మహారాణిపేట (విశాఖ): స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితా వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి విడుదల చేశారు. వెబ్సైట్(-https@// nagendrasvst. wordpress. comలో స్టాఫ్ నర్సుల ప్రావిజనల్ జాబితాను పొందుపరిచారు. ఈ జాబితాపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరణకు గడువు ఇచ్చారు. అభ్యర్థులు అభ్యంతరాలను రేసవానిపాలెంలో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో అందజేయాలని, వాటిని పరిశీలించిన మెరిట్ లిస్టు విడుదల చేస్తామని ఆర్డీ వివరించారు. ఉత్తరాంధ్రలో 106 పోస్టులకు గాను మొత్తం 8,300 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment