south afrcia
-
పాపం సౌతాఫ్రికా.. మరోసారి హార్ట్ బ్రేకింగ్! ప్రపంచంలోనే తొలి జట్టుగా
మళ్లీ అదే కథ.. అదే వ్యథ. ఐసీసీ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికా తలరాత ఏ మాత్రం మారలేదు. 'చోకర్స్ అనే పేరును సఫారీలు మరోసారి సార్థకత చేసుకున్నారు. సెమీస్ గండాన్ని మరోసారి సౌతాఫ్రికా గట్టెక్కలేకపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.363 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో బవుమా సేన విఫలమైంది. దీంతో బరువెక్కిన హృదయాలతో సఫారీలు ఇంటిముఖం పట్టారు. సెమీస్‌లో ఓడిపోవడం దక్షిణాఫ్రికాకు ఇదేమి తొలిసారి కాదు.పాపం ప్రోటీస్..ఇప్పటివరకు ఓవరాల్‌గా ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు పదిసార్లు సెమీఫైనల్స్ ఆడిన ప్రోటీస్ జట్టు ఏకంగా తొమ్మిదిసార్లు పరాజయం పాలైంది. దీంతో ఐసీసీ వన్డే టోర్నీ సెమీస్‌లో అత్యధిక సార్లు ఓటమిపాలైన జట్టుగా సౌతాఫ్రికా చెత్తరికార్డు నెలకొల్పింది. కాగా ప్రతీ ఐసీసీ ఈవెంట్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగే దక్షిణాఫ్రికా.. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అయ్యి ఇంటిదారి పడుతుంటుంది.ఐసీసీ ఛాంపియన్స్ తొట్టతొలి ఎడిషన్(1998) విజేతగా నిలిచిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత ఈ మెగా టోర్నీలో కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. 2000, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో వరుసగా సెమీ ఫైనల్స్‌కు చేరినప్పటికి.. రెండు సార్లు కూడా భారత్ చేతిలోనే ఓటమి పాలైంది. ఆ తర్వాత 2006, 2013 సీజన్లలో సెమీస్‌లో అడుగుపెట్టిన సౌతాఫ్రికా.. అక్కడ కూడా అదే తీరును కనబరిచింది. మళ్లీ ఇప్పుడు తాజా ఎడిషన్‌లో కూడా సౌతాఫ్రికాకు నిరాశే ఎదురైంది.వన్డే వరల్డ్‌కప్‌లో కూడా..కాగా వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాది ఇదే తీరు. అయితే ఈ ప్రపంచకప్‌లో సఫారీలను ఒత్తడితో పాటు దురదృష్టం కూడా వెంటాడింది. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా అతిథ్యమిచ్చాయి. సౌతాఫ్రికాకు ఇదే తొలి వన్డే ప్రపంచకప్. దక్షిణాఫ్రికా తమ తొలి వరల్డ్‌కప్‌లోనే సెమీస్‌కు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈమ్యాచ్‌లో ప్రోటీస్ జట్టుకు అదృష్టం కలిసిరాలేదు. వర్షం కారణంగా ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా అనుహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత 1999 వరల్డ్ కప్‌లో కూడా దక్షిణాఫ్రికా సెమీఫైనల్ల్లో అడుగుపెట్టింది. ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. ఈ మ్యాచ్‌లో ఈజీగా గెలవాల్సిన సౌతాఫ్రికా.. ఆఖరికి టైగా ముగించింది.రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. అప్పటిలో సూపర్ ఓవర్ లేదు. దీంతో ప్రోటీస్ ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత 2007లో ఆస్ట్రేలియాపై, 2015లో న్యూజిలాండ్‌పై ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను సౌతాఫ్రికా తమ సొంత తప్పిదాల్ల వల్ల చేజార్చుకుంది.ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్‌ను 298 పరుగులగా నిర్ధేశించారు. న్యూజిలాండ్ ఆరంభంలో అద్బుతంగా ఆడినప్పటికి.. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.అయితే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన గ్రాంట్ ఇలియట్‌ను రనౌట్ చేసే ఈజీ ఛాన్స్‌ను డివిలియర్స్ మిస్ చేసుకున్నాడు. దీంతో ఇలియట్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను సఫారీల నుంచి లాగేసుకున్నాడు. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్, మోర్నీ మోర్కల్ వంటి దిగ్గజ క్రికెటర్లు కంటతడి పెట్టుకున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో కూడా సౌతాఫ్రికా ఓటమి చవిచూసింది.చదవండి: మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉండండి.. నా పని నేను చేస్తా: జడ్డూ అసహనం -
ఆమ్లా, పీటర్సన్ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో దక్షిణాఫ్రికా మాస్టర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. సోమవారం వడోదర వేదికగా ఇంగ్లండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టి అంబ్రోస్(53) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(36), స్కోఫీల్డ్(20) రాణించారు. ఓపెనర్లు మస్టర్డ్(0), ఇయాన్ బెల్ నిరాశపరిచనప్పటికి మోర్గాన్, అంబ్రోస్ కీలక ఇన్నింగ్స్‌లతో ఇంగ్లీష్ జట్టును అదుకున్నారు. ఆఖరిలో ట్రిమ్‌లెట్( 4 బంతుల్లో 19 పరుగులు) హ్యాట్రిక్ సిక్స్‌లు బాది జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ప్రోటీస్ బౌలర్లలో ఫిలాండర్, హెన్రీ డేవిడ్స్, సబాలాల, కుర్గర్ తలా వికెట్ సాధించారు.హసీమ్ ఆమ్లా విధ్వంసం..158 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. సఫారీల కెప్టెన్ హషీమ్ ఆమ్లా అద్బతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు పీటర్సన్(56) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ మీకర్ రెండు, ర్యాన్ సైడ్‌బాటమ్ ఓ వికెట్ సాధించారు. సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం పాయింట్లపట్టికలో నాలుగో స్ధానంలో ఉంది.చదవండి: అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్ -
టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్‌లోనే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ బెర్త్‌లు అధికారికంగా ఖారారయ్యాయి. గ్రూపు-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూపు-బి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే ఈ నాలుగు జట్లు సెమీస్‌కు చేరినప్పటికి వాటి స్థానాలు ఇంకా ఖారారు కాలేదు.ఆదివారం న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగే ఆఖరి లీగ్ మ్యాచ తర్వాతే సెమీస్‌లో ఎవరి ప్రత్యర్ధి ఎవరన్నది తేలనుంది. కాగా మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత ఆడటం ఇప్పటికే ఖాయమైన సంగతి తెలిసిందే. కానీ ప్రత్యర్ధి సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా నా అన్నది నేడు ఖారారు కానుంది. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్‌కు పయనమయ్యాయి. రెండింటిలో ఒక జట్టు మైదానంలోకి దిగకుండానే మళ్లీ లాహోర్‌కు రావాల్సి ఉంటుంది. కివీస్‌తో చివరి పోరులో భారత్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియాతో రోహిత్ సేన మంగళవారం తొలి సెమీఫైనల్ ఆడుతుంది.ఇదే జరిగితే దక్షిణాఫ్రికా జట్టు తిరిగి పాకిస్తాన్ చేరుకుంటుంది. ఒకవేళ కివీస్ చేతిలో ఓడితే టీమిండియా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కానుంది. కంగారూలు రెండో సెమీఫైనల్ కోసం పాకిస్తాన్‌కు తిరుగు పయనం కానున్నారు. కీలక సెమీఫైనల్‌కు ముందు దుబాయ్ మైదానంలో ప్రాక్టీస్ చేయడంతో పాటు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లకు ఇది ఉపయోగపడనుంది.ఇక కివీస్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఓమార్పుతో బరిలోకి దిగింది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్. న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ ), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.చదవండి:SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్ బైబై -
CT 2025: సౌతాఫ్రికాకు భారీ షాక్!.. స్టార్ పేసర్ అవుట్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ(ICC Chapions Trophy)లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో కార్బిన్ బాష్(Corbin Bosch) చోటు దక్కించుకున్నాడు. పేసర్ అన్రిచ్ నోర్జే(Anrich Nortje) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడంతో... అతడి స్థానంలో క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) బాష్‌ను ఎంపిక చేసింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న నోర్జే 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ బరిలోకి కూడా దిగలేదన్న విషయం తెలిసిందే.ఇక నోర్జే స్థానంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చిన 30 ఏళ్ల బాష్ గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో మూడో వన్డేలో బరిలోకి దిగి ఒక వికెట్ తీసిన ఈ రైటార్మ్ పేసర్.. లక్ష్య ఛేదనలో నలభై పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా.. ఒక్క మ్యాచ్ అనుభవంతోనే అతడు ఏంగా ఐసీసీ టోర్నీకి ఎంపికకావడం విశేషం. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి జట్టులోకి వచ్చేశాడు! ఇక కార్బిన్ బాష్‌ను ప్రధాన జట్టుకు ఎంపిక చేయడంతో పాటు యంగ్ పేసర్ క్వెనా మఫాకాను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసినట్లు సీఎస్ఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్లో ముక్కోణపు టోర్నీ ఆడుతుండగా... తొలి మ్యాచ్ అనంతరం బాష్, మఫాకాతో పాటు టోనీ డీ జోర్జీ సఫారీ జట్టుతో కలవనున్నట్లు సీఎస్ఏ వెల్లడించింది. ఎనిమిది జట్లుకాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నీలో ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అడుగుపెట్టగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.షెడ్యూల్ ఇదేఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ ప్రాథమిక జట్లను ప్రకటించగా.. టీమ్‌లలో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీ పడుతున్నాయి.ఈ ఐసీసీ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఫిబ్రవరి 21నతమ తొలి మ్యాచ్ ఆడనుంది. కరాచీ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం రావల్పిండిలో ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ పూర్తి చేసుకుని.. మళ్లీ కరాచీ వేదికగానే లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. మార్చి 1న ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టుతెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డసెన్, కార్బిన్ బాష్.ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి.. -
'అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు
అఫ్గానిస్తాన్(Afghanistan)లో ప్రస్తుతం తాలిబాన్ల పరిపాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా సంకీర్ణ సేనల నిష్క్రమణతో మళ్లీ అధికారం చేపట్టిన తాలిబాన్లు అఫ్గాన్‌లో స్త్రీ హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించి కట్టుబాట్లతో ముళ్లబాట పరుస్తున్నారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన మహిళా జట్లను ఏ క్రీడల్లోనూ పాల్గొనివ్వడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడొద్దంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు 160 మందికి పైగా రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేయగా.. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా చేరింది.త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్‌తో మ్యాచ్ రద్దు చేసుకోవాలని సౌతాఫ్రికా క్రికెట్(South Afrcia)ను ఆ దేశ ప్రజలు నినాదిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా ప్రజల డిమాండ్‌కు ఆ దేశ క్రీడల మంత్రి గేటన్ మెకెంజీ సంఘీభావం తెలిపారు. "ప్రజల నిరసనకు నైతిక మద్దతు తెలుపుతున్నాను. అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి. అయితే నా అధికారాలు పరిమితం. ఇందులో నేను నిర్ణయం తీసుకోలేను. దక్షిణాఫ్రికా ప్రభుత్వం, క్రికెట్ బోర్డు సమాలోచనలు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకోవాలి. బోర్డు విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసినట్లు, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా వేటు వేయాలి. క్రీడల వ్యవహరాల్లో రాజకీయ జోక్యాన్ని ఏ మాత్రం సహించకూడదు. మహిళల పట్ల వివక్ష చూపుతున్న అఫ్గానిస్తాన్ వైఖరిని క్రికెట్ దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సైతం ఖండించాలి" అని గేటన్ మెకెంజీ పేర్కొన్నారు.మరో 40 రోజుల్లో..కాగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో 40 రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్లో సఫారీ జట్టు కరాచీ వేదికపై ఫిబ్రవరి 21న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.ఇక టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్నాయి.ఈ టోర్నీలో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ శనివారం(జనవరి11) ప్రకటించే అవకాశముంది.చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్‌గా మైఖేల్ వాన్ తనయుడు -
SA Vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్
స్వదేశంలో పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ఆరంభించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాక్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగల్గింది. ఓ దశలో కెప్టెన్ రిజ్వాన్ క్రీజులో ఉన్నప్పుడు పాకిస్తాన్ సునాయసంగా లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు.కానీ ఆఖరి ఓవర్లో రిజ్వాన్ ఔట్ కావడం, ఇతరుల నుంచి అతడికి సపోర్ట్ లభించకపోవడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 19 పరుగుల అవసరమవ్వగా.. సఫారీ యువ పేసర్ మఫాక కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(62 బంతుల్లో 74, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అయూబ్(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. బాబర్ ఆజం(0)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో జార్జ్ లిండీ 4 వికెట్లు పడగొట్టగా.. మఫాక రెండు, సీమ్లేన్, బార్ట్‌మన్ తలా వికెట్ సాధించారు.డేవిడ్ మిల్లర్ ఊచకోత..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ప్రోటీస్ టాపర్డర్ విఫలమైనప్పటికి.. మిడిలార్డర్ బ్యాట్ డేవిడ్ మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు జార్జ్ లిండే(24 బంతుల్లో 48, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, అర్బర్ ఆహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో డిసెంబర్ 13న సెంచూరియన్ వేదికగా జరగనుంది.చదవండి: సిరాజ్‌ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్ -
హ్యాట్రిక్ తీసిన ఇంగ్లండ్ బౌలర్
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో డీన్ ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో మహిళా క్రికెటర్‌గా డీన్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా (పురుషుల క్రికెట్‌తో పాటు) ఈ ఘనత సాధించిన ఏడో ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డీన్ ఇన్నింగ్స్ 17, 19 ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి మారిజన్ కాప్ వికెట్ తీసిన డీన్.. ఆతర్వాత 19వ ఓవర్ మొదటి రెండు బంతులకు నదినే డి క్లెర్క్, సినాలో జఫ్టా వికెట్లు తీసింది.ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు..కరోల్ హాడ్జస్ 1993లో డెన్మార్క్ మహిళల జట్టుపైక్లేర్ కాన్నర్ 1999లో భారత మహిళా జట్టుపైజేమ్స్ అండర్సన్ 2003లో పాకిస్తాన్ పురుషుల జట్టుపైస్టీవ్ హార్మిసన్ 2004లో భారత పురుషుల జట్టుపైఆండ్రూ ఫ్లింటాఫ్ 2009లో వెస్టిండీస్ పురుషుల జట్టుపైస్టీవెన్ ఫిన్ 2015లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుపైచార్లీ డీన్ 2024లో సౌతాఫ్రికా మహిళల జట్టుపైమ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 31.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. చార్లీ డీన్ (4/45), సోఫీ ఎక్లెస్టోన్ (3/27), లారెన్ ఫైలర్ (3/32) రెచ్చిపోవడంతో సౌతాఫ్రికా జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లో టైరాన్ (45), లారా వోల్వార్డ్ట్ (35), డెర్క్సన్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 24 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామీ బేమౌంట్ (34), బౌచియర్ (33), డేనియల్ హాడ్జ్ (25 నాటౌట్), నాట్ సీవర్ బ్రంట్ (20) ఇంగ్లండ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో డెర్క్సన్ 2, డి క్లెర్క్, మారిజన్ కాప్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది. -
సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో మూడో టి20లో అజేయ సెంచరీతో ఆకట్టుకున్న హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ... ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే తిలక్... ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడిగి మరీ మూడో స్థానంలో బరిలోకి దిగి సత్తా చాటాడు. తొలి రెండు టి20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి వరుసగా 33, 20 పరుగులు చేసిన తిలక్ వర్మ... తనను తాను నిరూపించుకోవడానికి ఒక స్థానం ముందే బ్యాటింగ్‌కు దిగాలనుకుంటున్నట్లు కెప్టెన్ కు వివరించాడు. దీనికి అంగీకరించిన సూర్యకుమార్ తాను బ్యాటింగ్ చేయాల్సిన మూడో ప్లేస్‌లో తిలక్‌ను దింపాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే క్రీజులోకి అడుగుపెట్టిన తిలక్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న సమయంలో తిలక్ తన హావభావాలతో సారథికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ‘సూర్యకుమార్ వల్లే అది సాధ్యమైంది. అతడు మూడో స్థానంలో ఆడే అవకాశం ఇవ్వడంతోనే స్వేచ్ఛగా ఆడాను. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశా. నాకు స్వతహాగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్ ఇష్టం. అదే సూర్యకు చెప్పా. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రే అతడు దానికి అంగీకారం తెలిపాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మైదానంలో నేనేంటో నిరూపించుకుంటా అని ముందే చెప్పాను. విఫలమైన సమయంలోనూ టీమ్ మేనేజ్మెంట్ అండగా నిలిచింది. సహజ సిద్ధమైన ఆట ఆడేవిధంగా ప్రోత్సహించింది. కెపె్టన్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వికెట్ పడ్డా వెనకడుగు వేయవద్దని సూచించారు’ అని తిలక్ చెప్పుకొచ్చాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించగా... తిలక్ వర్మ 56 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్నాడు. అందులో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. గాయాల కారణంగా కొన్నాళ్ల పాటు జట్టుకు దూరమైన తిలక్ వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడమే తన పని అని వివరించాడు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటానని వెల్లడించాడు. -
శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్
శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ నీల్ మెక్కెంజీ నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నిమిత్తం శ్రీలంక క్రికెట్ బోర్డు మెక్కెంజీని అపాయింట్ చేసింది. మెక్కెంజీ నవంబర్ 13-21 మధ్యలో శ్రీలంక జట్టుతో జాయిన్ అవుతాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ నవంబర్ 27న డర్బన్ వేదికగా మొదలవుతుంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 5-9 వరకు గెబెర్హా వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే శ్రీలంకకు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకే ఆ జట్టు స్థానికుడైన మెక్కెంజీ కన్సల్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. మెక్కెంజీ దక్షిణాఫ్రికాలోని పిచ్‌ల పరిస్థితులపై లంక ఆటగాళ్లకు అవగాహణ కల్పిస్తాడు. సౌతాఫ్రికాలో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే విషయంలో మెక్కెంజీ లంక ప్లేయర్లకు శిక్షణ ఇస్తాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా మెక్కెంజీ అనుభవం లంక ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ ఆష్లే డిసిల్వ తెలిపారు.48 ఏళ్ల మెక్కెంజీ గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌కు సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా పని చేశాడు. మెక్కెంజీ ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. మెక్కెంజీ 2000-2009 మధ్యలో సౌతాఫ్రికా తరఫున 124 మ్యాచ్‌లు ఆడి (మూడు ఫార్మాట్లలో) దాదాపు 5000 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మెక్కెంజీకి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. దేశవాలీ క్రికెట్లో మెక్కెంజీ దాదాపు 20000 పరుగులు చేశాడు.దక్షిణాఫ్రికాతో ప్రీ సిరీస్ క్యాంప్‌కు శ్రీలంక జట్టు..ధనంజయ డి సిల్వా, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, లహిరు కుమార, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, మిలన్ రత్నాయకే, కసున్ రజిత, లసిత్ ఎంబుల్దెనియా. -
వెర్రెయిన్నే సూపర్ సెంచరీ.. 308 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 308 పరుగులకు ఆలౌటైంది. 140/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ప్రోటీస్ అదనంగా 168 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో ప్రోటీస్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగుల భారీ ఆధిక్యంలో లభించింది. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటకి వెర్రెయిన్నే మాత్రం బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని తన జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 144 బంతులు ఎదుర్కొన్న వెర్రెయిన్నే 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్(54), పైడట్(32), టానీ డీజోరి(30) పరుగులతో రాణించారు. కాగా అంతకుముందు బంగ్లా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులకే కుప్పకూలింది.చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్? -
ఐసీసీ వరల్డ్ కప్ బెస్ట్ టీమ్ ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కరు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని న్యూజిలాండ్ ముద్దాడింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో కూడిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది.ఈ టీమ్‌కు దక్షిణాఫ్రికా సారథి లారా వోల్వార్ట్ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వోల్వార్ట్ తన అద్భుత కెప్టెన్సీ, ప్రదర్శనతో సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చింది. 12 మంది సభ్యుల ఈ టీమ్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల నుంచి చెరో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ జట్టులో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఒక్కరికే చోటు దక్కింది. . భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైనా నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి హర్మన్ 2 అర్ధ సెంచరీలు సహా 133.92 స్ట్రయిక్ రేట్‌తో 150 పరుగులు సాధించింది.జట్టు వివరాలు: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజీమిన్ బ్రిట్స్, నాన్కులులెకొ ఎమ్‌లాబా (దక్షిణాఫ్రికా), అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్, ఈడెన్ కార్సన్ (న్యూజిలాండ్), డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్ (వెస్టిండీస్), డానీ వ్యాట్ (ఇంగ్లండ్), మెగాన్ షుట్ (ఆ్రస్టేలియా), నిగార్ సుల్తానా (బంగ్లాదేశ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్). -
T20 WC Semis: 56 పరుగులకే ఆలౌట్.. ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో చెత్త రికార్డులు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేవలం ఒకే ఒక్కరు (అజ్మతుల్లా (10)) రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఎక్సట్రాల రూపంలో వచ్చిన పరుగులు అత్యధికం (13) కావడం విశేషం. ఆఫ్ఘన్ ఆటగాళ్లు రహ్మనుల్లా గుర్బాజ్ (0), ఇబ్రహీం జద్రాన్ (2), గుల్బదిన్ నైబ్ (9), మొహమ్మద్ నబీ (0), ఖరోటే (2), కరీమ్ జనత్ (8), రషీద్ ఖాన్ (8), నూర్ అహ్మద్ (0), నవీన్ ఉల్ హక్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ విభాగంలో దారుణంగా విఫలమైన ఆఫ్ఘనిస్తాన్ కొన్ని చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఆ రికార్డులేంటో చూద్దాం.టీ20 ప్రపంచకప్ టోర్నీల సెమీఫైనల్స్‌లో అత్యల్ప స్కోర్టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ చేసిన రెండో అత్యల్ప స్కోర్టీ20ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు అత్యల్ప స్కోర్ప్రస్తుత వరల్డ్‌కప్‌లో పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) అత్యధిక వికెట్లు (5)టీ20ల్లో సౌతాఫ్రికాపై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోర్ (56)కాగా, ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేసిన స్వల్ప స్కోర్‌ను సౌతాఫ్రికా ఆడుతూపాడుతూ ఛేదించి తొలి సారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది. తొలుత సఫారీ బౌలర్లు జన్సెన్ (3-0-16-3), షంషి (1.5-0-6-3), రబాడ (3-1-14-2), నోర్జే (3-0-7-2) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. డికాక్ 5 పరుగులు చేసి ఫజల్ హక్ ఫారూఖీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. రీజా హెండ్రిక్స్ (29), మార్క్రమ్ (23) సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించారు. -
సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఘోర పరాజయం.. తొలిసారి ఫైనల్లో సౌతాఫ్రికా
టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు ఓడింది. ట్రినిడాడ్ వేదికగా ఇవాళ (జూన్ 27) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొలిసారి వరల్డ్‌కప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది.రెచ్చిపోయిన సఫారీ బౌలర్లు.. చేతులెత్తేసిన ఆఫ్ఘన్ బ్యాటర్లుఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 56 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు విరుచుకుపడటంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జన్సెన్ (3-0-16-3), షంషి (1.5-0-6-3), రబాడ (3-1-14-2), నోర్జే (3-0-7-2) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను కకావికలం చేశారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే (అజ్మతుల్లా (10)) రెండంకెల స్కోర్ చేయగలిగారంటే సఫారీ పేసర్లు ఏరకంగా రెచ్చిపోయారో అర్దమవుతుంది. గుర్బాజ్ (0), జద్రాన్ (2), గుల్బదిన్ నైబ్ (9), నబీ (0), ఖరోటే (2), కరీమ్ జనత్ (8), రషీద్ ఖాన్ (8), నూర్ అహ్మద్ (0), నవీన్ ఉల్ హక్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన పరుగులు అత్యధికం (13) కావడం విశేషం.ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా కేవలం 8.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. డికాక్ 5 పరుగులు చేసి ఫజల్ హక్ ఫారూఖీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. రీజా హెండ్రిక్స్ (29), మార్క్రమ్ (23) సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించారు. -
బంగ్లాదేశ్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలోనే
టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ సూపర్-8కి చేరింది. సెయింట్ లూసియా వేదికగా సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్.. తమ సూపర్-8 బెర్త్ ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ బౌలర్లు కాపాడుకున్నారు. బంగ్లా బౌలర్ల దాటికి నేపాల్ 85 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా యువ పేసర్ టాంజిమ్ హసన్ షకీబ్ 4 వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ముస్తఫిజుర్ రెహ్మన్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు.బంగ్లాదేశ్ అరుదైన రికార్డు..ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలోనే అత్యల్ప అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా బంగ్లాదేశ్ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 113 పరుగుల మొత్తాన్ని డిఫెండ్ చేసింది. తాజా మ్యాచ్‌లో 106 పరుగుల టోటల్‌ను కాపాడుకున్న బంగ్లాదేశ్.. సఫారీల రికార్డును బ్రేక్ చేసింది. -
జాంబియాలో కలరా కల్లోలం.. పాఠశాలల మూసివేత!
దక్షిణాఫ్రికా దేశమైన జాంబియా కలరా వ్యాధితో పోరాడుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కలరా కారణంగా జాంబియాలో 400 మందికి పైగా బాధితులు మృతిచెందారు. 10 వేలమందికి మందికి పైగా జనం ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని లుసాకాలోని అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను కలరా చికిత్స కేంద్రంగా మార్చారు. జాంబియన్ ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అలాగే దేశంలోని పలు కలరా పీడిత ప్రాంతాలలో రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందజేస్తోంది. ‘జాంబియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్’ తెలిపిన వివరాల ప్రకారం జాంబియాలో కలరా వ్యాప్తి గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ నెలలో కలరా కారణంగా 412 మంది మృతిచెందారు. అలాగే 10,413 కలరా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 10 పది రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు కలరా బారిన పడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400కు పైగా కలరా కేసులు నమోదవుతున్నాయి. కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలరా సోకుతుంది. గత ఏడాది ఆఫ్రికాలోని మరో దేశమైన జింబాబ్వేలో కూడా కలరా వ్యాపించింది. ఇక్కడ కూడా స్వచ్ఛమైన తాగునీటి కొరత ఉంది. కలరా వ్యాపిస్తున్న మణికాలాండ్, మాస్వింగో రాష్ట్రాల్లో అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి పరిమితం చేశారు. -
SA VS IND 2nd T20: భారత్‌పై సౌతాఫ్రికా విజయం
భారత్‌పై సౌతాఫ్రికా విజయం భారత్‌పై ఐదు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. సౌతాఫ్రికా స్కోరు 154-5 ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 139 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ ఐదో వికెట్ కోల్పోయింది. మిల్లర్ ఔటయ్యాడు. నాలుగవ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 108 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగవ వికెట్ కోల్పోయింది. హేఇన్రిచ్ క్లాసేన్ ఔటయ్యాడు. టార్గెట్ 152.. 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసిన సౌతాఫ్రికా 152 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 56/1గా ఉంది. మార్క్రమ్ (14), హెండ్రిక్స్ (21) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 42 పరుగుల వద్ద (2.5 ఓవర్) సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి బ్రీట్జ్కీ (16) రనౌటయ్యాడు. టార్గెట్ 152.. 2 ఓవర్లలోనే 38 పరుగులు బాదిన సౌతాఫ్రికా 152 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా శరవేగంగా పరుగులు సాధిస్తుంది. ఆ జట్టు 2 ఓవర్లలోనే 38 పరుగులు పిండుకుంది. హెండ్రిక్స్ (19), బ్రీట్జ్కీ (14) క్రీజ్‌లో ఉన్నారు. తగ్గిన వర్షం.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే..? వర్షం తగ్గిన అనంతరం అంపైర్లు ఓవర్లను కుదించారు. భారత ఇన్నింగ్స్‌ను 19.3 ఓవర్ల వద్దనే ముగించిన అంపైర్లు.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు మార్చారు. వర్షం అంతరాయం భారత ఇన్నింగ్స్ మరో 3 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం మొదలైంది. 19.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 180/7గా ఉంది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్లో రవీంద్ర జడేజా (19), అర్షదీప్ సింగ్(0) ఔటయ్యారు. రింకూ సింగ్ (68)తో పాటు సిరాజ్ క్రీజ్‌లో ఉన్నాడు. రింకూ మెరుపు అర్ధశతకం రింకూ సింగ్ కేవలం 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో తన కెరీర్లో తొలి అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీనికి ముందు జితేశ్ శర్మ (1) మార్క్రమ్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 125 పరుగుల వద్ద (13.5 ఓవర్లలో) టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. షంషి బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (56) ఔటయ్యాడు. రింకూ (34), జితేశ్ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 55 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కొయెట్జీ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (29) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న తిలక్, స్కై ఓపెనర్లు గిల్, యశస్వి డకౌట్లు అయ్యాక తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి భారత్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు (53) దాటింది. స్కై (21), తిలక్ (28) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ డకౌట్ 6 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. రెండో ఓవర్ ఆఖరి బంతికి శుభ్‌మన్ గిల్ కూడా సున్నా పరుగులకే ఔటయ్యాడు. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్‌లో గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మూడో బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మూడో బంతికే వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ డకౌటయ్యాడు. సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్వల్ప అనారోగ్యం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని భారత కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించాడు. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు కూడా అవకాశం దక్కలేదు. తిలక్ వర్మ, జితేశ్ శర్మ వీరి స్థానాల్లో జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ. -
Junior Hockey World Cup 2023: టైటిల్ లక్ష్యంగా బరిలోకి...
కౌలాలంపూర్: మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో... నేటి నుంచి మొదలయ్యే జూనియర్ పురుషుల అండర్–21 హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు బరిలోకి దిగనుంది. పూల్ ‘సి’లో భాగంగా నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు గురువారం స్పెయిన్‌తో రెండో మ్యాచ్‌ను... శనివారం కెనడాతో మూడో మ్యాచ్‌ను ఆడుతుంది. ఈనెల 16 వరకు జరిగే ఈ టోరీ్నలో మొత్తం 16 జట్లు పోటీపడుతున్నాయి. జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. పూల్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, ఆ్రస్టేలియా, చిలీ, మలేసియా... పూల్ ‘బి’లో ఈజిప్‌్ట, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా... పూల్ ‘డి’లో బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లున్నాయి. ఈనెల 9న లీగ్ మ్యాచ్‌లు ముగిశాక ఆయా పూల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. క్వార్టర్ ఫైనల్స్ 12న, సెమీఫైనల్స్ 14న, ఫైనల్ 16న జరుగుతాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లను స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుసార్లు (2001, 2016) టైటిల్స్ సాధించి, ఒకసారి రన్నరప్‌గా (1997) నిలిచింది. భారత జట్టు: ఉత్తమ్ సింగ్ (కెప్టెన్), అరైజిత్ సింగ్ (వైస్ కెప్టెన్), ఆదిత్య, సౌరభ్, సుదీప్, బాబీ సింగ్, మోహిత్, రణ్విజయ్, శార్దానంద్, అమన్‌దీప్ లాక్రా, రోహిత్, సునీల్, అమీర్ అలీ, విష్ణుకాంత్, పూవణ్ణ, రాజిందర్ సింగ్, అమన్‌దీప్, ఆదిత్య సింగ్. -
CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 10) ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. సెమీస్ బెర్త్‌పై ఆశ చావని ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో శక్తివంచన లేకుండా పోరాడాలని భావిస్తుంది. అయితే వారు సెమీస్‌కు చేరడం అంత ఈజీ కాదు. దాదాపుగా అసాధ్యం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్లు అద్భుతమైన పోరాటాలు చేసినప్పటికీ.. అన్ని విభాగాల్లో పటిష్టమైన సౌతాఫ్రికా దగ్గర పప్పులు ఉడకకపోవచ్చు. 438 పరుగుల తేడాతో గెలిస్తేనే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో 438 పరుగుల భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఒక్కసారైన కనీసం 300 స్కోర్ దాటని ఆఫ్ఘన్లకు ఇది స్థాయికి మించిన పనే అవుతుంది. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటంతో ఆఫ్ఘనిస్తాన్‌కు ఈ దుస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆసీస్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి ఉంటే, నాలుగో సెమీస్ బెర్త్ కోసం పోటీ ఎన్నడూ లేనంత రసవత్తరంగా ఉండేది. ప్రస్తుతానికి న్యూజిలాండ్ అనధికారికంగా సెమీస్‌కు చేరుకోగా.. సాంకేతికంగా పాక్, ఆఫ్ఘనిస్తాన్లకు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. 16న కోల్‌కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ ఖరారైపోయింది. సెమీస్‌కు ముందు మరో మూడు లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. 11న ఆసీస్, బంగ్లాదేశ్ మధ్య నామమాత్రపు మ్యాచ్, అదే రోజు ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచ్, 12న భారత్,నెదర్లాండ్స్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ జరుగుతుంది. చదవండి: పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్ ఓడినా ఇంటికే..! -
డికాక్, డస్సెన్ అద్భుతంగా ఆడారు.. ఇక మేం సెమీస్‌కు చేరినట్లే: బవుమా
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ప్రొటీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరడంతో పాటు సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. న్యూజిలాండ్‌పై విజయానంతరం సఫారీ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ఈ గెలుపు మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఓవరాల్‌గా అదిరిపోయే ప్రదర్శన. డికాక్, డస్సెన్ అద్భుతంగా ఆడారు. మంచి భాగస్వామ్యాన్ని అందించారు. మా బౌలర్లు అనుకున్న ప్రకారం ప్లాన్ పక్కాగా అమలు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలో నేను, క్విన్నీ (డికాక్) పరిస్థితులను అంచనా వేసేందుకు నిదానంగా ఆడాం. చెడ్డ బంతులను బౌండరీలకు తరలించాం. క్విన్నీ 30వ ఓవర్ వరకు నిదానంగా ఆడి, ఆ తర్వాత మా బిగ్ హిట్టర్లతో కలిసి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లు మాపై ఎదురుదాడికి దిగుతారని తెలుసు. అలా జరిగితేనే మాకు అవకాశాలు వస్తాయని అంచనా వేశాం. గత కొంతకాలంగా మేం ఆచరిస్తున్న వ్యూహాలే ఈ మ్యాచ్‌లోనూ అమలు చేశాం. ఈ విజయం మాకు సెమీస్ స్థానాన్ని ఖరారు చేసేలా కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాం. తదుపరి జరిగే మ్యాచ్‌లపై మరింత ఫోకస్ పెంచుతామని అన్నాడు. కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (60), విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 190 పరుగుల తేడాతో భారీ విజయం
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా జైత్ర యాత్ర కొనసాగుతోంది. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ప్రోటీస్ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ 4 వికెట్లతో చెలరేగగా.. జానెసన్ మూడు, కోయెట్జీ రెండు, రబాడ ఒక వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(60) పరుగుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. జట్టులో కేన్ విలియమ్సన్ లేని లోటు సృష్టంగా కన్పిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. డస్సెన్ 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 పరుగులు చేయగా.. డికాక్ 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు సాధించాడు న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా.. నీషమ్, బౌల్ట్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ప్రోటీస్ 6 విజయాలు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్ధానికి చేరుకుంది. చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌లో టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. -
CWC 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. మరో భారీ స్కోర్‌పై కన్నేసిన సౌతాఫ్రికా
వన్డే వరల్డ్‌కప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా.. ఇవాళ (అక్టోబర్ 17) పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సఫారీలు మరో భారీ స్కోర్‌పై కన్నేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతి భారీ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా.. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేయడం ఖాయమని తెలుస్తుంది. ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో ఈ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా మరోసారి 400 స్కోర్‌ను దాటడం ఖాయమని అభిమానులు అంటున్నారు. సఫారీ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ప్రకారం 400 స్కోర్ వారికి పెద్ద లెక్క కాకపోచ్చు. ఓ మోస్తరుగా ఉండే నెదర్లాండ్స్ బౌలింగ్‌పై సఫారీ హిట్టర్లు ప్రతాపం చూపవచ్చు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో డికాక్ (100), డస్సెన్ (108), మార్క్రమ్ (106) సెంచరీలతో స్వైరవిహారం చేయడంతో 428 పరుగులు స్కోర్ చేసిన సఫారీ టమ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 300కుపైగా స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో డికాక్ మరోసారి శతక్కొట్టడంతో (109) సౌతాఫ్రికా 311 పరుగులు స్కోర్ చేసింది. వరుణుడు అడ్డుతగులుతాడా..? ధర్మశాలలో ఇవాళ ఉదయం నుంచి జల్లులు కురుస్తున్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా, క్రికెట్‌కు అనుకూలంగా ఉంది. అయితే ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉండటంతో ఏ క్షణంలో అయినా భారీ వర్షం పడే అవకాశం ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమయితే లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పిచ్ స్వభావంలో స్వల్పంగా మార్పులు జరుగవచ్చు. సౌతాఫ్రికాకు సంపూర్ణ ఆధిపత్యం.. సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ జట్లు ఇప్పటివరకు వన్డేల్లో 7 సార్లు ఎదురెదురుపడగా.. 6 సందర్భాల్లో సౌతాఫ్రికానే విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు ఎదురెదురుపడలేదు. వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్ అవుతుంది. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 102 పరుగుల తేడాతో.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 134 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. స్టార్ ఆటగాడు దూరం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. శ్రీలంక ముగ్గురు పేసర్లతో ఆడనుండగా.. దక్షిణాఫ్రికా ఏకంగా నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇక ప్రోటీస్‌తో మ్యాచ్‌కు శ్రీలంక స్టార్ స్పిన్నన్ మహీష్ థీక్షణ గాయం కారణంగా దూరమయ్యాడు. తుది జట్లు శ్రీలంక : కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(c), దునిత్ వెల్లలాగే, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, కసున్ రజిత దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, కగిసో రబాడ -
అగ్నిప్రమాదంలో 73కు పెరిగిన మరణాలు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జొహన్నెస్‌బర్గ్‌లోని ఐదంస్థుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 73 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది శరణార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ సేవల అధికార ప్రతినిధి రాబర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. మరో 43 మంది గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. తెల్లవారడానికి ముందే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారాయన. మంటల్ని అదుపులోకి తెచ్చిన అధికారులు.. భవనంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మరిన్ని మృతదేహాలు బయటకు వస్తున్నాయని తెలిపారాయన. మరోవైపు బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. The death toll in a fire in the Johannesburg CBD has risen to 55 & likely to increase. Over 43 other people have also been injured. It has been reported that the building that caught fire this morning in Johannesburg CBD is a hijacked building full of illegal immigrants. pic.twitter.com/OTEAiQVZ8j — Man’s NOT Barry Roux (@AdvoBarryRoux) August 31, 2023 -
చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్కులో చీతాల వరుస మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుండటంతో వాటి పరిరక్షణకు సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జీలు.. బీఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్రంపై న్యాయస్తానం పలు ప్రశ్నలు సంధించింది. కాగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి రెండు విడతల్లో మొత్తం 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఓ చీత నాలుగు పిల్లలకుజన్మనివ్వడంతో వీటి సంఖ్య 24కు చేరింది. వీటిలో గత నాలుగు నెల్లలో మూడు కూన చీతాలు సహా 8 మరణించాయి. ప్రస్తుతం 18 చీతాలు ఉండగా వీటిలో మరో రెండిటి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గత వారం రోజుల్లో రెండు చీతాలు మరణించడంపై ధర్మాసనం స్పందిస్తూ.. దీన్ని ఎందుకు ప్రతిష్టాత్మక అంశంగా మారుస్తున్నారని అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించింది. అయితే చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని ఇంకా కునో నేషనల్ పార్క్‌లోనే ఎందుకు ఉంచారని.. వేరే చోటుకు తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. చదవండి: వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి 20 చీతాల్లో 8 మరణించాయి.. అంటే ఏడాదిలో 40శాతం చీతాలు మృత్యువాత పడ్డాయి. ఇది మంచి సంకేతం కాదు. ఎందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించింది. వాటిని రాజస్థాన్‌కు తరలించే మార్గాలను పరిశీలించాలని సూచించింది. అయితే వాతావరణ పరిస్థితులు (ట్రాన్స్‌లోకేషన్) కారణంగా 50 శాతం మరణాలు సాధారణమేనని కేంద్రం ముందుగానే ఊహించిందని కేంద్రం తరఫున ఏసీజీ వాదనలు వినిపించారు. దీనిపై జస్టిస్ పార్దివాలా స్పందిస్తూ.. మరి సమస్య ఏంటి? ఇక్కడి వాతావరణం వాటికి అనుకూలంగా లేదా? కిడ్నీ,శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయా అని ప్రశ్నించారు. అయితే ఇన్ఫెక్షన్లు చీతాల మణాలకు దారి తీస్తున్నాన్నాయని ASG ధర్మాసనానికి తెలియజేశారు. లాగే ప్రతీ చీతా మరణంపై వివరణాత్మక విశ్లేషణ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే రాజస్థాన్‌లోని అభయారణ్యాలలో ఒకటి చిరుతపులికి ప్రసిద్ధి చెందిందని.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది. చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కు వాయిదా వేసింది. -
దక్షిణాఫ్రికాకు గుడ్ న్యూస్.. మూడేళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. మళ్లీ జాతీయ జట్టు తరుపున ఆడేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. 2021లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన డుప్లెసిస్.. ప్రోటీస్ వైట్ బాల్ జట్టు తరుపున ఆడేందుకు ఉత్సుకత చూపిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి డుప్లెసిస్ తప్పుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. డుప్లెసిస్ చివరిసారిగా 2020లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రోటీస్ తరపున ఆడాడు. ప్రోటీస్ వార్తాపత్రిక ర్యాప్పోర్ట్ నివేదిక ప్రకారం.. డుప్లెసిస్ ఇప్పటికే దక్షిణాఫ్రికా కొత్త వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్ కలిసినట్లు సమాచారం. స్వదేశంలో విండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లలో డుప్లెసిస్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. కాగా డుప్లెసిస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టీ20లీగ్‌లో ఫాప్ అదరగొట్టాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహించిన డుప్లెసిస్ 369 పరుగులు సాధించాడు. ఇక విండీస్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ సోమవారం ప్రకటించనుంది. మార్చి16న ఈస్ట్ లండన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ప్రోటీస్-విండీస్ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: WPL 2023: లేడీ సెహ్వాగ్ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో వైరల్ -
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా బవుమా.. టీ20లకు గుడ్‌బై!
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్‌పై వేటు పడింది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి ఎల్గర్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న టెంబా బవుమాను దక్షిణాఫ్రికా క్రికెట్ నియమించింది. అయితే దక్షిణాఫ్రికా కొత్త టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టనున్న బవుమా.. టీ20 కెప్టెన్సీ మాత్రం గుడ్‌బై చెప్పనున్నాడు. అతడు కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే సారథిగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా టీ20ల్లో ప్రోటీస్ కెప్టెన్‌గా మార్క్రమ్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. కాగా రెడ్‌బాల్ క్రికెట్లో సఫారీ జట్టు కెప్టెన్ అయిన తొలి నల్ల జాతీయుడిగా బవుమా రికార్డు సృష్టించనున్నాడు. ఇక ఎల్గర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 17 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. 17 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 7 ఓటములు, ఒకడ్రా ఉన్నాయి. అయితే వరుసగా ఇంగ్లండ్ ఆస్ట్రేలియా సిరీస్‌లలో దక్షిణాఫ్రికా ఓటమి పాలవ్వడంతో ప్రోటీస్ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లలో మాత్రం ఎల్గర్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఆకట్టుకోలేదు. తన స్థాయికి తగ్గట్టు రాణించడం విఫలమయ్యాడు. కాగా స్వదేశంలో వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ.. ఈ కీలక మార్పు చేసింది. ఫిబ్రవరి 28 నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. విండీస్‌తో టెస్టులకు ప్రోటీస్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ,ర్యాన్ రికెల్టన్ చదవండి: IPL 2023: మూడేళ్ల తర్వాత హోంగ్రౌండ్లో.. ఎస్ఆర్హెచ్ షెడ్యూల్ ఇదే Introducing the new #Proteas Test captain - Temba Bavuma 💪 He remains captain of the ODI side while he has opted to relinquish the captaincy of the T20I side. #BePartOfIt pic.twitter.com/WgsbHhEgss — Proteas Men (@ProteasMenCSA) February 17, 2023 -
గుడ్‌న్యూస్.. భారత్‌కు మరో 12 చీతాలు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు త్వరలో భారత్‌కు రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఆయన వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు దక్షిణాఫ్రికాతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతలో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. జనవరిలో మరో 12 రానున్నాయి. చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత.. -
SA Vs BAN: పాపం బంగ్లాదేశ్.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే?
టీ20 ప్రపంచకప్-2022లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. సూపర్-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం నమోదు చేసింది. 206 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 101 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బౌలర్లలో నోర్జే నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. షాంసీ మూడు, రబాడ, మహారాజ్ తలా వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో రిలీ రోసో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ డికాక్ 63 పరుగులతో రాణించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లా వికెట్ కీపర్ నూరల్ హసన్ చేసిన చిన్న తప్పిదం వల్ల దక్షిణాఫ్రికా 5 పెనాల్టీ పరుగులు లభించించాయి. ఏం జరిగిందంటే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన షకీబ్ ఆల్ హసన్ బౌలింగ్‌లో అఖరి బంతి డెలివర్ కాకముందే బంగ్లా వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఎడమ వైపుకు వెళ్లాడు. నింబంధనల బౌలర్ రన్-అప్ సమయంలో వికెట్ కీపర్ కదలడానికి అనుమతి లేదు. దీంతో అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. కాగా అంతకుముందు ఈ మెగా ఈవెంట్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు కూడా ఐదు పరుగుల జరిమానా విధించారు. ఆప్పడు బంతి డికాక్ గ్లౌవ్కు తాకడంతో అంపైర్లు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. pic.twitter.com/1STBiuR0Ff — Vaishnavi Iyer (@Vaishnaviiyer14) October 27, 2022 చదవండి: IPL 2023: శార్దూల్ ఠాకూర్‌కు ఢిల్లీ క్యాపిటిల్స్ గుడ్‌బై! -
చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. 98 పరుగులకే కివీస్ ఆలౌట్
టీ20 ప్రపంచకప్-2022 ప్రిపరేషన్స్‌లో భాగంగా వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాప్రికాతో న్యూజిలాండ్ తలపడుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మూడు వికెట్లతో కివీస్‌ను దెబ్బతీయగా.. షమ్సీ, పార్నెల్ రెండు వికెట్లు, మార్క్రమ్,జాన్సెన్, రబాడ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిఫ్స్(23), గప్టిల్(23) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. చదవండి: T20 WC 2022: పంత్‌కు దినేశ్ కార్తిక్ పాఠాలు.. వీడియో వైరల్ -
County Championship: శుబ్‌మన్ గిల్ ర్యాంప్ షాట్.. వీడియో వైరల్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2022లో గ్లామోర్గాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్.. తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ససెక్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గిల్ సెంచరీకి చేరువయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి గిల్ 91 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కాగా అతడి ఇన్నింగ్స్‌ను వన్డే మ్యాచ్‌ను తలపించేలా సాగింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో గిల్ ఆడిన ఓ షాట్ తొలి రోజు ఆటకే హైలట్‌గా నిలిచింది. గ్లామోర్గాన్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ వేసిన ఓ బౌన్సర్ బంతిని గిల్ అద్భుతమైన ర్యాంప్ షాట్ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి బౌండరీ అవతల పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను గ్లామోర్గాన్ క్రికెట్ ట్విటర్ షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం గిల్ స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఆక్టోబర్ 6 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు గిల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. Shubman Gill, that is 𝗼𝘂𝘁𝗿𝗮𝗴𝗲𝗼𝘂𝘀 🤯 Glamorgan 217/3 𝗪𝗮𝘁𝗰𝗵 𝗹𝗶𝘃𝗲: https://t.co/7M8MBwgNG2#SUSvGLAM | #GoGlam pic.twitter.com/FtMX1c7cue — Glamorgan Cricket 🏏 (@GlamCricket) September 26, 2022 చదవండి: Ind Vs Aus- Viral: వద్దంటున్నా ట్రోఫీ డీకే చేతిలోనే ఎందుకు పెట్టారు?! మరి అందరికంటే.. -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఇవే: షేన్ వాట్సన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(2021-23)లో ఫైనల్‌కు చేరే జట్లను ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అంచనా వేశాడు. ప్రస్తుత టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి అని వాట్సన్ జోస్యం చెప్పాడు. కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 75 విజయ శాతంతో ఆగ్రస్థానంలో కొనసాగుదోంది. అదే విధంగా ఆస్ట్రేలియా 70 విజయ శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్ 52.08 విజయ శాతంతో మూడో స్థానంలో ఉంది. కాగా గత డబ్ల్యూటీసీ(2019-21) ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అయితే ఫైనల్లో టీమిండియాపై కివీస్ విజయం సాధించి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రోటీస్,ఆస్ట్రేలియా ఢీ! "వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో ప్రోటీస్,ఆస్ట్రేలియా జట్లు ముందున్నాయి. రెండు జట్లు కూడా ఇటీవల కాలంలో అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాయి. శ్రీలంకతో జరిగిన అఖరి టెస్టులో ఆస్ట్రేలియా అత్యుత్తమంగా ఆడింది. అయితే పాకిస్తాన్,భారత్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ఇరు జట్లులో కూడా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న భారత్,పాక్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తే అది సంచలనమే అవుతోంది" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సన్ పేర్కొన్నాడు. చదవండి: యూఏఈ టీ20 లీగ్‌లో అజం ఖాన్.. తొలి పాక్ ఆటగాడిగా! -
బిగ్‌బాష్ లీగ్‌లో ఆడనున్న ఆర్సీబీ కెప్టెన్..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఈ బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. బిగ్ బాష్ లీగ్ 12వ సీజన్ ఓవర్సీస్ డ్రాఫ్ట్ నామినీల జాబితాలో తన పేరును డుప్లెసిస్ నమోదు చేసుకున్నాడు. ఇక బిగ్ బాష్ లీగ్‌లో ఇప్పటి వరకు డుప్లెసిస్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. 2012 సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఫాప్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో 17 బంతులు ఆడిన డుప్లెసిస్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక ఈ ఏడాది టోర్నమెంట్ హాఫ్ సీజన్‌కు డుప్లెసిస్ అందు బాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అత్యధిక జీతం కలిగిన ప్లాటినం విభాగంలో డుప్లెసిస్ చోటు దక్కించుకోవచ్చు అని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేటగిరీలో ఒక ఆటగాడు అత్యధికంగా 340,000 ఆస్ట్రేలియా డాలర్ల జీతం పొందుతాడు. ఇక అతడితో పాటు ఆ దేశ ఆటగాళ్లు రిలీ రోసోవ్, మార్చంట్ డి లాంగే కూడా తమ పేర్లును నమోదు చేసుకున్నారు. చదవండి: Ind Vs Eng: వాళ్లకు ఐపీఎల్ ముఖ్యం.. ఇది చాలా డేంజర్: బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..!
ఐపీఎల్-2022 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు బీసీసీఐ జూనియర్ జట్టును ఎంపిక చేసే ఆలోచనలో ఉంది. ఈ జట్టుకు శిఖర్ ధావన్ లేదా హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. మరో వైపు జూలై 1న ఇంగ్లాండ్‌తో జరిగే నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం జూన్ మధ్యలోనే భారత్ లండన్‌కి బయలుదేరనుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్ధానంలో భారత మాజీ టెస్టు స్పెషలిస్ట్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఐర్లాండ్ పర్యటనకు కూడా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్9న జరగనుంది. చదవండి: Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ -
'వాళ్లు మళ్లీ జట్టుకు ఎంపికవుతారో లేదో తెలియదు'
దక్షిణాఫ్రికా పలువురు స్టార్ ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో కన్నా ఐపీఎల్-2022లో ఆడటానికి ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కగిసో రబాడ , లుంగీ ఎన్గిడి, మార్కో జెన్సన్, ఐడెన్ మార్క్రామ్, రాసి వాన్ డెర్ డుస్సెన్ ఐపీఎల్-2022లో పాల్గొన్నారు. కాగా ఈ తమ జట్టు ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ ఆదినుంచే ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ తమ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. అయితే తమ జట్టును కాదని క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనడానికి వెళ్ళిన ఆటగాళ్ళపై చర్యలు తీసుకువడానికి దక్షిణాఫ్రికా క్రికెట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆడుతున్న ప్రోటీస్ ఆటగాళ్లు తమ స్థానాలను జట్టులో కోల్పోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ చేసిన వాఖ్యలు.. ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ అనంతరం విలేకరుల సమావేశంలో ఎల్గర్ మాట్లాడాడు. ఆ క్రమంలో ఐపీఎల్లో పాల్గోన్న ఆటగాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించగా.. దానికి బదులుగా "దక్షిణాఫ్రికా తరఫున ఆడేందుకు వీరు మళ్లీ జట్టుకు ఎంపిక అవుతారో లేదో నాకు తెలియదు. అది ఇప్పుడు నా చేతుల్లో లేదు అని ఎల్గర్ పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: IPL 2022: 'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది' -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్... గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫీల్డర్ ఆష్లీ గార్డనర్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్య పరిచింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసిన జెస్ జోనాసెన్ బౌలింగ్‌లో.. మిగ్నాన్ డు ప్రీజ్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే అంతా బంతి బౌండరీ దాటడం ఖాయమని భావించారు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆష్లీ గార్డనర్ జంప్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకుంది. దీంతో గార్డెనర్ క్యాచ్‌ను మైదానంలో ఉన్న వాళ్లంతా ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లు లీ(36), వొల్వార్ట్(90) కెప్టెన్ సునే లాస్ (52) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్లు రేచల్ హేన్స్(17), అలీసా హేలీ(5) వికెట్లు కోల్పోయింది.ఈ క్రమంలో మెగ్ లానింగ్ 130 బంతుల్లో 135 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చింది. Take a bow, Ash Gardner 🙌😍 #CWC22 #SAvAUS pic.twitter.com/KY3Cu9F9Mn — Female Cricket #CWC22 (@imfemalecricket) March 22, 2022 -
ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం.. పాపం న్యూజిలాండ్!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా విజయాల పరంపర కొనసాగిస్తోంది. చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా రెండు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాప్రికా 8 వికెట్లు కోల్పోయి చేధించింది. అఖరి ఓవర్లో 6 పరుగులు కావల్సిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ కాప్ బౌండరీ బాది జట్టును గెలిపించింది. View this post on Instagram A post shared by ICC (@icc) దక్షిణాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్ (67),సునే లూస్ (51), కాప్ (34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టగా, మాకే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 228 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సోఫియా డివైన్(93), అమేలియా కేర్(42) గ్రీన్(30) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, ఖాకా చెరో మూడు వికెట్లు సాధించారు. కాగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి దక్షిణాఫ్రికా రెండో స్ధానంలో ఉంది. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని అనవసరంగా వదిలేసి.. View this post on Instagram A post shared by ICC (@icc) -
వైడ్ కాదు, నోబాల్ కాదు.. కానీ ఓవర్లో 7 బంతులు.. అదెలా?
Women's ODI World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో నోబాల్ గాని, వైడ్ బాల్ గాని లేకుండా ఒకే ఓవర్లో 7 బంతులు వేయబడ్డాయి. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 27వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 27వ ఓవర్ ఓవర్ వేసిన ఒమైమా సోహైల్ బౌలింగ్‌లో అఖరి బంతికు బ్యాటర్ సునే లూస్‌ను ఎల్బీగా అంపైర్ ఔటిచ్చాడు. దీంతో ఆమె రివ్యూ వెళ్లగా నాటౌట్‌గా తేలింది. ఇది ఇలా ఉంటే.. రివ్యూకు పోయిన బంతి అఖరి బంతి అన్న విషయం మర్చిపోయిన అంపైర్ బౌలర్‌తో ఆదనంగా ఇంకో బాల్‌ను వేయించాడు. ఆదనపు బంతికి సింగిల్ లభించింది. అయితే అంపైర్ చేసిన ఈ నిర్వహకం ప్రస్తుతం చర్చ నీయాంశమైంది. ఇక చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 6 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. పాక్ బ్యాటర్లలో నిధా ఖాన్(40), సోహెల్(65), నిధా ధార్(55) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, ఖాకా చెరో రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వోల్వార్డ్ట్(75), లూస్(62) పరుగులతో రాణించారు. చదవండి: ICC Womens World Cup: పాకిస్తాన్‌కు మరో ఓటమి..సెమీస్ ఆశలు గల్లంతు! Legal 7 ball over… 😲 What’s happening?#PAKvSA #CWC22 pic.twitter.com/V3Y8GpF2Aq — ಒಬ್ಬಟ್ಟು | O ₿ ₿ A T T U 🔑 (@7cr0re) March 11, 2022 -
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు మందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్దార్ పేసర్ లుంగీ ఎంగిడీ వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. తొలి టెస్టుకు దూరమైన ఎంగిడి.. రెండో టెస్టుకు గాయం నుంచి కోలుకుంటాడాని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. అయితే గాయం నుంచి కోలుకోపోవడంతో ఎంగిడి జట్టు నుంచి తప్పుకున్నట్లు ప్రోటిస్ కెప్టెన్ ఎల్గర్ తెలిపాడు. తొలి టెస్టుకు ముందు అతడు పూర్తిగా బౌలింగ్ చేయలేకపోయాడు. రెండో టెస్టుకు కోలుకుంటాడని భావించాం. అయితే అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడు మాతో ప్రాక్టీస్‌లో కూడా పాల్గోనడంలేదు. అతడు జట్టుకు దూరం కావడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకుంటే మా బౌలింగ్ లైనప్‌లో అతడు చాలా కీలకం అని ఎల్గర్ పేర్కొన్నాడు. మరో వైపు స్టార్ బౌలర్ అన్రిచ్ నార్ట్జే కూడా కీవిస్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టులో ఘోర పరాజయం పొందిన దక్షిణాఫ్రికా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 25న దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: Ajinkya Rahane : 'ఏంటి రహానే మరి మారవా.. మళ్లీ డకౌట్ అయ్యావా' -
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్!
దక్షిణాఫ్రికాపై తొలి టెస్ట్‌లో విజయం సాధించి జోష్ మీద ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఓవల్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఫిట్నెస్ సమస్యల కారణంగా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. "ట్రెంట్ బౌల్ట్ రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అతడు గత కొద్ది కాలంగా విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడి ఫిట్నెస్ దృష్ట్యా విశ్రాంతి ఇవ్వాలని భావించాం అని కోచ్ స్టెడ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్- దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఇన్నిగ్స్ అండ్ 276 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ మాట్ హెన్రీ 7 వికెట్లు పడగొట్టి ప్రొటీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లోను హెన్రీ రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: ICC T20I Rankings: ఆరేళ్ల తర్వాత ఇదే తొలి సారి.. రెండో కెప్టెన్‌గా రోహిత్ -
NZ Vs SA : 7 వికెట్లతో చెలరేగిన కివీస్ బౌలర్.. 95 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
South Africa Tour Of New Zealand 2022- 1st Test Day 1: దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ అద్భుతంగా రాణించాడు. తొలి రోజు ఆటలో భాగంగా 7 వికెట్లు పడగొట్టి ప్రొటిస్ జట్టును కోలుకోకుండా చేశాడు. దీంతో 95 పరుగులకే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 17న క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య కివీస్‌కు హెన్రీ శుభారంభం అందించాడు. తొలుత ప్రొటిస్ కెప్టెన్, ఓపెనర్ డీన్ ఎల్గర్(1 పరుగు)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మార్కరమ్(15), డసెన్(8) వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. హంజా(25), వెరెనె(18), రబడ(0), స్టర్మాన్(0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఓవర్లు వేసిన హెన్రీ... 23 పరుగులు ఇచ్చి మొత్తంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పేసర్ హెన్రీకి తోడు జెమీషన్, టిమ్ సౌథీ, వాగ్నర్ తలా ఓ వికెట్ తీయడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 95 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్‌కు ఓపెనర్ టామ్ లాథమ్(15), విల్ యంగ్(8) శుభారంభం అందించలేకపోయారు. కాన్వే(36), హెన్రీ నికోల్స్(37- బ్యాటింగ్) రాణించారు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 116 పరుగులు చేసింది. 21 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నికోల్స్, వాగ్నర్ క్రీజులో ఉన్నారు. చదవండి: Ind Vs WI 1st T20: 'అది వైడ్‌బాల్ ఏంటి' రోహిత్ అసహనం.. కోహ్లి సలహా 5 WICKETS FOR HENRY 🔥#SparkSport #NZvSA@BLACKCAPS pic.twitter.com/EM9CAuuABS — Spark Sport (@sparknzsport) February 17, 2022 What a day for @Matthenry014! 7-23. His first FIVE wicket haul in Test cricket and the equal third best Test innings figures for New Zealand. South Africa all out for 95 batting first at Hagley. Follow play LIVE with @sparknzsport. #NZvSA pic.twitter.com/ZQIsEcKuBq — BLACKCAPS (@BLACKCAPS) February 17, 2022 -
టీమిండియాపై దుమ్మురేపాడు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా
దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ జనవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పీటర్సన్ అద్భుత ప్రదర్శనకు గాను అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ సిరీస్‌లో పీటర్సన్ 244 పరుగులు చేశాడు. అంతే కాకుండా సిరీస్‌ను 2-1తో ప్రోటీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మరోవైపు, జనవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ ఎంపికైంది. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల యాషెస్ టెస్టులో నైట్ 216 పరుగులు చేసింది. తొ్లి ఇన్నింగ్స్‌లో 164 పరుగులు సాధించి ఇంగ్లండ్‌కు భారీ స్కోర్‌ను అందించింది. అయితే ఆస్ట్రేలియా కూడా పోరడడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చదవండి: IPL 2022 Auction-Tilak Varma: తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి -
వారెవ్వా వోల్వార్డ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్
వెస్టిండీస్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ఫీల్డర్ లారా వోల్వార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 31 ఓవర్ వేసిన తుమీ సెఖుఖునే బౌలింగ్‌లో.. వెస్టిండీస్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పాయింట్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న లారా వోల్వార్డ్ ఒంటి చెత్తో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాటర్ల్లో కిసియా నైట్(48),డాటిన్(36) పరుగులతో రాణించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్ 4 వికెట్లతో వెస్టిండీస్‌ను కుప్పకూల్చగా, ఆయబొంగ ఖాకా, ట్రయాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఆండ్రీ స్టెయిన్(52),సునే లూస్(47) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. చదవండి: IPL 2022 Auction: "చాహల్ భాయ్ నీకు భారీ ధర దక్కడం ఖాయం.. ఆల్‌ది బెస్ట్" What the hell 🤯 Laura Woolvardt takes a stunner to dismiss Mathews.#SAvWI pic.twitter.com/ZxkKlWJeu1 — WCricCraze🏏 (@WomensCricCraze) February 6, 2022 -
సూపర్ ఓవర్లో వెస్టిండీస్ వీర బాదుడు.. 3సిక్స్‌లు, 2ఫోర్లతో.. ఏకంగా!
జోహన్నెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన రెండో వన్డే ఆసక్తికరంగా సాగింది. చివర వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో..విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైగా ముగిసిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. బ్యాటర్ దియాంద్రా డాటిన్ చెలరేగడంంతో కేవలం 6 బంతుల్లోనే 25 పరుగులు సాధించింది. డాటిన్ 5 బంతుల్లోనే 19 పరుగులు చేసింది. డాటిన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. అనంతరం 26 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 17 పరుగుల మాత్రమే సాధించి ఓటమి చెందింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లో ట్రియాన్(7),బ్రిట్స్(10) పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా.. విండీస్ బౌలర్లు చెలరేగడంతో 160 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 161 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. ఏడేళ్ల తర్వాత బౌలర్ రీ ఎంట్రీ
న్యూజిలాండ్‌తో త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 17 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. కాగా స్పిన్నర్ సైమన్ హార్మర్ దాదాపు ఏడేళ్ల తర్వాత సౌత్ఆఫ్రికా క్రికెట్ తరుపున పునరాగామనం చేయనున్నాడు. 2015లో ప్రోటీస్ జట్టుకు హర్మర్ చివరిగా ఆడిన హర్మర్.. దక్షిణాఫ్రికా క్రికెట్‌ను విడిచిపెట్టి, 2017లో ఇంగ్లండ్ కౌంటీ జట్టు ఎసెక్స్‌తో కోల్పాక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కేశవ్ మహారాజ్‌కు బ్యాక్అప్గా హర్మర్ను సౌత్ఆఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. అతడి ఫస్ట్-క్లాస్ కేరిర్‌లో 700కి పైగా వికెట్లు పడగొట్టాడు. 2014లో టెస్ట్ క్రికెట్లో అరంగట్రేం చేసిన హర్మర్ 20 వికెట్లు పడగొట్టాడు. ఇక హర్మర్తో పాటు వెస్టిండీస్, భారత్‌తో సిరీస్‌లకు దూరమైన పేసర్ లూథో సిపమ్లా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ఈ జట్టుకు డీన్ ఎల్గర్ సారథ్యం వహించునున్నాడు. కాగా భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్పాక్ ఒప్పందం అంటే.. యూరోపియన్ యూనియాన్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశాలకు చెందిన ఆటగాళ్లు విదేశీ ఆటగాడిగా పరిగణించకుండా ఈయూ దేశాల్లో ఏదైనా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చని కోల్పాక్ ఒప్పందం పేర్కొంది. న్యూజిలాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, సారెల్ ఎర్వీ, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, లుంగి ఎన్గిడి, డువాన్ ఒలివియర్, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, రెయాన్ రికిల్టన్, లూథో సిపమ్లా, గ్లెంటన్ స్టౌర్మాన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, కైల్ వెర్రెయిన్ -
దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు.. 21 ఏళ్ల తర్వాత!
పార్ల్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. కాగా భారత్ నిర్ధేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ప్రోటిస్ సునాయాసంగా ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు వికెట్ల పడగొట్టడంలో విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా విజయంలో ఓపెనర్లు మలాన్, డికాక్ కీలక పాత్ర పోషించారు. కాగా పార్ల్ వేదికగా వన్డే క్రికెట్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్ కావడం గమనార్హం. అంతకుముందు 2001లో శ్రీలంకపై 248 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా చేధించింది. ఇక టెస్ట్, వన్డే సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా.. కేప్ టౌన్ వేదికగా జనవరి 23న జరిగే చివరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. చదవండి: SA vs IND: 'భారత్ గెలవాలంటే అతడు జట్టులోకి రావాలి' -
ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన రికార్డు సాధించిన సౌతాఫ్రికా..
టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు బావుమా, వండర్ డుస్సేన్ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అంతకు ముందు సెంచూరియన్‌లో 2013లో డికాక్, డివిలియర్స్ నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతే కాకుండా ఇది ఓవరాల్‌గా రెండో అత్యధిక భాగస్వామ్యం కూడా. అంతకుముందు 2000లో కోచి వేదికగా తొలి వికెట్‌కు కిర్ట్సెన్ - గిబ్స్ 235 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు బావుమా(110), వండర్ డుస్సేన్(129) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు. చదవండి: మ్యాక్స్‌వెల్ ఊచకోత .. 41 బంతుల్లో సెంచరీ.. ఏకంగా 24 ఫోర్లు, 4 సిక్స్‌లు! -
South Africa: నో లాక్డౌన్! ఆంక్షల్లేవ్.. కరోనా వైరస్‌తో కలిసి జీవిస్తాం..
No lockdown In South Africa: కోవిడ్ 19తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. లాక్డౌన్ కానీ, క్వారంటైన్ ఆంక్షలుగానీ విధించే ప్రసక్తి లేదని దక్షిణాఫ్రికా తాజాగా మీడియాకు తెల్పింది. తొందరపాటు చర్యలకు పూనుకోకుండా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆచరణయోగ్యమైన నిర్ణయాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెల్పింది. ఆంక్షల విధింపు పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, ఇతర సామాజిక అంశాలపై ప్రమాదకర ప్రభావాన్ని చూపుతున్నాయని దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు జనవరి 9న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విధించిన కోవిడ్ -19 ఆంక్షలను ప్రభుత్వం గుడ్డిగా అనుసరించకూడదని, స్థానికంగా అవి ఆచరణ యోగ్యంకాదని, అవి కేవలం నామమాత్రపు ప్రయోజనాలను మాత్రమే ఇస్తాయన్నారు. కాగా దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకూ 93 వేల కోవిడ్ మరణాలు సంభవించగా, 33,60,879 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,02,476 కోవిడ్ యాక్టీవ్ కేసులున్నాయి. మొత్తం 35 లక్షల (3.5 మిలియన్లు) కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే! దీంతో ప్రస్తుతం దేశంలో కోవిడ్ నాలుగో వేవ్‌లో కొట్టుమిట్టాడుతోంది. కొత్త వేరియంట్ దాటికి ప్రపంచ దేశాలు గజగజలాడిపోతుంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించడానికి బదులు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అధిక స్థాయి లాక్డౌన్లకు వెళ్లకుండా, తక్షణ ఆరోగ్య ముప్పు పొంచి ఉందా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి నిలిపిందని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌కు ముందు వచ్చిన కోవిడ్ మూడు వేవ్‌లు సహజ సంక్రమణల ద్వారా రోగనిరోధక శక్తి బలం పుంజుకుందని వారు తెలిపారు. ఒమిక్రాన్ ప్రమాదాన్ని టీ సెల్ ఇమ్యునిటీ ఎదుర్కొంటుందన్నారు. అయినప్పటికీ దేశంలో తక్కువ స్థాయిలో నమోదవుతున్న కోవిడ్ 19 పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని అధిక రిస్క్ గ్రూపుల కోసం బూస్టర్ డోస్‌లతో సహా వ్యాక్సినేషన్ ప్రక్రియలను పెంచడం, ఐసోలేషన్ వంటి ఆచరణాత్మక విధానాలను ప్రభుత్వం ఎంచుకోవాలని నిపుణులు సూచించారు. చేతి పరిశుభ్రత, థర్మల్ స్క్రీనింగ్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకపోవడం, వెంటిలేషన్ లేని ఇండోర్ ప్రదేశాలలో మాస్కులు ధరించడం, తగినంత వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవడంపై అక్కడి ప్రభుత్వ దృష్టి నిలిపింది. చదవండి: కన్నీళ్లకు కరగని తాలిబన్లు! అతని కళ్ల ముందే.. -
దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్!
దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఆదేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు అనుమతిని తిరస్కరించింది. రాబోయే అంతర్జాతీయ పర్యటనలు, దేశీయ మ్యాచ్‌ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనడం లేదని సౌతాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ తెలిపారు. కాగా ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనకు ప్రోటిస్ జట్టు వెళ్లనుంది. అదే విధంగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో కూడా ఆడనుంది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. "అంతర్జాతీయ షెడ్యూల్, దేశీయ మ్యాచ్‌ల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనేందకు ప్రోటిస్ ఆటగాళ్ల అనుమతిని తిరస్కరించాం. త్వరలోనే మేము న్యూజిలాండ్‌లో పర్యటించున్నాం. అదే విధంగా స్వదేశంలో బంగ్లాదేశతో ఆడనున్నాం. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు జట్టు సేవలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి" అని స్మిత్ పేర్కొన్నాడు. కాగా ఇమ్రాన్ తాహిర్, రిలీ రోసౌ, మర్చంట్ డి లాంజే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL- 2022: ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! -
టాప్-5లోకి సౌతాఫ్రికా ... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. జోహన్స్‌బర్గ్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికా ఖాతాలో 12 పాయింట్లు వచ్చి చేరాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రోటాస్ జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది. ఇక భారత్ జట్టు 4 స్ధానంలో నిలిచింది. కాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడు వరుస విజయాలతో 36 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక జట్టు 24 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 36 పాయింట్లతో మూడో స్థానంలో, బంగ్లాదేశ్ 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ 7వ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ జట్టు 8వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ జట్టు చివరి స్థానంలో ఉంది. చదవండి: ఎల్గర్ మళ్లీ ఆ తప్పు చేయలేదు.. టీమిండియాకు చేజారిపోయింది! -
"టీమ్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు.. వాటిని నేను అసలు పట్టించుకోను"
జోహెన్స్‌బర్గ్ వేదికగా జరగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా నయావాల్ ఛతేశ్వేర పుజారా అర్ధసెంచరీ సాధించాడు. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న పుజారాకి ఈ అర్ధ సెంచరీ కాస్త ఉపశమనం కలిగించింది. ఈ క్రమంలో మూడోరోజు ఆట అనంతరం మాట్లాడిన పుజారా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేకపోయినా ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన జట్టు మేనేజ్మెంట్కు పుజారా కృతజ్ఞతలు తెలిపాడు. గత ఏడాదిగా తనపై వస్తున్న విమర్శలు గురించి పెద్దగా పట్టించుకోలేదని పుజారా చెప్పాడు. "టీమ్ మేనేజ్మెంట్ నాకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది, కాబట్టి బయట నాపై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. కోచింగ్ స్టాఫ్, కెప్టెన్, ఆటగాళ్లందరూ నాకు సపోర్ట్‌గా ఉంటారు. మేము కష్టపడి ఆడుతాము. కొన్ని సందర్భాల్లో ఎక్కువ పరుగులు చేయలేం. అటువంటి సమయంలో మాపై విమర్శలు రావడం సాధారణం. కానీ ఒక క్రికెటర్‌గా ఇవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకు పోవాలి" అని పుజారా పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 86 బంతులు ఎదుర్కొన్న పుజారా 53 పరుగులు చేశాడు. చదవండి: సఫారీలకు కావాల్సింది 122 పరుగులే.. టీమిండియా అద్భుతం చేసేనా? -
బుమ్రాకి బౌలింగ్ ఎలా చేయాలో సూచనలు చేసిన కోహ్లి..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆట నాలుగో రోజు గాయం కారణంగా ఫీల్డ్‌లోకి ఆలస్యంగా వచ్చిన బుమ్రా రెండు కీలక మైన వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్‌తో కలిసి 40పరుగుల భాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ సమయంలో బౌలింగ్ వచ్చిన బుమ్రా.. వాన్ డెర్ డస్సెన్‌ని క్లీన్ బౌల్డ్ చేసి భాగాస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించి నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ని ఔట్ చేయడానికి కోహ్లి వ్యూహలను రచిస్తోన్నాడు. బౌలింగ్ చేస్తున్న బుమ్రాకు కోహ్లి పలు సూచనలు చేశాడు. ఎల్గర్‌కు రౌండ్‌ది వికెట్ బౌలింగ్ చేయమని కోహ్లి సూచించాడు. పిచ్‌పై పగుల్లు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోమని కోహ్లి బుమ్రాకు సలహా ఇచ్చాడు. వెంటనే బుమ్రా తన పొజిషన్ మార్చుకుని రౌండ్‌ది వికెట్ బౌలింగ్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ విజయానికి 6వికెట్ల దూరంలో ఉంది. 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ఆఫ్రికా 4వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. చదవండి: SA Vs IND: టెస్టుల్లో రికార్డు సృష్టించిన బుమ్రా.. భారత్ తరపున తొలి బౌలర్‌గా.. -
టెస్టుల్లో రికార్డు సృష్టించిన బుమ్రా.. భారత్ తరపున తొలి బౌలర్‌గా..
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్లో సరి కొత్త రికార్డును సృష్టించాడు. భారత్ తరుపున విదేశాల్లో అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సెంచూరియాన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వాన్ డెర్ డస్సెన్‌ని ఔట్ చేసిన బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డును బుమ్రా కేవలం 43 ఇన్నింగ్స్‌లోనే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 25 టెస్ట్‌లు ఆడిన బుమ్రా మొత్తంగా 105 వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా సాధించిన 105 వికెట్లలో 101 విదేశాల్లోనే పడగొట్టడం గమనర్హం. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బుమ్రా అదరగొడుతున్నాడు. కీలక సమయంలో వాన్ డెర్ డస్సెన్, కేశవ్ మహారాజ్లను పెవిలియన్‌కు పంపి భారత్‌ను విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిపాడు. కాగా బుమ్రా తన టెస్ట్ కెరీర్‌ను 2018లో దక్షిణాఫ్రికాలోనే ప్రారంభించాడు. చదవండి: ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్‌గా కుల్ధీప్ యాదవ్.. -
భారత అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు భారత్ అభిమానులకు గుడ్ న్యూస్. గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో వన్డేలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ క్రికెట్ ఆకాడమీలో ఉన్న రోహిత్ ప్రాథమిక ఫిట్నెస్ పరీక్షలో నెగ్గినట్లు సమాచారం. సోమవారం రోహిత్ మరోసారి ఫిట్నెస్ పరీక్షకు హాజరు కానున్నాడు. ఈ పరీక్షలో రోహిత్ నెగ్గితే వన్డే సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టు వన్డే కెప్టెన్‌గా కోహ్లిని తొలిగించి రోహిత్‌ని నియమించిన సంగతి తెలిసిందే. "రోహిత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు తన గాయం నుంచి పూర్తి స్ధాయిలో కోలుకున్నాడు. ప్రాథమిక ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఇంకా ఎన్సీఏ లోనే ఉన్నాడు. రోహిత్ సోమవారం మరోసారి ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నాడు. ఈ పరీక్ష ఆధారంగా మేము తుది నిర్ణయం తీసుకుంటాం" అని ఎన్సీఏ అధికారి ఒకరు తెలిపారు. కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు మరో రెండు రోజుల్లో జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జట్టు ఎంపికలో యువ ఆటగాళ్లు రుత్‌రాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్‌ను పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక టెస్ట్ సిరీస్ ముగిశాక భారత్ దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది. చదవండి: Vijay Hazare Trophy 2021:తమిళనాడుతో హిమాచల్ ప్రదేశ్ ఫైనల్ పోరు... ధావన్ మళ్లీ మెరిసేనా! -
"ఈ సారి కూడా విజయం మాదే.. టీమిండియాకు ఓటమి తప్పదు"
దక్షిణాఫ్రికా పర్యటనలలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఇక టెస్ట్ సిరీస్‌లో భాగంగా సెంచూరియాన్ వేదికగా తొలిటెస్ట్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ భారత్ గెలవలేదు. ఈ సారి కచ్చితంగా కోహ్లి సేన తొలి సిరీస్ కైవసం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. భారత్ - దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ప్రోటాస్ మాజీ పేసర్ ముఖాయ ఎన్తిని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కొన్నేళ్లుగా అత్యుత్తమ టెస్టు జట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని, కానీ స్వదేశంలో టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాము అని అతడు తెలిపాడు. “ప్రస్తుతం భారత్ అత్యుత్తమ బౌలింగ్ విభాగాన్ని కలిగి ఉంది. కానీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ఇక్కడి పిచ్‌లపై పూర్తి అవగహన ఉంది. మా జట్టులో డీన్ ఎల్గర్, టెంబా బావుమా వంటి ఆద్బుతమైన బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా వాన్ డెర్ డుస్సెన్ రూపంలో మాకు ఒక మంచి ఆటగాడు దొరికాడు. ఇక డికాక్ కూడా తనదైన రోజున జట్టును గెలిపించగలడు. మాకు రబాడా, ఎంగడీ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు. భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టగలరు. మా బౌలర్లు ఇప్పటికే భారత్‌పై పట్టును కలిగి ఉన్నారు. చివరగా నేను చెప్పేది ఒక్కటే.. ఈసారి కూడా భారత జట్టు సిరీస్‌ను గెలవలేరు అని ముఖాయ ఎన్తిని పేర్కొన్నాడు. చదవండి: Abid Ali: పాక్ క్రికెటర్ ఆబిద్ అలీకి యాంజియో ప్లాస్టీ.. రెండు నెలలు విశ్రాంతి -
"అందుకే దక్షిణాఫ్రికా టూర్‌కు రహానేను ఎంపిక చేశారు"
Ajinkya Rahane: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ టెస్ట్ జట్టును బీసీసీఐ బుధవారం( డిసెంబర్ 8) ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఫామ్‌లో లేని అజింక్య రహానే పై వేటు తప్పదని అంతా భావించనప్పటికీ.. అనుహ్యంగా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే రహానెను వైస్ కెప్టెన్ భాధ్యతల నుంచి తప్పించి రోహిత్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో సెలక్టర్లు రహానెను ఎందుకు ఎంపిక చేశారో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్‌స్కే ప్రసాద్ తెలిపాడు. విదేశీ పిచ్‌ల్లో రహానెకు వున్న రికార్డుల వల్ల అతడివైపు సెలక్టర్లు మొగ్గు చూపారని ఎమ్‌స్కే ప్రసాద్ చెప్పాడు. "జట్టు ఎప్పుడూ జూనియర్లు, సీనియర్లు కలయిక తో సమతూకంగా ఉండాలి. రహానే విషయానికి వస్తే..2013లో టెస్ట్ క్రికెట్లో అద్బుతంగా రాణించాడు. సాధరణంగా రహానే విదేశాల్లో బాగా రాణిస్తాడు. కానీ స్వదేశంలో అతడికి పెద్దగా రికార్డులు లేవు. గత కొద్దికాలంగా అతడు పెద్దగా ఫామ్‌లో లేడు. ఈ క్రమంలో సెలెక్టర్లకు అతడిని ఎంపిక చేసే ముందు కాస్త అయోమయంకు గురై ఉంటారు. అయితే విదేశాల్లో అతడికి ఉన్న ట్రాక్ రికార్డును చూసి సెలెక్టర్లు ఎంపిక చేసుండవచ్చు" అని ఎమ్‌స్కే ప్రసాద్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా విదేశాల్లో రహానే 40 సగటుతో 3000పైగా పరుగులు సాధించాడు. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా చదవండి: IND-A Vs SA-A: భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ డ్రా.. -
IND Vs SA: వాళ్లిద్దరినీ త్వరగా ఔట్ చేస్తే.. భారత్‌దే విజయం!
South Africas batting is pretty vulnerable Karthik backs India to win: దక్షిణాఫ్రికా పర్యటనకు త్వరలో భారత్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ టెస్ట్ సిరీస్‌పై అసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ పర్యటనలో తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని కార్తీక్ జోస్యం చెప్పాడు. టీమిండియా.. ఫాస్ట్ బౌలింగ్ లైనప్, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కారణంగా టీమిండియా కచ్ఛింతంగా విజయం సాధిస్తుందని థీమా వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాపై విజయం సాధించడానికి భారత్‌కు ఇదే అత్యుత్తమ అవకాశం. ఎందకుంటే టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ లైనప్, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే.. బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉంది. కానీ రబడ, నార్ట్జేలతో కూడిన అద్బుతమైన బౌలింగ్ విభాగం ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లను భారత్ ఎదుర్కుంటే చాలు. కాగా చివరిసారిగా 2018లో దక్షిణాఫ్రికాకు పర్యటనకు వెళ్లిన భారత్ ఒకే ఒకే టెస్ట్‌లో విజయం సాధించింది. ఇక దక్షిణాఫ్రికా బ్యాటింగ్ గురించి మాట్లాడూతూ.. "బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా క్వింటన్ డికాక్, టెంబా బవుమాపైనే జట్టు బ్యాటింగ్ ఆదారపడి ఉంది. వీరిద్దరనీ త్వరగా ఔట్ చేస్తే భారత్‌కు విజయం తిరిగి ఉండదు. అంతేకాకుండా కొంతమంది ఆటగాళ్లకి అంతర్జాతీయ స్ధాయిలో అంతగా ఆడిన అనుభవం లేదు. కాబట్టి భారత్ వంటి మేటి జట్టుపై రాణించడం అంత సులభంకాదు. కనుక దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి సారి సిరీస్ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నాను "అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. కాగా డిసెంబర్26న సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. చదవండి: Pakistan Players Clash Video: డ్రెస్సింగ్‌రూంలో పాక్ ఆటగాళ్ల ‘గొడవ’.. బాబర్ ఆజం ప్రతీకారం! -
ఎలుకల నుంచే ఒమిక్రాన్!
Omicron Variant Updates In Telugu: ఒమిక్రాన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్. ఇప్పటికే ఉన్నవి చాలనట్టు ఈ కొత్త వేరియంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందనే ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది. దీనిపై శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టారు. కరోనా రూపుమార్చుకుని (మ్యూటేషన్ చెంది) కొత్త వేరియంట్‌గా ఎలా మారిందన్నది పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలుకల్లో కరోనా మ్యూటేట్ అయి ‘ఒమిక్రాన్’ పుట్టిందని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ రోగ నిరోధక శక్తిని బట్టి.. సాధారణంగా వైరస్లు తమకు ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందుకు మ్యూటేట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తి సరిగా లేనివారిలో, హెచ్ఐవీ బాధితుల్లో లేదా కరోనా ప్రభావానికి గురయ్యే జంతువుల్లో మ్యూటేషన్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త వేరియంట్ పుడుతుంటాయి. ప్రస్తుతం వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా.. రోగ నిరోధక శక్తి దెబ్బతిన్న హెచ్ఐవీ రోగిలో మ్యూటేట్ అయి ఉంటుందని ఇప్పటికే కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ వేరియంట్ ఎలుకల్లో పుట్టి.. ‘రివర్స్ జూనోసిస్’ పద్ధతిలో మనుషులకు సంక్రమించి ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. ‘ఒమిక్రాన్’లోని కొన్ని అసాధారణమైన మ్యూటేషన్లే దీనికి ఆధారమని తెలిపారు. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందన్నారు. అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ట్యూలేన్ యూనివర్సిటీ, అరిజోనా యూనివర్సిటీల శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. ఏమిటీ ‘రివర్స్ జూనోసిస్’? జంతువులు, పక్షుల్లో ఉండే కొన్నిరకాల వైరస్లు మనుషులకు కూడా సంక్రమిస్తుంటాయి. దీనిని ‘జూనోసిస్’ అంటారు. అలాంటి వైరస్లు కలుగజేసే వ్యాధులను ‘జూనోటిక్’ వ్యాధులు అంటారు. కరోనా వైరస్ కూడా ఇలా గబ్బిలాల నుంచి మనుషులకు సోకిన ‘జూనోసిస్’ వైరసే. జంతువుల నుంచి మనుషులకు సోకి రూపు మార్చుకున్న (మ్యూటేట్ అయిన) వైరస్లు.. తిరిగి ఇతర జంతువులకు సోకడాన్ని ‘రివర్స్ జూనోసిస్’ అంటారు. ఇలా మనుషుల నుంచి జంతువులకు సోకిన వైరస్లు.. ఆయా జంతువులకు తగ్గట్టు మళ్లీ మ్యూటేట్ అవుతాయి. ఇలా మార్పులు జరిగాక రెండోసారి సులువుగా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2020 మధ్యలోనే ఎలుకలకు వెళ్లి.. కరోనా తొలివేవ్ సమయంలోనే అంటే 2020 సంవత్సరం మధ్యలోనే ఆ వైరస్ ఎలుకలకు వ్యాపించి ఉంటుందని.. అప్పటి నుంచీ వివిధ మ్యూటేషన్లు జరిగాక ఇప్పుడు మనుషులకు వ్యాపించి ఉంటుందని స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త క్రిస్టియన్ అండర్సన్ తెలిపారు. ‘ఒమిక్రాన్’ వేరియంట్లో వచ్చిన మ్యూటేషన్లే దీనికి ఆధారమని వెల్లడించారు. ఒమిక్రాన్‌లో కనిపించిన మ్యూటేషన్లలో ఏడు మ్యూటేషన్లు ఆ వైరస్ ఎలుకలకు సంక్రమించడానికి వీలు కల్పించేవేనని.. ఆల్ఫా, బీటా, డెల్టా సహా ఇతర వేరియంట్లలో ఈ తరహా మ్యూటేషన్లు పెద్దగా కనిపించలేదని ట్యూలేన్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ రాబర్ట్ గారీ తెలిపారు. అంతేకాదు ఇతర వేరియంట్లు వేటిలోనూ లేని కొన్ని అసాధారణ మ్యూటేషన్లు కూడా.. ఈ కొత్త వేరియంట్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు. ఎందుకింత గందరగోళం? సాధారణంగా ఏ వైరస్ అయినా.. వ్యాపిస్తూ వెళ్లినకొద్దీ మ్యూటేట్ అవుతూ వస్తుంది. ప్రతి కొత్త వేరియంట్లో దానికన్నా ముందటి వేరియంట్‌కు సంబంధించిన మ్యూటేషన్లతోపాటు, కొత్త మ్యూటేషన్లు కూడా కనిపిస్తాయి. కానీ ‘ఒమిక్రాన్’లో ప్రస్తుతమున్న వేరియంట్లలోని మ్యూటేషన్లు లేవని.. అంతేగాకుండా ఒక్కసారిగా అతి ఎక్కువగా కొత్త మ్యూటేషన్లు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలోనే (ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లు పుట్టకముందే) విడివడిన ఒక వేరియంట్.. భారీగా మ్యూటేషన్లు జరిగాక తిరిగి వ్యాపించడం మొదలుపెట్టిందని అంటున్నారు. చదవండి: OCD Wife: నావల్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి!. చదవండి: Madhya Pradesh: ఎందు‘కని' పారేస్తున్నారు? -
తొలి రోజు భారత్‌పై చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా...
India A bowlers toil on opening day against South Africa A: భారత్ ‘ఎ’తో ఆరంభమైన తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ మొదటి రోజు చెలరేగింది. ఓపెనర్ పీటర్ మలాన్ (258 బంతుల్లో 157 నాటౌట్; 18 ఫోర్లు), టోని డి జోర్జి (186 బంతుల్లో 117; 18 ఫోర్లు) శతకాలు సాధించడంతో మంగళవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్, అర్జాన్, సైనీ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: ఆటలో దూకుడు పెంచాను చతేశ్వర్ పుజారా వ్యాఖ్య -
టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్ పాకిస్తాన్...
Pakistan are the Favourites to Win The T20 World Cup: టీ20 ప్రపంచకప్-2021 తుది దశకు చేరుకుంది. నవంబర్10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్, 11వ తేదీన పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు నవంబర్ 14న మెగా ఫైనల్లో తలపడనున్నాయి. అయితే సెమిస్కు చేరిన నాలుగు జట్లులో ఏ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా నిలుస్తోందో క్రికెట్ నిపుణులు, మాజీలు, స్టార్ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 ట్రోఫిని పాకిస్తాన్ కైవసం చేసుకుంటుందని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ జట్టుకు కూడా ట్రోఫీ గెలవగల సత్తా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఈ మెగా టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శనపై డుప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బౌలింగ్ అటాక్ అత్యుత్తమమని అతడు కొనియాడాడు. ఈ టోర్నీ సూపర్12లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయినప్పటికీ సెమిస్కు ఆర్హత సాధించలేకపోయింది. “పాకిస్తాన్ ఈసారి టైటిల్ ఫేవరేట్, కానీ న్యూజిలాండ్ అన్ని విధాలుగా ప్రత్యర్థి జట్టుకు గట్టి పోటీ ఇస్తుంది. న్యూజిలాండ్ గతంలో ఐసీసీ ట్రోఫిని తృటిలో చేజార్చకుంది. కాబట్టి వారు కూడా టైటిల్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మా జట్టు టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ టోర్నమెంట్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు" అని ఓ ఇంటర్వ్యూలో డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఇక ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ టీ20 ప్రపంచకప్ జట్టులో దక్కలేదు. దీనిపై స్పందించిన డు ప్లెసిస్ మాట్లడూతూ.. "అది నా చేతుల్లో లేదు. అది అంతా సెలక్షన్ కమిటీ చేతుల్లో ఉంటుంది. కానీ నాకు ముందే తెలుసు టీ 20 ప్రపంచకప్‌కు ఎంపిక కాను అని.. ఎందుకంటే శ్రీలంక టూర్‌కు ఎంపిక కానప్పడే అది నేను ఊహించాను" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Syed Musthaq Ali T20: సయ్యద్ ముస్తాక్ టి20లో దుమ్మురేపుతున్న దేశవాలీ ఆటగాళ్లు -
SA Vs ENG : ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం.. అయినా సెమిస్కు..
ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం.. అయినా సెమిస్కు.. చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది. అఖరి ఓవర్లో 14 పరుగుల కావల్సిన నేపథ్యంలో కగిసో రబడా హ్యట్రిక్ వికెట్లతో మెరిశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఆలీ(37), మలాన్(33),లివింగ్‌స్టోన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించినప్పటికీ సెమిస్కు ఆర్హత సాధించలేక పోయింది. కాగా అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్ ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో రెండు వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్ కలిసి 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్(90),మారక్రమ్(50), డికాక్(34), పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలలో మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మలాన్(33) ఔట్ 146 పరుగుల వద్ద మలాన్(33) రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్(27), మోర్గాన్(5) పరుగులతో క్రీజులో పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బెయిర్‌స్టో(1) ఔట్ 59 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. తబ్రైజ్ షమ్సీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఎల్బీగా వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో ఆలీ(31), మలాన్(20) పరుగులతో ఉన్నారు. కాగా జాసన్ రాయ్ రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్(26) ఔట్ సమయం: 21:59.58 పరుగుల వద్ద బట్లర్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగులు చేసిన బట్లర్, నోర్ట్జే బౌలింగ్‌లో బావుమాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఆలీ(8), బెయిర్‌స్టో(1) పరుగులతో ఉన్నారు. కాగా జాసన్ రాయ్ రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. చేలరేగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ 190 పరుగులు ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్ ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో రెండు వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్ కలిసి 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్(90),మారక్రమ్(50), డికాక్(34), పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలలో మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు. 130 పరుగులలోపు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేస్తే దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుతుంది. 15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 118/2 ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేలరేగి ఆడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో వాన్ డెర్ డస్సెన్(61), మారక్రమ్(15) పరుగులతో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా.. 6 ఓవర్లకు 49/1 సమయం: 19:59.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతుంది. 6 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డి కాక్(22), వాన్ డెర్ డస్సెన్(23) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. హెండ్రిక్స్(2) ఔట్ సమయం: 19:45 ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెండ్రిక్స్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన హెండ్రిక్స్ మోయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 3 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డి కాక్(11), వాన్ డెర్ డస్సెన్(1) పరుగులతో ఉన్నారు. షార్జా: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శనివారం(నవంబర్6) దక్షిణాఫ్రికా కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే నవంబర్6న జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి సెమిస్కు అడుగు దూరంలో నిలిచింది. దీంతో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా భారీ విజయం సాధిస్తే మెరుగైన రన్ రేట్‌తో సెమిస్కు చేరే అవకాశం ఉంటుంది. ఇక ఇరుజట్లు టీ20 ప్రపంచకప్‌లో ముఖాముఖి ఆరు సార్లు తలపడగా, దక్షిణాఫ్రికా 3 సార్లు గెలుపొందగా, 2 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఎటువంటి ఫలితం తేలలేదు. ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడా, కేశవ్ మహారాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ చదవండి: SA Vs ENG : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. -
టీ20ల్లో బంగ్లాదేశ్ చెత్త రికార్డు..
Bangladesh: టి20 క్రికెట్లో బంగ్లాదేశ్ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. టి20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో మూడు సార్లు వంద పరుగుల లోపు ఆలౌటైన తొలి జట్టు గా బంగ్లాదేశ్ నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2021లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కేవలం 84 పరుగులకే కూప్పకూలిన బంగ్లాదేశ్ ఈ ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. అంతకముందు న్యూజిలాండ్‌తో రెండు సార్లు బంగ్లాదేశ్ కేవలం 76 పరుగలకే ఆలౌటైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 85 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు.. సఫారి పేసర్లు రబాడ(3/20), నోర్జే(3/8), ప్రిటోరియస్(1/11) నిప్పులు చెరగడంతో 84 పరుగులకే కుప్పకూలింది. చదవండి: వాళ్లకు ఐపీఎల్ ఆడితే చాలు.. అంతర్జాతీయ క్రికెట్ వద్దు: పాక్ మాజీ కెప్టెన్ -
Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..!
ఉన్మాదం వెర్రితలలేయడం చరిత్రకేం కొత్త కాదు. వికృత చేష్టలతో కొందరు.. సీరియల్ కిల్లర్స్ ఇంకొందరు.. తరతరాలను వణికిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు మౌపా సెడ్రిక్ మాకే. తప్పు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించిన ఘనుడు. హత్యలు, హత్యాచారాలు, దొమ్మీలు, దోపిడీలు.. ఒక్కటేమిటి తవ్వేకొలదీ అతడి జీవితం ఓ నేరాల పుట్ట. దక్షిణాఫ్రికాకు చెందిన మౌపా.. 1965లో జన్మించాడు. అతడి నేర చరిత్ర 1996 నుంచి మొదలైంది. ఏడాదిలోనే తనున్న నగరాన్ని అతలాకుతలం చేసేశాడు. ‘మౌపా సెడ్రిక్ మాకే’గా కాకుండా ‘వెమ్మెర్ పాన్ కిల్లర్’గా పేరు మోశాడు. ఎందుకలా మారాడు? 1996 నుంచి 1997 వరకూ జోహాన్నెస్‌బర్గ్‌లోని వెమ్మెర్ పాన్ అనే ప్రాంతంలో వరుసగా 3 రకాల హత్యలు జరిగాయి. ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. హత్యలు జరిగిన తీరుని బట్టి రెండు రౌడీగ్యాంగ్స్ నగరానికి వచ్చి ఉంటాయని.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. హత్యకు గురైన తీరుని బట్టి వాటిని మూడు వేరువేరు కేటగరీలుగా విభజించి ప్రొఫైల్స్ కూడా రెడీ చేశారు. మొదటి రకం.. ఒంటరిగా నడిచివెళ్లే ఆడ, మగలను బండరాయితో కొట్టి చంపి, వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడం. రెండవ రకం.. కారుల్లో వెళ్లే జంటలను టార్గెట్ చేసి మొదట మగవారిని గన్‌తో కాల్చి చంపి.. తర్వాత స్త్రీలను రేప్ చేసి చంపడం. మూడవ రకం.. స్థానిక టైలర్ల షాపులపై దాడి చేసి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం. ఇలా జరిగిన హత్యల్లో మూడు తేడాలు ఉండేవి. దాంతో ఈ ఉదంతం ఓ మిస్టరీగా మారిపోయింది. టైలర్స్ మీద దాడి చేసేది ఒక గ్రూప్ అని, మిగిలిన రెండు రకాల హత్యలను మరో గ్రూప్ చేస్తోందని ముందొక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వెమ్మెర్ పాన్ ప్రాంతంలో హత్యలు జరుగుతున్నాయి కాబట్టి ‘వెమ్మెర్ పాన్ కిల్లర్’గా, కొందరిని సుత్తితో చంపుతున్నారు కాబట్టి ‘హామర్ కిల్లర్’గా పేర్లు పెట్టి స్థానిక మీడియా ఆ నగరవాసులను హెచ్చరించేది. మౌపా చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! ఓ రోజు ఓ టైలర్ షాప్‌లో పోలీసులకు ఒక స్లిప్ దొరికింది. దాంట్లో ఓ సంతకం ఉంది. దాన్ని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే.. అప్పటికే అలాంటి సంతకం రెండో గ్రూప్ చేసిన హత్యలో కీలక ఆధారంగా దొరికింది. దాంతో రెండు గ్రూపులు లేవనీ ఒకటే గ్రూపు ఇదంతా చేస్తోందని పోలీసులు భావించారు. కనీసం ఒక్కడిని పట్టుకున్నా గ్యాంగ్ మొత్తాన్ని బయటికి లాగొచ్చు అనే ఆలోచనతో దాన్నో సవాలుగా తీసుకున్నారు. వెమ్మెర్ పాన్ చుట్టుపక్కల మఫ్టీలో తిరగడం మొదలుపెట్టారు. కొన్నిరోజులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమ పై అధికారులకు అప్పగించారు ఆ మఫ్టీ పోలీసులు. అయితే ఆ అధికారులు అతన్ని చూడగానే షాక్ అయ్యారు. ‘నువ్వా?’ అంటూ ఆశ్చర్యపోతున్న అధికారులతో ‘నేనే సార్.. గుర్తున్నానా? నా పేరు మౌపా సెడ్రిక్ మాకే. ఆ ఏరియా మాదే సార్. ఇంతకు ముందు కొన్ని హత్యలకు సంబంధించిన సమాచారాన్ని నేనే కదా మీకిచ్చింది’ అని అతను అనడంతో పోలీసులకు మతి పోయింది. ఆ వెంటనే తేరుకొని వాళ్లు ‘అసలు ఆ నేరాల గురించి నీకు మాత్రమే ఎలా తెలుస్తోంది?’ అంటూ ఆరా లాగారు. దాంతో అతని డ్రామాకి తెరపడింది. అనుమానం రావాలే కానీ నిజాలను కక్కించడం ఎంతసేపు? చివరికి అదే జరిగింది. గ్యాంగులు, గ్రూపులు ఏమీ లేవని.. ఆ నేరాలన్నిటినీ తానే చేశానని ఒప్పుకున్నాడు మౌపా. పోలీసులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ తప్పించుకుని తిరిగిన మౌపా వ్యూహాన్ని చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మౌపా అరెస్టు 1,340 ఏళ్ల జైలుశిక్ష.. 1997 డిసెంబర్లో అరెస్ట్ అయిన మౌపాకి.. 6 సెప్టెంబర్, 2000 సంవత్సరంలో అన్ని ఆధారాలతో శిక్ష ఖరారైంది. అతడు మొత్తంగా 110కి పైగా నేరాలు చేసినట్లు తేలింది. 27 హత్యలు, 26 హత్యాయత్నాలు, 14 రేప్‌లు, 41 దోపిడీలు చేసినట్లు రుజువైంది. వాటన్నింటికీ కోర్టు అతడికి 27 జీవిత ఖైదులను విధించింది. అంటే 1,340 సంవత్సరాలు అతను జైల్లో ఉండాలని తీర్పునిచ్చింది. అయితే ఈ నేరాల్లో ఎక్కువ శాతం రెండిళ్ల చుట్టుపక్కలే జరగడం గమనార్హం. వాటిలో ఒకటి మౌపా పని చేసే ఇల్లు, మరొకటి అతడి సోదరుడు నివసిస్తున్న ఇల్లు. ఆ రెండిళ్ల మధ్య తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఈ నేరాలకు పాల్పడ్డాడు మౌపా. అయితే ఈ శిక్షలపై బాధిత బంధువు ఒకరు స్పందిస్తూ.. ‘మరణ శిక్ష అమల్లో ఉంటే నేను చాలా సంతోషించేవాడిని’ అన్నాడు.. 1995 నుంచి దక్షిణాఫ్రికాలో మరణ శిక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ. -సంహిత నిమ్మన చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. -
SA Vs WI: పెను ప్రమాదం తప్పించకున్న పాక్ అంపైర్ .. వీడియో వైరల్
Umpire Aleem Dar: టీ20 ప్రపంచకప్2021 సూపర్-12 రౌండ్లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్‌కు పెను ప్రమాదం తప్పింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన ప్రిటోరియాస్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్ బౌలర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అంపైర్ అలీమ్ దార్ వైపు వేగంగా దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన అతడు తప్పించుకుని కింద పడిపోయాడు. అయితే బంతి నేరుగా లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ దుసాన్ చేతికి వెళ్లింది. వెంటనే అతడు రనౌట్‌కు ప్రయత్నించి చాలా వేగంగా బౌలర్ ఎండ్‌వైపు త్రో చేశాడు. దీంతో అలీమ్ దార్ మరోసారి బంతి నుంచి తప్పించుకున్నాడు. అలీమ్ దార్‌కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆటగాళ్లంతా ఊపిరి పీల్చకున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Pak Vs NZ: కంగ్రాట్స్ న్యూజిలాండ్... పాకిస్తాన్ సేఫ్.. కానీ మా జట్టు మాత్రం డేంజర్: అక్తర్ Aleem Dar 🥶 pic.twitter.com/33nwLghf71 — Abdul Hadi 🇵🇰 (@Abdul_Hadi_1) October 26, 2021 -
స్టార్ ఆటగాళ్లకు మొండిచేయి.. దక్షిణాఫ్రికా టీ20 జట్టు ఇదే
కేప్ టౌన్: యూఏఈ, ఒమన్ వేదికగా వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. తెంబ బవుమా సారథ్యంలో15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. కాగా సీనియర్ ఆటగాళ్లు ఫాఫ్ డుప్లెసిస్, క్రిస్ మోరీస్,ఇమ్రాన్ తాహీర్‌లకు టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో చోటు దక్కలేదు. ఫామ్‌లో ఉన్నప్పటికీ బోర్డు వారిని పక్కనపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డుప్లెసిస్, ఇమ్రాన్ తాహీర్ ప్రస్తుతం కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నారు. కాగా సౌత్ ఆఫ్రికా తన తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. దక్షిణాఫ్రికా జట్టు: తెంబ బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), పార్చూన్, హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్తేజ్, ప్రొటోరియస్, కగిసో రబాడ, షంషీ, దుస్సేన్. రిజర్వ్ ప్లేయర్లు: జార్జ్ లిండే, ఫెహ్లువాయో, విలియమ్స్ చదవండి: Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్ -
రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు
కొలంబో: వర్షం అంతరాయం కలిగించిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 67 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత సఫారీ జట్టు 47 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేన్‌మన్ మలాన్ (135 బంతుల్లో 121; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. హెండ్రిక్స్ (51; 5 ఫోర్లు) రాణించాడు. వర్షం కారణంగా శ్రీలంక లక్ష్యాన్ని 41 ఓవర్లకు 265 పరుగులుగా కుదించారు. ఛేదనలో లంక 36.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (77; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. షమ్సీ 5 వికెట్ల శ్రీలంకను కట్టడి చేశాడు. చదవండి: BAN Vs NZ: వార్నీ ఇదేం డెలివరీ.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ -
ఉత్తరప్రదేశ్‌లో జన్మించి.. దక్షిణాఫ్రికాను అల్లకల్లోలం చేశారు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా(79)కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం 15 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జుమా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తాయి. వారం క్రితం ప్రారంభమైన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఫలితంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 మందికి పైగా మరణించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఈ నిరసన ప్రదర్శనలను 1990 తర్వాత దేశంలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పారు. జుమాపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో ప్రధానంగా ముగ్గురు భారతీయ సోదరులు ఉన్నారు. వీరిని గుప్తా సోదరులుగా పిలుస్తారు. జుమాకు, ఈ సోదరులకు చాలా దగ్గర సంబంధం ఉందని.. అధ్యక్షుడు వీరికి దేశ వనరులను దోచి పెట్టాడని ఆరోపణలు వెలుగు చూశాయి. ఒకానొక సమయంలో గుప్తా బ్రదర్స్ జుమా ప్రభుత్వ పాలసీలను నిర్ణయించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఇక జుమా పదవి నుంచి దిగిపోయిన తర్వాత గుప్తా సోదరుల్లో ఇద్దరు దేశం విడిచి పారిపోయారు. జుమాపై ఉన్న కేసేంటి.. జుమాపై భారీ అవినీతి కేసులు నమోదయ్యాయి. దీనిలో ఒకటి 1999నాటి 2 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాల ఒప్పందం కేసు కాగా.. మరొకటి 2009-18 వరకు జుమా పరిపాలన కాలంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలకు సంబంధించినది. మొదటి కేసులో జుమా ఆరోపణలను తోసిపుచ్చగా.. రెండో కేసులో విచారణకు అంగీకరించడం లేదని అధికారులు తెలిపారు. జుమాపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న పానెల్ జుమా, ముగ్గురు భారతీయ సోదరులతో కలిసి భారీ అవినీతికి పాల్పడినట్లు వెల్లడించింది. గుప్తా బ్రదర్స్‌గా పేరు గాంచిన అతుల్ గుప్తా, అజయ్ గుప్తా, రాజేస్ గుప్తాలతో కలిసి జుమా దేశ వనరులను కొల్లగొట్టారని తెలిపింది. గుప్తా సోదరులకు, జుమాకు మంచి సంబంధలుండేవని.. ఒకానొక దశలో జుమా ప్రభుత్వ పాలసీలను ఈ సోదరులే నిర్ణయించేవారని పానెల్ తెలిపింది. ఇక 2018లో జుమాను పదవి నుంచి తొలగించిన తర్వాత గుప్తా సోదరుల్లో ఇద్దరు దక్షిణాఫ్రికా విడిచి పారిపోయారు. జుమా-గుప్తా బంధం ‘జుప్తా’ జుమాకు, గుప్తా సోదరులకు తొలుత 2015-16 కాలంలో పరిచయం ఏర్పడింది. సహారా కంప్యూటర్ ఈవెంట్ సందర్భంగా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వత కొద్ది కాలంలోనే అది బలమైన బంధంగా మారింది. వీరి బంధాన్ని విమర్శకులు జుప్తా(జుమా+గుప్తా= జుప్తా)గా పిలిచేవారు. 2016లో గుప్తా సోదరులపై బలమైన అవినీతి ఆరోపణలు వెలుగు చూశాయి. గుప్తా బ్రదర్స్ అప్పటి ఉప ఆర్థిక మంత్రిని కలిసి.. తమ వ్యాపార ప్రయోజనాలను విస్తరించుకునే అవకాశం కల్పిస్తే.. అతడికి ఆర్థిక మంత్రి పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక సదరు మంత్రికి 600 మిలియన్ రాండ్లను చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక జుమా పదవి కోల్పోవడానికి గుప్తా బ్రదర్సే కారణమని మాజీ ఆర్థిక మంత్రి ప్రవీణ్ గోర్థాన్ ఆరోపించారు. ‘జుప్తా’ పతనం.. 2017లో దాదాపు లక్ష ఈ మెయిళ్లు లీక్ అయ్యాయి. ఇవన్ని ప్రధానంగా గుప్తా సోదరులకు సంబంధించినవే. జుమా ప్రభుత్వాన్ని గుప్తా బ్రదర్స్ ఎలా ప్రభావితం చేశారో ఈ ఈమెయిళ్లు తెలుపుతున్నాయి. దీనికి ముందు 2013లో గుప్తా సోదరులు చేసిన ఓ పని దక్షిణాఫ్రికా జనాల మనోభావాలను దెబ్బ తీసింది. అదేంటంటే దేశంలోని ముఖ్యులకు సంబంధించిన ఓ మిలటరీ ఎయిర్బేస్ని గుప్తా సోదరులు తమ వ్యక్తిగత పనులకు వాడుకోవడం తీవ్ర ఆగ్రహాన్ని రేకేత్తించింది. ఈ క్రమంలో ఈమెయిళ్లు లీక్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. జుమాకు, గుప్తా కుటుంబానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. 2018, ఫిబ్రవరిలో విపక్షాలు జుమాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దాంతో జుమా పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఆయనను బలవంతంగా అధ్యక్ష పదవి నుంచి దింపేసింది. గుప్తా సోదరులు దుబాయి, యూఏఈ పారిపోయారు. ఎవరీ గుప్తా సోదరులు.. గుప్తా సోదరులు పశ్చిమ ఉత్తరప్రదేశ్ సహరాన్‌పూర్‌కు చెందిన వారు. వీరికి ఓ చిన్న కుటుంబ వ్యాపారం ఉండేది. ఈ క్రమంలో వీరిలో పెద్దవాడైన అతుల్ గుప్తా 1993లో దక్షిణాఫ్రికా వెళ్లాడు. వర్ణవివక్ష ముగిసిన తర్వాత దేశం ప్రపంచానికి ఆహ్వానం పలికిన సమయంలో అతుల్ గుప్తా దక్షిణాఫ్రికా వెళ్లాడు. మిగతవారు ఆయనను అనుసరించారు. కొన్ని నివేదికల ప్రకారం గుప్తా సోదరులు మొదట్లో దక్షిణాఫ్రికాలో కార్లో బూట్లు తీసుకెళ్లి అమ్మేవారు. ఆ తర్వాత వారు సహారా కంప్యూటర్స్ అనే సంస్థను స్థాపించారు. వ్యాపారం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వారు రాజకీయ సంబంధాలను పెంచుకున్నారు.. వారు తమ వ్యాపారాన్ని కంప్యూటర్ల నుంచి విమాన ప్రయాణం, శక్తి, మైనింగ్, టెక్నాలజీ, మీడియా రంగాలకు విస్తరించారు. చివరకు దేశ పాలసీలను నిర్ణయించే వరకు ఎదిగారు. -
‘బాబోయ్ మందు’.. పైనాపిల్ బీర్‌కు ఫుల్గిరాకీ
‘హమ్ మందు నహీతో బతుకు నయ్ సక్తాహై’.. లాక్డౌన్ టైంలో చాలామంది మందు బాబులు వెల్లడించిన అభిప్రాయం ఇదే. అంతెందుకు ఫస్ట్ వేవ్ టైంలో మందు దొరక్క.. శానిటైజర్లు, ఇంట్లోనే మందు ప్రయోగాలతో ఘోరంగా దెబ్బతిన్నవాళ్లూ లేకపోలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో మందు బాబులకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు. దీంతో పైనాపిల్ ధరలకు రెక్కలొచ్చాయి. సౌతాఫ్రికాలో లాక్డౌన్ 4 లెవల్లో భాగంగా 14 రోజులపాటు లిక్కర్ షాపులు మూతపడ్డాయి. దీంతో పైనాపిల్ పండ్ల ద్వారా ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు మందుబాబులు. ఈ ప్రభావంతో పైనాపిల్ పండ్ల ధరలు 74 శాతం పెరిగాయి. లాక్డౌన్-మందు దొరకని పరిస్థితుల నేపథ్యంలోనే పైనాపిల్‌కు ఒక్కసారిగా డిమాండ్ సౌతాఫ్రికా అగ్రిమార్క్ ట్రెండ్స్(ఏఎంటీ) గురువారం వెల్లడించింది. అయితే జూన్ చివరి వారం నుంచే లిక్కర్‌పై ఆంక్షలను అమలు చేస్తోంది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. దీంతో అప్పటి నుంచే పైనాపిల్ ధరలు స్వల్ఫంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా 14 రోజుల నిషేధం నేపథ్యంలో.. ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే మాత్రం పైనాపిల్ ధరలు ఊహించని రేంజ్‌కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఒక మహిళ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు!
అందమైన జంట, అన్యోన్య దాంపత్యం, ముచ్చటైన జంట.. ఇలాంటి పదాలను తరచూగా వింటూనే ఉంటాం. ఎవరైనా భార్యాభర్తలు కలహాలు లేకుండా కాపురం చేస్తున్నా,, ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవిస్తున్నా ఈ పదాలతోనే వాళ్లను పొగడ్తల్లో ముంచేస్తాం. ఇద్దరు మనుషులు, వారి మనసులు కలిసి చేసే జీవనప్రయాణమే దాంపత్యం. ఏ సంప్రదాయం అయినా ఒక భర్తకు ఒక భార్య ఉండటమే చూడటానికి బాగుంటుంది. కానీ కొన్ని ఆచారాల్లో ఓ వ్యక్తి ఇద్దరు లేదా ఎంతమందినైనా పెళ్లి చేసుకునే వీలు కూడా ఉంటుంది. అయితే ఇష్టమొచ్చినన్ని పెళ్లిళ్లు చేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఎందుకు ఉండకూడదు. ఈ ఆలోచన మనలో ఎంతమందికి వచ్చిందో తెలియదు. కానీ దక్షిణాఫ్రికాలో మహిళలు, పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న సామాజికవేత్తలు దీనిపై పోరాడుతున్నారు. ప్రపంచంలో అత్యంత ఉదారమైన రాజ్యాంగవ్యవస్థల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉన్నాయి. తాజాగా బహుభర్తృత్వంపై వెల్లువెత్తిన ప్రతిపాదనలను ఆ దేశ ప్రభుత్వం స్వీకరించింది. దేశంలోని మహిళలు అనేక మంది పురుషులను పెళ్లాడేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వడాన్ని పరిశీలిస్తూ సమగ్ర ప్రతిపాదనలతో ఓ ఫైలును డాక్యుమెంట్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు హోంమంత్రిత్వశాఖ గ్రీన్ పేపర్‌ను జారీ చేసింది. మహిళలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలను అనుమతించాలన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం చేసిన ప్రతిపాదన దేశంలో విస్తృత చర్చకు దారితీసింది. బహుభర్తృత్వ ప్రతిపాదనలను అక్కడి మతసంస్థల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరిలో అక్కడి బుల్లితెర ప్రముఖుడు మౌసా సెలేకూ సైతం ఉన్నారు. నలుగురు భార్యలున్న ఈయన.. బహుభర్తృత్వం ఆఫ్రికన్ సంస్కృతి సర్వనాశనమవుతుందని విమర్శించారు. ఓ మహిళ ఎన్నడూ పురుషుడి స్థానాన్ని భర్తీ చేయలేదని, బహుభర్తృత్వం ద్వారా పిల్లలు పుడితే ఎవరి తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఓ మహిళకు ఒకరిని మించి భర్తలున్నప్పుడు వారంతా ఆమె ఇంటి పేరును స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు రెవరెండ్ కెన్నెత్ మెషో మాట్లాడుతూ.. బహుభార్యాత్వం ఆచరణలో ఆమోదయోగ్యమైనది. కానీ బహుభార్యత్వం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అసూయ, నాదీ అన్న అధిపత్య ధోరణితో ఉండే పురుషాధిక్య సమాజంలో ఒక మహిళ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చనేది పనిచేయదన్నారు. అయితే చట్టాన్ని మార్చుతూ చేసిన ప్రతిపాదనలోని కీలక సమస్యలపై సాంప్రదాయ నాయకులతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, ఇతర గ్రూప్‌లో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతోంది. -
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..
ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' పదకొండవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ ఫేం రాహుల్ వైద్య, వరుణ్ సూద్, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ ప్రియురాలు దిషా పర్మార్‌ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్ అయ్యారు. ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్‌బాస్-14లో రుబీనా దిలైక్‌తో తలపడి రాహుల్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్‌ని కూడా పరిచయం చేసిన రాహుల్ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్‌పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్ మదనపడుతూ కనిపించాడు. View this post on Instagram A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_) ఛదవండి : 'బిగ్‌బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
సిక్సర్లతో యువీ, బౌండరీలతో సచిన్..
న్యూఢిల్లీ: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2021లో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్.. సచిన్ టెండూల్కర్ (37 బంతుల్లో 60; 9 ఫోర్లు, సిక్స్), యువరాజ్ సింగ్ (22 బంతుల్లో 52; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు)ల వీరవిహారం ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్‌ను సాధించారు. వీరికి వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ బద్రీనాథ్ (34 బంతుల్లో 42 రిటైర్డ్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), యూసఫ్ పఠాన్ (10 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు కూడా తోడవడంతో టీమిండియా ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా, ఇదే సిరీస్‌లో బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 35 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. వీరూ సాధించిన 80 పరుగుల్లో 70 పరగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించినవే. సెహ్వాగ్‌కు సచిన్ (26 బంతుల్లో 33; 5 ఫోర్లు) దూకుడు కూడా తోడవడంతో ఈ మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆతరువాత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే రీతిలో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయి 34 బంతుల్లో 61 పరుగులతో విజృంభించాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం భారత్ విజయం ముంగిట ఆగిపోయింది. తాజాగా దక్షిణఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్, యువరాజ్లు చెలరేగిపోయి భారత అభిమానులకు పూర్వపు రోజులను గుర్తు చేస్తూ కనువిందు చేశారు. -
చెలరేగిన స్మృతి మంధాన.. దక్షిణాఫ్రికా చిత్తు
లక్నో: తొలి వన్డేలో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు వెంటనే తేరుకుంది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాను ఆల్‌రౌండ్ ప్రదర్శన తో దెబ్బకొట్టి సిరీస్‌లో సమంగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. బౌలింగ్‌లో వెటరన్ సీమర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి (4/42) దక్షిణాఫ్రికాను వణికించగా... తర్వాత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (64 బంతుల్లో 80 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. స్మృతికి పూనమ్ రౌత్ (89 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు) తోడుగా నిలిచింది. దాంతో భారత్ 28.4 ఓవర్లలో కేవలం వికెట్ నష్టపోయి 160 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఛేజింగ్‌లో వరుసగా పది అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. అంతకుముందు టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు లిజెల్లి లీ (4), వోల్వర్డ్ (9) జట్టు స్కోరు 20 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో లారా గుడ్‌ఆల్ (49; 2 ఫోర్లు), సునే లూస్ (36; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించాక కెప్టెన్ లూస్‌ను మాన్సీ జోషి అవుట్ చేసింది. అక్కడి నుంచి భారత బౌలర్లు పట్టుబిగించారు. కేవలం 58 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను పడేశారు. లూస్, గుడ్‌ఆల్ తర్వాత ఇంకెవరూ భారత బౌలింగ్‌కు అసలు క్రీజులో నిలిచే సాహసం చేయలేకపోయారు. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ 3, మాన్సి జోషి 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరగగా... స్మృతి, పూనమ్ రౌత్‌తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షబ్నిమ్ బౌలింగ్‌లో స్మృతి రెండు వరుస సిక్సర్లతో ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మృతి 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు అండగా నిలిచిన పూనమ్ రౌత్ 79 బంతుల్లో ఫిఫ్టీని అధిగమించింది. ఐదు వన్డేల సిరీస్ 1–1తో సమంగా ఉండగా... మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఆడటం ద్వారా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ గుర్తింపు పొందింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటివరకు 310 మ్యాచ్‌లు (10 టెస్టులు+211 వన్డేలు+82 టి20లు) ఆడింది. 309 మ్యాచ్‌లతో (23 టెస్టులు+191 వన్డేలు+95 టి20లు) చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. -
కరోనా వేళ.. క్రిస్మస్ ఎలా..!
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల ఉత్సాహం కరోనా పుణ్యమా అని మసకబారుతోంది. ఒకపక్క ఈ మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిందని సంతోషించేలోగానే, కొత్త రూపు సంతరించుకొని దాడి చేయడం ఆరంభించింది. దీంతో పలు దేశాలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకురాగా, కొన్ని దేశాలు తేలికపాటి ఆంక్షలు తెచ్చాయి. ప్రజలు సమూహంగా గుమిగూడటం నుంచి విందు భోజనాల వరకు అనేక అంశాలపై పరిమితులు విధించాయి. నూతన సంవత్సర వేడుకల్లో కొత్తరూపంలో కరోనా దాడి చేయకుండా దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధాజ్ఞలు పెరిగాయి. యూరప్ దేశాలైతే దాదాపు భయం గుప్పిట్లోకి జారాయి. ఆయా దేశాల వాతావరణ, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకున్నాయి. –లండన్ బ్రిటన్‌లో షట్‌డౌన్ నిన్నమొన్నటి వరకు క్రిస్మస్ సమయంలో ఆంక్షలన్నీ రద్దు చేయాలని బ్రిటన్ భావించింది. వ్యాక్సినేషన్ కూడా ఆరంభించింది. అయితే ఒక్కమారుగా కొత్త స్ట్రయిన్ బయటపడడంతో ఉలిక్కిపడింది. ప్రస్తుతం పాత ప్లాన్లన్నీ రద్దు చేసి పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐలాండ్‌ల్లో వివిధ రూపాల్లో లాక్‌డౌన్‌ను పునఃప్రారంభించారు. లండన్‌లోనైతే ఇంట్లో కూడా సామూహిక వేడుకలు వద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు డజన్ల కొద్దీ దేశాలు బ్రిటన్‌కు విమానాలు నిలిపివేశాయి. లెబనాన్ తీరేవేరు ఆర్థికంగా కూనారిల్లుతున్న ఎకానమీని గట్టెక్కించడానికి విదేశీ మారక ద్రవ్యార్జనే మార్గమని భావించిన లెబనాన్ చాలా ఆంక్షలు ఎత్తివేసింది. నైట్‌క్లబ్బులు తెరిచిఉంచేందుకు అనుమతినిచ్చింది. అయితే క్లబ్బుల్లో డ్యాన్సులను నిషేధించింది. అమెరికాలోరాష్ట్రాలదే నిర్ణయం అమెరికా ప్రభుత్వం దేశవ్యాప్తం ప్రయాణాలపై జాతీయ స్థాయిలో నిషేధం విధించలేదు. ఆయా రాష్ట్రాలే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వీలు కల్పించింది. కానీ వీలయినంత వరకు ఇంట్లోనే ఉండమని ప్రజలకు సూచించింది. దక్షిణాఫ్రికాలో మందు బం§Š క్రిస్మస్ రోజు దేశంలో మందు అమ్మకాలను దక్షిణాఫ్రికా నిలిపివేసింది. దేశంలో పలు చోట్ల నైట్‌కర్ఫ్యూ విధించింది. క్రిస్మస్, న్యూఇయర్ రోజును బీచ్‌లు మూసివేస్తున్నట్లు తెలిపింది. సామూహికంగా తిరగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంట్లో మాత్రం 100 మంది వరకు కలుసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు దక్షిణాఫ్రికాకు విమానాలు నిలిపివేస్తున్నాయి. బ్రెజిల్లో మీ ఇష్టం ఆది నుంచి కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బోల్సెనారో ప్రభుత్వం క్రిస్మస్ సమయంలో ఎలాంటి కొత్త ఆంక్షలు లేవని తెలిపింది. సోపౌలో నగర గవర్నర్ మాత్రం స్వల్ప ఆంక్షలు విధించారు. సోపౌలో, రియో, సాల్వ డార్లో డిసెంబర్ 31న బాణసంచా కాల్చడాన్ని నిలిపివేశారు. జర్మనీలో పాటలు నిషిద్ధం వచ్చే నెల 10వరకు కొత్త ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24–26 మధ్య మాత్రం స్వల్ప సడలింపులుంటాయని తెలిపింది. మ తపరమైన సమావేశాలు జరపవచ్చని, కానీ పాటలు మాత్రం నిషిద్ధమని తెలిపింది. ఇతర దేశాల్లో... ► పెరూలో క్రిస్మస్ రోజు కారు డ్రైవింగ్‌ను నిషేధించారు. ► ఫ్రాన్స్‌లో సామూహిక విందు భోజనాల్లో పాల్గొనేవారి సంఖ్యను ఆరుకు పరిమితం చేశారు. వచ్చే నెల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. ► చిలీలో విందు భోజనాలకు 15మంది వరకు అనుమతినిస్తున్నారు. ► ఇటలీలో వచ్చే రెండువారాల వరకు ప్రయాణాలు నిషేధించారు. ► పోర్చుగల్‌లో క్రిస్మస్కు కొంతమేర సడలింపులిచ్చి న్యూఇయర్‌కు కఠిన ఆంక్షలు విధించనున్నారు. ► స్పెయిన్‌లో స్వల్ప సడలింపులతో వేడుకలకు అనుమతించారు. ► దక్షిణ కొరియాలో వచ్చే నెల 3వరకు ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై ఆంక్షలు తెచ్చారు. ► రష్యాలో వచ్చేనెల 15వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. -
మూడోసారి తండ్రైన క్రికెటర్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్ మూడోసారి తండ్రయ్యాడు. అతడి భార్య డేనియల్ ఈనెల 11న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో భార్యాపిల్లలతో కలిసి ఉన్న ఫొటోను డివిల్లియర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాపకు యెంటేగా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ మేరకు ‘‘11-11-2020న అందమైన పాపాయి యెంటే డివిల్లియర్స్కు స్వాగతం పలికాం. నీ రాకతో మన కుటుంబం పరిపూర్ణమైంది. నిన్ను ప్రసాదించినందుకు ఆ దేవుడికి మేం ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం’’ అని క్యాప్షన్ జతచేశాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా డివిల్లియర్స్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి: అలా సెహ్వాగ్ వార్తల్లో ఉంటాడు: మాక్స్వెల్ ) కాగా ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన అనంతరం 2013లో డివిల్లియర్స్- డేనియల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు అబ్రహం జూనియర్, జాన్ ఉన్నారు. ఇక ఇప్పుడు కూతురు జన్మించడంతో డివిల్లియర్స్ దంపతులు ఆనందంలో మునిగిపోయారు. కాగా ఐపీఎల్-2020 సీజన్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున మైదానంలో దిగిన టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోవడంతో అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోగా.. డివిల్లియర్స్ వారి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు చెబుతూనే, అదే సమయంలో అంచనాలు అందుకోలేకపోయామని క్షమాపణ కూడా కోరాడు. View this post on Instagram A post shared by AB de Villiers (@abdevilliers17) -
ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు మృతి
బోట్స్వానా : నీటిలోని సైనోబాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ వల్ల ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వరుసగా ఏనుగులు చనిపోతుండటంపై విచరణ చేపట్టిన దర్యాప్తు సంస్థ ఈ మేరకు షాకింగ్ విషయాలను వెల్లడించింది. సాధారణంగా సైనోబాక్టీరియా అనేది నీటిలో, మట్టిలోనూ ఉండే సూక్షజీవి. వీటి వల్ల ప్రమాదం లేకపోయినా వాతావరణ మార్పుల వల్ల విషతుల్యం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ఈ సూక్ష్మజీవులు విషంగా మారాయని, ఈ నీళ్లు తాగడంతో ఏనుగులు చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మే నెల ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా 330 ఏనుగులు చనిపోయినట్లు జాతీయ వన్యప్రాణి, ఉద్యానవనాల డిప్యూటీ డైరెక్టర్ సిరిల్ టావోలో పేర్కొన్నారు. వీటిలో అత్యధికంగా జూలై మాసంలోనే 281 ఏనుగులు చనిపోయినట్లు తెలిపారు. (అరుదైన మగ కప్పల భీకర పోరు ) అయితే మిగతా వన్యప్రాణులకు సైతం ఈ పరిస్థితి ముప్పుగా మారుతుందనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఎందుకంటే ఈ టాక్సాన్స్ వల్ల ఇప్పటివరకు ఏనుగులు మాత్రమే చనిపోయాయి. మిగతా జంతువులన్నీ క్షేమంగానే ఉన్నాయి. కాబట్టి పరిస్థితుల్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఏనుగల జనాభా అధికంగా ఉండే ఆఫ్రికాలో మూడింట ఒకవంతు ఏనుగులు బోట్స్వానాలో ఉంది. ఇక దక్షిణాఫ్రికాలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. పొరుగున ఉన్న జింబాబ్వేలోని అతిపెద్ద గేమ్ పార్క్ సమీపంలో సుమారు 25 ఏనుగులు చనిపోయాయి. అయితే బొట్స్వానా ఘటనతో దీన్ని లింక్ చేయలేమని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి ఏనుగు మృతదేహాలను పరిశీంచాకే నీటిలోని టాక్సిన్ వల్ల చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఇవి మృత్యువాత పడి ఉండొచ్చేమో అని విక్టోరియా ఫాల్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌లోని పశువైద్యుడు క్రిస్ ఫాగ్గిన్ అన్నారు. (ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు) -
24 గంటల్లో 2.6 లక్షల మందికి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే 2,60,000 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమమని పేర్కొంది. ఈ కేసుల్లో అత్యధికంగా అమెరికా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా దేశాల నుంచేనని తెలిపింది. అదేవిధంగా, మే 10వ తేదీ తర్వాత ఒక్క రోజులోనే అత్యధికంగా 7,360 మంది కోవిడ్‌తో చనిపోయారని పేర్కొంది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు 1.45 కోట్లు కాగా, మరణాలు 6.06 లక్షలని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. -
ఈ బుడ్డోడికి ఎంత ధైర్యమో!
చిన్న పిల్లలు ఏవరైనా సాధారణంగా పెద్ద పెద్ద జంతువులను చూస్తే భయపడి ఏడుస్తాడు.కానీ సౌత్ ఆఫ్రికా అడవికి వెళ్లిన ఒక బుడ్డోడు మాత్రం ఏకంగా ఒక అడవి ఏనుగు దగ్గరకు వెళ్లి మరీ దాని తొండాన్ని తాకుతూ ‘హాయ్ ఎలిఫెంట్’ అని చెప్పి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫ్రికా అడవులు అంటేనే అక్కడ సఫారీకి వెళ్లిన వారికి పెద్ద పెద్ద ఏనుగులు, రకరకాల అడవి జంతువులు కనబడటం సర్వసాధారాణం. అయితే సఫారీ గైడ్లు అడవి ఏనుగుల దగ్గరకు పర్యాటకులను వెళ్లనివ్వరు. ఎందుకంటే అడవి జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. చదవండి: వైరల్ వీడియో.. పాములతో కేక్ తినిపించారు Just speechless 💕 Wildlife photographer Lesanne was on a shoot getting pics of this massive bull elephant, when her son, a little Zimbabwean boy fearlessly went up to him to say hello. Gentle giants..... pic.twitter.com/SdHlXq2r2P — Susanta Nanda IFS (@susantananda3) July 16, 2020 వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ లెసాన్నే ఫోలెర్, తన కొడుకుతో కలిసి సఫారీకి వెళ్లింది. అక్కడ ఓ పెద్ద అడవి ఏనుగు గడ్డి తింటుంటే లెసాన్నే దాన్ని ఫొటోలు తీయసాగింది. ఇంతలో ఆమె కొడుకు ఏమాత్రం భయపడకుండా ఏనుగు దగ్గరకు వెళ్లాడు. దాని తొండాన్ని నిమురుతూ... హాయ్ ఎలిఫేంట్ అని పలకరించాడు. ఇదంతా ఆమె వీడియో తీసింది. ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనందా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఆ ఏనుగు ఏదో ధ్యాసలో ఉండి ఆ చిన్నారిని పట్టించుకోలేదు. అదే ఏనుగు కోపంలో ఉండి ఉంటే ఆ పిల్లాడికి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ వీడియో పోస్ట్ చేసిన సుశాంతనందా ఆ చిన్నారి తొండాన్ని నిమరడం ఏనుగుకి నచ్చి ఉంటుంది అని చెబుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అడవి జంతువుల దగ్గరకు చిన్నారులు వెళ్లడం మంచిది కాదని అంటున్నారు. చిన్నారి తల్లి అలా వెళ్లనివ్వకుండా ఆపాలని సూచిస్తున్నారు. అదృష్టం కొద్దీ ఏం జరగలేదు కాబట్టి ఈ వీడియో చూసి ఎంజాయ్ చెయ్యగలుగుతున్నాం, అదే ఏమైనా అయి ఉంటే అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పక్కన ప్రొఫెషనల్స్ లేకుండా వన్యమృగాల దగ్గరకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. -
నెల్సన్ మండేలా చిన్న కుమార్తె మృతి
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా చిన్న కుమార్తె జిండ్జీ(59) మృతి చెందినట్లు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. ఈ రోజు ఉదయం జోహన్నెస్‌బర్గ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది. అయితే ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం జిండ్జీ డెన్మార్క్ రాయబారిగా పనిచేస్తున్నారు. కాగా నెల్సన్ మండేలా- రెండో భార్య విన్నీ మడికిజెలాకు పుట్టిన సంతానం జిండ్జీ. (క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత) అయితే వీరు 1992లో విడాకులు తీసుకోగా విన్నీ మడికిజెలా 2018 ఏప్రిల్ నెలలో మృతి చెందారు. 1998లో తన పుట్టిన రోజు సందర్భంగా మండేలా మూడో భార్య గ్రాచా మాచెల్స్ను వివాహం చేసుకున్నారు. నెల్సన్ మండేలాకు మొత్తం ముగ్గురు భార్యలు ఆరుగురు సంతానం. 20 మంది మనువలు, మనవరాళ్లు ఉన్నారు. కాగా మండేలా తీవ్ర శ్వాసకోశ సంబంధ అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న జోహన్నెస్‌బర్గ్‌లో మరణించారు. -
మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ ఏ నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు, గ్రూప్ బి నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఫైనల్ బెర్త్ కోసం తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా, మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. కాగా, ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు గురువారం సిడ్నీ వేదికగా జరగనున్నాయి. అయితే సిడ్నీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ జరగాల్సిన రెండు లీగ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే గురువారం సిడ్నీలో వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ అధికారులు తెలిపారు. మ్యాచ్ సజావుగా సాగే అవకాశం లేదని, మ్యాచ్‌కు పలమార్లు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వర్షం కారణంగా సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే గ్రూప్ దశలో ఆగ్రస్థానంలో ఉన్న జట్లు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాయని ప్రపంచకప్ నిర్వాహకులు తెలిపారు. దీంతో గ్రూప్-ఏలో టాపర్ టీమిండియా, గ్రూప్-బి టాపర్ దక్షిణాఫ్రికా జట్లు మార్చి 8న మెల్బోర్న్ వేదికగా జరిగే ఫైనల్లో తలపడతాయి. ఇక సెమీఫైనల్లో రిజర్వ్‌డే పెట్టాలన్న ఆసీస్ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ షెడ్యూల్ రూపొందాక మార్పులు చేర్పులు సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా అక్టోబర్‌లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ సెమీస్ రిజర్వ్‌డే లేదని వివరించింది. చదవండి: మళ్లీ టాప్‌టెన్‌లోకి వచ్చాడు 'కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది' -
దక్షిణాఫ్రికా లక్ష్యం 466
జొహన్నెస్‌బర్గ్: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం ఎదురైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మ్యాచ్‌ను అంపైర్లు నిలిపి వేశారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్ ప్రత్యర్థికి 466 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. జో రూట్ (58; 5 ఫోర్లు, సిక్స్) ‘టాప్’ స్కోరర్‌గా నిలిచాడు. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ బ్యూరన్ హెండ్రిక్స్ 5 వికెట్లతో మెరిశాడు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఫిలాండర్ రెండో ఇన్నింగ్స్‌లో 9 బంతులు వేసిన అనంతరం గాయం కారణంగా మైదానం వీడాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 88/6తో బ్యాటింగ్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 183 పరుగులకు ఆలౌటైంది. మార్క్ వుడ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాడు బట్లర్ అవుటై పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో అతడిని దూషించినందుకు గాను దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలాండర్‌పై మ్యాచ్ ఫీజులో ఐసీసీ 15 శాతం కోత విధించింది. -
వలసలు దెబ్బ తీస్తున్నాయి
2015 సిరీస్ అనుభవం తర్వాత స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటే చాలని ఇక్కడికొచ్చాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భారత పేసర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా దేశ బోర్డు సరైన ముందుస్తు ప్రణాళికలతో సిద్ధం కాలేదు. ఇక భారత పర్యటన మానసికంగా మాకు మానలేని గాయాలు చేసింది. దీనినుంచి కోలుకోవడం అంత సులువు కాదు. ప్రతీసారి భారత్ నిర్దాక్షిణ్యంగా ఆడి భారీ స్కోర్లు నమోదు చేసింది. వాటిని చూడగానే మానసికంగా మేం బలహీనపడిపోయాం. అదే మా బ్యాటింగ్‌లో కనిపించింది. వైజాగ్‌లో తొలి ఇన్నింగ్స్ చాలా బాగా ఆడిన తర్వాత ఇలా జరగడం బాధాకరం. ఆ తర్వాత మేం తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాం. అయితే ప్రతీ విభాగంలో మాపై పైచేయి సాధించిన భారత జట్టును ప్రశంసించకుండా ఉండలేం. దిగ్గజ ఆటగాళ్ల స్థానంలో భవిష్యత్తు కోసం వేరేవాళ్లను తీర్చి దిద్దే ప్రయత్నం జరగలేదు. ‘కొల్పాక్’ ఒప్పందంతో ప్రతిభ గల మా ఆటగాళ్లంతా ఇంగ్లండ్‌కు వలస వెళ్లిపోతుండటం దేశ క్రికెట్‌ను దెబ్బ తీస్తోంది. అంతా డబ్బు మహిమ. –డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్ -
నేడే క్లీన్‌స్వీప్
ఈ టెస్టుకు ఇంకా రెండు రోజుల ఆట ఉంది. కానీ... చరిత్రకెక్కేందుకు లాంఛనమే మిగిలుంది. సఫారీపై ఎప్పుడూలేని విధంగా 3–0తో క్లీన్‌స్వీప్ విజయానికి టీమిండియా రెండే అడుగుల దూరంలో ఉంది. టెస్టుల్లో నంబర్‌వన్ కోహ్లి బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను రోజంతా దడదడలాడించింది. మూడో టెస్టులో ఒక్క మూడో రోజే 16 వికెట్లతో ఘనచరితకు శ్రీకారం చుట్టింది. రాంచీ: భారత పేసర్లు షమీ, ఉమేశ్‌లు ఆఖరి టెస్టును మూడో రోజే తేల్చేశారు. ఇద్దరు సీమర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదేసి వికెట్లు పడేశారు. చారిత్రక విజయానికి భారత్‌ను దగ్గర చేశారు. క్లీన్‌స్వీప్‌కు రెండే వికెట్ల దూరంలో నిలిపారు. ఆ లాంఛనం తొలి ఘడియలోనే పూర్తయితే కోహ్లి సేన ఎదురులేని విజయాన్ని సాధిస్తుంది. తొలి సెషన్లో పేసర్లు ఉమేశ్ (3/40), షమీ (2/22)లకు స్పిన్నర్లు జడేజా (2/19), నదీమ్ (2/22) తోడయ్యారు. దీంతో సఫారీ తొలి ఇన్నింగ్స్ 56.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. హమ్జా (79 బంతుల్లో 62; 10 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. భారత పేసర్లు ఫాలోఆన్‌లో మరింత రెచ్చిపోయారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను నిలువునా కూల్చేశారు. ఆటనిలిచే సమయానికి 132 పరుగులకే 8 వికెట్లను పడేశారు. 10 పరుగులే ఇచి్చన షమీ 3 వికెట్లు తీయగా, ఉమేశ్ 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఆడింది... హమ్జా ఒక్కడే! దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ హమ్జా ఒక్కడే భారత బౌలర్లకు ఎదురునిలిచాడు. 9/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సఫారీ జట్టు ఆరంభ ఓవర్లోనే కెపె్టన్ డు ప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయింది. అతన్ని ఉమేశ్ బౌల్డ్ చేశాడు. హమ్జాకు బవుమా (72 బంతుల్లో 32; 5 ఫోర్లు) జతయ్యాడు. ఇద్దరు కలిసి భారత బౌలర్లను 21 ఓవర్ల పాటు ఆడుకున్నారు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక సఫారీ కష్టాలు మొదలయ్యాయి. వన్డేను తలపించే ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న హమ్జాను జడేజా బోల్తా కొట్టించగా... బవుమాను నదీమ్ ఔట్ చేశాడు. 129/6 స్కోరు వద్ద సఫారీ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్లో లిండే (81 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) టెయిలెండర్లతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. పీట్ (4), రబడ (0) స్వల్ప వ్యవధిలోనే ని్రష్కమించినప్పటికీ... తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నోర్జే (55 బంతుల్లో 4) ఆకట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌ను చాలాసేపు ఎదుర్కొన్నాడు. 45వ ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత కాసేపటికే లిండేను ఉమేశ్, నోర్జేను నదీమ్ ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 162 పరుగుల వద్ద ముగిసింది. తప్పని తడబాటు... తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీకి ఫాలోఆన్ తప్పలేదు. అయితే వారి రెండో ఇన్నింగ్స్ కూడా కష్టాలతోనే మొదలైంది. రిటైర్డ్‌హర్ట్ ఎల్గర్ (16) మినహా తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్ అంతా 5 పరుగుల్లోపే పెవిలియన్ చేరారు. డికాక్ (5)ను ఉమేశ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్న హమ్జా (0)కు షమీ ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇదే ఊపులో కెప్టెన్ డుప్లెసిస్ (4)ను షమీ ఎల్బీ చేశాడు. మొత్తానికి మూడో సెషన్‌కు ముందే సఫారీ 4 కీలక వికెట్లను కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత కూడా పర్యాటక జట్టు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ లిండే (27), పీట్ (23) నిలబడటంతో జట్టుస్కోరు వందకు చేరింది. ఎల్గర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రుయిన్ (30 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో రెండే వికెట్లు ఉండటంతో మరో అరగంటసేపు ఆటను పొడిగించారు. కానీ బ్రుయిన్.. నోర్జే (5 బ్యాటింగ్)తో కలిసి నాటౌట్‌గా నిలవడంతో ఆట మరో రోజు కొనసాగనుంది. ►5..ఒకే రోజు ఆటలో 14 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం భారత్‌కిది ఐదోసారి. ఈ జాబితాలో 20 వికెట్లు (అఫ్గానిస్తాన్‌పై బెంగళూరులో; 2018) తొలి స్థానంలో ఉండగా... తర్వాతి స్థానాల్లో 17 వికెట్లు (పాకిస్తాన్‌పై ఢిల్లీలో; 1952–53), 16 వికెట్లు (దక్షిణాఫ్రికాపై రాంచీలో; 2019లో), 15 వికెట్లు (శ్రీలంకపై బెంగళూరులో; 1993–94లో), 14 వికెట్లు (వెస్టిండీస్‌పై రాజ్‌కోట్‌లో 2018–19లో) ఉన్నాయి. ►8.. ప్రత్యర్థి జట్టును ఎక్కువసార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెపె్టన్‌గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. కోహ్లి సారథ్యంలో ఇప్పటివరకు భారత్ ప్రత్యర్థి జట్టును 8 సార్లు ఫాలోఆన్ ఆడించింది. తర్వాతి స్థానాల్లో అజహరుద్దీన్ (7), ధోని (5), సౌరవ్ గంగూలీ (4) ఉన్నారు. ►2.. ఒక సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు రెండుసార్లు ఫాలోఆన్ ఆడటం 1964–65 తర్వాత ఇదే తొలిసారి. స్వదేశంలో 1964–65లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా చివరిసారి రెండుసార్లు ఫాలోఆన్ ఆడింది. ►4.. టెస్టుల్లో స్టంపింగ్ ద్వారా కెరీర్లో తొలి వికెట్ తీసిన నాలుగో బౌలర్‌గా షాబాజ్ నదీమ్ గుర్తింపు పొందాడు. గతంలో డబ్ల్యూవీ రామన్ (వాల్‡్ష–1987–88లో), ఎం.వెంకటరమణ (హేన్స్–1988–89లో), ఆశిష్ కపూర్ (కార్ల్ హూపర్–1994–95లో) ఈ ఘనత సాధించారు. ►2.. కొట్నీ వాల్ష్ (వెస్టిండీస్) తర్వాత భారత గడ్డపై వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉమేశ్ యాదవ్ (6/88, 4/45, 3/37, 3/22, 3/40) గుర్తింపు పొందాడు. ఉమేశ్ బౌన్సర్... ఎల్గర్ కన్కషన్ భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ బౌన్సర్ సఫారీ ఓపెనర్ ఎల్గర్‌ను పడేసింది. అతను వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఎల్గర్ 16 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా... ఉమేశ్ వేసిన మూడో బంతి అనూహ్యంగా బౌన్స్ అయి బ్యాట్స్‌మన్ చెవి పైభాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను పడిపోయాడు. బ్యాటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఐసీసీ కన్కషన్ ప్రొటోకాల్ ప్రకారం మ్యాచ్ రిఫరీ ఎల్గర్ స్థానంలో బ్రుయిన్ను ఆడించేందుకు అనుమతించారు. ఎల్గర్ గాయం నుంచి కోలుకోవడానికి మరో ఆరు రోజల సమయం పడుతుందని దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. సాహా స్థానంలో పంత్ కీపింగ్ టీమిండియాకు మరో ఎదురుదెబ్బ. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయంతో మైదానం వీడాడు. మూడో రోజు ఆటలో అశ్విన్ వేసిన 27వ ఓవర్ తొలి బంతి గింగిర్లు తిరుగుతూ బౌన్స్ అయింది. క్రీజులో ఉన్న లిండే దాన్ని ఎదుర్కోలేకపోవడంతో బంతిని సాహా అందుకునే ప్రయత్నం చేయగా అతని మునివేళ్లను తాకడంతో గాయపడ్డాడు. నొప్పికి తాళలేకపోయిన సాహా పెవిలియన్ చేరగా అతని స్థానంలో రిషభ్ పంత్ కీపింగ్ చేయాల్సి వచ్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 497/9 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) సాహా (బి) షమీ 0; డికాక్ (సి) సాహా (బి) ఉమేశ్ 4; హమ్జా (బి) జడేజా 62; డు ప్లెసిస్ (బి) ఉమేశ్ 1; బవుమా (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 32; క్లాసెన్ (బి) జడేజా 6; లిండే (సి) రోహిత్ (బి) ఉమేశ్ 37; పీట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 4; రబడ రనౌట్ 0; నోర్జే (ఎల్బీడబ్ల్యూ) (బి) నదీమ్ 4; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (56.2 ఓవర్లలో ఆలౌట్) 162. వికెట్ల పతనం: 1–4, 2–8, 3–16, 4–107, 5–107, 6–119, 7–129, 8–130, 9–162, 10–162. బౌలింగ్: షమీ 10–4–22–2, ఉమేశ్ 9–1–40–3, నదీమ్ 11.2–4–22–2, జడేజా 14–3–19–2, అశ్విన్ 12–1–48–0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: డికాక్ (బి) ఉమేశ్ 5; ఎల్గర్ (రిటైర్డ్ హర్ట్) 16; హమ్జా (బి) షమీ 0; డు ప్లెసిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 4; బవుమా (సి) సాహా (బి) షమీ 0; క్లాసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్ 5; లిండే (రనౌట్) 27; పీట్ (బి) జడేజా 23; బ్రుయిన్ (బ్యాటింగ్) 30; రబడ (సి) జడేజా (బి) అశ్విన్ 12; నోర్జే (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (46 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–5, 2–10, 3–18, 4–26, 5–36, 6–67, 7–98, 8–121. బౌలింగ్: షమీ 9–5–10–3, ఉమేశ్ 9–1–35–2, జడేజా 13–5–36–1, నదీమ్ 5–0–18–0, అశి్వన్ 10–3–28–1. -
భయానక అనుభవం; తప్పదు మరి!
జంతువులను వీక్షించడానికి సఫారీకి వచ్చిన పర్యాటకులకు భయానక అనుభవం ఎదురైంది. జీపులో వెళ్తున్న వారిపై ఏనుగు ఒక్కసారిగా విరుచుకుపడింది. కోపంతో పరుగులు తీస్తూ తొండంతో జీపును తోసేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన పర్యాటకులు అంతేవేగంగా స్పందించి రివర్స్‌లో వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో.. ‘సఫారీ వెళ్లినపుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదు. మీరు అదృష్టవంతులు. అందుకే ప్రాణాలతో బయటపడ్డారు’ అంటూ కొంతమంది కామెంట్ చేస్తుండగా... మరికొందరు మాత్రం... ‘ఏనుగులతో సెల్ఫీలు దిగాలి. సింహంతో ఆడుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు తప్పవు మరి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
ఆశల పల్లకీలో లంక
చెస్టర్ లీ స్ట్రీట్: టోర్నీ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్‌ను ఓడించిన ఊపులో, మిగిలిన మూడు మ్యాచ్‌లూ నెగ్గితే సెమీఫైనల్స్ చేరే అవకాశం ఉన్న స్థితిలో శ్రీలంక శుక్రవారం దక్షిణాఫ్రికాను ఎదుర్కొననుంది. ప్రత్యర్థి పరాజయాల పరంపరలో ఉన్నందున... లంకకు ఇది ఆశావహ పరిస్థితి. గత మ్యాచ్‌లో ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ రాణించడం, వెటరన్ పేసర్ లసిత్ మలింగ బుల్లెట్ బంతులతో సత్తా చాటడంతో జట్టు ఆత్మ విశ్వాసంతో కనిపిస్తోంది. ఓపెనర్లు కెప్టెన్ కరుణరత్నె, కుశాల్ పెరీరా మంచి ఇన్నింగ్స్‌లు ఆడితే లంక విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. ధనంజయ డిసిల్వా స్పిన్‌ను ఆడటం సఫారీలకు పరీక్షే. టోర్నీలో ఒక్కటంటే ఒక్కటే (అఫ్గానిస్తాన్) గెలుపుతో ఉన్న దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్ పరువుతో ముడిపడినది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆ జట్టు చివరి మ్యాచ్‌ను పటిష్టమైన ఆస్ట్రేలియా (జూలై 6న)తో ఆడాల్సి ఉంది. లంక చేతిలో ఓడితే, ఇక ఆసీస్‌ను నిలువరించడం అసాధ్యం. అదే జరిగితే తమ చరిత్రలోనే అత్యంత దారుణ పరాభవం మిగులుతుంది. కాబట్టి, శుక్రవారం మ్యాచ్ సఫారీలకు కీలకం. వెటరన్లు ఆమ్లా, మిల్లర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న నేపథ్యంలో ఓపెనర్ డికాక్, కెప్టెన్ డుప్లెసిస్ పరుగులు సాధిస్తే ప్రత్యర్థికి పోటీ ఇవ్వగలుగుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పేసర్ రబడ కనీసం ఇప్పుడైనా సత్తా చాటుతాడేమో చూడాలి. ముఖాముఖి రికార్డు ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 76 మ్యాచ్‌లు జరగ్గా... లంక 31 మ్యాచ్‌ల్లో నెగ్గింది. దక్షిణాఫ్రికా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా, మరోదాంట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో ఐదు సార్లు ఎదురుపడగా మూడుసార్లు దక్షిణాఫ్రికా, ఒకసారి లంక గెలిచాయి. మరో మ్యాచ్ (2003 కప్‌లో) ‘టై’గా ముగిసింది. -
సూపరోహిట్...
ఎన్నాళ్లయిందో బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ నిబ్బరం చూసి! ఎన్ని ఇన్నింగ్స్లయ్యాయో అతడింత సంయమనంగా ఆడి! సిక్సర్ల జోరు, బౌండరీల మెరుపుల్లేకుండా ఎంత నిగ్రహంగా నిలిచాడో! ప్రపంచ కప్‌లో భారత్ ఏమైతే కోరుకుంటోందో అదే జరిగిన వేళ... అలవోక విజయంతో జట్టు టైటిల్ వేట ఆశావహంగా ప్రారంభమైంది. భారీ స్కోర్ల మైదానంగా పేరున్న రోజ్‌బౌల్ అందుకు భిన్నంగా స్పందించినా... యజువేంద్ర చహల్ మాయాజాలం, బుమ్రా మెరుపులు, రోహిత్ పోరాటంతో దక్షిణాఫ్రికాపై టీమిండియా సమయోచితంగా ఆడి గెలుపును సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో ఇరు జట్ల ఆట కంటే వాతావరణం గురించే ఎక్కువ చెప్పుకోవాలేమో...? మబ్బులు కమ్మి శీతల గాలులతో అంతగా పరిస్థితులను మార్చింది మరి. అదనపు బౌన్స్, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టింది. దీంతో క్యాచ్‌ల కోసం టెస్టుల తరహాలో మూడు స్లిప్‌లలో ఫీల్డర్లను మోహరించారు. చల్లదనంతో ఆటగాళ్లు పదేపదే చేతులను రుద్దుకున్నారు. దీంతో ఊహించిన దానికంటే తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. సౌతాంప్టన్: అంచనాలకు తగ్గకుండా ఆడి... ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ఆటతో తమ తొలి మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ (144 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో రాణించిన వేళ దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్లతో జయభేరి మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు... మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4/51) మాయాజాలం, పేసర్ జస్ప్రీత్ బుమ్రా (2/35) పకడ్బందీ బౌలింగ్‌తో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. 8వ నంబరు బ్యాట్స్‌మన్ క్రిస్ మోరిస్ (34 బంతుల్లో 42; ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. రబడ (35 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు)తో అతడు జోడించిన 66 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. కెప్టెన్ డు ప్లెసిస్ (54 బంతుల్లో 38; 4 ఫోర్లు), ఫెలుక్వాయో (61 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్) మోస్తరుగా ఆడారు. భువనేశ్వర్ (2/44) ఆఖర్లో రెండు వికెట్లు తీశాడు. ఛేదనలో రోహిత్ శతకానికి రాహుల్ (42 బంతుల్లో 26; 2 ఫోర్లు), ధోని (46 బంతుల్లో 34; 2 ఫోర్లు) అండగా నిలవడంతో భారత్ 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 230 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. టీమిండియా తదుపరి మ్యాచ్‌ను లండన్‌లో ఈ నెల 9న ఆస్ట్రేలియాతో ఆడనుంది. మొదట బుమ్రా, మధ్యలో చహల్... గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించి దెబ్బతిన్న పరిణామమేమో కాని... మబ్బులు కమ్మిన వాతావరణం ఉన్నప్పటికీ, బుధవారం టాస్ నెగ్గగానే డు ప్లెసిస్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. కానీ భువీ, బుమ్రాను ఎదుర్కొనడం సఫారీ ఓపెనర్లు ఆమ్లా (9 బంతుల్లో 6; ఫోర్), డికాక్ (17 బంతుల్లో 10; ఫోర్)లకు కత్తిమీద సామే అయింది. గుడ్ లెంగ్త్‌లో ఆఫ్ స్టంప్‌కు దూరంగా బుమ్రా వేసిన బంతి అదనపు బౌన్స్‌తో ఆమ్లా బ్యాట్ అంచును తాకుతూ రాగా రెండో స్లిప్‌లో రోహిత్ ఒడిసి పట్టాడు. బుమ్రా మరుసటి ఓవర్లో ఫుల్ లెంగ్త్ బంతితో డికాక్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ క్యాచ్‌ను మూడో స్లిప్‌లో కోహ్లి అందుకున్నాడు. ప్రధాన పేసర్ల తొలి స్పెల్ పూర్తికాక ముందే ఓపెనర్లు ఔటైన పరిస్థితుల్లో డు ప్లెసిస్, డసెన్ (22) నిలిచారు. పది ఓవర్ల పవర్ ప్లే పూర్తయ్యేసరికి జట్టు స్కోరు 34/2 మాత్రమే. కుల్దీప్, పాండ్యా బౌలింగ్‌లో ఇబ్బంది పడుతూనే ఈ జోడీ మూడో వికెట్‌కు 54 పరుగులు జత చేసింది. ఈ దశలో చహల్ రంగప్రవేశం ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. అతడు వేసిన 20వ ఓవర్ మొదటి బంతిని రివర్స్ స్వీప్‌కు యత్నించి డసెన్ బౌల్డ్ కాగా, గుగ్లీగా వచ్చిన చివరి బంతి డు ప్లెసిస్ వికెట్లను గిరాటేసింది. డుమిని (3)ని కుల్దీప్ ఎల్బీగా పంపాడు. దీనిపై రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. మిల్లర్ (40 బంతుల్లో 31; 1 ఫోర్), ఫెలుక్వాయో 12 ఓవర్ల పైగా నిలిచి 46 పరుగులు జోడించారు. మరోసారి చహల్ మాయాజాలం చూపి వీరిద్దరినీ ఔట్ చేశాడు. 158/7తో ఒకదశలో దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకే చాపచుట్టేసేలా కనిపించింది. మోరిస్, రబడ జంట భారత బౌలర్లందరినీ తట్టుకుని 59 బంతులు ఆడి స్కోరును 200 దాటించింది. చివరి ఓవర్లో మోరిస్, తాహిర్ (0)లను భువీ ఔట్ చేశాడు. ఛేదన కష్టమైంది... స్కోరు చిన్నదే అయినా దానిని అందుకోవడంలో భారత్‌కు తిప్పలు తప్పలేదు. పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న ప్రత్యర్థి పేసర్లు రబడ (2/39), మోరిస్ (1/36) చుక్కలు చూపారు. వీరి ధాటికి శిఖర్ ధావన్ (12 బంతుల్లో 8; ఫోర్) చేతులెత్తేశాడు. కోహ్లి (34 బంతుల్లో 18; 1 ఫోర్) తన ఆఫ్ స్టంప్ బలహీనత చాటుకుంటూ... డికాక్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. కానీ, రోహిత్ దృఢ సంకల్పంతో నిలిచాడు. ఇరు జట్ల గెలుపు అవకాశాలు చెరి సగం ఉన్న దశలో రాహుల్‌తో కలిసి మూడో వికెట్‌కు 96 బంతుల్లో 85 పరుగులు జోడించి మ్యాచ్ భారత్ వైపు మొగ్గేలా చేసాడు. అనంతరం ధోనితో కలిసి 74 పరుగులు జత చేసి విజయం ఖాయం చేశాడు. 48 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో వీరిద్దరూ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని కరిగించారు. అంతకుముందు 70 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను చేరుకున్న రోహిత్... రెండో ఫిఫ్టీని 58 బంతుల్లోనే అందుకుని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (7 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) ఫటాఫట్ బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు. ఊపొచ్చింది... మజా లేదు ప్రపంచ కప్ ప్రారంభమైన వారం రోజులకు... అది కూడా టీమిండియా ఆడుతుందనగానే మన ప్రేక్షకులకు ఊపొచ్చింది. ప్రారంభ ఉత్కంఠను అధిగమించి మ్యాచ్ గెలిచినా వారు కోరుకున్నంత మజా మాత్రం రాలేదు. త్వరత్వరగా వికెట్లు కోల్పోయిన సఫారీల నుంచి పెద్దగా ప్రతిఘటన, మెరుపులు లేకపోవడం, నత్తనడక రన్‌రేట్‌తో ఓ స్థితిలో మ్యాచ్ బోర్ కొట్టించింది. భారత ఇన్నింగ్స్‌లో ధావన్, కోహ్లి వికెట్లు కోల్పోయిన తర్వాత కాస్త చురుకు పుట్టింది. పిచ్ క్లిష్టంగా ఉండటంతో రోహిత్ సైతం ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో 5 పరుగులే చేయగలిగాడు. కోహ్లి (తొలి 32 బంతుల్లో 14)దీ ఇదే పరిస్థితి. కుదురుకున్నాక, ముఖ్యంగా అర్ధ సెంచరీ దాటాక రోహిత్ స్పిన్నర్లు షమ్సీ, తాహిర్ బౌలింగ్‌లో కట్ షాట్లతో బౌండరీలు కొట్టి తన క్లాస్ చూపాడు. దీంతో కొంత అనుభూతి మిగిలింది. సరైన సమయంలో... కొన్నాళ్లుగా భారత విజయాల్లో టాప్–3 బ్యాట్స్‌మెన్‌దే కీలక పాత్ర. అయితే, ఈ మ్యాచ్‌లో ధావన్ నిరాశపర్చాడు. కోహ్లి విఫలమయ్యాడు. రోహిత్ మాత్రం సెంచరీతో హిట్ కొట్టాడు. 145 కి.మీ.పైగా వేగంతో వచ్చిన రబడ మెరుపు బంతులను, పదునుగా కనిపించిన మోరిస్ బౌలింగ్‌ను తట్టుకుని మరీ పరీక్ష గట్టెక్కాడు. ఐపీఎల్ సహా ఇటీవల ఫామ్ లేమితో సతమతం అవుతున్న అతడు సరైన సమయంలో నిలిచి గెలిపించాడు. తన ఆటతో జట్టు నెత్తిన పాలు పోశాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన అతడికి ఈ క్రమంలో అదృష్టం కూడా తోడైంది. నాలుగుసార్లు క్యాచ్ ఔట్ ప్రమాదాన్ని తప్పించుకున్న హిట్‌మ్యాన్, ఒకసారి రివ్యూ నుంచి నాటౌట్‌గా బయట పడ్డాడు. మరోసారి రనౌట్ నుంచి గట్టెక్కాడు. ఏదేమైనా కప్ తొలి మ్యాచ్‌లోనే రోహిత్ టచ్‌లోకి రావడం టీమిండియాకు పెద్ద బలం. ఆ క్యాచ్ పట్టి ఉంటే... మ్యాచ్‌లో సెంచరీతో భారత గెలుపులో కీలక పాత్ర పోషించిన రోహిత్ వాస్తవానికి రబడ మొదటి ఓవర్లోనే ఔట్ కావాల్సింది. అప్పటికి అతడి స్కోరు 1 మాత్రమే. రబడ వేసిన బంతిని రోహిత్ ఫుల్‌షాట్ ఆడబోగా అది గ్లోవ్స్‌కు తగిలి రెండో స్లిప్ దిశగా గాల్లో లేచింది. డు ప్లెసిస్ నెమ్మదిగా కదలడంతో అందుకునే అవకాశం లేకపోయింది. వాస్తవానికి అద్భుత ఫీల్డరైన డుప్లెసిస్ తేలికైన క్యాచ్‌ను జారవిడిచి జట్టుకు కోలుకోలేని నష్టం చేశాడు. సరిగ్గా ఆరు బంతుల తర్వాత మోరిస్ ఓవర్లో డుమిని ఓ క్లిష్టమైన క్యాచ్‌ను పట్టలేకపోయాడు. ఈ రెండు దక్షిణాఫ్రికాకు మ్యాచ్‌ను చేజార్చాయని చెప్పొచ్చు. పిచ్ సవాల్ విసరడంతో మ్యాచ్ చాలెంజింగ్‌గా సాగింది. రోహిత్‌కు హ్యాట్సాఫ్. టాస్ గెలిచి ఉంటే బౌలింగే చేసేవాళ్లం. బుమ్రా బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ అందుకున్న 15 నిమిషాల తర్వాత సైతం నా చేతులు సాధారణ స్థితికి రాలేదు. ఆమ్లాను అతడు ఔట్ చేసిన తీరును వన్డేల్లో నేనింతవరకు చూడలేదు. దీన్నిబట్టి బుమ్రా ఓ ప్రత్యేక శ్రేణిలో ఉన్నాడని చెప్పొచ్చు. చహల్ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ జట్టుగా రాణించాం. మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ పాపం దక్షిణాఫ్రికా... ఆటగాళ్ల తప్పిదాలు, ప్రకృతి శాపాలతో ప్రపంచ కప్‌కు ఎప్పుడూ దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకెళ్లే దక్షిణాఫ్రికా ఈసారి ఏకంగా ఉదాసీనతనూ మోసుకొచ్చినట్లుంది. ఆ జట్టు టోర్నీలో ఉందన్న మాటే కానీ, ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పరిస్థితుల్లో మిగతా ఆరూ గెలిస్తే కానీ సెమీస్ చేరే అవకాశం లేదు. సఫారీలు ఇప్పుడున్న ఫామ్‌లో ఇది ఊహకు కూడా అందని విషయం. కప్‌కు ముందే ఫిలాండర్, నోర్జ్టె దూరం కాగా, కప్ జరుగుతుండగా ప్రధాన పేసర్లు స్టెయిన్, ఇన్‌గిడి ఔటయ్యారు. ఇది డుప్లెసిస్ సేనను కోలుకోలేని దెబ్బతీసింది. అటు బ్యాటింగ్‌లోనూ పేలవ ప్రదర్శనే. నిలకడకు మారుపేరైన ఆమ్లా పనైపోయినట్లుంది. అనుభవజ్ఞులైన డుమిని, మిల్లర్లది సంపూర్తి వైఫల్యం. డికాక్, డుప్లెసిస్ అవసరమైన సమయంలో ఆడలేకపోయారు. మొత్తం సఫారీ ఆటగాళ్ల కళ్లలో కసి లేదు. ప్రతిష్ఠాత్మక కప్ అన్న స్పృహే వారిలో లేదు. భారత్‌తో మ్యాచ్‌లో అతి పేలవమైన వారి ఫీల్డింగ్ చూస్తేనే ఈ విషయం తెలిసిపోతోంది. బహుశా ఈ ప్రపంచ కప్‌లో సఫారీలు సెమీస్ రేస్ నుంచి పక్కకు వెళ్లిపోయినట్టే అనిపిస్తోంది. -
ఇక సంచలనం అనకండి: మొర్తజా
లండన్: ఇకపై తమ జట్టు పెద్ద జట్లను ఓడిస్తే అది సంచలనం కానే కాదని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా అన్నాడు. ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ‘క్రికెట్లో బంగ్లా సాధించిన ప్రగతి ఇది. ఇంకా దీన్ని మీరు ఆశ్చ ర్యంగానో, సంచలనంగానో చూడొద్దు. మేం సర్వశక్తులు ఒడ్డితే ఏదైనా సాధిస్తామని మాకు తెలుసు. కానీ కొందరు బంగ్లా బాగును కోరుకోవట్లేదు. అయితే మేం మాత్రం ఆటపైనే దృష్టిసారిస్తాం. ఎవరేమనుకుంటే మాకేంటి’ అని మొర్తజా అన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ఆట ఎదుగుతూ వచ్చిందని ఆల్‌రౌండర్ షకీబ్ తెలిపాడు. ఆ మెగా ఈవెంట్లో బంగ్లాదేశ్... భారత్, దక్షిణాఫ్రికాలను కంగుతినిపించింది. -
వైజాగ్‌లో టెస్టు, వన్డే హైదరాబాద్‌లో టి20
న్యూఢిల్లీ: ప్రపంచకప్ అనంతరం భారత్‌లో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. 2019–20 సీజన్‌కుగానూ స్వదేశంలో జరుగనున్న 5 టెస్టులు, 9 వన్డేలు, 12 టి20ల్లో భారత్ వేర్వేరు జట్లతో తలపడనుంది. సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికాతో మొదలయ్యే ‘ఫ్రీడమ్ కప్’ ట్రోఫీతో ‘భారత హోమ్ సీజన్’ ప్రారంభమవుతుంది. ఫ్రీడమ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మూడు టి20లు, మూడు టెస్టులు జరుగుతాయి. అక్టోబర్ 2 నుంచి 6 వరకు జరిగే తొలి టెస్టుకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం నవంబర్‌లో భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్ 3 టి20లు, రెండు టెస్టులు ఆడుతుంది. తర్వాత డిసెంబర్ 6 నుంచి 22 వరకు వెస్టిండీస్ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా జరుగనున్న 3 టి20ల్లో చివరి మ్యాచ్‌కు హైదరాబాద్... 3 వన్డేల్లో రెండో మ్యాచ్‌కు వైజాగ్ వేదికలుగా ఉన్నాయి. డిసెంబర్ 6న ముంబైలో తొలి టి20, 8న తిరువనంతపురంలో రెండో టి20, 11న హైదరాబాద్‌లో మూడో టి20 జరుగుతాయి. డిసెంబర్ 15న చెన్నైలో తొలి వన్డే, 18న వైజాగ్‌లో రెండో వన్డే, 22న కటక్‌లో మూడో వన్డే జరుగుతాయి. తర్వాత జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ (జనవరి 5–10)... ఆస్ట్రేలియా (జనవరి 14–19), దక్షిణాఫ్రికా (మార్చి 12–18) లతో వరుసగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు జరుగుతాయి. మార్చి 18న దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌తో భారత హోమ్ సీజన్ ముగుస్తుంది. -
అదిరే ఆరంభం
‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ గెలవలేం’ అని తమ టీమ్ నినాదంగా మార్చుకున్న జట్టు మొదటి అడుగును బ్రహ్మాండంగా వేసింది. అద్భుతమైన ఆట, సొంతగడ్డపై టోర్నీ, ఎన్నో అనుకూలతలతో, భారీ అంచనాలతో ప్రపంచ కప్ బరిలో దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో వాటిని అందుకుంది. అన్ని రంగాల్లో సమష్టిగా చెలరేగి 2019 ప్రపంచకప్‌నకు ఘనారంభం అందించింది. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు... ఆ తర్వాత పదునైన బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్ కలగలిసి దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈసారి ఫేవరెట్ కాదు కాబట్టి మాపై ఒత్తిడి లేదంటూ బరిలోకి దిగిన సఫారీలు అన్ని రంగాల్లో విఫలమైన భారీ ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన బెన్ స్టోక్స్, భీకరమైన బంతులతో ప్రత్యర్థి పని పట్టిన పేసర్ జోఫ్రా ఆర్చర్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ హీరోలుగా నిలిచారు. లండన్: పన్నెండో ప్రపంచ కప్ తొలి మ్యాచ్ ఏకపక్ష ఫలితాన్ని అందించింది. గురువారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (79 బంతుల్లో 89; 9 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (60 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్ రాయ్ (53 బంతుల్లో 54; 8 ఫోర్లు), జో రూట్ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ స్కోరులో కీలక పాత్ర పోషించారు. సఫారీ బౌలర్లలో ఇన్‌గిడి 3 వికెట్లు పడగొట్టగా, తాహిర్, రబడ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. క్వింటన్ డి కాక్ (74 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డసెన్ (61 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఆర్చర్ 27 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా... స్టోక్స్, ప్లంకెట్ చెరో 2 వికెట్లు తీశారు. సోక్స్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగు అర్ధ సెంచరీలు... గత కొంత కాలంగా అద్భుతమైన ఆరంభాలతో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్న ఇంగ్లండ్‌కు అనూహ్యంగా షాక్ తగిలింది. ప్రధాన పేసర్లను కాదని స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌తో తొలి ఓవర్ వేయించిన డు ప్లెసిస్ వ్యూహం ఫలించింది ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో (0)ను ఇన్నింగ్స్ రెండో బంతికే తాహిర్ ఔట్ చేశాడు. అయితే జేసన్ రాయ్, రూట్ కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో వీరు బ్యాటింగ్ చేశారు. తొలి పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. అనంతరం ఒకే ఓవర్లో రాయ్, రూట్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రాయ్‌కు 51 బంతులు పట్టగా, రూట్ 56 బంతులు తీసుకున్నాడు. అయితే నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపించి దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా ఫెలుక్వాయో వేసిన షార్ట్ బంతిని ఆడబోయిన రాయ్ మిడాఫ్‌లో ప్లెసిస్‌కు క్యాచ్ ఇవ్వగా... రబడ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్లో డుమినికి రూట్ క్యాచ్ ఇచ్చాడు. రాయ్, రూట్ రెండో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. ఆ తర్వాత మరో సెంచరీ భాగస్వామ్యం ఇంగ్లండ్ కోలుకునేలా చేసింది. ఈసారి కెప్టెన్ మోర్గాన్, స్టోక్స్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఇన్‌గిడి ఓవర్లో మోర్గాన్ వరుసగా రెండు సిక్సర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో వన్డేల్లో 7 వేల పరుగుల మైలురాయిని దాటాడు. అనంతరం 50 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. మరోవైపు ప్రిటోరియస్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన స్టోక్స్ 45 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నాలుగో వికెట్‌కు స్టోక్స్‌తో కలిసి 106 పరుగులు జత చేసిన తర్వాత మార్క్రమ్ పట్టిన చక్కటి క్యాచ్‌తో మోర్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ దశలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు సఫలమయ్యారు. ఇన్‌గిడి వేసిన 49వ ఓవర్లో రివర్స్ పుల్కు ప్రయత్నించిన స్టోక్స్...ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి సెంచరీ చేజార్చుకున్నాడు. రాణించిన డి కాక్, డసెన్... ఇన్నింగ్స్ ఆరంభంలో డి కాక్, ఆ తర్వాత కొంత వరకు డసెన్ ... వీరిద్దరు రాణించడం మినహా ఏ దశలో కూడా దక్షిణాఫ్రికా విజయం దిశగా వెళుతున్నట్లు కనిపించలేదు. ముందు గా ఆర్చర్ తన రెండో ఓవర్లో 144.8 కిలోమీటర్ల వేగంతో విసిరిన బౌన్సర్ తలకు తగిలి ఆమ్లా రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించగా... వరుస ఓవర్లలో మార్క్రమ్ (11), కెప్టెన్ డు ప్లెసిస్ (5)లను ఔట్ చేసి ఆర్చర్ మళ్లీ దెబ్బ తీశాడు. ఈ దశలో డి కాక్, డసెన్ కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. 6 పరుగుల వద్ద డసెన్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ బట్లర్ వదిలేశాడు. 58 బంతుల్లో డి కాక్ అర్ధసెంచరీ పూర్తయింది. ప్లంకెట్ ఓవర్లో డి కాక్ ఫోర్, సిక్స్ కొట్టగా... అలీ వేసిన తర్వాతి ఓవర్లో డసెన్ 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో జోరు పెరిగింది. నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించాక డి కాక్‌ను ఔట్ చేసి ప్లంకెట్ ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత సఫారీల పతనం మొదలైంది. డసెన్‌ను ఆర్చర్ ఔట్ చేయడం... కోలుకొని తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన ఆమ్లా (13) కూడా చేతులెత్తేయడంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది. తాహిర్‌తో బౌలింగ్ షురూ... ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. మ్యాచ్ తొలి ఓవర్‌ను తాహిర్ బౌల్ చేశాడు. తద్వారా ఒక ప్రపంచ కప్ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన మొదటి స్పిన్నర్‌గా అతను గుర్తింపు పొందాడు. 1992 ప్రపంచ కప్‌లో దీపక్ పటేల్ (న్యూజిలాండ్) కొత్త బంతితో బౌలింగ్ చేసినా...అతను రెండో ఓవర్‌తో తన బౌలింగ్ మొదలు పెట్టాడు. మరోవైపు 40 ఏళ్ల 64 రోజుల వయస్సున్న తాహిర్...దక్షిణాఫ్రికా తరఫున ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెలుక్వాయో 54; బెయిర్‌స్టో (సి) డి కాక్ (బి) తాహిర్ 0; రూట్ (సి) డుమిని (బి) రబడ 51; మోర్గాన్ (సి) మార్క్రమ్ (బి) తాహిర్ 57; స్టోక్స్ (సి) ఆమ్లా (బి) ఇన్‌గిడి 89; బట్లర్ (బి) ఇన్‌గిడి 18; అలీ (సి) డుప్లెసిస్ (బి) ఇన్‌గిడి 3; వోక్స్ (సి) డుప్లెసిస్ (బి) రబడ 13; ప్లంకెట్ (నాటౌట్) 9; ఆర్చర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 311. వికెట్ల పతనం: 1–1, 2–107, 3–111, 4–217, 5–247, 6–260, 7–285, 8–300. బౌలింగ్: తాహిర్ 10–0–61–2; ఇన్‌గిడి 10–0–66–3; రబడ 10–0–66–2; ప్రిటోరియస్ 7–0–42–0; ఫెలుక్వాయో 8–0–44–1; డుమిని 2–0–14–0; మార్క్రమ్ 3–0–0–16–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 68; ఆమ్లా (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 13; మార్క్రమ్ (సి) రూట్ (బి) ఆర్చర్ 11; డుప్లెసిస్ (సి) అలీ (బి) ఆర్చర్ 5; వాన్‌డర్ డసెన్ (సి) అలీ (బి) ఆర్చర్ 50; డుమిని (సి) స్టోక్స్ (బి) అలీ 8; ప్రిటోరియస్ (రనౌట్) 1; ఫెలుక్వాయో (సి) స్టోక్స్ (బి) రషీద్ 24; రబడ (సి) ప్లంకెట్ (బి) స్టోక్స్ 11; ఇన్‌గిడి (నాటౌట్) 6; తాహిర్ (సి) రూట్ (బి) స్టోక్స్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (39.5 ఓవర్లలో ఆలౌట్) 207. వికెట్ల పతనం: 1–36; 2–44; 3–129; 4–142; 5–144; 6–167; 7–180; 8–180; 9–207; 10–207. బౌలింగ్: వోక్స్ 5–0–24–0; ఆర్చర్ 7–1–27–3; రషీద్ 8–0–35–1; అలీ 10–0–63–1; ప్లంకెట్ 7–0–37–2; స్టోక్స్ 2.5–0–12–2. స్టోక్స్, -
గజరాజు ఫన్నీ ఫీట్.. వైరల్
సఫారీలో సంచరించే ఓ ఏనుగు చేసిన ఫీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. జిరాఫీలను ఆదర్శంగా తీసుకుని రెండు కాళ్లపై నిల్చుని చెట్ల కొమ్మలను అందిపుచ్చుకుని ఆహారాన్ని ఆరగించింది. డంకెన్ టేలర్ అనే ఫోటోగ్రాఫర్ తన కుటుంబంతో క్రూగర్ నేషనల్ పార్క్(సౌతాఫ్రికా)కు వెళ్లగా.. అక్కడ ఓ ఏనుగు ఆయన కెమెరా కంటికి చిక్కింది. ‘సాధారణంగా సర్కస్ ఏనుగుల్లో ఇలాంటి ప్రవర్తన సహజం. కానీ, ఓ అడవి ఏనుగు ఇలా ప్రవర్తించటం మాత్రం చాలా అరుదు. ప్రతీ రోజూ జిరాఫీలను చూసి చూసి దానికి అలా చేయాలన్న ఆలోచన కలిగింది. వారంపైగానే అది యత్నించింది. ఏదైతేనేం చివరకు సాధించింది’ అని సఫారీ పర్యవేక్షకుడు డెన్ని బోనియెల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. -
జోరు ఎవరిదో!
జొహన్నెస్‌బర్గ్: గత వారం రోజులుగా బాల్ ట్యాంప రింగ్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. వాండరర్స్ మైదానంలో శుక్రవారం మొదలయ్యే నాలుగో టెస్టు ‘డ్రా’ చేసుకుంటే దక్షిణాఫ్రికా సొంతగడ్డపై 1970 తర్వాత ఆస్ట్రేలియాపై సిరీస్ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఆతిథ్య జట్టు 2–1తో ముందంజలో ఉంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు దూరమై ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి తమ అభిమానుల మనసులు గెలవాలని భావిస్తోంది. మరోవైపు మూడో టెస్టులో విజయం సాధించిన సఫారీలు అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్న మోర్నీ మోర్కెల్‌పై అందరి దృష్టి నిలవనుంది. -
రబడ నిషేధం ఎత్తివేతపై స్మిత్ అసంతృప్తి !
సాక్షి, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ నిషేధం ఎత్తివేయడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో రబడ స్మిత్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడని తొలుత ఐసీసీ రెండు టెస్టుల నిషేదం విధించిన విషయం తెలిసిందే. దీనిపై రబడా అప్పీల్ చేయగా విచారించిన అప్పీల్ కమిషనర్ మైకేల్ హెరాన్ నిషేదాన్ని ఎత్తి వేస్తూ రబడకు అనుకూలంగా తీర్పునిచ్చాడు. దీంతో రబడ గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. అయితే ఈ తీర్పును స్మిత్ తప్పుబట్టాడు. రబడ తనని ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడని, ఇది వీడియోలో స్పష్టంగా తెలుస్తుందన్నాడు. వికెట్ పడగొట్టిన తర్వాత బౌలర్ల ఆనందం తనకు తెలుసని, కానీ ఓవర్‌గా రియాక్ట్ కావడం అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి విషయాల్లో ఐసీసీ కఠినంగా వ్యవహరించాలని సూచించాడు. విచారణలో తన వాదనలు వినకపోవడం ఆశ్చర్యం కలిగించిందని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో రబడ తన బౌలింగ్‌తో ఆసీస్ పతనాన్ని శాసిస్తున్నాడు. రెండు మ్యాచుల్లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. -
అప్పుడు వార్నర్, డికాక్.. ఇప్పుడు స్మిత్, రబడ!
సాక్షి, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ తారస్థాయికి చేరింది. తొలి టెస్టులో వార్నర్, డికాక్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా రెండో టెస్టులో కగిసో రబడా-స్మిత్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో రబడపై రెండు మ్యాచ్‌ల నిషేదం పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గతంలో అతిగా ప్రవర్తించడంతో రబడాకు 5 డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి. మరో మూడు పాయింట్లు చేరితో ఖచ్చితంగా రెండు మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కోనున్నాడు. అసలేం జరిగిందంటే.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్(25) రబడ వేసిన 51.6వ బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అయితే సహనం కోల్పోయిన రబడా స్మిత్‌కు ఎదురుగా వెళ్తూ భుజంతో డీకోట్టి పెవిలియన్ వైపు వెళ్లూ అంటూ సూచించాడు. ఇది వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రబడ ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు. రబడపై నిషేదం విదిస్తే దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురదెబ్బ తగలనుంది. తొలి టెస్టులో క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన వార్నర్, నాథన్ లియోన్‌లకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. డ్రెస్సింగ్ రూంకు వెళ్తుండగా డికాక్‌తో గొడవ పెట్టుకున్న వార్నర్‌కు 75 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు డీమెరిట్ పాయింట్స్ విధించారు. డివిలియర్స్ రనౌట్ అనంతరం అతనిపైకి బాల్ విసిరిన లియోన్‌కు 15 శాతం ఫీజుకోత విధించారు. ఇక ఆటగాళ్ల ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దమని అభిప్రాయపడుతున్నారు. -
అప్పుడు వార్నర్, డికాక్.. ఇప్పుడు స్మిత్, రబడ!
-
వన్డేల్లోనూ తిరిగొస్తా
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ సురేశ్ రైనాకు పునరాగమనంలాంటిది. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన అతను ఈ సిరీస్‌లో 15, 31, 43 పరుగులు చేశాడు. చివరి టి20లో బౌలింగ్‌లో కూడా రాణించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తులో ఇదే జోరు కొనసాగించి వన్డే జట్టులోకి కూడా తిరిగొస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. రైనా భారత్ తరఫున 2015 అక్టోబరులో ఆఖరిసారిగా వన్డే ఆడాడు. ‘తిరిగి జట్టులోకి రావడం నాకు కీలక మలుపులాంటింది. ఇప్పుడు గెలిచిన జట్టులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. మూడో స్థానంలో నాకు అవకాశమిచ్చి దూకుడుగా ఆడమంటూ కోహ్లి నాపై నమ్మకముంచడం వల్లే ఇది సాధ్యమైంది. మున్ముందు శ్రీలంకతో టోర్నీతో పాటు ఐపీఎల్లో కూడా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లకు అవకాశం ఉంది. గత రెండేళ్లుగా చాలా కష్టపడ్డాను. భారత్‌కు మళ్లీ ఆడాలనే పట్టుదలతో మైదానంలో, జిమ్‌లో కూడా తీవ్రంగా శ్రమించాను. వన్డేల్లో నేను గతంలో ఐదో స్థానంలో రాణించాను. రాబోయే మరికొన్ని మ్యాచ్‌లలో బాగా ఆడితే చాలు వన్డేల్లో కూడా తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’ అని రైనా చెప్పాడు. -
చివరి వన్డే కూడా గెలుస్తాం!
దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరినప్పుడు ఈసారి భారత జట్టు మూడు ఫార్మాట్లలో సిరీస్ విజయాలతో తిరిగి వస్తుందని అందరూ భావించారు. కానీ అది సాధ్యపడలేదు. తొలి రెండు టెస్ట్‌ల్లో మంచి పోరాటం చేసినప్పటికీ నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ వైఫల్యాలతో రెండు టెస్టులూ చేజారాయి. దీంతో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. మూడో టెస్ట్‌లో కఠినమైన పిచ్‌పై మన బౌలర్లు పేస్, బౌన్స్ ఉపయోగించుకొని కచ్చితత్వంతో బంతులు వేసి ప్రత్యర్థి ఆటకట్టించారు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటన రూపంలో భారత్‌కు మరో కఠిన సవాల్ ఎదురుకానుంది. కానీ... ఆ పర్యటన వన్డే సిరీస్‌తో ప్రారంభమవుతుంది. తొలి టెస్టు ఆడే సమయానికి కోహ్లి సేన ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టి దాదాపు నెల గడుస్తుంది. పరిస్థితులపై ఓ అవగాహన ఏర్పడటానికి ఆ సమయం చాలా ఉపయోగపడనుంది. చివరి టెస్టు విజయం భారత జట్టుపై చాలా ప్రభావం చూపింది. ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో మనవాళ్లు వన్డేల్లో అదరగొడుతున్నారు. ప్రతీ మ్యాచ్‌లో టాప్ 3 బ్యాట్స్‌మెన్ 30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. 118 పరుగులు మాత్రమే చేయాల్సిన రెండో వన్డేలో మినహా ఆ ముగ్గురూ సెంచరీలు సాధించారు. ఈ విజయాల్లో లెగ్ స్పిన్నర్ల పాత్ర మరువలేనిది. చహల్, కుల్దీప్ల బౌలింగ్ సఫారీలకు కొరుకుడు పడటంలేదు. సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లాడినప్పటికీ వీరి స్పిన్‌పై ఓ అవగాహనకు రాలేకపోతున్నారు. కుల్దీప్ ఇప్పటికే టెస్టుల్లోనూ తానెంతటి ప్రమాదకారో నిరూపించుకున్నాడు. బుమ్రా పరిమిత ఓవర్ల నుంచి ఐదు రోజుల ఫార్మాట్‌కు మారినా తన ప్రభావం చూపించాడు. ఇక చహల్ వంతు. అతనూ టెస్టుల్లో రాణిస్తాడనటంలో సందేహం లేదు. మణికట్టు స్పిన్ బౌలర్లలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వారికి పిచ్‌నుంచి సహకారంలాంటిది అవసరం లేదు. భారత జట్టు తాజా ప్రదర్శన నాకు అమితానందాన్ని కలిగిస్తోంది. చివరి వన్డేలోనూ టీమిండియా విజయం సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
అలా చేసినందుకు రబాడాకు జరిమానా
సాక్షి స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పాస్ట్ బౌలర్ కగిసో రబాడాకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. భారత్‌తో జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఔటైన సమయంలో అభ్యంతకరంగా సెండ్ ఆఫ్ సిగ్నల్స్‌కు ఇచ్చినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ అతని ఖాతాలో జమైంది. ఇప్పటికే రబాడా డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. డీమెరిట్ పాయింట్లు 4కు చేరితే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రబాడా ఇప్పటికే ఒక టెస్టు మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు. 2019, ఫిబ్రవరి లోపు రబాడా డీమెరిట్ పాయింట్లు 8కి చేరితే రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం కానీ, ఒక టెస్టు లేదా రెండు వన్డేలు/టీ20 లేదా నాలుగు వన్డేలు/టీ20లు నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. రబాడా తన నేరాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు ఒప్పుకున్నాడు. ధావన్ ఔటైనపుడు రబాడా అతని వైపు చూస్తూ చేతులు ఊపుతూ పెవిలియన్ వెళ్లాలని చూపించినట్లు వీడియో ఉంది. -
క్రికెటర్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు..విచారణకు ఆదేశం
సాక్షి స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య జరిగిన నాలుగో వన్డే సమయంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్పై జాతి వివక్ష వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై క్రికెట్ దక్షిణాఫ్రికా, వాండరర్స్ స్టేడియం భద్రతా టీం విచారిస్తున్నాయి. పింక్ వన్డే జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల్లోని ఓ గుర్తుతెలియని వ్యక్తి తాహిర్‌ను అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో తాహిర్ సదరు ప్రేక్షకుడితో గొడవపడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని స్టేడియం భద్రతా సిబ్బందికి తాహిర్ తెలిపాడు. దీంతో భద్రతా సిబ్బంది వచ్చి ఆ ప్రేక్షకుడిని స్టేడియం బయటకు తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఫేస్బుక్లో ఓ వీడియో హల్చల్ చేస్తుంది. తాహిర్‌తో ప్రేక్షకుడు ఘర్షణ పడుతుండటాన్ని పక్కనే ఉన్న మరో ప్రేక్షకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, జాతి వివక్ష వ్యాఖ్యలు చోటుచేసుకుంటే సహించేదిలేదని, తప్పు ఎవరిదైనా చర్యలు తప్పవని క్రికెట్ దక్షిణాఫ్రికా అధికారులు వెల్లడించారు. -
ఇంకా రెండు కొడితే మరో రికార్డు బ్రేక్!
కేప్‌టౌన్: అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. బ్యాట్ పడితే చాలు మంచి నీళ్లు ప్రాయంలా ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో రికార్డుల పంట పండించాడు. వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్‌గా కోహ్లి ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా 12వ వన్డే శతకాన్ని సాధించిన కోహ్లి.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(11) రికార్డును అధిగమించాడు. భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఘనత కూడా కోహ్లి(14 సెంచరీలు) పేరిటే ఉంది. మరొకవైపు వన్డేల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఎనిమిదో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. సఫారీలతో మ్యాచ్‌లో కోహ్లి రెండు సిక్సర్లు సాధించిన తర్వాత వన్డేల్లో సెంచరీ సిక్సర్ల మార్కును చేరాడు. భారత్ తరపున ధోని(216)తొలి స్థానంలో ఉన్నాడు. మరొకవైపు కెరీర్లో 34వ వన్డే సెంచరీ చేసిన క్రమంలో దక్షిణాఫ్రికాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్ గా కోహ్లి రికార్డులకెక్కాడు. సచిన్ (152) స్కోరును అతను దాటేశాడు. సింగిల్స్ ద్వారానే వంద పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. ఈ మ్యాచ్‌లో 75 సింగిల్స్ తీసిన అతను 11 సార్లు 2 పరుగులు, ఒకసారి 3 పరుగుల చొప్పున సాధించాడు. ఈ ఆరు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లి.. రెండో వన్డేలో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరొక రెండు వన్డే సెంచరీలు కొడితే అత్యధిక సెంచరీలు కొట్టిన ఓవరాల్ కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు. ప్రస్తుత ఏబీ డివిలియర్స్(13) రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన వారిలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్(22) అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఇంటాబయటా ఎక్కడైనా గెలుస్తాం: ధావన్
భారత వన్డే జట్టు అద్భుతంగా రాణిస్తోందని, ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలిగే సత్తా ప్రస్తుత కోహ్లి సేనలో ఉందని ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ‘జట్టులో చాలా మంది అనుభవజ్ఞులున్నారు. సత్తాగల కుర్రాళ్లతో సమతూకంగా ఉంది. పాండ్యాలాంటి ఆల్‌రౌండర్ జట్టుకు అదనపు బలం. దీంతో దక్షిణాఫ్రికాల పేలవమైన రికార్డును చెరిపేసేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది’ అని ధావన్ అన్నాడు. ఫ్లాట్ పిచ్‌లపై కూడా చెలరేగే మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్లను ఎదుర్కోవడం ఇప్పుడు ఏ జట్టుకైనా కష్టమేనన్నాడు. -
రెండో వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా కోహ్లిసేన బరిలోకి దిగుతుండగా సఫారీ జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్‌తో ఖాయా జోండో అరంగేట్రం చేస్తున్నాడు. గాయంతో కెప్టెన్ డుప్లెసిస్ దూరం కాగా ఈ స్థానంలో జోండోను తుది జట్టులోకి ఎంపిక చేశారు. ఇక ఆలౌరౌండర్ పెహ్లుకువాయో స్థానంలో స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీని ఎంపిక చేశారు. తాత్కలిక కెప్టెన్‌గా మార్క్రమ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. డర్బన్ వన్డే విజయంతో కోహ్లిసేన ఉత్సాహంగా ఉండగా కీలక ఆటగాళ్ల గాయాలతో సొంతగడ్డపై సఫారీ టీమ్ తడబాటును ఎదుర్కొంటోంది. తుది జట్లు భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్యా రహానే, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్ దక్షిణాఫ్రికా : హషిమ్ ఆమ్లా, డికాక్, మార్క్రమ్, డుమిని, డేవిడ్ మిల్లర్, ఖాయా జోండో, క్రిస్ మొర్రిస్, రబడా,మోర్కెల్. తబ్రాజ్ షమ్సీ, ఇమ్రాన్ తాహిర్ -
ఇంకా ఒక్కటి బాదితే రికార్డు బద్దలే!
డర్బన్ : ఎవడు కొడితే రెండోఇన్నింగ్స్‌లో టీమిండియా విక్టరీ సాధింస్తుందో.. ఆ ‘చేజింగ్ మాస్టర్’ కోహ్లి మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. సారథులుగా కోహ్లి, గంగూలీలు ఇద్దరూ విదేశాల్లో 11 సెంచరీలు చేశారు. ఇందుకుగానూ గంగూలీకి 142 ఇన్నింగ్స్‌లు పడితే, కోహ్లి కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తిచేశాడు. కోహ్లి ఇకా ఒకే ఒక్క సెంచరీ బాదితే.. గంగూలీ రికార్డు బద్దలయినట్లే! సౌతాఫ్రికా గడ్డపై తొలి సెంచరీ మోదిన కోహ్లి.. ఆ జట్టుతో మరో ఐదు వన్డేలు ఆడాల్సిఉంది. కాబట్టి ఈ సిరీస్‌లోనే విరాట్ పనికాచ్చేస్తాడని ఆశిద్దాం. చేజింగ్ మాస్టర్ : డర్బన్ టన్నుతో కలిపి వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 33కు చేరింది. ఇందులో 20 సెంచరీలు లక్ష్యఛేదనలో సాధించినవే కావడం గమనార్హం. ఆ 20 సెంచరీల్లోనూ 18 సెంచరీలు జట్టును విజయతీరాలకు చేర్చినవే కావడం విశేషం. కెరీర్లో మొత్తంలో విదేశీ గడ్డపై కోహ్లి 15 సెంచరీలు చేశాడు. అందులో కెప్టెన్‌గా సాధించినవే 11 సెంచరీలు! డర్బన్ వేదికగా గురువారం సౌతాఫ్రికా-ఇండియాల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 270 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ కోహ్లి 112(119 బంతుల్లో), రహానే 79 (86 బందుల్లో) పరుగులతో జట్టును గెలిపించారు. ఈ విజయంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో నిలిచింది. -
ఇండియా వండరర్స్
-
ఇండియా వండరర్స్
అద్భుత అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టారు... అరుదైన సందర్భాన్ని మధురంగా మార్చుకున్నారు... ఏ మూలనో ఉన్న అపనమ్మకాన్ని పటాపంచలు చేస్తూ... ప్రత్యర్థికి కొట్టినపిండిలాంటి పిచ్‌పై వారినే పడగొట్టారు... విదేశీ గడ్డ మీద తమ సత్తాపై సందేహాలను తీరుస్తూ... క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి మరీ జయకేతనం ఎగరేశారు... జొహన్నెస్‌బర్గ్: వాండరర్స్ మైదానం మనకు మరోసారి అచ్చొచ్చింది. అందీ అందనట్లుగా ఊరిస్తున్న విజయాన్ని టీమిండియా నిజం చేసుకుంది. పచ్చిక పిచ్‌పై పేస్‌తో బెంబేలెత్తిద్దామని భావించిన ప్రొటీస్‌ను అదే పేస్‌తో బోల్తా కొట్టించింది. ప్రత్యర్థి ప్రతిఘటనతో ఒక దశలో చేజారుతుందేమో అనిపించిన మ్యాచ్‌ను తనవైపు తిప్పుకొని... సఫారీ గడ్డపై తొలి సిరీస్ క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. మహమ్మద్ షమీ (5/28) నిప్పులు చెరిగే బంతులకు బుమ్రా (2/57), ఇషాంత్‌శర్మ (2/31)ల పదునైన బౌలింగ్ తోడవటంతో 241 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 177కే ఆలౌటైంది. ఓపెనర్ ఎల్గర్ (86 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), ఆపద్బాంధవుడు ఆమ్లా (52) పోరాడినా... తర్వాతి బ్యాట్స్‌మెన్ చేతులేత్తేశారు. దీంతో శనివారం ఇక్కడ ముగిసిన మూడో టెస్టులో భారత్ 63 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విలువైన పరుగులు చేయడంతో పాటు, నాలుగు వికెట్లు తీసిన భువనేశ్వర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఫిలాండర్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. రెండు జట్ల మధ్య ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 1న డర్బన్‌లో జరగనుంది. ఎల్గర్, ఆమ్లా భయపెట్టారు... శనివారం ఉదయం వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా మారి మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 17/1తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టును ఎల్గర్, ఆమ్లా నింపాదిగా నడిపించారు. పరుగులు చేయకున్నా... వికెట్ మాత్రం ఇవ్వలేదు. కొన్నిసార్లు ముందు రోజులాగే అనూహ్య బౌన్స్ అయినా పిచ్ మరీ అంత ఇబ్బందిగా ఏమీ కనిపించలేదు. దీనికితోడు బుమ్రా, షమీ సరైన లెంగ్త్‌లో బంతులేయలేకపోయారు. పిచ్‌ను రోలర్‌తో ఎక్కువగా తొక్కించడం కూడా బ్యాట్స్‌మెన్‌కు ఉపయోగపడింది. ఆమ్లా ఎప్పటిలాగే సాధికారికంగా కనిపించగా... ఎల్గర్ కిందామీద పడుతూనే నిలదొక్కుకున్నాడు. దక్షిణాఫ్రికా 69/1తో లంచ్‌కు వెళ్లింది. విరామం అనంతరం కూడా దక్షిణాఫ్రికా పట్టు కొనసాగింది. కొన్ని మంచి బంతులు పడినా అవేమీ వికెట్ ఇవ్వలేదు. ఈలోగా ప్రత్యర్థి స్కోరు 100కు చేరింది. ప్రధాన పేసర్లతో కాకపోవడంతో పాండ్యాను దించినా ఫలితం దక్కలేదు. అతడి బౌలింగ్‌లోనే బౌండరీతో ఎల్గర్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే... అతడి బౌలింగ్‌కు పిచ్ స్పందించిన తీరు చూశాక ఆశలు చిగురించాయి. ఇషాంత్, బుమ్రా భళా... మరోవైపు ఆమ్లా కూడా 50 దాటాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో పాటు ఆల్‌రౌండర్లు ఆడాల్సి ఉండటంతో సఫారీ జట్టు అప్పటికింకా పోటీలోనే ఉంది. అయితే... ఇక్కడే ఇషాంత్, బుమ్రా విజృంభించారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ నలుగురినీ స్వల్ప వ్యవధిలో వెనక్కుపంపి భారత్‌ను గెలుపు దిశగా నడిపించారు. తొలుత ఇషాంత్ బంతిని ఫ్లిక్ చేయబోయి ఆమ్లా... పాండ్యాకు చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ టెస్టులో ఇదే ఏకైక శతక భాగస్వామ్యం కావడం విశేషం. ఆ జట్టుకు పెద్ద షాక్ మాత్రం డివిలియర్స్ (6) నిష్క్రమణే. టీ బ్రేక్‌కు పది నిమిషాలు కూడా లేని సమయంలో బుమ్రా వేసిన అద్భుత బంతికి అతడు గల్లీలో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 131/3. జట్టును గెలిపించాల్సిన బాధ్యతను భుజాన మోస్తూ క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ (2) ఘోరంగా విఫలమయ్యాడు. ఇషాంత్ బంతిని ఆడలేక బౌల్డయ్యాడు. డికాక్ (0) బుమ్రాకు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. 124/1 నుంచి 145/5కు చేరిన ప్రొటీస్ ఆత్మరక్షణలో పడిపోయారు. షమీ మ్యాజిక్... క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్ వికెట్ ఇవ్వడం లేదు. దీంతోపాటు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో భారత్ విజయంపై ఏ మూలనో సందేహం. కానీ వాటన్నిటినీ ఛేదిస్తూ షమీ చెలరేగాడు. యార్కర్లతో ప్రొటీస్ లోయరార్డర్‌ను కకావికలు చేశాడు. అతడి ధాటికి ఫిలాండర్, ఫెలూక్వాయో, మోర్కెల్ ఖాతానే తెరవలేకపోయారు. వీరు ముగ్గురూ బౌల్డ్ అవడం గమనార్హం. ఈ మధ్యలో రబడ (0)ను భువీ వెనక్కుపంపాడు. చివరి వికెట్ మాత్రమే ఉన్న దశలో లాభం లేదని భావించి ఎల్గర్ సిక్స్; ఫోర్ కొట్టాడు. అయితే... ఇన్‌గిడిని (4)ని అవుట్ చేసిన షమీ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అయిదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకుని భారత్‌కు గెలుపునందించాడు. విదేశాల్లో ఇంకా ఆడగలం మేం సవాల్‌ను స్వీకరించాం. కఠినమైన పిచ్‌పై మా కుర్రాళ్లు నాలుగు రోజులు అద్భుతంగా ఆడారు. మొదట బ్యాటింగ్ చేయడం కలిసొచ్చింది. రెండు టెస్టుల్లోనూ విజయానికి దగ్గరగా వచ్చాం. ఈసారి గెలిచాం. ప్రతిఘటనను ఊహించాం. ఆమ్లా, ఎల్గర్ అద్భుతంగా ఆడినా ఛేదన కష్టమే. ఒత్తిడిలో వికెట్లు పడిపోతుండగా పైచేయి సాధించలేరు. మేం పరుగులు ఇవ్వకపోవడమూ ఉయయోగపడింది. మా బౌలింగ్ పెద్ద సానుకూలాంశం. 60 వికెట్లు పడగొట్టడం అరుదు. టెస్టులు గెలవాలంటే బౌలర్లలో ఆత్మవిశ్వాసం ఉండాలి. బ్యాట్స్‌మెన్ మెరుగుపడితే విదేశాల్లో తరచూ విజయాలు సాధించగలమని నేను నమ్ముతున్నా. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ బ్యాటింగ్‌ను ఆస్వాదించా చాలా సంతోషంగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా రాణించేందుకు ప్రయత్నించా. అది జట్టుకు సరైన సమయంలో మేలు చేసింది. టెస్టుల్లో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తా. పిచ్ కఠినంగా ఉన్నా... సాధ్యమైన మేర నిలదొక్కుకోవాలని భావించా. అదృష్టవశాత్తు పరుగులు వచ్చాయి. కొన్ని బంతులు అసహజంగా లేచినా మొత్తమ్మీద ఇది అద్భుతమైన పిచ్. – భువనేశ్వర్, భారత పేసర్ భారత్ అద్భుతంగా ఆడింది మేం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. బౌలింగ్‌లో స్థిరత్వం లోపించింది. ఫీల్డింగ్ సగటు స్థాయిలో ఉంది. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్ ఇది. ఆమ్లా, ఎల్గర్ ఉదయం ఆడిన తీరు చూసి ఆశ్చర్యపోయాం. బంతి ఆలస్యంగా స్పందిస్తుందని పిచ్ చరిత్ర చూస్తే తెలుస్తుంది. అయినా సిరీస్ గెలుపుపై సంతోషంగా ఉన్నాం. ఈ టెస్టుకు ముందు 2–1తో సిరీస్ ముగుస్తుందని ఊహించను కూడా లేదు. భారత్ అద్భుతంగా ఆడింది. – డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్ ►1 మూడు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 12 సార్లు కూడా ఆలౌట్ కావడం (మొత్తం 120 వికెట్లు) టెస్టు చరిత్రలో ఇది మొదటి సారి మాత్రమే. ► 2 విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ప్రత్యర్థి వికెట్లన్నీ కుప్పకూల్చడం ఇది రెండో సారి మాత్రమే. గతంలో 1986లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ఆరు ఇన్నింగ్స్‌లలోనూ ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ►21 కెప్టెన్‌గా కోహ్లి విజయాల సంఖ్య. ధోని (27) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ‘ఫ్రీడమ్ ట్రోఫీ’తో టెస్టు సిరీస్ విజేత దక్షిణాఫ్రికా జట్టు -
సమర్పించేశారు
కొత్త చరిత్ర సృష్టించేందుకు అవకాశం లభించింది. కానీ చివరకు చరిత్ర మారలేదు. అదే పాత కథ పునరావృతమైంది. విదేశీ గడ్డపై భారత బౌలర్లు విజయావకాశాలు సృష్టిస్తే, వాటిని ఉపయోగించుకోలేక బ్యాట్స్‌మెన్ నేలపాలు చేసిన టెస్టుల జాబితాలో మరొకటి చేరింది. దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టు విజయంతో అద్భుత ఆరంభాన్ని అందుకునే అవకాశాన్ని కోహ్లి సేన కోల్పోయింది. సొంత మైదానాల్లో వరుస విజయాల తర్వాత ఆశలతో, అంచనాలతో సఫారీ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియాకు విదేశాల్లో మ్యాచ్ గెలవాలంటే అంత సులువు కాదని మళ్లీ అర్థమైంది. 208 పరుగుల విజయలక్ష్యం. పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కాస్త కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. కానీ మన స్టార్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. పరిస్థితికి అనుగుణంగా ఆడలేక ఒకరిని అనుసరిస్తూ మరొకరు వేగంగా పెవిలియన్ చేరారు. మ్యాచ్‌కు ముందు భారత్ ఆటపై పెద్దగా అంచనాల్లేవంటూ వ్యంగ్య బాణాలు విసిరిన ఫిలాండర్ నిజంగానే పదునైన బంతులతో మన పని పట్టాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు పాఠాలు నేర్పేలా అశ్విన్, భువనేశ్వర్ కొంత పోరాడినా లాభం లేకపోయింది. ‘యోయో టెస్టు’ల్లో పాస్ అయిన మన ఆటగాళ్లు, అసలు ఆటలో మాత్రం ఫెయిలయ్యారు. ఈ టెస్టు నుంచి భారత్ ఊరట చెందే అంశం ఏదైనా ఉందంటే అది మన పేస్ బౌలర్ల ప్రదర్శనే. తొలి రోజు శుభారంభంతో ఒక దశలో మ్యాచ్‌పై పట్టు చిక్కేలా చేసినా... రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 130కే ప్రత్యర్థి ఆలౌట్ చేయగలిగినా అది వారి గొప్పతనమే. ఇదే జోరు కొనసాగితే తర్వాతి మ్యాచుల్లోనైనా మన జట్టు గెలుపును ఆశించవచ్చేమో! కేప్‌టౌన్: సఫారీ పర్యటనను భారత్ పరాజయంతో ప్రారంభించింది. వర్షార్పణం అయిన రోజును మినహాయిస్తే... మూడు రోజుల్లోపే ముగిసిన తొలి టెస్టులో భారత్ 72 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. న్యూలాండ్స్ మైదానంలో సోమవారం 208 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ (53 బంతుల్లో 37; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వెర్నాన్ ఫిలాండర్ (6/42) తన అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌ను దెబ్బ తీశాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆలౌటైంది. డివిలియర్స్ (50 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు. షమీ, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. తాజా ఫలితంతో మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు శనివారం నుంచి సెంచూరియన్‌లో జరుగుతుంది. షమీ, బుమ్రా జోరు... 65/2 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికాను భారత పేస్ బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. అద్భుతమైన స్వింగ్, అనూహ్య బౌన్స్‌తో చెలరేగి బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. రెండో ఓవర్లోనే ఆమ్లా (4)ను షమీ అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్ది సేపటికే రబడ (5)ను కూడా షమీ వెనక్కి పంపాడు. ఈ దశలో ఒక ఎండ్‌లో డివిలియర్స్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా... భారత్ మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. బుమ్రా వేసిన అద్భుత బంతికి డు ప్లెసిస్ (0) వద్ద జవాబు లేకపోగా, అతని తర్వాతి ఓవర్లో డి కాక్ (8) కూడా చేతులెత్తేశాడు. ఫిలాండర్ (0)ను అవుట్ చేసి షమీ తన జోరు కొనసాగించగా, మహరాజ్ (15)ను అవుట్ చేసి భువనేశ్వర్ తానూ ఈ ఉత్సవంలో భాగమయ్యాడు. మోర్కెల్ (2)ను కూడా భువీ అవుట్ చేయగా... భారీ షాట్‌కు ప్రయత్నించి బుమ్రా బౌలింగ్‌లో డివిలియర్స్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సోమవారం కేవలం 21.1 ఓవర్లు మాత్రమే ఆడిన దక్షిణాఫ్రికా 65 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోవడం విశేషం. అంతా విఫలం... ఊరించే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ విజయంపై ఆశలు పెట్టుకుంది. తగినన్ని ఓవర్లు కూడా అందుబాటులో ఉండటంతో దానికి అనుగుణంగా జాగ్రత్తగా ఆడితే జట్టు గెలుపు దిశగా సాగేది. అయితే దక్షిణాఫ్రికా పేసర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. గాయంతో స్టెయిన్ మ్యాచ్‌కు దూరమైనా... ఫిలాండర్ జట్టు భారాన్ని మోయగా, రబడ, మోర్నీ మోర్కెల్ అండగా నిలిచారు. అయితే మరోసారి ధావన్ (16) పుల్ షాట్ ఆడటంలో విఫలమై అవుట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి ఓవర్లోనే విజయ్ (13) కూడా బంతిని స్లిప్‌లోకి పంపించి వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి (40 బంతుల్లో 28; 4 ఫోర్లు), రోహిత్ (10) భాగస్వామ్యం ఆశలు చిగురింపజేసింది. అయితే మళ్లీ చెలరేగిన ఫిలాండర్ తన వరుస ఓవర్లలో వీరిద్దరిని పెవిలియన్ పంపించాడు. ఫిలాండర్ అద్భుత బంతికి కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీనిపై రివ్యూ చేసినా లాభం లేకపోయింది. రోహిత్ బంతిని వికెట్లపైకి ఆడుకొని తన విఫల టెస్టును ముగించాడు. తొలి ఇన్నింగ్స్ హీరో హార్దిక్ పాండ్యా (1), సాహా (8) రబడ బారిన పడ్డారు. ఆశలు రేపినా... 82/7తో భారత్ టీ విరామానికి వెళ్లింది. అనంతరం ఇక పరాజయం లాంఛనమే అనిపించిన దశలో అశ్వి న్, భువనేశ్వర్ (13 నాటౌట్) పోరాడారు. వీరిద్దరు పట్టుదలగా నిలబడటంతో పాటు చకచకా పరుగులు సాధించడంతో దక్షిణాఫ్రికా జట్టులో అసహనం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరిద్దరు 13 ఓవర్ల పాటు సఫారీలకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరకు కెప్టెన్ మళ్లీ ఫిలాండర్నే నమ్ముకున్నాడు. అతని బౌలింగ్‌లో కట్ చేయబోయి డి కాక్ అద్భుత క్యాచ్‌కు అశ్విన్ అవుట్ కావడంతో భారత్ ఓటమికి చేరువైంది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. తర్వాతి మూడు బంతుల్లో ఫిలాండ ర్... షమీ (4), బుమ్రా (0)లను అవుట్ చేసి భారత్ కథ ముగించాడు. ►10 ఈ టెస్టులో భారత కీపర్ సాహా 10 మంది బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో భాగమై గతంలో ధోని (9) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో అతను ఐదేసి క్యాచ్‌లు పట్టాడు. ► తొలి ఇన్నింగ్స్‌లో మాకు దక్కిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకొని వారిని 220కే పరిమితం చేస్తే ఫలితం మరోలా ఉండేది. వరుసగా వికెట్లు కోల్పోవడం దెబ్బ తీసింది. మూడు రోజులు కూడా మేం సమఉజ్జీలుగానే ఉన్నాం. 208 లక్ష్యం అనేది ఎలా చూసినా కష్టమైంది కాదు. అయితే మాలో ఒకరు 20–30 పరుగులు కాకుండా కనీసం 70–80 చేయాల్సింది. ఒక బౌలర్ తగ్గినా వారు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడంపై మేం దృష్టి పెట్టాల్సి ఉంది. మేం కూడా వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాం కాబట్టి పూర్తి వైఫల్యంగా కూడా చెప్పలేం. నిజానికి మా బౌలర్లు సర్వశక్తులూ ఒడ్డారు. వారికి నా సానుభూతి. ఇలాంటి పిచ్ ఎదురై మళ్లీ అవకాశం వస్తే దానిని వదులుకోం. బౌలర్లు ప్రత్యర్థిని కుప్పకూలిస్తే బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా ఆడి ఫలితం రాబడతాం. – కోహ్లి, భారత కెప్టెన్ -
తొలి రోజు ఆట ముగిసే సమయానికి..
కేప్‌టౌన్: తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 28 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పొయింది. ధావన్ (16), కోహ్లి (5) , మురళి విజయ్(1)లు అవుట్ కాగా ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(0), పుజారా(5) ఉన్నారు. మెర్కెల్, ఫిలాండర్, స్టెయిన్‌లకు తలో వికెట్ పడింది. టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 286 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు పూర్తిగా ఆడకుండానే సఫారీలు చాపచుట్టేశారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా, రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు సాధించాడు. ఇక హార్దిక్ పాండ్యా, షమీ, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది. -
అందుకే వద్దనుకున్నాం: కోహ్లి
కేప్‌టౌన్: ప్రాక్టీస్ మ్యాచ్ పిచ్‌తో టెస్టు సిరీస్‌కు ఒరిగేదేమీ లేనందునే వార్మప్ మ్యాచ్ వద్దన్నామని భారత కెప్టెన్ కోహ్లి వివరణ ఇచ్చాడు. శనివారం ప్రాక్టీస్ సెషన్ ముగిశాక అతను మీడియాతో మాట్లాడుతూ... ‘న్యూలాండ్స్ (తొలి టెస్టు వేదిక) పిచ్‌కు వార్మప్ పిచ్‌కు అసలే మాత్రం సంబంధం లేదు. కనీసం 15 శాతమైనా సరిపోలని పిచ్ అది. అందుకే వద్దన్నాం. ఇలాంటి ప్రాక్టీస్ పోటీల కంటే నెట్స్‌లో చెమటోడ్చడమే మేలనుకున్నాం. పైగా సిరీస్‌కు ముందు మానసిక ప్రశాంతత కూడా అవసరమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కోహ్లి చెప్పాడు. గత పర్యటన (2013–14)లో ఆడిన వారిలో 13 మంది ఈసారి వచ్చారని... అనుభవం గడించిన వీరంతా తప్పకుండా నాణ్యమైన ఆట ఆడతారని విశ్వాసాన్ని వెలిబుచ్చాడు. ‘ఇక్కడి పిచ్‌లు బౌన్సీ ట్రాక్లని మా వాళ్లందరికీ తెలుసు. తప్పకుండా ఈసారి సిరీస్ సాధించే సత్తా మాలో ఉందని నమ్మకంతో ఉన్నాను’ అని కోహ్లి తెలిపాడు. ఇది భారత్, సఫారీ సమరమని... డివిలియర్స్–కోహ్లి పోరు కానే కాదన్నాడు. తన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సహచరుడంటే తనకెంతో గౌరవమన్నాడు. దక్షిణాఫ్రికాతో క్లిష్టమైన సవాల్‌కు టీమిండియా సిద్ధంగా ఉందని భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో నాకు భారతే మేటి జట్టుగా కనబడుతోంది. నాలుగేళ్ల క్రితం ఈ మాట అడిగితే అప్పుడు కాదని చెప్పేవాణ్ని. కానీ ప్రస్తుత జట్టు అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. ధావన్ అవుట్: సిరీస్‌కు ముందే భారత్‌కు తొలిదెబ్బ తగిలింది. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో కేప్‌టౌన్ టెస్టుకు దూరమయ్యాడు. గాయంతోనే అక్కడికి వెళ్లిన అతను పూర్తిగా కోలుకోకపోవడం వల్లే తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడని జట్టు వర్గాలు వెల్లడించాయి. -
మన సమోసాకు అరుదైన గౌరవం
జోహాన్స్‌బర్గ్: ప్రముఖ భారతీయ స్నాక్ సమోసాకు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ కాంటెస్ట్‌లో నోరూరించే మన వంటకం చిల్లీ చికెన్ సమోసా నెగ్గింది. భారతీయ సంతతి కోసం నిర్వహించే పత్రిక వీక్లీ పోస్ట్ నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో చాక్లెట్, జీడిపప్పు, ఇతర నోరూరించే వంటకాలతో పోటీ పడి చిల్లీ చికెన్ సమోసా భోజనప్రియుల మన్ననలు పొందింది. బాదంపప్పు, జీడిపప్పులు సహా పలు రుచులతో చిల్లీ చికెన్ సమోసాను తయారు చేశారు. ట్రెడిషనల్ పంజాబీ స్నాక్‌గా పేరొందిన సమోసా వంటకాన్ని పోటీకి నిలిపిన సల్మా అజీ కాంటెస్ట్‌లో గెలుపొందారు. తాను వంట చేయడాన్ని ఇష్టపడతాననీ, ప్రతి వంటకానికీ మరింత మెరుగులు దిద్ది మరింత రుచికరంగా చేస్తానని సల్మా చెప్పారు. తాను మొదట పిల్లల కోసం చికెన్ శాండ్విచ్ చేశానని ఆ తర్వాత చిల్లీ చికెన్ సమోసాను కనిపెట్టానన్నారు. కాశ్మీరీ కారం పొడితో చికెన్‌ను వండినట్టు చెప్పారు. ఇదే కాంటెస్ట్ మరో క్యాటగిరీలో ఒకే నిమిషంలో పది సమోసాలు తిన్న ఇబ్రహీం బక్స్ ఫాస్టెస్ట్ సమోసా ఈటర్ టైటిల్ గెలుచుకున్నారు. -
బంగ్లాదేశ్ విలవిల
బ్లూమ్‌ఫాంటీన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్ పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజే ఫాలోఆన్ ఆడుతోంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 428/3తో శనివారం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 573 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆమ్లా (132; 17 ఫోర్లు), కెప్టెన్ డు ప్లెసిస్ (135 నాటౌట్; 15 ఫోర్లు) సెంచరీలు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (70) రాణించాడు. రబడా 5, ఒలివియర్ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీకి 426 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లా ఆట నిలిచే సమయానికి వికెట్ కోల్పోకుండా 7 పరుగులు చేసింది. -
దక్షిణాఫ్రికా ఘనవిజయం
పోష్‌స్ట్రూమ్: పేసర్ కగిసో రబడ (3/33), స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (4/25) చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 333 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 424 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 32.4 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆట చివరి రోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 49/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లా కేవలం 41 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయి చిత్తుగా ఓడింది. మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రహమాన్ నెలకొల్పిన 15 పరుగుల భాగస్వామ్యమే బంగ్లాదేశ్ ఐదో రోజు ఆటలో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఈమ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 496/3 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, బంగ్లా 320 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు 247/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం మొదలవుతుంది. -
ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం
కేప్‌టౌన్: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను గెలిచి మంచి ఊపుమీద ఉన్న దక్షిణాఫ్రికా.. తొలి ట్వంటీ 20లో మాత్రం పోరాడి గెలిచింది. రెండు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివ రిబంతికి గట్టెక్కింది. ఇరు జట్ల మధ్య ఆఖరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌పై సఫారీలే పైచేయి సాధించారు. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్(17 నాటౌట్) ఆఖరి ఓవర్లో 14 పరుగులు సాధించడంతో పాటు, చివరి బంతికి రెండు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్రపోషించాడు. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 135 కాగా, 19.0 ఓవర్లలో 120/7. ఇక మిగిలింది ఆఖరి ఓవర్. ఆ ఓవర్లో సఫారీలు విజయం సాధించాలంటే 15 పరుగులు చేయాలి. ఆ తరుణంలో ఇంగ్లండ్ బౌలర్ తోప్లీ వేసిన తొలి బంతిని అబాట్ సింగిల్ గా మలచడంతో క్రిస్ మోరిస్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ తరువాత రెండు వరుస బంతులను ఫోర్, సిక్సర్‌గా మలచగా, నాల్గో బంతికి పరుగు రాలేదు. ఇంకా ఆఖరి రెండు బంతులకు నాలుగు పరుగులు కావాలి. ఆ సమయంలో మోరిస్ సమయోచితంగా రెండేసి పరుగుల చొప్పున తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 134 పరుగులు నమోదు చేసింది. -
సఫారీ జట్టులో డి లాంజ్‌కు చోటు
మూడో టెస్టుకూ స్టెయిన్ దూరం! నాగపూర్: గాయం నుంచి పూర్తిగా కోలుకోని దక్షిణాఫ్రికా ప్రధాన పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ మూడో టెస్టుకూ దూరమయ్యే అవకాశం ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయని అతను బెంగళూరు మ్యాచ్ ఆడలేదు. అతని గాయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో దక్షిణాఫ్రికా ముందు జాగ్రత్తగా మర్చంట్ డి లాంజ్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. భారత్‌తో తొలి టి20 మ్యాచ్ ఆడిన అతను ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశవాళీ పోటీల్లో పాల్గొంటున్నాడు. ‘ప్రస్తుతం మా జట్టులో ముగ్గురు పేసర్లే ఫిట్‌గా ఉన్నారు. మళ్లీ ఎవరైనా గాయపడితే ఇబ్బందని డి లాంజ్‌ను పిలిపించాం. మంచి వేగంతో రివర్స్ స్వింగ్ చేయగల అతని నైపుణ్యం జట్టుకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం’ అని జట్టు కోచ్ రసెల్ డొమింగో చెప్పారు. కెరీర్లో 2 టెస్టులే ఆడిన డి లాంజ్, ఆఖరిసారిగా 2012లో బరిలోకి దిగాడు. -
టీమిండియాకు షాక్
ధర్మశాల: మూడు ట్వంటీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ శుక్రవారం జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియాకు షాక్ తగిలింది. టీమిండియా విసిరిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా( 36), ఏబీ డివిలియర్స్ (51)లు శుభారంభాన్ని అందించారు. ఆమ్లా తనదైన శైలిలో ఆడితే డివిలియర్స్ వచ్చీ రావడంతోనే రెచ్చిపోయాడు. కాగా, వీరు స్వల్ప పరుగుల వ్యవధిలో అవుటైన వెంటనే డు ప్లెసిస్ (4) కూడా పెవిలియన్ కు చేరడంతో దక్షిణాఫ్రికా కాస్త ఆందోళనలో పడింది. అనంతరం జేపీ డుమినీ, బెహర్దియన్ లు దూకుడుగా ఆడారు. డుమినీ(68), బెహర్దియన్(32) పరుగులతో క్రీజ్ లో నాటౌట్ గా ఉండి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ నాల్గో వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ తాజా విజయంతో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యాన్ని సంపాందించింది. 15 ఓవర్ వరకూ విజయం టీమిండియా చేతుల్లో ఉన్నట్లు కనిపించినా.. ఆ తదుపరి ఓవర్ టీమిండియా విజయాన్ని పూర్తిగా దూరం చేసింది. 16 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 22 పరుగులను దక్షిణాఫ్రికాకు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్ లో డుమినీ వరుసగా మూడు సిక్సర్లు వేసి దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి మార్గం సుగుమం చేశాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన డుమినికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియా బౌలర్లలో ఎవరూ ఆకట్టుకోలేదు. అశ్విన్, ఎస్ అరవింద్ లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. భారత్ స్కోరు 22 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ శిఖర్ ధవన్(3) అనవసర పరుగుకోసం యత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ(106; 66బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీని పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ ట్వంటీ20 ల్లో తొలి సెంచరీని రోహిత్ నమోదు చేశాడు. రోహిత్ కు జతగా విరాట్ కోహ్లి (43) రాణించడంతో రెండో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. కాగా, విరాట్, రోహిత్ వికెట్లను వరుసగా కోల్పోవడంతో టీమిండియా వేగం తగ్గింది. విరాట్ రెండో వికెట్ రూపంలో వెనుదిరిగగా, రోహిత్ మూడు వికెట్ గా పెవిలియన్ కు చేరాడు.అటు తరువాత స్కోరును పెంచే యత్నంలో సురేష్ రైనా(14) అవుటయ్యాడు. కాగా, అజింక్యా రహానే స్థానంలో తుది జట్టులో కలిసిన అంబటి రాయుడు డకౌట్ గా వెనుదిరగగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(20) నాటౌట్ మిగలడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. -
బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
ధర్మశాల: మూడు ట్వంటీ 20 మ్యాచ్ లో సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జాతిపిత మహాత్మా గాంధీ 146వ జయంతి సందర్భంగా భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా టాస్ కాయిన్‌ను రూపొందించింది. 20 గ్రాముల బరువు గల స్వచ్ఛమైన వెండితో బంగారు పూత పూసి తయారు చేయించిన నాణెముతో టాస్ వేశారు. సమవుజ్జీలైన ఇరు జట్లు గెలుపుతో సిరీస్ ను శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా, డు ప్లెసిస్ సారథ్యంలోని దక్షిణాఫ్రికాలు గెలుపుపై పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే డే అండ్ నైట్ ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనబడుతోంది. భారత తుది జట్టు:శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోని*, అంబటి రాయుడు, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, ఎస్ అరవింద్ దక్షిణాఫ్రికా తుది జట్టు: ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, డు ప్లెసిస్*, జేపీ డుమినీ, డేవిడ్ మిల్లర్, బెహ్రార్దియన్, క్రిస్ మోరిస్, రబాదా, అబాట్, లాంజ్, ఇమ్రాన్ తహీర్