కొత్తపల్లి జలపాతానికి కొత్త హంగులు
● పూర్తయిన ఆధునికీకరణ పనులు ● ప్రారంభించిన పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి కొత్త హంగుల సమకూర్చారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా తీర్చిదిద్దారు. జలపాతానికి వెళ్లే మార్గంలో టైల్స్‌తో మార్గాన్ని నిర్మించారు. గార్డెన్ ఆధునికీకరించారు. వ్యూపాయింట్ నిర్మించారు. పర్యాటకులను ఆకర్షించేలా రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటచేశారు. పర్యాటకులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. ఆధునీకరణ పూర్తయిన నేపథ్యంలో సోమవారం జలపాతం వద్దకు ప్రవేశాలను పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ప్రారంభించారు. ఆయన ఆదివాసీ గిరిజనులతో థింసా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వీఎస్ ప్రభాకర్‌రావు, ఎం వెంకటేశ్వేరరావు, పరిపాలనాధికారి ఎం హేమలత, గిరిజన సంక్షేమశాఖ ఏఈ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment