చర్మవ్యాధి సోకిన పిల్లలకు పూర్తిస్థాయిలో వైద్యం
టులో ఉండాలని ఆదేశించారు.
విజయవాడ ల్యాబ్‌కు రక్తనమూనాలు
చర్మవ్యాధి సోకిన పిల్లల నుంచి గొంతు, ముక్కు నుంచి నమూనాలు సేకరించి విజయవాడలోని ల్యాబ్‌కు మంపించినట్టు రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. దీనిపై నాలుగు రోజుల్లో రిపోర్ట్ వస్తుందని, అప్పటి వరకు ఈ వ్యాధి ఎలా ప్రబలిందనేది నిర్థారించలేమన్నారు. గోమంగి పీహెచ్‌సీ సందర్శించారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పెదబయలు పీహెచ్‌సీని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 220 వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఆమె వెల్లడించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్ బాషా, ఎన్‌సీడీసీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రతాప్, డీవీహెచ్‌ఎన్‌వో డాక్టర్ భూలోకమ్మ, ఉప్ప పీహెచ్‌సీ వైద్యాధికారి రేఖ, పెదబయలు,గోమంగి,రూడకోట వైద్యాధికారులు నిఖిల్,చైతన్యకుమార్, సత్యారావు, కిరణ్, కిశోర్ పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రిలో చిన్నారులకు వైద్యం
సాక్షి,పాడేరు: చర్మవ్యాధి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 17మంది చిన్నారులకు స్థానిక జిల్లా సర్వజన ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. లండూలు, గొచ్చంగి. పెదపాడు, పుట్టకోట, మెట్టగూడ గ్రామాల్లో ఐదు నుంచి 15ఏళ్ల లోపు చిన్నారులకు శరీరమంతా దద్దుర్లు,దురదలతో పాటు దగ్గు, జలుబుతో కూడిన జ్వరాలు సోకాయి. వీరందరినీ వైద్యబృందాలు స్థానిక జిల్లా ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం తీసుకువచ్చి వైద్యసేవలు అందిస్తున్నారు. రక్తపరీక్షలు నిర్వహించారు.
7వ పేజీ తరువాయి
Comments
Please login to add a commentAdd a comment