మద్యం తాగొద్దంటే..పురుగుమందు తాగాడు | - | Sakshi
Sakshi News home page

మద్యం తాగొద్దంటే..పురుగుమందు తాగాడు

Published Tue, Jan 28 2025 12:59 AM | Last Updated on Tue, Jan 28 2025 12:59 AM

మద్యం తాగొద్దంటే..పురుగుమందు తాగాడు

మద్యం తాగొద్దంటే..పురుగుమందు తాగాడు

కోటవురట్ల : మద్యం తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపం చెందిన ఓ రిక్షా కార్మికుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాలు ఇవి. రాట్నాలపాలేనికి చెందిన బుంగా అప్పారావు(50) రిక్షా తొక్కి జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బులతో తరచూ మద్యం తాగుతుండడంతో భార్య బుంగా ఈరమ్మ ఆరోగ్యం చెడిపోతుందని మందలించింది. దాంతో మనస్తాపం చెందిన అప్పారావు సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఈరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోస్టుమార్టంకు అప్పగించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement