scholarship
-
మరీ ఇంత బద్ధకమా?
సాక్షి, హైదరాబాద్: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియలో పోస్టుమెట్రిక్ విద్యార్థులు బద్ధకం వీడడం లేదు. దరఖాస్తు కోసం నెలల తరబడి గడువు ఇచ్చినా, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా గడువు తేదీని పలుమార్లు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైంది. ఇంటర్ మొదలు, డిగ్రీ, పీజీ, వృత్తివిద్య, సాంకేతిక విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31లోపు ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. పోస్టుమెట్రిక్ విద్యార్థులు దాదాపు12 లక్షల మంది ఉంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. నాలుగు నెలల పాటు అవకాశం కల్పించినా, సగం మంది విద్యార్థులు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేదు. దీంతో దరఖాస్తు గడువును మార్చి 31వరకు పొడిగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఏడు నెలల పాటు అవకాశం కల్పించినా, 10.3 లక్షల మంది మాత్రమే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా 1.7లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదని సంక్షేమశాఖలు గుర్తించాయి. కాలేజీ యాజమాన్యాల నుంచి సేకరించిన సమాచారం అధారంగా ఆయా విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు నెలలు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మే 31వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల యాజమాన్యాల ఉదాసీనత పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడంలో కళాశాల యాజమాన్యాల బాధ్యత కీలకం. విద్యార్థుల దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రత్యేకంగా కాలేజీలో ఒక వ్యక్తిని నియమించి ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయించాలి. ఈ మేరకు సంక్షేమ శాఖలు కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నా, ప్రైవేట్ కాలేజీలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారంతా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సంక్షేమశాఖ అధికారులు తాజాగా కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.దరఖాస్తు ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో వాటి పరిశీలన సైతం ఆలస్యమవుతోందని సంక్షేమ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తయితే కాలేజీల వారీగా పరిశీలన ప్రారంభించి వేగవంతంగా మంజూరు చేయవచ్చని సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో నెలకొన్న జాప్యంతో ముందుకు సాగని పరిస్థితి నెలకొందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. మరోవైపు వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో వారికోసమైనా గడువును పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. -
‘ఫీజు’లో కోత.. విద్యార్థులకు వాత!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మరోసారి రుజువైంది. నూతన విద్యా విధానాన్ని బలోపేతం చేస్తూ చేపట్టాల్సిన చర్యలు బడ్జెట్లో ఏమాత్రం కనిపించ లేదు. కేవలం వర్సిటీల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, సాంకేతిక విద్యా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,506 కోట్లు కేటాయించారు. ఐటీఐ, సంప్రదాయ, సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్–ఎంటీఎఫ్)ల కేటాయింపుల్లోనూ అలసత్వం ప్రదర్శించినట్టు బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. ఏటా రూ.2,800 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఆర్టీఎఫ్) కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, బడ్జెట్లో రూ.1,960 కోట్లు మాత్రమే కనిపిస్తోంది. ఇక హాస్టల్ వసతి ఖర్చులు (పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్– ఎంటీఎఫ్)కు ఏడాదికి రూ.1,100 వ్యయం అవుతుండగా రూ.684 కోట్లు మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. చాలా వరకు వివిధ కార్పొరేషన్ల కేటాయింపుల్లో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల కేటాయింపులను చూపిస్తుండటం గమనార్హం. మొత్తంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్‌లలో సుమారు రూ.1200 కోట్ల మేర కోత విధించినట్టు తెలుస్తోంది.పెండింగ్ బకాయిలఊసే లేదుగత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలను ప్రభుత్వం నిలిపి వేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు చేయాలి. కూటమి ప్రభుత్వం వీటిని ఆపేసింది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పిడుగులా పడింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కళాశాలల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లులు దిక్కుతోచక పుస్తెలు అమ్మి, తాకట్టుపెట్టి, అధిక వడ్డీలకు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రైవేటు కాలేజీల్లో పీజీ చేరే వారికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ ఊసే మరిచారు. ఇప్పటికి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులను విస్మరించింది. విద్యకు సంబంధించి కేంద్రం నుంచే సింహ భాగం నిధులు వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా మోసం చేయడం తగదని విద్యార్థి వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.ఏటా విద్యార్థులకుఇవ్వాల్సింది రూ.2,800 కోట్లుబడ్జెట్లో కేటాయించింది రూ.1,960 కోట్లు -
రాష్ట్ర వాటా విడుదల ఎప్పుడో!
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కేంద్రం 75% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. 40% రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు విడుదల చేయలేదు. విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎదురుచూస్తూనే ఉన్నారు. రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు ప్రస్తుతం రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ అభివృద్ధి శాఖలో రూ.275 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.175 కోట్లు ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు విడుదలలో జాప్యం జరిగింది. అయితే నెలన్నర క్రితం అప్పటి నిధులను క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేసిన వెంటనే ఈ నిధిని వినియోగించాలనే నిబంధన విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకుంటే వాటిని కేంద్రం వెనక్కు తీసుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో తాజా దరఖాస్తుల ప్రక్రియ మరోవైపు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గత నెల 31తోనే ఈ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందలేదు. దీంతో గడువు పొడిగింపు కోసం సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల పోరు దీక్ష
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/తిరుపతి కల్చరల్: ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.3,900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని, జీవో 77ను రద్దు చేయాలని విద్యార్థి యువజన సంఘాలు పోరు దీక్ష చేశాయి. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఏ, ఏఐవైఎఫ్ సోమవారం ఒక రోజు పోరుదీక్ష చేపట్టాయి.విద్యార్థుల దీక్షలను వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. తిరుపతిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్ పిలుపు మేరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రిలయన్స్ స్కాలర్షిప్లో మెరిసిన తెలుగు విద్యార్థులు
రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ప్రఖ్యాత అండర్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు (scholarship) 2024-25 బ్యాచ్‌కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోగా 5,000 మంది ప్రతిభావంతులైన అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులను రిలయన్స్ ఫౌండేషన్ ఎంపిక చేసింది.విద్యలో నాణ్యత, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించి యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్ పదేళ్లలో 50,000 స్కాలర్షిప్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు స్కాలర్షిప్ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. విద్యను సమాన అవకాశాలను అందించేందుకు మార్గంగా మార్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ నిబద్ధతను ఈ ప్రోగ్రామ్ నొక్కిచెబుతోంది.దేశం నలుమూలల నుంచి ఎంపికైన 5000 మంది విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్, ఇతర విద్యా ఖర్చుల కోసం ఈ కార్యక్రమం ద్వారా రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంపికైన విద్యార్థుల్లో 70% మంది రూ. 2.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం కలిగిన కుటుంబాలనుంచి రావడం విశేషం.రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల (Telugu states) విద్యార్ధులు తమ ప్రతిభతో 2024-25 బ్యాచ్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 850 మంది విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 1వ స్థానంలో నిలవగా, 411 మంది విద్యార్థులతో తెలంగాణ 4వ స్థానం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 1,261 మంది అభ్యర్ధులు (25.22%) స్కాలర్షిప్ సాధించారు. -
ఎడతెగని ఎదురుచూపు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన సంగీత గతేడాది బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీలో దరఖాస్తు చేయగా.. 2023 ఆగస్టులో ఆమెకు అడ్మిషన్ లభించింది. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు పరిశీలన పూర్తి చేసుకుని పీజీ కోర్సులో చేరిపోయింది. స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పు చేసి అమెరికా వెళ్లింది. ప్రస్తుతం ఎమ్మెస్ మొదటి సంవత్సరం పూర్తయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో రెండో సంవత్సరం కూడా పూర్తవుతుంది. కానీ విద్యానిధి పథకానికి ఆమె అర్హత సాధించిందా? లేదా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సంగీత తండ్రి మాసాబ్‌ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించగా.. అర్హుల జాబితా ఇంకా సిద్ధంకాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆయనకు అధికారుల నుంచి ఇదే సమాధానం వస్తోంది. ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు.. దాదాపు ఆరువేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదురు చూపులివి.సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతి బా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హుల ఎంపిక ఏడా దిన్నరగా నిలిచిపోయింది. 2023– 24 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణే తప్ప అర్హులను తేల్చటంలేదు. దీంతో ఈ స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకొన్న చాలామంది విద్యార్థులు ఇప్పటికే సగం కోర్సు కూడా పూర్తిచేశారు. కానీ తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటనేది ఇప్పటికీ తేలలేదు. దాదాపు రెండు సీజన్లలో వచ్చిన దరఖాస్తుల విషయం ఎటూ తేల్చకుండానే.. ఇప్పుడు మరోమారు దరఖాస్తుల స్వీకరణ సైతం చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ నాన్చుడు ధోరణి వల్ల దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కూడా ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకాన్ని అందిస్తున్నాయి. ఆ శాఖలు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి స్కాలర్షిప్లు అందిస్తుండగా, బీసీ సంక్షేమ శాఖలో మాత్రం ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నది.డిమాండ్ ఎక్కువ.. కోటా తక్కువపూలే విదేశీ విద్యానిధి పథకానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర శాఖలతో పోలిస్తే బీసీ సంక్షేమ శాఖలో వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద ఏటా రెండు దఫాలుగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ స్ప్రింగ్ సీజన్, ఫాల్ సీజన్ అని ఏటా రెండుసార్లు ఉంటుంది. సెప్టెంబర్ వరకు మొదటి దఫా, జనవరిలో రెండో దఫా దరఖాస్తులను సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత... విద్యార్థుల డిగ్రీ మార్కులతోపాటు జీఆర్ఈ/జీమ్యాట్‌లో మార్కులు, ఐఈఎల్టీఎస్/టోఫెల్ మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు శాఖలవారీగా ప్రత్యేక కమిటీలుంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో పోటీ తక్కువగా ఉండడంతో అర్హుల ఎంపిక ఆలస్యం లేకుండా సాగిపోతున్నది. బీసీ సంక్షేమ శాఖలోవిపరీతమైన పోటీ ఉండడంతో ఉప కులాలవారీగా కోటాను విభజిస్తూ అర్హులను ఎంపిక చేస్తున్నారు. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేస్తారు. ఏటా (రెండు సీజన్లు కలిపి) 300 మందికి స్కాలర్షిప్లు ఇస్తారు. ఒక్కో సీజన్‌కు సగటున 3 వేల దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన గత రెండు సీజన్లలో 6 వేలకు పైబడి దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు. కోటా పెంపు కోసమేనట!పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రస్తుతం 300 యూనిట్లుగా ఉన్న కోటాను కనీసం వెయ్యికి పెంచాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పలు సమీక్షలు నిర్వహించిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కోటా పెంపు ప్రతిపాదనలు పంపింది. ఏటా కనీసం 800 మంది విద్యార్థులకైనా ఈ పథకం కింద స్కాలర్íÙప్లు ఇవ్వాలని సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ఫైలు సీఎం వద్దకు చేరి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగలేదు. కోటా పెంపు తర్వాతే అర్హుల ఎంపిక చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి ప్రస్తుత పరిస్థితి2023–24 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు 6 వేలకుపైగా ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్షిప్ రూ.20 లక్షలు సంవత్సరానికి ఇచ్చే మొత్తం స్కాలర్íÙప్లు 300 -
1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్
ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం మహీంద్రా గ్రూప్ ఉపకారవేతనాలు అందిస్తుంది. మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే 2024ని పురస్కరించుకుని ‘మహీంద్రా సార్థి అభియాన్’ పేరుతో స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను ప్రతిభావంతులైన 1000 మంది విద్యార్థినులకు పైచదువుల కోసం రూ.10 వేలు చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నారు.మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు వినోద్ సహాయ్ మాట్లాడుతూ..‘మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం సాయం చేస్తున్నాం. మహిళాసాధికారతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పదో తరగతి పూర్తయి పైచదువులు చదివాలనుకునే ప్రతి ట్రక్ డ్రైవర్ కుమార్తె ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000 ఇవ్వడంతోపాటు గుర్తింపు సర్టిఫికెట్ కూడా అందిస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దుఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా కావడం విశేషం అని అధికారులు తెలిపారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించిన కంపెనీ ఇప్పటివరకు 10,029 మందికి ఉపకారవేతనాలు అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 75 ట్రాన్స్పోర్ట్ హబ్‌లను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. విద్యార్థినుల మెరిట్, కంపెనీ నిబంధనల ఆధారంగా స్క్రీనింగ్ చేసి స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఇందుకోసం సంస్థ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. -
5100 మందికి రూ.లక్షల్లో స్కాలర్షిప్లు
దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి తమ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు ప్రకటించింది.దేశ వృద్ధిలో కీలకమైన యువతను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో రిలయన్స్ ఫౌండేషన్ 2022లో స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా పదేళ్లలో 50,000 మందికి స్కాలర్షిప్లు అందించడం లక్ష్యం. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ మొత్తం 5100 మందికి స్కాలర్షిప్లు అందించనుంది.ఈ విద్యా సంవత్సరంలో అందించే స్కాలర్‌షిప్‌లలో 5000 మంది అండర్ గ్రాడ్యుయేట్, 100 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ అవకాశం కల్పిస్తోంది. ఈ స్కాలర్షిప్ కింద అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.2లక్షల వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.6 లక్షల వరకు సాయం అందించనుంది. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు అక్టోబర్ 6వ తేదీ. -
కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్: బాలికలకు స్కాలర్షిప్స్..
సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలలో భాగంగా కోటక్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఈఎఫ్) తమ కన్య స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా 500 మందికి స్కాలర్షిప్లను ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికల ఉన్నత విద్యార్జనకు వీలుగా ఏటా రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని 4–5 సంవత్సరాల పాటు అందిస్తామని చెప్పారు. రూ.6లక్షల లోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారై, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో 75 శాతం ఆ పైన మార్కులు సాధించిన వారు ఈ స్కాలర్షిప్స్ దరఖాస్తుకు అర్హత పొందుతారని తెలియజేశారు.ఇవి చదవండి: ‘ఒలింపిక్’ స్ఫూర్తిని పంచేందుకు.. -
ఏడుగురు భారత సంతతి విద్యార్థులకు ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లు!
ఏడుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రతిష్టాత్మక నైట్స్ హెనెస్సీ స్కాలర్షిప్ను పొందారు. ప్రంచంలోనే అతిపెద్ద గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ అయిన ఈ స్కాలర్షిప్ కోసం 90 మంది స్కాలర్లను ఎంపిక చేయగా, వారిలో ఆంక్ అగర్వాల్, వాసన్ కుమార్, అనీష్ పప్పు, ఇషా సంఘ్వి, కృతిక సింగ్, కృష్ణ పాఠక్, రాహుల్ పెనుమాక ఉన్నారు. ఆ విద్యార్థులంతా వైద్యం,సాంకేతికత, ఇంజనీరింగ్, న్యాయ రంగాలు తదితర విభాగాల్లో ఈ స్కాలర్షిప్లను పొందారు. వాళ్లంతా ఆ యూనివర్సిటీలో పీహెచ్డీ, ఎండీఏ, ఎండీ డిగ్రీలు చేయనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా 30 దేశాలకు చెందిన 90 మంది విద్యార్థులు స్టాన్ఫోర్డ్లోని ఏడు పాఠాశాలల్లో 45 గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు చేయడానికి రావడం విశేషం. ఈ ఏడాది ఆ విద్యార్థుల్లో ఆస్ట్రియా, బహ్రెయిన్, బెలారస్, బొలీవియా, బల్గేరియా, ఫ్రాన్స్, శ్రీలంక విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక ఎంపికైన విద్యార్థుల బ్యాచ్‌లో దాదాపు 47% మంది యూఎస్ యేతర పాస్‌పోర్ట్‌లు కలిగిఉన్నారు. ఈ మేరకు నైట్-హెన్నెస్సీ స్కాలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీనా సీలిగ్ మాట్లాడుతూ..ప్రతి స్కాలర్ తన నేపథ్య సమాజానికి ఆదర్శంగా ఉండటమేగాక ప్రత్యేక దృక్పథాన్ని తీసుకొస్తారు. అలాగే ప్రపంచంలోని అన్ని సవాళ్లను అధిగమించేలా విభిన్న సంస్కృతుల భావజాలన్ని ఆకళింపు చేసుకునేలా జ్ఞానాన్ని సముపార్జించి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. కాగా, ఈ ఫెలోషిప్తో విద్యార్థులు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో మూడేళ్ల గ్రాడ్యేయేట్ అధ్యయనాన్ని కొనసాగించేలా ఆర్థిక సాయం అందుకుంటారు .(చదవండి: భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!) -
జాతీయ ఉపకార వేతనాలకు ప్రత్యేక పోర్టల్
సాక్షి, అమరావతి: కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు అందించే ‘సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్షిప్’లకు దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చినట్లు ఇంటర్మిడియెట్ విద్యామండలి కమిషనర్ సౌరభ్ గౌర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. 2023–24 విద్యా సంవత్సరానికి సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ సమాచారాన్ని డీవీఈవోలు, ఆర్ఐవోలు అన్ని మేనేజ్మెంట్స్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు తెలియజేయాలన్నారు. విద్యార్థుల డేటాను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని, వివరాల ఆధారంగా http://www.scholarships.gov.in వెబ్సైట్లో స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
టోకెన్లతోనే సరి
సాక్షి, హైదరాబాద్: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్‌లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్‌లో జనరేట్ అయ్యి టోకెన్ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి. దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. అవన్నీ రెండేళ్ల కిందటివే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్‌లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్‌లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ ‘సాక్షి’తో అన్నారు. -
మరింత సులభంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్థారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగకూడదని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పలు శాఖలు ప్రత్యేకంగా వీటిని అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు లేని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుంది. ఆ శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాలి. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని నిర్దేశించారు. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తీసుకుంటారని తెలిపింది. ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్ టైమ్‌లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది. ఆరు దశల ధ్రువీకరణ ఇలా.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆరు దశల్లో దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆధార్ కార్డు, ఇతర వివరాల ద్వారా ఆ వ్యక్తికి ఉన్న భూమి, మున్సిపల్ ఆస్తి, 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు, వారు వినియోగించే విద్యుత్ యూనిట్లను పరిశీలిస్తారు. వీటి ద్వారా వారి ఆరి్థక స్థితిని నిర్ధారిస్తారు. -
ఒక్కొక్కరికి రూ. 2లక్షలు.. 5వేల విద్యార్థులకు అవకాశం - రిలయన్స్ ఫౌండేషన్
రిలయన్స్ ఫౌండేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి 5,000 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. దీని కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు 2023 అక్టోబర్ 15లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ అన్ని బ్రాంచ్‌లలోని మొదటి సంవత్సరం రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ ఫౌండేషన్ అందించే ఈ స్కాలర్షిప్ మెరిట్ ఆధారంగా చేసుకుని అందివ్వడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన ఒక్కో విద్యార్థికి రూ. 2 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఇందులో మహిళా విద్యార్థులకు, వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా చదువుకోవాలనే సదుద్దేశ్యంతో రిలయన్స్ సంస్థ ఈ స్కాలర్షిప్లను అందిస్తోంది. 2022 - 23 విద్యాసంవత్సరంలో కూడా సంస్థ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. దీని కోసం అప్పుడు లక్ష మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఎంపికైన వారిలో 51 శాతం మహిళలు, 97 మంది వికలాంగులు ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రూ.20 వేలతో మొదలై ప్రపంచ స్థాయికి.. వావ్ అనిపించే 'వందన' ప్రస్థానం! రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి www.scholarships.reliancefoundation.org వెబ్సైట్ సందర్శించవచ్చు. ఇందులో కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..
దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) బంపరాఫర్ ప్రకటించింది. 1,000 మంది ప్రభుత్వ అధికారులకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సెర్ట్ఇన్ (CERT-In)తో గూగుల్ క్లౌడ్ (Google Cloud) తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సెర్ట్ఇన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో భాగం. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్, ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూసుకుంటుంది. (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) రూ.లక్ష స్కాలర్షిప్ కూడా.. 'సైబర్ ఫోర్స్' పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులకు సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా వీరికి జనరేటివ్ ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ ఏఐ హ్యాకథాన్ల నిర్వహణ వంటివి గూగుల్ క్లౌడ్, మాండియంట్ నిపుణులచే నిర్వహించన్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రూ.లక్ష స్కాలర్షిప్ కూడా ఇవ్వననున్నట్లు పేర్కొంది. ‘సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముందుకు సాగాలంటే జనరేటివ్ ఏఐ శక్తిని వినియోగించుకోవడం చాలా అవసరం’ అని సెర్ట్ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహ్ల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా భారతీయులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేస్తున్నామని, కొత్త సురక్షితమైన భద్రత సేవలను అందించడానికి సహకారం అందిస్తున్నామని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అన్నారు. -
మైనారిటీ స్కాలర్షిప్ పేరిట రూ.144 కోట్ల కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీ స్కాలర్షిప్ కార్యక్రమంలో అవకతవకలపై విచారణ చేపట్టిన సీబీఐ ఈ మొత్తం విద్యా సంస్థల్లో 53 శాతం బోగస్ సంస్థలేనని తేల్చింది. మైనారిటీలకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో కింద యాక్టివ్‌గా ఉన్న విద్యా సంస్థలలో దాదాపు 53 శాతం నకిలీవేనని గుర్తించారు సీబీఐ అధికారులు. గత ఐదేళ్ళలో 18 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 830 సంస్థల్లో భారీగా అవినీతి జరిగినట్లు విచారణలో వెల్లడైందని ఈ కుంభకోణంలో దాదాపుగా రూ.144.83 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించింది సీబీఐ. అనుమానిత నిందితుల్లో ఈ 830 సంస్థలకు చెందిన ప్రభుత్వాధికారులు, అనేక PSU బ్యాంకుల అధికారులు ఉన్నారని తెలిపింది సీబీఐ. ఏటా సుమారు 65 లక్షల మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయా పథకాల క్రింద మైనారిటీ స్కాలర్షిప్లను పొందుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారాసీలకు చెందిన ఆరు మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేవారు. Central Bureau of Investigation (CBI) registers case against unknown officials in connection with alleged minority scholarship scam of Rs 144 crores — ANI (@ANI) August 29, 2023 ఇది కూడా చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ.. -
పేద బాలికలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చేయూత
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌కు చెందిన సామాజిక సేవా సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నిరుపేద విద్యారి్థనులకు రూ.100 కోట్లతో ‘స్టెమ్ స్టార్’ స్కాలర్షిప్ను అందిస్తున్నట్టు ప్రకటించింది. మొదటి దశలో 2,000 మంది బాలికలకు స్కాలర్షిప్ ఇవ్వనుంది. పేరొందిన విద్యా సంస్థల్లో.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్ (స్టెమ్) విభాగాల్లో కోర్సులు చేసే, ఆర్థికంగా బలహీన వర్గాల వారు ఇందుకు అర్హులని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. స్టెమ్ స్టార్ స్కాలర్షిప్ అన్నది ట్యూషన్ ఫీజులు, నివాస వ్యయాలను చెల్లించడంతోపాటు, రూ.లక్ష వరకు స్టడీ మెటీరియల్ కోసం ఇస్తుంది. ‘‘పేదరికం ఎంతో యువతను విద్యకు దూరం చేస్తోంది. బాలికలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మహిళలు విద్యావంతులు అయితే వారి పిల్లల స్కూలింగ్‌పై సానుకూల ప్రభావం చూపించడాన్ని గమనించొచ్చు. అందుకే స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్ కార్యక్రమం ఉన్నత విద్య చదువుకోవాలనే బాలికలకు సాధికారతను కలి్పంచనుంది’’అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మాణి తెలిపారు. -
జీఆర్టీ జ్యువెలర్స్ చేయూత: రూ. 50 లక్షల స్కాలర్షిప్స్
హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థుల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ‘జీఆర్టీ జ్యువెలర్స్’ చేయూత అందించింది. ఈ విద్యా సంవత్సరం(2023-24) మొదటి లేదా రెండో ఏడాది ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులు చదువుతున్న వారికి స్కాలర్ షిప్స్ అందించింది. అర్హులైన 100 మంది విద్యార్థులకు రూ.50 లక్షల ఉపకార వేతనాలు మంజూరు చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయితే డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ సాయం కొనసాగుతుందని వెల్లడించింది. ఉన్నత విద్య ద్వారానే సామాజిక చైత్యనం అభివృద్ధి చెందుతుందని కంపెనీ తెలిపింది. -
పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందుడుగు వేశారు. తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రతిభగల పేద విద్యార్ధులకు అండగా నిలిచారు. తాను చదువుకున్న కళశాలలో ప్రస్తుతం అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్లు అందించారు. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాలలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్ధుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందించారు. కళాశాల పూర్వ విద్యార్థి బాపయ్య చౌదరి నాట్స్ అధ్యక్షునిగా ఎన్నికై తాను చదువుకున్న కళాశాలలోనే పేద విద్యార్థులకు సహాయ,సహకారాలు అందించడం మరెందరో పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని పలువురు అభినందించారు. మెరిట్ స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిభ గల విద్యార్ధులను మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సాహిస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. (చదవండి: వైట్‌హౌస్‌లో అడుగడుగున మోదీకి ఘన స్వాగతం) -
5,000 మందికి రిలయన్స్ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 5,000 మంది విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యారు. 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 2022–23 సంవత్సరానికి రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లను ప్రదానం చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు రూ.2 లక్షల వరకు గ్రాంట్‌ని అందుకుంటారని వివరించింది. స్కాలర్షిప్స్ అందుకునే విద్యార్థుల్లో ఇంజనీరింగ్/టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, కామర్స్, ఆర్ట్స్, బిజినెస్/మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, ఆర్కిటెక్చర్, ఇతర ప్రొఫెషనల్ డిగ్రీలకు చెందినవారు ఉన్నారు. స్కాలర్స్‌లో 51 శాతం మంది బాలికలు. 4,984 విద్యా సంస్థలలో చదువుతున్న దాదాపు 40,000 మంది దరఖాస్తుదారుల నుండి కఠినమైన ప్రక్రియ ద్వారా వీరి ఎంపిక జరిగింది. ఇందులో ఆప్టిట్యూడ్ టెస్ట్, 12వ తరగతి మార్కు లు, ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా అర్హుల జాబితా రూపొందింది. పదేళ్లలో 50,000 మందికి స్కాలర్షిప్స్ అందజేయనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ 2022 డిసెంబర్లో ప్రకటించింది. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
ఎస్సీ స్కాలర్‌షిప్‌లకు అందని కేంద్ర సాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులకు కేంద్ర నిధులు అందడం లేదు. దీనికి సంబంధించి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మూడేళ్లుగా నిధుల విడుదలను నిలిపివేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపితేనే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. దీనితో గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సిన రూ.775 కోట్లు ఆగిపోయాయి. అంతేకాదు ఇలా నిలిచిన నిధులను తదుపరి ఏడాది ఇచ్చే (క్యారీ ఫార్వర్డ్) అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని.. అంటే భారమంతా రాష్ట్రంపై పడినట్టేనని అధికారులు చెప్తున్నారు. కేంద్ర నిధులు విడుదలకాక రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నిధులను సర్దుబాటు చేయాల్సి రావడంతో విద్యార్థులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందంటున్నారు. నేరుగా ఇచ్చేందుకే కేంద్రం పట్టు.. ఎస్సీవర్గాల వారికి నేరుగా లబ్ధి చేకూర్చేలా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మూడేళ్ల కింద నిబంధన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అందించే సాయం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం కాకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్రం.. నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ నిర్దేశిత ఫార్మాట్లో వివరాలను అందజేసినా.. ఉపకార వేతన దరఖాస్తులు స్వీకరించిన వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. ఆ ఫార్మాట్లో వివరాల సమర్పణకు, ఇతర నిబంధనలకు రాష్ట్రం అంగీకరించకపోవడం, వివరాలు పంపకపోవడంతో కేంద్రం నిధుల విడుదలను ఆపేసింది. మూడేళ్లలో ఇప్పటివరకు రూ.775 కోట్లు ఇలా నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థి ఖాతాలో జమచేస్తుండగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీల ఖాతాలో జమ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పొంగులేటి కొత్త పార్టీ.. పేరు అదేనా? -
విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
విజయనగర్ కాలనీ: పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడంతో పాటు 16 లక్షల కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అంజి, నీల వెంకటేశ్, రామకృష్ణ నాయకత్వంలో మాసాబ్‌ట్యాంక్ బీసీ సంక్షేమ భవన్‌ను వేలాది మంది విద్యార్థులతో కలిసి ముట్టడించారు. ముట్టడిలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ ఆరేళ్ల కిందటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, ఇటీవల పెరిగిన నిత్యావసర ధరల నూనెలు, పప్పులు, కూరగాయలు తదితర ఆహార వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. హోటల్లో ఒక్క పూట భోజనం కనీసం రూ.60 ఉందని, హాస్టల్ విద్యార్థులకు పూటకు రూ.10 ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలకు నెలకు రూ.2,100 ఇస్తూ, హాస్టల్ విద్యార్థులకు రూ.950 ఇవ్వడంలో ఏమైనా న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. 2013 వరకు కోర్సు ఫీజులు మంజూరు చేశారని, 2014 నుంచి ప్రభుత్వం పూర్తి ఫీజు స్కీమ్‌కు పరిమితులు విధిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తోందన్నారు. కార్యక్రమంలో తిరుపతి, అనిల్, అనంతయ్యలతో పాటు వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు జీఆర్టీ జ్యువెలర్స్ అండ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన జీఆర్టీ జ్యువెలర్స్.. ఎంతో కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన డిగ్రీ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇందుకోసం అందిన వెయ్యి దరఖాస్తులను పరిశీలించి 71 మంది అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసింది. ఒకటో సెమిస్టర్‌కు అర్హులైన విద్యార్థులకు రూ.25 లక్షలు అందజేసింది. రెండో సెమిస్టర్‌కు కూడా ఉపకార వేతనాలను అందిస్తామని.. డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ సాయం కొనసాగుతుందని సంస్థ ఎండీ జీఆర్ ‘ఆనంద్’అనంతపద్మనాభన్ స్పష్టం చేశారు. -
నిజమైన హిందూధర్మ పరిరక్షకుడు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన హిందూ ధర్మపరిరక్షకుడని మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. కొంతమంది రాజకీయాల కోసం హిందూమతాన్ని వాడుకుంటున్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం అలోచించే సీఎం కేసీఆర్ అని, బ్రాహ్మణులపట్ల అపార గౌరవం కలిగిన నేత అని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ సమాజ్ సామూహిక భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారని అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ‘వివేకానంద విదేశీ విద్యాపథకం’అర్హులకు స్కాలర్షిప్ మంజూరు పత్రాలను అందించే కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఒకప్పుడు అర్చకులకు పుణ్యకార్యం జరిగితేనే జీతాలు వచ్చే పరిస్థితి ఉండేదని, కానీ ముఖ్యమంత్రి కృషితో ప్రతీనెల అర్చకులకు జీతాలు సమయానికి వచ్చే వ్యవస్థ ఏర్పాటైందని వివరించారు. దేవాలయాల కోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. విదేశీవిద్య కోసం ఈ ఏడాది 121 మందికి రూ.24.20 కోట్లు మంజూరయ్యాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. వేద విద్యార్ధులకు నెలకు రూ.250, వేదవిద్య పూర్తయ్యాక వృత్తిలో నిలదొక్కుకునేందుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో కొత్త బ్రాహ్మణభవన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన ధరల మేరకు స్కాలర్షిప్ ఇవ్వాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): పెరిగిన ధరల మేరకు విద్యార్థులకు ఇచ్చే ఉప కారవేతనాలను కూడా పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు రెండేళ్లుగా బకాయి ఉన్న రూ.3,500 కోట్ల ఫీజులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలో 16 బీసీ సంఘాలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ రూ.1,800 నుంచి రూ. 5,000కు, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,500 నుంచి 1,800కు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2,000లకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీబంధు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. జూనియర్ అడ్వొకేట్లకు స్టైపెండ్‌ను రూ.10 వేలకు పెంచాలన్నారు. -
బీసీలకు బర్లు, గొర్లు కాదు, బడులు కావాలె
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాడానికి స్కాలర్ షిప్‌లు, ఫీజులు ఇవ్వాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గొర్లను, బర్లను ఇస్తూ బీసీలను మళ్లీ కులవృత్తులకే పరిమితం చేయాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ‘పాలమూరు నుంచి పట్నం వరకు’పేరిట డిసెంబర్ రెండో తేదీన చేపట్టిన బీసీల పోరుయాత్ర గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో నిర్వహించిన బీసీల పోరుగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. గత మూడున్నరేళ్లుగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడంలేదని, స్కాలర్షిప్లు, మెస్‌చార్జీలు పెరిగిన ధరల ప్రకారం పెంచడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దొడ్డు బియ్యంతో నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆసరా పింఛన్‌దారులకు రూ.2016 రూపాయలు ఇస్తుండగా, హాస్టల్ విద్యార్థులకేమో రూ.1,500 ఇస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్ర అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరు రవికృష్ణ గౌడ్, బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు స్వామిగౌడ్, పాలకూరి కిరణ్, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం: ఆర్.కృష్ణయ్య
పంజగుట్ట (హైదరాబాద్): వచ్చే బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. సోమ వారం బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఒక్కో విద్యార్థికి రూ.20 వేల స్కాలర్షిప్, పాఠశాల విద్యార్థులకు రూ.15 వేలు, మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని తెలిపారు. లోటుబడ్జెట్లో ఉన్న రాష్ట్రమే ఇస్తుండగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం. ఎనిమిదేళ్లుగా 5.70 లక్షల మంది బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒక్కరికీ మంజూరు చేయలేదు’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విద్యార్థి నాయకుడు జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు. -
మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
కవాడిగూడ: నాణ్యమైన భోజ నం లేక హాస్టల్ విద్యార్థులు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగానే మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద ఆదివారం నిర్వహించిన మహాధర్నాలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 లక్షలమంది హాస్టల్ విద్యార్థులకు తక్షణమే మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాలేజీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రూ.1500 నుంచి 3000 వరకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా దామాషా ప్రకారం మరో 240 గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, రాజ్‌కుమార్, సతీష్, అనంతయ్య, నిఖిల్, భాస్కర్, ప్రజాపతి మల్లేష్, సందీప్, వంశీ, వందలాదిమంది గురుకుల హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ ఇవ్వాలి
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ రేట్లు పెంచాలని, చదివే విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు రూ.5500 నుంచి 20 వేలకు పెంచాలని, కోర్సుల్లో చదివే విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, ఫీజుల బకాయిలు రూ.3300 కోట్లు చెల్లించాలని నవంబర్ 10న కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్వో కార్యాలయాల వరకు ర్యాలీలు జరపాలని 14 బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం బీసీ భవన్లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశానికి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హజరై మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్షిప్లు 5 సంవత్సరాల క్రితం నిర్ణయించారని ఆంధ్రప్రదేశ్‌లో రూ. 20 వేలు స్కాలర్షిప్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో కేవలం రూ.5500 మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలన్నారు. 2007లో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మొత్తం ఫీజులు మంజూరు చేస్తే ప్రభుత్వానికి అదనంగా 150 కోట్లు మాత్రమే భారం పడుతుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ దిక్కులేని శాఖగా మారిందని ఈ శాఖకు కమీషనర్, ఎండీ లేరన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, నీలం వెంకటేష్ పాల్గొన్నారు. -
‘ఉపకార’ సంస్కరణలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల విషయంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని భావించిన సంక్షేమ శాఖలకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలను సమర్పించాయి. ప్రధానంగా సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ, పరిశీలన, ఆమోదం విషయంలో సవరణలకు సంబంధించిన ప్రతి పాదనలను సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా..వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రస్తుతం అవలంభిస్తున్న పద్ధతులతోనే పథకాలను అమలు చేయాలని భావించి పాత విధానాల ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేశాయి. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి విద్యార్థుల నుంచి ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేలా గడువును నిర్దేశించాయి. సులభతరం కోసం సంస్కరణలు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఇవన్నీ ఆన్లైన్ పద్ధతిలోనే స్వీకరిస్తున్నప్పటికీ.. పరిశీలన ప్రక్రియలో పలు అంచెలన్నీ మాన్యువల్ పద్ధతిలోనే సాగుతున్నాయి. దీంతో పథకాల అమలులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సులభతర విధానం కోసం దరఖాస్తుల ప్రక్రియలో మార్పులు చేయాలని సంక్షేమ శాఖలు పలు దఫాలుగా చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఏదైనా కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థి ఒకసారి ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు సమర్పిస్తే కోర్సు ముగిసే వరకు ఆ దరఖాస్తును సాంకేతికంగా అప్డేట్ చేయాలని, ఈ బాధ్యతలను కాలేజీ యాజమాన్యాలకు ఇస్తే విద్యార్థి పదేపదే దరఖాస్తు చేసే పని ఉండదని, సంక్షేమ శాఖ అధికారులు మొదటి ప్రతిపాదన చేశారు. విద్యార్థుల నుంచి ప్రతిసారి ఆదాయ ధ్రువీకరణ పత్రాల సమర్పణ, అఫిడవిట్లు తీసుకునే విధానాన్ని రద్దు చేయాలని, ఇక ప్రతి విద్యార్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో పత్రాలను సమర్పించడం కాకుండా ఆన్లైన్ విధానాన్నే పాటించడం, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియంతా కాలేజీలో నిర్వహించడంలాంటి పద్ధతులతో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలు మరింత సులభతరమవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇదంతా జరిగి ఆర్నెళ్లు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో పాత విధానాన్నే అనుసరించాలని, ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాది నుంచి కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేస్తూ కాలేజీ యాజమాన్యాలకు జిల్లా సంక్షేమ శాఖల నుంచి ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు మౌఖిక ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారు. -
విద్యార్థుల స్కాలర్ షిప్ రూ. 20 వేలకు పెంచాలి
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్ షిప్‌లను రూ.5,500 నుంచి రూ. 20 వేలకు పెంచాలని, ఫీజు బకాయిలు రూ. 3,300 కోట్లు వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 10న కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తారని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రూ. 20 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంటే తెలంగాణలో కేవలం రూ. 5,500 మాత్రమే ఇస్తున్నారని ప్రస్తుత అవసరాలకు రూ. 20 వేలకు పెంచాలని కోరారు. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1,500 నుంచి రూ. 3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2 వేలకు పెంచాలన్నారు. బీసీలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బీసీ గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలని కృష్ణయ్య కోరారు. -
ఉద్దేశించిన లక్ష్యం నెరవేరడం లేదు!
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దళిత – గిరిజన విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించడానికి ఇచ్చే ‘అంబేడ్కర్ విదేశీ ఉపకార వేతనం’లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఈ పథకాన్ని 2013లో మొదలు పెట్టారు. అయితే ఉమ్మడి రాష్టంలో విదేశీ విద్యకు పది లక్షల రూపాయలు; వారి వీసా, విమాన ఖర్చులు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ స్కాలర్షిప్ను రూ. 20 లక్షలకు పెంచారు. అయితే ఆ పెంచిన ఉపకార వేతనం కూడా విద్యార్థులకు ఏమాత్రం సరి పోవడం లేదు. అలాగే ఈ ఉపకార వేతనం పొందటానికి విధించిన కొన్ని షరతులూ వెనుకబడిన దళిత, గిరిజన పిల్లలకు ఇబ్బంది కరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కాలర్షిప్’ ఇచ్చే ప్రక్రియలో అనేక లోటుపాటులు ఉన్నాయి. ఈ స్కాలర్షిప్ మంజూరు అయినవారికి కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ డబ్బు కనీసం విశ్వవిద్యాలయాల ట్యూషన్ ఫీజు కట్టడానికి కూడా చాలదు. విదేశాల్లో పీజీ పూర్తి చేయాలంటే రూ. 50 లక్షల నుండి కోటి వరకూ ఖర్చవుతుంది. పిల్లిని పెంచడానికి కావలసిన పాల కోసం ఆవును కొన్నట్లు... పేద దళిత, ఆదివాసీ విద్యార్థులు రూ. 20 లక్షల స్కాలర్ షిప్ మంజూరైన కారణంగా... తమ తాహతుకు మించి బ్యాంకుల నుండి పూర్తి ఖర్చులకు సరిపడా డబ్బు లోన్ తీసుకుని తమ విదేశీ విద్యాభ్యాసాన్ని పూర్తిచేయవలసి వస్తున్నది. అప్పుల పాలయిన విద్యార్థులు వాటిని తీర్చడానికి ఏదో ఒక చోట పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ విద్యార్జనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ పథకంలో మరికొన్ని లోపాలూ ఉన్నాయి. కేవలం ప్రపంచంలోని 10 దేశాలలో చదివితేనే ఈ ప్రభుత్వ పథకానికి దళిత – గిరిజన విద్యార్థులు అర్హులు. వేరే దేశాల్లో మంచి యూనివర్సిటీల్లో సీట్లు వచ్చినా ఈ స్కాలర్షిప్ పొందేందుకు అవకాశం లేదు. ఇందువల్ల ఈ పథకం నిజంగా ప్రభుత్వం అనుకున్న స్థాయిలో అణగారిన వర్గాల విద్యార్థులకు మేలు చేయటం లేదు. అలాగే ఈ పథకం కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలంటే వారి డిగ్రీ, పీజీ కోర్సులలో 60 శాతం మార్కులు ఉండాలి. అయితే మన దేశంలో ఏ ప్రభుత్వ యూనివర్సిటీలలో అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి అంటే కేవలం 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. మరి చదువుకునే విద్యార్థులకు 60 శాతం మార్కుల నిబంధన ఎందుకో అర్థం కాదు. (క్లిక్ చేయండి: భారతీయ గ్రామాల్లో ఇంగ్లిష్ విప్లవం) ఇంతే కాకుండా జీఆర్ఈ, ఇంగ్లిష్ సామర్థ్య పరీక్షలు... వారు వెళ్లే యూనివర్సిటీకి అవసరం లేకున్నా ఈ స్కీం నుంచి విద్యార్థులు లబ్ధి పొందాలి అంటే కచ్చితంగా ఈ పరీక్షలు రాయాలనే నిబంధన ఉంది. గ్రామీణ ప్రాంతాలు, వెనకబడిన అటవీ ప్రాంతాల నుండి వచ్చే దళిత, గిరిజన విద్యార్థులకు ఈ పరీక్షల్లో స్కోర్ సాధించడం చాలా కష్టం. ఈ నిబంధన కారణంగా అనేక దళిత–గిరిజన విద్యార్థులు లబ్ధి పొందలేక పోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఉపకార వేతనం మంజూరు విషయంలో వాస్తవాలకు అనుగుణంగా స్కీమ్‌కు మార్పు చేర్పులు చేయాలని సంబంధిత విద్యార్థిలోకం కోరుకుంటోంది. (క్లిక్ చేయండి: పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?) - అశోక్ ధనావత్ విద్యార్థి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్, ది హేగ్, నెదర్లాండ్ -
స్కాలర్షిప్లు పెంచకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో విద్యార్ధులకు స్కాలర్షిప్లు పెంచకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు స్కాలర్షిప్ రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. పేద విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీసీ గురుకులాలకు ఒక ఐఏఎస్‌ను నియమించకపోవటం బాధాకరమన్నారు. తెలంగాణలో బీసీ సంక్షేమశాఖ నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 240 బీసీ హాస్టళ్లు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో విద్యకోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీ విద్యార్థికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఉపకారానికి కొర్రీ .. విద్యార్థులు వర్రీ!
సాక్షి, హైదరాబాద్: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై కేంద్రం విధించిన సరికొత్త నిబంధనలు పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాము సూచించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటేనే కేంద్ర వాటా విడుదల చేస్తామని స్పష్టం చేయడం, దీనిపై రాష్ట్ర సర్కారు మిన్నకుండడంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.600 కోట్లు నిలిచిపోయాయి. దీంతో అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. రాష్ట్రంలో వివిధ పోస్టుమెట్రిక్ కోర్సులు చదివే విద్యార్థులు ఏటా 2 లక్షలకు పైగా ఉంటారు. 60 శాతానికి పెరిగిన కేంద్రం వాటా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రాష్ట్రాలకు నిధులిస్తుంది. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులు కలిపి విద్యార్థులకు అందిస్తుంటాయి. ఎన్నో ఏళ్లుగా ఈ పద్ధతి కొనసాగుతోంది. అయితే తన వాటా నిధులు 40 నుంచి 60 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి కొత్త నిబంధనలు విధించింది. గతేడాది నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 40 శాతం (గతంలో 60 శాతం) విడుదల చేయాలనే మెలిక పెట్టింది. అంతేకాకుండా విద్యార్థుల ఖాతా నంబర్లను కేంద్రానికి పంపితే నేరుగా నిధులు జమ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. వివరాలను పంపాలని సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం పంపలేదు. సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం! నేరుగా తామే ఖాతాల్లో నిధులిస్తామనే నిబంధనతో లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశముందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు ఉపకారవేతనాలే నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీ ఖాతాలో జమ చేస్తోంది. కేంద్రం నిబంధనల ప్రకారం ఫీజులు కూడావిద్యార్థి ఖాతాలో జమ చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయని ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో లబ్ధిదారులకు అందించడమే ఉత్తమమని, ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల వివరాలను పంపకపోవడంతో రెండేళ్లుగా ఈ కోటాలో పైసా కూడా విడుదల కాలేదు. ఇరకాటంలో విద్యార్థులు.. 2021–22 విద్యా సంవత్సర దరఖాస్తుల పరిశీలన పూర్తయినప్పటికీ ఆయా విద్యార్థులకు సంబంధించిన ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో మెజార్టీ విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఎదురు చూస్తుండగా... కాలేజీ యాజమాన్యాలు ఫీజు నిధుల కోసం పడిగాపులు కాస్తున్నాయి. కొన్నిచోట్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తుండడంతో వారు అప్పులు చేసి సొంతగా ఫీజులు చెల్లిస్తున్న ఉదంతాలు సైతం కనిపిస్తున్నాయి. -
హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన వేదాంత్ ఆనంద్‌వాడే (18) బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంనుంచి భారీ స్కాలర్షిప్ సాధించాడు. వేదాంత్ బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు దాదాపు కోటిన్నర స్కాలర్షిప్ అందించనుంది. 17 మంది నోబెల్ గ్రహీతలను అందించిన కేస్ వెస్ట్రన్ నుండి స్కాలర్షిప్ అందుకున్న ఈ హైదరాబాదీ సర్జన్ కావాలనుకుంటున్నాడట. వేదాంత్ ఆనంద్‌వాడే న్యూరోసైన్స్ సైకాలజీలో ప్రీ-మెడ్ గ్రాడ్యుయేషన్ కోసం కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ నుండి రూ.1.3 కోట్ల స్కాలర్షిప్ అందుకున్నాడు.ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్షిప్ లేఖను పంపింది. అంతేకాదు క్లైమేట్ కాంపిటీషన్ ఛాలెంజ్‌లో విజయం సాధించిన వేదాంత్, ఈ ఏడాది నవంబర్‌లో పారిస్‌కు కూడా వెళ్లబోతున్నాడు. యునెస్కోలోని జ్యూరీకి సలహాలివ్వబోతున్నాడు. 8వ తరగతి చదువుతున్నప్పటినుంచే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనేది తన లక్ష్యం, 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత, కోవిడ్ కాలంలో అమ్మ ప్రపంచవ్యాప్త నైపుణ్యానికి పరిచయం చేసిందని వెల్లడించాడు. ఈ క్రమంలో కోరుకున్న కాలేజీలు, కోర్సుల నిమిత్తం ఇంటర్నెట్ను వెదికాను. 16 సంవత్సరాల వయస్సులో మూడు నెలల క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శిక్షణే, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ స్కాలర్షిప్ దాకా తీసుకెళ్లిందంటూ తన జర్నీని వెల్లడించాడు వేదాంత్. కాగా వేదాంత్ తండ్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెంటిస్టుగా ఉన్నారు. అమ్మ ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్నారు. -
గుడ్‌న్యూస్! వైఈటీ ఎగ్జామ్‌లో మెరిట్‌తో.. ఏడాదికి రూ.75 వేల స్కాలర్షిప్
విద్యార్ధులకు కేంద్రం శుభవార్త చెప్పింది. యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా (వైఏఎస్‌ఏఎస్‌వీఐ) స్కీమ్‌లో భాగంగా స్కాలర్ షిప్ అందించేందుకు విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్మెంట్ విద్యార్ధులకు సువర్ణ అవకాశాన్ని కల్పించింది. అర్హులైన విద్యార్ధులకు ఏడాదికి రూ.75వేల నుంచి రూ.లక్షా 25 వేల వరకు స్కాలర్ షిప్‌ను అందించేందుకు సిద్ధమమైంది. ఇందులో భాగంగా ప్రతిభావంతులైన 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న అథర్ బ్యాక్ వర్డ్ క్లాస్ (ఓబీసీ) డి-నోటిఫైడ్, సంచార, సెమీ-సంచార (డీఎన్టీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) కేటగిరీల విద్యార్ధుల్ని ఎంపిక చేయనుంది. అర్హతలు ఏంటంటే కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్లో విద్యార్ధులు అర్హత పొందాలంటే విద్యార్ధులు తల్లిదండ్రులు, లేదంటే వారి గార్డియన్ (సంరక్షకు)ల వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించకూడదు. ఎలా అప్లయ్ చేయాలి పీఎం వైఏఎస్‌ఏఎస్‌వీఐ స్కాలర్ షిప్లో విద్యార్ధులు అప్లయ్ చేయాలంటే అధికారిక వెబ్సైట్ yet.nta.ac.in సందర్శించాల్సి ఉంటుంది. జులై 27నుంచి ఆగస్టు 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ దిద్దుబాటు విండో ఆగస్టు 27 నుండి 31 వరకు తెరిచి ఉంటుంది. ఏఏ డాక్యుమెంట్లు కావాలంటే పీఎం వైఏఎస్‌ఏఎస్‌వీఐ స్కాలర్షిప్ దరఖాస్తు కోసం విద్యార్ధులు కాంటాక్ట్ నెంబర్ ఆధార్ నంబర్, ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. ఎగ్జామ్ ఎలా ఉంటుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే వైఏఎస్‌ఏఎస్‌వీఐ ప్రవేశ పరీక్షలో (yet) మెరిట్ ఆధారంగా విద్యార్థులు స్కాలర్షిప్ కోసం ఎంపిక చేయబడతారు. సెప్టెంబరు 11న కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ప్రవేశపరీక్ష నిర్వహించబడుతుంది.దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ సెప్టెంబర్ 5న అందుబాటులో ఉంటుంది. -
హైదరాబాద్ విద్యార్థికి వెల్స్‌స్లీ వర్సిటీ రూ. 2 కోట్ల స్కాలర్షిప్
మల్కాజిగిరి: లక్ష్య సాధనకు సంకల్ప బలం దండిగా ఉండాలి. విజయం దిశగా పయనించేందుకు అకుంఠిత శ్రమ తోడవ్వాలి. ఆ కోవకు చెందిన యువతియే మల్కాజిగిరి విష్ణుపురి కాలనీకి చెందిన లక్కప్రగడ నీలిమ కుమార్తె శ్రేయా సాయి. అమెరికా మసాచుసెట్స్‌లోని ప్రఖ్యాత వెల్స్లీ కాలేజీలో 2022– 26 వరకు అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోసం రూ.2.7 కోట్ల (ఇండియన్ కరెన్సీ) స్కాలర్షిప్ ప్యాకేజీని సదరు యూనివర్సిటీ నుంచి ఆమె పొందడం గమనార్హం. శ్రేయా సాయి సైనిక్‌పురిలోని భవన్స్‌లో పదో తరగతి, నల్లకుంటలోని డెల్టా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనే లక్ష్యంతో వెల్స్‌స్లీ కాలేజీని ఎంపిక చేసుకొని ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకుంది. శ్రేయా సాయి ప్రతిభను గుర్తించిన మసాచుసెట్స్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్, సైకాలజీలో యూజీ చేయడానికి రూ.2.7 కోట్లు మంజూరు చేస్తూ మార్చి నెలలో సంబంధించిన పత్రాలను అందజేశారు. కాలేజీ ఫౌండర్ శ్రీకాంత్ మల్లప్ప, అకాడమీ డైరెక్టర్ భాస్కర్ గరిమెళ్లతో పాటు పాటా్నకు చెందిన గ్లోబల్ సంస్థ సీఈఓ శరత్ సహకారంతో వెల్స్లీ కళాశాలలో సీటు సాధించినట్లు శ్రేయా సాయి తెలిపింది. వచ్చే నెలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్తున్నట్లు పేర్కొంది. అమ్మ తోడ్పాటుతోనే.. s పాఠశాల స్థాయి నుంచే వివిధ పోటీల్లో పాల్గొనే దాన్ని. స్వచ్ఛ భారత్ నిర్వహణకు తోటి విద్యార్థులతో గ్రూపు ఏర్పాటు చేశాను. కేబినెట్ మెంబర్‌గా ఉండేదాన్ని. అమ్మ నీలిమతో పాటు అమ్మమ్మ జానకీదేవి సహకారం ఎంతో ఉంది. ప్రత్యేక కార్యాచరణతో ఆన్లైన్ అసైన్‌మెంట్స్‌తో పాటు, సెమినార్స్‌లో పాల్గొనేదాన్ని. నా పట్టుదలే లక్ష్యాన్ని దరిజేరేలా చేసింది. – శ్రేయాసాయి (చదవండి: బాత్రూంలోనే నివాసం) -
Scholarships: విద్యార్థులకు అలర్ట్.. ఇది మీ కోసమే..
సాక్షి, అమరావతి: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాధాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫోసిస్ కో–ఫౌండర్ ఎస్డీ శిబులాల్, కుమారి శిబులాల్ సామాజిక బాధ్యతలో భాగంగా సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్షిప్లను 15 రాష్ట్రాల్లో అందజేస్తున్నారు. చదవండి: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. వార్షికాదాయం రూ.రెండు లక్షల్లోపు ఉండి 2022 విద్యా సంవత్సరంలో పదో తరగతి 90 శాతం లేదా 9 సీజీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న చదువుల నిమిత్తం రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్షిప్లను ఇవ్వనున్నట్లు విద్యాధాన్ పేర్కొంది. జూన్ 7 నుంచి జూలై 10 వరకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www. vidyadhan.org అనే వెబ్సైట్ లేదా 8367751309 నంబర్లో సంప్రదించవచ్చు. -
ఎడ్యుకేషన్‌లోన్ కావాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
విదేశాల్లో చదువుకుని, కెరీర్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టాలన్నది చైతన్య (24) డ్రీమ్. బీటెక్ చేసిన తర్వాత రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. ఫ్రాన్స్‌లోని మాంట్పెల్లియర్ బిజినెస్ స్కూల్లో ఎంఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోర్సుకు పాక్షికంగా స్కాలర్ షిప్ రావడంతో అతడు ఎంతో సంతోషించాడు. కానీ, అప్పుడే అసలు సవాలు ఎదురైంది. వచ్చిన స్కాలర్షిప్ కొద్ది మొత్తమే, మిగిలిన మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా రుణం సులభంగా లభిస్తుందని అనుకోవచ్చు. కానీ, ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ప్రశాంతత కోల్పోయి అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు కావడంతో బ్యాంకు విద్యా రుణానికి ఓకే చెప్పింది. అందుకే, విద్యా రుణం పొందడం అనుకున్నంత సులభం కాదు. రుణం ఇచ్చే సంస్థ అన్ని విషయాలను స్పృశిస్తుంది. ఎలా వ్యవహరిస్తే సులభంగా రుణం లభిస్తుంది? ఈ విషయంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఏటా వేలాది మంది భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాంగ శాఖ వద్దనున్న తాజా సమాచారం మేరకు.. కరోనా తర్వాత కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. 2021లో 11 లక్షల మంది భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. 2024లో భారత్ నుంచి సుమారు 18 లక్షల మంది విదేశాల్లో ఉన్నత విద్యను ఎంపిక చేసుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా. వారు చేసే ఖర్చు వార్షికంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.16 లక్షల కోట్లు) ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. విద్యా రుణాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు ప్లాన్ చేసుకునే వారు ముందుగానే ఇందుకు సంబంధించి వాస్తవ అంశాలను, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా విచారించుకోవాలి. ‘‘ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విద్యా రుణాలను పరిమితంగానే మంజూరు చేస్తోంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఆమోదం చెప్పడం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల పూర్తి జాబితానే చాలా బ్యాంకుల వద్ద లేదంటే విద్యా రుణాల విషయంలో వాటికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు’’అని లాంచ్మైకెరీర్ అనే కెరీర్ కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్ గ్లోబల్ లీడర్ సుష్మాశర్మ తెలిపారు. బ్యాంకును గుర్తించడం.. విద్యా సంస్థలు, దేశాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ విద్యా రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించవు. పైగా ఒక బ్యాంకుకు సంబంధించి కూడా అన్ని శాఖలు ఈ వ్యాపారం చూడడం లేదు. చైతన్య ముందుగా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకుందామని అనుకున్నాడు. సులభంగా, వేగంగా వస్తుందని అనుకుని కొన్ని ఎన్బీఎఫ్సీలను సంప్రదించాడు. కానీ, ఒక్కటంటే ఒక్కటీ చైతన్య సీటు సంపాదించిన యూనివర్సిటీ కోర్సులకు రుణాలను ఆఫర్ చేయడం లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరికి ఎస్బీఐని సంప్రదించగా అతడి ప్రయత్నం ఫలించింది. అదీ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చింది. కావాల్సినంత రుణం.. విదేశీ విద్యా కోర్సు అంటే ఫీజులకే బోలెడు ఖర్చు అవుతుంది. ఇదే పెద్ద సవాలు. విదేశీ విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ముందే ట్యూషన్ పీజులతోపాటు అక్కడ నివసించేందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుష్మాశర్మ సూచించారు. ఇక కావాల్సినంత రుణం లభించక, తాము సొం తంగా సమకూర్చుకోలేని సందర్భాల్లో విద్యార్థులు రాజీమార్గాలను అనుసరించడాన్ని గమనించొచ్చు. కావాల్సి నంత రుణం/నిధులు సమకూరని సందర్భంలో అవసరమైతే కోర్సును లేదంటే విద్యా సంస్థను మార్చే వారు కూడా ఉన్నట్టు ఫ్లై మాస్టర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎండీ రాజేష్ వర్మ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు.. రుణం ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా, మరో సంస్థ అయినా ఏం చూస్తుంది..? రుణం తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా..? అనే కదా.. అలాగే, విద్యా రుణం విషయంలో బ్యాంకులు అభ్యర్థి చేస్తున్న కోర్సు, ఉద్యోగ మార్కెట్లో ఆ కోర్సుకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తాయి. ఇందులో భాగంగా విద్యార్థి చదవబోయే విద్యాసంస్థకు ఉన్న పేరు, గుర్తింపు, అందులో చదివిన వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ‘‘విద్యార్థి కేంబ్రిడ్జ్ లేదా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వంటి విద్యా సంస్థలకు వెళ్లొచ్చు. కానీ, ఈ తరహా ప్రతిష్టాత్మక, పేరొందిన ఇనిస్టిట్యూషన్స్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి బదులు విద్యార్థులు ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో చివరికి పెద్దగా తెలియని యూనివర్సిటీలో అడ్మిషన్‌తో వారు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు విద్యా రుణం కష్టంగా మారుతుంది’’ అని విద్యా రుణాల మార్కెట్‌ప్లేస్ అయిన విమేక్స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ ఆర్ కృష్ణ తెలిపారు. పేపర్ వర్క్ కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమం. డాక్యుమెంట్ ప్రక్రియ ఎంత క్లిష్టమో ఇప్పటికే రుణం తీసుకుని విదేశీ విద్యా కోర్సు చేస్తున్న వారిని అడిగితేనే తెలుస్తుంది. విభా షణ్ముఖ్ (33) యూఎస్‌లోని రైస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎంత క్లిష్టతరమో తన అనుభవాన్ని వెల్లడించారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు 2013లో ఆయన ఓ ప్రభుత్వ రంగ బ్యాం కులో రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘బ్యాంకు అడిగిన అన్ని పత్రాలను తీసుకెళ్లి ఇచ్చాను. అయినా కానీ, కోర్సుకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలకు సంబంధించి యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం కావాలని బ్యాంకు అడిగింది. కానీ యూనివర్సిటీల నుంచి ఈ తరహా పత్రాలు పొందడం అదిపెద్ద సవాలు’’అని షణ్ముఖ్ తెలిపారు. తాకట్టు.. దేశీ యూనివర్సిటీల్లో కోర్సుల కోసం రుణాలు తీసుకునేట్టు అయితే బ్యాంకులు తనఖా కోరవు. కానీ, విదేశీ వర్సిటీల్లో విద్య కోసం తీసుకునే రుణాలకు సంబంధించి తనఖా పెట్టాలని బ్యాంకులు అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తనఖా కోరుతున్నాయి. తనఖా కింద స్తిరాస్థి, ప్రావిడెంట్ ఫండ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తే సరిపోతుంది. చాలా ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు తనఖా అడగడం లేదు. మాస్టర్స్ కోర్సులకు తనఖా లేకుండానే ఇవి రుణాలు ఇస్తున్నాయి. వివరాలు సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేయాలి. అధిక వ్యయాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణానికి డాక్యుమెంట్లు సమర్పణ, ఆమోదం ప్రక్రియ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అదే ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకుల నుంచి విద్యా రుణం సులభంగానే లభిస్తుంది. కాకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణాలపై రేట్లు 6.9 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 10.5 శాతం నుంచి 13 శాతం మధ్య ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు (ఎక్కువ శాతం) ఇచ్చే విద్యా రుణాలకు మారటోరియం ఉండడం లేదు. దీంతో రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే చెల్లింపులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మారటోరియం అంటే.. కోర్సు కాల వ్యవధికి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు రుణానికి చెల్లింపులు చేయక్కర్లేదు. కోర్సు అనంతరం ఉద్యోగం పొందేందుకు వీలుగా ఆరు నెలల వ్యవధి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి కుటుంబానికి ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకుని రుణానికి వెంటనే చెల్లింపులు చేయలేని వారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మారటోరియంతో కూడిన విద్యా రుణానికే ప్రయత్నించాలి. రుణానికి ముందే ప్రణాళిక ఉండాలి.. సాధారణంగా విద్యార్థులు తమ బడ్జెట్ కోణం నుంచి విదేశాల్లో ప్రవేశాలకు ప్రయత్నిస్తుంటారు. అంటే తక్కువ వ్యయాలు అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంటారు. దీనివల్ల అంతగా ప్రాచుర్యం లేని దేశం లేదా విద్యా సంస్థలో చేరాల్సి వస్తుంది. అందుబాటు ధరలు ఏ దేశంలో ఉన్నాయో విచారించుకుని అక్కడ విద్యాసంస్థను ఎంపిక చేసుకుంటున్నారు. ‘‘ఉదాహరణకు ఒక విద్యార్థి రూ.20లక్షలు ఖర్చు చేయగలనని అనుకుంటే ఆమె లేదా అతడు జర్మనీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే యూఎస్ లేదా యూకేలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రుణం పొందే విషయంలో పేరున్న యూనివర్సిటీయే కాకుండా, దేశానికీ ప్రాధాన్యం ఉంటుంది’’అని కృష్ణ వివరించారు. విద్యా సంస్థలు పేరున్నవి, ప్రతిష్టాత్మకమైనవి అయితే బ్యాంకులు తనఖా కోరడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు అయితే యూనివర్సిటీలు, కోర్సులతో జాబితాను నిర్వహిస్తున్నాయి. ఏఏ వర్సిటీలు, ఏ కోర్సులకు తక్కువ వడ్డీ రేటు రుణాలు, తక్కువ తనఖాతో మంజూరు చేయాలో ఈ జాబితానే వాటికి ప్రామాణికంగా ఉంటోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతోపాటు ప్రొడిగీ ఫైనాన్స్, ఎంపవర్ ఫైనాన్సింగ్ తదితర అంతర్జాతీయ సంస్థలు సైతం విద్యా రుణాలు ఇస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు విద్యారుణాల పరంగా సాయాన్ని అందిస్తున్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నవారు, సరైన పత్రాలను అందించలేని వారికి విద్యా రుణం పరంగా ప్రైవేటు బ్యాంకులు సౌకర్యం’’అని కృష్ణ తెలిపారు. స్కాలర్షిప్ ‘‘విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో కోర్సుకు అయ్యే వ్యయం మేర పూర్తి స్కాలర్షిప్ పొందే అవకాశం 2–3 శాతం మందికే ఉంటుంది. కానీ, పాక్షిక స్కాలర్షిప్ను అందించే విద్యా మండళ్లు, ఇనిస్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి’’అని కృష్ణ తెలిపారు. దరఖాస్తు సమయంలోనే స్కాలర్షిప్ కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అవకాశాలున్నట్టు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలు, విరాళాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టాటా ఫౌండేషన్, అగాఖాన్ ఫౌండేషన్ తదితర సంస్థలు సాయం అందిస్తున్నాయి. స్కాలర్షిప్ పొందడంలో సాయపడే జ్ఞాన్‌ధన్, విమేక్ సొల్యూషన్స్ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. క్రెడిట్ స్కోరు విద్యా రుణం విషయంలోనూ మంచి క్రెడిట్ స్కోరు సాయపడుతుంది. దరఖాస్తు ఆమోదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాలేజీకి వచ్చిన పిల్లలు ‘బై నౌ పే లేటర్’ సదుపాయాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుని చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చర్యలు రుణాలకు అడ్డంకిగా మారతాయి. విదేశ విద్య ప్రణాళిక ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులూ ఈ విషయంలో పిల్లల వ్యయాల పట్ల శ్రద్ధ చూపాలి. డాక్యుమెంట్లు విద్యా రుణానికి కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కేవైసీ అంటే గుర్తింపు, వయసు, చిరునామాను ధ్రువీకరించేవి. వీటితోపాటు గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో షీటు, సెకండరీ స్కూల్, హైస్కూల్ ఇలా విద్యకు సంబంధించి అన్ని మెమో పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల ఆదాయ రుజువు సర్టిఫికెట్ అవసరం. తనఖా కోసం ఉంచతగిన ఇల్లు, పొలం, ప్లాట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే పీపీఎఫ్ ఖాతా పాస్ బుక్, యూనివర్సిటీలో ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ మంజూరు చేసే లేఖ, కోర్సు ఫీజుల చెల్లింపుల షెడ్యూల్, స్కాలర్షిప్ లెటర్, రుణ గ్రహీత బ్యాంకు స్టేట్మెంట్ (చివరి ఆరు నెలలు), తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వాటా కింద చెల్లించే మొత్తానికి మూలాన్ని అడుగుతాయి. అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చూడాలి రుణం సాయంతో విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారు చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో.. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు ఒకటి. దీనివల్ల తీసుకునే రుణాన్ని తిరిగి తీర్చివేసే సామర్థ్యాలపై స్పష్టత తెచ్చుకోవచ్చు. విద్యా రుణాల్లో పెరుగుతున్న ఎగవేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త అవసరమని తెలియజేస్తన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన విద్యా రుణాల్లో 9.55 శాతం నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏలు) 2020లో వర్గీకరించినట్టు 2021 పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. కోర్సు అనంతరం అక్కడే కొంతకాలంపాటు ఉండి ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘గతంలో అయితే కొన్ని దేశాలు కోర్సు అనంతరం కేవలం కొన్ని నెలల పాటే ఉపాధి అవకాశాల అన్వేషణకు వీలుగా ఉండనిచ్చేవి. కానీ, ఇప్పుడు బ్రిటన్ సహా చాలా దేశాలు గ్రాడ్యుయేట్ రూట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి. వీటి కింద ఉన్నతవిద్య అనంతరం అక్కడే కొన్నేళ్లపాటు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు’’అని ఓ కన్సల్టెన్సీ అధినేత తెలిపారు. -
‘ఉపకారం’.. బహుదూరం
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ మొదలై 5 నెలలవుతున్నా ఇంకా 76 శాతం మంది విద్యార్థులే వివరాలు నమోదు చేసుకున్నారు. నమోదు ప్రక్రియను సర్కారు ఇప్పటికే రెండుసార్లు పొడిగించినా అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. 31తో గడువు పూర్తి కానుండటంతో ఆలోపు 90 శాతం లక్ష్యం చేరుకునేలా కనిపించట్లేదు. దీంతో గడువును మరోసారి పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్‌లో మొదలు రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న వారిలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2021–22 విద్యా సంవత్సరంలో 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాయి. ఈ ప్రక్రియను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సర్కారు గడువు పెట్టింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవడంతో గడువును నవంబర్ వరకు పొడిగించింది. అయినా అనుకున్న లక్ష్యం పూర్తవకపోవడంతో ఈ నెల 31 వరకు పెంచింది. ఇప్పటికీ కూడా 9.60 లక్షల మందే ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. సంక్షేమ శాఖల అంచనాల ప్రకారం మరో 3 లక్షల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుత గడువులోగా 3 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం లేదు. వాస్తవానికి కాలేజీ యాజమాన్యాలు చొరవ తీసుకుని విద్యార్థులకు అవగాహన కల్పించడం, వాళ్ల నుంచి వివరాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసేలా చూడాలి. దీనిపై సంక్షేమ శాఖలు కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చినా ప్రక్రియ ఇంకా పూర్తవలేదు. పరిశీలనపై తీవ్ర ప్రభావం ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు గతంలో (కరోనాకు ముందు) నవంబర్ చివరి వారం, డిసెంబర్ రెండో వారం నాటికి 95 శాతం వచ్చేవి. వీటిని ఫిబ్రవరి రెండో వారం కల్లా సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించి అర్హతను ఖరారు చేసేవారు. బడ్జెట్ లభ్యతను బట్టి నిధులు విడుదల చేసేవారు. కానీ ఈ సారి దరఖాస్తు ప్రక్రియే ఇంకా కొనసాగుతోంది. లక్ష్యం దూరంలో ఉండటంతో గడువును మరో నెల పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఫలితంగా విద్యార్థులకు మరింత ఆలస్యంగా ఉపకార వేతనాలు అందే అవకాశం ఉంది. -
రెండేళ్ల పాటు బాలికలకు స్కాలర్షిప్.. ఆన్లైన్లో అప్లై చేయండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్(ఎస్జీసీఎస్) పథకాన్ని అమలుచేస్తోంది. ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకు గాను ఈ స్కాలర్షిప్ను సీబీఎస్ఈ 2006లో ప్రారంభించింది. సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు ► విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె(సింగిల్ గర్ల్‌చైల్డ్) అయి ఉండాలి. ► ఈ స్కాలర్షిప్కు కేవలం భారతీయ పౌరులు మాత్రమే అర్హులు. ► విద్యార్థిని సీబీఎస్ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి చదువుతూ ఉండాలి. ► పదో తరగతి పరీక్షలో కనీసం 60శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ► విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు. ► 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు మాత్రమే అర్హులు. ► 2020 సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులు. ► సీబీఎస్ఈ బోర్డుకు సంబంధించి ఎన్ఆర్ఐ విద్యార్థిని అయితే ట్యూషన్ ఫీజు నెలకు రూ.6000కు మించకుండా ఉంటే స్కాలర్షిప్కు అర్హురాలే. ► విద్యార్థిని ఏకైక సంతానం అని రుజువు చేయడానికి సంబంధించి సీబీఎస్ఈ వెబ్సైట్లో పేర్కొన్న ఫార్మెట్లో ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ఎడీఎం /ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్/నోటరీ అటెస్ట్ చేసిన ఒరిజనల్ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ వ్యవధి ► స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ► స్కాలర్షిప్ రెన్యువల్ చేయించుకోవాలంటే.. విద్యార్థిని 11వ తరగతి నుంచి ఆపై తరగతులలో కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ► విద్యార్ధిని సత్ప్రవర్తనతోపాటు పాఠశాలలో హాజరు శాతం కూడా బాగుండాలి. ► ఒకవేళ విద్యార్థిని పాఠశాల లేదా కోర్సు మారాలంటే.. బోర్డు ముందస్తు అనుమతి తీసుకుంటేనే స్కాలర్షిప్ కొనసాగుతుంది. ► స్కాలర్షిప్ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు. స్కాలర్షిప్ మొత్తం ► విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2022 ► సీబీఎస్ఈ పాఠశాలల దరఖాస్తు ధృవీకరణకు చివరి తేది: 25.01.2022 ► వెబ్సైట్: cbse.nic.in -
గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్.. ఏడాదికి రూ.20,000
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) 2021 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు. ► అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మిం^è కుండా ఉండాలి. మెడిసిన్/ఇంజనీరింగ్/ఏదైనా గ్రాడ్యుయేషన్ /ఇంటిగ్రేటెడ్ కోర్సులు/ఏదైనా విభాగంలో డిప్లొమా/తత్సమాన కోర్సులు/ఒకేషనల్ కోర్సు(ఐటీఐల్లో)ల్లో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందజేస్తారు. ► 2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లో/ఐటీఐల్లో ఒకేషనల్ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అందజేస్తారు. ► ప్రత్యేకంగా బాలికలకు ఉపకార వేతనాలు: బాలికల విద్యను ప్రోత్సహించడానికి వీటిని అందిస్తున్నారు. కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలు దీనికి అర్హులు. 2020–21 విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2లక్షలు మించకూడదు. ► స్కాలర్షిప్ వ్యవధి: రెగ్యులర్ స్కాలర్స్‌కు సంబంధిత కోర్సు పూర్తయ్యే వరకు అందిస్తారు. బాలికలకు ప్రత్యేకంగా అందించే ఉపకార వేతనాలు రెండు సంవత్సరాలు అందిస్తారు. ► ఉపకార వేతనాల మొత్తం: రెగ్యులర్ స్కాలర్స్‌కు ఏడాదికి రూ.20,000లని మూడు వాయిదాల్లో అందిస్తారు. ► ప్రత్యేకంగా బాలికలకు ఏడాదికి రూ.10,000లని మూడు వాయిదాల్లో అందిస్తారు. ► ఎంపిక విధానం: 10/10+2లో సాధించిన మెరిట్ మార్కులు, తల్లిదండ్రుల కుటుంబ వార్షికాదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021 ► వెబ్సైట్: licindia.in -
కార్పొరేట్‌కు దీటుగా... ప్రతిభకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు దేశంలోనే అత్యంత ప్రముఖ విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థల్లో చదవాలనే కోరిక చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. అయితే ప్రతిభ కలిగినా పేదరికం కారణంగా కొంతమంది ఆ విద్యా సంస్థల్లో చేరడానికి వెనుకాడతారు. అలాంటి వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం పలు ఐఐటీలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. పేద విద్యార్థులకు ఫీజులను పూర్తిగా తామే భరిస్తామంటూ కొన్ని ముందుకు రాగా వసతి, భోజనాలతో పాటూ ఫీజుల భారమూ తామే చూసుకుంటామని మరికొన్ని ప్రకటించాయి. ఇంకొన్ని అయితే ఆయా విద్యార్థులకు ఫీజులు, వసతితో పాటు పుస్తకాలు ఇతర మెటీరియల్ ఖర్చులు, ప్రయాణ భత్యాలు, పాకెట్ మనీ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చాయి. ఐఐటీలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఆయా విద్యాసంస్థలు తమ ఆఫర్లను ప్రకటించాయి. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) జేఈఈ అడ్వాన్స్ అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్ మెరిట్ జాబితాలను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ సాధించిన పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగా వారి విద్యను కొనసాగించడంలో సహాయపడటానికి ఈ ఐఐటీలు స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందిస్తామని పేర్కొన్నాయి. ఫలితంగా మెరిట్ ఉన్న పేద విద్యార్థులు ఐఐటీల్లో చేరేందుకు మొగ్గుచూపారు. బాగా చదివితే చాలు ఇక అన్నీ ఉచితమే అన్నట్లుగా ఐఐటీలు పోటీపడి ఆఫర్లు ఇచ్చాయి. ఐఐటీలు.. వాటి ఆఫర్లు ఐఐటీ బాంబే: బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్ ఉండి, వారి తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 5 లక్షలకు మించకుంటే మెరిట్–కమ్ మీన్స్ స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ బాంబే పేర్కొంది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 4.5 లక్షలకన్నా తక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీలకు భోజన సదుపాయంతో పాటు నెలకు రూ. 250 పాకెట్ అలవెన్స్ ఇస్తామంది. అవే కాకుండా ఆ విద్యార్థులకు అధికారికంగా నిర్ణయించిన ట్యూషన్ ఫీజు, హాస్టల్ అద్దె చెల్లింపు నుంచి మినహాయింపును ప్రకటించింది. ఐఐటీ గాంధీనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ కామన్ ర్యాంకు జాబితాలో 1,000, ఆపైన ర్యాంకును పొందిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ గాంధీనగర్ వెల్లడించింది. బీటెక్ నాలుగేళ్ల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని సంస్థ భరించేలా ఆ స్కాలర్షిప్ ఉంటుందని వివరించింది. ఐఐటీ భిలాయ్: అన్రిజర్వ్డ్ విద్యార్థులతో పాటు ఓబీసీ వర్గాలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెరిట్–కమ్–మీన్స్ స్కాలర్షిప్ను ఐఐటీ భిలాయ్ అందిస్తోంది. వీరి గరిష్ట పరిమితి సంఖ్యను 25 శాతంగా పేర్కొంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల రాయితీని ఇస్తోంది. నెలకు రూ. 1,000 పాకెట్ మనీని అందించనున్నట్లు పేర్కొంది. ఐఐటీ మద్రాస్: తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 1 లక్ష కంటే తక్కువ ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందితే పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఐఐటి మద్రాస్ ప్రకటించింది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.4.5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులకు నెలకు రూ. 1,000తో కూడిన మెరిట్ –కమ్ –మీన్స్ స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రుల ఆదాయం రూ. 4.5 లోపు ఉన్నవారికి ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల మినహాయింపు ప్రకటించింది. ఐఐటీ ఢిల్లీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన విద్యార్థులకోసం ఐఐటీ ఢిల్లీ ఎండోమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 30 మంది మెరిట్ విద్యార్థులకు ఏడాదికి 1 లక్ష చొప్పున అందించనుంది. ఈ స్కాలర్షిప్ పథకంలో 15 మంది పురుషులకు, 15 మంది మహిళా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఐఐటీ కాన్పూర్ మెరిట్ విద్యార్థుల కోసం ఐఐటీ కాన్పూర్ ‘బ్రైట్ మైండ్ స్కాలర్షిప్’ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ మొదటి 100 ర్యాంక్‌లలో నిలిచిన విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్లో బీటెక్, బీఎస్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందితే ఈ స్కాలర్షిప్ కింద రూ.3 లక్షలు ఇవ్వనుంది. విద్యార్థుల హాస్టల్, పుస్తకాలు, ఇతర ఖర్చులతో పాటు మొత్తం ట్యూషన్ ఫీజులను ఈ స్కాలర్షిప్ కవర్ చేస్తుంది. -
ఎన్నారై స్కాలర్షిప్స్.. నవంబరు 30తో ఆఖరు
Scholarship Programme For Diaspora Children : ప్రవాస భారతీయుల పిల్లల చదువుల కోసం కేంద్రం అందిస్తున్న స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ డైసపోరా చిల్డ్రెన్ (ఎస్పీడీసీ)కి దరఖాస్తు చేసుకునే సమయం 2021 నవంబరు 30తో ముగుస్తోంది. ఎస్పీడీసీ పథకం కింద కేంద్రం నాన్ రెసిడెంట్ ఇండియన్లు (ఎన్నారై), పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐవో), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కేటగిరీలకు చెందిన వారి పిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఎస్పీడీసీ కింద ప్రతీ ఏడు 150 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందుతాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ప్రతీ కేటగిరీకి 50 వంతున స్కాలర్షిప్లు రిజర్వ్ చేశారు. అర్హతలు ఉన్న విద్యార్థులు విదేశాంగ శాఖ పొర్టల్ లేదా spdcindia.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని.. ఆ తర్వాత సంబంధిత పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఇంజనీరింగ్ విద్యార్థినులకు స్కాలర్షిప్.. ఏడాదికి 50 వేలు
ఇంజనీరింగ్, డిప్లొమా చదివే విద్యార్థినులకు ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ ప్రకటన వచ్చేసింది. ప్రతిభావంతులైన విద్యార్థినులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రతి ఏటా ఈ స్కాలర్షిప్ అందిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇలా ఏఐసీటీఈ గతంలో 4వేల మందికి స్కాలర్‌షిప్స్‌ను అందించేది. ఇందులో బీటెక్ అభ్యసించేవారికి 2000, డిప్లొమా వారికి 2000 చొప్పున కేటాయించింది. ప్రస్తుతం 2021 ఏడాది సంబంధించి ఈ స్కాలర్షిప్స్ సంఖ్యను భారీగా పెంచింది. 4 వేల నుంచి 10వేలకు(బీటెక్–5000, డిప్లొమా–5000)పెంచింది. ఆర్థిక ప్రోత్సాహం ప్రగతి స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.50వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాలేజీ ఫీజు, కంప్యూటర్ కొనుగోలు, స్టేషనరీ, బుక్స్, ఎక్విప్మెంట్ తదితర అవసరాలన్నింటికీ కలిపి ఈ మొత్తాన్ని డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో అందజేస్తారు. అర్హత ఏఐసీటీఈ గుర్తింపు పొంది టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇయర్ బీటెక్/డిప్లొమా కోర్సుల్లో చేరి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకుండా ఉండాలి. కుటుంబంలో అర్హులైన విద్యార్థినులు ఇద్దరూ ఉంటే ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంబంధిత కాలేజీలో బీటెక్/పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ధ్రువపత్రాలు పదోతరగతి/ఇంటర్ అకడమిక్ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొందిన సర్టిఫికేట్, ట్యూషన్ ఫీజు రిసిప్ట్, ఆధార్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఫోటోగ్రాఫ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021 ► వెబ్సైట్: https://www.aicte-india.org/ -
ఓఎన్జీసీ స్కాలర్షిప్స్.. అప్లై చేయండి ఇలా..
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ఫౌండేషన్ సీఎస్ఆర్ కింద స్కాలర్షిప్స్ అందిస్తోంది. దీనిలో భాగంగా 2021–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం మెరిటోరియస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. (ఏపీఈపీడీసీఎల్: జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు) అర్హతలు ► ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్ లేదా మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/జియాలజీ ప్రోగ్రామ్స్‌లలో మొదటి ఏడాది చదివే వారు, అలాగే గత అకడమిక్ పరీక్షల్లో కనీసం 60 శాతం సీజీపీఏ/ఓజీపీఏ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ దరఖాస్తు అర్హులు. (ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► జనరల్/ఓబీసీ కుటుంబ వార్షికదాయం రూ. 2 లక్షలకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు అయితే రూ.4.5లక్షలకు మించకూడదు. ► వయసు: జులై 1 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి. స్కాలర్షిప్ ► ప్రోగ్రామ్ కింద అర్హులైన 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి.. ఏడాదికి రూ.48000 అంటే నెలకు రూ.4000 చొప్పున స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. ఇందులో 50 శాతం స్కాలర్‌షిప్స్‌ను అమ్మాయిలకు కేటాయిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ అండ్ పోస్ట్ ద్వారా పంపాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2021 ► వెబ్సైట్: https://ongcscholar.org/#/ -
బకాయిల కుప్పలు .. విద్యార్థులకు తిప్పలు
►రెండు సంవత్సరాలుగా నిధులు అందకపోవడంతో రూ.5.5 లక్షల అప్పు చేసి ఫీజు చెల్లించిన చైతన్యపురికి చెందిన పీజీ వైద్య విద్యార్థిని తండ్రి రెండు నెలలుగా హైదరాబాద్ బీసీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రభుత్వ పథకంపైనే ఆధారపడిన విద్యార్థులు అప్పులు చేసి కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. రెండేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. 2019–20 విద్యా సంవత్సరం బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. ఇక 2020–21కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. రెండేళ్లకు కలిపి మొత్తం రూ.3017.41 కోట్ల బకాయిలున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాలనూ ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. క్రమం తప్పకుండా జరగాల్సిన నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నిచోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందక పోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టతరంగా మారుతోందని యాజమాన్యాలు అంటున్నాయి. జాడలేని నెలవారీ నిధులు మూడేళ్ల క్రితం ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. మొదట్లో ప్రతి విద్యా సంవత్సరం చివర్లో నిధులను మంజూరు చేసేవారు. అయితే పెద్దమొత్తంలో నిధులు ఒకేసారి విడుదల చేయడం భారంగా మారుతుండటంతో నెలవారీగా నిధులు విడుదల చేయాలని భావించింది. సాధారణ, వృత్తి విద్యా కోర్సులకు వేరువేరుగా పద్దుల కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించి చర్యలు చేపట్టింది. తొలి రెండు మూడు నెలలు నిధుల విడుదల సాఫీగా జరిగినప్పటికీ.. ఆ తర్వాత క్రమం తప్పింది. దీంతో బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. దీంతో రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు పలు కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడితో తామే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాల్సి వస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత.. చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. జూనియర్ విద్యార్థుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తుండటంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇలా ఫీజులు చెల్లించినవారు సంక్షేమ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదనే సమాధానం ఎదురవుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు. వనపర్తి జిల్లా గోపాల్పేట హరిజనవాడకు చెందిన లావణ్య అనే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక గతనెల 19న బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. దరఖాస్తులు పరిశీలనకే పరిమితం... 2020–21 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలకు సంబంధించి 12.85 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగింది. దాదాపుగా నూరు శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ మొదలైన నెల రోజుల తర్వాత నుంచి వాటి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కావాలి. అయితే కోవిడ్–19 నేపథ్యంలో పరిశీలన ఆలస్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిశీలన ప్రారంభించిన సంక్షేమాధికారులు ఇప్పటివరకు 80 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాల కోసం రూ.2,250 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అయినా ఇప్పటివరకు అటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గానీ, ఉపకార వేతనాలకు కానీ నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. ఇక 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా రూ.767.41 కోట్ల మేర బకాయి ఉంది. వీటికి సంబంధించి సంక్షేమ శాఖ అధికారులు బిల్లులు సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. తక్షణమే నిధులు విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయమై ఆర్థిక మంత్రితో సహా పలువురికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. ఇతర పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థులకు బకాయి పడ్డ నిధులను ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం దిక్కుతోచని స్థితిలో కాలేజీలు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చదువుతున్న వాళ్లు 85 శాతం ఉన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. అప్పులు చేసి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ఏకంగా కాలేజీలనే మూసేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. – గౌరి సతీష్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం -
ఈ ఎగ్జామ్ పాస్ అయితే రూ.151 కోట్ల స్కాలర్ షిప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కంపెనీ అప్‌గ్రేడ్‌కు చెందిన కోచింగ్ ఇనిస్టిట్యూట్ అప్‌గ్రేడ్‌జీత్... రూ.151 కోట్ల కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఎన్ఆర్ఏ) సీఈటీ ఉపకార వేతనాలకు అర్హత పరీక్షలను నిర్వహించనుంది. ఈ నెల 8న జాతీయ స్థాయిలో జరగనున్న ఈ పరీక్ష రాసేందుకు ఇప్పటికే 2.5 లక్షల మంది నమోదు చేసుకున్నారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో 18, 25 తేదీలలో రెండు సార్లు జీత్‌సీఈటీ టెస్ట్‌కు అపూర్వ స్పందన లభించిందని.. అందుకే మరొక టెస్ట్‌ను నిర్వహించనున్నామని అప్‌గ్రేడ్‌జీత్ సీఈఓ రితేష్ రౌషన్ తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు రౌండ్లుగా పరీక్ష ఉంటుంది. ఎన్ఆర్ఏ సీఈటీ ఎగ్జామ్ అంటే? కేంద్ర ప్రభుత్వశాఖలైన కాగ్, సెంట్రల్ సెక్రటరియేట్ సర్వీస్, సెంట్రల్ విజిలెన్స్ కమీషన్, రైల్వే,విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర శాఖల్లో ఉద్యోగుల భర్తీకి కేంద్రం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ కామన్ ఎలిజిబులిటి టెస్ట్ (NRA CET) టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఆ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో విధులు నిర్వహించవచ్చు. అయితే ఈ ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తారు? ఏఏ సబ్జెట్లను ఎలా చదివితే జాబ్ ఎలా వస్తుందనే అంశంతో పాటు.. అభ్యర్ధులకు కోచింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేందుకు ప్రముఖ కోచింగ్ ఇనిస్టిట్యూట్ అప్‌గ్రేడ్‌జీత్ 'జీత్‌సీఈటీ టెస్ట్' ను నిర్వహించి భారీ మొత్తంలో స్కాలర్ షిప్‌ను అందించేందుకు సిద్ధమైంది. స్కాలర్ షిప్‌కు అభ్యర్ధుల ఎంపిక ఈ ఎగ్జామ్ ఆగస్ట్ 8న (వచ్చే ఆదివారం) నిర్వహించనుంది. ఈ ఎగ్జామ్ రాసే అభ్యర్ధులను రెండు రౌండ్లుగా విభజించింది. ప్రిలిమినరీ రౌండ్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులను మెయిన్స్ ఆహ్వానిస్తారు. ఈ రెండో రౌండ్ లో ఎంత మంది పాస్ అవుతారో వారిలో మెరిట్ ఆధారంగా 3వేల మంది అభ్యర్ధులను ఎంపిక చేసి వారికి 6నెలల NRA CET కోర్స్ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా అందిస్తోంది. దీంతో పాటు రూ.151కోట్ల స్కాలర్ షిప్ ను అందిస్తుండగా.. ఇక రెండో రౌండ్లో 3వేల మందిని మినహాయించి మిగిలిన అభ్యర్ధులకు ఒక నెల NRA CET కోర్స్ సబ్స్క్రిప్షన్ అందిస్తున్నట్లు అప్‌గ్రేడ్‌జీత్ సీఈఓ రితేష్ రౌషన్ ప్రకటించారు. -
తెలుగు విద్యార్థికి అరుదైన అవకాశం.. రూ.2 కోట్ల స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన విద్యార్థిని శ్వేతా రెడ్డి(17) అరుదైన అవకాశం లభించింది. అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ శ్వేతారెడ్డికి ఏకంగా రూ.2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తోపాటు ఈ స్కాలర్షిప్ను ప్రకటించింది.ఈ కాలేజీలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప విషయం కాగా.. శ్వేతారెడ్డి స్కాలర్ షిష్‌ను కూడా దక్కించుకుంది. డైయర్ ఫెలోషిప్ పేరిట లాఫాయెట్ కాలేజీ ప్రతి ఏడాది ఆరుగురు విద్యార్థులకు మాత్రం ఈ స్కాలర్ షిప్ అందిస్తుంది. ఈ ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో తెలుగు విద్యార్థి శ్వేతారెడ్డి ఉండడం విశేషం. శ్వేతా ప్రతిభ, నాయకత్వ లక్షణాలు చూసే ఈ ఆఫర్ ఇచ్చినట్లు లాఫాయెట్ కాలేజీ తెలిపింది. కాగా స్కాలర్ షిప్ సాధించడం పట్ల శ్వేతా హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తనకు ఇలాంటి అద్భుత అవకాశం రావడం వెనక డెక్స్ టెరీటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఉందని.. దాని వల్లే తాను ఈ స్కాలర్ షిప్ అందుకోగలిగానని పేర్కొంది. -
Sonu Sood: ‘రియల్ హీరో’ మరో కీలక నిర్ణయం.. ‘సంభవం’ పేరుతో..
‘రియల్ హీరో’ సోనూ సూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల అండగా నిలవాలని డిసైడ్ అయ్యాడు. ‘సంభవం’ పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా.. మీ బాధ్యత మేం తీసుకుంటాం. ‘సంభవం’ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది’అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. స్కాలర్షిప్స్ కోసం www.soodcharityfoundation.org వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సోనూ సూద్ తెలిపాడు. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరాడు. కాగా, గతేడాది లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్ సొంత ఖర్చులతో ఇళ్లకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఏ కష్టమొచ్చిన సాయం అందిస్తూ పేదల పాలిట దేవుడిగా మారాడు. Karni hai IAS ki tayyari ✍️ Hum lenge aapki zimmedari 🙏🏻 Thrilled to announce the launch of 'SAMBHAVAM'. A @SoodFoundation & @diyanewdelhi initiative. Details on https://t.co/YO6UJqRIR5 pic.twitter.com/NvFgpL1Llj — sonu sood (@SonuSood) June 11, 2021 చదవండి: పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్ -
ఈ ఐడెంటికల్ ట్విన్ సిస్టర్స్ ప్రతిభ అదుర్స్
వాషింగ్టన్ : కలలు అందరూ కంటారు.. కొంతమంది మాత్రమే ఆ కలల్ని సాధించటానికి కృషి చేస్తారు. ఎన్ని కష్టాలొచ్చినా.. నష్టాలొచ్చినా పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. అలాంటి వారినే లోకం కీర్తిస్తుంది.. వారి గురించే జనాలు గొప్పగా చెప్పుకుంటారు. అమెరికాకు చెందిన ఐడెంటికల్ ట్విన్ సిస్టర్స్ కూడా కలలు కన్నారు. చదువులో అత్యధిక మార్కులు సాధించాలని కష్టపడ్డారు. ఆ కష్టం ఫలించింది.. వారిని అంతర్జాతీయ సెలెబ్రిటీలను చేసింది. వివరాలు.. అమెరికాలోని లూసియానాకు చెందిన డెనీసా, డెస్టినీ కాడ్వెల్ ఐడెంటికల్ ట్విన్ సిస్టర్స్. వీరు స్కాట్లాండ్ విల్లే మాగ్నెట్ హై స్కూల్లో చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ చదివారు. డెస్టినీ 4.0 జీపీఏ, డెనీసా 3.95 జీపీఏ సాధించారు. స్కూల్ టాపర్స్‌గా నిలిచారు. దీంతో 24 మిలియన్ డాలర్ల స్కాలర్షిప్లు వారిని వరించాయి. అంతేకాదు 200 కాలేజీలనుంచి తమ కాలేజీలో చేరండంటూ ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈ సిస్టర్స్ అంతర్జాతీయ సెలెబ్రిటీలు అయిపోయారు. ‘‘ మీరు సాధించాలనుకున్న దాన్ని పూర్తిగా సాధించండి’’.. ‘‘మిమ్మల్ని కుంగదీసే నెగిటివిటీని బుర్రలోనికి రానికండి. దాన్నో మోటివేషన్‌గా తీసుకోండి. అన్నింటినీ పాజిటివ్‌గా వాడుకోండి’’ అని తమ సక్సెస్ ఫార్ములాను చెప్పుకొచ్చారు. వీరు కేవలం చదువులోనే కాదు! డ్యాన్స్, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండటం విశేషం. -
Study Abroad: విదేశీ స్కాలర్‌షిప్‌లకు మార్గమిదిగో..!
గత కొన్నేళ్లుగా దేశంలోని యువత దృష్టి విదేశీ యూనివర్సిటీల్లో చదువులపై ఎక్కువగా ఉంటోంది. ఏదో రకంగా స్టడీ కోసం అబ్రాడ్‌కు వెళ్లాలని గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. వీరి మార్గంలో అధిక ఫీజులు, ఇతర వ్యయాలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. ప్రతిభావంతులకు ఆర్థిక అవరోధాలు అడ్డురాకూడదనే సదాశయంతో వివిధ దేశాలు, పలు ట్రస్టులు స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. విదేశీ విద్య అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు సంబంధించి ముఖ్యమైన స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌లపై ప్రత్యేక కథనం.. ఆస్ట్రేలియా అవార్డ్స్ స్కాలర్షిప్స్ వీటిని ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ అందిస్తోంది. ఆస్ట్రేలియాలో పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపుతోపాటు రీసెర్చ్, అకడమిక్ వ్యయాలకు సరిపడే మొత్తం స్కాలర్‌షిప్‌గా లభిస్తుంది. వెబ్సైట్: dfat.gov.au ► ఎండీవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్: ఈ ప్రోగ్రామ్ పరిధిలో పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ లభిస్తుంది. పీజీ అభ్యర్థులకు రెండేళ్లు, పీహెచ్డీ అభ్యర్థులకు మూడున్నరేళ్ల వరకు స్కాలర్షిప్ గడువు ఉంటుంది. ► ఎండీవర్ ఆస్ట్రేలియా చెంగ్ కాంగ్ రీసెర్చ్ ఫెలోషిప్: నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో రీసెర్చ్ చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం. ఎంపికైన అభ్యర్థులకు 23,500 ఆస్ట్రేలియా డాలర్లు లభిస్తాయి. ► ఎండీవవర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అవార్డ్స్: ఆస్ట్రేలియా ప్రభుత్వ పరిధిలోని కళాశాలలు, యూనివర్సిటీలలో డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, అసోసియేట్ డిగ్రీలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు వీటిని అందజేస్తారు. ► ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్షిప్స్: పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు ఉద్దేశించిన పథకం ఇది. ప్రతి ఏటా మూడు వందల మంది విదేశీ విద్యార్థులను ఆయా ప్రామాణికాల(రీసెర్చ్ టాపిక్, అకడమిక్ రికార్డ్ తదితర) ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్స్: https://india.highcommission.gov.au/ https://www.studyinaustralia.gov.au/ కెనడా: బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ హెల్త్ సైన్స్, నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో రీసెర్చ్ ఔత్సాహికులకు బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్‌ను అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి డెబ్భై వేల డాలర్లు లభిస్తాయి. ఏటా 70 ఫెలోషిప్స్(అన్ని దేశాలకు కలిపి) అందుబాటులో ఉంటాయి. వ్యవధి: రెండు సంవత్సరాలు. వెబ్సైట్: banting.fellowships-bourses.gc.ca ► ట్రుడే సాలర్షిప్స్: వీటిని ది ట్రుడే ఫౌండేషన్ అందిస్తోంది. డాక్టోరల్(రీసెర్చ్) స్టడీస్ విద్యార్థులకు అందిస్తారు. సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో పీహెచ్డీ చేస్తున్న వారికి ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి ఏటా అరవై వేల డాలర్ల స్కాలర్‌షిప్‌తోపాటు 20 వేల డాలర్ల ట్రావెలింగ్ అలవెన్స్ లభిస్తుంది. వెబ్సైట్: www.trudeaufoundation.ca ► వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్: కెనడియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకం... వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్. కెనడాలోని యూనివర్సిటీల్లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాన్ని ఖరారు చేసుకున్న అభ్యర్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏటా యాభై వేల డాలర్లు చొప్పున మూడేళ్లపాటు స్కాలర్షిప్ అందిస్తారు. వెబ్సైట్: vanier.gc.ca ► కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్–మాస్టర్స్ ప్రోగ్రామ్స్: ఇది కెనడా ప్రభుత్వ గుర్తించిన యూనివర్సిటీల్లో మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకం. ఏటా కెనడా సహా అన్ని దేశాలకు సంబంధించి మొత్తం 2,500 మందికి వీటిని అందజేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి 17,500 డాలర్లు స్కాలర్‌షిప్‌గా లభిస్తుంది. వెబ్సైట్: https://www.nserc-crsng.gc.ca/ -
స్టడీ అబ్రాడ్: ఈ పొరపాట్లు లేకుంటే కల సాకారమే!
దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల స్వప్నం.. స్టడీ అబ్రాడ్. ఈ కలను సాకారం చేసుకోవాలని ఎంతోమంది కష్టపడుతుంటారు. కానీ, విదేశీ విద్య దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టంగా,సుదీర్ఘంగా ఉంటుంది. దాంతో విద్యార్థులు అప్లికేషన్ దశలోనే పొరపాట్లు చేస్తూ.. ఇబ్బందుల్లో పడుతున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో.. కాస్త అప్రమత్తంగా ఉంటే .. విదేశాల్లో చదువుకోవాలనే తమ కలను నిజం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ పరంగా విద్యార్థులు చేస్తున్న పొరపాట్లు–వాటిని అధిగమించడం ఎలాగో తెలుసుకుందాం.. రీసెర్చ్ లేదు రీసెర్చ్ చేయకపోవడం.. ఇది స్టడీ అబ్రాడ్ అభ్యర్థులు చేస్తున్న తప్పిదాల్లో ముందు వరుసలో ఉంది. చాలామంది అభ్యర్థులు దేశం, విశ్వవిద్యాలయం, కోర్సులు, ఆర్థిక ప్రో త్సాహకాలు(స్కాలర్షిప్స్), ఫీజులు, ప్రవేశ విధానాలు, క్యాంపస్, లొకేషన్, వాతావరణం, లివింగ్ కాస్ట్ వంటి అంశా లపై లోతుగా అధ్యయనంచేసి.. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. దాంతో వారి జాబితాలో కేవలం కొన్ని యూనివర్సిటీలు, కోర్సులు మాత్రమే ఉంటున్నాయి. ఫలితంగా స్టడీ అబ్రాడ్ కల క్లిష్టంగా మారుతోంది. ప్రస్తుతం ఆన్లైన్లో సమస్త సమాచారం లభ్యమవుతోంది. అభ్యర్థులు సరైన రీసెర్చ్‌తో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. సరైన వ్యక్తికి సరైన ప్రశ్న! విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ కనీసం ఒక అడ్మిషన్ కౌన్సెల ర్ను నియమిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు అవస రమైన సలహాలు, సూచనలు, గైడెన్స్ అందించడం వీరి ప్రధాన విధిగా ఉంటుంది. కాబట్టి స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక అభ్యర్థుల సందేహాల నివృత్తికి నేరుగా వర్సిటీని మెయిల్ ద్వారా సంప్రదించొచ్చు. తద్వారా సరైన వ్యక్తి నుంచి సరైన పరిష్కారాన్ని పొందవచ్చు. ఇలా చేయకుండా.. గూగుల్‌లో తోచింది బ్రౌజ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అంటున్నారు నిపుణులు. ప్రణాళిక లేమి భారత్‌లో మాదిరిగా విదేశీ యూనివర్సిటీలు, ఇన్స్టి ట్యూట్స్.. ఒకే సమయంలో ప్రవేశ ప్రక్రియను ప్రారం భించవు. ప్రతి వర్సిటీ, ఇన్స్టిట్యూట్ తనదైన ప్రత్యేక అడ్మిషన్ షెడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అనేక ఇన్స్టి ట్యూట్లు ఏడాది పొడవునా దరఖాస్తులు ఆహ్వానిస్తే.. మరికొన్ని మూడు గడువుల్లోనే దరఖాస్తులు స్వీకరిస్తు న్నాయి. కాబట్టి అభ్యర్థులు అడ్మిషన్‌కు ఒక సంవత్సరం ముందుగానే మానసికంగా,డాక్యుమెంటేషన్ పరంగా సిద్ధం కావడం ప్రారంభించాలి. అడ్మిషన్ కౌన్సెలర్లు కేవలం విశ్వ విద్యాలయ అంశాల్లోనే అభ్యర్థులకు సహాయపడగలరు. వీసా సంబంధిత విషయాల్లో వారి నుంచి ఎలాంటి తో డ్పాటు అందదు. కాబట్టి వీసా ప్రక్రియను అభ్యర్థులు సొంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సహనం కోల్పోకుండా.. ఓపిగ్గా ఒక్కో అడుగు వేయాలి. సీటు దక్కితే చాలదు స్టడీ అబ్రాడ్ పరంగా విద్యార్థులు విశ్వవిద్యాలయంలో సీటు దక్కితే చాలు..వీసా ప్రక్రియ పూర్తయితే సరిపోతుంది అనే కోణంలో ఆలోచిస్తుంటారు. కానీ, వీటితోపాటు సదరు దేశంలో, వర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత స్డూడెంట్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే కోణంలోనూ ఆలోచించాలి. తరగ తులు ప్రారంభమైన తర్వాత అందుబాటులో ఉండే ప్రత్యా మ్నాయాలు? డిగ్రీ చేతికొచ్చిన తర్వాత ఏం చేయాలను కుంటున్నారు? తదితర అంశాలపై స్పష్టతతో వ్యవహరిం చాలి. దీనికోసం ముందుగా ఇంటర్న్షిప్స్, ఫ్యాకల్టీ, మెంటార్స్, క్లబ్స్ వంటి విషయాల్లో తగిన రీసెర్చ్ చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్(ఎస్ఓపీ) విదేశీ విద్య దరఖాస్తు ప్రక్రియలో.. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్వోపీ) చాలా కీలకం. ఇందులో అభ్యర్థులు స్వీయ విజ యాలు, లక్ష్యాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఆఫీసర్స్.. ఈ ఎస్వోపీ ఆధారంగా అభ్యర్థి యూనివర్సి టీలో ప్రవేశానికి అర్హుడా? కాదా?అనే విషయంపై ఒక నిర్ణ యానికి వస్తారు. కాబట్టి అభ్యర్థులు పరీక్షల్లో సాధించిన విజయాలతోపాటు ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో ప్రవేశం, స్పోర్ట్స్ వంటి వాటినీ ఎస్‌వోపీలో పేర్కొనాలి. వీటిని ప్రస్తావించే సమయంలో నిజాయితీగా వ్యవ హరించాలి. ఎస్వోపీ రూపకల్పనలో గొప్పలకు పోవడం మంచికాదు. అలాగే సాధించిన విజయాలను తక్కువ చేసుకోవడం చేయరాదు. ఉన్నది ఉన్నట్లు రాయాలి. ఫాల్, స్రింగ్.. ఏది బెటర్ విదేశీ యూనివర్సిటీలు ఫాల్ సెషన్,స్ప్రింగ్ సెషన్ పేరుతో ఏటా రెండుసార్లు అడ్మిషన్స్ కల్పిస్తాయి. కానీ, చాలా మంది విద్యార్థులకు ఏ సెషన్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలనే విషయంలో పూర్తి స్పష్టత ఉండదు. ఈ రెండు సెషన్ల మధ్య తేడాల గురించి విద్యార్థులు తప్ప నిసరిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి ఈ రెండు సెషన్ల విషయంలో బోధన, కోర్సులు, ఇతర ప్రోత్సాహకాల పరంగా అనేక వ్యత్యాసాలు ఉంటాయి. సెమిస్టర్ ప్రారంభం.. ఇలా ప్రతి ఏటా ఫాల్ సెషన్ ఆగస్టులో, స్ప్రింగ్ సెషన్ జనవరిలో ప్రారంభమవుతుంది. వీటికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ సదరు సెషన్ ప్రారంభానికి ఆరు నెలల ముందుగానే మొదలవుతుంది. ఫాల్ సెషన్ అడ్మిషన్ల కోసం జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు; స్ప్రింగ్ సెషన్ అడ్మిషన్లకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో యూనివర్సిటీలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. వీటికి అదనంగా మరికొన్ని విశ్వవిద్యాలయాలు రోలింగ్ అడ్మిషన్ల పేరిట ఏడాది పొడవునా దరఖాస్తు ప్రక్రియ చేపడుతుంటాయి. వీటి సంఖ్యను వేళ్ల మీద లెక్కించొచ్చు. ‘ఫాల్’కే మొగ్గు మన దేశం నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఫాల్ సెషన్ అడ్మిషన్లకు డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. దీనికి కారణం.. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి కాగానే..ఎక్కువ కాలం వేచి ఉండకుండా.. విదేశీ వర్సిటీలో అడుగు పెట్టొచ్చు అనే ఆలోచనే. విదేశీ యూనివర్సిటీలు కూడా ఫాల్ సెషన్లోనే ఎక్కువ కోర్సులు, సీట్లను అందుబాటులో ఉంచు తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు వారు మెచ్చిన కోర్సులో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర ప్రయోజనాలు వీటితోపాటు మరికొన్ని అంశాలు కూడా విద్యార్థులు ఫాల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కారణమవుతున్నాయి. వీటిలో ప్రధానంగా పేర్కొనాల్సింది.. యూనివర్సిటీలు అం దించే స్కాలర్షిప్స్(ఆర్థిక ప్రోత్సాహకాలు). ఫాల్ సెషన్‌కు ఇతర సెషన్స్‌తో పోల్చితే వర్సిటీలు స్కాలర్షిప్స్ కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో అకడమిక్‌గా మంచి ప్రొఫైల్ ఉన్న విద్యార్థులకు ఫాల్ సెషన్లో స్కాలర్షిప్స్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టీచింగ్ అసిస్టెంట్‌షిప్ ఫాల్ సెషన్ విద్యార్థులకు కలిసొస్తున్న మరో అంశం.. టీచింగ్ అసిస్టెంట్‌షిప్. అంటే.. ఒక కోర్సులో చేరిన విద్యార్థి ఆ కోర్సుకు సంబంధించి ప్రొఫెసర్ల వద్ద టీచింగ్ అసిస్టెం ట్‌గా సహకారం అందించడం. విద్యార్థులు అదనపు తరగ తులు, మూల్యాంకన, పరీక్షల ఇన్విజిలేషన్ తదితర అంశా ల్లో సహకారం అందించాల్సి ఉంటుంది. ఏడాది వ్యవధిలో ఉండే ఈ టీచింగ్ అసిస్టెంట్‌షిప్ అవకాశాలు ఫాల్ సెషన్లో ఎక్కుగా లభిస్తాయి. కారణం.. ఫాల్ సెషన్లోనే ఎక్కువ ప్రవేశాలు కల్పించే విధానాన్ని యూనివర్సిటీలు అనుసరి స్తుండటమే. టీచింగ్ అసిస్టెంట్‌షిప్ పొందే విషయంలో.. భారత విద్యార్థులు ఇతర దేశాల విద్యార్థులతో పోల్చితే ముందుంటున్నారు. భారత విద్యార్థుల్లో కష్టపడే తత్వం, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్కువగా ఉండటంతో ప్రొఫెసర్లు సైతం మన విద్యార్థులను తమ అసిస్టెంట్స్‌గా తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. స్ప్రింగ్ ఇలా డిసెంబర్/జనవరిలో ప్రారంభమయ్యే స్ప్రింగ్ సెషన్లో.. ఫాల్ సెషన్‌తో పోల్చితే అందుబాటులో ఉండే కోర్సులు, ఇతర ప్రోత్సాహకాలు కొంచెం తక్కువ. అలాగని విద్యార్థులు స్ప్రింగ్ సెషన్లో చేరడం వల్ల ప్రయోజనం ఉండదని భావించాల్సిన పనిలేదు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత స్టడీ అబ్రాడ్ వైపు దృష్టిసారించే వారికి స్ప్రింగ్ సెషన్ అందుబాటులో ఉంటుంది. కొందరు విద్యార్థులు స్టాండర్ట్ టెస్ట్ స్కోర్లను మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో.. ఆయా టెస్ట్‌లను మరోసారి రాద్దాం అనే వ్యూహంతో అడుగులు వేస్తూ ఫాల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోరు. ఇలాంటి విద్యార్థులకు స్ప్రింగ్ సెషన్లో సానుకూలతలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం సరైన ఆలోచన కాదు. ఫాల్, స్ప్రింగ్ సెషన్ ఏదైనా.. బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో చేరేందుకు కృషి చేయాలి. ఫాల్ సెషన్లో తక్కువ ర్యాంకు ఇన్స్టిట్యూట్లో చేరడం కంటే.. స్ప్రింగ్ సెషన్లో బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో చేరడం మేలని గుర్తించాలి. అంతేతప్ప.. స్కాలర్షిప్స్, టీచింగ్ అసిస్టెన్స్ అవకాశాలు తక్కువనే ఆలోచనతో స్ప్రింగ్ సెషన్‌ను విస్మరించరాదు. దరఖాస్తు చేసుకుంటున్న యూనివర్సిటీల్లో, ఆసక్తి గల కోర్సుకు స్ప్రింగ్ సెషన్ అడ్మిషన్లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని స్ప్రింగ్ సెషన్ ఔత్సాహికులు పరిశీలించాలి. వ్యత్యాసాలు ఫాల్ సెషన్: విద్యార్థుల నుంచి డిమాండ్ ఎక్కువ. అంతే స్థాయిలో అందించే కోర్సుల సంఖ్య కూడా ఎక్కువే. ► బ్యాచిలర్ డిగ్రీ పూర్తవుతూనే అబ్రాడ్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందాలనుకునే వారికి ఈ సెషన్ అనుకూలం. ► స్కాలర్షిప్స్, అందుబాటులోని కోర్సుల పరంగా మెరుగైన అవకాశాలు. స్ప్రింగ్ సెషన్: తక్కువ డిమాండ్, తక్కువ సంఖ్యలో కోర్సులు. టెస్ట్ స్కోర్స్ ఉత్తమంగా ఉండి మరో ఏడాది వృథా చేయడం ఎందుకు అనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది. ► స్కాలర్షిప్స్ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ► మొదటి సంవత్సరంలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ అవకాశం లేకపోవడం ప్రతికూలత. ఇవెంతో కీలకం ► ఏ సెషన్ అయినా.. విద్యార్థులు కంట్రీ, కాలేజ్, కోర్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నచ్చిన కోర్సు కేవలం ఒక సెషన్లో మాత్రమే అందుబాటులో ఉంటే ఆ సెషన్‌కే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ రెండు సెషన్స్‌లోనూ ఉంటే ప్రొఫైల్‌ను మరింత పటిష్టంగా దరఖాస్తు చేసుకుంటే.. స్కాలర్షిప్ దక్కే అవకాశాలు మెరుగవుతాయి. రెండో ప్రామాణికం ‘కాలేజ్’ను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం విద్యార్థులు బెస్ట్ కాలేజ్‌లో సీటు లభించాలంటే.. జీఆర్ఈ/ఐఈఎల్టీఎస్ / జీమ్యాట్ తదితర టెస్ట్ స్కోర్స్ అత్యంత మెరుగ్గా ఉండాలని భావిస్తూ.. ఒత్తిడికి గురవుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.. కాలేజ్‌లు కేవలం టెస్ట్ స్కోర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లేదు. అభ్యర్థుల ప్రొఫైల్‌కి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రొఫైల్ మెరుగ్గా ఉండేలా వ్యవహరించాలి. విద్యార్థులకు అత్యున్నత ఆయుధం స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఈ ఎస్ఓపీని అత్యంత మెరుగైన రీతిలో తీర్చిదిద్దేలా కసరత్తు చేయాలి. ► బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్/కాలేజ్‌లు ఉన్న దేశాన్ని గమ్యంగా ఎంచుకోవాలి. చేరాలనుకుంటున్న కోర్సులో అత్యుత్తమ బోధన అందించే కళాశాలలు ఉన్న దేశాలను అన్వేషించి.. వాటి నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫాల్ సెషన్లో అడ్మిషన్ లభించకపోయినా ఫర్వాలేదు.. బెస్ట్ కాలేజే లక్ష్యం అనుకొని స్ప్రింగ్ సెషన్ వైపు మొగ్గు చూపే విద్యార్థులు.. ఈ రెండు సెషన్ల దరఖాస్తు సమయానికి మధ్య ఉండే వ్యవధిని ప్రొఫైల్‌ను మెరుగుపరచుకోవ డానికి వినియోగించుకోవాలి. ఆన్లైన్ కోర్సులు అభ్యసించడం, రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం, టెక్నికల్ పేపర్స్ పబ్లిష్ చేయడం వంటి వాటికి సమయం కేటాయించాలి. స్టడీ అబ్రాడ్.. డాక్యుమెంట్స్ ► అప్లికేషన్, కవరింగ్ లెటర్ ► అప్లికేషన్ ఫీజు ► జీఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, ఎస్ఏటీ పరీక్షల్లో స్కోరు. ► స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ► లెటర్ ఆఫ్ రికమండేషన్ ► వ్యాసాలు ఠి అకడమిక్ సర్టిఫికెట్లు ► ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ► పాస్‌పోర్ట్ ఠి స్పాన్సర్ లెటర్స్, స్పాన్సరర్స్ ఆదాయపు పన్ను స్టేట్మెంట్ -
జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్
న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జేఎన్ఎంఎఫ్).. డాక్టోరల్ స్టడీస్ చదివే దేశానికి చెందిన వారితోపాటు, ఇతర ఆసియా దేశాల విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ► పీహెచ్డీ చదివే విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్: ► స్కాలర్షిప్ అందించే సమయం: రెండేళ్లు. ► పీహెచ్డీ విభాగాలు: ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, సోషియాలజీ, కంపెరేటివ్ స్టడీస్ ఇన్ రిలీజియన్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఎకాలజీ–ఇన్విరాన్మెంట్. వీటిలో ఏదో ఒక స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ చేసే అభ్యర్థులకు ఉపకార వేతనం లభిస్తోంది. ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఫుల్‌టైం పీహెచ్డీ స్కాలర్ అయి ఉండాలి. ► వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, తీన్‌మూర్తీ హౌస్, న్యూఢిల్లీ–110011 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: jnmf.in చదవండి: JEE Advanced 2021: అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..! సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో! -
నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వీఐటీ స్కాలర్షిప్
సాక్షి, అమరావతి: నాన్ ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు వీఐటీ యూనివర్శిటి శుభవార్త అందించింది. తమ యూనివర్శిటీలో ఆర్ట్స్ బీబీఏ, లా, బీ.కమ్, బీఏ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరే అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే లక్ష్యంగా జీవీ మెరిట్ స్కాలర్‌షిప్‌తో పాటు రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ను ఇవ్వనున్నట్లు గురువారం వీఐటీ యూనివర్శిటీ ఉపాధ్యక్షుడు డా.శేఖర్ విశ్వనాథన్ ప్రకటించారు. విశ్వవిద్యాలయ సామజిక బాధ్యతగా సాగుతున్న స్టార్స్ ప్రోగ్రామ్ కూడా కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జీవీ మెరిట్ స్కాలర్షిప్ దేశవ్యాప్తంగా ఏ బోర్డు టాపర్కైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం వందశాతం స్కాలర్షిప్ లభిస్తుందని వీఐటీ-ఏపీ వైస్ ఛాన్సలర్ డా.ఎస్ వి కోటా రెడ్డి అన్నారు. వీఐటీ-ఏపీ రిజిస్ట్రార్ డా.సి.ఎల్.వి శివకుమార్ మాట్లాడుతూ.. రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ పొందటానికి అర్హతలుగా అభ్యర్థి దేశవ్యాప్తంగా ఏదేని జిల్లా టాపర్‌గా ఉండాలన్నారు. అతను/ఆమె డిగ్రీ ప్రోగ్రాంలో అన్ని సంవత్సరాలకు 50 శాతం స్కాలర్షిప్ పొందుతారని తెలిపారు. జిల్లా టాపర్ ఒక అమ్మాయి అయితే, ఆమెకు అదనంగా 25 శాతం స్కాలర్షిప్ లభిస్తుంది దీంతో మొత్తం 75 శాతం స్కాలర్షిప్ అవుతుంది. అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు.. ⇔ బీబీఏలో జనరల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫిన్‌టెక్ కోర్సులు, ⇔ న్యాయ విభాగంలో బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్), బి.బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్) కోర్సులను, ⇔ బి.కామ్ కోర్స్మూడేళ్ళతోపాటుసిఎంఏ, సిఏ, ఏసిఎస్ లకుప్రాధమికంగా బోదించటం జరుగుతుంది. అదే విధంగా డ్యూయల్ డిగ్రీ విభాగంలో బి.ఏ. మరియు ఎం.ఏ (పబ్లిక్సర్వీసెస్), బి.ఎస్సి. మరియు ఎం.ఎస్సి (డేటాసైన్సు) కోర్సులను అందచేయటం జరుగుతుంది. ఈ రెండు మెరిట్ స్కాలర్షిప్లను నాన్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్ 2021 నుండి అమలులోనికి వస్తాయని యూనివర్శిటీ యాజమాన్యం పేర్కొంది. ఈ అర్హత కలిగి విద్యార్థిని/ విద్యార్థులు తేదీ 17.02.2021 నుంచి 31.05.2021 లోపు దరఖాస్తు చేసుకోవాలని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ –అడ్మిషన్స్ డా. ఆర్. తహియా అఫ్జల్ తెలిపారు. మరిన్ని వివరాలకు కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.vitap.ac.in నుసందర్శించవచ్చని లేదా 7901091283కి కాల్ చేసి లేదా admission@vitap.ac.inకి ఈ-మెయిలు చేసి వివరాలను పొందవచ్చని చెప్పారు. -
నత్తనడకన ‘స్కాలర్‌షిప్పు’!
సాక్షి, హైదరాబాద్ : పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కాస్త నత్తనడకన సాగుతోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 13 శాతానికి మించి రాలేదు. డిసెంబర్ 31వ తేదీతో దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిర్దేశించిన గడువులోగా పూర్తిస్థాయి విద్యార్థులు దరఖాస్తులు సమర్పించే అవకాశం కనిపించడం లేదు. యాజమాన్యాల పట్టింపేది..? ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఏటా సగటున 12.5 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. ఇందులో రెన్యువల్ విద్యార్థులు 7 లక్షలకుపైగా కాగా, ఫ్రెషర్స్ ఐదు లక్షలమంది ఉంటున్నారు. ఈ క్రమంలో 2020–21 విద్యాసంవత్సరంలో కూడా ఇదేస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 31 వరకు గడువును నిర్దేశించిన ప్రభుత్వం ఈలోగా విద్యార్థులతో దరఖాస్తులు సమర్పించేలా అవగాహన కల్పించాలని కాలేజీ యాజమాన్యాలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు ఫ్రెషర్స్ విద్యార్థుల్లో కేవలం 1,07,679 మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ఈ ఏడాది 7.99 లక్షల మంది ఫ్రెషర్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతుండగా అందులో కేవలం 13.4 శాతం మంది మాత్రమే స్పందించారు. మరో నెలన్నర గడువు మాత్రమే ఉండగా ఆలోపు విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో ఉపకార, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేయించడంలో కాలేజీ యాజమాన్యాలదే కీలకబాధ్యత. కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుతం విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఈ క్రమంలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులతో ఫోన్లో సంప్రదింపులు సాగిస్తున్న యాజమాన్యాలు ఉపకార, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తులపై కూడా అవగాహన కల్పించాలని సంక్షేమ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కానీ, యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని, తప్పనిసరిగా దర ఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధిస్తే విద్యార్థులు స్పందిస్తారని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మొదలు కాని ఫ్రెషర్స్ దరఖాస్తులు ప్రస్తుతం రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు. ఇంకా పలు కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో ఫ్రెషర్స్ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ఒకట్రెండురోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు దరఖాస్తు నమోదుపై శ్రద్ధ తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
ముస్లిం మైనారిటీలకు శుభవార్త
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముస్లీం మైనారిటీలకు శుభవార్త. రాష్ట్రంలోని ఇమామ్, మౌజిస్‌లకు ఏపీ ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసినట్లు వక్ఫ్ బోర్డు సీఈఓ అలీం బాషా మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 23 కోట్ల రూపాయలకు పైగా నిధులను రెండు రోజులుగా ఆయా వక్ఫ్ సంస్థల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ఇమాంలకు రూ. 5 వేలు, మౌజిస్‌లకు రూ. 3వేల చొప్పున విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలోని 10వేల మంది లబ్దిదారులకు నిధులు విడుదల చేశామన్నారు. అలాగే గత ఏడాదిలో కూడా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం 49.6 కోట్ల గౌరవ వేతనం అందించినట్లు అలీం బాషా తెలిపారు. -
ఆధార్ అప్డేట్ చేయాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం తలపెట్టిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలును ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ పథకాలకు విద్యార్థుల వేలిముద్రల సమర్పణను తప్పనిసరి చేసింది. ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రతి విద్యార్థి ఇకపై బయోమెట్రిక్ ఎంట్రీ చేయాల్సిందే. ఇదివరకు మాన్యువల్ పద్ధతిలో వివరాల నమోదుతో దరఖాస్తును ఆమోదించే అధికారం సంక్షేమాధికారికి ఉండేది. కానీ ప్రస్తుతం ప్రతి విద్యార్థి తప్పకుండా ఆధార్‌తో అనుసంధానమైన వేలిముద్రలు సమర్పిస్తేనే దరఖాస్తు సంక్షేమాధికారికి చేరుతుంది. అయితే ఆధార్ ఆధారిత వేలిముద్రలు సరిపోలడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు ఆధార్ కార్డు పొందిన సమయంలో ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ ప్రస్తుతం సమర్పించే ప్రింట్స్ సరిపోలడం లేదు. పిల్లల్లో ఎదుగుదల వేగంగా ఉండటంతో వేలిముద్రల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో పోస్టుమెట్రిక్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఆధార్ అప్డేషన్ అనివార్యమవుతోంది. అప్డేట్ చేస్తేనే... : ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తులో విద్యార్థి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఈ నంబర్ ఎంట్రీ చేయడంతో దానికి అనుసంధానమైన వేలిముద్రలు దరఖాస్తులో భాగమవుతాయి. ఈ దరఖాస్తు కాలేజీ ప్రిన్స్‌పల్ లాగిన్‌కు చేరుతుంది. అక్కడ దరఖాస్తును తెరిచి పరిశీలించిన తర్వాత విద్యార్థి తన వేలి ముద్రలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌తో అనుసంధానమైన వేలి ముద్రల్లో ఏమాత్రం తేడా ఉన్నా సాఫ్ట్వేర్ ఆమోదించదు. ప్రతి ఐదేళ్లకోసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన మార్పులు, కొత్తగా చేరికలను ఎంట్రీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఈ అప్డేషన్ ప్రక్రియ అవసరముందని సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆధార్ అప్డేట్ చేసుకోని విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు సమయంలో ఇబ్బందులు వస్తున్నందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబర్ 30 వరకు గడువు... : 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుకు వచ్చేనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. వాస్తవానికి ఇప్పటికే గడువు ముగియాల్సి ఉండగా.. కోవిడ్–19 వ్యాప్తి, అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం నెలకొనడంతో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యంగా ప్రారంభించారు. వచ్చే నెలాఖరు వరకు దరఖాస్తుకు సమయం ఉండటంతో ఆలోపు దీర్ఘకాలికంగా ఆధార్ అప్డేట్ చేసుకోని విద్యార్థులు ఆధార్ నమోదు కేంద్రాల్లో వేలి ముద్రలు సమర్పిస్తే సరిపోతుంది. -
చీవినింగ్తో లైఫ్ చిల్!
సాక్షి, హైదరాబాద్: నేర్చుకోవడం జీవితాంతం సాగే ప్రక్రియ. ఒకసారి ఉద్యోగం అనే బతుకు యుద్ధంలోకి ప్రవేశించాక చదివే తీరిక ఎక్కడుంటుంది. అవకాశాలూ అంతంత మాత్రమే! ఇదీ మనలో చాలామంది అనుకునేది. కానీ వాస్తవం వేరు అంటున్నారు పరకాల ప్రత్యూష, భరత్‌కుమార్‌లు. బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే చీవినింగ్ స్కాలర్‌షిప్‌నకు తెలుగు రాష్ట్రాల నుంచి వీరు ఎంపికయ్యారు. ఉద్యోగాల్లో స్థిరపడినా కూడా నేర్చుకోవాలన్న ఆసక్తితో ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లండన్‌లో చదువు ఎలా ఉంటుంది? యూనివర్సిటీల తీరు తెన్నులేంటి? చీవినింగ్ స్కాలర్లుగా తమ ప్రాథమ్యాలేమిటి? భవిష్యత్ ప్రణాళికలేంటి.. తదితర విషయాలను వారు ఇలా పంచుకున్నారు. పర్యావరణ కోసం: పరకాల ప్రత్యూష ‘చీవినింగ్ స్కాలర్షిప్ మన జీవితాన్ని మార్చే అరుదైన అవకాశం. 2018లో అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న ఏకైక తెలుగు మహిళగా రికార్డు సృష్టించా. చీవినింగ్ స్కాలర్‌గా ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అండ్ పాలిటిక్స్‌పై బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్నా. సుస్థిరాభివృద్ధి, విధాన రూపకల్పన వంటి అంశాల్లో పనిచేస్తుంటాను. 2021లో కోర్సు పూర్తయిన కొంత సమయానికే బ్రిటన్‌లో జరగనున్న కాప్–26 కోసం పనిచేయాలని భావిస్తున్నాను. భారత్ తిరిగి వచ్చాక పర్యావరణ, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా’అని పరకాల ప్రత్యూష పేర్కొన్నారు. వర్సిటీల గురించి.. ‘బ్రిటన్‌లో విశ్వవిద్యాలయాల వ్యవస్థ చాలా వినూత్నమైంది. ఎంపిక చేసుకునేందుకు బోలెడన్ని కోర్సులు ఉన్నాయి. నా కోసం కూడా ఓ ప్రత్యేకమైన కోర్సు సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడి సిబ్బంది ఆయా రంగాల్లో నిష్ణాతులైనా కూడా చాలా కలుపుగోలుగా ఉంటారు. ఓపికతో, మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. ఈ లక్షణాలన్నింటి వల్ల ఇక్కడి చదువు సంతృప్తినిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ అందరూ అందరినీ గౌరవిస్తారు. ఎవరినీ చులకన చేసి మాట్లాడరు. విద్యార్థులందరి అభిప్రాయాలు, ఆలోచనలకు విలువ ఉంటుంది. దేశవిదేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలసి చదువుకోవడం వల్ల వారి సంస్కృతులు తెలుస్తాయి. చీవినింగ్ స్కాలర్షిప్ అనేది జీవితకాలంలో దొరికే అద్భుత అవకాశం. ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే మీరిచ్చే సమాధానాలు వీలైనంత నిజాయితీగా ఉండేలా జాగ్రత్త పడండి’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రత్యేక గుర్తింపు కోసం: భరత్‌కుమార్ ‘ప్రజారోగ్య రంగంలో నాదైన గుర్తింపు పొందాలనేది నా లక్ష్యం. విశాఖపట్నంలో కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ చదివాను. సంజీవని వంటి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. గిరిజన సమాజాల అభివృద్ధికి నా వంతు సాయం చేశాను. విశాఖ జిల్లా గిరిజనులపై నేను జరిపిన అధ్యయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చేరేలా చేసింది. అక్కడే ఎంఏ పూర్తి చేశా. వేర్వేరు స్థాయిల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పని చేయడం ప్రజారోగ్యం ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. అందుకే చీవినింగ్ స్కాలర్షిప్లో భాగంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో ఉన్నత చదువు అభ్యసించేందుకు ఎంపిక కావడం సంతోషాన్నిస్తోంది. ప్రజా రోగ్య రంగంలో తాజా పరిశోధనలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వచ్చింది. జాతీయస్థాయిలో వినియోగదారుల ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తా. ప్రజారోగ్యాన్ని మానవాభివృద్ధి సూచీలో భాగమయ్యేలా చేసేందుకు కృషి చేస్తా’అని భరత్ కుమార్ వివరించారు. ఏమిటీ చీవినింగ్ స్కాలర్షిప్? బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో అమలు చేస్తున్న స్కాలర్షిప్ పథకం ఇది. బ్రిటన్‌లోని సుమారు 150 యూనివర్సిటీల్లో సుమారు 12 వేల కోర్సుల్లో మీకు నచ్చిన దానిలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైతే బ్రిటన్‌లో ఏడాది కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఖర్చులను ఆ దేశ ప్రభుత్వమే భరిస్తుంది. చీవినింగ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారికి రెండేళ్ల వృత్తి అనుభవం ఉండాలి. దరఖాస్తుకు గడువు ఈ ఏడాది నవంబర్ 3వ తేదీ. 1983లో ప్రారంభమైన చీవినింగ్ స్కాలర్షిప్, ఫెలోషిప్‌ల ద్వారా ఇప్పటివరకు సుమారు 3,200 మంది స్కాలర్లు బ్రిటన్‌లో విద్యను అభ్యసించారు. -
విద్యార్థులందరికి రూ.11 వేలు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కూడా అలానే వ్యాప్తి చేందుతుంది. ఇంటర్నెట్లో కనిపించే ప్రతిదీ నిజమని నమ్మితే.. బొక్కబోర్లా పడతాం. ఇలా వైరలయ్యే న్యూస్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత నమ్మాలి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఒకటి తెగ వైరలవుతోంది. దాని సారంశం ఏంటంటే.. కేంద్రం విద్యార్థులందరికి 11 వేల రూపాయల స్కాలర్షిప్ అందిస్తుంది. స్కూలు, కాలేజీ స్టూడెంట్స్ ఫీజులు చెల్లించడం కోసం ఈ స్కాలర్షిప్ను ఇవ్వనుందనే వార్త కొద్ది రోజులుగా తెగ వైరలవుతోంది. అన్‌లాక్ 4.0లో భాగంగా విద్యాసంస్థలు తెరిచారు. అయితే చాలా మంది విద్యార్థులు ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. కనుక తమకు సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. వారి విన్నపం మేరకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 11 వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వనుంది అని. (చదవండి: మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ . లక్ష : ఈ వార్త నిజమేనా!) అయితే ఇది ఫేక్ న్యూస్.. కేంద్రం ఇలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఈ ఫేక్ న్యూస్‌ని తొలగించడేమ కాక విద్యార్థులందరికి కేంద్రం 11 వేల రూపాయలు ఇస్తుందంటూ ఓ వెబ్సైట్లో వచ్చిన ఈ వార్త నిజం కాదు. ఆ వెబ్సైట్ కూడా నిజం కాదు. కేంద్రం ఇలాంటి ప్రకటన చేయలేదు అని ట్వీట్ చేసింది. ఇంటర్నెట్లో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్లో ఈ ఫ్యాక్ట్ చెక్ ఆర్మ్‌ని ప్రారంభించింది. దీని లక్ష్యం “వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని గుర్తించడం.. ప్రజలను హెచ్చరించడం’’. दावा:- एक वेबसाइट पर दावा किया जा रहा है कि कोरोना महामारी के चलते केंद्र सरकार स्कूल और कॉलेजों के सभी छात्रों को उनकी फीस भरने के लिए 11,000 रुपए प्रदान कर रही है।#PIBFactCheck:- यह वेबसाइट फर्जी है। केंद्र सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गई है। pic.twitter.com/kcD1jO8jZm — PIB Fact Check (@PIBFactCheck) September 22, 2020 -
స్కాలర్షిప్ ఇస్తాను.. కానీ: సోనూ సూద్
రియల్ హీరో సోనూ సూద్ మరో మంచి పనితో ముందుకు వచ్చారు. ఈ సారి పేద విద్యార్థులను ప్రోత్సాహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు సోనూ సూద్. ఆయన తల్లి, ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరు మీదుగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించనున్నారు. scholarships@sonusood.me లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో విద్య ఎంత ఖరీదైన వనరుగా మారిందో చూస్తున్నాం. దాంతో చాలా మంది పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులకు హాజరవ్వాలన్నా చాలా మంది విద్యార్థుల దగ్గర స్మార్ట్ఫోన్లు, టీవీలు లేవు. కొందరు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో నేను దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను. ప్రతిభ గల పేద విద్యార్థులకు నా తల్లి పేరు మీద స్కాలర్షిప్ అందిస్తాను. మా అమ్మ గారు పంజాబ్ విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పారు. ఆమె స్ఫూర్తిని నేను కొనసాగించాలనుకుంటున్నాను’ అన్నారు. (చదవండి: మీకు 20 సార్లు ట్వీట్ చేశాను: సోనూ సూద్) కోర్సులేంటి.. అర్హులేవరు.. ‘మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్షిప్ అందుబాటులో ఉంటుంది. 2 లక్షల రూపాలయ కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులు స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. కానీ వారికి మంచి మార్కులు వచ్చి ఉండాలి. అలాంటి వారి ఫీజు, వసతి, ఆహారం అన్ని విషయాలను మేమే చూసుకుంటాం’ అన్నారు సోనూ సూద్. -
టార్గెట్.. సెప్టెంబర్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను వేగవంతం చేసే దిశగా సంక్షేమ శాఖలు చర్యలు చేపట్టాయి. కోవిడ్–19 ప్రభావంతో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంది. వాస్తవానికి ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తి చేసి అర్హతను నిర్ధారించాల్సి ఉండగా, లాక్‌డౌన్‌తో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం క్రమంగా కార్యాలయాలు తెరిచినా.. విద్యా సంస్థలు మాత్రం తెరవలేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంక్షేమ శాఖలు ప్రత్యేకంగా లక్ష్యాన్ని నిర్ధేశించాయి. ఈనెలాఖరు కల్లా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలన చేసి అర్హతను నిర్ధారించాలని క్షేత్రస్థాయి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశాయి. అర్హత తేలితేనే అంచనాలు... ప్రస్తుతం పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్ ్స టెస్టులు జరుగుతున్నాయి. ఇది కాగానే కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికానుంది. దీంతో వచ్చేనెలలో నూతన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కంటే ముందే పెండింగ్‌లో ఉన్నవి పరిశీలించి అర్హత నిర్ధారించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా పరిశీలన పూర్తయితే అందులో అర్హత ఉన్నవేవో ఖరారు చేయొచ్చు. అప్పుడు 2019–20 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనా లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఎంత నిధులు కావాలో తెలుస్తుంది. 12.73 లక్షల దరఖాస్తులు... ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గరిష్టంగా 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా 2019–20లో 12.73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రెన్యూవల్ విద్యార్థులు7.69 లక్షల మంది, కొత్త విద్యార్థులు 6.71లక్షల మంది. గత నెలాఖరు నాటికి 5.78 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు ఇంటివద్ద నుంచే పనిచేస్తున్నారు. దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే పరిశీలన చేయాల్సి ఉండటంతో వీలైన వారంతా వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పరిశీలన చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
హెచ్‌సీయూ విద్యార్థికి గ్రేస్ హోపర్ స్కాలర్షిప్
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంసీఏ విద్యార్థిని వాణిగుప్తాకు 2020 సంవత్స రానికి గ్రేస్ హోపర్ స్టూడెంట్ స్కాలర్షిప్ లభించింది.కాలిఫోర్నియాలోని అనితాబి డాట్ ఆర్గ్ ఈ స్కాలర్షిప్ను అందజేస్తుంది. ఇందులో భాగంగా 1200 డాలర్లు వార్షిక మొత్తంగా చెల్లిస్తారు. ఈ సందర్భంగా వాణిగుప్తాను పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
బోపన్న టెన్నిస్ స్కాలర్షిప్స్
బెంగళూరు: భారత డబుల్స్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న టెన్నిస్ స్కాలర్షిప్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఆటతోపాటు చదువు నేర్పే ఈ కార్యక్రమం కోసం ఒక్కో విద్యార్థిపై రూ. 10 లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. బెంగళూరులోని ‘ద స్పోర్ట్స్ స్కూల్’ సహ భాగస్వామిగా ఉన్న ఈ ప్రాజెక్టులో అండర్–12, 14, 16 విభాగాల్లోని బాలబాలికల ప్రతిభ, అఖిల భారత టెన్నిస్ సంఘం ర్యాంకింగ్ ఆధారంగా ఒక్కో కేటగిరీలో 20 మందిని ఎంపిక చేస్తారు. వీరికి అత్యున్నత టెన్నిస్ శిక్షణతో పాటు విద్య కూడా అందజేస్తారు. ఇది భారత టెన్నిస్‌ను మార్చే కార్యక్రమంగా బోపన్న అభివర్ణించాడు. ప్రపంచంలోనే ఇది గొప్ప ఉపకారవేతనమని చెప్పాడు. 100 శాతం స్కాలర్షిప్ అందజేస్తామని, అమెరికా టెన్నిస్ కాలేజ్‌లో కూడా 70 లేదంటే 80 శాతం మొత్తాన్నే స్కాలర్‌షిప్‌గా అందజేస్తారని... ఇక్కడ మాత్రం పూర్తి మొత్తం ఇస్తామని రోహన్ బోపన్న చెప్పాడు. తను జూనియర్ స్థాయిలో ఉన్నప్పుడు తనకు అందుబాటులో లేని సౌకర్యాలు, సామాగ్రి ఇప్పుడు శిక్షణ పొందేవాళ్లకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పాడు. -
ఎమ్మెస్‌కు వెళతానని ఊహించలేదు: సూర్య దీపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన విద్యార్థినికి అమెరికాలోని ప్రతిష్టాత్మక అబర్న్ యూనివర్సిటీలో ఎమ్మెస్ కోర్సులో సీటు దక్కింది. హైదరాబాద్ లోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సీఆర్ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్య దీపిక ఈ ఘనత సాధించింది. ఇంకా ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా ఫారెస్ట్రీ కోర్సులో దీపిక కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ యూనివర్సిటీ ఎమ్మెస్‌లో సీటును పూర్తి ఉచితంగా ఇచ్చింది. రెండేళ్ల ఈ ఎమ్మెస్ కోర్సు ఫీజు 15,000 డాలర్లు కాగా దీనిని మాఫీ చేయటంతో పాటు నెలకు 1,500 డాలర్ల స్కాలర్షిప్ను కూడా మంజూరు చేసింది (ఈ రెండింటి విలువ దాదాపు రూ. 50 లక్షల వరకూ ఉంటుందని అంచనా). అబర్న్ యూనివర్సిటీలో ప్రముఖ డాక్టర్ జన్నా విల్లోగ్ నేతృత్వంలో జెనెటిక్స్, వైల్డ్ లైఫ్‌ను సూర్య దీపిక అధ్యయనం చేయనుంది. రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించడంలో భాగంగా ఎఫ్సీఆర్ఐ గతంలో అబర్న్ తోపాటు కెనడాకు చెందిన బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీతోనూ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మరో ముగ్గురు విద్యార్థులకు కూడా ఈ యూనివర్సిటీల్లో ప్రవేశం దక్కే అవకాశం ఉందని కాలేజీ డీన్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెస్‌కు వెళతానని ఊహించలేదు: సూర్య దీపిక తన అకడమిక్ కోర్సులో భాగంగా ఉన్నతవిద్యను అభ్యసిస్తానని, అందులోనూ అమెరికాలో ఎమ్మెస్ చదువుతానని తాను ఊహించలేదని సూర్య దీపిక తెలిపింది. తన కలను నిజం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విషయంలో అటవీ కళాశాల యాజమాన్యం, సిబ్బంది తనకు అన్నివిధాలా అండగా నిలిచారని పేర్కొంది. నగర శివార్లలోని ములుగులో నెలకొల్పిన ఎఫ్సీఆర్ఐలో ప్రస్తుతం బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు నడుస్తోంది. 2016కు చెందిన మొదటి బ్యాచ్ విద్యార్థులు ప్రస్తుతం చివరి ఏడాదిలో ఉన్నారు. వీరిలో సుమారు 20 మంది ఉన్నత చదువులతో పాటు, సివిల్ సర్వీసులకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సును ఆరంభించేందుకు అన్ని అనుమతులు వచ్చినట్లు డీన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మొదటి బ్యాచ్‌లో 24 మందికి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తామన్నారు. -
ఉపకారానికి అడ్డంకులు..
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల మంజూరీకి మరిన్ని అడ్డంకులు వచ్చిపడ్డాయి. ఇప్పటివరకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో మంజూరీలో జాప్యం జరుగుతుండగా.. ప్రస్తుతం సంక్షేమ శాఖల వద్ద అందుబాటులో అంతో ఇంతో నిధులున్నా వాటిని పంపిణీ చేయడంలో సమస్యలు నెలకొన్నాయి. ఈ–పాస్ వెబ్సైట్లో విద్యార్థులు చదువుతున్న కోర్సుకు సంబంధించి ట్యూషన్ ఫీజును సంబంధిత యూనివర్సిటీ అప్డేట్ చేయకపోవడంతో విద్యార్థి దరఖాస్తును మంజూరు చేయడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. పోస్టుమెట్రిక్ కోర్సులకు సంబంధించి ఫీజులను కాలేజీకి గుర్తింపు ఇచ్చే బోర్డు లేదా యూనివర్సిటీ నిర్ధారిస్తూ ఈ–పాస్ వెబ్సైట్లో అప్డేట్ చేయాలి. అదేవిధంగా ఫీజులకు సంబంధించి వర్సిటీ నిర్ణయాలు తదితర సమాచారాన్ని మాన్యువల్ పద్ధతిలో సంక్షేమ శాఖలకు సమర్పించాలి. దీనిలో భాగంగా మెజారిటీ యూనివర్సిటీలు సమాచారాన్ని ఇచ్చినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అత్యధిక కాలేజీలున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫీజు స్ట్రక్చర్ అందకపోవడంతో సంక్షేమ శాఖాధికారులు దరఖాస్తుల పరిశీలనను పక్కనపెట్టారు. ఉపకార వేతనాలకు ఇబ్బందులు.. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలను ఫిబ్రవరి నెలాఖరు కల్లా క్లియర్ చేయాలని సంక్షేమ శాఖలు భావించాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టేందుకు ఉపక్రమించగా.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫీజ్ స్ట్రక్చర్ అందకపోవడంతో ఆయా దరఖాస్తులను పక్కనపెట్టాయి. రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ఉపకార వేతనాలు ఇచ్చేందుకు బడ్జెట్ అందుబాటులో ఉంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి నెలాఖరులోగా సీనియర్ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన చేసే అధికారులకు ఫీజు స్ట్రక్చర్ కనిపించకపోవడంతో వాటి పరిశీలన నిలిపివేస్తున్నారు. పరిశీలన ప్రక్రియ నిలిచిపోతే విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అధికారులు స్పందించడం లేదు.. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసి నాలుగు వారాలైంది. ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం కోర్సుల వారీగా ఫీజు స్ట్రక్చర్‌ను ఈ–పాస్ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. దీంతో ఆయా విద్యార్థుల దరఖాస్తులను పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో నిధులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫీజ్ స్ట్రక్చర్ అప్డేట్ కాకపోవడంతో అధికారులు ఈ యూనివర్సిటీ పరిధిలోని దరఖాస్తులను పక్కకు పెడుతున్నారు. ఈ అంశాన్ని 15 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లా. కానీ వర్సిటీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. – గౌరి సతీశ్, రాష్ట్ర కన్వీనర్, ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ -
జగనన్న వసతి దీవెనకు రూ. 2,300 కోట్లు
సాక్షి, అమరావతి: జగనన్న వసతి దీవెన పథకంలో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు ఖర్చు చేయనుంది. ఇటీవల వైఎస్సార్ నవశకంలో నిర్వహించిన సర్వేలో కొత్తగా 95,887 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులయ్యారు. ఇంటర్, ఆపైన చదువుతూ.. స్కాలర్షిప్లు తీసుకునే ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హుడు. ఈ పథకంలో పేద విద్యార్థుల వసతి కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేలు అందజేస్తుంది. ఈ మొత్తాన్ని తల్లి బ్యాంకు అకౌంట్‌కు జమచేస్తారు. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు 10,65,357 మంది కాగా.. కొత్తగా 95,887 మంది విద్యార్థులు చేరడంతో ఆ సంఖ్య 11,61,244కు చేరింది. త్వరలోనే వీరికి వసతి దీవెన కార్డులు అందచేస్తారు. వసతి దీవెన పథకానికి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా నిధులు ఖర్చు కానున్నాయి. ఇంతవరకూ ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఫీజుల కింద ప్రభుత్వం రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 2,300 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అంటే అదనంగా రూ. 1,500 కోట్లు ఖర్చుచేయాలి. విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు సంవత్సరానికి రూ. 20 వేలు ఖర్చు చేయాల్సిందేనని ప్రభుత్వం భావించింది. అందుకే ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకు సాగుతోంది. -
కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు
సాక్షి, హైదరాబాద్: దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా ఉపకారవేతనాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ వరకు ఏదైనా కోర్సు పూర్తి చేసిన కార్మికుల పిల్లలు సంబంధిత కార్మిక కమిషనర్ కార్యాలయం నుంచి దరఖాస్తును పొందాలని, వాటిని పూర్తి వివరాలతో పూరించి 2020 ఫిబ్రవరి 15వ తేదీలోగా కార్మిక శాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన అభ్యర్థులే అర్హులని, రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉపకారవేతనాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించింది. -
ఉపకార దరఖాస్తులకు ఈ నెల 31 వరకే గడువు
సాక్షి, హైదరాబాద్ : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన దరఖాస్తుల సమర్పణ గడవు ఆగస్టు నెలాఖరుతో ముగియాల్సి ఉన్నా దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మరికొంత సమయం పెంచాలని ప్రభుత్వాన్ని సం క్షేమ శాఖలు కోరాయి. దీంతో మరో నెల గడువును పెంచుతూ సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయినప్పటికీ సంక్షేమ శాఖల అంచనాల్లో కనీసం 50 శాతం దరఖాస్తులు కూడా రాకపోవడంతో చివరి అవకాశంగా డిసెంబర్ నెలాఖరు వరకు గడువును పొడిగించిన ప్రభుత్వం... ఆ తర్వాత ఎలాంటి మార్పులుండవని, నిర్దేశించిన గడువులోగా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించకుంటే అనర్హులవుతారని స్పష్టం చేసింది. ] 2019–20 విద్యా సంవత్సరంలో 13.45 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా ఇప్పటివరకు 12.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. మరో పది రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండటంతో సంక్షేమ శాఖాధికారులు కాలేజీ యాజమాన్యాలకు ఎస్ఎంఎస్ల ద్వారా గడువు తేదీని గుర్తుచేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన కాలేజీల విద్యార్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావాల్సి ఉందని ఆయా జిల్లాల అధికారులు చెబు తున్నారు. ఈ నెల 31 తర్వాత గడువు పెంచే అవకాశం లేకపోవడంతో ఆలోగా దరఖాస్తులు సమర్పించేలా చర్యలు తీసు కోవాలని కాలేజీల యాజమాన్యాలతోపాటు విద్యార్థులకు సూచనలు చేస్తున్నారు. -
బీసీ విద్యార్థులకు దీపావళి కానుక
సాక్షి, హైదరాబాద్: బీసీ విద్యార్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన, ఫీజురీయిం బర్స్మెంట్ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేసింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో నిర్దేశించిన బడ్జెట్‌కు అనుగుణంగా రూ.1,196.58 కోట్లకు సంబంధించిన బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్లను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పార్థ సారథి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెలువడడమే తరు వాయి బీసీ సంక్షేమ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది. ఈ నిధు లతో 2017–18, 2018–19 బకాయి లను దాదాపు క్లియర్ చేయనుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ లకు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద నిధుల కేటాయింపులు ఉండ డంతో విద్యా ర్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయిం బర్స్మెంట్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖకు నిధుల కేటాయింపుల్లో జాప్యం జరుగుతుండడంతో పంపిణీ ఆలస్య మైంది. తాజాగా ఆమోదించిన పద్దుల్లో బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేత నాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకా లతోపాటు బీసీల కులాంతర వివాహ ఆర్థిక సాయం తదితరాలున్నాయి. ఇందులో ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కేటగిరీల్లో నిధులు విడుదల చేయడంతో ప్రాధాన్యతా క్రమంలో సమాన నిధులు ఇచ్చే వీలుంటుంది. -
విద్యార్థులు 8 లక్షలు.. దరఖాస్తులు 9 వేలు
సాక్షి, హైదరాబాద్: విద్యాసంవత్సరం మధ్యలోనే సీనియర్లకు ఉపకార వేతనం ఇవ్వాలని సంక్షేమ శాఖలు భావించినా దరఖాస్తులు అంతంత మాత్రమే వచ్చాయి. దీంతో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పంపిణీ ప్రక్రియ జాప్యం కానుంది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ జూలై మొదటివారంలో ప్రారంభమైంది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో తొలుత రెన్యువల్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఉపక్రమించింది. ఈ పథకాల కింద ప్రతి సంవత్సరం 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో దాదాపు 5 లక్షల మంది ఫ్రెషర్స్ ఉంటారు. 2019–20 విద్యాసంవత్సరంలో 8,02,871 మంది సీనియర్ విద్యార్థులున్నట్లు సంక్షేమశాఖలు లెక్క తేల్చాయి. దరఖాస్తులు తొమ్మిదిన్నరవేలే... స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సెప్టెంబర్ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. 3 నెలలపాటు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా, తొలి నెలన్నరలో రెన్యువల్, మిగతా నెలన్నరలో ఫ్రెషర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే సులభతరమవుతుందని సంక్షేమ శాఖలు భావించాయి. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం 9,541 మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఆగస్టు ఆఖరుకల్లా రెన్యువల్ విద్యార్థులు దరఖాస్తులు సమర్పిస్తే సెప్టెంబర్ నుంచి వాటిని పరిశీలించి నవంబర్ కల్లా అర్హత నిర్ధారణ చేపట్టి డిసెంబర్లో ఉపకారవేతనాలు పంపిణీ చేయాలని సంక్షేమ శాఖలు ప్రణాళికలు తయారు చేసుకున్నాయి. ఇప్పుడు డిసెంబర్ నాటికి స్కాలర్షిప్ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. అవగాహన కల్పించని కళాశాలలు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల నమోదుపై కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించడం లేదు. విద్యార్థుల నుంచి కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతోపాటు స్టడీ సర్టిఫికెట్లను యాజ మాన్యాలు తీసుకుని ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. అనంతరం విద్యార్థి నుంచి వేలిముద్రలు తీసుకుని వెబ్సైట్లో అప్డేట్ చేసి ఫైలును సంక్షేమాధికారికి పంపాలి. అక్కడ వివరాలను సరిచూసిన తర్వాత అర్హతను నిర్ధారిస్తారు. యాజమాన్యాలు దరఖాస్తు గడువు తేదీని సైతం నోటీసు బోర్డుల్లో పెట్టడం లేదని సంక్షేమాధికారులు చెబుతున్నారు. నమోదుపై చైతన్యం కల్పిస్తేనే ఈ పథకాల అమలు సులభతరమవుతుందని అధికారులు అంటున్నారు. -
‘బీసీ ఓవర్సీస్’కు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కమిషనర్ అనితా రాజేంద్ర సూచించారు. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదని, కుటుంబ వార్షికాదాయం ఐదు లక్షల్లోపు ఉండాలని తెలిపారు. టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీమ్యాట్లలో కనీస స్కోరు సాధించాలన్నారు. రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఎల్పీయూలో 3 లక్షలదాకా స్కాలర్షిప్
జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి, ఉపకార వేతనానికి ఎల్‌పీయూనెస్ట్ అనే అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎల్పీయూ ఓ ప్రకటనలో తెలిపింది. 58 దేశాల్లో ఈ పరీక్ష ఉంటుందనీ, విద్యార్థులు తాము ఎంచుకునే కోర్సును బట్టి రూ. 3 లక్షల వరకు ఉపకార వేతనం పొందొచ్చని ఎల్పీయూ వెల్లడించింది. విద్యార్థులు జూన్ 30లోపు ఎల్పీయూనెస్ట్కు దరఖాస్తు చేసుకోవాలనీ, ఈ ఎల్పీయూనెస్ట్తోపాటు బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లోనూ సాధించిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని ఉపకార వేతనాలకు విద్యార్థులను ఎంపిక చేస్తామంది. -
రెండు పద్దులకు ఓకే
సాక్షి, హైదరాబాద్ : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు కష్టాలకు త్వరలో చెక్ పడనుంది. ప్రాధాన్యతా క్రమంలో ఫీజుల పంపిణీ విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం సమన్యాయం దిశగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలకు రెండు పద్దులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ లెక్కన టెక్నికల్, నాన్ టెక్నికల్ కేటగిరీలకు వేర్వేరుగా నిధులు విడుదల చేయనుంది. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్లో అధిక భాగం సాంకేతిక కోర్సులు చదువుతున్న వారివే. ఈ క్రమంలో ప్రభుత్వం త్రైమాసికాలవారీగా నిధులు విడుదల చేస్తుండగా... తొలి ప్రాధాన్యత కింద విడుదలైన నిధులను టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు ఇస్తున్నారు. దీంతో జనరల్ కోర్సులు చదివే విద్యార్థులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంఖ్యాపరంగా అధికంగా ఉండే జనరల్ కోర్సుల విద్యార్థులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం తలనొప్పిగా మారుతోంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ సమన్యాయ సూత్రాన్ని పాటించాల ని భావించిన ప్రభుత్వం... వేర్వేరు పద్దులు ఏర్పా టు చేసింది. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఈ రెండు పద్దుల విధానం అమల్లోకి రానుంది. ఏ, బీ కేటగిరీలుగా... ప్రస్తుతం సంక్షేమ శాఖలకు ఒకే పద్దు కింద ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటిని జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖాధికారులకు విడుదల చేసి అక్కడ్నుంచి విద్యార్థుల ఖాతాలకు నిధులు పంపిణీ చేస్తున్నారు. తాజాగా కొత్త విధానాన్ని అమలు చేయనుండటంతో సంక్షేమ శాఖలకు రెండు పద్దులు ఏర్పాటు కానున్నాయి. ప్రతి శాఖలో జనరల్ కేటగిరీగా ‘ఏ’, వృత్తివిద్య కేటగిరీగా ‘బీ’పేరుతో పద్దులను నిర్వహించనున్నారు. ‘ఏ’కేటగిరీలో ఇంటర్మీడియెట్, జనరల్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, పాలిటెక్నిక్ కోర్సులుంటాయి. కేటగిరీ ‘బీ’లో ఇంజనీరింగ్, ఎంటెక్‌తోపాటు వృత్తివిద్యకు సంబంధించిన కేటగిరీలుంటాయి. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కింద ఏటా దాదాపు 13 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా రూ. 2,250 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందులో దాదాపు ‘ఏ’కేటగిరీకి సంబంధించి 63 శాతం విద్యార్థులుండగా... బడ్జెట్లో 44 శాతంమాత్రమే వారికి అవసరమవుతుంది. వృత్తివిద్యా విభాగంలో 37 శాతం విద్యార్థులకు ఏకంగా 56 శాతం బడ్జెట్ వినియోగమవుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో ఫీజులు విడుదల చేస్తుండటంతో ఎక్కువ బడ్జెట్ వృత్తివిద్యా కోర్సులకే ఖర్చవుతోంది. దీంతో జనరల్ కోటాకు తదుపరి విడుదలయ్యే నిధులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల పంపిణీలో అన్యాయం జరుగుతోందంటూ ఎస్సీ అభివృద్ధిశాఖ వద్ద పలుమార్లు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు పి.కరుణాకర్ కొత్త విధానానికి సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించగా వాటిని ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో కొత్తగా రెండు పద్దుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పద్దులు ఇలా... ప్రతి శాఖలో జనరల్ కేటగిరీగా ‘ఏ’, వృత్తివిద్య కేటగిరీగా ‘బీ’ పేరుతో పద్దులను నిర్వహించనున్నారు. ‘ఏ’ కేటగిరీలో ఇంటర్మీడియట్, జనరల్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, పాలిటెక్నిక్ కోర్సులుంటాయి. కేటగిరీ ‘బీ’లో ఇంజనీరింగ్, ఎంటెక్‌తోపాటు వృత్తివిద్యకు సంబంధించిన కేటగిరీలుంటాయి. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కింద ఏటా దాదాపు 13 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి -
పరిశోధన పత్రాల ప్రచురణ ఫ్రీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధన పత్రాలను ప్రచురణ చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. విద్యార్థి దశలో అంత మొత్తం వెచ్చించడం కష్టమే! విద్యార్థిగా ఆ కష్టాలను అనుభవించారు కాబట్టే విష్ణువర్ధన్ రెడ్డి, సయ్యద్ సల్మాన్‌లు.. తమ లాగా ఇతర విద్యార్థులు ఇబ్బంది పడకూడదని ఆలోచించారు. రూబటోసిస్ పబ్లికేషన్ పేరిట పరిశోధన పత్రాలను ఉచితంగా ప్రచురించే ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని వివరాలు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా 2018లో రూబటోసిస్ ఇన్నోవేషన్‌ను ప్రారంభించాం. వైద్యు లు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్, ఫ్రొఫెసర్లు, స్టూడెంట్స్ ఎవరైనా సరే ఉచితంగా పరిశోధన పత్రాలు, సర్వే గుర్తింపులు, రివ్యూలు, ఆర్టికల్స్, కేస్ నివేదికలను ప్రచురణ చేసుకునే వీలు కల్పించడమే రూబటోసిస్ పబ్లికేషన్ ప్రత్యేకత. 50 జర్నల్స్ ప్రచురణ.. మెడికల్, ఫార్మాసూటికల్, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో 50 వరకు జర్నల్స్ పబ్లిష్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ (ఐఎస్బీఎన్), ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సీరియల్ నంబర్ (ఐఎస్ఎస్ఎన్), క్రాస్‌రెఫ్ మెంబర్షిప్ అనుమతి పొందినవే. త్వరలోనే పబ్మెడ్, మెడ్లైన్, థామస్ రూటర్ అనుమతి కూడా తీసుకోనున్నాం. ప్రతి ఒక్క ప్రచురణ ఓపెన్ యాక్సెస్ విధానంలో పబ్లిష్ అవుతుంది గనక ఎప్పుడైనా, ఎక్కడైనా మన ఆర్టికల్స్‌ను చదువుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రివ్యూ చేశాకే పబ్లిష్.. జర్నల్స్ పబ్లిష్ చేయబోయే ముందు నాణ్యత పరీక్షల నిమిత్తం 2 రకాలుగా రివ్యూలు చేపిస్తాం. ఒక్క జర్నల్ రివ్యూ కోసం 12–13 ప్రొఫెసర్లతో ఒప్పందం చేసుకున్నాం. టర్నిటిన్, ఐథెంటికేట్ సాఫ్ట్వేర్లతో కంటెంట్‌ను చెక్ చేస్తాం. దీంతో కంటెంట్‌ను కాపీ చేశారా? ఏ రచయిత నుంచి తీసుకున్నారు? వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. త్వరలోనే అకౌంటింగ్, మానవ వనరులు, సేల్స్ అండ్ మార్కెటింగ్, సర్జికల్స్ విభాగాల్లో మరొక 50 జర్నల్స్‌ను ప్రచురణ చేయనున్నాం. సమావేశాలతో ఆదాయం.. కంపెనీ ఆదాయ వనరుల కోసం లైవ్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుంటాం. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 2 సమావేశాలు నిర్వహించాం. నలుగురు వక్తలు, ఇద్దరు చైర్‌పర్సన్స్, 40 మంది డెలిగేట్స్ పాల్గొనే వేదికను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం రూ.50 వేలు చార్జీ చేస్తుంటాం. విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకొని అక్కడ కూడా కాన్ఫరెన్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది కాలంలో ఇండియాలో 10, విదేశాల్లో 10 సమావేశాలను లక్షి్యంచాం. ఒక్కదానికి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. రూ. 30 లక్షల సమీకరణ.. ఒక అంశానికి సంబంధించి అన్ని పాఠ్యాంశాలను సమగ్రంగా పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు పుస్తకాలను కూడా ప్రచురిస్తుంటాం. ఇప్పటివరకు ఫార్మాసూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఓరల్ అండ్ మ్యాక్సోఫేసియల్ సర్జరీ, ఎక్స్పరిమెంటల్ సిన్ ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్ పుస్తకాలను ప్రచురించాం. త్వరలోనే మరొక 10 పుస్తకాలు మార్కెట్లోకి రానున్నాయి. ప్రస్తుతం మా కంపెనీలో 42 మంది ఉద్యోగులున్నారు. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రూ.30 లక్షల నిధులను సమీకరించనున్నామని విష్ణు వర్ధన్ తెలిపారు. -
‘ఫీజు’లపై ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఫీజు గండం వచ్చిపడింది. ప్రభు త్వం నిధులు విడుదల ఉత్తర్వులిస్తున్నా, సంక్షేమశాఖలు కేటగిరీలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బిల్లులను ఖజానాశాఖకు పంపుతున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం వాటిని ఆమోదించకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారు. వేతనాలు, డైట్ చార్జీలు మినహా మిగతా బిల్లులను అట్టిపెట్టుకుంటున్నారు. దీంతో 2017–18 విద్యా సంవత్సరం ముగిసి విద్యార్థులు కాలేజీలను వీడినప్పటికీ ఫీజు చెల్లించని కారణంగా వారి ధ్రువ పత్రాలను యాజమాన్యాలు ఇవ్వడంలేదు. 2017– 18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.04 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ 2018 ఫిబ్రవరి రెండో వారం వరకు కొనసాగింది. వాటి పరిశీలన గతేడాది జూన్‌లో ప్రారంభమై డిసెంబర్ వరకూ కొనసాగింది. ఈ క్రమంలో పూర్తయిన దరఖాస్తుల బిల్లులను సంక్షేమశాఖల అధికారులు ఖజానాశాఖకు సమర్పిస్తూ వచ్చారు. కానీ ఖజానాశాఖలో ఆ బిల్లుల ఆమోదం ప్రహసనంగా మారింది. పలు రకాల ఆంక్షలను పేర్కొంటూ ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతన బిల్లులను అటకెక్కిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉద్యోగుల వేతనాలు, డైట్ చార్జీల బిల్లులు మినహా మిగతా చెల్లింపులు జరగలేదు. జనవరి రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో మరోమారు చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉద్యోగుల వేతన బిల్లులనే ఆమోదిస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా ఫీజుల చెల్లింపు నిలిచిపోయింది. 2017–18 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు- రూ.13,04,431 ఉపకార వేతనాలు, ఫీజులకు అవసరమైన నిధులు- రూ.2,315 కోట్లు ఇప్పటివరకు విద్యార్థులకు విడుదల చేసినవి- రూ.1,075 కోట్లు బకాయిలు రూ. 1,240 కోట్లు ప్రస్తుతం 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖాధికారులు ఖజనాశాఖకు పంపిస్తున్నారు. ఇప్పటివరకు మెజారిటీ విద్యార్థులకు ఫీజులు మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులు, ఉపకార వేతనాల కింద రూ. 2,315 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ. 1,075 కోట్లకు సంబంధించిన బిల్లలనే ఖజానాశాఖ ఆమోదించడంతో ఆ మేరకు విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. ఇంకా రూ. 1,240 కోట్ల మేర విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన బిల్లులు ఖజానాశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఖజానాశాఖపై ఆంక్షలు తొలగితే తప్ప వాటి విడుదల సులభతరం కాదని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు... కేటగిరీ ఫ్రెషర్స్ రెన్యువల్స్ మొత్తం ఎస్సీ 98,180 1,31,706 2,29,886 ఎస్టీ 55,829 76,215 1,32,044 బీసీ 3,05,215 4,17,462 7,22,677 డిజేబుల్ 84 117 201 ఈబీసీ 26,933 58,913 85,846 మైనారిటీ 65,700 68,077 1,33,777 ఈ ఏడాది విద్యార్థులకు చెల్లింపులు కష్టమే...! ప్రస్తుతం 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గతేడాది అక్టొబర్ నాటికే దరఖాస్తుల గడువు ముగియగా అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో తొలుత డిసెంబర్ 31 వరకు, ఆ తర్వాత జనవరి నెలాఖరు వరకు గడువు పొడిగించిన అధికారులు... విద్యార్థి సంఘాలు, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఈ నెలాఖరు వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఫ్రెషర్స్ 5.81 లక్షలు, రెన్యువల్ విద్యార్థులు 7.18 లక్షల మంది ఉన్నారు. సంక్షేమశాఖలు ఒక పక్క దరఖాస్తులు స్వీకరిస్తూనే మరోపక్క వాటి పరిశీలన ప్రారంభించాయి. ఇప్పటివరకు లక్ష మంది విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 70 వేల వరకు మంజూరు చేశారు. అయితే 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో 2018–19 చెల్లింపులను ఇప్పట్లో చేసే అవకాశం కనిపించడం లేదు. 2018–19 విద్యా సంవత్సరం దరఖాస్తులు (ఇప్పటివరకు)... కేటగిరీ దరఖాస్తులు ఎస్సీ 2,32,442 ఎస్టీ 1,30,749 బీసీ 7,17,246 డిజేబుల్ 227 ఈబీసీ 83,464 మైనారిటీ 1,36,498 నిధులు విడుదల చేయాలి... ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నెలవారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. నెలనెలా నిధులిస్తే చెల్లింపులు సులభతరమయ్యేవి. కానీ మొదట్లో ఇచ్చినా ఆ తర్వాత చెల్లింపుల ప్రక్రియ గాడితప్పింది. ఖజానశాఖపై ఆంక్షలు పెట్టడంతో బిల్లులను ఆమోదించట్లేదు. ఫలితంగా సిబ్బంది వేతనాల చెల్లింపు, కాలేజీల నిర్వహణ యాజమాన్యాలకు భారంగా మారింది. అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇకనైనా నెలవారీ నిబంధన ప్రకారం నిధులు విడుదల చేయాలి. – గౌరి సతీశ్, తెలంగాణ కళాశాలల యాజమాన్యాల జేఏసీ కన్వీనర్ -
ఉపకారం... ‘సెట్’ చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తోంది. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకుగాను విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా దరఖాస్తు చేసే క్రమంలో వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి వస్తోంది. కోర్సు చదివినన్ని సంవత్సరాలు ఇలా ప్రతిసారీ వివరాల నమోదు ఇబ్బందికరంగా మారుతోంది. పైగా నమోదు క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే వారి ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈక్రమంలో దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎస్సీ అభివృద్ధిశాఖ కసరత్తు చేస్తోంది. ఇకపై సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఆధారంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దరఖాస్తు చేసే ప్రక్రియలో కేవలం సెట్ హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసిన వెంటనే విద్యార్థి వివరాలు పేజీలో ప్రత్యక్షమవుతాయి. ఇందులో కోర్సు, కాలేజీ తదితర వివరాలను ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేసిన వెంటనే దరఖాస్తు కాలేజీ యూజర్ ఐడీకి చేరుతుంది. అన్ని డిగ్రీ, పీజీ కోర్సులకు.. ఇంటర్మీడియెట్ మినహాయిస్తే డిగ్రీ విద్యార్థులకు దోస్త్, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ టెస్టుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సెట్‌కు దరఖాస్తు చేసుకున్న వివరాలను ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ఫారంలో ప్రత్యక్షమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు దోస్త్, సెట్ల వెబ్సైట్లను ఈపాస్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఈమేరకు సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) అధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ సంప్రదింపులు చేస్తోంది. ఈపాస్ వెబ్‌సైట్‌తో వివిధ సెట్ల వెబ్‌పేజీలను అనుసంధానం చేస్తే సర్వర్, సాంకేతికత సమస్యలు కూడా తీరుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చించిన అధికారులు వచ్చే విద్యా ఏడాది నుంచి కొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు పి.కరుణాకర్ సాక్షితో అన్నారు. -
ఉపకార వేతనాలు రావట్లే..
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల పిల్లల చదువుల కోసం మంజూరు చేసే ఉపకార వేతనాలు నిలిచి ఏళ్లు గడుస్తున్నాయి. అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాల కింద 2014లో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఆ తర్వాత ఈ మంజూరు ప్రక్రియ నిలవడంతో పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత కరువైంది. ఇటు మహిళల పొదుపును ప్రోత్సహిస్తూనే..వారి పిల్లల చదువులకు పోత్సాహకం అందించే ఉద్దేశంతో ఈ పథకాలు గతంలో అమలైనప్పటికీ..ఇప్పుడు పట్టింపు కరువైంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారులను ఎంపిక చేసినా.. ఆ తర్వాత రెండేళ్లుగా అసలు ఊసే లేదు. అభయహస్తం, ఆమ్ఆద్మీ బీమా యోజన పథకాలకు నగదు చెల్లిస్తున్న మహిళల పిల్లలకు లబ్ధి కలగట్లేదు. 2014–15 ఏడాదికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.1,200 అందజేశారు. ఆ తర్వాతి ఏడాది జాబితా రూపొందించినా స్కాలర్షిప్లు మాత్రం రాలేదు. 2015–16 ఏడాదిలో అభయహస్తం, ఆమ్‌ఆద్మీయోజన పథకాలకు సంబంధించిన స్కాలర్షిప్లు 18,943 మంది విద్యార్థులకు రావాల్సి ఉంది. అయితే 2014–15 అభయహస్తం, ఆమ్‌ఆద్మీయోజన పథకం కింద 23,698 మంది విద్యార్థులకు రూ.2,84,36,400 ఉపకార వేతనాలు అందించారు. మరో 1,200 మందికి రావాల్సి ఉంది. 2014–15, 2015–16 సంవత్సరాలకు గాను 20,143 మందిని ఉపకార వేతనాలకు అర్హులుగా అధికారులు గుర్తించారు. విద్యార్థుల డాటాను సైతం అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. వీరికి కూడా ఒక్కో విద్యార్థికి రూ.1,200 చొప్పున ఉపకార వేతనం రావాలి. మొత్తం రూ.2,41,71,600 అందించాల్సి ఉంది. ఆర్థికంగా వెనుకబడి మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి పొదుపు చేసుకుంటున్న సభ్యుల పిల్లలు చదువుకునేందుకు ప్రకటించిన ఉపకార వేతనాలపై ప్రభుత్వం ఊసెత్తకపోవడంతో సభ్యుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 2016–17, 2017–18లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను కూడా చేపట్టలేదు. ఉపకార వేతనాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయలేదు. దీంతో అభయహస్తం, ఆమ్ఆద్మీబీమా యోజన పథకంలో నగదు చెల్లిస్తున్న మహిళా సభ్యులు అసలు ఉపకార వేతనాలు ఇస్తారా..? ఇవ్వరా..? అనేది అర్థంగాక అయోమయానికి గురవుతున్నారు. అయితే..ఈసారైనా ప్రభుత్వం తమ పిల్లల చదువులకు సాయం చేస్తుందని మహిళా సంఘాలు ఆశిస్తున్నాయి. పథకాల లబ్ధిని అందించకపోతే కనీసం తాము చెల్లించిన నగదు అయినా తిరిగి ఇస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉంటామనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సర్కారు ఏమైనా మార్గదర్శకాలు జారీ చేస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. -
దరఖాస్తు చేసుకోలె!
కరీంనగర్‌ఎడ్యుకేషన్: విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. అధికారుల అవగాహనలేమి.. పట్టింపులేనితనంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 13 ఇంజినీరింగ్ కళాశాలలు, 109 డిగ్రీ కళాశాలలు, 6 ఫార్మసీ, 9 పాలిటెక్నిక్, 8 బీఈడీ కళాశాలలు, 56 ప్రైవేట్ కళాశాలలున్నాయి. ఫీజురీయింబర్‌మెంట్ ఫ్రెష్, రినివల్ చేసుకోవాల్సిన విద్యార్థులు 42,666 మంది ఉన్నట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, ఇంటర్మీడియట్ శాఖల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏటా రెన్యూవల్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా చేరిన విద్యార్థులు సైతం రీయింబర్స్‌మెంట్‌కు అర్హులే. అయితే సాంకేతిక సమస్య..అవగాహన కల్పించాల్సిన కళాశాల యాజమాన్య, సంక్షేమాధికారుల వైఫల్యం వెరసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు వేలాదిమంది కనీసం దరఖాస్తుకు నోచుకోవడంలేదు. ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇచ్చినా.. దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లాలో గతంతో పోల్చితే దాదాపు 22 వేల మందికిపైగా విద్యార్థులు ఈసారి స్కాలర్షిప్ దరఖాస్తు చేయకపోవడం విశేషం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఏటా ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం గడువు విధిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గడువు వచ్చేనెల 30తో ముగియనుంది. దాదాపు మూడు నెలల నుంచి దరఖాస్తు చేసుకునేందుకుగడువు ఉన్నా.. జిల్లాలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్ దరఖాస్తులు చేసుకోలేకపోయారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది దాదాపు 22 వేల మందికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు దూరంగా ఉన్నారు. దరఖాస్తు చేసుకోకపోవడానికి అవగాహన కల్పించడంలో ఆయా కళాశాలల యాజమాన్యం, సంబంధిత సంక్షేమ శాఖలు, ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముందుగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, ఆ కాపీని ప్రింట్అవుట్ తీసి కళాశాల్లో అందించాల్సి ఉంటుంది. ఆ వివరాలను కళాశాలలు తమ లాగిన్ ద్వారా సంబంధిత సంక్షేమశాఖ కార్యాలయాలకు ఆన్లైన్ ద్వారా పంపిస్తాయి. తిరిగి హార్డ్‌కాపీలను కూడా కార్యాలయానికి పంపిస్తాయి. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని నిబంధన పెట్టినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. విద్యార్థులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినప్పటికీ.. సర్వర్ సమస్యతో అప్లోడ్ కాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. వీటితో పాటు తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది అరకొరగా ఉండడం, ఉన్న సిబ్బంది ఎన్ని కల ప్రక్రియ షెడ్యూల్‌తో పాటు ఇతరత్రా కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో అనుకున్న సమయానికి «విద్యార్థులకు ధృవపత్రాలు అందించలేకపోతున్నారు. సర్టిఫికెట్లు పొందడంలోనూ ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో తాత్సారం, బ్యాంక్ ఖాతాలు తెరవడంలో సమస్యలతో నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇదిలా ఉంటే విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకునేట్లు చేయడంలో ఆయా కళాశాలల యాజమాన్యాలు, సంక్షేమ శాఖల వైఫల్యం కూడా కనిపిస్తోంది. సాంకేతిక సమస్యలు పోను ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించలేకపోయారనే ఆరోపణలున్నాయి. సాంకేతిక శా పం, అవగాహన కల్పించడంలో వైఫల్యం తో మొత్తానికి వేలాది విద్యార్థులు కనీసం దరఖాస్తుకు కూడా నోచుకోని దుస్థితి ఏర్పడింది. వచ్చేనెల 30 వరకు గడువు.. ప్రభుత్వం మూడోసారి స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగించింది. వచ్చేనెల 30 వరకు ఫ్రెష్, రినివల్కు సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకొని హార్డ్‌కాపీలు కళాశాలలో అందజేయాలి. ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి 2018–19 సంవత్సరానికి గాను 8,491 మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. 6422 మంది విద్యార్థులు స్కాలర్షిప్కు ఇంత వరకు దరఖాస్తు చేసుకోలేదు. గడువుముగిసేలోగా దరఖాస్తులు అందజేయకుంటే ఆయా కళాశాలలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
భారతీయ మహిళలకు రూ.9.4 కోట్ల స్కాలర్షిప్
లండన్: బ్రిటన్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం(స్టెమ్) సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేయాలనుకునే భారతీయ మహిళలకు రూ.9.49 కోట్ల(మిలియన్ పౌండ్లు) స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ తెలిపింది. ఈ మొత్తాన్ని బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో 2019–20 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ కోర్సులో చేరే 70 మంది భారతీయ మహిళలకు ఇస్తామని వెల్లడించింది. 2018–19 విద్యా సంవత్సరంలో స్టెమ్స్ కోర్సుల్లో చేరిన 104 మంది భారతీయ మహిళలకు స్కాలర్షిప్లు ఇచ్చామని కౌన్సిల్ భారత డైరెక్టర్ అలెన్ గెమ్మెల్ తెలిపారు. వీరంతా ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్న 43 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాయాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారని వెల్లడించారు. బ్రిటన్‌లోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా 2019, జనవరి 30 నాటికి సీటు పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతేడాది స్టెమ్ కోర్సులు పూర్తిచేసిన భారతీయ యువతుల్లో 50 శాతం కంటే ఎక్కువమంది భారత్‌లోని టైర్–2, టైర్–3 నగరాల నుంచే ఉన్నారని తెలిపారు. గతేడాది దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నతవిద్య కోసం బ్రిటన్ వర్సిటీల్లో చేరారు. బ్రిటన్ సైన్యంలో భారతీయులు.. త్రివిధ బలగాల్లో సిబ్బంది కొరతకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, కెన్యా సహా 53 కామన్వెల్త్ దేశాలకు చెందిన యువతను సైన్యంలో చేర్చుకునేందుకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం బ్రిటన్‌లో ఐదేళ్ల పాటు స్థిరనివాసం ఉండాలన్న నిబంధనను తొలగించనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ త్రివిధ దళాల్లో 8,200 మంది సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ దేశాల నుంచి ఈ ఏడాది 1,350 మందిని విధుల్లోకి తీసుకునేలా రూపొందించిన ప్రతిపాదనను రక్షణశాఖ పార్లమెంటుకు సమర్పించింది. బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాల్లో చేరేందుకు యువతులకు అవకాశం ఇస్తున్నారు. బ్రిటన్ సైన్యంలో పనిచేసేందుకు నేపాల్ గుర్ఖాలకు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. -
గజిబిజి.. గందరగోళం
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతన పరీక్షలకు హాజరైన విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో చోటు చేసుకున్న ఘటనలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో ఆదివారం 53 పరీక్షా కేంద్రాల్లో జరిగిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్‌ఎంఎస్‌ఎస్), జాతీయ ప్రతిభాన్వేషణ (ఎన్టీఎస్ఈ) పరీక్షలకు 11,020 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం 31 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసిన 6,835 మంది విద్యార్థుల్లో 6,682 మంది హాజరయ్యారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ఎన్టీఎస్ పరీక్షకు గుంటూరు నగర పరిధిలో 22 పరీక్షా కేంద్రాల పరిధిలో 4,559 మంది విద్యార్థులకు గానూ 4338 మంది హాజరయ్యారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు తెలుగు పేపర్! గుంటూరు నగర పరిధిలోని రెండు పరీక్షా కేంద్రాల్లో చోటు చేసుకున్న ఘటనలతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పాత గుంటూరులోని యాదవ ఉన్నత పాఠశాలలో ఉదయం జరిగిన ఎన్టీఎస్ పేపర్–1 పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంకు బదులుగా తెలుగు మీడియం పేపర్ ఇవ్వడంతో ఆందోళనకు గురయ్యారు. ఎన్టీఎస్ పరీక్షను ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించడంతో ఓఎంఆర్, క్వశ్చన్ పేపర్ బండిల్ వేర్వేరుగా ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. దీంతో విషయాన్ని ఇన్విజిలేటర్ ద్వారా తెలుసుకున్న చీఫ్ సూపరింటెండెంట్ డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న డీఈవో ఆర్ఎస్ గంగా భవానీ పాఠశాలకు వచ్చి విచారించారు. ఈ లోగా పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రం తప్పుగా ఇచ్చారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గుంటూరులోని ఒక కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థులతో ఎన్టీఎస్ పరీక్షకు దరఖాస్తు చేసే సమయంలో ఇంగ్లిష్ మీడియంకు బదులుగా తెలుగు మీడియంను నమోదు చేయడంతో అందుకు అనుగుణంగానే ప్రశ్నాపత్రం వచ్చిం దని, ఇందుకు విద్యాశాఖ తప్పిదం లేదని డీఈవో గంగా భవానీ తేల్చిచెప్పారు. కాగా విద్యార్థులు నష్టపోతున్నారనే కోణంలో ఈ విషయాన్ని ప్రభు త్వ పరీక్షల విభాగ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించడంతో విద్యార్థులు యథావిధిగా పరీక్ష రాశారు. అదే విధంగా సంగడిగుంటలోని చలమయ్య హైస్కూల్లో ఓఎంఆర్ షీట్‌తో సంబంధం లేకుండా వేర్వేరు కోడ్లతో ఉన్న ప్రశ్నాపత్రాలు ఇచ్చిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో జరిగిన పొరపాటును గుర్తించిన నిర్వాహకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్‌పైన ప్రశ్నాపత్రం కోడ్ నమోదు చేసి పరీక్ష రాయించాలని డీఈవో సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. జరిగిన సంఘటనపై డీఈవో గంగా భవానీ ఆదేశాలతో ప్రభుత్వ పరీక్షల విభాగ జిల్లా సహాయ కమిషనర్ మాణిక్యాంబ చలమయ్య హైస్కూల్‌కు వెళ్లి విచారించారు. ఎన్టీఎస్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు చేసిన తప్పిదాలతో ఇటువంటి సమస్యలు చోటు చేసుకున్నాయని డీఈవో గంగా భవానీ తెలియజేశారు. -
భారతీయ విద్యార్థులకు డేవిడ్సన్ ఫెలోషిప్
వాషింగ్టన్: సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భారత సంతతికి చెందిన విద్యార్థులు తమ సత్తా నిరూపిస్తున్నారు. తాజాగా ఆరుగురు విద్యార్థులు తమ ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక డేవిడ్సన్ ఫెలోస్ స్కాలర్షిప్– 2018 అందుకున్నారు. డేవిడ్సన్ ఇన్స్టిట్యూట్ అందించే ఈ స్కాలర్షిప్ ప్రపంచంలో 10 అతిపెద్ద స్కాలర్‌షిప్‌ల్లో ఏడోది. ఏటా సైన్స్, మేథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సంగీతం, సాహిత్యం, తత్వశాస్త్రం వంటి వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 18 ఏళ్లలోపు విద్యార్థులకు దీన్ని అందజేస్తారు. శుక్రవారం వాషింగ్టన్లో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా వ్యాప్తంగా ఈ స్కాలర్షిప్కు ఎంపికైన 20 మంది విద్యార్థులు నగదును అందుకున్నారు. ఆ ఆరుగురు వీరే.. వర్జీనియాకు చెందిన కావ్య కొప్పరపు (18) కేన్సర్ చికిత్సలో నూతన ఆవిష్కరణలు చేసింది. కనెక్టికట్‌కు చెందిన రాహుల్ సుబ్రమణియన్ (17) దోమల్లో వచ్చే మార్పులతో ఆధారంగా ముందుగానే జికా వైరస్‌ను అంచనా వేసి హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను అభివృద్ధి చేశాడు. వీరిద్దరు రూ.36.7 లక్షల చొప్పున నగదు అందుకున్నారు. న్యూజెర్సీకి చెందిన ఇషాన్ త్రిపాఠీ (16) కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ఇండోర్‌లో గాలి నాణ్యత పెంచి లక్షలాది మంది జీవితాలను వ్యాధుల నుంచి కాపాడాడు. అరిజోనాకు చెందిన సచిన్ కోనన్ (17) భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను వేగంగా గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేశాడు. కణాల గమనంలో మార్పు వల్లే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నిరూపించిన వర్జీనియాకు చెందిన మరిస్సా సుమతిపాల (18) వైద్యశాస్త్ర విభాగంలో స్కాలర్షిప్కు ఎంపికైంది. ఈ ముగ్గురికి రూ.18.3 లక్షల చొప్పున నగదు లభించింది. జన్యువులను మరింత మెరుగ్గా విశ్లేషించే వ్యవస్థను కనుగొన్నందుకు కాలిఫోర్నియాకు చెందిన రాజీవ్ మువ్వా (18) రూ.7లక్షలు అందుకున్నాడు. -
స్కాలర్షిప్ దరఖాస్తులకు బ్రేక్!
శాతవాహనయూనివర్సిటీ: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు 2018–19 విద్యాసంవత్సరంలో కొత్తగా ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కానీ.. దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయిస్తే సంబంధిత కళాశాలలు, కోర్సుల వివరాలు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కారణమేం టని కళాశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే.. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్ అధికా రుల చేతుల్లో ఉంటుందని చెబుతున్నారు. ఈనెల 30తో కొత్త దరఖాస్తుల గడువు ముగుస్తుండడంతో విద్యార్థులు కలవరపడుతున్నారు. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెలాఖరున ముగియనుంది. కానీ.. నేటికీ కొత్తగా కోర్సుల్లో చేరిన డిగ్రీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ ఈ–పాస్‌లో కళాశాలల వివరాలు లేకపోవడంతో సాధ్యపడడం లేదు. ఏటా యూనివర్సి టీ అధికారులు అనుబంధ హోదా పక్రియ ముగి సిన తర్వాత హోదా దక్కిన కళాశాలల వివరాల ను ఈ–పాస్‌కు అనుసంధానం చేయాల్సి ఉం టుంది. అయితే నేటికీ ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తలపట్టుకుంటున్నారు. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్ అధికారులు ఈ విషయంలో జా ప్యం వీడి వెంటనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోనేలా వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని విద్యార్థులు, వి ద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యమవుతున్న పక్రియ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకున్న వారు ఉపకారవేతనాల దరఖాస్తుకు సిద్ధమయ్యారు. ఆ ప్రక్రియ ప్రారంభమై దాదాపు 70 రోజులు గడిచినా ఇంతవరకు దరఖాస్తు చేసుకోనే వీలులేకపోవడంతో ప్రతిరోజూ ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ల డం.. నిరాశతో తిరిగి రావడం విద్యార్థుల వంతవుతోంది. కొందరు విద్యార్థులు ఆయా కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తే.. యూనివర్సిటీ, ఈ పాస్ అధికారుల చేతులో ఉంటుందని సర్దిచెబుతూ వస్తున్నారు. కానీ అసలు విషయం మరో లా ఉంది. శాతవాహన యూనివర్సిటీ అధికారులకే ఈపాస్‌కు సంబంధించిన లాగిన్ సమాచారం లేకపోవడంతోనే కళాశాలల వివరాలు అనుసంధానం కాలేదని సమాచారం. కేవలం శాతవాహనకే కాకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉన్నట్లు సమాచారం. ఈ పాస్ అధికారులు యూనివర్సిటీ అధికారులకు కావాల్సిన లాగిన్ సమాచారమిస్తేనే కళాశాలల వివరాలు ఈ–పాస్‌లో నమోదయ్యే అవకాశముంటుంది. తర్వాత యథావిధిగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. అనుసంధానం పూర్తయ్యేదెన్నడో...! ఉపకార వేతనాల దరఖాస్తులు ప్రారంభం రోజులు గడుస్తున్నా నేటికీ అవకాశం లేకపోవడంతో డిగ్రీ మొదటి సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపాస్ అధికారులు యూనివర్సిటీ అధికారులకు అనుసంధానికి కావాల్సిన సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ జాప్యానికి కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు. అనుబంధ హోదా ప్రకటించిన తర్వాత ఆయా కళాశాలలు, కోర్సుల వివరాలను యూనివర్సిటీ అధికారులు అనుసంధానం చేస్తేనే విద్యార్థులకు దరఖాస్తులు చేసుకునే అవకాశముంటుంది. గడువు ఈనెల 30 వరకు ఉందిగానీ శాతవాహన అధికారులకే లాగిన్ సమాచారం లేకపోవడంతో అనుసంధానం ఆలస్యమవడం ఖాయమని తెలుస్తోంది. కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ–పాస్ అధికారులు, యూనివర్సిటీలకు లాగిన్ సమాచారమందిస్తాయని, అనంతరం అనుసంధాన ప్రక్రియ జరుగుతుందని, అప్పటి వరకు విద్యార్థులు వేచిచూడక తప్పదని అధికారవర్గాల ద్వారా సమాచారం. ఈ–పాస్ అధికారులు సత్వరమే స్పందించి దరఖాస్తుల ప్రక్రియలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మేలు చేకూర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. లాగిన్ సమాచారం రాలేదు... ఈ ఏడాది డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నవారికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఈ పాస్ అధికారుల నుంచి శాతవాహనకు లాగిన్ సమాచారం రాలేదు. కళాశాలల సమాచారం అనుసం«ధానం చేయలేదు. శాతవాహనతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉంది. కాకతీయ, శాతవాహన పరిధిలోని పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అయిన తర్వాత లాగిన్ సమాచారం వచ్చి అనుసంధానం చేసే అవకాశాలుంటాయి. – ఉమేష్‌కుమార్, శాతవాహన రిజిస్ట్రార్ -
పచ్చనేతలు పోట్లూరు స్కూల్ ప్లేగ్రౌండ్ కబ్జా
-
విద్యార్థుల చాకచక్యం.. తప్పిన ప్రమాదం
టెక్సాస్: ముగ్గురు విద్యార్థులు సమయస్పూర్తితో వ్యవహరించటంతో తమతో పాటు తోటి విద్యార్థులను పెను ప్రమాదం నుంచి కాపాడగలిగారు. ఈ ఘటన అమెరికాలోని ఆగ్నేయ టెక్సాస్‌లో చోటుచేసుకుంది. సాయంత్రం స్కూల్ పూర్తయ్యాక బస్స్ డ్రైవర్ విద్యార్తులను ఎక్కించుకొని బయలుదేరాడు. స్కూల్ నుంచి బస్సు కొద్ది దూరం ప్రయాణించాక డ్రైవర్ అపస్మారకస్థితిలో ఉండటాన్ని గమనించిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో ముగ్గురు విద్యార్థులు మిగతావారిలా ఆందోళన చెందకుండా చాకచక్యంగా బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు ఆపారు. అనంతరం విద్యార్థులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కాపాడలేకపోయారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల సాహసాన్ని అభినందించారు. -
సాయి సంస్కృత పండితుడా?
ఎవరికైనా కొంత పాండిత్యం పట్టుబడితే చాలు తమ పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఎవర్ని నలుగుర్లోనూ కించపరుద్దామా? అనే దృష్టితో ఎక్కువ మంది కనిపిస్తారు. కొందరైతే అప్పటికప్పుడు అవతలివారి తక్కువదనాన్ని గుర్తించి మనసులో ఒక అంచనాకి వచ్చి మౌనంగా ఉంటారు. ఇక కొందరైతే చాటుగా వేళాకోళం చేస్తూ కనిపిస్తారు. సాయిది మాత్రం మరొకర్ని తక్కువ చేసే లక్షణం కానే కాదు. అవతలి వ్యక్తికి తన స్థాయి స్పష్టంగా తనకే అర్థమయ్యేలా, నొప్పించకుండా అర్థమయ్యేలా చేయడం సాయి ప్రత్యేకత. ఉదాహరణతో గమనిద్దాం! దీని అర్థం ఇదేనా? నానా(నానాసాహెబ్ ఛాందోర్కర్) సాయికి మంచి భక్తుడు. నిరంతరం సాయి సేవలోనే ఉంటూ ఉండేవాడు. ఓ రోజున ఎప్పటిలాగానే సాయి పాదాలని చేతులతో ఒత్తుతూ తనకి బాగా ఇష్టమైన భగవద్గీత శ్లోకాలని లోలోపల కూనిరాగంలాగా తీస్తూ పాడుకోవడం మొదలుపెట్టాడు. జ్ఞానసంన్యాసయోగమని ఓ యోగముంది భగవద్గీతలో. దానిలోని 34వ శ్లోకాన్ని నానా చిన్నగొంతుతో పాడటం మొదలెట్టాడు ఓ పక్క సాయి పాదాలని ఒత్తుతూ. సాయి వెంటనే.. నానా! శ్లోకాన్ని చాలా బాగా పాడుతున్నావు గానీ, లోలోపల గొణుగుతూ చదవడమెందుకు? పైకే పాడు ఆ శ్లోకాన్ని నేనూ వింటాను అన్నాడు. నానాకి మరింత సంతోషమైంది. శ్రావ్యంగానూ కొంత పెద్ద గొంతుతోనూ స్పష్టంగా పాడి విన్పించాడు నానా. ఆ శ్లోకం ఇదే. త ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా! ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః అనేది. అప్పుడు సాయి.. ‘‘నానా! ఈ శ్లోకానికి అర్థాన్ని ‘ప్రతి పదానికీ ఇది అర్థం’ అంటూ నాకు చెప్పవూ?’’ అని అడిగాడు.సాయికి సంస్కృతం రాదనీ, ఆ కారణంగా తానే దానికి అర్థాన్ని సాయి అంతటివానికి చెప్పే అవకాశాన్ని పొందగలిగాననీ నానా ఆనందపడుతూ అర్థాన్ని వివరించసాగాడు.‘ప్రణిపాతేన – సాష్టాంగ ప్రణామం చేతనూ, పరిప్రశ్నేన – ప్రశ్నించడం చేతనూ, సేవయా – సేవించడం చేతనూ, తే – నీకు, తత్త్వ దర్శినః – తత్త్వసాక్షాత్కారాన్ని పొందిన, జ్ఞానినః – జ్ఞానులు, జ్ఞానమ్ – జ్ఞానాన్ని, ఉపదేక్ష్యంతి – ఎంతో శ్రద్ధతో బోధిస్తూ నీకు అర్థమయ్యేలా చేస్తారు. తత్ – ఏ ప్రకారంగా ఆ జ్ఞానం బోధింపబడుతుందో దాన్ని, విద్ధి – శ్రద్ధతో గమనించి తెలుసుకో!ఓ గురువు నుంచి జ్ఞానాన్ని పొందాలంటే అది సాష్టాంగ ప్రణామం ద్వారా, ప్రశ్నించి తెలుసుకోవడం ద్వారా, ఆ గురువుకి సేవని చూస్తూ ఉండటం ద్వారా అది సాధ్యం. ఇంతకీ జ్ఞానాన్ని బోధించగల ఆ తత్త్వాన్ని తెలిసిన గురువు నుంచి పై పద్ధతుల్లో దేని ద్వారా ఆ జ్ఞానం లభిస్తుందో దాన్ని శ్రద్ధతో గమనించి తెలుసుకో! అనేది దానర్థం అని పరమ సంతృప్తిని పడుతూ చెప్పాడు నానా.ఇంతేకాదు. మళ్లీ సాయి ఈ చెప్పిందాన్ని మరోలా చేస్తూ చెప్పకుండానూ, అలాగే తన పాండిత్యపు లోతు సాయికి అర్థమయ్యేలాగానూ, పరమానందపడుతూ ఈ పై వ్యాఖ్యానానికి కొనసాగింపుగా ‘ఆనందగిరివ్యాఖ్యానం శంకరానంద శ్రీధర వ్యాఖ్యానం, శంకర భాష్యం, మధుసూదన వ్యాఖ్యా.. నీలకంఠ వ్యాఖ్యా.... కూడా ఈ విషయాన్నే చెప్పాయి’ అని నానా చెప్పి తన మాటలకి సాయి ప్రతిస్పందన ఏమిటో తెలుసుకునే ఉద్దేశంతో ఓ పక్క ధైర్యం, ఆత్మసంతృప్తితోనూ.. మరో పక్క అదో తీరు భయం, అధైర్యంతోనూ.. సాయి ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు నానా.ఇతర భక్తులంతా నానా సంస్కృత పండితుడైన కారణంగానూ, సాయికి సంస్కృత పాండిత్యమున్నట్లు ఏనాడూ విన్న– కన్నవారు లేని కారణంగానూ, సాయి ఏమంటాడోనని అలా చూస్తూ ఉండిపోయారు అటు నానానీ ఇటు సాయినీ. సాయి ప్రారంభించాడు. నానా! పై శ్లోకంలోని మూడవ పాదాన్ని ఒక్కసారి చూడు. ‘ఉపదేక్ష్యంతి తే జ్ఞానమ్’ అని కదా నువ్వు చదివింది. దానికి అర్థాన్ని వివరించినది కూడాను. సంస్కృత వ్యాకరణం ప్రకారం దీన్ని ‘తే+అజ్ఞానమ్’ అని కూడా విడదీయవచ్చు. (ఏజః పదాం తాదతి అనే సూత్రం ప్రకారం ఇది శాస్త్రం అంగీకరించిన సత్యమే) ఆ పద్ధతిలో మరి జ్ఞానులంతా అజ్ఞానాన్ని ఉపదేశిస్తారని అన్నామనుకో! ‘ఇలా చెప్పడం తప్పు!’ అని ఎలా అనగలవు? నేనేదో నిన్ను తగ్గించడానికో, ఏదో మెలిక పెట్టి అవమానించడానికో నీతో అంటున్న మాట కాదు. ఇలా ఎవరైనా నిన్నడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతావు? ఇది మొదటి సందేహం. రెండవది. కృష్ణుడు కదా గీతని ఉపదేశించాడు! ఆయన ఏమంటున్నాడని ఈ శ్లోకం చెప్తోంది? ‘తత్త్వాన్ని దర్శించిన జ్ఞానులు నీకు జ్ఞానం అంటే ఏమిటో ఆ విశేషాలని వివరిస్తారు’ అని కదా! అంటే మరి ఉపదేశిస్తూన్న కృష్ణుడు తత్త్వదర్శి కాడా? జ్ఞాని కాడా? ఆయనే మరి తత్త్వదర్శులయిన జ్ఞానుల దగ్గరికి వెళ్లాలని చెప్తూన్నవాడు అవుతుంటే ఇక ఈయన ఎందుకు గీతని అర్జునునికి బోధించాలి? పైగా ‘అన్నీ తెలిసినవాడ్ని నేనే’ (వేదాహం సమతీతాని..) అని ఆయనకాయనే భగవద్గీతలో చెప్పుకున్నాడు కదా! మరి ఆయనే ఫలానివాళ్లు తత్త్వదర్శులు, జ్ఞానులు అని చెప్పకూడదా?మరోమాట కూడా! ఆయనే భగవద్గీత చేస్తూ (భగవంతుడ్ని, అతని స్వరూపాన్ని గూర్చిన విశేషాలని గానం చేస్తూ) జ్ఞానమంటే ఏమిటో, విజ్ఞానమంటే ఏమిటో, ఏం తెలుసుకుంటే ఇక తెలియవలసిందంటూ ఏదీ ఉండదో.. దాన్ని తెలియజేస్తున్నాను (జ్ఞానం తేహం సవిజ్ఞానమ్.. అవశిష్వతే) అన్నాడో దీన్నంతటినీ ఆలోచిస్తూంటే తికమక అయిపోతోంది.అందరూ నోరెళ్లబెట్టి చూస్తుంటే, నానాకి నోటమాట రాకపోతూంటే సాయి చెప్పుకుపోతున్నాడు.నానా! ఇక చివరి అనుమానాన్ని విను. సాష్టాంగప్రణామం చేస్తే జ్ఞానం ఉపదేశింపబడుతుందా? మామూలు తేలికపదాన్ని వాడకుండా నమస్కారమనే అర్థంలో ‘ప్రణిపాతం’ అనేంత గట్టిపదాన్ని వాడాల్సి వచ్చిందట? అలాగే ప్రశ్నిస్తూ ఉంటే జ్ఞానం ఉపదేశింపబడుతుందా? అయినా ప్రశ్నించడం అనకుండా పరిప్రశ్న చేయడమనేంత గట్టిపదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? మరొక్కమాట... సేవ చేస్తే జ్ఞానాన్ని ఉపదేశిస్తారా? ఇదేంమాట? జ్ఞానమనేది అంత తేలికైనదా? అని ప్రశ్నార్థకంగా నానాని చూశాడు సాయి. మల్లయుద్ధంలో చిత్తుచిత్తుగా ఓడిపోయినవానిలా నానా అక్షరం కూడా మాట్లాడలేక, సాయిపాదాలు రెంటినీ గట్టిగా పట్టుకుని ‘సాయిదేవా! నువ్వు అనన్యసామాన్యుడివి. మహా ప్రతిభా సంపన్నుడివి. ఇన్ని మార్లు భగవద్గీతలోని ఈ అధ్యాయాన్ని చదివినా సమాధానాలు ఎలాగూ తెలియనే తెలియవు గానీ, కనీసం ఇలాంటి ప్రశ్నలు ఈ శ్లోకం చదివితే వస్తాయి, వచ్చేందుకు అవకాశముందనే విషయం కూడా తెలియని అజ్ఞానంతో ఉన్నాను. దయచేసి సమాధానాల్ని చెప్పి నాకు జ్ఞానబోధ చేయి తండ్రీ!’ అన్నాడు నానా.సాయి ప్రారంభించాడు. ‘‘ఏం లేదు నానా? ఆందోళన పడకు! జ్ఞానాన్ని సంపాదించాలంటే జ్ఞానపిపాసి అయిన వ్యక్తి సద్గురువుని ఏ తీరుగా ఆశ్రయించాలో చెప్పే శ్లోకం ఇది.ప్రణిపాతమనే మాటకి సాష్టాంగనమస్కారమనేది అర్థమే కావచ్చు గానీ ఒట్టిగా సాష్టాంగ ప్రణామాలవల్ల జ్ఞానం ఉపదేశింపబడదు. ప్రణిపాతమంటే ‘సర్వస్య శరణాగతి’ అని అర్థం. ఏనుగుకాస్తా చెరువులో దిగింది. మొసలి దాని ముందు రెండుపాదాలనీ పట్టింది. మొసలి నీటిలోనికీ, ఏనుగు ఒడ్డువైపుకీ లాగుకుంటూ ఒకర్ని మరొకరు గెలవాలని ప్రయత్నించారు. సాధ్యపడలేదు. అప్పుడు ఏనుగు – నీవే తప్ప ఇత్ః పరం బెరుగ..! ఓ! దైవమా! నన్ను రక్షింప సమర్థుడివి నువ్వే సుమా! అంటూ తన శరీర మనః ప్రాణ బుద్ధులతో శరణుకోరి ప్రార్థించింది. అదుగో అదీ ‘సర్వస్య శరణాగతిః’ అంటే. ద్రౌపది నిండు కౌరవసభలో వస్త్రాపహరణం జరగబోతున్న తరుణంలో సర్వస్యశరణాగతిధర్మంతో కృష్ణుడ్ని ప్రార్థించింది. ఇదే విధంగా సుగ్రీవుడు కూడా వాలితో యుద్ధానికి తలపడి పూర్తిగా ఓడిపోయి రాముణ్ని శరణువేడాడు. ఆ రాముడు వాలిని వధించాడంటే దానికి కారణం సుగ్రీవుని బలాధిక్యం కాదు. సుగ్రీవుడు చేసిన శరణాగతి ధర్మం మాత్రమే. కాబట్టి ప్రణిపాతమంటే.. శరణుకోరుతూ, తనని తాను రక్షించే వ్యక్తికి సమర్పించుకోవడమని అర్థమన్నమాట. ఇక ప్రశ్నించడమనే మాటకి.. ఎదుటివానికి విసుగొచ్చేంత స్థాయిలో ప్రశ్నించడమని అర్థం కాదు. ప్రశ్న అనకుండా ‘పరిప్రశ్న’ అనడమంటే వేదాంతానికి సంబంధించిన ప్రశ్న వేయడమని అర్థమన్నమాట! అంతే కాదు. కొందరు – ఎదుటివానికి ఎంత తెలుసు? అనే దుర్బుద్ధితో, అతనికి తెలిసిన దాన్ని కాదనిపించాలనే వంకర బుద్ధితో, ఏమేమో మోసంతో నిండిన ప్రమాణాలని చూపించి, నిజం కానిదానిని నమ్మింపజేసి, వారితో కూడిన సభలో వాళ్లని బహిరంగంగా ఓడించి, తాము గొప్పవారనిపించుకోవడం.. వంటి ఇలాంటివి సరికాదన్నమాట. శ్రద్ధతో, భక్తితో కేవలం విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో మాత్రమే ప్రశ్నించడం, అందునా లౌకికమైన ధోరణిలో కాకుండా వేదాంతానికి సంబంధించి ప్రశ్నించడమే ‘పరిప్రశ్న’. మూడవ పదం ‘సేవ’ అనే మాటకి అర్థం గురువుగారికి పాదాలొత్తడం, దూరం నుంచి నూతి నీళ్లు తోడి తేవడం, ఇంకా మూఢభక్తితో ఆయనకి ఒళ్లు తోమడం.. వంటివన్నీ జ్ఞానాన్ని పొందే మార్గాలు కానే కావు.9 విధాల భక్తి మార్గాలున్నాయి. స్నేహపూర్వకంగా ఉండే భక్తి సఖ్యభక్తి. దీనికి ఉదాహరణ అర్జునుడు. తన రథానికి సారథిగా ఉంచుకోవడమే కాక భక్తితో స్నేహాన్ని శ్రుతిమించకుండా చేశాడు. పరీక్షిన్మహారాజుకి పాము కాటు శాపం రాగానే శుకమహర్షి దగ్గర అధ్యాత్మ విద్యని నేర్చుకోవడం కోసం మోక్షతత్వాన్ని గురించి విన్నాడు. ఇది శ్రవణభక్తికి ఉదాహరణ. నిస్వార్థంగా దాస్యాన్ని చేసి రామునికి, సీతమ్మ జాడని చెప్పడమే కాక, రాముని మీద ప్రయోగించదలిచి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని దాచి ఉంచుకుంటే దాన్ని తనమీదే ప్రయోగించేలా చేసుకున్న ఆంజనేయుడు దాస్య భక్తికి ఉదాహరణ. శరీరంలోని పంచజ్ఞానేంద్రియాలతోనూ సంపూర్ణభక్తితో వందనం చేసి తరించిన అక్రూరుడు (భాగవతంలో) వందనభక్తికి ఉదాహరణ. సంవత్సరకాలం పాటు రాజ్యాన్ని విడిచి, భార్యతో కలిసి, ఓ మధువనంలో ఉంటూ రాజసౌఖ్యాలనీ, లాంఛనాలనీ విడిచి కృష్ణుడినే సేవించిన అంబరీషుడు అర్చన భక్తికి ఉదాహరణ. తన హృదయపూర్వకమైన సేవతో ఒక్క తులసిదళానికే తన భర్త కృష్ణుడు తూగిపోయేలా చేసుకుని విజేత్రి(గెలిచినది) అయిన రుక్మిణి సేవాభక్తికి ఉదాహరణ. విదురుడు, భీష్ముడూ మొదలైన పెద్దలు కృష్ణుడ్ని ఏనాడూ వ్యక్తిగా కాక ఎల్లప్పుడూ దైవంగానే ఆరాధిస్తూ తమ అంతఃకరణం నిండుగా దైవంగానే అనుకున్నారు. ఇది ఆత్మలో ఎరుక అంటే ఆత్మనివేదన భక్తికి ఉదాహరణ. నిరంతరం సంకీర్తన చేస్తూ తన భక్తిని చాటుకుని, విజయాన్ని సాధించిన నారదుడు సంకీర్తన భక్తికి ఉదాహరణ. తనకి ప్రాణాపాయం లేనే లేదనే ధైర్యంతో తన తండ్రి చంపదలచి, ప్రయత్నాలు చేస్తున్నా చలించని ప్రహ్లాదుడు చింతనమనే 9 వ భక్తికి ఉదాహరణ. అలా ఈ తీరు ఏదో ఒక భక్తిమార్గంలో సేవిస్తూ ఉండడం సేవ కిందికొస్తుంది తప్ప గురువుకి భౌతికంగా చేసే సేవ.. సేవాభక్తి కిందికి రాదు.సాయి ఇలా చెప్పేస్తూ ఉంటే.. సాయి ఇంతటి లోతు పాండిత్యాన్ని ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరి నుంచి గ్రహించాడు? అనే భావంతో అందరూ నిశ్చేష్టులై వింటూండిపోయారు. కేవలం అది ఆయన చేసిన మంత్రమననశక్తి మాత్రమే అనేది స్పష్టంగా అర్థం కాసాగింది అందరికీ. అప్పుడు సాయి మాట్లాడుతూ.. ఇంకొక్క విషయాన్ని చెప్పి ముగిస్తానంటూ జ్ఞానం గురించి చెప్పాడిలా.ఏ గురువూ ఏ శిష్యునికీ జ్ఞానాన్ని గురించి చెప్పడు. చెప్పలేడు కూడా. పంచదార అనేది తీపిగా ఉంటుందని చెప్తే తెలియదు అలా వినడం ద్వారా. ఏవేవో గ్రంథాల్లో చదివితే అర్థమయ్యే విషయం కాదు. స్వయంగా దాన్ని తిన్నప్పుడే ఆ విషయం ఎవరూ చెప్పనంతగా, చెప్పలేనంతగా అర్థమవుతుంది. దీన్నే ఆది శంకరుల వారు అనుభూతి అన్నారు. ఏది ప్రత్యక్షంగా తెలియదో, గ్రంథాల ద్వారా అనుభవానికి రాదో, రాలేదో, వచ్చే వీలులేనిదో, ప్రత్యక్షం, పరోక్షం అనే రెండింటి ద్వారా కాక స్వయంగా అనుభవంలో మాత్రమే తెలిసేదో అదే అపరోక్ష అనుభూతి అవుతుందన్నమాట.సాయి ఇంతలోతుగా చెప్తుంటే కొందరికి ఈ వేదాంతం కొంతస్థాయిలోనే అర్థమవుతున్నా.. ఓ మహమ్మదీయునికి ఇంతటి వైదిక సంస్కారమా? అనుకున్నారు. పూర్తిగా తెలియకున్నా వినాలనే ఆసక్తి పెరుగుతూ వింటూనే ఉండిపోయారు.సాయి చెప్పసాగాడు. భగవద్గీతలో కృష్ణుడన్నాడు ‘అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః’ అని.అందరికీ ఉండేది అజ్ఞానమే. దాన్ని తొలగిస్తే చాలు జ్ఞానమంటే ఏమిటో తెలుస్తుంది.ఉదాహరణకి సూర్యుడ్ని, చంద్రుడ్ని రాహుకేతుగ్రహాలు గ్రహిస్తాయి. దాన్నే గ్రహణం తొలిగాక పూర్తిగా వారి ప్రకాశం మనకి సొంతమవుతుంది. గురువనే వారెవరు ఉన్నారో ఆయన మనకున్న ఆ అజ్ఞానాన్ని తొలగించడమనే పనిని మాత్రమే చేస్తాడు. అద్దం నిండా దుమ్ము, ధూళి, నూనె మరకలు వంటివి పడితే మనరూపం కన్పించకుండా పోతుంటే, దాన్ని ఎలా శుభ్రపరచాలో అలా శుభ్రం చేసిన రోజున మన రూపం ప్రతిబింబితమవుతుంది. ఆ దుమ్ము, ధూళి, నూనె మరకలు వంటివి అజ్ఞానంతో సమానం. దాన్ని తుడిచి శుభ్రపరిచినవాడు గురువు. అద్దానికున్న ప్రతిబింబించగలిగే గుణం జ్ఞానలక్షణం. ఇలా శుభ్ర పరుచుకోవాలనే విధానాన్ని తెలిపిన గురువు ద్వారా ఈ విషయాన్ని గ్రహించడం అనుభవంలోనికి తెచ్చుకుని, నిత్యం శుభ్రపరుచుకుంటూ ఉండటం ‘జ్ఞానం’. ‘తాడుని చూసి పామేమో అనుకుని భయపడతాం. తాడు గురించిన, పాముని గురించిన జ్ఞానం కలిగిన గురువు మనలో పాముని గురించిన అజ్ఞానపు ఆలోచనని తొలగించి తాడే సుమా! అనే జ్ఞానాన్ని కలిగిస్తే అతను గురువూ – అది జ్ఞానస్వరూపమూనూ. కాబట్టి మట్టిపట్టిన బంగారాన్ని ఎలా నిప్పులో వేసి కాల్చి నిజమైన మేలిమి బంగారపు ముద్దని పైకి తెచ్చి చూపిస్తారో అలా గురువు ఎప్పుడూ తన వద్దకొచ్చిన శిష్యుల అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానదర్శనాన్ని చేయించుతాడే తప్ప తాను కొత్తగా జ్ఞానమంటూ మరి దేన్నో బోధించడు. బోధించలేడు.’‘జ్ఞానమనేది ఎప్పుడూ ఉన్నదే. ఎక్కడా ఉండేదే. దాని మీద ఉన్న – మనకి అర్థం కాకుండా ఉన్న ఆ అడ్డునీ, అవరోధాన్నీ, ముసుగునీ తొలగిస్తే చాలు. జ్ఞానమనేది ఎవరికి వారికే తెలుస్తుంది. అర్థమవుతుంది. అనుభవంలో కన్పిస్తుంది అని ఈ శ్లోకం అర్థం’ అని ముగించాడు సాయి.నానాతో పాటు వింటున్న ఆ భక్తులంతా సాయి పాదాలని కౌగిలించుకున్నట్లుగా ఒకరి వెంట ఒకరు చుట్టేశారు. ఇప్పటివరకూ చూసిన సాయిని మరింత స్పష్టంగా, లోతుగా, అవగాహనతో చూశారు. సాయికున్న అత్యద్భుత యోగశక్తి, తపశ్శక్తి, మంత్రమననశక్తి కారణంగా సంస్కృత పండితుడైన, వ్యాఖ్యాన గ్రంథాలని ఔపోశనపట్టిన వాడైన నానాకి కూడా అర్థం కాలేదని తనకి తానే అంగీకరించేలా వ్యాఖ్యానించాడు సాయి అనుకున్నారు నానాతో సహా.నేడు మనం కూడా గ్రహించుకోవల్సింది ఒక్కటే. సాయికి ఇష్టమైన నైవేద్యాలు, సాయికి ఇష్టమైన ప్రదేశాలు, సాయికి ప్రీతికరమైన ఊదీ(విభూతి)ని ధరించడాలు మాత్రమే చేస్తూ.. సాయికి దగ్గరివాళ్లం అయిపోయామనుకోకూడదు. సాయిని గురించిన ఈ తత్త్వాన్ని తెలిపే చరిత్రలని చదివి, దాన్ని హృదయంలో ఉంచుకోగలగాలి. అప్పుడే సాయి మనకి అర్థమవుతాడు. మనకి అర్థం ఎక్కడైనా కాలేదన్నచోట తానే వచ్చి, మనకి అర్థమయ్యేలా తనని తాను వివరించుకుంటాడు. అందుచేత సాయి చేసిన ప్రతిపనీ, ప్రతిమాటా, ప్రతి సంఘటనా వెనుక ఎంతో అర్థం ఉంటుందన్నమాటే!‘మేకని కోసి చంపాల్సిందే!’ అని సాయి ఓ భక్తునికి ఆజ్ఞాపించాడు ఒకసారి. ఇదేమిటి? జీవహింసని చేయవలసిందని దైవసమానుడైన సాయి ఆజ్ఞాపించాడా? అందునా ఓ బ్రాహ్మణుడ్ని..? ఏమిటి అంతరార్థం? తెలుసుకుందాం అజ్ఞానాన్ని తొలగించుకుని..! – సశేషం -
నిమ్మకూరు: హరికృష్ణ చదివిన స్కూలు
-
బడిలో భయం భయం
ధర్మవరం: నియోజవకర్గంలో మొత్తం 244 ప్రభుత్వ పాఠశాలల్లో 22,492 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం పాఠశాలల భవనాల్లో 60 శాతం బడుల్లో తరగతి గదుల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, భయం భయంగానే పాఠాలు చెబుతున్నారని అధికారులు గుర్తించారు. పాఠశాల నిర్మాణాలపై చెత్తాచెదారం పేరుకపోవడం, వర్షపునీరు నిల్వ ఉండటం వల్ల నీరు గోడల్లోకి ఇంకి ఇనుము తుప్పు పట్టి పెచ్చులు లేశాయని చెబుతున్నారు. నియోజకవర్గంలో పరిస్థితి ఇలా..! ♦ తాడిమర్రి మండల పరిధిలోని తురకవారిపల్లి, నార్సింపల్లి ప్రాథమిక పాఠశాలల్లో మూడు గదులు, బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఒక గది, పుల్లానారాయణపల్లి పాఠశాలలో ఒక గది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ♦ ముదిగుబ్బ మండల కేంద్రంలో 4 పాఠశాలలతోపాటు గంగిరెడ్డిపల్లి, రాళ్లనంతపురం, సంకేపల్లి, ఒడ్డుకిందతాండా, రామస్వామి తాండా, నాగలగుబ్బల, యాకర్లకుంటపల్లి, బ్రహ్మదేవమర్రి, కోటిరెడ్డిపల్లి, కొండగట్టుపల్లి, ఎన్ఎస్పీ కొట్టాల, అడవి బ్రాహ్మణపల్లి తాండాల్లోని పాఠశాలల్లో తరగతి గదుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటికి తక్షణమే మరమ్మత్తులు చేయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ♦ ధర్మవరం పట్టణంలో 13, ధర్మవరం మండల పరిధిలో 8 పాఠశాలల్లో తరగతి గదుల పరిస్థితి అధ్వానంగా ఉందని, మరమ్మతులు చేయించాలని అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. ♦ బత్తలపల్లి మండలంలో ముద్దనపల్లి, వేల్పుమడుగు, పోట్లమర్రి వెంకటగారిపల్లి, మాల్యవంతం, ఎం.చెర్లోపల్లి, తంబాపురం, కోడేకండ్ల, జలాలపురం, రాఘవంపల్లి గ్రామాల్లో తరగతి గదులు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఆయా పాఠశాలల పరిస్థితి గురించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ఎంఈఓ తెలిపారు. తరగతి గది పెచ్చులూడిపడి విద్యార్థికి గాయాలు తాడిమర్రి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడి మీద పడటంతో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన స్థానిక ఎస్సీ హాస్టల్ విద్యార్థి సాకే.నరేంద్ర మధ్యాహ్నం 2గంటల సమయంలో తోటి విద్యార్థులతో కలిసి తరగతిలో పాఠాలు వింటుండగా పైకప్పు పెచ్చులూడి అతనిపై పడింది. ఆ విద్యార్థి తలకు తీవ్రగాయం కావడంతో క్లాస్‌లో ఉన్న హిందీ టీచర్ చంద్రకళ, ఇతర ఉపాధ్యాయులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కంప్యూటర్ గది కావడం వల్లే... తొమ్మిదో తరగతి విద్యార్థులకు క్లాస్‌రూం మొదటి అంతస్తులో ఉన్ననప్పటికీ వాళ్లు అక్కడ అల్లరి చేస్తుండటంతో కిందున్న కంప్యూటర్ గదిలో వాళ్లకు పాఠాలు చెబుతున్నారు. అది కంప్యూటర్ గది కావడంతో పైకప్పునకు థర్మాకోల్‌తో పీఓపీ చేయించారు. దీనివల్ల ఆ గది పైకప్పు కనిపించే అవకాశం లేకుండా పోయింది. దీంతో పైపెచ్చులు ఊడుతున్నాయనే విషయాన్ని గుర్తించలేకపోయారు. పీఓపీతో తప్పిన పెనుప్రమాదం పీఓపీ థర్మాకోల్ కారణంగా ప్రమాదకర పరిస్థితిని గుర్తించడానికి వీల్లేకుండా పోయినప్పటికీ దానివల్లే పెనుప్రమాదం తప్పిం చింది. పెచ్చులూడిన పైకప్పు థర్మాకోల్‌పై పడి తర్వాత విద్యార్థిపై పడటంతో ఓ మోస్తరు గాయంతో విద్యార్థి క్షేమంగా బయటపడ్డాడు. అదే నేరుగా విద్యార్థి తలపై పడి ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది. దసరా సెలవుల్లో మరమ్మతులు చేపట్టాలి శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలి. ఎంఈఓలు సూచించిన భవనాలకు దసరా సెలవుల్లో మరమ్మతులు చేపట్టి పాఠశాలలు తిరిగి తెరిచేసరికి పనులు పూర్తి చేయాలి. తాడిమర్రిలో పాఠశాల భవనం పెచ్చులు ఊడిపడి విద్యార్థి గాయపడిన సంఘటనల్లాంటివి పునరావృతం కాకూడదు.– అమరనాథరెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడు -
ఉపకార దరఖాస్తులో కొత్త విధానం
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ ఉపకారవేతన దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఒకే దరఖాస్తు పత్రాన్ని అందిస్తున్నారు. ఈ పత్రంలో విద్యార్థి పూర్తి వివరాలు ఈపాస్ వెబ్సైట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇందులో తప్పులు దొర్లితే అధికారులు తిప్పి పంపడం, మళ్లీ విద్యార్థి వాటిని సవరించి పంపే ప్రక్రియలో అధిక సమయం పట్టేస్తుంది. దీంతో విద్యార్థులకు ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇకపై పొరపాట్లకు తావులేకుండా దరఖాస్తు విధానాన్ని సులభతరం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఒక కోర్సుకు సంబంధించి ఒకేసారి వివరాలు ఎంట్రీ చేస్తే సరిపోయేలా... రెన్యూవల్ విషయంలో మార్కుల సమాచారం మినహా మిగతా వివరాలు తొలి దరఖాస్తుతో లింకు చేసేలా సాంకేతికతను యంత్రాంగం అభివృద్ధిచేస్తోంది. సెట్లతో అనుసంధానం... ఇంటర్మీడియెట్, జనరల్ డిగ్రీ మినహాయిస్తే మిగతా కోర్సుల్లో ప్రవేశాలకు సెట్(కామన్ ఎంట్రన్స్ టెస్ట్) తప్పనిసరి. ఈక్రమంలో సెట్‌కు దర ఖాస్తు చేసుకున్న వివరాలను ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ఫారంలో ప్రత్యక్షమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. సెట్ వెబ్సైట్లతో ఈపాస్ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేసేలా ఎస్సీ అభివృద్ధిశాఖ చర్యలు చేపడుతోంది. సెట్ తాలూకు అంకెను ఈపాస్ వెబ్సైట్లో ప్రవేశపెడితే విద్యార్థి సమాచారమంతా ప్రత్యక్షమయ్యేలా రూపొ ందిస్తున్నారు. ప్రస్తుతం సెట్ రాసేందుకైనా, ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేశారు. ఆధార్ వివరాలతో పాటు సెట్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేస్తే ఈపాస్ దరఖాస్తు సులభతరం కానుందని భావిస్తున్న ప్రభుత్వం ఈమేరకు సీజీజీ అధికారులతో చర్యలు జరుపుతోంది. సెప్టెంబరు నెలాఖరు వరకు స్వీకరణ 2018–19 సంవత్సరానికి సంబంధించి ఈపాస్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం రెన్యూవల్ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ ఏడాది పోస్టుగ్రా డ్యుయేషన్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల దరఖాస్తులు కొత్త పద్ధతిలో స్వీకరించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు వెబ్‌సైట్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ఢిల్లీ పాఠశాలలో దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఖరీదైన గోలే మార్కెట్ ప్రాంతంలోని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై ఓ ఎలక్ట్రీషియన్ రామ్ ఆశ్రయ్ (37) స్కూల్ ఆవరణలో రేప్ చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎలక్ట్రీషియన్‌ను అరెస్టుచేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 20 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారు. కాగా, రేప్ చేసిన రామ్‌తోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మరో ముగ్గురిని ఎన్డీఎంసీ సస్పెండ్ చేసింది. రామ్ ఆశ్రయ్ పై అధికారి, జూనియర్ ఇంజినీర్ అయిన సౌరభ్ బిష్ట్ ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తుండగా ఆయన ఒప్పందాన్ని ఎన్డీఎంసీ రద్దు చేసి ఉద్యోగం నుంచి తొలగించింది. సస్పెండైన వారిలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోష్, విద్యుత్తు విభాగ అసిస్టెంట్ ఇంజనీర్ తులసి, ఉపాధ్యాయిని శిఖ ఉన్నారు. మహిళలపై నేరాలను అడ్డుకునేందుకు కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. భద్రతా చర్యలేంటో చెప్పండి.. పాఠశాలలో పిల్లల భద్రత కోసం తీసుకున్న చర్యలేంటో చెప్పాల్సిందిగా డీసీడబ్ల్యూ పోలీసులతోపాటు స్కూల్ అధికారులకు నోటీసులిచ్చింది. ఎన్‌హెచ్చార్సీ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులిచ్చింది. నిందితుడు తమ స్కూల్ ఉద్యోగి కాదనీ, ఎన్డీఎంసీ ఉద్యోగిగా ఇక్కడ పనిచేయడానికి మాత్రమే వచ్చాడని పాఠశాల వర్గాలు చెప్పాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల బయట ఆందోళనకు దిగి, ఈ స్కూల్లో తమ పిల్లలకు భద్రతేముందని ప్రశ్నించారు. టీచర్లు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చూపారన్నారు. ఇంటికి వెళ్తుండగా పిలిచి.. ఎన్డీఎంసీలో శాశ్వత ఉద్యోగి అయిన రామ్ 2 నెలలుగా స్కూల్లో విద్యుత్తు పనులు చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం స్కూల్ అయిపోయాక ఇంటికెళ్తున్న బాలికను పిలిచి పంపు రూంలోకి తీసుకెళ్లి రేప్‌చేశాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. పాప ఇంటికి వెళ్లిన అనంతరం ఆమె మర్మాంగాల నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించిన బాలిక తల్లి.. వెంటనే ఆమెను వైద్యశాలకు తీసుకెళ్లింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు తేల్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుణ్ని పోలీసులు అరెస్టుచేసి విచారణచేపట్టారు. -
35 ఏళ్ల క్రితం కరుణానిధి సాయం
ముంబై: తమిళభాషపై అపార ప్రేమ ఉన్న కరుణానిధి, తమిళులు ఎక్కడ నుంచి సాయం కోరినా వెంటనే స్పందించేవారు. అన్నిరకాలుగా అదుకునేందుకు ప్రయత్నించేవారు. తాము కోరిన వెంటనే సమావేశానికి వచ్చిన కరుణానిధి, తమిళులకు ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ ఏర్పాటుకు సహకరించారని డీఎంకే ముంబై విభాగం చీఫ్ ఆర్.పళనిస్వామి గుర్తుచేసుకున్నారు. ‘ముంబైలో 1983లో తమిళులంతా కలసి నిర్వహించిన ఓ సమావేశానికి రావాల్సిందిగా మేము కరుణానిధిని ఆహ్వానించాం. ఆయన అందుకు అంగీకరించడమే కాకుండా మేం ఏయే కార్యక్రమాలు చేపడుతున్నామో, మాకు ఏం ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళులు గణనీయంగా ఉన్న ధారావి ప్రాంతంలో కమ్యూనిటీ స్కూల్ లేదనీ, నిధులు లేకపోవడం వల్లే దాని నిర్మాణం చేపట్టలేకపోయామని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. దీంతో స్కూల్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల్ని కరుణానిధి ఆదేశించారు. కేవలం ఆయన తీసుకున్న చొరవతో ఈ ప్రాంతంలో ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ కూడా ఏర్పాటైంది’ అని పళనిస్వామి చెప్పారు. ముంబై సమావేశానికి వచ్చిన సందర్భంగా కరుణ వేలాది మందిని కలుసుకున్నారన్నారు. 2010లోనే ఆసుపత్రి కోసం ఇల్లు దానం చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెన్నై గోపాలపురంలోని ఖరీదైన తన ఇంటిని ఆసుపత్రి స్థాపన కోసం 2010లోనే దానమిచ్చారు. ఆ ఏడాది తన 86వ జన్మదిన వేడుకల సందర్భంగా కరుణానిధి తన కొడుకులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధితోపాటు ఆయన భార్యలు కూడా చనిపోయిన తర్వాత ఈ ఆసుపత్రిని స్థాపించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కరుణానిధి తల్లి పేరిట అన్నై అంజుగమ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, కరుణ కుటుంబసభ్యులతోపాటు కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, ప్రముఖ తమిళ గేయరచయిత వైరముత్తు తదితరులు కూడా ట్రస్ట్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఆసుపత్రికి కలైజ్ఞర్ కరుణానిధి హాస్పిటల్ అని పేరుపెట్టనున్నారు. -
బడినీ మింగేశారు!
ఒంగోలు టూటౌన్: అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖాళీ స్థలం కనపడితే కబ్జా చేయకుండా ఉండలేకపోతున్నారు. అది కుంటైనా, మందబయిలు పోరుంబోకు అయినా, పాఠశాల స్థలం అయినా గద్దల్లా వాలిపోతూ తమ కబంధ హస్తాల్లోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్లాట్లుగా వేసి లక్షల సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కరవదిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (98) స్థలంపై స్థానిక టీడీపీ ముఖ్య నేత కన్ను పడింది. వెంటనే దానిని ఆక్రమించి ప్లాట్లగా మలిచాడు. వాటిని స్థానికులకే అమ్మకాలు చేపట్టాడు. ఒక్కొక్క ప్లాట్ లక్ష వరకు అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసినా.. అధికార పార్టీ నేతల దెబ్బకు కిమ్మనకుండా ఉన్నారు. ఎవరికి వారే మనకెందుకనుకుంటూ నోరుమెదపకుండా ఉండిపోయారు. అడ్డుకున్న విపక్షం అంతా సైలెంట్‌గా ఉన్నా వైఎస్సార్సీపీ నేతలు ఊరుకోలేదు. పాఠశాల కబ్జాకు గురయిన విషయం తెలుసుకొని వెంటనే మీకోసంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లారు. స్థానిక గ్రామపంచాయతీలో, మండలస్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అధికార పార్టీ నేతల దెబ్బకు అంతా మిన్నుకుండిపోయారు. చేసేదేం లేక లోక్ అదాలత్‌లో వైఎస్సార్సీపీ నేతలు కేసు వేశారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఇటీవల మండల ఎంఈఓ పాఠశాల స్థల పరిశీలనకు వచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులంతా సంఘటన స్థలం వద్దకు వెళ్లారు. స్థలం కబ్జాపై వివరించారు. తరువాత ఎంఈఓ స్థానిక టీడీపీ నేతలను కలిశారు. లోక్ అదాలత్‌కు ఎంఈఓ హాజరు జూలై 31వ తేదీన మండల విద్యాశాఖాధికారి లోక్ అదాలత్ జడ్జి వద్దకు హాజరయ్యారు. స్థలం ఆక్రమించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆయన ప్రశ్నించారు. పాఠశాల స్థలం కొలిచి స్వాధీనం చేయాలని తెలియజేశామని జడ్జికి వివరించారు. అనంతరం మళ్లీ వాయిదా వేసినట్లు పిటిషనర్లు తెలిపారు. మండల స్థాయికి చెందిన కొంతమంది అధికారులకు, గ్రామపంచాయతీ అధికారులకు నోటీసులు జారీ చేశారని పిటిషనర్లు తెలిపారు. వీరితో పాటు పాఠశాల స్థలం కొని నిర్మాణాలు చేపడుతున్న మరో ముగ్గురికి కూడా నోటీసులు పంపించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆక్రమణదారులు లోక్‌అదాలత్ కోర్టుకి హాజరు కాకుండా మళ్లీ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కూడా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు పిల్లర్స్ వేసి నిర్మాణాలు చేపడుతున్నారని మండల విద్యాశాఖాధికారి, గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికుడు టి. యల్లమంద తెలిపారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వం పాఠశాల స్థలం కబ్జాకు గురయితే గ్రామంలో పెద్దలు నోరుమెదపడం లేదంటే అధికార పార్టీ నేతల ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పాఠశాల స్థలమే కాకుండా అంతకుముందు గ్రామాన్ని వరద ముంపు నుంచి కాపాడే కుంటను ఆక్రమించి అమ్ముకున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు టి. యల్లమంద, మన్నే శ్రీనివాసరావు, రాయపాటి, మేడికొండ కోటేశ్వరరావు, వాకా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇలా ఖాళీగా కనపడిన ప్రభుత్వ పోరంబోకు స్థలాలను కబ్జా చేసి లక్షలు పోగేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాకు గురైన మండల ప్రాథమిక పాఠశాల స్థలంను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: ఎంఈఓ పాఠశాల స్థలంలో ఎవరూ ఆక్రమణలు చేపట్టవద్దని చెప్పాం. నిర్మాణదారులను కూడా హెచ్చరించాం. ఈ స్థలం వ్యవహారం ప్రస్తుతం లోక్ అదాలత్‌లో ఉన్నట్లు ఆక్రమణదారులకు తెలియజేశాం. ప్రభుత్వం నిబంధనలను ధిక్కరించి ఎవరైనా స్థలంలో ప్రవేశిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. -
కస్తూరి కుసుమాలు
గ్రామీణ నేపథ్యం, పేదరికం, అనాథలుగా మారడం, తదితర కారణాలతో పాఠశాలలను మధ్యలో మానేసిన బాలికలను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. విద్యతో పాటు క్రీడలు, యోగా, కంప్యూటర్ తదితర అంశాలలోనూ శిక్షణ నిస్తున్నాయి. విద్యార్థినులు 6వ తరగతిలో ఈ పాఠశాలల్లో చేరితే పైసా ఖర్చు లేకుండా ఇంటర్ విద్యను పూర్తి చేసుకోవచ్చు. మదనపల్లె సిటీ: పేద విద్యార్థినుల జీవితాల్లో కేజీబీవీలు వెలుగునింపుతున్నాయి. జిల్లాలో 20 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో గంగవరం, రామకుప్పం మండలాల్లో ఉన్న కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ విద్యను కూడా ప్రవేశపెట్టారు. అద్భుతం..దినచర్య ఈ విద్యాలయాల్లో దినచర్య అద్భుతంగా ఉంటుంది. నిత్యం వేకువజాము 4 గంటలకు బాలికలను నిద్రలేపి సుమారు గంటపాటు చదివిస్తారు. ఒక గంట పాటు యోగాసనాలు చేయిస్తారు. స్నానం, అల్పాహారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేస్తారు. సాయంత్రం 5 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం గంట పాటు ఆట, పాటలు, మొక్కలు సంరక్షణ వంటి పనులు చేస్తారు. రాత్రి 7 తరువాత భోజనం, అనంతరం 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ వుంటాయి. నిత్యం అధ్యాపకులు ఒక పద్ధతి ప్రకారం విద్యార్థినులకు దినచర్య అమలు చేస్తారు. ఏడో తరగతి విద్యార్థినుల కోసం ఇంకో అడుగు ముందుకేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విద్యతో పాటు విద్యార్థినులకు మానసిక ఉల్లాసం కోసం ఆటలు కూడా ఆడిస్తున్నారు. కుట్టుపని, కంప్యూటర్ విద్య, చేతి పనులపై కూడా శిక్షణ ఇస్తున్నారు. మెరుగైన మెనూ విద్యార్థినులకు పౌష్టికాహారంతో కూడిన మెనూను కేజీబీవీల్లో అమలు చేస్తున్నారు. ప్రతి రోజు మూడు పూటల భోజనంతో పాటు ఉద యం, సాయంత్రం ప్రత్యేకంగా స్నాక్స్‌ను అందజేస్తున్నారు. వారానికి ఐదు రోజుల పాటు కోడిగుడ్లు, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, పెన్నులు, ఏడాదికి నాలుగు జతల యూనిఫాం, బూట్లు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు అందిస్తున్నారు. వాటితో పాటు ప్రతి నెలా సబ్బులు, తలనూనె, టూత్‌పేస్టు, కాస్మోటిక్స్ కూడా అందజేస్తున్నారు. స్వచ్ఛ విద్యాలయాలుగా... విద్యార్థినులకు శారీరక సమస్యలపై అవగాహన కల్పించేందుకు 24 గంటలు ఒక ఎఎన్ఎం అందుబాటులో ఉంటుంది. దీనికి తోడు విద్యాలయ ఆవరణలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు,కూరగాయల తోటలను పెంచే బాధ్యతలను చిన్నారులకు అప్పగిస్తున్నారు. వాటిని విద్యార్థినులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని కేజీబీవీలు స్వచ్ఛ విద్యాలయాలుగా మారుతున్నాయి. కురబలకోట మండలంలోని కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయం జాతీయ స్థాయిలో స్వచ్ఛ పురస్కార్ అవార్డుకు ఎంపికై రూ.50 వేల నగదు బహుమతిని కూడా అందుకుంది. -
ఫీజులపై ఉన్న శ్రద్ధ భద్రతపై ఏదీ!
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ పాఠశా లలో గురువారం స్టేజీ కూలిపోయి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనపై నిరసన వెల్లువెత్తింది. చిన్నారుల మృతదేహాలతో శుక్రవారం పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారుల మృతదేహాలపై పడి బంధువులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. కాగా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు ఆరోపించారు. పాఠశాల పైకప్పు ప్రమాదకరంగా ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన పలువురు పాఠశాల బస్సును ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రూ.5 లక్షల పరిహారం... సంఘటన జరిగిన వెంటనే న్యూ సెంచరీ పాఠశాల డైరెక్టర్ ఎం.వెంకట్ పరారయ్యాడు. చిన్నారులు మృతి చెంది 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని యాజమాన్యం కోసం నిరీక్షించారు. యాజమాన్యం అజ్ఞాతంలో ఉండటంతో అధికారులతో చర్చించి నష్టపరిహారాన్ని ప్రకటించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. స్కూల్ అనుమతిని రద్దు చేయడంతో పాటు భవనాన్ని పూర్తిగా తొలగిస్తామన్నారు. పాఠశాలలోని 176 మంది విద్యార్థులకు నష్టం జరగకుండా సమీపంలోని 11 పాఠశాలల్లో చేర్పిస్తామని, వారికయ్యే ఫీజును ప్రభు త్వమే భరిస్తుందని ప్రకటించారు. అలాగే మృతి చెంది న విద్యార్థినులు మణికీర్తన, చందనశ్రీ కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందివ్వనున్నట్లు వివరించారు. జాయింట్ కలెక్టర్ సందర్శన... మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఉదయం పాఠశాలను సందర్శించారు. స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవోను సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అలాగే ప్రతి వారం మండల ఎడ్యుకేషన్ అధికారులు అన్ని పాఠశాలలను తనిఖీ చేసి ఎప్పటికప్పడు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఒక విద్యార్థి డిశ్చార్జ్.. న్యూ సెంచరీ పాఠశాల ప్రమాదంలో గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థుల్లో సందీప్‌ను శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. నరేశ్, లిఖిత ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గతంలోనే చెప్పాం... పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పిల్లర్లు కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయని గతంలోనే పలుమార్లు యాజమాన్యానికి గుర్తు చేశాం. లైట్ వెయిట్‌గానే ఉంది.. ప్రమాదమేమీ లేదని నిర్లక్ష్యం వహించారు. పాఠశాల పైకప్పు కూడా తాటి చెక్కలతో పేర్చారు. యాజమాన్య నిర్లక్ష్యంతోనే చిన్నారులు బలయ్యారు. – రమణారావు, విద్యార్థి తండ్రి వెంకట్రావ్‌నగర్ నా ఆనందం ఆవిరైంది... నా మనవరాలు మణికీర్తన గొప్పగా చదువుకుంటుందని చాలా ఆనందపడ్డాం. పెద్ద డాక్టర్ అయి నాకు మెరుగైన వైద్యం చేస్తానని, తన దగ్గరే ఉంచుకుంటా అని చెబుతుంటే ఎంతో ఆనందపడ్డా. ఇప్పుడు ఆ ఆనందమంతా ఆవిరైపోయింది. నా మనవరాల్ని ఈ పాఠశాల బలిగొంది. – పద్మ, మణికీర్తన నానమ్మ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే... రూ.లక్షల ఫీజులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల భద్రతలో లేకపోవడం దారుణం. కేవలం యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విలువైన చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిశాయి. నా మనవరాలు పాఠశాలలో చేరి రెండు నెలలైనా కాలేదు.. ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ఇది మాకు తీరని గుండెకోత. దీనికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. – డి. రంగయ్య, చందనశ్రీ తాతయ్య -
హైదరాబాద్ చైతన్య స్కూల్లో కీచకుడు
-
న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ సీజ్
హైదరాబాద్ : కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్‌ను సీజ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ కుమారి వెల్లడించారు. విద్యా సంవత్సరం మధ్యలో స్కూలు సీజ్ చేయాలని నిర్ణయించడంతో, విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులను న్యూసెంచరీ పబ్లిక్ స్కూల్‌కి దగ్గరో ఉన్న పాఠశాలల్లో చదివిస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల విషయమై ఆయా పాఠశాల యాజమాన్యాలతో సంప్రదించి తల్లిదండ్రులపై భారం పడకుండా చూస్తామని చెప్పారు. సిలబస్ కరిక్యూలర్ ప్రకారం ఉంటుంది కాబట్టి సిలబస్ విషయంలో విద్యార్థులు సమస్యను ఎదుర్కొనే అవకాశాలు లేవని తెలిపారు. ఇప్పటికే గోడ కూలి ఇద్దరు విద్యార్థులు మృతిచెందటంతో న్యూ సెంచరీ పబ్లిక్ స్కూలు కూల్చివేతకి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేయనుంది. మొదటి నోటీసుకి 15 రోజుల గడువు, ఆ తర్వాత 7 రోజుల గడువుతో మరో నోటీసు ఇవ్వనున్నారు. చివరగా 24 గంటల గడువుతో నోటీసు ఇస్తారు. యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేని సందర్భంలో స్కూలును పూర్తిగా నేలమట్టం చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుంది. శుక్రవారం జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్‌ను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో స్కూల్‌ను నిర్వహించడం సరికాదన్నారు. చనిపోయిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుందని, గాయపడిన వారికి ప్రభుత్వం వైద్య ఖర్చులు భరిస్తుందని హామీ ఇచ్చారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు బస్సులపై దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులు స్కూల్లోకి ప్రవేశించి ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేశారు. -
క్లాస్‌రూమ్‌లో విద్యార్థిపైన పడిన సీలింగ్ ఫ్యాన్
-
సుదీర్ఘ ప్రసంగం.. విసుగెత్తిన జనం
కొవ్వూరు/కొవ్వూరు రూరల్ : సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగానికి పశివేదల గ్రామ జనం విసుగెత్తిపోయారు. గురువారం ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు గ్రామానికి వచ్చారు. గ్రామంలో పలువీధుల్లో పర్యటించి జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి జవహర్, స్థానిక సర్పంచ్ కాశీఅన్నపూర్ణ తప్ప వేదికపైన వేరొకరికి మాట్లాడే అవకాశం కల్పించలేదు. కొవ్వూరులోను మంత్రి జవహర్, మునిసిపల్ చైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి, కలెక్టర్ కాటమనేని భాస్కర్లు మాత్రమే ప్రసంగించారు. కొవ్వూరులో ఏకంగా గంటా నలభై నిమిషాలు సీఎం ప్రసంగించడంతో జనం విసుగెత్తిపోయారు. ఇక వినలేక నెమ్మదిగా జారుకున్నారు. పోలీసులు జనాన్ని నిలువరించేందుకు ప్రవేశ ద్వారాల వద్దకట్టడి చేసే ప్రయత్నాలు చేశారు. నాయకులు సైతం జనానికి సర్దిచెప్పి కూర్చోపెట్టాల్సి వచ్చింది. సీఎం తన ప్రసంగంలో ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా చేకూరే లబ్ధిని వివరించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. పశివేదల గ్రామానికి ప్రత్యేక వరాలేమీ ప్రకటించలేదు. మంత్రి కేఎస్ జవహర్ గ్రామంలో ఎస్సీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం ఏవిధమైన ప్రకటన చేయకపోవడంతో స్థానికులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. స్థానిక సర్పంచ్ బేతిన కాశీఅన్నపూర్ణ సర్పంచ్ల పదవీ కాలం పొడిగించాలని కోరినా సీఎం ఏవిధమైన ప్రకటన చేయలేదు. పథకాల వారిగా కాల్‌సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో వచ్చిన మార్కులను మండల శాఖ అధికారులతో చర్చించారు. గ్రామ వికాసం పుస్తకావిష్కరణ, పవర్ ఆఫ్ పశివేదల వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ పశివేదలలో 90 శాతం సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు. గ్రామంలో ఇంకా పది కుటుంబాలకే ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. అంతకు ముందు కొవ్వూరు –నందమూరు రోడ్డులోని హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు నాయకులు స్వాగతం పలికారు. మంత్రి కెఎస్ జవహర్, ఏఎంసీ చైర్మన్ వేగి చిన్నా, మున్సిపల్ చైర్మన్ జొన్నలగడ్డ రాధారాణి, జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, ఎంపీపీ వాడవెల్లి రాజ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ దుద్దుపూడి రాజా రమేష్, నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, కంఠమణి రామకృష్ణ, బేతిన నారాయణ, యలమాటి సత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు. సీఎంకు సమస్యలపై వినతులు బూరుగుపల్లి సుబ్బారావు అనే రైతు చాగల్లు చెరకు ఫ్యాక్టరీలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరారు. ఊనగట్ల గ్రామంలో గుండాల పుంత రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. నందమూరుకు చెందిన గన్నమని గణేష్ అనే దివ్యాంగుడు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ఇప్పించాలని కోరారు. అడ్వకేట్ కొడవలి బాలాజీ వికలాంగులకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్నందున పదవీకాలం పొడించాలని సర్పంచ్ల ఛాంబర్ సభ్యులు సీఎంకి వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు పట్టణానికి.. నగర దర్శిని–నగర వికాసం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సంస్కృత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పట్టణంలో అవుట్ పాల్ డ్రయిన్ నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీకళాశాల వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయిస్తామని ప్రకటించారు. అంతకు ముందు మంత్రి జవహర్ మాట్లాడారు. మునిసిపల్ చైర్పర్సన్ రాధారాణి, మంత్రి పితాని సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పెండ్యాల అచ్యుత రామయ్య (అచ్చిబాబు), కలెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
చెల్లుబాటు ఖాతాకే స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీలో కొత్త సంస్కరణలను ఎస్సీ అభివృద్ధి శాఖ తీసుకొస్తోంది. స్కాలర్‌షిప్‌ల పంపిణీలో రివర్స్ ట్రాన్సాక్షన్ల సమస్యను అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం విద్యార్థుల ఖాతాలను పరిశీలించి చెల్లుబాటు ఖాతాలున్న వారికే ఉపకారవేతనాలు విడుదల చేయనున్నారు. ఖాతా సరైనది కాకుంటే.. ఒప్పందం ప్రకారం స్కాలర్షిప్ కోసం విద్యార్థులిచ్చిన ఖాతా సరైనదో కాదో ఎస్బీఐ అధికారులు తేల్చుతారు. బ్యాంకు ఖాతా నిర్వహిస్తున్నారా లేక నిర్వహణ లోపంతో ఖాతా స్తంభించిపోయిందా నిర్ధారిస్తారు. అలాంటి ఖాతాలన్నీ సేకరించి సంబంధిత కళాశాలలకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారమిచ్చి ఆయా విద్యార్థులకు తెలియజేస్తారు. ఇతర బ్యాంకు ఖాతాల నిర్వహణను ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో తేల్చనున్నారు. ఈ మేరకు గత వారం ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్బీఐ, ఎన్పీసీఐ అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఏటా 10 శాతం రద్దు రాష్ట్రంలో సగటున 13 లక్షల మంది ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులు 12 లక్షలకు పైమాటే. అయితే సగటున 10 శాతం మంది తప్పుడు వివరాలు నమోదు చేయడం, లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఆ ఖాతాలు స్తంభిస్తున్నాయి. దీంతో వారికి ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నా ఆ మొత్తం తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమవుతోంది. దీంతో సంక్షేమాధికారులు వారి ఖాతా నంబర్లను మళ్లీ సేకరించి మళ్లీ బిల్లులు రూపొందించి వాటిని ఖజానా శాఖకు సమర్పించి విడుదల చేయడం ప్రహసనమవుతోంది. దీంతో ఖాతాల పరిశీలనపై పర్యవేక్షణ ఉంటే మేలని భావించిన అధికారులు ఎస్బీఐతో అవగాహన కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఖాతాల పరిశీలన పూర్తయితేనే సంక్షేమాధికారులు బిల్లులు రూపొందిస్తారని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. -
ఎస్సీ విద్యార్థుల ఫీజు గడువును పెంచండి
న్యూఢిల్లీ: పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందుకునే ఎస్సీ విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువును పెంచేలా ఆయా విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశించింది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజుతో పాటు ఉపకార వేతనం నగదు జమఅయ్యేంత వరకూ ఈ గడువును పెంచాలని కోరింది.. ఫీజు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయన్న కారణంతో పలు విద్యాసంస్థలు ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. బ్యాంక్ ఖాతాలో ఫీజు డిపాజిట్ కాగానే వెంటనే చెల్లిస్తామని విద్యార్థుల నుంచి కాలేజీలు హమీపత్రం తీసుకోవాలని సూచించింది. -
పాఠశాల వంట గదిలో 60 పాములు
-
విష సర్పాల మంద.. వెన్నులో వణుకు!
ముంబై : ఓ స్కూల్ వంట గదిలో విష సర్పాల గుంపు బయటపడటం కలకలం సృష్టించింది. వాటిని చూసిన విద్యార్థులు, వంట మనుషులకు వెన్నులో వణుకు పుట్టింది. ఈ ఘటన మహారాష్ట్ర, హింగోలి జిల్లా, భొకారే గ్రామ ప్రభుత్వ పాఠశాల్లో చోటుచేసుకుంది. ప్రతి రోజులాగే వంట మనిషి గదిలోకి వెళ్లి వంట కోసం కట్టెలు తీయ సాగింది. ఒకటి రెండు కట్టెలు తీసిన తర్వాత ఆమెకు భయంకరమైన పాముల గుంపు కనిపించింది. వెంటనే భయంతో అరుస్తూ బయటకు పరుగెత్తుకొచ్చింది. ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలపగా అతను పాములు పట్టేవారికి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ విక్కీ దాలడ్ వచ్చి రెండు గంటల పాటు కష్టపడి సుమారు 60 పాములు పట్టుకున్నాడు. దీంతో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ పాములను ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు విక్కీ దాలడ్ తెలిపారు. -
సెయింట్ జాన్స్ స్కూల్ స్వర్ణోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
-
బిహార్‌లోని ఛప్రా జిల్లాలో దారుణం
-
స్కూల్లోనే బాలికపై క్లాస్మేట్స్ మృగవాంఛ
తొమ్మిదో తరగతి చదివే బాలికకు స్కూల్ నరకాన్ని తలపించింది. ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా ఏకంగా 18 మంది ఏడు నెలలుగా ఆమెపై మృగవాంఛ తీర్చుకుంటున్నారు. బాధితురాలు ధైర్యం చేయటంతో చివరకు విషయం వెలుగులోకి రాగా.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... పట్నా: బిహార్‌లోని ఛప్రా జిల్లా పర్సాఘడ్‌లోని ఓ స్కూల్లో బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గతేడాది డిసెంబర్లో ఓ కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరైన ఓ క్లాస్మేట్ ఓదార్చినట్లు నటించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్స్‌పాల్, మరో ఇద్దరు టీచర్లు సహా ఐదుగురు విద్యార్థులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారికి జత కలిసిన మరికొందరు విద్యార్థులు అప్పటి నుంచి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ ఏడు నెలలుగా మృగవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ మధ్యే తండ్రి జైలు నుంచి విడుదల కావటంతో జరిగిన దారుణాన్ని అతనికి చెప్పుకుని కూతురు విలపించింది. దీంతో ఎక్మా పోలీస్ స్టేషన్లో తండ్రిసాయంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రిన్సిపాల్‌తోపాటు ఓ టీచర్‌ను, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు అధికారి అజయ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం తరలించిన అధికారులు.. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు. -
ఛీ.. ఇదేం స్కూలు!
పుణె: ‘విద్యార్థినులు ఒకే రంగు లోదుస్తులు వేసుకోవాలి. మరుగుదొడ్డికి నిర్ణీత సమయంలో మాత్రమే వెళ్లాలి’ అంటూ ఓ ప్రైవేటు పాఠశాల ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలోని పుణెలోని మయీర్ ఎమ్ఐటీ స్కూల్ విధించిన ఆంక్షలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్థినులు ధరించే స్కర్టుల పొడవు ఎతుందో కచ్చితంగా పేర్కొనాలని స్కూల్ యాజమాన్యం ఆదేశించింది. ‘విద్యార్థినులు తెలుపు లేదా స్కిన్ కలర్ లోదుస్తులు ధరించాలి. వారు ధరించి స్కర్ట్ పొడవు ఎంతుందో కచ్చితంగా పేర్కొనాలి. ఈ వివరాలు స్కూల్ డైరీలో రాసి మాతో సంతకం పెట్టించుకుని తీసురావాల’ని స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్టు ఓ విద్యార్థి పేరెంట్ తెలిపారు. తమ ఆదేశాలు పాటించని విద్యార్థులు, తల్లిదండ్రులపై చర్యలు తప్పవని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం ఆంక్షలంటూ మండిపడుతున్నారు. గతానుభవాలతోనే... అయితే మంచి ఉద్దేశంతోనే ఈ నిబంధనలు పెట్టామని ఎమ్ఐటీ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర కరాద్ నగరె తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. గతంలో తమకు ఎదురైన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించామని, వీటి వెనుక ఎటువంటి రహస్య అజెండా లేదని వివరణయిచ్చారు. -
లోదుస్తులపైనా ఆ స్కూల్ ఆదేశాలు..
సాక్షి, ముంబై : పూణేకు చెందిన విశ్వశాతి గురుకుల్ విద్యా సంస్థ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. బాలికల లోదుస్తుల రంగుపై స్కూల్ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇచ్చిన డైరీల్లో బాలికలు తెలుపు రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలని నిర్ధిష్టంగా పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యం తమను బలవంతంగా ఈ ప్రతిపాదనకు ఒప్పించేలా ఇలా వ్యవహరిస్తోందని తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గదర్శకాలపై పలువురు తల్లితండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వీటిని తోసిపుచ్చుతున్న స్కూల్ యాజమాన్యం బాలికల భద్రత కోసమే ఈ నియమాలను పొందుపరిచామని సమర్ధించుకుంటోంది. వివాదాస్పద మార్గదర్శకాలపై తల్లితండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ నియమాలను వ్యతిరేకిస్తూ ప్రాధమిక విద్య డైరెక్టర్‌ను తల్లితండ్రులు కలిసి స్కూల్ తీరుపై ఫిర్యాదు చేశారు. -
నాగుపాము కలకలం
సరుబుజ్జిలి: మండలంలోని వెన్నెవలస గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం నాగుపాము కలకలం సృష్టించింది. తరగతి గదుల్లోకి రావడంతో విద్యార్థులు, సిబ్బంది ¿భయాందోళనకు గురయ్యారు. గదుల్లోకి పాము వెళ్లడంతో బాలికలు ఉరుకులు పరుగులు తీశారు. వెంటనే వార్డెన్ వాసుదేవరావు స్పందించి పామును పట్టుకుని హతమార్చారు. పక్కనే ఆటవిక ప్రాంతం ఉండడంతో తరుచూ విష జంతువుల తాకిడి అధికంగా ఉందని సిబ్బంది వాపోతున్నారు. -
ప్రథమ పురుష
‘‘ఏమైంది, దానికి?’’ ‘‘గేటు వేస్తుంటే వేలు నలిగింది!’’ ‘‘వేలు నలగడం ఏమిటీ? ఎవరు గేటు వేశారు? ఎక్కడ గేటు వేశారు?’’ ‘‘మనింట్లోనేనండి!’’ ‘‘మనింట్లో గేటు లాగడం ఏమిటి? పైగా పిల్ల లాగడం ఏమిటి?’’ ‘‘అబ్బా స్కూల్ బస్ దిగింది. దిగి గేటు తీసుకుంది.’’ ‘‘స్కూల్ బస్సు దిగితే, నువ్వేం చేస్తున్నావు?’’ ‘‘అప్పుడే వంట ముగించుకుని, స్నానానికి వెళ్ళానండి!’’‘‘పిల్ల స్కూల్ నుంచి వస్తుందని తెలుసు కదా? స్నానానికి వెళ్ళడం ఏమిటి?’’ ‘‘టైముందనుకున్నానండి!’’ ‘‘టైముండటం ఏమిటే! స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా? ఈరోజు బస్సు లేటవుతుందని?’’ ‘‘అలా కాదండి. పిల్ల వచ్చేలోపు స్నానం ముగించేయ్యొచ్చుకదా అని!’’ ‘‘రోజూ ఎలా చేస్తున్నావు?’’ ‘‘పిల్ల వచ్చింతర్వాత, దానికి అన్నం పెట్టి నేను స్నానానికి వెళ్తున్నానండి.’’ ‘‘మరి ఈ రోజు ఎందుకు ఆగలేకపోయావ్?’’ ‘‘చెబుతున్నాను కదండి టైముందికదా అని!’’ ‘‘ఎక్కడిది టైము? రోజూ వచ్చినట్టే వచ్చిందికదా ఈరోజు కూడా? లేటవ్వలేదుగా?’’ ‘‘లేటవ్వలేదండి’’ ‘‘మరి?’’ ‘‘....’’ ‘‘మాట్లాడవే! అలా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడతావేంటి!’’ ‘‘అన్నం కలుపుతా’’ ‘‘అన్నం కలపడం ఏమిటి?’’ ‘‘పిల్లకి అన్నం కలపాలి కదా!’’ ‘‘ఔను, ఐతే?’’ ‘‘అన్నంలో పప్పు’’ ‘‘పప్పు ఉడకలేదా?’’ ‘‘అది కాదండి!’’ ‘‘మరేవిటి?’’ ‘‘కూర కలుపుదాం అనుకున్నాను.’’ ‘‘కలిపావా?’’ ‘‘లేదండి!’’ ‘‘ఎందుకని?’’ ‘‘...’’ ‘‘మాట్లాడవేం?’’ ‘‘నిన్న మీరు తెస్తానన్నారు తేలేదు.’’ ‘‘ఏం తేలేదు?’’ ‘‘కంది పప్పు!’’ ‘‘సవాలక్ష సమస్యలతో నేను ఆఫీసులో ఏడుస్తా ఉంటే నీకు, నీ పిల్లకి పప్పు తేలేదన్నమాట. ఇప్పుడు పిల్ల వేలు నలగడానికి నేనే కారణం అంటున్నావా?’’ ‘‘అలా కాదండి. రోజూ దానికి పప్పు పెట్టమని మీరే కదా అన్నారు! పప్పు నిండుకుంది! అందుకని కూర కలుపుదామనుకున్నాను’’ ‘‘కలపాల్సింది! ఎందుకని కలపలేదు?’’ ‘‘కూరలేదు.’’ ‘‘కొంపలో కూరలేదా, కూరల్లేవా?’’ ‘‘కూరలున్నాయండి, బంగాళదుంపల్లేవు!’’‘‘అదేంటి?’’ ‘’’పిల్ల బంగాళాదుంప ఫ్రై అయితేనే తింటోందండి!’’ ‘‘చెప్పవే, చెప్పు. పప్పు తేలేదు.. బంగాళాదుంప తేలేదు.. ఇంకా?’’ ‘‘....’’ ‘‘ఫోనుందిగా? ఏ బిగ్ బాస్కెట్కో, అమెజాన్కో ఆర్డరివ్వొచ్చుగా’’ ‘‘మీరేగా ఎఫ్‌బిలో మునిగిపోతున్నానని వైఫై కనెక్షన్ పీకించేశారు! నా ఫోన్‌కి జీపీఆర్ఎస్ కూడా లేదు!’’ ‘‘మరి నన్ను చూడు, నా అందం చూడు, నా జడ చూడు, నా ఇది చూడు అని పోస్ట్‌లతో చంపేస్తున్నావ్గా! దానికి సొల్లుగాళ్ళంతా లైకులు, హార్టులూ! నాకెలాగుండాలే?’ ‘‘ఏదో టైంపాస్‌కి ఒక పోస్ట్ చేస్తే, దానికి ఇన్ని మాటలంటున్నారు!’’ ‘‘టైంపాస్ ఏమిటే? పెళ్ళి చేసుకున్నప్పుడే చెప్పా! వుద్యోగం చేసుకునే పిల్లొద్దు. నన్ను, నా పిల్లల్ని చూసుకునే పెళ్ళాం కావాలని! పిల్లని, నన్ను సరిగ్గా చూసుకుంటే నీకు ఇంకెక్కడిదే టైము? నీకు టైమెక్కువయికాదూ, ఈరోజు పిల్ల వేలు నలిగింది?’’ ‘‘అదేమి కాదు! పచ్చ కామెర్లోడికి అంతా పచ్చగానే కనపడుతుందంట!’’ ‘‘ఏమిటే కూసావ్?’’ ‘‘మీరు మీ కొలీగ్ అన్జెప్పి దాన్ని వాళ్లింటిదాకా రోజూ డ్రాప్ చెయ్యడం లేదా? పిల్లి పాలు తాగుతూ... లాగుంది! ఫ్లాట్‌లో పడి ఉంటాను కాబట్టి నాకు ఏం తెలీదనుకోకండి!’’ ‘‘నేను మగాడ్ని! నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా! నా ఇష్టం వచ్చినోళ్ళతో తిరుగుతా.....’’ ‘‘మాటలు జాగ్రత్తగా రానివ్వండి!’’ ‘‘ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? చెప్పు!’’ ‘‘నేనెళ్ళిపోతా!’’ ‘‘ఎక్కడికి వెళ్ళిపోతావ్?’’ ‘‘మా ఇంటికి!’’ ‘‘ఇంటికా, కాలేజి లవ్వర్ దగ్గిరకా?’’ ‘‘ఎవడండి లవరు? నాకెవ్వరు లేరు!’’ ‘‘లవరూ లేక, ఎవరూ లేక ఎక్కడికెళ్తావే?’’ ‘‘మా పుట్టింటికి పోతా.’’ ‘‘వెళ్తే మళ్ళీ రావు ఈ ఇంటికి!’’ ’’ ఈ బెదిరింపులకే!’’ ‘‘అంటే ఇది వరకు రానిచ్చాననేనా?’’ ∙∙ ‘‘హలో! అవున్రా నేనే. బావా అని పిలవకు! ఈ రాత్రి నీ చెల్లాయి నా ఇంట్లో గడపడానికి వీల్లేదు! వెంటనే దాన్ని తీసుకెళ్లిపో!’’ ‘‘...’’ ‘‘నేను వినను. బావా లేదు, గీవా లేదు. ఇదే ఆఖరు సారి! దానికి మొగుడంటే అలుసైపోయింది. నే విన్ను! అంతే! ’’ ∙∙ ‘‘డాడీ... మమ్మీ...’’ ‘‘ఏరమ్మా, ఆయన?’’ ‘‘లోపల పడుకున్నారమ్మా!’’ ‘‘అదేంటి?’’ ‘‘రాత్రి ఫ్రెండ్స్ తీసుకొచ్చారింటికి ఆయన్ని!’’ ‘‘రాత్రంతా ఆయనింటికి రాలేదా?’’ ‘‘లేదు, నాన్నగారండి!’’ ‘‘అమ్మా. తాతీ!’’ ‘‘బుజ్జీ... డాడి, తాతి టాకింగ్! మనం బయటికి వెళ్ళి ఐస్‌క్రీం తిందాం, ఏం?’’ ‘‘ఏరా! అసలే మీ అక్క దానికి సరిగ్గా తిండిపెట్టడం లేదు! ఇప్పుడు నువ్వు దిగావ్! ఐస్‌క్రీం అంటూ! జలుబు చేస్తుంది! ఐస్క్రీంలూ చాక్లెట్లు వద్దు!’’ ‘‘అలాగే, బావగారండి.’’ ‘‘ఈ నక్క వినయాలకేం గాని! దానికేమన్నా కొనిపెట్టావో చంపేస్తా!’’ ‘‘ఏదో అలసటతో ఆలస్యం అయిందంటండి! సరిగ్గా చూసుకోలేదు! కందిపప్పు జార్ నిండుకుంది! పిల్లేమో అన్నీ తినదాయే! మీరే కాస్త అల్లుడుగారికి నచ్చజెప్పండి!’’ ‘‘ఏమిటే నచ్చజెప్పడం! నువ్వు దాన్ని వెనకేసుకొచ్చావు ఇన్నాళ్ళు! ఇప్పుడు అది సంసారం చేసుకోవాలా వద్దా! కాస్త ఇంగితం ఉండొద్దు! పెళ్ళైపోయింది. తన కుటుంబం. మంచి, చెడూ చూసుకోవాలా, వద్దా?’’ ‘‘చిన్న పిల్లండి!’’ ‘‘చిన్న పిల్లేంటే! అయిదేళ్ళ పిల్లకి తల్లి! ఇంకా చిన్నపిల్లంటావ్! నువ్వు పెంచావుగా దాన్ని! నువ్వు తల్లివేగా? ఇదేనా మీ పెంపకం అని అడిగితే, నా తల ఎక్కడ పెట్టుకోను?’’ ‘‘అదేంటండి అలాగంటారు? మధ్యలో నేనేం చేశాను?’’ ‘‘నువ్వు దానికి కాస్త వంటా, వార్పు నేర్పుంటే బాగుండేది.’’ ‘‘మీరేగా దాని జీవితం బాగోవాలంటే బాగా చదవాలని, చదివించారు! అది ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకోనిచ్చారు.’’ ‘‘ఔనే, చదివించాను. వంట, గింటా నేర్పొద్దన్నానా?’’ ‘‘దానికి టైమెక్కడిదండి? టెంత్‌కి వచ్చినప్పట్నుంచి ట్యూషన్లు, స్పెషల్ క్లాసులు సరిపోయినవిగా! మీరేగా పాపం పిల్ల నలిగిపోతోందే, తరువాత చూద్దాం అని అన్నారు!’’ ‘‘ఔనే, అన్నాను. మరి కాలేజి రోజుల్లో ఏం చేసి తగలడ్డావ్?’’ ‘‘ఇప్పుడవన్నీ ఎందుకులేగాని, అల్లుడు గారు మట్టుకు అలా తిట్టొచ్చా? తప్పు కదండి!’’ ‘‘ఏం తప్పు? మనమ్మాయి చేసింది తప్పు. ఇది మొదటిసారా? పదోసారో, పదిహేనో సారో! ఆయనకి మట్టుకు విసుగు పుట్టదా? ఎన్నోసారి మనకి ఫోను చెయ్యడం? మనం పరిగెత్తుకుంటూ రావడం? ఆయన చెబుతునే ఉన్నాడు! నన్నూ, పిల్లని చూసుకునే భార్య కావాలి, అది చాలని. ఒక అత్తగారు లేదు! ఒక మామగారు లేరు! మరదళ్ళు లేరు! మరుదులు లేరు! వాళ్ళ ఆరడిల్లేవు! ఇద్దరంటే ఇద్దరు! భార్య, భర్త, పిల్ల! జాగ్రత్తగా చూసుకోవద్దు?’’ ‘‘మొగుడూ, పెళ్ళాలన్న తరువాత ఏమీ ఉండకుండా ఎలా ఉంటాయండి?’’ ‘‘అయితే ఏం చెయ్యమంటావ్?’’ ‘‘కాస్త నెమ్మదిగా విడమరిచి చెప్పండి, అల్లుడిగారికి. వింటారాయన.’’ ‘‘ఆ! వింటాడు, నేను విన్నానా?’’. - అనిల్ అట్లూరి -
తడ'బడి'తే నిలబెడదాం
బుడిబుడి అడుగులు వేసే చిన్నారులను బడిలో వేసేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతారు. చిన్న పలక, అందమైన దుస్తులు ధరించి, అడుగులో అడుగేస్తూ బుజ్జాయిలు బడికి వెళ్తుంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వారి ఆనందానికి అవధులే ఉండవు. కొందరు పిల్లల విషయంలో మాత్రం తిప్పలు తప్పవు. బడి పేరెత్తితే చాలు వణికిపోతుంటారు. ఏడుపు లంకించుకుని అమ్మ కొంగును చుట్టేస్తుంటారు. ఇక బడి గంట వినబడితే చాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లు భయపడుతుంటారు. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. జగ్గయ్యపేట: గతంలో పిల్లలకు ఐదారేళ్ల వయసు వచ్చే వరకు పాఠశాలలకు పంపే వారు కాదు. బాల్యం హాయిగా ఇంట్లోనే పెద్దల మధ్య గడిచిపోయేది. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి చాలా వరకు పోయింది. ఏక కుటుంబ సంస్కృతి పెరిగింది. ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలను వీలైనంత తక్కువ వయసులోనే పాఠశాలలకు పంపటానికి ఇష్టపడుతున్నారు. ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారని, బడికి పంపితే మంచి అలవాట్లు అలవడుతాయని మూడేళ్ల పిల్లలను సైతం బడిబాట పట్టిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మొదలు గ్రామాల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. మూడేళ్లు నిండితే చాలు పిల్లలు స్కూల్లో కనిపిస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ చిన్నారులకు పాఠాలు మొదలువుతున్నాయి. ఎంతో డబ్బు పోసి పిల్లలను పాఠశాలలకు పంపితే వారు వెళ్లకుండా మారాం చేయడం వెనుక ఉన్న కారణాలను గుర్తించాలి. తల్లిదండ్రుల పాత్ర కీలకం.. చిన్నారుల్లో భయాన్ని పొగొట్టడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. కారణాలు ఏవైనా స్కూలుకు వెళ్లబోమని పేచీ పెట్టే పిల్లలను సరైన రీతిలో బుజ్జగించాలి. వారిని కొట్టి, తిట్టి భయపెట్టడం మంచిది కాదు. బలవంతంగా పంపడం వలన వారిలో పాఠశాలపై వ్యతిరేక భావన కలిగే అవకాశం ఉంది. పాఠశాలలో చేరిన కొత్తలో తల్లిదండ్రులు ఎవరో ఒకరు స్కూలులో దింపి, పాఠశాల పూర్తి కాగానే తీసుకురావటం వలన పిల్లల్లో మనోధైర్యం ఏర్పడుతుంది. ఉపాధ్యాయుల ప్రభావం.. తల్లిదండ్రుల సంరక్షణ నుంచి స్కూలుకు వెళ్లగానే ఉపాధ్యాయుల వ్యవహార శైలి పిల్లల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అందుకే పిల్లల విషయంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఎంతో కీలకం. పిల్లల్లో స్కూలు ఫోబియాను పోగొట్టాలంటే ఉపాధ్యాయుల సహకారం ఎంతో అవసరం. పిల్లలు ఉపాధ్యాయులను చూడగానే భయపడాలనే భావనతో ఉండకూడదు. సన్నిహితంగా, స్నేహపూర్వకంగా మెలగాలి. ఒక స్నేహితుని మాదిరిగా మాట్లాడి దగ్గరకు తీసుకోవాలి. పిల్లల మనసులో ఉపాధ్యాయులు కొడతారనే భావన తొలగించే ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయుల తీరు పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. నర్సరీ పిల్లలకు వీలైనంత వరకు హోంవర్కు లేకుండా చూడాలి. వారిని అనవసర ఒత్తిడికి గురి చేయకూడదు. స్కూలుకు రోజూ రావడం వలన ప్రయోజనాలను ఉపాధ్యాయులు చెప్పాలి. చిన్నప్పుడే గొప్ప వారి జీవిత చరిత్రలను చెబితే వారికి జీవితాంతం గుర్తుంటాయి. ఓ మంచి లక్ష్యం ఏర్పడటానికి దోహదం చేస్తాయి. పాఠశాల ఫోబియానే కారణం.. సాధారణంగా పిల్లలు పాఠశాల అంటే భయపడటాన్ని సైన్స్ పరిభాషలో స్కూల్ ఫోబియా అంటారు. ఇది ఉన్న పిల్లలు బడి గేటు దగ్గరకు రాగానే బిగ్గరగా ఏడవడం, వాంతులు చేసుకోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కడుపునొప్పి వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తుంటాయి. తల్లిదండ్రులు పిల్లాడు నటిస్తున్నాడు అనుకోకుండా జాగ్రత్తగా చూడాలి. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లటం మంచిది. బడి అంటే భయపడే పిల్లలను బలవంతంగా పంపడం సరికాదు. వారి భయానికి కారణాన్ని కనుగొని దాన్ని తొలగించాలి. ఆ తర్వాతే పాఠశాలకు పంపాలి. దాదాపు నూటికి 90 శాతం మంది పిల్లలు స్కూలుకు ఎలాంటి పేచీ పెట్టకుండా వెళతారు. మిగిలిన పది శాతం మందితోనే సమస్య. వీరు స్కూలంటేనే భయపడిపోతుంటారు. బడికి వెళ్లమంటూ మారాం చేస్తుంటారు. భయం పోగొట్టాలి: వెంకటేశ్వరరావు, పిల్లల వైద్యుడు స్కూలు ఫోబియాతో పిల్లలకు లేనిపోని సమస్యలు వస్తుంటాయి. కొందరు వాంతులు చేసుకొంటారు. మరి కొందరు కడుపులో నొప్పి అంటూ మారాం చేస్తారు. వారిని ఆ ఫోబియా నుంచి బయటకు తీసుకురావాలి. వారికి మంచి వాతావరణం కల్పిస్తే ఫోబియా నుంచి బయట పడతారు. ఒకసారి ఆ ఫోబియా నుంచి పిల్లలు బయటకు వస్తే మరలా ఇలాంటి సమస్య ఉత్పన్నం కాదు. -
కీచక టీచర్‌కు దేహశుద్ది
-
అరకొరే వచ్చాయ్!
సాక్షి, విశాఖపట్నం: వేసవి సెలవులు పూర్తయ్యాయి. పాఠశాలలు తెరచుకున్నాయి.అయినా పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరలేదు. వచ్చిన అరకొర పుస్తకాల పంపిణీ పూర్తి కాలేదు. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న వారు సుమారు 6.10 లక్షల మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ప్రాథమిక పాఠశాలల్లో 3.10 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1.80 లక్షలు, ఉన్నత పాఠశాలల్లో 1.20 లక్షల మంది చదువుతున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల వారికి తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల్లో బోధన ఉంటుంది. హైస్కూల్ పిల్లలకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గణితం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం సబ్జెక్టులుంటాయి. ఇలా వీరందిరికీ సుమారు 19 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం. పాఠశాలలు తెరిచాక ఇప్పటివరకు సగం అంటే దాదాపు 10 లక్షల పాఠ్య పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా స్కూళ్లకు ఎమ్మార్సీ కార్యాలయాల నుంచి పంపిణీ చేయిస్తున్నారు. ఇంకా మరో 9 లక్షల పుస్తకాలు రావాల్సి ఉంది. ఇవి మరో వారం రోజుల్లో రావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్వ విద్యార్థుల నుంచి గతేడాది పుస్తకాలను సేకరించి బుక్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తవి వచ్చే వరకు వీటితో విద్యాబోధన సాగిస్తున్నారు. ఎందుకీ ఆలస్యం! ఈ ఏడాది నుంచి విద్యాశాఖ పాఠ్య పుస్తకాలకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ పుస్తకాలపై క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ఉంటుంది. వీటిని స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ లెస్సన్స్‌ను ఆండ్రాయిడ్ మొబైళ్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని విద్యార్థులు చదువుకోవడానికి వీలవుతుంది. ఇదంతా కొత్త విధానం కావడం వల్ల పుస్తకాల ముద్రణ, సరఫరా, పంపిణీ ఆలస్యమవుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నెలాఖరుకల్లా రావచ్చు.. జిల్లాకు ఇప్పటిదాకా 10 లక్షల పాఠ్య పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా పాఠశాలల్లో పంపిణీ చేయిస్తున్నాం. మరో 9 లక్షల పుస్తకాలు అవసరమవుతాయి. ఇవి ఈ నెలాఖరుకల్లా వస్తాయని భావిస్తున్నాం. అప్పటిదాకా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా బుక్ బ్యాంకులో ఉంచిన గతేడాది పుస్తకాలతో విద్యాబోధన సాగిస్తున్నాం.– బి.లింగేశ్వరరెడ్డి,జిల్లా విద్యాశాఖాధికారి -
ఓ మంచి లంచ్‌బాక్స్!
పిల్లలకు ఆహారం తినిపించాలంటే తల్లులకు కత్తిమీద సాములాంటిదే. ఇంటి దగ్గర ఉంటే ఏదోలా బుజ్జగించి తినిపించేస్తారు. అదే స్కూల్‌కి వెళ్లితే.. అక్కడ ఎలా తింటారో, ఏం తింటారో? అసలు తినకుండా లంచ్ బాక్సును ఇంటికి తీసుకొస్తారేమో.. అన్న ఆలోచన వెంటాడుతూ ఉంటుంది. దీనికి తోడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు రోజూ బండెడు పుస్తకాలు, తరగని సిలబస్‌తో కుస్తీ పడుతుంటారు. దానికి అవసరమైన ఎనర్జీ అందించాలంటే వారికి మంచి పోషకవిలువలున్న భోజనం అవసరం. పిల్లకు ఇష్టం కదా అని వేపుళ్లు, జంక్‌ఫుడ్ పెట్టకూడదు. బయట తీసుకుంటున్నా.. నిలువరించాలి. చదువుకునే పిల్లల జ్ఞాపకశక్తి, ఆరోగ్యంపై ప్రభావం చూపే జంక్‌ఫుడ్‌ను దూరం చేయాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చిన్నారుల మంచి ఆరోగ్యానికి మంచి లంచ్‌బాక్సు అవసరం! తాడేపల్లిరూరల్ : పిల్లలు రోజూ తీసుకెళ్లే లంచ్‌బాక్సులో తల్లిదండ్రులు అనారోగ్యాన్ని పంపిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ చేపట్టిన పరిశీలనలో ఈ తరహా నిజాలు చిన్నారు ఆరోగ్యాన్ని కలవరపెడుతున్నాయి. పిల్లలు పాఠశాలలకు తీసుకెళ్లే ఆహారంలో మార్పుల వల్లనే అధిక బరువు సమస్య వస్తోందని నిర్ధారణలో తేలింది. 2016తో పోలిస్తే దాదాపు 30 శాతం పిల్లలు ఇప్పుడు జంక్‌ఫుడ్ తీసుకెళ్తున్నారు. అన్నం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు లంచ్‌బాక్స్‌ల్లో కనుమరుగైపోతున్నాయి. ఏ లంచ్‌బాక్స్ చూసినా నూడుల్స్, సమోసా, పఫ్, కేక్‌లు, బర్గర్లు, పిజ్జాముక్కలు, ఫ్రైడ్పదార్థాలు, చిప్స్, చాక్లెట్స్ వంటి పదార్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తక్కువ సమయంలో రెడీ అయ్యే ఇటువంటి పదార్థాలకు తల్లిదండ్రులు అలవాటు పడిపోతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే చిన్నారుల్లో 10 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే చిన్నారుల్లో 3 శాతం మందికి ఊబకాయం సమస్య ఉందని నివేదికలు చెబుతున్నాయి. పరిశోధనలు ఏం చెబుతున్నాయి.. జంక్‌ఫుడ్‌లో సరైన పోషకాలు, సరిపడినన్ని కేలరీలు ఉండవు. దీనివల్ల ఊబకాయంతో పాటు మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా కొవ్వు, అధిక చక్కెర, ఉప్పు, అధిక కేలరీలు కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మెదడుపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఎలుకలపై పరిశోధన చేసి ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. జంక్‌ఫుడ్ తిన్న ఎలుకలు తాము వెళ్లేదారిని కూడా మరిచిపోయినట్లు గుర్తించారు. పిల్లలకు నచ్చజెప్పాలి.. సమతుల ఆహారాన్ని ఎంపికచేసి, ఉదయం లేచిన వెంటనే ఏది పెట్టాలో పిల్లలను అడిగి.. అదే బాక్సుల్లో పెట్టాలి. ఆ విధంగా బాక్స్ ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలు వారంతట వారే ఎంపిక చేసిన ఆహారాన్ని తీసుకెళ్తుంటే.. 85 శాతం మంది పిల్లలు పూర్తిగా లంచ్‌బాక్స్ ఖాళీ చేసేస్తున్నారు. పోషకాహారమే మేలు.. స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎక్కువగా ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ వంటి పదార్థాలు అందించాలి. స్కూల్లో కంటి చూపును ఎక్కువగా ఉపయోగిచాల్సి ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు ఇవ్వాలి. చదువడం, ఆడటం వల్ల కేలరీలు అధికంగా ఖర్చవుతుంటాయి. అందువల్ల కేలరీలు లభించే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వారు నీరసించే అవకాశముండదు. వారంలో నాలుగైదు రోజులు గుడ్లు ఉడికించి ఇవ్వాలి. 18 ఏళ్ల వరకు పిల్లల్ని జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంచితే.. 40 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. లంచ్‌బాక్స్ ఎలా ఉండాలి? ⇔ ఆహారం తాజాగా ఉండే మెటీరియల్‌ను ఎంచుకోవాలి. ⇔ లోపల ఎక్కువ భాగాలుండేలా ఎంపిక చేస్తే ఎక్కువ ఐటమ్స్ పెట్టే వీలుంటుంది. ⇔ ప్రతిభాగం శుభ్రపరిచేలా చూడాలి. లేదంటే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. ⇔ సైజ్ మరీ పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియం సైజ్ మంచిది. ⇔ ప్లాస్టిక్ బాక్సులు వాడకూడదు. వేడి వస్తువులను బాక్సుల్లో పెడితే ఆ వేడికి రసాయనాలు ఆహారంలో కలిసి, అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. -
చాయ్‌వాలా కూతురుకు రూ. 3.8 కోట్ల స్కాలర్షిప్
ఇప్పుడు వేల మందిలో ఉన్నా ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కి చెందిన సుదీక్షా భాటిని సులభంగా గుర్తుపట్టొచ్చు. అందుకు కారణం ఆమె కళ్ళల్లో తొణికిసలాడే విజయస్వప్నం. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన చాయ్ వాలా కూతురు సుదీక్షా భాటీ. రోజూ పదికో పరకకో టీ అమ్ముకుని బతికే సుదీక్షా భాటీ తండ్రి వార్షికాదాయం కేవలం 72000. కానీ పట్టుదలతో చదివి తన కుటుంబాన్ని పేదరికంలో నుంచి విముక్తి చేయాలనుకుంది ఆయన కూతురు. రేయింబవళ్ళు కష్టపడి చదివి సిబిఎస్సి ప్లస్‌టూ పరీక్షల్లో 98శాతం మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. అదే ఆమె కలను సాకారం చేసింది. ఈ విజయంతో చాయ్‌వాలా కూతురు సుదీక్షా భాటీని అమెరికా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన కాలేజీలో చదువుకునేందుకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల స్కాలర్షిప్ సుధీక్షా భాటీని వరించింది. ఒక్కో సెమిస్టర్‌కి 70,428 అమెరికన్ డాలర్లు, నాలుగేళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుకి మొత్తం 3 కోట్ల 83 లక్షల రూపాయల స్కాలర్షిప్ సొంతం చేసుకొని అమెరికాలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒకటైన బాబ్సన్ కాలేజీలో చదువుకునే అత్యున్నతావకాశం సుదీక్షా భాటీ సొంతమైంది. కేవలం చదువులోనే కాదు సామాజిక కార్యకలాపాల్లో సైతం సుదీక్షా భాటీ ముందు వరుసలో ఉంటుంది. ఆడపిల్లల వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థలో ఉంటూ ఆడపిల్లలను చదివించాలని ఉద్యమిస్తోన్న సుదీక్షా భాటీ ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది. పేదరికం కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్న సుదీక్ష ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగుతానంటోంది. ‘‘అమెరికాలో చదవాలనే నా కల సాకారమయ్యింది. నా విజయం నాకే కాకుండా నా కుటుంబానికీ, నేను చదువుకున్న పాఠశాలకూ పేరుప్రతిష్టలు సమకూర్చడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. మరింత పట్టుదలతో నా గమ్యం వైపు పయనిస్తాను. నా లక్ష్యసాధనకోసం కఠోరశ్రమ చేయాల్సి ఉంది. చేయగలనన్న నమ్మకం నాకుంది’’ అని సుధీక్షా భాటీ సగర్వంగా ప్రకటించారు. -
కొండవెలగాడలో బోస్టన్ స్కూల్
నెల్లిమర్ల విజయనగరం : రాష్ట్రంలోనే ఏకైక బాల నేరస్తుల కారాగృహం(బోస్టన్ స్కూల్) రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర విభజన తరువాత గతంలో నిజామాబాద్‌లో ఉన్న బోస్టన్ స్కూల్ తెలంగాణకు తరలిపోయింది. దీంతో బాల నేరస్తులకు వసతి కల్పించేందుకు అవసరమయ్యే ప్రత్యేకమైన కారాగృహం లేకుండాపోయింది. దీంతో జిల్లాలో బోస్టన్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ అధికారులు యోచించారు. ఇక్కడే జిల్లా జైలును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కేంద్రమైన విజయనగరం నుంచి నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి వెళ్లే దారిలో రూ.25 కోట్లతో బోస్టన్ స్కూల్, జిల్లా జైలుకు అవసరమయ్యే భవనాల నిర్మాణం పనులు ప్రస్తుతం చురుగ్గా జరుగుతున్నాయి.రాష్ట్రం విడిపోయిన తరువాత ఉన్న ఒక్కగానొక్క బోస్టన్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లిపోవడంతో రాష్ట్రానికి సంబంధించిన బాల నేరస్తులను ఎక్కడ ఉంచాలో తెలియని అయోమయ స్థితిలో జైళ్ల శాఖ అధికారులు తర్జనభర్జన పడ్డారు. చివరకు విజయనగరం జిల్లాలో నెలకొల్పాలని యోచించి కొండవెలగాడ గ్రామానికి వెళ్లే దారిలో 25ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి, బాల నేరస్తులను ఇక్కడికి రప్పించాలని జైళ్లశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడే జిల్లా జైలును కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా జైలు ఏర్పాటుతో విజయనగరం, చీపురుపల్లి, సాలూరు, ఎస్.కోట ప్రాంతాల్లోని సబ్‌జైళ్లలో ఉన్న ఖైదీలను ఎప్పటికప్పుడు ఒకే చోటుకు చేర్చేందుకు అవకాశముంది. రిమాండ్ ఖైదీలతో పాటు శిక్ష ఖరారైన ఖైదీలకు వసతి సౌకర్యం కల్పించేందుకు అవకాశం కలుగుతుందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. చురుగ్గా బోస్టన్ స్కూల్ నిర్మాణం నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామ పరిధిలో బోస్టన్ స్కూల్ నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. అక్కడే జిల్లా జైలు నిర్మాణం కూడా చేపడుతున్నాం. ఇటీవల మా ఉన్నతాధికారులు సందర్శించి, నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తాం. –గణేశ్, సబ్‌జైలు సూపరింటెండెంట్, విజయనగరం -
‘గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో భారీ అగ్ని ప్రమాదం
లండన్: స్కాట్లాండ్కు చెందిన చారిత్రక గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్కూల్ పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 20 ఫైరింజన్లు, 120 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు కృషిచేశారు. స్కూల్లో మొదలైన అగ్ని కీలలు వేగంగా క్యాంపస్ నైట్‌క్లబ్, ఓ2 ఏబీసీ అనే మ్యూజిక్ కేంద్రానికి కూడా వ్యాపించాయి. ఈ భవనానికి ప్రముఖ ఆర్కిటెక్ట్ చార్లెస్ రెన్ని మెకింతోష్ రూపకల్పన చేశారు. -
పాఠశాలల సామగ్రి ఏమైంది?
బెజ్జూర్(సిర్పూర్) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ పాఠశాలకు ఏటా రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ నిధులతో పాఠశాలలో రికార్డులు భద్రపర్చేందుకు బీరువా, మూడు కుర్చీలు, చాక్‌పీస్, వాటర్‌ఫిల్టర్, తదితర సామగ్రిని కొనుగొలు చేయాల్సి ఉంటుంది. కాని సామగ్రి కొనకుండా ఈ నిధులను గతేడాది మార్చిలోనే డ్రా చేసినట్లు సమాచారం. పాఠశాలలు ప్రారంభమై 14 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సామగ్రి లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెజ్జూర్ మండలంలో 49 పాఠశాలకు సంబంధించి రూ.4.90 లక్షలు మంజూరు కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చైర్మన్లు కలిసి నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. నిధులు డ్రా అయి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా సామగ్రి కొనుగోలు చేయకపోవడంతో అప్పట్లో దీనిపై ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర అధికారులు పాఠశాలలను తనిఖీలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయులు కొంత నాసిరకం సామగ్రి కొనుగోలు చేసి ఎమ్మార్సీ కార్యాలయంలో భద్రపర్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. జిల్లా అధికారులను ఎంఈవో రమేశ్ ముందుగానే కలిసి మాట్లాడుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. విచారణకు వచ్చిన జిల్లా అధికారులు సైతం నామమాత్రంగా విచారణ చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. 46 పాఠశాలల రికార్డులను తనిఖీ చేయాల్సి ఉండగా కేవలం 22 పాఠశాలల రికార్డులను మాత్రమే తనిఖీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. 50 పాఠశాలలకుగాను కేవలం 12 మంది ఉపాధ్యాయులు ఉండగా, నలుగురు రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు మాత్రమే అన్ని పాఠశాలలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. సల్గుపల్లి పాఠశాల హెచ్ఎం తిరుపతికి19 పాఠశాలలకు, బారెగూడ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రవికి 18, పెంచికల్‌పేట ఉర్దూ పాఠశాల హెచ్ఎంకు 12, కొండపల్లి పాఠశాల హెచ్ఎం 7 పాఠశాలలకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. వీరు సామగ్రి కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల అభివృద్ధి నిధులను డ్రా చేసిన ప్రధానోపాధ్యాయులు ఇంతవరకు సామగ్రి కొనుగోలు చేయకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది. దీంతో సామగ్రి కొనుగోలు కోసం వచ్చిన నిధులు ఏమాయ్యయని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై సలుగుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిని సంప్రందించగా బెజ్జూర్ ఎంఈవో కార్యాలయంలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో నిధులు డ్రా చేయాలని మౌఖికంగా ఆదేశించడంతో డ్రా చేసి ఎంఈవోకే ఇచ్చామని తెలిపారు . బెజ్జూర్ ఎంఈవో రమేశ్‌బాబును సంప్రదించగా వారం రోజుల్లో పాఠశాలలకు సామగ్రి సరఫరా చేస్తామని తెలిపారు. సామగ్రి సరఫరా చేయని పక్షంలో నిధులను యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. -
రచ్చకెక్కిన అమరావతి పాఠశాల వివాదం
సత్తెనపల్లి: పట్టణంలోని శ్రీ ప్రగతి ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీకి సంబంధించిన అమరావతి పాఠశాల వివాదం తారస్థాయికి చేరింది. నిరసనలు, దీక్షలు, రాస్తారోకో చేపట్టిన సభ్యులు మంగళవారం స్థలానికి, పాఠశాలకు మధ్య సిమెంట్ పోల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. బుధవారం సిమెంట్ పోల్స్‌ను తొలగింప చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దాడులకు తెగబడడంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడింది. శ్రీ ప్రగతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీకి చెందిన కొండవీటి దత్తాత్రేయులు, మక్కెన వెంకట్రావు, కూలీలపై మారణాయుధాలతో దాడులు చేయడంతో వారు గాయపడ్డారు. వారు పట్టణంలోని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఖాళీ స్థలం కబ్జా చేసేందుకు యత్నాలు శ్రీ ప్రగతి ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ కార్యదర్శి పరిటాల నరేష్ మాట్లాడుతూ సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని అమరావతి స్కూలులో ఖాళీ స్థలం కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ తమను బెదిరించి స్థలాన్ని కబ్జాదారులకు అప్పగించాలని చూస్తున్నారని, అన్యాయం గురించి హైకోర్టులో రిట్ పిటీషన్ వేశామని తెలిపారు. సివిల్ వ్యవహారంలో జోక్యం చేసుకున్నందుకు స్వయంగా న్యాయస్థానానికి వచ్చి రెండు వారాల్లో కౌంటర్ వేయమని డీఎస్పీని న్యాయమూర్తి ఆదేశించారన్నారు. తనపై కోర్టులో రిట్ పిటిషన్ వేస్తారా? అనే కోపంతో డీఎస్పీ తమ స్థలాన్ని కాజేయాలని చూస్తున్న కబ్జాదారులకు సహకరించేందుకు పోలీసులకు అదేశాలు ఇచ్చారన్నారు. బుధవారం కబ్జాదారులు వంద మంది రౌడీలను తీసుకొచ్చి తమ స్థలానికి వేసిన కంచెను తొలగింప చేశారని ఆయన ఆరోపించారు. పనులు చేయిస్తున్న కొండవీటి దత్తాత్రేయులు, మన్నె వెంకట్రావు, కూలీలపై కత్తులతో దాడి చేసి దారుణంగా గాయపరిచారని తెలిపారు. అల్లర్లు సృష్టించి గాయపరిచిన వారిలో లక్కరాజుగార్లపాడుకు చెందిన కొండవీటి కృష్ణమోహన్, సత్తెనపల్లికి చెందిన సూర్యదేవర శ్రీనివాసరావు, విజయవాడకు చెందిన మొక్కపాటి రాజశేఖర్, యెల్లినేడి కోటేశ్వరరావు, దమ్మాలపాడుకు చెందిన శిరిగిరి ప్రభాకరరావు, ధూళిపాళ్లకు చెందిన బండారుపల్లి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన ఫణి శ్రీధర్, కృష్ణారెడ్డి, పెదపాలేనికి చెందిన రాజేష్, అబ్బూరుకు చెందిన నెట్టెం కృష్ణ, తక్కెళ్ళపాటి బాబ్జి అలియాస్ పాకాలపాడు బాబ్జి మరికొంత మంది ఉన్నారని తెలిపారు. తమ స్థలంలో కంచెను తొలగించిన కబ్జాదారులు, మారణాæయుధాలతో దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బధిర చైతన్యం..!
అద్దంకి రూరల్: పూనూరి ఆరోగ్యం అనే మహిళ తన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితుల పిల్లల్లో ఉన్న వికలత్వాన్ని చూసి చలించారు. వారికి విద్యను అందించి సమాజంలో భాగస్వాములను చేయాలనే తపనతో 2000 సంవత్సరంలో అద్దంకి పట్టణంలోని పాత కోర్టు భవనాల వద్ద అద్దె గృహంలో 30 మంది విద్యార్ధులతో చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాల ప్రారంభించారు. మొక్క పెరిగి వృక్షం అయినట్లు 10 సంవత్సరాల అనంతరం అంటే 2010లో ప్రభుత్వం చేయూత, దాతల సహకారంతో సింగరకొండ వెళ్లే రహదారిలోని కాకానిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో సొంత భవనం సమకూర్చారు. ప్రస్తుతం 100 మంది చిన్నారులకు ఆశ్రయం కల్పించారు. 18 వసంతాలుగా ఎందరో బధిరులు, మానసిక వికలాంగులను ఈ విద్యాలయం అక్కున చేర్చుకుంది. పాఠశాలలోని బధిర విద్యార్థులందరికీ విద్యతో పాటు ఉచితంగా భోజనం, ఉదయం టిఫిన్, సాయంత్ర స్నాక్స్, పాలు, బాలబాలికలకు వేర్వేరుగా వసతి, యూనిఫాం అందజేస్తున్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో బోధన ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం మేళవించి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక విద్యతో పాటు స్పీచ్ థెరపీ, గ్రూప్ హియరింగ్ పరికరాలు సమకూర్చి మాటలు రాని వారికి శిక్షణ ఇస్తూ ప్రత్యేక బోధనతో ముందుకు సాగుతున్నారు. వృత్తివిద్య కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి చదివిన విద్యార్థులు ఇప్పుడు ఇంటర్మీడియెట్‌లో 20 మంది, డిగ్రీలో 10 మంది, పాలిటెక్నిక్‌లో 5 గురు విద్యాభ్యాసం చేస్తుండటం తోటి విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది. సృజనకు దర్పణం బధిరుల విద్యార్థులు తమలోని కళాహృదయంతో పనికి రాని చిత్తు కాగితాలతో మానవుడి మెదడు, నౌకా, జాతీయ జెండా, గుండె, సైకిల్ వంటి కళాకృతులు నిర్మించారు. పాఠశాలకు వచ్చినవారు చిన్నారులను అభినందిస్తున్నప్పుడు వారిలో మరింత ఉత్సాహం కలుగుతోంది. ఇక్కడి వారు ప్రభుత్వ ఉద్యోగులుగా.. ఇక్కడ విద్యను అభ్యసించిన వారిలో ఇద్దరు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారిలో ఒకరు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో, మరొకరు పొదిలి మార్కెట్ యార్డులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 80 శాతం నిధులు అందజేస్తుండగా.. మిగిలిన 20 శాతం దాతల ద్వారా సమకూరుతోంది. 10 మంది బోధన సిబ్బంది ఉన్నారు. -
రాజుగారికి నచ్చిన అబద్ధం
షేక్ సాదీ (అలై రహ్మా) గొప్ప పండితులుగా పేరు గడించారు. ఆయన చెప్పిన గాథలు సమాజ సంస్కరణ కోసం ఎంతో ఉపయోగపడేవి. ఆయన చెప్పినదే ఈ గాథ. ఓ రాజుగారు ఫలానా ఖైదీని ఉరితీయండి అని తలారిని ఆజ్ఞాపించారు. ఈ మాటలు విన్న ఖైదీ ప్రాణం మీద ఆశలు వదులుకున్నాడు. రాజుగారి మీద కోపం కట్టలు తెగింది. ఎలాగూ చావు తప్పదని రాజుగారిని తనదైన భాషలో నానా దుర్భాషలాడటం మొదలెట్టాడు. ఆ విధంగా రాజుగారి మీద కక్ష తీర్చుకున్నాడు. రాజుగారికి ఖైదీ మాటలు అర్థంకాక పక్కనే ఉన్న మంత్రులను అడిగారు. అందులో నుంచి ఒక మంత్రి కలగజేసుకొని ‘‘ఈ ఖైదీ మిమ్మల్ని దీవిస్తున్నాడు. ‘‘తమ కోపాన్ని దిగమింగేవారు, ఇతరులను క్షమించేవారంటే అల్లాహ్‌కు ఎంతో ఇష్టం’’ అనే ఖుర్ఆన్ వచనాన్ని వల్లిస్తున్నాడు’’ అని రాజుగారికి మంత్రి వివరించాడు. మంత్రి చెప్పిన ఈ మాటలతో రాజుగారికి ఖైదీ మీద కోపం చల్లారింది. ఆ ఖైదీ ఉరిశిక్షను రద్దుచేస్తూ క్షమాభిక్ష పెట్టారు. పక్కనే ఉన్న మరోమంత్రి కలగజేసుకుని ‘‘ఈ ఖైదీ దీవెనలు ఇచ్చింది, క్షమాపణలు కోరింది అంతా పచ్చి అబద్ధం. రాజుగారికే అబద్ధం చెబుతావా! రాజుగారూ ఈ ఖైదీ మిమ్మల్ని నానా దుర్భాషలాడాడు’’ అని నిజం చెప్పాడు. రెండోమంత్రి నిజం చెప్పినా అతని మాటలు రాజుగారికి నచ్చలేదు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ‘‘నువ్వు చెప్పిన నిజం కంటే మొదటి మంత్రి చెప్పిన అబద్ధం నాకెంతో నచ్చింది. ఎందుకంటే మొదటి మంత్రి అబద్ధం చెప్పినా అతని సంకల్పం సత్యంపై ఉండింది. నువ్వు నిజం చెప్పినా నీ సంకల్పం నాకు నచ్చలేదు.’’ అన్నారు. మొదటి మంత్రిని అభినందించారు. – అమ్మార్ -
అక్షయ్‌హరిప్రసాద్‌కుమార్
ఉత్తరప్రదేశ్‌లోని ఖైరాహి గ్రామం. ఆ గ్రామానికి పెద్ద హరిప్రసాద్. గ్రామపెద్ద ఆలోచనలు ఊరి గురించే సాగాలి, అలాగే సాగుతుంటాయి కూడా. మామూలుగా అయితే ఊరి చెరువు ఎలా ఉంది, పంటకాలువల పూడిక ఎప్పుడు తీయాలి, రోడ్లెలా ఉన్నాయి, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా, స్కూలు భవనం పెచ్చులు రాలకుండా పటిష్టంగా ఉందా లేదా, టీచర్లు అందరూ వస్తున్నారా, పాఠాలు చక్కగా చెబుతున్నారా, పిల్లలకు పోలియో వ్యాక్సిన్లు వేయిస్తున్నారా లేదా... ఇంత వరకే సాగుతుంటాయి. అయితే హరిప్రసాద్ ఆలోచనలు మరింత ముందుకెళ్లాయి. స్కూలుకి టీచర్లు సక్రమంగా వచ్చేలా చూడటంతోనే సరిపోదు, పిల్లలు కూడా వచ్చేలా చూడాలి. అప్పుడే పిల్లలకు నాలుగు అక్షరాలు వస్తాయి అనుకున్నాడు. పిల్లల హాజరు మీదకు మళ్లింది హరిప్రసాద్ దృష్టి. తొమ్మిది, పది తరగతుల్లో ఆడ పిల్లలు తరచూ స్కూలు ‘ఎగ్గొట్టేస్తున్నారు’. నిజమే, హాజరు పట్టీ చూసిన హరిప్రసాద్‌కు కలిగిన తొలి అభిప్రాయం అదే. ‘ఒక్కొక్కరు అన్నేసి రోజులు బడికి రాకపోతే మీరేమీ పట్టించుకోరా, రోజూ పాఠాలు వినాలని చెప్పాల్సిన మీరే ఏమీ పట్టనట్లు ఊరుకుంటే ఎలా’ అని టీచర్లను అడిగాడు. అప్పుడు తెలిసింది! ఆ ప్రశ్నకు టీచర్ల దగ్గర సమాధానం లేదు. ‘ఇదే ప్రశ్న మేమూ అడుగుతున్నాం. ఆ అమ్మాయిలు మాత్రం నోరు విప్పడం లేదు. ఎంత గట్టిగా అడిగినా, నిలదీసినా కూడా మౌనాన్ని వీడడం లేదు’ అని నిస్సహాయతను వ్యక్తం చేశారు హెడ్మాస్టర్. ‘బహుశా రుతుక్రమం ఇబ్బందులు కావచ్చు, మేమెలా మాట్లాడగలం? ప్రతి నెలలోనూ నాలుగైదు రోజులు సెలవులను చూసీచూడనట్లు వదిలేయక తప్పడం లేదు’ సైన్స్ టీచర్ మెల్లగా చెప్పారు. ఆమె ఊహ నిజమే! తండ్రుల సమావేశం హరిప్రసాద్ వెంటనే స్కూల్లోనే ఒక చిన్న గదికి ఎరుపు రంగు వేసి అందులో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాడు. ‘వీటిని వాడుకోండి, ఈ సమస్య కోసం పాఠాలు మానుకోవద్దు, రోజూ స్కూలుకి రండి’ అని టీచర్లతో చెప్పించాడు. అంతటితో ఊరుకోకుండా ఆ స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయిల తండ్రులతో స్వయంగా మాట్లాడాడు. ‘రుతుక్రమం కళంకం కాదు, దేహధర్మం. ఆ రోజుల్లో ఒక పక్కన ఉండిపోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. బడికి పంపడమూ తప్పు కాదు. పిల్లలకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇంట్లో కంటే మెరుగ్గా ఉంటాయి స్కూల్లో. అమ్మాయిలను అన్ని రోజుల్లోనూ స్కూలుకి పంపించండి’ అని వారు సమాధానపడే వరకు చెప్పారు. హరిప్రసాద్ ఆరోగ్యశాఖలో స్వచ్ఛందంగా పని చేస్తుంటారు. యునిసెఫ్ నిర్వహిస్తున్న ‘ప్రాజెక్ట్ గరిమ’లో కూడా క్రియాశీలకంగా పని చేస్తుంటారు. దాంతో ఆరోగ్యశాఖ ఈ స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయిలకు అవసరమైనన్ని నాప్కిన్స్ని సప్లయ్ చేస్తోంది. ఆ ప్రయత్నంతో టీచర్లలో కూడా ఉత్సాహం వచ్చింది. అప్పటికే బడి మానేసిన 35 మంది అమ్మాయిల తల్లిదండ్రులను ఒప్పించి, ఆ అమ్మాయిలను తిరిగి స్కూల్లో చేర్చుకున్నారు స్కూల్ హెడ్మాస్టర్. లోకల్ ప్యాడ్‌మ్యాన్ హరిప్రసాద్ ఇదంతా ఎటువంటి ఆర్భాటం లేకుండా చాలా మామూలుగా చేసేశారు. కానీ ఆ ఊరి యువకులు మాత్రం అతడికి మారుపేరు పెట్టేశారు. శానిటరీ ప్యాడ్ పట్ల అవగాహన కల్పించడానికి అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాతో పోల్చి ఆ పేరే పెట్టేశారు. హరిప్రసాద్‌ను అదే సంగతి అడిగితే ‘ఆ సినిమా గురించి నాకు తెలియదు. యువకులంతా ఆ సినిమా పేరుతో పిలుస్తున్నారు’ అని నవ్వేస్తారాయన. ఖైరాహీ పాఠశాలలోని ఈ ఎరుపు రంగు గదిలో శానిటరీ నేప్కిన్స్ సిద్ధంగా ఉంటాయి. బాలికల గైర్హాజరీని తగ్గించేందుకు హరిప్రసాద్ ఈ ఏర్పాటు చేశారు. ఆ గదికి ప్రత్యేకంగా ఎరుపు రంగును వేయించింది కూడా ఆయనే! – మంజీర -
వికాస్ స్కూల్లో విధ్వంసం
కోవెలకుంట్ల : పట్టణ శివారులోని గుంజలపాడు రహదారిలో ఉన్న వికాస్ స్కూల్లో గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. వచ్చే నెలలో పాఠశాలలు పున: ప్రారంభం కానుండటంతో రెండు రోజుల క్రితం నర్సరీ నుంచి పదో తరగతి వరకు రూ. 15 లక్షల విలువ చేసే టెస్ట్, నోట్ పుస్తకాలను తీసుకొచ్చి కంప్యూటర్ ల్యాబ్‌లో భద్రపరిచారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి స్కూల్లోకి ప్రవేశించి ల్యాబ్ తాళాలు పగలగొట్టి పెట్రోలో పోసి పుస్తకాలు, కంప్యూటర్లకు నిప్పు పెట్టారు. స్కూల్ ఆవరణలో ఉన్న బస్సుల అద్దాలను ధ్వంసం చేసి పరారయ్యారు. బుధవారం ఉదయం ఈ రహదారిలో వాకింగ్‌కు వెళుతున్న వ్యక్తులు తరగతి గదిలో పొగ రావడాన్ని గమనించి స్కూల్ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. పాఠశాల కరస్పాండెంట్ వినోద్‌కుమార్ స్కూల్‌కు చేరుకుని జరిగిన విధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో రూ. 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఎస్ఐ మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
స్కూలు గేటే యమపాశంలా మారింది
న్యూఢిల్లీ : స్కూలు గేటు యమపాశంలా మారి 12ఏళ్ల విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన ముంబైలోని కోపార్ ఖైరనేలో శుక్రవారం చోటుచేసుకుంది. కోపార్ ఖైరనే సెక్టార్ 11లోని సివిక్ స్యూలు గ్రౌండ్లో సౌరభ్ చౌదరి, నిలేష్ దేవ్ర్‌లు మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. సౌరభ్, నిలేష్‌లు బంతి గ్రౌండ్ లోపలి నుంచి బయటకు పోకుండా ఉండాలని తెరచి ఉన్న స్కూలు గేటును మూయటానికి ప్రయత్నించారు. గట్టిగా స్కూలు గేటును కదపటంతో అదికాస్త మీద పడి ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సౌరభ్ తలకు బలమైన గాయం కావడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సౌరభ్‌ను ఆస్పత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయింది అత్యవసర చికిత్స పోందుతూ అతడు కన్నుమూశాడు. నిలేష్ ప్రాణాపాయం నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సౌరభ్ తండ్రి సునీల్ చౌదరి మాట్లాడుతూ.. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు చనిపోయాడని ఆరోపించాడు. తన కొడుకు చావుకు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని సునీల్ చౌదరి కోరాడు. -
జీవనం తెలుగునాడులో..అనుబంధం తమిళనాడుతో
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని తడ మండలంలో తెలుగు మాట్లాడేవారికన్నా తమిళంతో అనుబంధం పెంచుకున్న కుటుంబాలే ఎక్కువ. మండల కేంద్రం నుంచి దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో ఎక్కువగా తమిళభాషనే మాట్లాడుతారు. ఇక్కడి కుటుంబాల్లో చాలామందికి తెలుగు మాట్లాడటం పూర్తిగా రాదు. అనేకరకాలుగా ఆ గడ్డతో అనుబంధం పెంచుకున్న వారు మనకు ఈ మండలంలో కనిపిస్తారు. నెల్లూరు, తడ: మండలంలో 18 పంచాయతీలున్నాయి. అందులో సగానికన్నా ఎక్కువ చోట్ల తమిళ ప్రాబల్యం ఉంటుంది. తడ, తడకండ్రిగల్లో సగం తెలుగు వాళ్లున్నా పూడి, కారూరు, బీవీపాళెం, పెరియవట్టు, రామాపురం, ఇరకం, వేనాడుతోపాటు వాటంబేడు గ్రామాల్లో అత్యధిక శాతం తమిళభాషే వాడుకలో ఉంటుంది. ఈ పంచాయతీల్లో పెద్దలు తమ పిల్లలకు తెలుగు చదువులు వద్దని తమిళ చదువులు నేర్పేందుకే మొగ్గు చూపుతారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో.. సరిహద్దు పంచాయతీల్లో అత్యధికంగా మత్స్యకారులు, వన్నెకాపులు నివసిస్తుంటారు. ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సమయంలో కొన్ని పంచాయతీలు ఆంధ్రాలో కలిశాయి. అదేసమయంలో మత్స్యకార, వన్నెకాపు కులాలకు చెందిన వారి బంధువులు ఎక్కువశాతం ఆ రాష్ట్రం పరిధిలోకి వెళ్లిపోయారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మద్రాస్తోనే ఎక్కువ అనుబంధం ఉండటంతో విభజన అనంతరం కూడా తెలుగువారు తమిళనాడుతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. తమిళనాడులో చేర్చాలని.. తమ వారంతా తమిళనాడులో ఉన్నందున మత్స్యకారులు, వన్నెకాపులు ఎక్కువగా ఉంటున్న దక్షిణ తడ గ్రామాలను తమిళనాడులో చేర్చాల్సిందిగా గతంలో పోరాటాలు కూడా నడిచాయి. మండలంలోని సుమారు 60 వేల జనాభాలో సగం వరకు ఉన్న బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ రెండు కులాలు సగం పంచాయతీల్లో శాసించే స్థాయిలో ఉన్నారు. కనీసం ఇక్కడ తమిళ పాఠశాలలు ఏర్పాటుచేసి ఆ భాష నేర్పాల్సిందిగా అధికారులు, నాయకులకు స్థానిక ప్రజలు ఎన్నోమార్లు విన్నవించుకున్నారు. కానీ ఫలితం లేకుండాపోయింది. తెలుగు రాక ఇబ్బందులు ఇక్కడి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు తమిళం తప్ప మరో భాష రాని పరిస్థితి ఉంది. అదే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే తహసీల్దార్, ఎస్సై, ఎంపీడీఓ, బ్యాంక్ అధికారులకు చాలావరకు తమిళం రాదు. దీంతో ప్రజలు తమ సమస్యలు వారికి చెప్పుకోవాలంటే తెలుగుభాష తెలిసిన వారి సహాయం తీసుకోవాల్సిందే. రామాపురం, బీవీపాళెం, పెరియవట్టు, కారూరు, ఇరకం పంచాయతీలకు సంబంధించి మహిళా సర్పంచ్‌లుండగా వీరు తమిళం తప్ప మరో భాష మాట్లాడలేరు. పండగలు ఈ ప్రాంతంలో తెలుగు ఉగాది కన్నా తమిళ ఉగాదికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమిళ సంప్రదాయం ప్రకారం ఇక్కడ పండగలు, వివాహాది వేడుకలు జరుగుతాయి. మహిళలు, పురుషుల కట్టుబొట్టు అంతా తమిళ పద్ధతిలోనే ఉంటుంది. తమిళ పాఠ్యాంశం లేక తడ దక్షిణ ప్రాంతంలో సరైన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నెలకొనలేదు. దీంతో తమ పిల్లలను తమిళనాడులోని ఆరంబాకం, ఎళాపూరు, సున్నాంబుకుళం, గుమ్మిడిపూండి, పొన్నేరి ప్రాంతాలకు పంపి చదివిస్తున్నారు. తమిళనాడులోని సరిహద్దు గ్రామాల్లో తెలుగు మీడియంలో పాఠశాలలు చేర్పిస్తుండగా ఇక్కడ మాత్రం ఎందుకు మార్పు రావడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత అడిగినా అక్కడికే తెలుగు చదువు విషయంలో ఎంత చెప్పినా తమిళ పాఠశాలలకేపిల్లలను పంపుతున్నారు. దీనికితోడు వాహన సౌకర్యం పెరగడంతో ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు వెళ్లిపోతున్నారు. కనీసం ఒక్క తమిళ టీచర్ ఉన్నా కొంతవరకు విద్యార్థులకు కాపాడుకోవచ్చు. గతంలో కారూరు పంచాయతీ, కాశింగాడుకుప్పం పాఠశాలలో రెండువందలకుపైగా విద్యార్థులుండగా ప్రస్తుతం పదులసంఖ్యకు చేరింది.– జి.శ్రీనివాసులు, టీచర్ తమిళ పాఠశాల ఏర్పాటుకు చర్యలు ప్రత్యేక పరిస్థితుల్లో జీవిస్తున్న ఇక్కడి ప్రజలకు ప్రభుత్వాల నుంచి సరైన సహకారం లభించడంలేదు. విద్య విషయంలో చిన్నారులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించేలా రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుచేసేందుకు ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. తమిళభాష అవసరం ఉన్న పంచాయతీల్లోని ప్రధాన పాఠశాలల్లో ఆ భాషను నేర్పేందుకు ఒక టీచర్ని ఏర్పాటుచేయాలని అధికారులను కోరడం జరిగింది. అయితే ఉన్న పాఠశాలలనే మూసేందుకు సిద్ధపడుతున్న టీడీపీ పెద్దలు కొత్త పోస్ట్లిచ్చి పాఠాలు చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజల కోరిక మేరకు తమిళ పాఠ్యాంశాన్ని ప్రవేశపెడతాం. వెనుకబడిన తరగతుల పిల్లలకోసం రెసిడెన్షి్యల్ పాఠశాలను నెలకొల్పుతాం. – కిలివేటి సంజీవయ్య,సూళ్లూరుపేట ఎమ్మెల్యే -
వేదాంతదేశికులు జీవితానికి అక్షర చిత్రాలు
దార్శనికులు, తాత్త్వికులు, సంస్కృత, తమిళ, ప్రాకృత భాషలలో లెక్కకు మిక్కిలిగా వేదాంత గ్రంథాలను రచించిన ఉద్దండ పండితులు వేదాంతదేశికులు, శ్రీమద్రామానుజుల తరువాత విశిష్టాద్వైత ప్రవర్తకులలో అంతటివారుగా ప్రసిద్ధి పొందిన మహనీయులు దేశికులు. విష్ణుమూర్తి నందక ఖడ్గం ఏ విధంగా అయితే అన్నమయ్యగా అవతరించిందో, వేంకటేశ్వరస్వామివారి ఘంట వేంకట నాథులుగా ఉద్భవించినట్లు కథనాలున్నాయి. శ్రీరంగం దేవాలయం విదేశీయుల దురాక్రమణకు గురై, అక్కడి ఉత్సవమూర్తి కొంతకాలం తిరుమలలో ప్రవాసం చేసిన విషయం తెలిసిందే. తరువాతి కాలంలో ఆ మూర్తిని శ్రీరంగంలో పునఃప్రతిష్ఠించడంలో దేశికులదే ప్రముఖపాత్ర. విద్యార్థి దశలోనే శ్రీ భాష్య ప్రసంగాలను ముప్పైమార్లు చేసిన ఘనత దేశికులది. వాల్మీకి కృత రామాయణంలోని హనుమ సందేÔè ం, కాళిదాసు‘మేఘసందేశం’ వంటి సందేశకావ్య పరంపరలో పరమోత్కృష్ట కావ్యం దేశికుల హంససందేశం. ఈ కావ్యం నుంచి ప్రేరణ పొందడం వల్లే తాను ఆయన జీవిత చరిత్రను రచించినట్లు చెప్పారు. ఇందులో దేశికుల జీవితంలోని ప్రధాన ఘట్టాలతోబాటు, ఆయన వ్యక్తిత్వం, విశిష్టాద్వైతంలోనూ, శ్రీవైష్ణవమతంలోనూ దేశికులపాత్ర, ఆయన రచించిన వేదాంత గ్రంథాల వివరాలను చూడవచ్చు. దేశికులు కేవలం గ్రంథరచయిత కాదు. ఆయన చూపిన దివ్యశక్తులు ఎన్నో కథలుగాచెప్పుకొంటారు. అందమైన ముఖచిత్రం, ఆర్టుపేపరు మీద అంతకన్నా అందమైన వర్ణఛాయాచిత్రాలు అనేకం, చిత్రాలలో జీవితచరిత్ర అదనపు ఆకర్షణ. -
సహకరించని..‘దోస్త్’
సాక్షి, బోథ్: డిగ్రీ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే వి ద్యార్థులకు ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధా నం నిబంధన తిప్పలు పెడుతోంది. ఈ లింక్ ఉంటేనే దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకు నే అవకాశం ఉంది. అయితే చాలా మంది వి ద్యార్థులకు తమ మొబైల్ నంబర్లు ఆధార్‌తో అనుసంధా నం లేకపోవడంతో దరఖాస్తు చేయలేకపోతున్నా రు. అనుసంధానం చేయాలంటే కనీసం వారం, పది రోజుల సమయం పట్టే అవకాశం ఉండడం.. మరో వైపు దరఖాస్తు గడువు సమీపిస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అనుసంధానం ఉంటేనే దరఖాస్తు.. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి రెండేళ్లుగా ‘దోస్త్’ వెబ్సైట్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. గతంలో ఆధార్‌తో మొబైల్నంబర్ అనుసంధానం లేకపోయినా దరఖాస్తులను స్వీకరించారు. అయితే ఈ ఏడాది ఖచ్చితంగా అనుసంధానం ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలని వెబ్సైట్లో నిబంధన పెట్టడంతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేయలేకపోతున్నారు. అనుసంధానం నిబంధనను ఎత్తివేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇలా... డిగ్రీలో ప్రవేశాలకు గతంలో ‘మీసేవ’లో బయోమెట్రిక్ విధానం ద్వారా దోస్త్ వెబ్సైట్లో విద్యార్థులు నమోదు చేసుకుని తాము ఎంచుకున్న కళాశాలలకు, గ్రూపుల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేవారు. ఈ విధానంలో ఆధార్ నంబర్‌కు మొబైల్నంబర్ అనుసంధానం అవసరం ఉండేది కాదు. విద్యార్థుల మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకుంటే ఆ నంబర్‌కు యూసర్ ఐడీ, పాస్వర్డ్ వచ్చేది. ఈ విధానంతో రెండేళ్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలు పొందారు. కాగా, గతంలో మీసేవ నిర్వాహకులు అధిక డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెలువెత్తాయి. లింక్‌తోనే తిప్పలు... 2018–19లో డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 8న ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు దోస్త్ వెబ్సైట్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. గతంలో జరిగిన పొరపాట్ల నేపథ్యంలో ఈ సారి విద్యార్థుల ఆధార్‌తో వారి మొబైల్ నంబర్ అనుసంధానం చేయాలని నిబంధన విధించింది. దీంతో పాటు మీ సేవకు వెళ్లకుండా విద్యార్థులు నేరుగా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. లింక్ చేయాలంటే వారం సమయం.. ఉన్నత విద్యామండలి నిబంధన మేరకు విద్యార్థులు తమ ఆధార్ నంబర్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేయాలంటే దాదాపు వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. తమ ప్రాంతంలో ఉండే ఆధార్ సెంటర్‌కు వెళ్లి మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. దీనికి దాదాపు విద్యార్థులు రూ. 30 నుంచి రూ. 50 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అనుసంధానం ఎక్కడ చేస్తారో కూడా చాలా మంది విద్యార్థులకు అవగాహన లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. లింక్ నిబంధనను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2017–18లో ఇంటర్ పాసైన విద్యార్థులు.. జిల్లా పాసైన విద్యార్థులు ఆదిలాబాద్ 5,350 మంచిర్యాల 3,884 నిర్మల్ 3,941 కుమురంభీం 3013 మొత్తం 16,188 -
స్కూల్ బెల్ట్‌తో మిస్టరీ వీడింది
సాక్షి, న్యూఢిల్లీ: స్కూల్ బెల్ట్ సాయంతో తల్లికొడుకుల హత్య కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. తన గురించి చిన్న ఆనవాలు కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డ నిందితుడిని.. అతి కష్టం మీద పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ మాల్దాకు చెందిన బబ్లూ కుమార్ మోందాల్(29) ఢిల్లీ ఓఖ్లా ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉండే సావిత్రి ఘోష్ అనే వితంతువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చుట్టుపక్కల వారిని మాత్రం తానే ఆమె భర్తనని బబ్లూ నమ్మించసాగాడు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం బబ్లూకు యాక్సిడెంట్ అయి కాలికి గాయమైంది. అయితే అప్పటి నుంచి సావిత్రి తనను నిర్లక్ష్యం చేస్తూ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. గత నెల 25న ఆమెకు మద్యం తాగించి గొంతుకోసి చంపాడు. ఆపై 8 ఏళ్ల ఆమె కొడుకును కూడా అదే రీతిలో చంపి పరారయ్యాడు. దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బబ్లూకు సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా పోలీసులకు లభించలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు మిస్టరీ ఛాలెంజింగ్‌గా మారింది. బెల్ట్ ఆధారంగా... సావిత్రి భర్తగా చెప్పుకున్న బబ్లూపైనే పోలీసులకు అనుమానం మొదలైంది. కానీ, అతనికి సంబంధించి ఒక్క చిన్న క్లూ కూడా లభ్యం కాలేదు. చివరకు అతని పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ కూడా ఎవరికి తెలీకపోవటంతో దర్యాప్తు కష్టతరంగా మారింది. ఇంతలో బాలుడి స్కూల్బెల్ట్ పై స్కూల్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్ వివరాల్లో పిల్లాడి దరఖాస్తు ఫామ్‌లో ఉన్న ఫోటో(తండ్రి స్థానంలో బబ్లూ ఫోటో ఉంది) ఆధారంగా ఆచూకీ కోసం యత్నించారు. చివరకు అతను మాల్దాకు చెందిన వ్యక్తి అన్న సమాచారం దొరకటంతో సౌత్ ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ‘నిందితుడు కనీసం ఫోన్ కూడా వినియోగించేవాడు కాదు. దారినపోయే వారి ఫోన్ అడిగి తన బంధువులకు కాల్స్ చేసేవాడు. దీంతో అసలు అతను ఎక్కడ ఉన్నాడన్నది కనుక్కోవటం కష్టతరంగా మారింది. అయితే ఆ బంధువుల సాయంతోనే చివరకు అతన్ని పట్టుకున్నాం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బుధవారం జార్ఖండ్‌లోని షహిబ్‌గంజ్ ప్రాంతంలో చివరకు బబ్లూను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
సొంతింటి ఎంపికలో కీలకమివే!
ఇప్పటివరకు ప్రాజెక్ట్‌లలో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆసుపత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్ : సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆసుపత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లలను పంపించడంలో తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తుంది. పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్‌లోనే ఆసుపత్రి ఉందా? వంటి అంశాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్‌ను కొనేముందు క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్ ఆవరణలోనే పాఠశాల, ఆసుపత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. శరవేగంగా అభివృద్ధి.. కొనుగోలుదారుల అభిరుచిలో వచ్చిన మార్పుతో ఆయా ప్రాజెక్ట్‌లుండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్ ఆవరణలో పాఠశాలలు, ఆసుపత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని కంపెనీలైతే ప్లే స్కూళ్లు, రీసెర్చ్ సెంటర్లకూ ప్రాజెక్టుల్లోనే స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆసుపత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్ మాళ్లు, మల్టీప్లక్స్ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు రియల్ బూమ్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. కీలకమే కానీ.. ♦ వర్షాకాలంలో కొనుగోలుదారులు ఇంటిని కొనడానికి సైటు వద్దకెళితే రవాణా సదుపాయాల గురించి పక్కాగా తెలుస్తుంది. ♦ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందా? స్థానిక రైళ్లను సులువుగా అందుకోవచ్చా? ఇలాంటి అంశాలన్నీ వానాకాలంలోనే పక్కాగా తెలుస్తాయి. ♦ వర్షాకాలంలో అయితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం ముంపులో ఉందా? లేక గడ్డ మీద ఉందా అనే విషయం ఇట్లే తెలిసిపోతుంది. వానలు పడితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతమంతా నీరుతో నిండిపోతుందా? అనే అంశం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చే ముందే తెలుసుకోవచ్చు. ♦ నిర్మాణ పనులు ఆరంభమైనా నిర్మాణం చివరి స్థాయిలో ఉన్నా వర్షాకాలంలో వెళితే ఆయా కట్టడం వర్షాలకు గట్టిగా నిలుస్తుందా? లేదా అనే విషయం తెలుస్తుంది. ♦ గోడల్లో పగుళ్లు ఉన్నా, వర్షం నీరు కారుతున్నా పరీక్షించడానికి ఇంతకు మించిన సమయం లేదని గుర్తుంచుకోండి. -
పుస్తకమూ విద్యార్థే!
ఒకప్పుడు అన్న చదివిన పుస్తకాన్నే తమ్ముడు చదివేవాడు, అక్క చదివిన పుస్తకాన్నే చెల్లెలు చదివేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లు వచ్చాక ఒక పుస్తకాన్ని మరొకరు చదవడానికి వాళ్లు పెట్టుకున్న నిబంధనలు అంగీకరించడం లేదు. ‘‘మా పెద్ద పిల్లాడు చదివింది కూడా మీ స్కూల్లోనే, మీ కౌంటర్లో కొన్న పుస్తకాలే ఇవి. చిన్న పిల్లాడిని ఈ పుస్తకాలతో చదువుకోనివ్వండి’’అని పేరెంట్స్ మొత్తుకున్నా సరే, ప్రైవేటు స్కూళ్ల రూల్స్ ఒప్పుకోవు. ‘‘అంతగా ఆ పుస్తకాలు బాగున్నాయనుకుంటే మీ చిన్న పిల్లవాడికి రెండో సెట్‌గా ఉంటాయి. ఇంట్లో ఉంచుకోండి. ఒకవేళ ఇప్పుడు కొన్న పుస్తకాల్లో ఏవైనా పోతే అవి పనికొస్తాయి’’ అని.. స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. పేరెంట్స్ ఇంకేం చేస్తారు? ఓ ఏడాది పాటు దాచి, అవీఇవీ అన్నీ కలిపి పాత పేపర్లు కొనేవాళ్లకు తూకానికి వేసేస్తారు! ప్రభుత్వ ఉద్యమం! ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల పుస్తకాల పొదుపు ఉద్యమం మొదలు పెట్టింది! వాడిన పుస్తకాలు వెళ్లాల్సింది పాత పేపర్ల దుకాణానికి కాదని, మరో పేద విద్యార్థికి అవి జ్ఞానాన్ని అందించాలనీ ప్రభుత్వం సంకల్పించి పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్’ నుంచి ఢిల్లీలోని అన్నీ స్కూళ్లకు ఆదేశాలు వెళ్లాయి. వాటి ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థికి పెద్ద తరగతికి వెళ్లినప్పుడు కొత్త పుస్తకాలు ఇచ్చే టైమ్‌లో అతడికి గత ఏడాది ఇచ్చిన పాత పుస్తకాలను స్కూలు సిబ్బంది వెనక్కి తీసుకోవాలి. వాటితో ఓ బ్యాంకు తయారు చేయాలి. పాత పుస్తకాలలో జారిపోతున్న పేజీలను అతికించి, పెన్సిల్ రాతలను చెరిపేసి వాటిని మళ్లీ వాడుకునే విధంగా సిద్ధం చేయాలి. కొంతమంది పిల్లలు పుస్తకాలను పూర్తిగా పనికి రానంతగా చించేసినా సరే వాటిని మెరుగుపరచాలి. దీనివల్ల సగం పుస్తకాలైనా బుక్ బ్యాంకుకు చేరతాయి. అంటే ప్రభుత్వం తిరిగి పుస్తకాలు ముద్రించాల్సిన ఖర్చులో ఏటా çసగానికి సగం ఆదా అవుతుంది. అంతకంటే ముఖ్యంగా కాగితం తయారీకి అవసరమైన సహజ వనరులు ఆదా అవుతాయి. పేరెంట్స్ సహకారం తాజాగా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. అక్కడి ప్రభుత్వ పాఠశాల సిబ్బంది పాత పాఠ్య పుస్తకాలను విద్యార్థుల నుంచి సేకరించి ఒకచోట అందుబాటులో ఉంచుతారు. ఆ పుస్తకాలను తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. అలాకూడా కొనలేని పిల్లలకు వాటిని ఉచితంగా ఇస్తారు. ఈ విధానాన్ని ప్రైవేట్ స్కూళ్లు కూడా ఆచరిస్తే పేద తల్లిదండ్రులు ఆర్థికంగా కాస్త ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు కొత్త పుస్తకాల ముద్రణ తగ్గుతుంది కనుక పర్యావరణానికీ మేలు జరుగుతుంది. పేరెంట్స్ కూడా పూనుకుని తమ పిల్లలు చదివేసిన పాఠ్యపుస్తకాలను కాలనీలలో ఉండే లైబ్రరీలకు ఇస్తే.. పుస్తకాలు కొనలేని వాళ్లు వాటిని తీసుకుంటారు. ఏడాది మధ్యలో పిల్లలు పుస్తకాలు పోగొట్టినప్పుడు లైబ్రరీలో ఉండే ఈ పుస్తకాలు పెద్ద ఆసరా అవుతాయి. అక్షరం అమూల్యం టెక్ట్స్ బుక్ జీవితకాలం తొమ్మిది నెలలో ఏడాదో కాదు. వాటికి దక్కాల్సిన గౌరవం కాగితం తూగే బరువుతో కాదు. పుస్తకం విలువ వెలకట్టలేనంత విలువైన సమాచారం. అమూల్యమైన వాటిని అంతే అమూల్యంగా వాడుకోవాలి. ఢిల్లీలో మొదలైన ఈ బుక్ బ్యాంక్ ఉద్యమం అన్ని రాష్ట్రాలకూ విస్తరించాలి. పాఠ్య పుస్తకాల జీవితకాలం ఎంత ఉంటుంది? ఏడాది అనుకుంటాం కదా! ఏడాది అన్నది విద్యాసంవత్సరానికి మాత్రమే కానీ, పుస్తకానికి కాల పరిమితి అంటూ ఉండదు. పాత విద్యార్థులు వెళ్లిపోయి, కొత్త విద్యార్థులు వచ్చినా మళ్లీ ఇదే పుస్తకాన్నే కదా చదవాలి. అందుకే జాగ్రత్తగా వాడుకున్నంత కాలం, వాడుకోవడం తెలిసినంత కాలం పాఠ్యపుస్తకాలు నిలిచి ఉంటాయి. సిలబస్ మారే వరకు పాఠ్యపుస్తకాలు కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త విద్యార్థులే. -
యూపీలో ఘోర రైలు ప్రమాదం
-
రైలు బండి కాదు సర్కారీ బడి
మన దేశంలో చదువుకోవాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైళ్లలో ప్రయాణించి మరీ పాఠశాలకు వెళ్లిన విద్యార్థుల్ని చూశాం. కానీ రాజస్తాన్‌లోని అల్వార్‌లో విద్యార్థులు రైలెక్కి మరీ అక్షరాలు దిద్దుతున్నారు. సర్వశిక్షా అభియాన్‌లోని ఒక ఇంజనీర్ ఆలోచన ఆ పాఠశాల రూపురేఖలే మార్చేసింది. ప్రభుత్వ పాఠశాల భవనం కాస్తా రైలుగా మారిపోయింది. రైలు ఇంజిన్ ప్రిన్సిపాల్ గది, రైలు బోగీలే తరగతి గదులు, పిల్లలు ఆడుకునే మైదానం రైల్వే ప్లాట్‌ఫామ్‌గా కనిపిస్తుంది. కాంపౌండ్ వాల్ని గూడ్స్ రైలుగా మార్చి వాటిపై స్ఫూర్తిదాయక కొటేషన్లు రాశారు. ఇన్ని హంగులు ఎందుకు చేశారన్న సందేహాలు ఎందుకంటే.. అన్ని రాష్ట్రాల్లోలాగే రాజస్తాన్‌లోనూ ఎవరూ సర్కారీ బడివైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అందుకే విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఇలాంటి సరికొత్త ఆలోచన చేశారు. పిల్లల్లో రైలు బండిపై చాలా కుతూహలం ఉంటుంది. రైలెక్కడం అంటే ఎగిరి గంతేస్తారు. అందుకే ఈ సర్కారీ బడి కాస్తా రైలు బండిగా మారిపోయింది. ఇలా మారాక విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాఠశాల సిబ్బందిలోనూ ఉత్సాహం పెరిగింది. కొన్ని తరగతి గదులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రిన్సిపాల్ పురుషోత్తం గుప్తా చెప్పారు. పిల్లలైతే చుక్ చుక్ రైలు వచ్చింది.. చదువులను మోసుకొచ్చిందంటూ చదువుకుంటున్నారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉప‘కారం’..!
సంక్షేమ పథకాలకు కత్తెర వేసుకుంటూ వస్తున్న సర్కారు తన కత్తిని మరోమారు విద్యార్థుల వైపు తిప్పింది. విద్యార్థులకు సాయం చేయడానికి అందించే ఉపకార వేతనాలను వీలైనన్ని తీసేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఇందుకు పల్స్ సర్వేను సాకుగా చూపిస్తున్నారు. ఇదివరకు చేసిన పల్స్ సర్వే ఆధారంగా దాదాపు 19 వేల మంది విద్యార్థులకు స్కాలర్ రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. గత ఏడాది దాదాపు 12 వేల మందికి ఇలాగే సాయాన్ని దూరం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. సాయం చేయాల్సింది పోయి ఇలా కక్షపూరితంగా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. రాజాం/పాలకొండరూరల్ : ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తీసేసి.. ప్రజా సంక్షేమ పథకా లను తగ్గిస్తూ వస్తున్న టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఉపకార వేతనాలపై మళ్లీ గు రి పెట్టింది. నిబంధనలను మార్చుతూ కోత వేయడానికి సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 2015–16 ఆర్థిక సంవత్సరం వరకూ అన్ని గ్రామాల్లోని మహిళా సం ఘాలకు సంబంధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేవి. 2016–17 విద్యాసంవత్సరంలో మాత్రం పల్స్ సర్వే ప్రామాణికంగా స్కాలర్స్ ఇచ్చారు. ఫలితంగా ఆ ఏడాది 9–12 తరగతుల విద్యార్థులు 12 వేల మందికి మొండిచేయి ఎదురైంది. వీరంతా పల్స్ సర్వేలో లేరని సర్కారు చెప్పింది. అయితే మహిళా సంఘాల సభ్యులు అప్పట్లోనే దీనిపై మండిపడ్డారు. సంఘాల్లో ఉన్నా స్కాలర్లు ఇవ్వలేదని బహిరంగంగానే ఆరోపించారు. పెరగనున్న సంఖ్య.. నెలరోజుల కిందట విద్యార్థులకు ఇచ్చిన ఉపకార వేతనాలు నిజానికి 2016–17 విద్యాసంవత్సరం చివరిలో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఏడాది కాలంపాటు తాత్సారం చేశారు. చివరకు 12 వేలమందిని రిజెక్ట్లో పెట్టేశారు. తాజాగా ఈ ఏడాది (2017–18) విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంతవరకూ ఉపకార వేతనాలు అందించలేదు. ఈ ఉపకార వేతనాలు వచ్చే విద్యాసంవత్సరంలో అందించనున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరంలో 12 వేల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులను బాధితులుగా చేయనున్నారు. దీనికి కూడా మళ్లీ ‘పల్స్’నే సాకుగా చూపెట్టనున్నారు. ఆందోళనలో విద్యార్థులు.. ఏటా అర్హత గల విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తూ పోతుండడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎవరి పేరు ఉంటుందో ఎవరి పేరు ఊడుతుందో తెలీకపోవడం, అనర్హతకు నిర్దిష్టమైన కారణాలు చూపకపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. మహిళా సంఘాల సభ్యులు తాము సంఘాల్లో ఉన్నా పిల్లలకు స్కాలర్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపకార వేతనాలు అందాల్సిన మొత్తం విద్యార్థులు : 1,04,698 మంది వీరికి అందించాల్సిన మొత్తం : రూ. 12,56,37,600 2016–17 విద్యాసంవత్సరంలో గుర్తించిన విద్యార్థులు : 92,462 మంది. వీరికి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది : రూ.11,09,54,400 2016–17 విద్యాసంవత్సరంలో ఉపకార వేతనాలకు నోచుకోని బాధిత విద్యార్థులు : 12,236, వీరికి చెల్లించాల్సిన మొత్తం : రూ. 1.46,83,200 ఉపకార వేతనాలు అందించే తరగతులు : 9 నుంచి 12వ తరగతి వరకూ ఒక్కో విద్యార్ధికి ఏడాదికి ఇచ్చేది : రూ. 1200లు 2017–18 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ఈ పధకానికి అర్హులైన విద్యార్థులు : 1,12,384 మంది (అంచనా వివరాలు). పల్స్ సర్వేలో ప్రస్తుతం అంచనాల ప్రకారం స్కాలర్ రాని విద్యార్థులు : 19 వేల మంది ఉపకార వేతనం రాలేదు.. నాకు ఉపకార వేతనం రావాల్సి ఉంది. కానీ రాలేదు. మా అమ్మ మహిళా సంఘంలో ఉంది. అయినా ఎందుకు ఇవ్వలేదని అర్థం కాలేదు. అడిగితే ఇప్పుడు నెట్లో అప్లై చేయమంటున్నారు. - సీహెచ్.జీవన్‌కుమార్, 9వ తరగతి విద్యార్థి మాకు రాలేదు.. మాకు ఉపకార వేతనం ఇంతవరకూ రాలేదు. దీంతో ఇబ్బందిగా ఉంది. ఈ ఉపకార వేతనం వస్తే పదో తరగతి పుస్తకాలు కొనుక్కుందామని అనుకున్నాను. ఇంతవరకూ ఇవి రాలేదు. నాపేరు కూడా లిస్టులో లేదని అంటున్నారు. – ఆబోతులు గణేష్, పాలకొండ. పేరు ఉన్నా డబ్బులు రాలేదు.. ఉపకార వేతనాలకు సంబంధించి నాకు ఈ ఏడాది డబ్బులు రాలేదు. మా స్నేహితులకు వచ్చాయి. ఈ వేతనాలకు సం బంధించి నెట్లో నా పేరు ఉంది. కానీ డబ్బులు రాలేదు. – వారణాశి పావని, కాకరాపల్లి, సంతకవిటి మండలం. చర్యలు తీసుకుంటున్నాం.. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు చెందిన విద్యార్థులకు ఏటా అందిస్తున్న ఉపకార వేతనాల్లో ఈ ఏడాది కొంతమందికి రాని విషయం వాస్తవమే. పల్స్ సర్వేను ప్రామాణికంగా తీసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. బాధిత విద్యార్థులు 12 వేల మందికి పైబడి ఉన్నారు. వీరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – డి.సీతారామయ్య, వెలుగుశాఖ డీపీఎం, శ్రీకాకుళం. -
స్కాలర్‌షిప్‌ల మంజూరులో జాప్యమెందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యా ర్థులకు స్కాలర్షిప్లను మంజూరులో జాప్యంపై పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఉపకార వేతనాల మంజూరులో జాప్యం పై ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) శుక్రవారం సమీక్షించింది. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆయా శాఖలు అనుసరిస్తున్న విధానంపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. దరఖాస్తులను ఆన్లైన్లోనే తీసుకుంటున్నామని, కోర్సు, విద్యాసంస్థ, సామాజిక, ఆర్థిక అర్హతలన్నీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే ఆన్లైన్లో నమోదవుతాయని అధికారులు వివరించారు. కాలేజీ, వర్సిటీల్లోని విద్యా ప్రమాణాలను బట్టి స్కాలర్షిప్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికారులు వెల్లడించారు. స్కాలర్‌షిప్‌ల మం జూరు, వాటిలో ఇబ్బందులపై చర్చించడానికి వీసీలతో భేటీ ఏర్పాటు చేయాలన్నారు. -
పాఠశాలలో ఘాతుకం
సాక్షి, మక్తల్ : పాఠశాలలోని తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న ఓ ఉపాధ్యాయురాలిపై భర్త కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు.. ఈ సంఘటన బుధవారం మండలంలోని ముస్లాయిపల్లిలో కలకలం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దాదన్‌పల్లికి చెందిన అంజిరెడ్డి, లక్ష్మి దంపతుల కూతురు కన్యాకుమారి(35) కి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని సాతన్‌కోటకు చెందిన రమణారెడ్డితో గత ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఈమె ముస్లాయిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. భార్యాభర్తలు కలిసి మక్తల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఏడాది భార్యాభర్తల మధ్య బేదాభిప్రాయాలు వచ్చి తర చూ ఘర్షణ పడేవారు. దీంతో బంధువు లు పం చాయతీ నిర్వహించి నచ్చజెప్పేవారు. చిన్నచూపు చూస్తోందని.. ఇటీవల డీఎస్సీ ప్రకటించడంతో రమణారెడ్డి కర్నూలులోని అవనిగడ్డలో కోచింగ్ తీసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకుని.. తనను చిన్నచూపు చూస్తుందని భావిస్తూ మంగళవారం ఇద్దరూ కలిసి దాదన్‌పల్లికి వచ్చారు. బుధవారం ఉదయం తన పిల్లలు జసిక, అనన్యలు రమణరెడ్డితో కలిసి ముస్లాయిపల్లి పాఠశాలకు వచ్చారు. ఇద్దరూ కలిసి ఓ గదిలో మాట్లాడుతున్న సమయంలోనే భర్త కత్తితో భార్యను పొడిచాడు. దీంతో ఆమె కేకలు వేయగా ఉపాధ్యాయులు రావడంతో రమణారెడ్డి తన చేతిలో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన వారిని గ్రామస్తులు 104లో మక్తల్ ఆస్పత్రికి తరలించారు. కన్యాకుమారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రానికి పంపించారు. విషయం తెలుకున్న జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి, అనుగొండ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఘటన చోటుచేసుకోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఎంఈఓ లక్ష్మీనారాయణ పాఠశాలకు వచ్చి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తరచూ గొడవపడేవారు.. రమణారెడ్డి తమ ఇంటికి వస్తే చాలు తరచూ గొడవపడేవారని కన్యాకుమారి తండ్రి అంజిరెడ్డి అన్నారు. ప్రతిరోజు దాదన్‌పల్లి నుంచి ము స్లాయిపల్లికి పాఠశాలకు వెళ్లేదని, బుధవారం సై తం అలాగే వెళ్లగా ఘటన చోటుచేసుకుందన్నా రు. రమణారెడ్డి మాట్లాడుతూ తనను చిన్న చూపు చూస్తుందని, దీంతో అనుమానం పెం చుకుని కత్తితో బెదిరించే క్రమంలో ఘటన చోటు చేసుకుందన్నారు. తనకు ఏమాత్రం గౌరవం ఇ వ్వడం లేదని వాపోయారు. ఈ విషయం కుటం బ సభ్యులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. -
ఆల్ బాయ్స్ స్కూల్లో ఒక్కతే అమ్మాయి
ప్రతిభ కన్నా పద్ధతి ముఖ్యం అనుకుంది ఒక స్కూలు. పద్ధతిదేముందీ, ప్రతిభే ముఖ్యం అనుకుంది ఇంకో స్కూలు. దాంతో ప్రతిభ ఉన్న ఒక బాలికకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆల్ బాయ్స్ స్కూల్లో సీటు లభించింది! అది పూర్తిగా బాయ్స్ స్కూల్. 92 ఏళ్ల నుంచీ ఉంది. మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అక్కడే చదువుకున్నారు. బాలీవుడ్ నటుడు రాజ్‌కపూర్ చదివిన స్కూల్ కూడా అదే. ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్‌లో ఉన్న కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్ అది. ఈ ఆల్ బాయ్స్ స్కూల్లో తొలిసారిగా ఇప్పుడు షకీనా ముఖియా అనే బాలిక చేరింది. పదకొండేళ్ల ముఖియా రియాలిటీ షో ద్వారా దేశానికి సుపరిచితమైన గాయని. ఎందుకు చేరాల్సి వచ్చింది? షకీనా ముఖియా డెహ్రాడూన్‌లోని సెయింట్ థామస్‌లో ఆరవ తరగతి వరకు చదివింది. సరిపడా హాజరు లేకపోవడంతో ఆమెను ఏడవ తరగతికి ప్రమోట్ చేయడానికి ససేమిరా అనేసింది స్కూల్ యాజమాన్యం. ‘వాయిస్ ఇండియా కిడ్స్’ రియాలిటీ షో కోసం ఆమె తరచూ స్కూలుకు ఆబ్సెంట్ అవుతుండేది షకీనా. ‘ఆమె ఎంత చురుకైన విద్యార్థి అయినప్పటికీ మా రూల్స్ మాకుంటాయి కదా, అటెండెన్స్ తగినంత లేకపోతే విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయడం కుదరదు. మళ్లీ అదే క్లాసు చదవాల్సిందే’ అని కరాఖండిగా చెప్పేసింది యాజమాన్యం. చదివిందే చదవడమా! ‘నాకు సిలబస్‌లో పాఠాలు రాకపోతే కదా మళ్లీ చదవాల్సింది, నాకు పాఠాలన్నీ వచ్చు ఇంకెందుకు చదవాలి’.. ఇదీ షకీనా ఆశ్చర్యం. ఆమె తల్లిదండ్రులక్కూడా తమ బిడ్డ ఒక ఏడాదిని వదులుకోవడం ఇష్టంలేకపోయింది. దాంతో డెహ్రాడూన్‌లోని కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్‌ను సంప్రదించారు. ఆ స్కూలు ‘ఓన్లీ బాయ్స్’ అనే నిబంధనను పక్కన పెట్టి, ‘ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం’ అన్నట్లు షకీనాకు పరీక్ష పెట్టింది. షకీనా పాసయింది. సీట్ ఖరారైంది. రేపటి నుంచి (ఏప్రిల్ 12) క్లాసులు మొదలవుతాయి. ఇప్పుడిక షకీనా ఏడవ తరగతి విద్యార్థిని. ఆల్ బాయ్స్ స్కూల్లో షకీనాకు సీటిచ్చి స్కూలు యాజమాన్యం రికార్డు బ్రేక్ చేసింది కానీ.. ఆమెకు యూనిఫామ్ డిజైన్ చేయించడం వంటి ఇతర సౌకర్యాలేవీ సాధ్యం కాదనేసింది! అబ్బాయిల్లాగానే ప్యాంటు, షర్టు వేసుకోవాలని చెప్పింది. ‘అదసలు సమస్యే కాద’నేసింది షకీనా. గుడ్. తల్లిదండ్రుల సంశయం ఇప్పటి వరకు కో ఎడ్యుకేషన్‌లో చదివిన అమ్మాయి, ఇప్పుడు స్కూలు మొత్తానికి ఒక్కతే అమ్మాయి! ఇబ్బంది పడుతుందేమోనని తల్లిదండ్రులు వికాస్, ధీరా ముఖియా సందేహించారు. షకీనా మాత్రం ‘సింగర్‌గా ఎదగాలి, కాంపిటీషన్లలో పాల్గొనాలి, అదే సమయంలో చదువు పూర్తి చేసుకోవాలి. ఇదే నా ఆకాంక్ష. అందుకు అనుమతించిన గ్రేట్ స్కూల్ ఇది. ఎంతోమంది గొప్ప వాళ్లు చదివిన స్కూల్లో నేను చదువుతున్నాను’ అని సంతోషంగా చెబుతోంది. షకీనా రేపటి రోజున పెద్ద సింగర్ అయిన తర్వాత వచ్చిన కొత్త తరం విద్యార్థులు... ‘మాది సింగర్ షకీనా చదివిన స్కూల్’ అని చెప్పుకుంటారేమో! ఇప్పుడు మనం షకీనా చేరింది వి.పి. సింగ్, రాజ్కపూర్లు చదివిన స్కూల్ అని చెప్పుకున్నట్లుగా. – మంజీర -
పాఠశాలలకు సమీపంలో మద్యం దుకాణమా..!
భోగాపురం: ఓ పక్క ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు.. మరో పక్క గ్రామదేవత పైడితల్లి అమ్మవారి వనుము.. ఇంకోవైపు జాతీయ రహదారి.. ఇలాంటి చోట మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ దుకాణం ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. భోగాపురం మండల కేంద్రంలో బట్టికాలువ సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని (లైసెన్స్ జీఎల్ఎస్ నంబర్ 30 (ఏ 4 షాపు) నాయుడు వైన్స్) పోలిపల్లి గ్రామానికి మార్చేందుకు సదరు షాపు యజమాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అదే గ్రామానికి చేరువలో వైఎస్సార్సీపీ నాయకుడుకి చెందిన మద్యం దుకాణం ఉంది. అతడిని ఇబ్బంది పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు నాయుడు వైన్స్‌ను అక్కడే ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. అనుకున్నదే తడువుగా పాఠశాల, గ్రామదేవత వనుము, జాతీయ రహదారి మధ్యలో అధికార పార్టీ నాయకుడికి చెందిన స్థలంలో షాపు ఏర్పాటుకి షెడ్ కూడా నిర్మించేశారు. అయితే జనావాసాల మధ్య దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు మాసాల కిందట కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, అబ్కారీశాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సూపరింటిండెంట్, భోగాపురం సీఐ ఇలా ప్రతీ ఒక్కరికీ ఫిర్యాదుతో పాటు షాపు ఏర్పాటు వల్ల ఏర్పడే ఇబ్బందులను వివరించారు. అలాగే ఆ స్థలంలో షాపు పెట్టకుండా నిలుపుదల చేయాలంటూ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. దీనిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలంటూ అబ్కారీ శాఖ కమిషనర్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో డిప్యూటీ క మిషనర్ పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం సు ప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం సదరు స్థలంలో షాపు ఏ ర్పాటు చేయడానికి కుదరదంటూ కమిషనర్‌కి ఈ ఏడా ది మార్చి 27న నివేదిక పంపించారు. దీనిపై కమిషనర్ మార్చి 28న విజయవాడలో పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి గ్రామస్తుల అభ్యంతరాన్ని నేరుగా తెలుసుకున్నారు. అధికారులపై ఒత్తిడి.. అయితే షాపు పెట్టడానికి అవకాశం లేదన్న విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు ఏకంగా మంత్రులతో అబ్కారీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో మార్చి 30న అబ్కారీశాఖ అధికారులు మళ్లీ షెడ్‌ను పరిశీలించి కొలతలు వేశారు. షాపు పెట్టే స్థలం కూడా అధికార పార్టీ వారికి చెందినది కావడంతో అధికారులు నిబంధనలకు పాతర వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అబ్కారీశాఖ సీఐ బహుదూర్ వద్ద ప్రస్తావించగా, మద్యం దుకాణాన్ని భోగాపురం నుంచి పోలిపల్లికి మార్చేందుకు ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఈ ఫైల్ కమిషనర్ వద్ద ఉందన్నారు. మద్యం షాపు పెట్టేందుకు నిర్మాణం చేసిన షెడ్ నిబంధనల ప్రకారం ఉందా? లేదా? అని ప్రశ్నించగా నిబంధనల ప్రకారం ఉంటే షాపు ఎప్పుడో ప్రారంభమయ్యేది కదా అని సమాధానమిచ్చారు. ఏది ఏమైనా ఈ అంశం తమ చేతిలో లేదని కమిషనర్ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుందన్నారు. -
వీడు మాములోడు కాదు...
విదేశాల్లో చదువుకోవాలనుకుంటే చాలా కష్టపడాలి. అక్కడి యూనివర్సిటీల్లో చేరాలంటే ఎన్నో ప్రవేశ పరీక్షలు రాయాలి, ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలి. అయితే పరీక్షల గోల మనకెందుకులే కొందరు వదిలేస్తారు. మరికొంతమంది పట్టుదలతో సాధిస్తారు. అయితే హూస్టన్‌కు చెందిన మైఖేల్ బ్రౌన్ మాత్రం అమెరికాలోని దాదాపు అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయగా అన్నింటికి అర్హత సాధించాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మొదలుకొని యేల్, ప్రిన్స్టన్, టెక్సాస్ ఇలా ప్రఖ్యాత యూనివర్సిటీలన్నింటికి ఎంపికై అవి అందించే స్కాలర్‌షిప్‌లకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవ్వరూ కూడా రిజెక్ట్ చేయలేరు ఈ యూనివర్సిటీల్లో చేరడానికి. మరీ ముఖ్యంగా స్టాన్ఫోర్డ్లాంటి విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు అవకాశం వస్తే వదులుకోలేరు కదా అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన కొడుకు సాధించిన విజయానికి అతని తల్లి ఉప్పొంగుతూ...‘బ్రౌన్ చిన్నప్పటి నుంచీ చురుగ్గానే ఉండేవాడు. ఏ పని మొదలుపెట్టినా...మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు’ అంటూ తెలిపింది. -
సచిన్‌కు సీఎం కృతజ్ఞతలు
జమ్మూకశ్మీర్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.40 లక్షలను కుప్వారా జిల్లాలోని ఓ పాఠశాలకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన సందేశం వెల్లడించారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా మన అందరికీ సచిన్ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె అన్నారు. ద్రుగ్‌ముల్లా గ్రామంలో 2007లో స్థాపించిన ఇంపీరియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఒక్కటే పదో తరగతి వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాల. ఈ పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సచిన్ కేటాయించిన నిథులతో తరగతి గదులు, లాబొరేటరీ, మూత్రశాలలు, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లను నిర్మించనున్నారు. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోని సూళ్లకు ఇప్పటికే సుమారు 7.5 కోట్ల రూపాయలను సచిన్ కేటాయించాడు. -
స్కూలులో సచిన్ టెండూల్కర్
-
అంబిటస్లో ఘనంగా ఫుడ్‌ఫెస్టివల్
సిద్దిపేటఎడ్యుకేషన్: ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. అనే సినిమా పాటను మైమరిపించేలా పలు రకాల వంటకాలను తయారు చేసి స్థానిక అంబిటస్ పాఠశాలలో ప్రదర్శించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన ఈ ఫుడ్‌ఫెస్టివల్ కార్యక్రమంలో సుమారు 100మంది పేరెంట్స్ వివిధ రకాల ఆధునిక, సాంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతిలు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జంక్ ఫుడ్‌తో పోశకాలున్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీ చైతన్య, నారాయణ గుర్తింపు రద్దు చేయాలి
నాంపల్లి : శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని, కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మరణానికి కారకులైన యాజమాన్యాలపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షులు మద్దిలేటి, ప్రధాన కార్యదర్శి మెంచు సందీప్ అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. వారు మాట్లాడుతూ... కార్పొరేట్ సంస్థలు ర్యాంకుల పేరుతో విద్యార్థులను చంపుతున్నాయని ఆరోపించారు. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు విద్యను వ్యాపారం చేశాయన్నారు. గత ఏడాది అక్టోబర్, నవంబరు మాసాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు విద్యాసంస్థల్లోనే 47 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. అయినా యాజమాన్యాలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బోర్డు అధికారుల నుంచి రాష్ట్ర మంత్రుల దాకా వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే కేజీ నుంచి పీజీదాకా ఉచిత విద్య అందించాలని కోరారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లును ఉప సంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీవీవీ నేతలు స్వాతి, రాహుల్, కిషోర్, నజీర్, మహేష్, సందీప్, మహేష్, చందూలాల్, బలరాం, నాగరాజు, భాస్కర్, వేణు, విష్ణు, గోపి పాల్గొన్నారు. -
బడి పిల్లలకు బట్టలు
ఇక 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రతీ ఏటా రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇంత వరకు పాఠశాలల్లో కొనసాగిన రెండు డ్రెస్సుల విధానం కనుమరుగు కానుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా ఒకే రకమైన యూనిఫాంలో కనిపించనున్నారు. జిల్లాలో 231 ఉన్నత పాఠశాలలుండగా 9, 10వ తరగతుల్లో సుమారు 19 వేల మంది చదువుతున్నట్లు సమాచారం. వీరందరికీ ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు. పాపన్నపేట(మెదక్) : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే రెండు జతల యూనిఫాంల విధానంతో జిల్లాలో ఏటా సుమారు రూ.76 లక్షల వ్యయం కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ధనిక, పేద తారతమ్యం రూపుమాపి విద్యార్థులంతా ఒకటే అనే భావన పెంపొందించేందుకు. నిరుపేద విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేందుకు.. విద్యాహక్కు చట్టం అమలు పర్చేందుకు 2009 నుంచి ఉచితంగా రెండు జతల యూనిఫాంలు అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వీటిని సమకూరుస్తున్నారు. దీనికోసం ఒక్కో జత (ప్యాంటు, షర్టు)కు రూ.200 ఇస్తున్నారు. ఇందులో రూ.160 బట్ట ఖరీదు, రూ.40 కుట్టు కూలీ ఖర్చులుగా అందజేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకైతే 1 నుంచి 7వ తరగతుల వారికి నెక్కర్, షర్టు, 8వ తరగతుల వారికి ప్యాంటు, షర్టు, బాలికలకు 1నుంచి 2వ తరగతుల వారికి ఫ్రాక్స్, 3నుంచి 5 వరకు స్కర్టులు, షర్టు, 6 నుంచి 8వ తరగతుల వారికి పంజాబీ డ్రెస్సు, చున్నీ పంపిణీ చేస్తున్నారు. అయితే 9,10వ తరగతుల వారికి మాత్రం యూనిఫాంలు పంపిణీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 9,10 తరగతులకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి భాగస్వామ్యంతో ఇంత వరకు 1నుంచి 8 తరగతుల వారికి యూనిఫాంలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతుల విద్యార్థులు ఇష్టమొచ్చిన విధంగా పాఠశాలకు సివిల్ డ్రెస్సులు వేసుకొని వచ్చేవారు. దీంతో పాఠశాలలో భిన్నత్వం కనిపించేది. పేద విద్యార్థులు కొంత మంది చిరిగిన అంగీలు కూడా వేసుకొని వచ్చేవారు. ఈ వివక్షతను రూపుమాపి, పేదలకు బాసటగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే యేడాది నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు కూడా రెండు జతల యూనిఫాంలు ఇస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. దీనికోసం రూ.34.31 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. దీంతో నిరుపేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం 9,10వ తరగతుల విద్యార్థులకు కూడా ఉచిత యూనిఫాంలు ఇస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత వరకు 1నుంచి 8 తరగతుల విద్యార్థులకే యూనిఫాంలు ఇవ్వడం, 9, 10వ తరగతుల వారికి ఇవ్వక పోవడం వల్ల ఒకే పాఠశాలలో చదివే విద్యార్థుల మధ్య వైరుధ్యం కనిపించేది. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిల నిర్ణయంతో జిల్లాలో సుమారు 19వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. నిరుపేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. – మధుమోహన్, నోడల్ అధికారి ఎదురు చూపులు నేడు ఫలించాయి సుమారు పదేళ్లుగా 9, 10వ తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉచిత యూనిఫాంలు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ ఆర్థిక భారం కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతుండడంతో అటు వైపుగా ఎవరూ ఆలోచించలేదు. ప్రస్తుత నిర్ణయంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరగడానికి ఉచిత యూనిఫాంలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా కారణమే. – నీలకంఠం, ఎంఈఓ, కొల్చారం -
సెలవే శాపమైంది
పాములపాడు: శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడమే ఆ విద్యార్థికి శాపమైంది. స్కూలు లేకపోవడంతో ఆటల్లో నిమగ్నమైన బాలున్ని బావి రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన పాములపాడు మండలం వేంపెంటలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఖాజాహుసేన్, గోకారమ్మ దంపతుల కుమారుడు మౌలాలి ఆత్మకూరులోని ఓ ప్రయివేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. సెలవు కావడంతో సోమవారం తోటి పిల్లలతో కలిసి గ్రామ సమీప బావి వద్దకు ఆడుకునేందుకు వెళ్లా రు. ఆడుకుంటున్న సమయంలో కాలుజారీ నీటిలో పడ్డాడు. తోటి పిల్లల సమాచారం మేరకు తల్లిదండ్రులు బావి వద్దకు వచ్చేలోగా మౌలాలి నీటిలో మునిగిపోయాడు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుని మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపారు. సర్పంచ్ రామసుబ్బమ్మ బాధిత కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సాయం చేశారు. -
మా ఊరొచ్చిన ఏనుగు
భీమేశ్వర్ ఐదవ తరగతి చదువుతున్నాడు.రోజూ స్నేహితులతో కలిసి స్కూల్‌కి వెళ్లి వస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్ళే దారిలో పెద్ద ఖాళీస్థలం ఒకటి ఉంటుంది. ఆ ఖాళీస్థలంలో సాయంత్రం అయ్యేసరికి చాలా మంది పిల్లలు చేరి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ అక్కడ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు. దేశంలో అనేక చోట్ల తయారైన వివిధ రకాలైన వస్తువులను ఒకచోట చేర్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. వ్యాపారస్తులు ప్రజల్ని ఆకర్షించే విధంగా ఎగ్జిబిషన్లను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఒకరోజు స్కూల్ నుంచి వస్తుంటే, పెద్ద లారీలో ఏవో సామగ్రితోపాటు కొన్ని జంతువుల బొమ్మలు కూడా వాటితో వచ్చాయి. వాటిలో ఏనుగు బొమ్మ పెద్దదిగా ఉండడంతో బయటకి కనిపించింది. అది నల్ల రంగులో ఉంది. అన్ని జంతువుల కన్నా పెద్దగా, చేటంత చెవులతో, తెల్లటి పొడుగాటి దంతాలతో చూడ ముచ్చటగా తమను చూసి నవ్వుతుందా అన్నట్లు అనిపించింది చూసేవాళ్ళకి. ఏనుగు బొమ్మను లారీలోంచి దింపగానే పిల్లలంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. తమ ఊరికి ఎగ్జిబిషన్ వచ్చినందుకు సంబరపడ్డారు. వాటిని భీమేశ్వర్తో పాటు పిల్లలందరూ ఆసక్తిగా గమనించారు. ఎగ్జిబిషన్ లోపల రంగులరాట్నం, ఎన్నో ఆకట్టుకునే వస్తువులు ఉన్నా, ఏనుగు బొమ్మే నచ్చింది వాళ్ళకి. భీమేశ్వర్‌కి అప్పటికప్పుడు నిజం ఏనుగును చూడాలని అనిపించింది. ఇంటికి వెళ్లి అమ్మని అడిగాడు.. ‘అమ్మా! నాకు నిజమైన ఏనుగుని చూడాలని వుంది’.‘నిజమైన జంతువులు అడవుల్లోనే ఉంటాయి. లేదంటే జంతు ప్రదర్శనశాలలో ఉంటాయి. అది మన ఊరిలో లేదు. ఎప్పుడైనా హైదరాబాద్‌లో అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూద్దువులే’ అంది. ఆ మాటకి నిరాశ చెందాడు భీమేశ్వర్. నిజం ఏనుగుని చూడాలంటే, అన్ని రోజులు ఆగాలా అని. వాడి బిక్క మొహాన్ని అర్థం చేసుకొని ‘ఈసారి వేసవి సెలవులకి వెళ్దాం’ అని నచ్చజెప్పింది అమ్మ. ఆరోజు... హోం వర్కు చేసి పడుకున్న భీమేశ్వర్‌కి పదేపదే ఆ ఏనుగు బొమ్మే గుర్తుకు వచ్చింది. అది కళ్ళతో తనని చూసి నవ్వుతున్నట్లే అనిపించింది. నిద్రలోకి వెళ్ళిపోయిన భీమేశ్వర్‌కి చుట్టూ తన స్నేహితులే కనిపించారు రంగురంగుల బట్టలేసుకుని తూనీగల్లా. ‘అరే, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు కదా. అప్పుడే ఎలా వచ్చేశారు’ ఆశ్చర్యంగా చూడసాగాడు. వాళ్లందరూ తనలాగే నిజం ఏనుగుని చూడాలనే కోరికతో ఉన్నట్లు తెలిసింది. అందరూ కలిసి అడవి వైపు వెళ్ళసాగారు. ముందు భీమేశ్వర్ నడుస్తుంటే.. మిగిలిన పిల్లలందరూ వెనకాలే రా సాగారు. వారి ఆనందానికి అవధులు లేవు. అడవంతా బాగా తెలుసునన్నట్లు ఉత్సాహంగా గంతులేస్తూ ముందుకి వెళుతున్నారు. ఆ అడవి పూల మొక్కలతో, పండ్ల మొక్కలతో నిండి ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి ఓ జలపాతం కనిపించింది. జలపాతానికి అవతలి వైపున ఉన్న తటాకం వద్ద ఊడలమర్రి చాలా స్థలం ఆక్రమించుకుని దట్టంగా వ్యాపించి ఉంది. దాని మీద ఎన్నో పక్షులు, జంతువులు నివాసం ఏర్పరచుకుని ఉన్నట్లున్నాయి. కోలాహలంగా ఉంది. జలపాతంలో చాలా జంతువులు జలకాలాడుతూ కనిపించాయి. వాటిలో వాళ్ళు చూడాలనుకునే ఏనుగు కూడా కనిపించింది. నల్లని రంగులో భారీగా, పెద్ద తొండం, తలకి ఇరువైపులా చేటంత చెవులతో తెల్లని పింగాణీ దంతాలతో మిలమిల మెరుస్తోంది. అది తొండంతో నీళ్ళు పీల్చి, తోటి జంతువులపై తుంపరల జల్లు కురిపిస్తోంది. ఆ జల్లుల్లో అవి అన్నీ జలకాలాడుతూ సేదతీరుతున్నాయి. చూడాలనుకుంటున్న ఏనుగు నిజంగా కనిపించేసరికి ఉత్సాహం వచ్చింది వాళ్ళకి. అచ్చు ఎగ్జిబిషన్లో పెట్టినట్లే ఉంది అనుకుంటూ ఒకళ్ళను ఒకళ్ళు కూడబలుక్కుని, ‘గణపతి బప్పా మోరియా’ అని అరిచారు. దాంతో పిల్లలందరినీ ఆ అడవిలోని జంతువులు చూశాయి. తమని చూడడానికి పట్నం నుంచి పిల్లలు వచ్చారని చాలా సంబరపడ్డాయి. సింహం సైతం శాంతంగా మారి, పిల్లలకి స్నేహహస్తం అందించింది. ‘ఏంటర్రా పిల్లలూ.. ఇలా వచ్చారు’ అంటూ ప్రేమగా అడిగింది.సింహాన్ని చూసి ముందు భయపడినా, దాని శాంత స్వభావాన్ని చూసి ధైర్యం తెచ్చుకుని చెప్పాడు భీమేశ్వర్ ‘మిమ్మల్ని అందర్నీ చూడాలని వచ్చాం. ముఖ్యంగా ఏనుగు.. గజరాజుని’.అలా అంటూ ఉంటే, మిగిలిన జంతువులు జింక, నక్క, ఎలుగుబంటి, కుందేలు, తాబేలు, పావురం, చిలుక, పులి, ఒంటె వాటి స్థావరాల నుంచి బయటకు వచ్చి అక్కడికి చేరుకున్నాయి. భీమేశ్వర్ మాటలకు పులి, ఏనుగు వంక అసూయగా చూస్తూ ‘ఏం.. ఏనుగునే అంత ముఖ్యంగా ఎందుకు చూడాలని అనుకున్నారు. మేమంతా జంతువులము కామా?’ అడిగింది కినుకగా.‘ఏనుగు అంటే గణపతి అవతారం. ఏ విషయంలోనైనా గణపతినే మేము ముందుగా పూజిస్తాం. విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గజాననుడు, మూషిక వాహనుడు అని చాలా పేర్లతో పిలుస్తుంటాం. అలాంటి ఏనుగు బొమ్మనే మా ఊరి ఎగ్జిబిషన్లో పెట్టారు. అది చాలా బాగుంది. అప్పటినుంచే నిజం ఏనుగు ఎలా ఉంటుందో చూడాలని అనిపించింది’ చెప్పాడు భీమేశ్వర్.‘అవును. మేము కూడా అంతే, అందుకే అందరం కలిసి వచ్చేశాం’ చెప్పాడు విభువన్. ‘మీరందరూ దేవుళ్ళకు వాహనాలు. అయితే, గణపతి మాత్రం మాకు కనిపించే దేవుడు. పండుగ రోజుల్లో వీధికి ఒక చోట గణపతి విగ్రహాల్ని ప్రతిష్టిస్తాం’ చెప్పింది సుప్రజ.‘అవును. మేము పుస్తకాల పూజ అంటూ వినాయకుడికి తొలి పూజ చేస్తాం ప్రతి ఏటా. ఇప్పుడు నిజంగా గణపతి బప్పాని చూశాం’ సంతోషంగా చెప్పాడు అనిరు«ద్. ఆ ప్రశంసలకి గజరాజు సంతోషపడి, మురిపెంగా తలాడిస్తూ.. పిల్లలకి ఇష్టమని పొలంలోకి వెళ్లి కొన్ని చెరకుగడలూ, మొక్కజొన్న కండెలు కోసుకొని తెచ్చిచ్చింది. కోతి రేగుపండ్లు, కుందేలు కొన్ని రకాల దుంపలు, ఎలుగుబంటి పుట్టతేనె పట్టుకొచ్చి పెట్టాయి.పిల్లలందరూ ఇష్టంగా తిన్నారు. వాటితోపాటు కలిసి తనివితీరా ఆడి పాడారు. అమ్మాయిల కోసం చాలా పూలు కోసుకొచ్చి ఇచ్చాయి. అలా ఎంతసేపు గడిచిందో గాని... తెలతెలవారుతున్నట్లు తూర్పు రేఖలు విచ్చుకోవడంతో, ఎప్పుడు లేచిందో గాని ఓ కోడి సమస్త జనావళిని మేల్కొల్పడానికి ‘నేను సైతం’ అన్నట్లు ‘కొక్కొరోకో’ అంటూ గొంతెత్తి కూసింది.కలలో వినిపించినట్లు అనిపించినా అది పక్క ఇంట్లో కోడే కావడంతో మెలకువ వచ్చేసింది భీమేశ్వర్‌కి. అప్పటివరకూ ఉన్న కల కళ్ళ ముందు మెదిలింది. కలలో నిజం ఏనుగును చూసినందుకు సంతోషపడుతూ, విషయాన్ని తోటి స్నేహితులకి చెప్పాలని ఉత్సాహపడ్డాడు. -
లెక్కల్లో వెనుకబడ్డ ఢిల్లీ పిల్లలు!
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ఎన్సీఈఆర్టీ నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో దేశ రాజధాని ఢిల్లీ విద్యార్థులు వెనుకబడ్డారు. ఆంగ్లంలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఐదో స్థానంలో, గణితంలో వెనకబడిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. విద్యార్థుల సామర్థ్యాన్ని, విద్యా ప్రమాణాలను పరిశీలించేందుకు జాతీయ విద్యా పరిశోధన సంస్థ(ఎన్సీఈఆర్టీ) దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించింది. సర్వేలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో 32శాతం మాత్రమే ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. గణిత ప్రశ్నలకు 34 శాతం విద్యార్థులు మాత్రమే సమాధానం చెప్పారు. మూడో తరగతి విద్యార్థులపై సర్వే నిర్వహించగా 54శాతం గణిత ప్రశ్నలకు, 58 శాతం ఆంగ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 44 శాతం గణిత ప్రశ్నలకు, 52శాతం ఆంగ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నాస్ సర్వేలో రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ వెనుకబడి ఉంది. ఢిల్లీకి చెందిన జానకి రాజన్ అనే ప్రొఫెసర్ నాస్ సర్వేపై స్పందిస్తూ...విద్యార్థులకు లెక్కలు కూడా రాకుండా విద్యాశాఖ మంత్రి బెస్ట్ ఎడుకేషన్ మినిస్టర్ గా అవార్డులు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంచాలకులు సౌమ్య గుప్తా స్పందిస్తూ.. నాస్ సర్వే ఫలితాలకు తాము ఆశ్యర్యం చెందలేదని, తమ సర్వేలో విద్యార్థులకు నేర్చుకునే నైపుణ్యం లేదని తేలిందని తెలిపారు. అయితే, లక్షకుపైగా విద్యార్థులకు చదివే నైపుణ్యం మెరుగుపడిందని తెలిపారు. -
విద్యార్థులకు ‘పోలీస్ విధులు, చట్టాలు’ సిలబస్
నెల్లూరు(క్రైమ్): చట్టాన్ని గౌరవించే సమాజాన్ని నిర్మించేందుకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలన్నదే స్టూడెంట్ క్యాడెట్ పోలీస్ ప్రోగ్రాం (ఎస్‌సీపీపీ) నిర్వహణ ముఖ్య ఉద్దేశమని ఏఎస్పీ బి. శరత్‌బాబు అన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో ఎస్‌సీపీపీ కార్యక్రమాన్ని ఏఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లోని 8,9 తరగతులు చదివే విద్యార్థులకు పోలీసు వ్యవస్థ, పోలీసులు విధులపై అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పాఠశాల స్థాయి నుంచే పౌర నియమాలను పాటించడం, చట్టాలపై అవగాహన పెంపొందించుకుని అసాంఘిక చర్యలకు అడ్డుకట్టవేయడం అలవడుతుందన్నారు. చిన్నతనం నుంచే పోలీసు వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన ఉంటే భవిష్యత్‌లో పోలీసుశాఖకు సేవలందించే ఆలోచలనలతో పాటు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలోనూ ఎస్‌సీపీపీ అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. నగరంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, కేఏఎస్ వ్యాస్ పోలీసు స్కూల్, ముత్తుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, కోవూరు జేబీఆర్ ఉన్నత పాఠశాల, గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, నాయుడుపేట ఏపీఆర్డబ్ల్యూఆర్ఎస్ ఉన్నత పాఠశాల, కావలి ఎస్పీఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కలిగిరి జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆత్మకూరు ఎల్‌ఆర్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పొదలకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ పాఠశాలల్లో చదివే 8, 9 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వలంటీర్లను ఏర్పాటు చేసి వారానికి ఒకసారి ప్రభుత్వం ఇచ్చిన పోలీసు సిలబస్‌ను బోధిస్తామన్నారు. దీని వల్ల విద్యార్థులను మంచి పౌరులుగా తయారు చేయడంతో పాటు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి సమాజాభివృద్ధికి ఉపయోగపడేలా చిన్నారులను తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు ప్రాజెక్టర్లు, కంప్యూటర్లు, స్క్రీన్లు, ఆడియో సిస్టమ్‌లు, ట్రాఫిక్ పరికరాలు అందించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, రాఘవరెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నెలాఖరులోగా స్కాలర్షిప్లు!
సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీకి సంక్షేమ శాఖలు కసరత్తు ప్రారంభించాయి. కోర్సు ముగిసేలోగా స్కాలర్ షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించాయి. 2017–18 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.28 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని శాఖలవారీగా విభజించి.. ప్రత్యేకాధికారులను నియమించి దరఖాస్తుల పరీశీలన చేపట్టింది. ముందుగా జనరల్ కోర్సులకు... వృత్తి విద్యా కోర్సులు ఏప్రిల్ నెలాఖరులోగా ముగియనున్నాయి. ఈ క్రమంలో ముందుగా జనరల్ కోర్సుల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల దరఖాస్తులను ముందుగా పరిశీలిస్తున్నారు. మొదటగా చివరి సంవత్సరం విద్యార్థులకు, ఆ తర్వాత జూనియర్లకు ఉపకారవేతనాలు ఇవ్వనున్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలకు సంక్షేమ శాఖల వద్ద నిధులు అందుబాటులో ఉన్నాయి. మూడో త్రైమాసికంతోపాటు త్వరలో విడుదల కానున్న నాల్గో త్రైమాసికం నిధుల నుంచి వీటిని విడుదల చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలు స్కాలర్షిప్ క్లియరెన్స్ బిల్లులను తయారు చేస్తున్నారు. వచ్చేవారం నుంచి ఆయా బిల్లులను ఖజానా శాఖకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. -
తప్పిన పెను ప్రమాదం
గంట్యాడ: పాఠశాల వంటగదిలో గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో భవనం కుప్పకూలింది. సంఘటన సమయంలో పరిసర ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని రామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాఠశాల నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. పేలుడు శబ్ధానికి పరిసర నివాసితులు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పాఠశాల వంటగది నుంచి పొగలు రావడంతో అక్కడకు చేరుకున్నారు. భవనంలో నుంచి మంటలు రావడంతో స్కూల్ కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం ఇచ్చారు. హెచ్ఎం ఎంఈఓకు సమాచారం ఇవ్వగా ఆమె 101 ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి వారిని అప్రమత్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసిం ది. ప్రమాదంలో భవనం పూర్తిగా కూలి పోయింది. పాఠశాలకు ఒంటి పూట బడులు కావడం, సాయంత్రం ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్ర మాద వివరాలను ఉన్నతాధికారులకు తె లియజేస్తామని ఎంఈఓ జి.విజయలక్ష్మి తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలి యరాలేదు. ప్రమాదంలో గుడ్లు, వంట సామగ్రి, వంటపాత్రలు ధ్వంసమయ్యా యి. సిలెండర్ తునాతునకలైంది. విజయనగరం అగ్నిమాపక సిబ్బంది ఎస్ఎఫ్ఓ దిలీప్‌కుమార్, సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. -
పరీక్షల్లో పాస్ చేయిస్తానంటూ..
చండీగఢ్: హరియాణాలో దారుణం జరిగింది. పాఠాలు బోధించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదోతరగతి పరీక్షల్లో పాస్ చేయిస్తానని మభ్యపెట్టి 16 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని పసిగట్టిన బాధితురాలి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గోహానా పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ తన స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలికను సమీపంలోని బంధువుల ఇంటికి పిలిపించాడు. పరీక్షలు చాలా కఠినంగా ఉండబోతున్నాయని విద్యార్థిని భయపెట్టి.. పాస్ అయ్యేందుకు తాను సాయం చేస్తానని నమ్మబలికాడు. తాను చెప్పినట్టు వింటే.. వేరొక బాలికతో పరీక్షలు రాయిస్తానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత విద్యార్థిని తండ్రిని పిలిచి రూ.10వేలు ఇస్తే వేరొక అమ్మాయితో పరీక్షలు రాయిస్తానని ప్రిన్సిపాల్ నమ్మబలికారు. పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక తండ్రితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆయన బాధితురాలితో కలిసి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, మరో ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పాఠశాలలో ‘లెస్బియన్’ కలకలం
కోల్‌కతా: స్వలింగసంపర్కానికి పాల్పడినట్లు విద్యార్థినులతో ఓ పాఠశాల యాజమాన్యం లేఖలు రాయించుకున్న ఘటన పశ్చిమబెంగాల్లో కలకలం రేపింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలోని కమల గర్ల్స్ హైస్కూల్‌కి చెందిన 10 మంది బాలికలు స్వలింగసంపర్కానికి పాల్పడినట్లు ఇతర విద్యార్థులు ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం బాలికలను పిలిచి విచారించింది. తాము స్వలింగ సంపర్కానికి పాల్పడ్డామని వారు విచారణలో ఒప్పుకున్నట్టు పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. పాఠశాల యాజమాన్యం వారిచే లేఖలు రాయించుకుని విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. తమ పిల్లలు స్వలింగ సంపర్కానికి పాల్పడలేదని, బలవంతంగా వారిచే లేఖలు రాయించారని ఘర్షణకు దిగారు. తమ పిల్లలపై అనవనరంగా నిందలు మోపారని, చేతులు పట్టుకోవడం లేదా ఒకరి భుజాల మీద ఒకరు చేయి వేయడం స్వలింగ సంపర్కం కాదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాలికల ఉదంతాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికే లేఖలు రాయించామని స్కూల్ యాజమాన్యం తెలిపింది.