుకుతోంది. ఎవరికెంత అవసరమో అంత ఇసుక సరఫరా చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఫలితంగా నిర్మాణాలు జోరందుకున్నాయి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నాగావళి, వంశధార నదుల్లో 18 రీచ్‌లకు అనుమతి వచ్చింది. వాటిలో 12 లక్షల 45 వేల టన్నుల ఇసుక లభ్యత ఉంది. అనుమతులొచ్చిన వాటిలో 13 రీచ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటిలో 8 లక్షల 68 వేల టన్నుల ఇసుక ఉంది. మరో 5 రీచ్‌లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వాటిలో మరో 4 లక్షల టన్నుల ఇసుకను తవ్వు కోవచ్చు. మొత్తానికి జిల్లాలో 12 లక్షల 45 వేల టన్నుల మేర ఇసుక తవ్వకాలు జరిపేందుకు అవకాశం ఉంది. భవన నిర్మాణదారులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని చూసి భయపడాల్సిన పనిలేదు. ఇసుక కొరత కారణంగా పని దొరకలేదన్న పరిస్థితులు ఎక్కడా లేవు. రెండు పట్టా భూములకు కూడా అనుమతులిచ్చారు. వాటిలో ఒక పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవికాకుండా బాహుద, మహేంద్రతనయ నదుల్లో తహశీల్దార్ల ఆధ్వర్యంలో కార్యదర్శుల సమక్షంలో మరో 10 రీచ్‌లు నడుస్తున్నాయి. టెక్కలి, పలాసలోనైతే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో ఇసుక కొరత అనేది ఎక్కడా లేదు. మన జిల్లా అవసరాలను తీర్చడమే కాకుండా విశాఖపట్నం, డెంకాడ, బొబ్బిలిలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి జిల్లా నుంచి ఇసుక తరలిస్తున్నారు. కేవలం స్టాక్ పాయింట్ల ద్వారా రోజుకి 2వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నారు. అవసరానికి మించి... జిల్లాలో ప్రతి రోజూ 8 వేల నుంచి 10 వేల టన్నుల మేర ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. రోజుకు 4 వేల టన్నుల వరకు బుకింగ్ జరుగుతున్నది. బయట ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లు, జిల్లాలోని బుక్ చేసుకున్న వారికి కలిపి ప్రతి రోజూ 5 వేల నుంచి 6 వేల టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. ఈ లెక్కన ఇసుక ఎంత అందుబాటులో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్కలి, పలాస స్టాక్ పాయింట్ల ద్వారా పలాస, టెక్కలి నియోజకవర్గాలకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేస్తుండగా, బాహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి కార్యదర్శుల ఆధ్వర్యంలో నడుస్తున్న రీచ్‌ల ద్వారా çపలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు సమస్య లేకుండా ఇసుక సరఫరా జరుగుతున్నది. ఉచితం కన్న తక్కువ ధరకే.. గతంలో ఇసుక ఉచిత విధానం పేరుకే తప్ప ఎక్కడా ఇసుక ఉచితంగా దొరకలేదు. టీడీపీ నేతలు దోపిడీదారులుగా తయారై రీచ్‌లను ఆక్రమించి ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టి అమ్మకాలు సాగించారు. ప్రభుత్వానికి పైసా రాకపోగా టీడీపీ నేతలు కోట్లు దండుకున్నారు. ఉచిత విధానమని చెప్పి ట్రాక్టర్ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయించారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రూ.2400 నుంచి రూ.4 వేల వరకు ఇసుక దొరుకుతున్నది. ఈ లెక్కడ అప్పట్లో ఇసుక సొమ్ము అంతా ఎక్కడికెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ప్రారంభమైన రీచ్‌లివి.. మడపాం, పర్లాం, ఎరగాం, పెద చావలాపురం, పురుషోత్తపట్నం 2, గోపాలపెంట, పోతయ్యవలస, కిల్లిపాలెం, కల్లేపల్లి, సింగూరు, తునివాడ, అంగూరు, చవ్వాకులపేటలో ఇసుక రీచ్‌లు ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా మహేంద్రతనయ, బాహుదా నదుల్లో మరో 10 రీచ్‌లు నడుస్తున్నాయి. స్థానికంగా కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రీచ్‌లివి. ఇసుక పుష్కలంగా దొరుకుతోంది.. మా ప్రాంతంలో ఇసుక పుష్కలంగా లభిస్తోంది. రోజుకు 90 వరకు ట్రాక్టర్లు ఇక్కడకు వస్తున్నాయి. అధికారులు వచ్చి తనిఖీ చేస్తున్నారు. ఇసుకను అక్ర మంగా తరలించే చాన్సే లేదు. ఇళ్ల పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. భవన కార్మికులందరికీ చేతి నిండా పనులు ఉన్నాయి. ఇసుకకు కట్టే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వెళుతోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు అమలు జరిపేందుకు ఇది అవకాశం ఇస్తుంది. పుష్కలంగా ఇసుక జిల్లాలో ఇసుక పూర్తిగా అందుబాటులో ఉంది. ఎవరికెంత అవసరమో అంతా బుక్ చేసుకోవచ్చు. సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కొరత అనేది లేదు. రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు కూడా సరఫరా చేసే స్థాయిలో ఉన్నాం. – ఎస్.కె.వి.సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్, భూగర్భ గనుల శాఖ ఇసుక సరఫరా పెరిగింది.. వంశధారలో నీటిమట్టం బా గా తగ్గింది. ప్రస్తుతం ఇసుక అందుబాటులోకి వచ్చింది. 10 రోజుల క్రితం నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు సమస్య తీరింది. నరసన్నపేటలో రూ.2700 కు లభిస్తుంది. మరో నాలుగైదు రోజుల్లో మరింతగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం. –అరవల ఆదినారాయణ, పోతయ్యవలస, నరసన్నపేట ఇసుక కొరత లేదు ప్రస్తుతం ఇసుక బిర్లంగిలో పుష్కలంగా దొరుకుతోంది. భవన నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తొలి నెల రోజులు ఇబ్బంది పడినా నేను సోంపేట నుంచి వచ్చి ఇక్కడే ఇసుకను కొనుగోలు చేస్తున్నాను. త్వరలో మరో మూడు ఇసుక రీచ్‌లు ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ అధికారులు చెబుతున్నారు. – టి.దుర్యోధన, ట్రాక్టర్ డ్రైవర్, ఇచ్ఛాపురం మండలం -
అందరికీ అందుబాటులో ఇసుక
సాక్షి, విజయవాడ: వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వచ్చాయని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈ నెల 21 వరకూ ఇసుక వారోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఇసుక కొరత తీర్చేందుకు ఇసుక రీచ్ లతో పాటు స్టాక్ డిపోలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విజయవాడలోని భవానీపురం, షాదీఖానా, కానూరులో మూడు స్టాక్ డిపోలతో పాటు మచిలీపట్నం, మైలవరం, నూజివీడులో కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆన్లైన్లో ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం ఐదు ఇసుక రీచ్‌ల తో పాటు నాలుగు పట్టా భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో వారం రోజులలో ఐదు ఇసుక రీచ్‌లు, ఐదు పట్టా భూములు అందుబాటులో కి రానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇసుక రీచ్ లు , స్టాక్ పాయింట్లు, స్టాక్ యార్డులు మొత్తం 15 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
బ్లూ ఫ్రాగ్ ఎండీ సెల్ఫోన్లు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. శుక్రవారం కూడా సీఐడీ అధికారులు బ్లూ ఫ్రాగ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సంస్థ ఎండీ ఫణికుమార్‌రాజ్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మొబైల్స్‌లోని ఫోన్ కాల్స్ డేటా విశ్లేషణ కోసం అమరావతిలోని సీఐడీ కార్యాలయానికి పంపారు. ఫణితో పాటు టెక్నికల్ అసిస్టెంట్ ప్రవీణ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బ్లూ ఫ్రాగ్‌లో సీజ్ చేసిన సర్వర్ల సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించేందుకు రెండు సైబర్ క్రైం బృందాలను నియమించారు. ఏ ఐపీ అడ్రస్‌లతో బ్లూ ఫ్రాగ్ కార్యకలాపాలు నిర్వహించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాక్ష్యాధారాలు సేకరించాం ప్రభుత్వ వెబ్‌సైట్‌ను బ్లూ ఫ్రాగ్ బ్లాక్ చేసి ఇసుక కృత్రిమ కొరత సృష్టించిందనే ఫిర్యాదులపై విచారణ వేగవంతం చేశాం. కొన్ని ప్రాధమిక సాక్ష్యాధారాలు సేకరించాం. వాటిని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించి నిర్ధారణ చేసుకుంటాం. రెండు మూడురోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది.– సునీల్‌కుమార్, సీఐడీ ఏడీజీ -
బ్లూ ఫ్రాగ్ కేసు దర్యాప్తు వేగవంతం
సాక్షి, విజయవాడ: ఇసుక మింగి పసుపు పులుముకున్న ఎల్లోఫ్రాడ్ కంపెనీగా రూపాంతరం చెందిన బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థపై అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ని హ్యాక్ చేసిన ఆరోణలపై తీగలాగగా డొంకంతా కదులుతోంది. సంస్థ నిర్వాహకులను విచారిస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసుపై దర్యాప్తును మరింత వేగంవంతం చేశారు. ఈ క్రమంలో హ్యాకింగ్‌పై సాక్ష్యాధారాలు కూడా సేకరించామని, కొన్ని రోజుల వ్యవధిలోనే అక్రమార్కుల పనిపడతామని సీఐడీ అధికారి ఏడీజీ పీవీ సునీల్ కుమార్ మీడియాకు తెలిపారు. కాగా ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ.. ప్రభుత్వ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసి ఇసుక కృత్రిమ కొరతను సృష్టించినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీపై విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. అదే విధంగా విచారణలో ఆధారాలు సేకరించామని, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించి ముందుకు సాగుతామని సునీల్ కుమార్ పేర్కొన్నారు. అదే విధంగా క్లౌడ్‌లో పెట్టిన సమాచారంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసే వారి ఐపీ అడ్రస్‌ను కూడా ట్రాక్ చేసి విచారిస్తున్నామని అన్నారు. కాగా అక్రమ నిల్వల కోసం ఆన్లైన్లో ఇసుకను బుక్‌చేసే వారిపై కూడా నిఘా పెడుతున్నామని ఏడీజీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. -
బ్లూ ఫ్రాగ్ విచారణపై స్పందించిన డీజీపీ
-
బ్లూ ఫ్రాగ్ కాదు.. ఎల్లో ఫ్రాగే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సరఫరా వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2018లో ఒక్క ఏడాదిలోనే ‘మన శాండ్’ యాప్ ద్వారా లక్ష ట్రక్కుల ఇసుకను బ్లాక్ చేసినట్టు సీఐడీ పోలీసులకు ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. ఈ ఇసుక ఎక్కడికి చేరిందో తెలుసుకునేందుకు దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. ఆ ఇసుకను ఎవరి కోసం బుక్ చేశారో అన్న వివరాలు స్పష్టంగా లేవని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. టీడీపీ వ్రభుత్వంలో ఇష్టారాజ్యంగా ప్రజల సమాచారాన్ని సేకరించిన ఈ సంస్థ గత ఆరునెలలుగా ఏయే కార్యకలాపాలు నిర్వహించిందనే దానిపై కూడా విశ్లేషిస్తున్నారు. సర్వర్లలో సమాచార విశ్లేషణకు ప్రత్యేక బృందాలు రాష్ట్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్‌ను బ్లాక్ చేసి కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తున్నట్టు బ్లూ ఫ్రాగ్‌పై గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక సరఫరాకు సంబంధించి ‘మన శాండ్’ యాప్‌ను బ్లూ ఫ్రాగ్ నిర్వహించేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇసుక సరఫరా విధానాన్ని పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్(రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ )ను బ్లాక్ చేశారని, లబి్ధదారులు చెల్లించే డబ్బులు కూడా మళ్లింపు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి గత రెండ్రోజులుగా విచారణ చేపట్టారు. బ్లూ ఫ్రాగ్‌కు చెందిన 14 సర్వర్ల సమాచారాన్ని క్రోఢీకరిస్తున్నారు. సర్వర్లలో సమాచారం ఎక్కువగా ఉండటంతో విశ్లేషణకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. సీజ్ చేసిన సమాచారాన్ని పరిశీలన నిమిత్తం ఎప్పటికప్పుడు సైబర్ క్రైంకు పంపిస్తున్నారు. గత మూడేళ్లలో బ్లూ ఫ్రాగ్ నిర్వహించిన మన శాండ్ అప్లికేషన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒక్క ఏడాదిలో రూ.6 కోట్ల జీఎస్టీ చెల్లింపులు? టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని నదీతీరం వెంబడి ప్రధాన ఇసుక ర్యాంపులు బ్లూఫ్రాగ్ నిర్వహణలోనే ఉండేవని తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఇసుక ర్యాంపుల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని కూడా బ్లూ ఫ్రాగ్ సరఫరా చేసేదని సమాచారం. అప్పట్లో ఒక ఏడాదిలో రూ.6 కోట్ల జీఎస్టీ చెల్లించిన వైనంపైనా సీఐడీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 2018 సెపె్టంబర్ నుంచి 2019 జనవరి వరకు జీఎస్టీ చెల్లింపులో జాప్యంపై రూ. 1.5 కోట్ల జరిమానా చెల్లించినట్టు వెల్లడైంది. క్లౌడ్ డేటాను పరిశీలిస్తున్నాం బ్లూ ఫ్రాగ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఇసుక కొరత ఉన్నట్టు చూపించిందనే ఫిర్యాదులు వచ్చాయి. వాటికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. బ్లూ ఫ్రాగ్ రూపొందించిన అప్లికేషన్ల క్లౌడ్ డేటాను పరిశీలించాల్సి ఉంది. రాష్ట్రంలో ఇసుక కొరత లేనప్పటికీ ఉన్నట్టు వెబ్సైట్లో చూపించారా? ర్యాంపులో ఇసుక ఉన్నా లేనట్లు చూపించారా? వంటి అనేక అనుమానాలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. పీవీ సునీల్ కుమార్, సీఐడీ ఏడీజీ అది టీడీపీ సంస్థే అది బ్లూ ఫ్రాగ్ కాదు.. ఎల్లో ఫ్రాగ్ అని ఎన్నికల ముందే తేలిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. విశాఖలో గురువారం మాట్లాడుతూ సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారనే ఆరోపణలపై బ్లూ ఫ్రాగ్‌పై కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ‘అది తెలుగుదేశం పారీ్టకి చెందిన సంస్థే... అందులో అనుమానం లేదు.. అయితే ఇప్పుడు ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం, కృత్రిమ కొరతను సృష్టించిందన్న ఆరోపణలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయాలు వెల్లడవుతాయి’ అని మంత్రి చెప్పారు. కన్నబాబు -
చంద్రబాబువి దొంగ దీక్షలు
-
ఇసుకోత్సవం!
కష్టకాలం దాటింది. ఇసుక కొరత తీరింది. రీచ్‌లలో తవ్వకాలు మొదలయ్యాయి. లబి్ధదారుల చెంతకు ఇసుక లారీలు కదిలాయి. ఆగిన భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. కారి్మకుల కళ్లలో ఆనందాలు నిండాయి. కృష్ణమ్మ తగ్గుముఖం పట్టగా.. అధికార యంత్రాంగం ఇసుక సరఫరాకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ‘ఇసుక వారోత్సవాలు’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా ఇసుకను అందించేందుకు సమాయత్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇసుక కొరతను అధిగమించారు. రోజుకు 20 వేల టన్నుల ఇసుక అవసరాలు ఉండగా మంగళవారం ఒక్కరోజే 20,204 టన్నుల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశారు. జిల్లాలో కొత్తగా 9 రీచ్‌లను గుర్తించారు. మరో 125 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా బాపట్ల, వినుకొండ, పిడుగురాళ్ల, నరసరావుపేటలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 19 ఇసుక రీచ్‌లు, 5 పట్టా భూముల్లో 14.49 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. మంగళవారం రీచ్‌ల నుంచి 11,600 టన్నుల ఇసుక తవ్వకాలు జరిపారు. రాజధాని ప్రాంతంలోని స్టాక్ పాయింట్లు, ఎన్సీసీ, ఎల్అండ్టీ వద్ద ఇసుల నిల్వల నుంచి కూడా వినియోగదారులకు ఇసుకను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మైనింగ్ శాఖ పరిధిలో తొమ్మిది కొత్త ఇసుకరీచ్‌లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో బాపట్లలో ఓలేరు రీచ్, భట్టిప్రోలు మండలంలో తూర్పుపాలెం, దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరులో నాలుగు రీచ్‌ల అనుమతులు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. సాక్షి, అమరావతి: జిల్లాలో ఇసుక కొరతను అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పుష్కలమైన ఇసుక నిల్వలు ఉన్నాయని, వాటిని లబి్ధదారులకు అందిచే లక్ష్యంతో పని చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా రోజుకు 20వేల టన్నుల ఇసుక డిమాండ్ ఉండగా మంగళవారం 20,204 టన్నుల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందులో ప్రధానంగా కొత్త రీచ్‌లను గుర్తించడం, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు పరిశీలన అనుమతులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం మైనింగ్ శాఖ పరిధిలో తొమ్మిది కొత్త ఇసుకరీచ్‌లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో బాపట్లలో ఓలేరు రీచ్, భట్టిప్రోలు మండలంలో తూర్పుపాలెం, దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరుల నాలుగు ఇసుకరీచ్‌ల అనుమతులు కోసం మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ముమ్మర కసరత్తు.. జిల్లాలోని 19 ఇసుక రీచ్‌లు, 5 పట్టా భూముల్లో 14.49 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతులు తీసుకున్నారు. ఇప్పటికే గాజులంక, బొమ్మువానిపాలెం, మున్నంగి, తాడేపల్లి, బత్తినపాడు (కృష్ణాజిల్లా), దిడుగు, కొంగంటివారిపాలెం, నవ్వులూరు, పెదకాకాని, చౌడవరంలో స్టాకు యార్డులు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా కొత్తగా మరో నాలుగు స్టాకు యార్డులు బాపట్ల, వినుకొండ, పిడుగురాళ్ల, నరసరావుపేటలో ఏర్పాటు చేయనున్నారు. ఇసుక లభ్యతను మరింత పెంచేందుకు వీలుగా 125 పట్టాభూముల్లోనూ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా చేపట్టే చర్యలు.. కొత్త స్టాకుయార్డులు, ఇసుక డిపోల ఏర్పాటు ప్రధానంగా వేబ్రిడ్జిలు, లైంటింగ్, సీసీ కెమెరాలు, మౌలిక వసతుల కల్పన ప్రతి నియోజకవర్గంలో స్టాకుయార్డు, డిపోల వద్ద ఇసుక ధరలు తెలిపే విధంగా ప్రచారం రీచ్‌ల వద్ద టన్ను ఇసుక రూ.375గా ప్రభుత్వం ధరను నిర్ణయించింది. అయితే తాజాగా స్టాక్ యార్డుల వద్ద నుంచి ఇసుక రీచ్‌లు ఎంత దూరంలో ఉన్నాయో చూసి ధరను నిర్ణయించి, అక్కడ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. పారదర్శకంగా సరఫరా.. ఇసుక వినియోగదారులకు పారదర్శకంగా అందేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలను తీసుకొంటోంది. కృష్ణా నదికి వరద తగ్గుముఖం పట్టడంతో, రీచ్‌లలో వీలైనంత ఎక్కువగా తవ్వకాలు జరిపేందుకు కల్టెకర్ ఐ.శామ్యూల్‌ఆనంద్‌కుమార్ నేతృత్వంలో కసరత్తు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఇసుక రీచ్‌ల నుంచి 11,600 టన్నుల ఇసుక తవ్వకాలు నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో స్టాకు ఉన్న, ఎన్సీసీ, ఎల్అండ్టీ వద్ద ఇసుల నిల్వల నుంచి ఇసుకను వినియోగదారులకు కేటాయిస్తున్నారు. ఇసుక అందుబాటులో ఉంది.. జిల్లాలో ఇసుక కొరతను అధిగమించాం. రోజుకు 20 వేల టన్నుల ఇసుక అవసరం కాగా, మంగళవారం 20,204 టన్నుల ఇసుకను సరఫరా చేశాం. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. అవసరం లేకున్నా ఇసుకను కొనుగోలు చేసి వ్యాపారం చేసే దళారీలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇసుక రీచ్‌లు, స్టాకు పాయింట్ల వద్ద సిబ్బంది అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదు. అక్కడ ప్రత్యేక నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. –ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్, కలెక్టర్ చాలా సంతోషంగా ఉంది నేను చిన్న ఇంటిని నిర్మించుకుంటున్నాను. కొద్ది రోజుల కింద ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. అధికారులు బుధవారం మంగళగిరి పట్టణంలోని అమరావతి టౌన్íÙప్ వద్ద ఉన్న స్టాక్ పాయింట్ నుంచి నాకు తొమ్మిది టన్నుల ఇసుకను సరఫరా చేశారు. –వల్లంశెట్టి బాలచంద్ర. కంతేరు, తాడికొండ మండలం -
‘ఇసుక మీద రాజకీయంగా బతకాలనుకుంటున్నారు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అందుబాటులోకి వచ్చాక కూడా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయడు దీక్ష అంటూ రాజకీయం చేయాలనుకోవడం సిగ్గు చేటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఇసుక మీద రాజకీయం చేస్తూ బతకాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారమిక్కడ ఆయన మీడియా సమావేశంలో ఇసుకపై అనవసర రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై మంత్రి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మన్ననలు పొందేలా పాలిస్తుంటే.. చంద్రబాబు సొంత పుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు మాత్రం విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో ఇసుకను అడ్డుగోలుగా దోచేశారని.. ఇసుక దందా వల్లే చంద్రబాబుని ప్రజలు ఓడించారన్నారు. అయితే తమ ప్రభుత్వం అవినీతి లేని ఇసుక పాలసీని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నన్నాళ్లు వర్షాలు లేవని గుర్తుచేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. నదుల్లో వరదలు రావడంతో ఇసుక సమస్య కొంత ఏర్పడిందన్నారు. అయితే ఇప్పటివరకు లక్షా 24 వేల టన్నుల ఇసుకను సరఫరా చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పస్తుతం ఇసుక పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 14 నుంచి 21 వరుకు జరిగే ఇసుక వారోత్సవాల్లో మరిన్ని స్టాక్ పాయింట్లను ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాను కంట్రోల్ చేయడానికి ప్రత్యేక డీజీని నియమించడంతో పాటు 150 నుంచి 200 వరకు చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా రాత్రి వేళ కూడా పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో అక్కడి పరిస్థితుల ఆధారంగా ఇసుక ధరను నిర్ణయిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. -
ఇసుక.. సమస్యలేదిక!
విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంది. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే సరఫరా చేస్తున్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. విశాఖ జిల్లా అవసరాల కోసం ఆయా నదుల్లో కేటాయించిన రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా జోరందుకుంది. ఇక జిల్లాలో మరిన్ని స్టాక్ యార్డుల ఏర్పాటు ద్వారా ఇసుకను మరింత చేరువలో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట(విశాఖ దక్షిణం): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘ఉచిత ఇసుక’ సాకుతో జరిగిన మాఫియా దోపిడీని నిరోధించి, ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను అందించాలని, అదే సమయంలో వాల్టా నిబంధనల ప్రకారం నదులను సంరక్షించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో గత ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా ఈసారి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రుతుపవనాలు, తుపానుల ప్రభావంతో వర్షాలు అధికంగా కురిశాయి. దీంతో నదులన్నీ వరదతో పొటెత్తాయి. దాదాపు రెండు నెలల పాటు నిండుగా ప్రవహించాయి. గత పదేళ్లలో ఎప్పుడూలేని విధంగా జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకుఆటంకం ఏర్పడింది. తాజాగా బుల్బుల్ తుపాను గండం తప్పడంతో వరద మళ్లీ వచ్చే అవకాశం కూడా లేదు. నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. విశాఖ అవసరాల కోసం కేటాయించిన గోదావరి నదిలో రెండు రీచ్‌లు, శ్రీకాకుళం జిల్లాలో ఐదు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. ప్రతి రోజూ సగటున 4 వేల నుంచి 5 వేల టన్నుల ఇసుక జిల్లాకు వస్తోంది. రీచ్‌ల్లో జోరుగా తవ్వకాలు విశాఖ నగరం, రూరల్ ప్రాంతాల్లో భవన నిర్మాణాల కోసం ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు రీచ్‌లను ప్రభుత్వం కేటాయించింది. పెదసవలాపురం, యరగాం, చవ్వాకులపేట రీచ్‌లను బల్క్ కొనుగోలుదారుల కోసం, గోపాలపెంట, మడపాం రీచ్‌లను రిటైల్ అవసరాల కోసం ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి, కాటవరం రీచ్‌లను బల్క్, రిటైల్ వినియోగదారుల కోసం కేటాయించారు. స్టాక్ యార్డుల్లో భారీగా నిల్వ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. విశాఖ నగర శివారు ముడసర్లోవ, అగనంపూడితో పాటు రూరల్‌లో నక్కపల్లి, నర్సీపట్నంలో ప్రస్తుతం ఇసుక స్టాక్‌యార్డులు నిర్వహిస్తున్నారు. చోడవరం, అనకాపల్లిలో ఏర్పాటు కోసం స్థలాన్వేషణ ఒకటీ రెండు రోజుల్లో కొలిక్కి రానుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అగనంపూడిలో 8,076 టన్నులు, ముడసర్లోవలో 14,227 టన్నులు, నక్కపల్లిలో 650 టన్నులు, నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా దాదాపు 23 వేల టన్నుల మేర ఇసుక నిల్వ ఉందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ యార్డుల్లో ఇప్పటివరకు 69,846 టన్నుల ఇసుక విక్రయాలు జరిగాయి. అక్రమ రవాణాపై ఉక్కుపాదం ఒకవైపు భవన నిర్మాణ అవసరాలకు ఇసుకను అందుబాటులో ఉంచుతూనే మరోవైపు ఇసుక అక్రమ రవాణా నిరోధానికి జిల్లా యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. పర్యవేక్షణ కోసం నలుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. జిల్లాకు కేటాయించిన రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా ఇతర జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అక్రమార్కులను ఏమాత్రం ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకూ స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు పోలీసుల సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సిండికేట్, మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇసుక ఆక్రమ సరఫరా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. సరఫరా పర్యవేక్షణకు కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. దీని పర్యవేక్షణ బాధ్యతను డిప్యూటీ కలెక్టరు స్థాయి అధికారికి అప్పగించారు. దూరం బట్టి రవాణా చార్జీలు స్టాక్ యార్డులో ఇసుక కోసం టన్ను రూ.375 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీచ్ నుంచి యార్డుకు కిలోమీటరును బట్టి రవాణా చార్జీ నిర్ణయించారు. టన్నుకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు చేస్తున్నారు. లోడింగ్ చార్జీలు టన్నుకు రూ.50 అదనం. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని మడపాం నుంచి విశాఖలోని ముడసర్లోవ ఇసుక స్టాక్ యార్డు వరకూ 115 కిలో మీటర్లు దూరం ఉంది. కిలోమీటరుకు రూ.4.90 చొప్పున టన్నుకు ధర లెక్కిస్తున్నారు. ఈ మేరకు టన్నుకు రూ.975 చొప్పున ధర నిర్ణయించినట్లు గనుల శాఖ సహాయ సంచాలకులు టి.తమ్మినాయుడు చెప్పారు. అలాగే గోదావరి ఇసుక టన్ను ధర రూ.1375 ఉంది. ఈ ప్రకారం ఆన్లైన్ www.rand.ap.gov.in లో వినియోగదారులు తమ పేరును ఆధార్, మొబైల్ నంబరు ద్వారా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆర్డరు రసీదు రూపంలో ఓఆర్ కోడ్ సహా మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. గనుల శాఖ పోర్టల్ www.minerapgov లో నమోదైన వాహనం ద్వారా ఇసుకను రవాణా చేసుకోవచ్చు. ఈ వాహనం నిర్దేశిత ప్రాంతం చేరేవరకూ ధ్రువీకరణ కోసం ఇ–రవాణా పత్రం అధికారులు స్టాక్‌యార్డు వద్ద ఇస్తారు. -
ఇసుక దీక్షా...కార్తీక ఉపవాసమా?
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇసుక దీక్ష చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం దళితవాడలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుక దోపిడీ చేసిన విషయాన్ని ప్రజలు మరువలేదన్నారు. తహసీల్దార్ వనజాక్షి విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహరించిన తీరును ప్రజలంతా గమనించారన్నారు. అధికారులపై దాడులు చేసి ఇసుకను కొల్లగొట్టిన చరిత్రను మరిస్తే ఎలా చంద్రబాబూ అని ఆయన ప్రశ్నించారు. అటువంటి చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తాననడం విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కార్తీకమాసం కావడంతో ఉపవాసదీక్ష చేసి దాన్ని ఇసుక దీక్షగా చేయనున్నాడని ఎద్దేవా చేశారు. వరుస వర్షాలతో నదుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇసుక కొరత వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఒక్క పిచ్చి వ్యక్తి ఇలా ఉంటే మరో పిచ్చి వ్యక్తి పవన్‌కల్యాణ్ మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు. వైజాగ్‌లో రెండు కిలో మీటర్లు పాదయాత్ర పూర్తికాకుండానే వాహనం ఎక్కిన వ్యక్తి పవన్‌కల్యాణ్ అన్నారు. 3,600 కిలో మీటర్లు పైగా పాదయాత్ర చేసిన తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిని విమర్శించడం సిగ్గు చేటన్నారు. పిచ్చిప్రేలాపనులు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి, కోశాధికారి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల కనీ్వనర్ నలుబోలు సుబ్బారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇసుకే బంగారమాయె..
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక ధరలు అమాంతంగా పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగి భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరుస వర్షాలతో ఇసుక రవాణాలో అంతరాయం ఏర్పడుతుండగా, ఇదే అదనుగా దళారులు ఇసుక కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతీరోజు సగటున 60 వేల మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగం జరుగుతుండగా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆన్లైన్ విధానంలో విక్రయిస్తోంది. ఆన్లైన్లో టన్ను ఇసుక ధర రూ.600 కాగా, రవాణా, ఇతర చార్జీలు కలుపుకుని లారీ యజమానులు, దళారులు సాధారణ రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,400 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 50 ఇసుక రీచ్‌లను టీఎస్ఐఐసీ నిర్వహిస్తుండగా, వర్షాలతో వరద పోటెత్తుతుండటంతో నదీ గర్భం నుంచి ఇసుక వెలికితీతకు అంతరాయం కలుగుతోంది. దీంతో టీఎస్ఎండీసీ ఆన్లైన్లో పరిమితంగా అనుమతులు జారీ చేస్తుండటంతో.. బహిరంగ మార్కెట్లో దళారులు టన్ను ఇసుకను రూ.3 వేలకు పైగా విక్రయిస్తున్నారు. నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. 15 రీచ్‌లలో మాత్రమే వెలికితీత రిజర్వాయర్ల పూడికతీత, గోదావరిలోని ఇసుక తిన్నె లు, పట్టా భూముల నుంచి టీఎస్ఎండీసీ ఇసుకను వెలికితీసేందుకు 13 జిల్లాల పరిధిలోని 50కి పైగా ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. ఇసుక వెలికితీత ప్రధానంగా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా రిజర్వాయర్ల పరిధిలోని 27 ఇసుక రీచ్‌ల వద్ద జరుగుతుండగా, గోదావరి వరదల మూలంగా ఇసుక వెలికితీతకు అంతరాయం కలుగుతోంది. అందుబాటులోని ఇసుకను ప్రభుత్వ పథకాలకు టీఎస్ఎండీసీ కేటాయిస్తోంది. ప్రస్తుతం సుమారు 15 రీచ్‌లలో పాక్షికంగా ఇసుక వెలికితీత జరుగుతున్నట్లు టీఎస్ఎండీసీ వర్గాలు చెప్తున్నాయి. స్టాక్ పాయింట్లలో 41 లక్షల క్యూబిక్ మీటర్లు వర్షాకాలంలో ఎదురయ్యే ఇసుక కొరతను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఎండీసీ ముందు జాగ్రత్తగా 2 కోట్ల క్యూబిక్ మీటర్లు (సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నులు) నిలువ చేసేలా ప్రణాళిక సిద్దం చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే నడుమ 65 లక్షల క్యూబిక్ మీటర్లను స్టాక్ పాయింట్లకు తరలించగా, ప్రస్తుతం 41 లక్షల క్యూబిక్ మీటర్లు (సుమారు 62 లక్షల మెట్రిక్ టన్నులు) అందుబాటులో ఉంది. వీటిని అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాలకు, ఇతరులకు ఆన్లైన్లో కేటాయిస్తున్నారు. అయితే రోజువారీ డిమాండుకు అనుగుణంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌తో పాటు, మరో రెండు సబ్ స్టాక్పాయింట్లలో జంట నగరాల అవసరాల కోసం ఇసుక విక్రయిస్తున్నా, ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇసుక లేక.. ఇంటి పనులు నిలిపేశా..! ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు రూ.20 లక్షలు ఖర్చు చేశా. స్లాబ్ దశ వరకు పనులు జరిగాయి. ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు కనీసం 50 టన్నుల ఇసుక అవసరమవుతుందని అనుకుంటున్నా. అయితే మార్కెట్లో ప్రస్తుతం సన్న ఇసుక టన్ను ధర రూ.3,200, దొడ్డు ఇసుక రూ.2,500 వరకు ఉంది. నిర్మాణం ఆగిపోవద్దనే ఉద్దేశంతో ఎక్కువ ధర పెడతామనుకున్నా.. ఎక్కడా దొరకడం లేదు. దీంతో నిర్మాణ పనులను ప్రస్తుతానికి నిలిపేశా. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి. ––వరికుప్పల శంకర్, తమ్మలోనిగూడ, రంగారెడ్డి జిల్లా ప్లాస్టరింగ్ ఇసుక ధరలు పెరిగాయి గతంలో స్లాబ్ ఇసుక టన్ను రూ.1,100 వరకుండేది. ఇప్పుడు రెండింతలై రూ.2,200 వరకు పలుకుతోంది. ప్లాస్టరింగ్ ఇసుక ధర దాదాపు మూడింతలు పెరిగింది. ఇసుక ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందనే భయంతో పనులు నిలిపేస్తున్నాం. తప్పనిసరిగా కొనుగోలు చేయాలని అనుకున్నా దళారీలు ధరలు పెంచేశారు. ఇసుకపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే మాకు కూడా గిట్టుబాటయ్యే అవకాశం లేదు. ––మేతరి స్వామి, బిల్డర్, తుర్కయాంజాల్ వర్షాకాలం వల్లే.. వర్షాకాలంలో రీచ్‌ల నుంచి ఇసుక తీయడం సాధ్యం కాదు. రహదారులకు వెళ్లే దారులు బురదతో ఉండటంతో వాహనాలకు అనుమతినివ్వడం లేదు. వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో 65 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వచేశాం. దీంతో ఇసుక కొరతను దాదాపు 70 శాతం మేర ఎదుర్కొంటున్నాం. ఆన్లైన్లో టీఎస్ఎండీసీ నిర్దేశించిన ధర రూ.600కు టన్ను చొప్పున అత్యంత పారదర్శకంగా విక్రయిస్తున్నాం. వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో త్వరలో ఇసుక లభ్యత సాధారణ స్థితికి చేరుకుంటుంది. ––మల్సూర్, ఎండీ, టీఎస్ఎండీసీ -
ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇసుక మాఫియా, స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక విధానంపై సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ధలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోలీసు, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంకా ఈ సమావేశంలో అధికారులతో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. సరిహద్దుల్లో నిఘా పెంచండి ‘ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకు రండి. ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఎంత రేటు పెట్టాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించండి. రేటు నిర్ణయించాక ధరలను ప్రకటించాలి. నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలి. నిర్ణయించిన రేటుకే ఇసుకను అమ్మాలి. ఈలోగా ఇసుక సరఫరాను బాగా పెంచాలి. సరిహద్దుల్లో నిఘాను పెంచండి. ఎట్టిపరిస్థితుల్లోనూ స్మగ్లింగ్ చేయకూడదు. టెక్నాలజీని వాడుకోండి. స్మగ్లింగ్ జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలి ఇసుకను అధిక రేటుకు అమ్ముతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపాలి. అవినీతికి తావులేకుండా చేస్తున్నాం, అయినా సరే మనం విమర్శలకు గురవుతున్నాం. ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి దూరంగా ఉన్నారు, అయినా సరే బండలు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే వారం స్పందన నాటికి ఈ రేట్లు, టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించాలి. వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహిస్తాం. స్పందనలో ఇసుక వారోత్సవం తేదీల ప్రకటిస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి 275 రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా?. 275 రీచ్‌ల్లో ఏం జరుగుతుందనే దానిపై మనం చూడగలగాలి. ఇసుక తవ్వకాలు నిలిచిపోతే ఎందుకు నిలిచిపోయాయో మనం తెలుసుకునే అవకాశం కలగాలి. మొత్తం 275 చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, మనం లైవ్‌లో చూడగలగాలి. మైనింగ్ అధికారులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు కంట్రోల్ రూంద్వారా చూడగలగాలి. రాత్రి పూట కూడా పనిచేయగలిగే సీసీ కెమెరాలు పెట్టాలి. అవసరమైతే స్టాక్ పాయింట్లు పెంచాలి వరద నీరు తగ్గగానే అన్ని రీచ్‌లనుంచి ఇసుక సరఫరా ప్రారంభం కావాలి. ప్రతి రీచ్ వద్ద సీసీ కెమెరాలు పెట్టాలి. ఇసుక సరఫరా కోసం వాహనాలు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వారికి వెంటనే అనుమతి ఇవ్వాలి. ఇసుక నిల్వలు సరిపడా ఉన్నంతవరకూ విరామం లేకుండా పనిచేయాలి. అవసరమైతే ఇంకా స్టాక్ పాయింట్లు పెంచాలి. ఇసుక విషయంలో ఎవ్వరూ వేలెత్తిచూపకుండా ఇసుక సరఫరా కావాలి. అలాగే రీచ్‌ల వద్ద ఈ నెలాఖరు నాటికి కెమెరాలు, వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి. ఆలస్యంకాకుండా వేర్వేరు సంస్థలనుంచి సాంకేతిక సహకారం తీసుకోండి. ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయి వరదలన్నవి మన చేతిలో లేవు. ఆగస్టునుంచి ఇవ్వాళ్టి వరకూ నదుల్లో అలానే వరద కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చి 5నెలలు అయింది. మంత్రులు జూన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు, పాలనకు సన్నద్ధమయ్యేలోగా ఆగస్టులో వరదలు ప్రారంభం అయ్యాయి. అధికారం చేపట్టిన 5నెలల్లో 3 నెలలు వరదలు వచ్చిన విషయాన్ని గర్తుంచుకోవాలి. ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయి. ఏ ఇష్యూ లేక ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని పట్టుకున్నాయి. మంచి మనసుతో పనిచేస్తున్నప్పుడు కచ్చితంగా దేవుడు సహకరిస్తాడు’అని సీఎం వైఎస్ జగన్ అధికారులతో పేర్కొన్నాడు. మద్యం నియంత్రణపై సమీక్ష ఇసుక విధానంతో పాటు మద్యం నియంత్రణపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎవరైనా లిక్కర్ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లిక్కర్ అమ్మినట్టు ఫిర్యాదు రాగానే కచ్చితంగా జైలుకు పంపాలని, దీనిపై కూడా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. మద్యం నియంత్రణపై కూడా చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. దీనిపై విధివిధానాలకు మరో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండ
సాక్షి, విశాఖపట్నం: భవన నిర్మాణ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం మేఘాలయ హోటల్ల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు నెలల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పవన్‌కల్యాణ్‌కు మంత్రి ఈ సందర్భంగా సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉన్న 70 శాతం మందికి పైగా ప్రజలు పాలన బావుందంటే, లాంగ్‌మార్చ్‌లో చెప్పిన విధంగా పవన్ కల్యాణ్ రాజకీయాలకు స్వస్తి పలికి సినిమాల్లోకి వెళిపోతారా? అని ముత్తంశెట్టి ప్రశ్నించారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక దళిత ఎమ్మెల్యేకు మీరిచ్చిన గౌరవమేమిటని ఆయన జనసేన అధినేతను ప్రశ్నించారు. పేరుకు భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్‌మార్చ్ పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. గత ఐదేళ్లలో ఇసుకను దోచుకు తిన్న ఇసుక మాఫియా బ్రాండ్ అంబాసిడర్ అచ్చెన్నాయుడిని పక్కపెట్టుకుని మాట్లాడినప్పుడే ప్రజలు చీదరించుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా భవననిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచిస్తే మంచి సూచనలు చేస్తే స్వీకరిస్తామని వ్యక్తిగత దూషణలకు దిగితే సహించబోమని అన్నారు. అగనంపూడి, ముడసర్లోవల్లో 2172 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని, అందులో 57వేల టన్నులు డిస్పాచ్ చేయగా 5వేల టన్నుల స్టాక్ ఉన్నట్లు తెలిపారు. 2 వేల టన్నుల కొరత ఉందని మంత్రి అన్నారు. మరో రెండు వారాల్లో ఇసుక కొరత తీరనుందని ఆయన అన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ వరద ఉద్ధృతి కారణంగా కొంతమేరకు ఇసుక కొరత ఏర్పడిందని, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. గతేడాదితో పోల్చుకుంటే వర్షాలు ఎక్కువగా కురవడం కారణంగా నదుల్లో ఇసుక తీయడం కుదర్లేదని, మరో రెండు వారాల్లో నదుల ఉద్ధృతి తగ్గుతోందని ఇసుక కొరత తీరనుందని ఎంపీ అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షల ద్వారానే అవినీతి జరగకూడదనే సీఎం జగన్మోహన్రెడ్డి కొత్త ఇసుక పాలసీనీ తీసుకొచ్చారన్నారు. పరిమితి లోబడి 20 కిలోమీటర్లు లోపు వారు ఇసుక రవాణా చేసుకునే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ వెనక ఎవరున్నారో చెప్పాలి వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వెనక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో లాంగ్‌మార్చ్ పెట్టింది కేవలం వైఎస్సార్సీపీ నాయకులపై వ్యక్తిగత దూషణలు చేయడానికే తప్ప భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం కాదని తేటతెల్లమైందన్నారు. లాంగ్‌మార్చ్‌లో పవన్ మాటలు విన్న ప్రతి సామాన్యుడికి పవన్ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నట్లు తేటతెల్లమవుతోందని అన్నారు. ప్రశాంతతకు మారు పేరైన విశాఖ నగరంలో లాంగ్మార్చ్ల పేరిట రచ్చచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడుగా విజయసాయిరెడ్డి పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు ఏపీ అభివృద్ధికి, సమస్యలపై మాట్లాడారో మీ ఢిల్లీ పెద్దలను అడిగి తెలుసుకో అని పవన్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కొయ్యప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి ఇసుక
ధర్మవరం రూరల్: సామాన్యులకు ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధర్మవరం నియోజకవర్గంలోని పీసీ రేవు వద్ద ఇసుక రీచ్ నుంచి ధర్మవరం మార్కెట్‌యార్డ్‌కు ఇసుకను తోలి నిల్వ ఉంచుతున్నారు. కావాల్సిన వారు మీ సేవలో అనుమతులు తీసుకొని మార్కెట్ యార్డ్‌లో లభించే ఇసుకను తీసుకెళ్లవచ్చని అధికారులు చెబుతున్నారు. టన్ను ఇసుక రూ.625 తాడిమర్రి మండలం పీసీ రేవు వద్ద ప్రభుత్వం ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేసింది. అయితే దూరాన ఉన్న ఇసుక రీచ్‌కు వెళ్లి ఇసుకను తీసుకురావాలంటే సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక బాడుగలతో పాటు వ్యయప్రయాసాలకు గురికావాల్సి వస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా పీసీ రేవు వద్ద వున్న రీచ్ నుంచి ఇసుకను తీసుకొచ్చి మార్కెట్‌యార్డ్‌లో నిల్వ చేసేలా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చొరవ చూపారు. ఈ స్టాక్ పాయింట్ నుంచి పట్టణం, రూరల్ ప్రాంతాలకు తక్కువ ధరకే ఇసుక తీసుకెళ్లవచ్చు. ధర్మవరం మార్కెట్ యార్డ్ నుంచి ఇప్పటి వరకు 1600 టన్నుల ఇసుకను ప్రజలు తీసుకెళ్లినట్లు అధికారులు చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుకను తీసుకెళ్లవచ్చు. మీ సేవలో ప్రతి రోజూ ఇసుక కోసం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ చేసుకోవచ్చునని అధికారులు అంటున్నారు. డంప్ నుంచి తీసుకెళ్లిన ఇసుకను వారి వారి ప్రాంతాలకు 4 గంటలలోపు తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఆ లోపు ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇసుక డంప్ వద్ద నిరంతరం సీసీ కెమరాలతో పర్యవేక్షిస్తుంటామన్నారు. ఇసుకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట గత టీడీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇసుకను బెంగళూరుకు అక్రమంగా తరలించి రూ.కోట్లు ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నాయకులు అంతా తామై ఇసుకను సామాన్యులకు దొరకకుండా కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు తక్కువ ధరకే ఇసుకను ప్రజలకు అందించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గతంలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్న ఇసుకాసురులకు అడ్డుకట్ట పడినట్లయ్యింది. తక్కువ ధరకే ఇసుక కంబదూరు: మండలంలోని చెన్నంపల్లిలో ప్రభుత్వం గుర్తించిన రీచ్ ద్వారా ఇసుక విక్రయాలు సాగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఇసుక రీచ్ ప్రారంభం కావడంతో ప్రజలకు ఇసుక అందుబాటులోకి వచ్చింది. అవసరమైన వారు టన్నుకు రూ.375 ప్రకారం మీ సేవ కేంద్రంలో చెల్లించి పర్మిట్లు పొంది ఇసుకను తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ విధానం అమలులోకి తీసుకురావడంతో ఇసుకాసురుల దోపిడీకి చెక్ పడుతోంది. సామన్య ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభిస్తోంది. -
పచ్చ పవనం
-
విశాఖలో ప్రభుత్వం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్